మిస్సన్న గారూ మీ పూరణ బాగుంది కానీ చివరి పాదం అతికించినట్లు ఉంది. నేననుకోవటం పైపాదాల్లో "న" "ట" లతో కలపక పోవటం అని. ఛందో బధ్ధమో లేదో నాకు తెలియదు. ఎల్లా ఉందో చూడండి. ---------------
తిరుగుబాట్లు రేగె నేటి దేశాలందు స్వేచ్చ కోరు ప్రజలు చీదరింప కలవరమ్ము రేపె ఘన నియంతల నట
నీటి లోన బుట్టె నిప్పు గనుడు!! ------------- కవి మిత్రులకు నేను కవిని కాను మిత్రుడిని మాత్రమే. అందుకని తప్పులుంటే క్షమిస్తారు కదూ.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు, ధన్యవాదాలు.
మందాకిని గారు, ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
లక్కరాజు వారూ, క్రమం తప్పకుండా బ్లాగులోని సమస్యాపూరణలను చదువుతూ వెంటవెంటనే స్పందిస్తూ, సలహాలు, సూచనలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. శాస్త్రి గారి వ్యాఖ్య చూసారు కదా మీరు చెప్పినట్లు మార్చితే యతి తప్పుతుంది. మిస్సన్న గారి పద్యంలోను మీ సూచించిది చేస్తే యతి తప్పుతుంది. అన్నట్టు మీ పేరులోని "ఎస్" అంటే ఏమిటి? మీ పూర్తి పేరు చెప్పండి.
మిస్సన్న గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
వసంత్ కిశోర్ గారూ, మీ షడ్రుచుల పూరణలు బాగున్నాయి. మొదటి పూరణలో అన్న హజారే నిప్పులాంటి మనిషి అని చెప్పారు. రెండవ పూరణలో సుమతి మనస్సనే నీటిలో పుట్టిన అగ్నిని చక్కగా ఆవిష్కరించారు. మూడవ పూరణలో ప్రహ్లాదుని ప్రస్తావన బాగుంది. మొదటి పాదంలో "హరియె" అంటే గణదోషం ఉండదు. నాల్గవ పూరణ ధృవుని వృత్తాంతంతో అలరిస్తున్నది. ఐదవ పూరణలో చాణక్యుని విషయాన్ని చక్కగా చెప్పారు. కాని రెండవ పాదంలో యతి తప్పింది. "సూద మొంద జేసె" అనేది "నాశ మొంద జేసె" అయితే? ఆరవ పూరణలో కృష్ణుని నాట్యాన్ని మనోహరంగా వర్ణించారు. అభినందనలు, ధన్యవాదాలు.
రాజేశ్వరక్కయ్యా, తమ్ముడి మీద కోపం వచ్చిందా? బహు కాలానికి దయ చూపారు. మనోహరమైన పద్యంతో "రీ్ఎంట్రీ" చేసారు. ధన్యవాదాలు.
రావుగారూ ! తప్పేమీ కాదు ! సరిగానే పడింది ! పండితు లెవ్వరూ లేరిక్కడ ఒక్క శంకరయ్య మాష్టారు తప్ప ! అంతా హైస్కూలు స్థాయి తెలుగు పందితులే ! అనుమానం ఆవంత కూడా లేదు !
అయ్యా ! హైస్కూలు తెలుగు దాటిన వాళ్ళెవరైనా ఉంటే నన్ను మన్నించండి !
లక్కరాజు వారూ! తెలుగు భాష పట్ల, తెలుగు పద్యం పట్లా మీకున్న అభిమానం, ఆసక్తి శ్లాఘనీయం. గురువుగారి బ్లాగులో వ్రాసే వాళ్ళందరం వసంత మహోదయులన్నట్లు హైస్కూలు పండిట్లమే. ఎవరి నాలుక మీదా యెవరూ బీజాక్షరాలు గానీ మరోటీ గానీ వ్రాయలేదు. ఇది కేవలం శంకరాభరణం మహత్తు. మన మిత్రులలో చాలామందిమి గురుకృప వలన మనకున్న స్వల్ప పరిజ్ఞానానికి మెరుగులు దిద్దుకుంటున్న వారలమే. మీరూ త్వరలోనే పద్యాలు వ్రాయగలిగే శక్తిని పొంద గలరనడంలో సందేహం లేదు. సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు.
ముంచె సంద్ర మంత భూకంపములు వచ్చి
రిప్లయితొలగించండిరేడియేష నందరే!జపాను
సోలు చుండె నేడు శోకాగ్నిలో తాను
నీటి లోన బుట్టె నిప్పు గనుడు!!
పనివత్తిడిలోబడి కూడా సాహిత్య సేవకు లోబడి సమయానికి బ్లాగులోబడికి వచ్చి ప్రశ్న పత్రమునిచ్చిన మాస్టరుగారూ! మీకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిజగమునందుగనఁగ జరుగును వింతలు
రిప్లయితొలగించండిమారుఁగాలమందు మర్మ మేమొ;
వింటి నోడ మునిగి, వెదజల్లె నూనెలు;
నీటి లోన బుట్టె నిప్పు గనుడు!
సోలు చుండె నేడు శోకాగ్నిలో తాను
రిప్లయితొలగించండినీటి లోన బుట్టె నిప్పు గనుడు!!
-----------
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ పూరణ బాగుంది. నాకెందుకో "సోలు" తీసేసి "చీదు" అనిపెట్టి చదువుతుంటే ఇంకా బాగున్నట్లు అనిపిస్తోంది.
చీదు చుండె నేడు శోకాగ్నిలో తాను
నీటి లోన బుట్టె నిప్పు గనుడు!!
తిరుగుబాట్లు రేగె దేశ దేశాలందు
రిప్లయితొలగించండిస్వేచ్చ కోరు ప్రజలు చీదరించ
కలవరమ్ము కల్గె ఘన నియంతల కట
నీటి లోన బుట్టె నిప్పు గనుడు!!
లక్కరాజు గారూ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిచీ వ్రాస్తే యతి సరిపోదండీ.
మిస్సన్న గారూ మీ పూరణ బాగుంది కానీ చివరి పాదం అతికించినట్లు ఉంది. నేననుకోవటం పైపాదాల్లో "న" "ట" లతో కలపక పోవటం అని. ఛందో బధ్ధమో లేదో నాకు తెలియదు. ఎల్లా ఉందో చూడండి.
రిప్లయితొలగించండి---------------
తిరుగుబాట్లు రేగె నేటి దేశాలందు
స్వేచ్చ కోరు ప్రజలు చీదరింప
కలవరమ్ము రేపె ఘన నియంతల నట
నీటి లోన బుట్టె నిప్పు గనుడు!!
-------------
కవి మిత్రులకు నేను కవిని కాను మిత్రుడిని మాత్రమే. అందుకని తప్పులుంటే క్షమిస్తారు కదూ.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
01)
__________________________________
ఆకసమున కెగసె - అవినీతి నేడయ్యొ !
జనుల దోచు వాడె - ఘనుడు నేడు !
అన్న దీక్ష బూనె - అంతమొందింపగా !
నీటిలోనఁ బుట్టె - నిప్పు గనుఁడు !
__________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి02)
రిప్లయితొలగించండి__________________________________
భాను రాక వలన - ప్రాణమే పోవును
నీదు పతికి నిలను - నిక్క మనగ
సూర్య గమన మాపు - సుదతి సుమతి మది
నీటిలోనఁ బుట్టె - నిప్పు గనుఁడు !
__________________________________
03)
రిప్లయితొలగించండి__________________________________
హరి లేని చోటు - అవని లేనే లేదు
అందు యిందు యనగ - అనుమ వలదు !
స్తంభ మందు జూపె - చక్రిని బాలుడు !
నీటిలోనఁ బుట్టె - నిప్పు గనుఁడు !
__________________________________
అనుమ = సందేహము
04)
రిప్లయితొలగించండి__________________________________
తండ్రి యంక పీఠి - తగవు నీవని తోయ
చిన్న బోయి నట్టి - చిన్ని ధృవుడు
ధృడముగా నిలిచెను - ధృవతారయై మింట
నీటిలోనఁ బుట్టె - నిప్పు గనుఁడు !
__________________________________
05)
రిప్లయితొలగించండి__________________________________
పిలక బట్టి యీడ్వ - పెలుచన పెరుగగా
సూద మొంద జేసె - నంద నవము !
శపథ మూని చతుర - చాణక్యు డంతట !
నీటిలోనఁ బుట్టె - నిప్పు గనుఁడు !
__________________________________
పెలుచన = కోపము
సూదము = హతము
కాళీయుని మర్థించు చిన్ని కృష్ణుడు :
రిప్లయితొలగించండి06)
__________________________________
తకిట తకిట తథిమి - తకిట తకిట యనుచు
కాళి పడగ పైన - కాలు మోపి
వింత నటన జేయు - వేణుగానము తోడ !
నీటిలోనఁ బుట్టె - నిప్పు గనుఁడు !
__________________________________
నింగి లోన నిలచె నీలాల నెలరాజు
రిప్లయితొలగించండిజగతి పైన వెలసె జనని దుర్గ
కవుల కలము లందు కలతలు చెలరేగె
నీటి లోన బుట్టె నిప్పు గనుడు !
రాజేశ్వరి గారూ వావ్. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి. మూడు పాదాలలో నింగి లో నుండి నీటిలోకి వచ్చారు. పూరణ బాగుంది.
రిప్లయితొలగించండిలక్కరాజు వారూ మీ సూచన బాగుంది.
రిప్లయితొలగించండికానీ ఛందో నియమాలకు ఇబ్బంది కల్గుతుంది.
ధన్యవాదాలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు, ధన్యవాదాలు.
మందాకిని గారు,
ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
లక్కరాజు వారూ,
క్రమం తప్పకుండా బ్లాగులోని సమస్యాపూరణలను చదువుతూ వెంటవెంటనే స్పందిస్తూ, సలహాలు, సూచనలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు.
శాస్త్రి గారి వ్యాఖ్య చూసారు కదా మీరు చెప్పినట్లు మార్చితే యతి తప్పుతుంది.
మిస్సన్న గారి పద్యంలోను మీ సూచించిది చేస్తే యతి తప్పుతుంది.
అన్నట్టు మీ పేరులోని "ఎస్" అంటే ఏమిటి? మీ పూర్తి పేరు చెప్పండి.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
వసంత్ కిశోర్ గారూ,
మీ షడ్రుచుల పూరణలు బాగున్నాయి.
మొదటి పూరణలో అన్న హజారే నిప్పులాంటి మనిషి అని చెప్పారు.
రెండవ పూరణలో సుమతి మనస్సనే నీటిలో పుట్టిన అగ్నిని చక్కగా ఆవిష్కరించారు.
మూడవ పూరణలో ప్రహ్లాదుని ప్రస్తావన బాగుంది. మొదటి పాదంలో "హరియె" అంటే గణదోషం ఉండదు.
నాల్గవ పూరణ ధృవుని వృత్తాంతంతో అలరిస్తున్నది.
ఐదవ పూరణలో చాణక్యుని విషయాన్ని చక్కగా చెప్పారు. కాని రెండవ పాదంలో యతి తప్పింది. "సూద మొంద జేసె" అనేది "నాశ మొంద జేసె" అయితే?
ఆరవ పూరణలో కృష్ణుని నాట్యాన్ని మనోహరంగా వర్ణించారు.
అభినందనలు, ధన్యవాదాలు.
రాజేశ్వరక్కయ్యా,
తమ్ముడి మీద కోపం వచ్చిందా? బహు కాలానికి దయ చూపారు.
మనోహరమైన పద్యంతో "రీ్ఎంట్రీ" చేసారు. ధన్యవాదాలు.
శంకరార్యా !
రిప్లయితొలగించండిమీ సూచనలకూ సవరణలకూ
ధన్యవాదములు !
అంధ రాజు సాక్షి గాంధారి పుత్రుండు
రిప్లయితొలగించండివంద నీయు రాలి వలువ లొలువ
ధర్మమడిగె నాడు ద్రౌపది !నామెక
న్నీటి లోన బుట్టె నిప్పు గనుడు
కవి పందితులతోటి ఆరునెలలు సావాసం చేస్తే ఏమన్నా అంటుతుందేమో నని చూస్తున్నాను. కుదరటల్లేదు.
రిప్లయితొలగించండిఇంకా ఏ మిస్సన్న గారో నాలిక మీద రాస్తే కాళిదాసు లాగా అవుతానేమో అనుకున్నా. కుదరటల్లేదు.
ఛందస్సులో నా పరిజ్ఞానం 1950s లో రేపల్లి హైస్చూల్ లో మా తెలుగు మాస్టారు బోడేపూడి వెంకట్రావు గారు ప్రేమతో ఇచ్చినది.
"యస్" అంటే నా పేరు లో శివరామకృష్ణ.
శంకరాభరణం తో ఆనందించ నివ్వండి నన్ను.
పైన పండితులు తప్పుపడింది క్షమించండి.
రిప్లయితొలగించండిరావుగారూ !
రిప్లయితొలగించండితప్పేమీ కాదు !
సరిగానే పడింది !
పండితు లెవ్వరూ లేరిక్కడ
ఒక్క శంకరయ్య మాష్టారు తప్ప !
అంతా హైస్కూలు స్థాయి తెలుగు పందితులే !
అనుమానం ఆవంత కూడా లేదు !
అయ్యా ! హైస్కూలు తెలుగు దాటిన వాళ్ళెవరైనా
ఉంటే నన్ను మన్నించండి !
లక్కరాజు వారూ! తెలుగు భాష పట్ల, తెలుగు పద్యం పట్లా మీకున్న అభిమానం, ఆసక్తి శ్లాఘనీయం.
రిప్లయితొలగించండిగురువుగారి బ్లాగులో వ్రాసే వాళ్ళందరం వసంత మహోదయులన్నట్లు
హైస్కూలు పండిట్లమే.
ఎవరి నాలుక మీదా యెవరూ బీజాక్షరాలు గానీ మరోటీ గానీ వ్రాయలేదు.
ఇది కేవలం శంకరాభరణం మహత్తు.
మన మిత్రులలో చాలామందిమి గురుకృప వలన మనకున్న స్వల్ప పరిజ్ఞానానికి మెరుగులు దిద్దుకుంటున్న వారలమే.
మీరూ త్వరలోనే పద్యాలు వ్రాయగలిగే శక్తిని పొంద గలరనడంలో సందేహం లేదు.
సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు.
పీతాంబర ధరా! మీ పద్యం అమోఘం.
రిప్లయితొలగించండిమిస్సన్న గారు ధన్య వాదములు.
రిప్లయితొలగించండిమంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ వైవిధ్యంగా ఉంది. "కన్నీటి నుండి నిప్పు" పుట్టించారు. బాగుంది. అభినందనలు.
లక్కరాజు వారూ,
రిప్లయితొలగించండిషిప్ట్ నొక్కితే"డ", లేకుంటే "ద". అంతే తేడా. ఓకేనా?! :-)