20, ఏప్రిల్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 291 (పిట్ట పిట్ట పోరు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
పిట్ట పిట్ట పోరు పిల్లి దీర్చె.
సమస్యను పంపిన అజ్ఞాత మిత్రునికి ధన్యవాదాలు.

16 కామెంట్‌లు:

 1. "శంకరాభరణం" లోని సమస్యా పూరణలను ఒక పి.డి.ఎఫ్. పుస్తకంగా తీర్చి దిద్దాలనుకుంటున్నాను. జిగురు సత్యనారాయణ గారి "సమస్యాపూరణల శతం" చూసాను. బాగుంది. అలా చేయాలంటే స్టెప్ బై స్టెప్ వివరంగా తెలియజేయ వలసిందిగా సాంకేతిక విషయ నిష్ణాతులైన మిత్రులకు మనవి.

  రిప్లయితొలగించండి
 2. పిల్లిపిల్లిపోరు పెద్దకోతియె దీర్చె
  పిట్ట పిట్ట పోరు పిల్లి దీర్చె
  మనిషి మనిషి పోరు మరి దీర్చు నెవరురా
  మానవత్వమంత మంట గలవ?

  రిప్లయితొలగించండి
 3. దొంగ దొంగ కలసి దొరలను వంచించు
  పగిది నాయకులును ప్రజల ధనము
  కొల్లగొట్టుచుండ, గొని పోవు నక్స్లైటు
  పిట్ట పిట్ట పోరు పిల్లి దీర్చె.

  రిప్లయితొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !
  01)
  _____________________________________

  అబ్ది నపుడు పుట్టె - అమృతము ! కలిగె
  అసుర సురల నడుమ - అధిక పోరు !
  మోక్ష దాత యంత - మోహినిగా మారి
  పిట్ట పిట్ట పోరు - పిల్లి దీర్చె !
  ______________________________________

  రిప్లయితొలగించండి
 5. తిరుగుబాటు దార్లు దేశ భక్తుల మధ్య
  వైర మధిక మాయె పోరు హెచ్చె
  అగ్ర రాజ్య మొకటి అదనుగా చెలరేగె
  పిట్ట పిట్ట పోరు పిల్లి దీర్చె.

  రిప్లయితొలగించండి
 6. భూమినాక్రమించి పోరుకు తెగియించు
  దిష్టి కళ్ళ పొరుగు దేశములను
  చెనకి గెలువవలెను స్నేహముతో గాదు
  జవహరు డిది తెలియ జాల కైక్య
  రాజ్య సమితి కడకు రయ్యంచు బోయెను
  నోటి దనుక వచ్చి దాటిబోయె
  చేతికంద వచ్చి చేజారి బోయె కా
  శ్మీరు పురవరంబు దూరమాయె
  ఐక్య రాజ్య సమితి కధికార మీయగా
  పిట్ట పిట్ట పోరు పిల్లి దీర్చె

  రిప్లయితొలగించండి
 7. కవి మిత్రులకు అభినందనలు. అందరి పూరణలు అలరించుచున్నవి.

  పిట్ట,పిల్లి వాటి పిల్లలతో పోరి
  బైట కలసి మిగుల బాధ పడెను!
  నచ్చ జెప్పి పిదప నాపిల్లి పోరును
  పిట్ట; పిట్ట పోరు పిల్లి; దీర్చె!!

  రిప్లయితొలగించండి
 8. గురువు గారు,
  PDF Fileని బ్లాగులో Upload చెయ్యాలంటే ముఖ్యముగా మూడు Steps
  (నేను చేసిన పద్దతిని తెలియజేస్తున్నాను, దీనికంతే సులభమైన పద్దతి ఉండవచ్చు)
  1. PDF File తయారు చేసుకోవటము.
  2. దానిని gmail Documentsలో Upload చెయ్యటము
  3. బ్లాగు టపాలో దానికి లింకు ఇవ్వటము.

  PDF File తయారు చేసుకోవటము:-
  a ముందుగా మన దెగ్గర PDF Writer ఉన్నదో లేదో చూసుకొవాలి. లేనిచో దానిని down load చేసుకో వచ్చు. నేను PDF995 వాడుతున్నాను. దీన్ని free Software గా Down load చేసుకోవచ్చు.
  b మనకు కావలిసిన Matterను MS WORD Document లో సిద్ధము చేసుకోని ఉంచుకోవలెను.
  c Word Documentలో Printకి వెళ్లి PDF995ని ఎంచుకొని OKకొట్టిన దానిని PDF Fileగా Save చెయ్య వచ్చు.

  రిప్లయితొలగించండి
 9. gmail Documents లో Upload చెయ్యటము
  a gMail తెఱచినంత ఎడమ వైపు పై మూలలో Documents అని కనపడుతుంది. దానిని నొక్క వలెను.
  b Upload Buttonని నొక్కి మనము సిద్దముగా ఉంచుకున్న PDFని Public file గా upload చెయ్య వలెను.
  c ఆ తరువాత google Docsకి వచ్చి upload చేసిన Docపైన curserఉంచి Right Click నొక్కి Sharing > Sharing Settings కి వెళ్లి ఆ File URL ని Copy చెసుకో వచ్చు .

  బ్లాగు టపాలో దానికి లింకు ఇవ్వటము:-
  a అలా Copy చేసుకున్న లింకును టపలొ Directగా ఇవ్వ వచ్చు
  b లేదా ఏదైనా ఒక పదానికి లింకుగా ఇవ్వవచ్చు. ఇలా ఇవ్వాలంటే మొదటగా ఆ పదాన్ని Select చేసుకోని పైన ఉన్న లింకు Buttonని (Text Color Button ప్రక్కన ఉంటుంది) నొక్కి Copy చేసుకున్న File URLని Paste చెయ్యలి.

  రిప్లయితొలగించండి
 10. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !
  01అ)
  _____________________________________

  అబ్ధి గలుగ , నపుడు - అమృతము కొరకయి
  అసుర సురల పోరు - అధిక మవగ
  మోక్ష దాత యంత - మోహినిగా మారి
  పిట్ట పిట్ట పోరు - పిల్లి దీర్చె !
  ______________________________________

  రిప్లయితొలగించండి
 11. అన్నదమ్ములున్న యాస్తి పంచకబోయె
  కడక పార్టుమెంట్లు గట్టు వారు
  కబ్జ జేసి చిల్లిగవ్వ చేతబెట్టి నటుల
  పిట్ట పిట్ట పోరు పిల్లి దీర్చె

  రిప్లయితొలగించండి
 12. పరికిణీల పోరు చీరనే దీర్చెను ,
  ప్రేమ పోరు జూడ పెళ్లి దీర్చె,
  పెదవి పెదవి పోరు మదన ముద్దే తీర్చె,
  పిట్ట పిట్ట పోరు పిల్లి దీర్చె!

  గుట్ట గుట్ట పోరు గుత్తెదారుడు దీర్చె,
  గుడిసె గుడిసె పోరు రోడు దీర్చె
  పార్టి పార్టి పోరు పంది కొక్కులు దీర్చె
  పిట్ట పిట్ట పోరు పిల్లి దీర్చె!

  రిప్లయితొలగించండి
 13. మిత్రు లందరికీ నమస్కృతులు.
  నేను హుస్నాబాద్‌లో ఉన్నాను. అందువల్ల మీ పురణలను పరిశీలించి వ్యాఖ్యానించలేక పోతున్నాను.
  పూరణలను పంపిన
  చమ్రశేఖర్, చింతా రామకృష్ణా రావు, వసంత్ కిశోర్, మిస్సన్న, గిరి, గోలి హనుమచ్ఛాస్త్రి, మంద పీతాంబర్ గారలకు అభినందనలు, ధన్యవాదాలు.
  పి. డి. ఎఫ్. గురించిన వివరాలు తెల్పిన సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 14. మీ సాహిత్య సేవ కొనియాడదగింది.అభినందనలు !!!

  రిప్లయితొలగించండి
 15. రొట్టెముక్కగూర్చి కొట్టుకొనఁగఁ జూచి
  త్రాసుఁ దెచ్చి తూచి తగవు మాన్పు
  తీర్పు నెపముఁ జూపి తినివైచె పూర్తిగా
  పిట్ట పిట్ట పోరు పిల్లి దీర్చె

  రిప్లయితొలగించండి