1, ఏప్రిల్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 273 (కవులు నియమములకుఁ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కవులు నియమములకుఁ గట్టుపడరు.

26 కామెంట్‌లు:

 1. గణము ప్రాస యతులు కట్టుబాటులు కొన్ని
  పద్య కవిత లందు పరిఢవిల్లు!
  వచన కవితలందు వైరుధ్య భావమున
  కవులు నియమములకు గట్టు పడరు.

  రిప్లయితొలగించండి
 2. కవులు కపులు ఘనులె కాంచగఁ నిరువురు
  కట్టుబడుచు నుంద్రు కావ్య రచన
  కవులు నియమములకుఁ, గట్టుపడరు ధ్వంస
  రచనఁ నీమ ములకు రాజ! కపులు.

  రిప్లయితొలగించండి
 3. చలన చిత్ర గీత శైలిఁ గనఁగఁ వింత
  లెన్నొ! తెలుగు కాన లేముఁ దెలుఁగు
  పాటలందు! చిత్ర భాషవి చిత్రమే!
  కవులు నియమములకుఁ గట్టుపడరు.

  రిప్లయితొలగించండి
 4. వెక్కిరించుటెపని! వెధవలు కవులను!
  ఎంతమంది జెప్పె? ఎన్ని సార్లు!
  పద్య కవిత సున్న! పైత్యమె మెండు, కు
  కవులు నియమములకుఁ గట్టుపడరు

  రిప్లయితొలగించండి
 5. కావ్యపఠన మాయె గగనపు కుసుమము
  పలుకులందు రాయు భాషలందు
  పదునుఁదేలుఁ జాల పదసంపదే లేని
  కవులు నియమములకుఁ గట్టుపడరు

  రిప్లయితొలగించండి
 6. గలగలమని పారు సెలయేటి రవళులు
  కవిత యందు గూర్చి కమ్మదనము
  జగతి కొసగనెంచి ఛంధస్సు; అదిదప్ప
  కవులు నియమములకుఁ గట్టుపడరు.

  రిప్లయితొలగించండి
 7. ఆ : తన్మయత్వ మందు తానుండ కనులకె

  దురుగ రంభ నిలిచి దనను బిలువ

  దెలియ కుండు , నా విధంబున సుప్రసిద్ధ

  కవులు నియమములకుఁ గట్టుపడరు !

  రిప్లయితొలగించండి
 8. పక్షి యెగుర నెవడు బరిమితులను బెట్టు,
  కోకి లేల మాను కూత బెట్ట,
  గాలి, నీరు, సూర్య కాంతుల రీతిగా
  కవులు నియమములకు కట్టు బడరు!

  రిప్లయితొలగించండి
 9. నేను చేసిన పూరణలో మూడవ పాదంలోని గణ దోషాన్ని సరిచేసి పూరిస్తున్నాను.గమనించగలరు.

  గణము,ప్రాస,యతులు,కట్టుబాటులు కొన్ని
  పద్య కవిత లందు పరిఢవిల్లు!
  వచన కవిత లందు, భావ కవిత లంచు
  కవులు నియమములకు గట్టు బడరు!

  రిప్లయితొలగించండి
 10. కలము బూని గూడ కదనరంగము నందు
  ఖడ్గ తిక్కన కవి కత్తి బట్టె ;
  సత్యవచన ప్రియులు నిత్య స్వతంత్రులు
  కవులు నియమములకు గట్టు బడరు

  రిప్లయితొలగించండి
 11. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !
  01)

  "రవి గాంచనిచో , కవి గాంచునని "గదా, నార్యోక్తి !!!
  _________________________________________

  రాజు కోర్కె దీర్చ - రచియించె భారతం
  ఆంధ్ర భాష నన్న - యార్యు డాది !
  వాడి కలము కత్తి - వేడి జూపియె గదా
  తిక్క నార్యు డిలను - దీప్తి నొందె !

  గరళ కంఠు నడిగె - కవి సిరి నాథుడే
  ఇద్ద రేల నీకు ? - ఇంతు లనుచు !!!
  భాగవతపు కర్త - బమ్మెర పోతన
  వాణి , కిచ్చి వాణి - వాసి కెక్కె !!!

  వాణి = సరస్వతి
  వాణి = మాట

  కత్తి కన్న వాడి - కలమునదే గదా !!
  రవిని మించు వాడు - కవియె గాదొ !!!
  శృంఖలమ్ము , కవులె - చేదించ గల రిల !
  కవులు నియమములకు - కట్టు బడరు !
  _________________________________________

  రిప్లయితొలగించండి
 12. వివరణ :

  సిరి గల వానికి జెల్లును
  తరుణుల పది యారు వేల - తగ పెండ్లాడన్ !
  తిరిపెమున కిద్దరాండ్రా ?
  పరమేశా గంగ విడుము - పార్వతి చాలున్ !

  "శ్రీనాథుడు "


  దాహమైతే మంచి నీళ్ళు కావాలని ఈశ్వరుణ్ణి
  మహాకవి అడిగిన తీరిది !

  " డబ్బున్న వాళ్ళ కెంత మందున్నా
  పరవా లేదు ! గాని ,
  అడుక్కు తినే వాడివి
  నీ కెందుకోయ్ ఇద్దరు పెళ్ళాలు ?
  మొదటి దాన్నుంచుకోని
  నీ చిన్న పెళ్ళాన్ని , గంగను నా కొదిలేయ వయ్యా "

  అని అడగ్గలిగిన దమ్మూ ధైర్యమూ ఎవరికుంటాయ్
  కవికి తప్ప !

  రిప్లయితొలగించండి
 13. వివరణ :

  కాటుక కంటి నీరు, చను - కట్టు , పయిం బడ , నేల యేడ్చెదో ?
  కైటభ దైత్య మర్దనుని - గాదిలి కోడల ! యో మదంబ, ఓ
  హాటక గర్భురాణి ! నిను - ఆకటికిం గొని పోయి యల్ల క
  ర్ణాట కిరాట కీచకుల - కమ్మ ! త్రిశుద్ధిగ నమ్ము ! భారతీ !

  " బమ్మెర పోతన "

  అంటూ వాణికే వాణి నిచ్చుట (వాగ్దానం చేయుట )
  ఏరి తరం ? కవికి గాక !!!

  రిప్లయితొలగించండి
 14. హనుమచ్ఛాస్త్రి గారూ,
  నియమాలకు కట్టుబడని వచనకవుల గురించి చక్కగా చెప్పారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  నియమాలకు కట్టుబడని కపులతో సమస్యను పూరించి రక్తి కట్టించారు. బాగుంది. అభినందనలు.

  మందాకిని గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  రెండవ పూరణలో "రాయు భాష"కు "వ్రాయు భాష" సాధురూపం కదా!

  వెంకటప్పయ్య గారూ,
  కుకవులను గూర్చి చక్కగా పూరించారు. అభినందనలు.
  "ఎంతమంది జెప్పి రెన్ని సార్లు!" అనాలి కదా.

  హరి గారూ,
  ఉదాత్తమైన పూరణ. అభినందనలు.

  వరప్రసాద్ గారూ,
  మీ ప్రయత్నం మెచ్చుకోదగింది. ఇలాగే వ్రాస్తూ ఉండండి. ముందు ముందు మీ నుండి చక్కని పద్యాలు తప్పక వస్తాయి.
  రెండవ, మూడవ పాదాలలో యతి తప్పింది. మూడవ పాదంలో గణదోషం ఉంది.
  మీ పద్యానికి నా సవరణ (బ్రాకెట్లలో)
  తన్మయత్వ మందు తానుండ కనులకె
  దురుగ రంభ నిలిచి (మురిసి) బిలువ
  దెలియ కుండు(నట్టి తీరుతోడ) ప్రసిద్ధ
  కవులు నియమములకుఁ గట్టుపడరు !

  రిప్లయితొలగించండి
 15. పీతాంబర్ గారూ,
  ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.

  రవీందర్ గారూ,
  చక్కని పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
  "సత్యవచన ప్రియులు" అన్నప్పుడు "న" గురువు అవుతుంది. "సత్యవచన రతులు" అందాం.
  కాని ఖడ్గ తిక్కన కవి యెప్పుడయ్యాడు?

  వసంత్ కిశోర్ గారూ,
  సవివరమైన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  కాని మీరూ ఖడ్గ తిక్కన, కవి తిక్కనలను ఒకటిగా చూసారు.

  రిప్లయితొలగించండి
 16. తొలుత పలికె రైతు "తొమ్మిది బస్తాల
  కవులెకరమునకును" ఖండితముగను
  పంట వచ్చు వేళ కుంటి సాకునుఁ జూపి
  కవులు నియమములకుఁ గట్టుపడరు.

  రిప్లయితొలగించండి
 17. కవులు దలచి నంత కవనమై భాసిల్లు
  మనసు లోని భావ మధుర రసము
  శతము యుగము లలరు చరితార్దులే వారు
  కవులు నియమములకు గట్టు పడరు !

  రిప్లయితొలగించండి
 18. కవులు దలచి నంత కవనమై భాసిల్లు
  మనసు లోని భావ మధుర రసము
  శతము యుగము లలరు చరితార్దులే వారు
  కవులు నియమములకు గట్టు పడరు !
  -----
  యతి ప్రాసల సంగతి నాకు తెలియదు కానీ భావాన్ని సున్నితంగా సుతారంగా చెప్పారు.

  రిప్లయితొలగించండి
 19. గురువుగారు,
  ధన్యవాదాలు. వ్రాయు అని వ్రాస్తే దానికి ముందు ఉన్న అక్షరం గురువు అవుతుందని అలా వ్రాశాను.

  రిప్లయితొలగించండి
 20. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంశనివారం, ఏప్రిల్ 02, 2011 7:21:00 AM

  జిగురు సత్యనారాయణ గారు కౌలు నియమాలు భావంతో పూరించడం చాలా బాగుంది.
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించండి
 21. కవిమిత్రు లందరూ చక్కగా పూరించుచున్నారు అందరికీ అబినందనలు.
  జీ యస్ యన్ గారూ!'కవుల 'ను 'కౌలు 'దారులను జేసి మీ దారి వేరని చూపించారు.భేష్!ప్రత్యేక అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. ఆ: చెడ్డ మానవులను జెడ్డ వ్యవస్థ ను

  మార్చు సాహసమున మార్చెను తమ

  పంథ,నాటి కవుల పద కవితల జూడ

  కవులు నియమములకుఁ గట్టుపడరు !

  గురువు గారికి నా నమస్కారములు, మీ సహాయమును సదా కోరుతూ

  శ్రీ శ్రీ గారి పద కవితలను మనసు నందుంచి మరోకటి .

  రిప్లయితొలగించండి
 23. శంకరార్యా !
  ఖడ్గ తిక్కన ,కవి తిక్కనలకు
  బంధుత్వం ఉందని ఈ మధ్య గరికిపాటి వారు
  భక్తి టీవి భారతంలో చెప్పడం జరిగింది !
  ప్రస్తుతం విరాట పర్వం నడుస్తోంది !

  అంతేగాదు కవి తిక్కన , అమాత్యుడు గా పనిచేస్తూనే
  కవిత్వం వ్రాసినట్లు ఆయనే చెప్పారు !

  అందుజేత
  కవితిక్కన కత్తి కూడా వాడాడని నా భావం !
  అంతేగాని ఇద్దరూ ఒకటని గాదు !
  గమనించ గలరు !

  రిప్లయితొలగించండి
 24. సత్యనారాయణ గారూ,
  వైవిధ్యమైన మీ పూరణ ప్రశంసార్హమై ఉంది. అభినందనలు.

  రాజేశ్వరి గారూ,
  మనోహరమైన పూరణ. అభినందనలు.

  రావు గారూ,
  ధన్యవాదాలు.

  వరప్రసాద్ గారూ,
  ఈ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  వసంత్ కిశోర్ గారూ,
  నిజమే! తిక్కన లిద్దరికీ బంధుతవం ఉంది. కవి తిక్కన మనుమసిద్ధికి మంత్రిగా ఉన్నాడు. కాని కత్తిపట్టి యుద్ధం చేసినట్లు ఎక్కడా లేదు.

  రిప్లయితొలగించండి
 25. గురువు గారూ! నిజమే ఖడ్గ తిక్కన కవి కాదు. నేనే పొరపాటు పడ్డాను. మీరన్నట్టు న కూడా గురువే ఔతుంది. సవరణకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి