వికలముఁజెందినకరిరా జు,కరుణఁజూపుమనివేడఁ, జోరున, ననుజూ డకఁజని,కరిగాచియనువుఁ మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా.
గజేంద్రుని రక్షణ పూర్తి అయినాక, శ్రీమన్నారాయణుడు "నేనిలా వచ్చేసినందుకు నీవేమనుకున్నావు" అని శ్రీమహాలక్ష్మి ని అడుగుతాడు. భక్తులనిలా కాపాడిన భగవంతుని చూచి ఆ తల్లి మరులుఁగొందని నా యూహ. కొడుకుని పడిపోకుండా భర్త పట్టుకొని కాపాడినపుడు భార్య అతన్ని ఆరాధనగా చూడదా? పై పద్యంలో సుకరముగ+అల అని భావన.
Congratulations, India. Happy World Cup Winning Moments. ధోని సేన దోచుకొనెగ దుర్లభ ప్ర పంచ కప్పు, భరతదేశ బావుటాలు యెగిరె నోయి సుజనసీమ లెల్ల మెచ్చె భారతీయుడా,నీకిదె భళి భళి భళి ! కొసమెరుపు: పంచ్ కోసం ఇంగ్లీషులో కూడా విష్చేశాను, వరల్డ్ కప్ కదా!
సుకరము గల నాడొకపరి
రిప్లయితొలగించండిమకరముఁ జంపిన దయాళుఁ మదిలో నేమా
రక పూజలుఁ జే సెడు మా
మ,కరము పట్టంగ నాకు మరులు గలిగెరా
మకరము మా రాశులు! క్షే
రిప్లయితొలగించండిమకరము మా జాతకంబు! మనువే కుదిరెన్!
మకరము లగ్నములో వా
మ,కరము పట్టంగ నాకు మరులు గలిగె రా!
సకలము నీవే ననె, నా
రిప్లయితొలగించండిముకుళితమౌ మోముగాంచి, ముదమున ప్రేమన్
బ్రకటించ,మనోహరు ,వా
మ,కరము పట్టంగ నాకు మరులు గలిగెరా!
నవనిధుల పేర్లు:పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్ఛపము, ముకుందము, కుందము, నీలము, వరము: వచ్చేట్లుగా సమస్యా పూరణ:
రిప్లయితొలగించండిఒక పద్మ,మహా పద్మముఁ
నిక, కచ్ఛప, వర, ముకుంద, నీలము, కుందా
దిక, శంఖ, నవని ధియునా
మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా!
వికలముఁజెందినకరిరా
రిప్లయితొలగించండిజు,కరుణఁజూపుమనివేడఁ, జోరున, ననుజూ
డకఁజని,కరిగాచియనువుఁ
మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా.
గజేంద్రుని రక్షణ పూర్తి అయినాక, శ్రీమన్నారాయణుడు "నేనిలా వచ్చేసినందుకు నీవేమనుకున్నావు" అని శ్రీమహాలక్ష్మి ని అడుగుతాడు.
భక్తులనిలా కాపాడిన భగవంతుని చూచి ఆ తల్లి మరులుఁగొందని నా యూహ.
కొడుకుని పడిపోకుండా భర్త పట్టుకొని కాపాడినపుడు భార్య అతన్ని ఆరాధనగా చూడదా?
పై పద్యంలో సుకరముగ+అల అని భావన.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమకరందమంటి పల్కులు
రిప్లయితొలగించండిమకరధ్వజునమ్ముఁబోలు మైసోయగముల్
మకరారినడక గల భా
మ కరము పట్టంగ నాకు మరులు గలిగెరా!
క : మకరందము రుచికై గో
రిప్లయితొలగించండిధిక, తుమ్మెద పాట్లు జూడ నికరం గానే
మకరందం పై మిక్కిలి
మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా!
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ చాలా బాగున్నాయి. అభినందనలు.
హనుమచ్ఛాస్త్రి గారూ,
ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
పీతాంబర్ గారు,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
"ముకుళితమౌ మోము" .... ?
చంద్రశేఖర్ గారూ,
మీ నవనిధుల పూరణ బాగుంది. అభినందనలు.
ఫణి ప్రసన్న కుమార్ గారూ,
అత్యుత్తమమైన పూరణ. అభినందనలు.
"మకరందమంటి పల్కులు" అనేదాన్ని "మకరందము వంటి నుడులు" అందాం.
వరప్రసాద్ గారూ,
పద్యం బాగుంది. కాని చిన్న వివరణ ఇస్తే బాగుండేది.
రెండవ పాదంలో "ధి-ని"లకు యతి చెల్లదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఒకపరి కరి గావవె బో,
రిప్లయితొలగించండిమకరము పట్టంగ!నాకు మరులు గలిగె రా
ర! కనికరమునను నను నీ
మకరి జరా సంధు నుండి మనిపేల్కొనగన్!
మనిపి+యేల్కొనగన్
మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండిశుక పికముల రావమ్ముల
నికరములౌ మధుకరముల నిస్వన మెలరన్
సుకరముగా సుమబాణుని
మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా !
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమంచి పూరణ. అభినందనలు.
"మనిపి యేలుకొనన్" అని యడాగమ రూపమే వస్తుంది. అక్కడ సంధి లేదు.
"మనుపుచు నేలన్" అనిగాని, "మనిపియు నేలన్" అంటే సరి.
నరసింహ మూర్తి గారూ,
మనోహరమైన పూరణ. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
విశ్వ విజేతలుగా నిల్చిన టీమిండియాను
మెచ్చుకుంటూ భారతీయుడు :
01)
___________________________________________
సుకృతుల జేసిరి సర్వుల
శకలము గాకుండ నిలిపి - సచినుని కలనే
సుకరముగ క్రికెటు కప్పు , త
మ , కరము పట్టంగ నాకు - మరులు గలిగెరా !
___________________________________________
సుకృతి = ధన్యుడు
Congratulations, India. Happy World Cup Winning Moments.
రిప్లయితొలగించండిధోని సేన దోచుకొనెగ దుర్లభ ప్ర
పంచ కప్పు, భరతదేశ బావుటాలు
యెగిరె నోయి సుజనసీమ లెల్ల మెచ్చె
భారతీయుడా,నీకిదె భళి భళి భళి !
కొసమెరుపు: పంచ్ కోసం ఇంగ్లీషులో కూడా విష్చేశాను, వరల్డ్ కప్ కదా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమకరందపు పలుకులు విని
రిప్లయితొలగించండిమకరాంకుని గాంచినంత మాటలు కరువై !
కకవికల మవగ మదిలొ
మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా !
మకరాంకుడు = మన్మధుడు
కోట్లాది భారతీయుల కలని నిజం చేసిన 'టీం ఇండియా' కి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
ప్రపంచ క్రికెట్ కప్పును సాధించిన భారత జట్టుకు శుబాకాంక్షలు.
రిప్లయితొలగించండిమొదట సెహ్వాగు వెనుదిర్గ మొక్కవోక!
సచిను యువరాజు కొహ్లీలు సాహసింప!
ధోని గంభీరు నిలబడి తోడు నిలువ!
కప్పు దెచ్చిరి భారత కలలు పండ!
గురువుగారూ దిద్దుబాటుకు ధన్యవాదాలు..
రిప్లయితొలగించండిక్రికెటు కప్పు మనదె! క్రీడ లీడర్ మనమె!
రిప్లయితొలగించండిజగతి కప్పు మనదె! జాణ మనమె!
కలసి కట్టు జట్టు! కరచు మట్టిని వైరి!
ఐక మత్య మొకటె ఆదు కొనును!
గురువుగారు ఈ సమస్యను పరిశీలించ వచ్చును.
రిప్లయితొలగించండికప్పు గెలిచినారు కలత వడగ !
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిసమయానుకూలమైన చక్కని పూరణ. అభినందనలు.
రాజేశ్వరి గారూ,
పద్యం బాగుంది. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ,
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
హనుమచ్ఛాస్త్రి గారూ,
మిస్సన్న గారూ,
............................ ధన్యవాదాలు.
"సకల సుఖమ్ములు వీడియు
రిప్లయితొలగించండినకిలీ వేటలను వలచి నందము తోడన్
సుకరముగ నాట లాడుచు
మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా!"
...as spoken by a girl watching Steve Irwin, the famous "crocodile hunter"...
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నికటపు చెరువున మున్గుచు
రిప్లయితొలగించండివికటపు కేకలను యువతి విరివిగ నిడగా
చకచక నీదుచునా భా
మ కరము పట్టంగ నాకు మరులు గలిగెరా