13, ఏప్రిల్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 284 (గోమాంసముఁ దినెడివాఁడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
గోమాంసముఁ దినెడివాఁడె గురువన నొప్పున్.
(రామ రామ! శివ శివా! పాపము శమించుఁగాక!)

16 కామెంట్‌లు:

 1. గోమాయువు యన నొప్పును
  గోమాంసము దినెడి వాడె; గురువన నొప్పున్
  క్షేమముగా భూజనులకు
  నీమములను బోధజేసి నిష్టతొ నుండన్!

  రిప్లయితొలగించండి
 2. ఏమా గురువులు తగరా?
  నీమంబుల్ నిష్ఠలంచు నీల్గెద వౌరా!
  సోమరి! ప్రహ్లాదా! విను
  గోమాంసముఁ దినెడివాఁడె గురువన నొప్పున్.

  రిప్లయితొలగించండి
 3. ఏమో! ' టైపాటి 'చ్చట
  'గోమాంసము దినెడి వాడె గురువన నొప్పున్!'
  మేమా 'పాటు ' ను మార్చగ
  'గోమాంసము దినెడి వాడె గృధ్రము చెప్పన్!'

  రిప్లయితొలగించండి
 4. శాస్త్రి గారూ మీ రెండు పద్యాలు చాల బాగున్నాయి. మీ నిన్నటి రామ సన్నుతి మనోహరంగా ఉఇంది.
  గో గృ లకు యతి మైత్రి ఉందా అని సందేహం.

  రిప్లయితొలగించండి
 5. హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ రెండు పద్యాలను చూసాను. బాగున్నాయి. అయితే చిన్న లోపాలు.
  మొదటి పద్యంలో "గోమాయువు + అన" అన్నప్పుడు యడాగమం రాదు. "గోమాయు వనఁగ నొప్పును" అంటే సరి. పద్యం చివర నిష్ఠ"తొ" అన్నారు. "నిష్ఠను మెలఁగన్" అంటే బాగుంటుంది.
  రెండవ పద్యం చివరి పాదంలో "గో-గృ"లకు యతి చెల్లదు. "కుజనుఁడు చెప్పన్" అంటే సరి!

  మిస్సన్న గారూ,
  రాక్షస కుల గురువును విషయంగా చేసికొని చక్కని పూరణ నిచ్చారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. మిస్సన్న గారూ!ధన్యవాదములు. ప్రహ్లాదుని పరంగా చేసిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
  శంకరార్యా! దోష నివృత్తి జేసినందులకు కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 7. రోమాంచితమౌ కనఁగఁదు
  గో,మాంసముదినెడివాడె; గురువననొప్పున్
  ప్రేమాంబుధి దేల్చునెవఁడుఁ
  గామాంధతనుండిగాఁచుఁగైవల్యముకై!

  కనఁగఁ+అదుగో

  రిప్లయితొలగించండి
 8. మందాకిని గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  "కనఁగదుగో" కంటే "కన నదుగో" అనడం సరి.

  రిప్లయితొలగించండి
 9. నా పూరణ .....

  నా మీఁదఁ జూపె నెంతో
  ప్రేమను "రహమాను" సారు విద్య నొసఁగెఁ దా
  నో ముస్లిము, కుల రీతిని
  గోమాంసముఁ దినెడివాఁడె గురువన నొప్పున్.

  రిప్లయితొలగించండి
 10. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !
  01)
  ____________________________________

  హేమాంగము ననవచ్చును
  గోమాంసము దినెడివాడు ! - గురువన నొప్పున్
  మీమాంసది యేల ? నిజము
  ప్రేమాంబుధి విద్య నేర్పు - బోధకు నకిలన్ !
  ____________________________________
  హేమాంగము = సింహము

  రిప్లయితొలగించండి
 11. శంకరార్యా! సమస్యను ' సమర్థ 'నీయముగా పూరించారు. అభినందనలు.
  మందాకిని గారూ!గో,మాంసాన్ని దూరం చేశారు.. బాగుంది.
  కిశోర్ గారూ!గోమాంసాన్ని తినెడివాడిని, గురువు దరికి చేరనీయలేదు..అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. గోలి హనుమచ్ఛాస్త్రి గారన్నట్లు గురువుగారు కడు సమర్థనీయమైన పూరణ నిచ్చారు.

  రిప్లయితొలగించండి
 13. రామాయణమ్ము నేర్వగ
  స్వామీజీ పండితులగు చక్కని గురువుల్
  గోముగ కసాయి వృత్తికి
  గోమాంసముఁ దినెడివాఁడె గురువన నొప్పున్

  రిప్లయితొలగించండి
 14. రామాయణమ్ము జించును
  గోమాంసముఁ దినెడివాఁడె;..గురువన నొప్పున్
  గోమూత్రపు బలము జదివి
  మీమాంసలు చేసి చేసి మ్రింగెడు వానిన్

  రిప్లయితొలగించండి