19, ఏప్రిల్ 2011, మంగళవారం

సమస్యా పూరణం - 290 (సంజీవనిఁ దెచ్చి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
సంజీవనిఁ దెచ్చి యిచ్చి చంపగ సాగెన్.
సమస్యను సూచించిన చంద్ర శేఖర్ గారికి ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

  1. పంజా సింహము కట్టులఁ
    ముంజేతుల కొండనెత్తి మోసిన హనుమా
    కెంజాయలసౌమిత్రుఁకుఁ
    సంజీవనిఁ దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్.

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !

    01)
    ___________________________________

    ముంజేతిని తొందరగా
    సంజీవని దెచ్చి యిచ్చి ! - చంపగ సాగెన్
    అంజని సుతుడే యంతట
    రంజిల్లగ రామ బంట్లు - రాక్షస మూకన్ !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  3. రంజుగఁ సాగెడి రణమున
    కంజదళాక్షుడనుజుండఁ గనియల్లాడెన్
    యంజన సుతుడేగెన్; యా
    సంజీవనిఁ దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్.

    రిప్లయితొలగించండి
  4. ముంజెను దెచ్చిన రీతిగ
    సంజీవని దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్
    కుంజర శతశత బలమున
    అంజన సుతుడపుడు పోరి యసురుల తోడన్!

    రిప్లయితొలగించండి
  5. పుంజిగొని ముందుకుంజని
    భంజితులై జనెను దైత్య బలగంబులు ప్రా
    భంజను రౌద్రాటొప ప్ర
    భంజనమున జిక్కి సాలభంజికల బలెన్
    అంత,
    అంజన సూనుని రాబి
    ల్చెన్ జాంబవతు పురిగొని సుషేణుడు సౌమి
    త్రిన్ జీవితు జేయగ మృత
    సంజీవని వేగ దెచ్చు సాయము జేయన్
    అపుడు,
    వెన్ జూడక సాగెన్ సమి
    తింజయు డసదృశ పవనగతిన్ పెకలిచె న
    ద్రిన్ జడియింప నసురులన్
    సంజీవనిఁ దెచ్చి యిచ్చి చంపగ సాగెన్

    రిప్లయితొలగించండి
  6. గుంజి మహీధర మంతట
    సంజీవనిఁ దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్
    అంజని పుత్రుం డసురుల
    కెంజాయపు కనుల నగ్ని కీలలు రేగన్.

    రిప్లయితొలగించండి
  7. అందరు అనుకొన్నట్లే శ్రీరామాయణం ఆధారంగా పూరించారు. ధన్యవాదాలు, కవిమిత్రులకు. మహాభారతంలోని కచ-దేవయాని కధ ఆధారంగా:

    రంజుగ బ్రతికించె భృగువు
    సంజీవనిఁ దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్
    అంజిక నసురులు కచునిన్
    సంజీవని నేర్వరాదు చంపు మనంగన్.

    రిప్లయితొలగించండి
  8. మా ఇంట్లో నా చిన్నతనంలో మా అవ్వ జలుబు చేస్తే సంజీవని అని ఒక కషాయం కలిపి ఇచ్చేది.అప్పుడు ఆమెను తిట్టుకునే వాళ్ళం.

    ఏం జరిగిందని? పొడి జలు
    బుం జూచి తడబడి యవ్వ ముమ్మారిట్లున్
    గంజిని కలువ కషాయము -
    సంజీవనిఁ దెచ్చి యిచ్చి చంపగ సాగెన్.

    రిప్లయితొలగించండి
  9. చిన్న అనుమానము - ఒక పాదాంతము 'సాగెన్' గా మలి పాదారంభము 'అంజన' గా ఉన్నప్పుడు, 'సాగె నంజన' అవుతుంది కద?

    రిప్లయితొలగించండి
  10. నేను కూడా అదే అనుకొని, "సాగె...న్నంజిక" అని వ్రాసి (గణాలు కలుపుకొంటూ), మరల విడదీసి సుళువుగా అర్థమవ్వటం కోసం "సాగెన్...అంజిక" వ్రాశాను. శంకరయ్య మాస్టారు చెప్పాలి అలా విడదీసి వ్రాయటం కరక్టేనా కాదా అని.

    రిప్లయితొలగించండి
  11. సాగెన్నంజిక వచ్చే అవకాశము లేదనుకుంటానండి.

    జేసెన్ + నాట్యము - జేసెన్నాట్యము
    పాడెన్ + ఆటాడెన్ = పాడె నాటాడెన్
    సాగెన్ + అంజిక = సాగె నంజిక

    రిప్లయితొలగించండి
  12. అంజన సుతు సౌమిత్రికి
    సంజీవనిఁ దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్,
    పింజారి మూక నంతను,
    కంజ దళాక్షుండు మెచ్చ ,కాలుడు మెచ్చన్!

    రిప్లయితొలగించండి
  13. వింజామరతో వీచుచుఁ
    మంజీరమధురసునాదమంజులవాణిన్
    కెంజాయలవధువతఁడినిఁ
    సంజీవనిఁ దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్.


    రామాయణం ఆధారంగా కాకుండా :) :)
    నవ వధూవరుల మనోస్థితి ఆధారంగా ....

    రిప్లయితొలగించండి
  14. కవి మిత్రు లందరికీ నమస్కృతులు.
    అత్యవసరంగా మా అక్కయ్య దగ్గరికి (హుస్నాబద్) వెళ్తున్న కారణంగా రెండు రోజులు మీ పూరణలను పరిశీలించి వ్యాఖ్యానించలేక పోవచ్చు. వీలు చేసికొని సమస్య నైతే పోస్ట్ చేస్తాను. ఈ రెండు రోజులు దయచేసి మీరే పరస్పర గుణదోష విచారణ చేయండి.
    పూరణలను పంపిన
    మందాకిని, వసంత్ కిశోర్, గోలి హనుమచ్ఛాస్త్రి, గిరి, మిస్సన్న, చంద్రశేఖర్, రవి, మంద పీతాంబర్
    గారలకు అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. అంజలినిడి గీర్వాణికి
    సంజీవనిఁ దెచ్చి యిచ్చి చంపఁగ సాగెన్
    భంజింపఁదగిన వ్యాఖ్యల
    మంజలవాక్కోలాచలమల్లీశ్వరుఁడై :)

    రిప్లయితొలగించండి
  16. పింజారీ అంటే పింజలు, జంద్యాలు వడికేవాడు,బీబీ నాంచారమ్మ వారసుడు http://nrahamthulla.blogspot.in/2013/07/blog-post.html

    రిప్లయితొలగించండి
  17. గింజుచు "పెన్షను" ముదుసలి
    జంజాటము తాళలేక చావుని గోరన్
    రంజిల్లు "వెంటి లేటరు
    సంజీవనిఁ" దెచ్చి యిచ్చి చంపగ సాగెన్

    రిప్లయితొలగించండి
  18. అంజన సుతుండు ఘనముగ
    సంజీవనిఁ దెచ్చి యిచ్చి;..చంపగ సాగెన్
    గుంజుచు గుద్దుచు మొత్తుచు
    జంజాటపు రాక్షసులను ఝకటమునందున్

    రిప్లయితొలగించండి