22, జూన్ 2016, బుధవారం

సమస్య - 2067 (శుని సంపంగి సుమాల...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“శుని సంపంగి సుమాల శోభలను మెచ్చున్ మేలు మేలంచుఁ దాన్”
లేదా...
“శునకము సంపంగిపూల శోభను మెచ్చున్”
ఈ సమస్యను సూచించిన రెండుచింతల రామకృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు.

39 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. అనిశంబున్ నవ చంపకంబుల విరుల్ హారంబుగా గూర్చుచున్
      వినియోగించు మహేశ్వరార్చనల గా
      వించన్ దరిన్ భక్తుడా
      కనులందున్ గని స్వామి సత్క్రుపను
      సాకారంబుగానెంచు నీ
      శుని సంపంగి సుమాల శోభలను మెచ్చున్ మేలు మేలంచు దాన్!





      తొలగించండి
    3. గురువు గారికి నమస్సులు...అర్థానుస్వాములు యేయే సందర్భాలలో యెలాంటి పదాలకు చేరివస్తాయో దయచేసి తెలుపగలరు....

      తొలగించండి
    4. రెండు మూడు రోజులు ఓపిక పట్టండి. అర్ధానుస్వారాల గురించి వివరంగా ప్రత్యేక పాఠమే పెడతాను.

      తొలగించండి
    5. ధన్యవాదములు గురువుగారూ...మిమ్మల్ని యిబ్బంది పెట్టినానేమో....మన్నించండి

      తొలగించండి
    6. సవరణతో......

      అనిశంబున్ నవ చంపకంబుల విరుల్ హారంబుగా గూర్చుచున్
      వినియోగించు మహేశ్వరార్చనల శో
      భిల్లన్ దగన్ ముగ్ధుడై
      కనులందున్ గనె స్వామి సత్క్రుపను
      సాకారంబుగానెంచి యీ
      శుని సంపంగి సుమాల శోభలను మెచ్చున్ మేలు మేలంచు దాన్!







      తొలగించండి
  2. అనయము కావలి గాచును
    శునకము;సంపంగి పూల శోభను మెచ్చున్
    ఘనతర రసికాగ్రణి తా
    మిను మిక్కిలి మదన తాపమింపును గూర్పన్

    రిప్లయితొలగించండి
  3. నను నీ దానను జేయగన్ రగిలి! ప్రాణాపాయ మూహించడే!
    తనువున్ బండుగ నింపగన్ వలపు బంధమ్ముల్ ప్రసాదించుగా
    ననసానాగడనన్ కుమారిఁగని దానై గుమ్మరింపన్ మహే
    శుని సంపంగి సుమాల శోభలను మెచ్చున్ మేలు మేలంచుఁ దాన్

    రిప్లయితొలగించండి
  4. కనబడె సింహము వోలెను
    శునకము, సంపంగి పూల శోభను మెచ్చు
    న్ద నులత గల యాభామలు
    కనువిందుగ నుండుకత న కళకళ తోడన్
    -----
    హనుమా !వింటివె యీయది
    శునకము సంపంగి పూల శోభను మెచ్చు
    న్గన బడగా నీ పూవులు
    తనువంతయు బులకరించి తాదాత్మ్య మగున్

    రిప్లయితొలగించండి
  5. అనయము నచ్చిక జూపును
    శునకము, సంపంగి పూల శోభను మెచ్చున్
    ఘనమగు పరివాసములిడు
    ననలను జడలందు దుఱుము నవలామణులే!!!

    పరివాసము = పరిమళము
    నన = పూలు

    రిప్లయితొలగించండి
  6. ఘనుడా శంకరు భక్తపాలన క్రియా కాంక్షా రతుం డాతనిన్
    మన మందింపుగ నిల్పిమోదమున సంభావింప దామంబుల
    న్ననిశమ్మున్ ద్విగుణీకృతం బయిన,కంఠాలంకృతస్నిగ్ధ, మీ
    శుని సంపంగి సుమాల శోభలను మెచ్చున్ మేలు మేలంచుఁ దాన్

    అనఘ వినాశక విష్ణు క
    థనముల మెత్తురె నితాంత తామస జనులున్
    జన పదముల జని యెవ్విధి
    శునకము సంపంగిపూల శోభను మెచ్చున్

    రిప్లయితొలగించండి

  7. అనయము వాకిట నుండును
    శునకము;సంపంగి పూల శోభను మెచ్చున్
    వనితారత్నము ముదమున
    వనిలో పూచిన విరులను వడిగా తెంచెన్.

    రిప్లయితొలగించండి
  8. ఘనుడౌవేంకట నాథసత్ కృపకు సంకల్పించు సద్భక్తిచే
    మనసున్ మంగళ దాయకంబుగను సౌమ్యంబందు నాశ్రీనివా
    శుని సంపంగి సుమాలశోభలను “మెచ్చున్ మేలు మేలంచు దాన్
    పనితంబందున మంగమాంబ మురిసెన్ వాత్సల్య మోహాకృతిన్. {పనితం=పొగడబడిన}

    రిప్లయితొలగించండి
  9. మనలో విశ్వాసంబగు
    శునకము,సంపంగి పూలశోభనుమెచ్చున్
    మనుగడలో వనితలు,సా
    దనమున విజ్ఞాని ప్రతిభ ధరలో ఘనమే|

    రిప్లయితొలగించండి
  10. అనయము మ్రు చ్చిలి యన్నము
    తను చేరు ను దాలిగుంట తద్దయు తృప్తిన్
    జనుల సరిపోలి యెవ్విధి
    శునకము సంపంగిపూల శోభను మెచ్చున్ ?

    రిప్లయితొలగించండి
  11. వినుమా యీయది సావధానముగ సంపెంగల్ సమూలంబుగా
    నొనరన్ మాలగ జేయగా మిగుల దానో పంగ నామా గిరీ
    శుని సంపంగి సుమాల శోభ లను మెచ్చున్ మేలు మేలంచు దాన్
    ననగా పండిత శ్రేణులీయె డను నే నా శ్చ ర్య ము న్ బొంది తి న్

    రిప్లయితొలగించండి
  12. కనలేదే విరి సొబగుల
    శునకము, సంపంగి పూల శోభను మెచ్చున్
    వనితలు మురిపము గానుత
    మనల్లనికురుల ముడువరె మక్కువ తోడన్

    రిప్లయితొలగించండి
  13. పెను దౌష్ట్యంబుగ దేవమానవులనిన్ పీడించ నాతారకుం
    డును సంహారము సేయ గౌరిసుతు బుట్టున్నట్లు సంకల్పమై
    యనిరుద్ధుందెస నెక్కుపెట్టె శరమున్ అస్వప్నులాశన్ రతీ
    శుని సంపంగి సుమాల శోభలను మెచ్చున్ మేలుమేలంచుదాన్॥

    రిప్లయితొలగించండి
  14. ఘనమగు శిక్షణ తోడన్
    జనియెడు రక్షక దళముల జకుటములందున్,
    కనగా, సుకృతము కూడిన
    శునకము సంపంగి పూల శోభను మెచ్చున్!

    రిప్లయితొలగించండి
  15. తనభుక్తిన్ గొను యిచ్చతో సతతమున్ తచ్చాడు చుండున్ గదా
    శుని, సంపంగి సుమాల శోభలన్ మెచ్చున్ మేలు మేలంచుఁదాన్
    తనువున్ కోర్కులు దండిగా చిగురులొత్తంగన్ వియోగమ్ముతో
    ఘనుడౌ వల్లభు రాకకై వెదకుచున్ కాంతాలలామమ్మటన్

    రిప్లయితొలగించండి
  16. ఫణిరాజున్ మెడ నుంచి హారముగ నా భర్గుండు తా వేడుకన్
    ఘన భస్మమ్మును మేననద్దుకొని గంగన్నిల్ప శీర్షమ్మునన్
    గన,నా పార్వతి నేత్ర పర్వమనుచున్ కైలాసమున్నేలు నీ
    శుని సంపంగి సుమాల శోభలను మెచ్చున్ మేలు మేలంచుఁ దాన్.

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. ఘనమగు నమ్మిక చూపును
    శునకము; సంపంగి పూల శోభను మెచ్చున్,
    కనకాంగి తానె కురులను
    నునుపుగ దువ్వీ ముడువగను సిగను తానే!

    (నండూరి సుందరీ నాగమణి)

    రిప్లయితొలగించండి
  19. పనిగొని పథికుల గరచును
    శునకము; సంపంగిపూల శోభను మెచ్చున్
    పెనగొని నాగులు వృక్షము
    ననవరతము నా సుగంధ మా ఘ్రాణింపన్

    రిప్లయితొలగించండి
  20. ఘనుడౌ వేంకట నాథు గొల్వగను భక్తాగ్రేసరుం డొక్కడున్
    జనెనా శ్రీగిరి భక్తితో నట గనెన్ స్వామిన్ మహా వేంకటే
    శుని సంపంగి సుమాలశోభలను మెచ్చున్ మేలుమేలంచు దాన్
    తనువెల్లన్ పులకింప భాష్పములు ప్రత్యక్షమ్మయే నంతటన్

    రిప్లయితొలగించండి
  21. కినుక వహించెను కద యొక
    శునకము! సంపంగిపూల శోభను మెచ్చున్
    అనిరీ కవులుకద ! వలదు
    మనకీ రాణి బతుకులని మస్తుగ బోయెన్ !


    జిలేబులు అందరికీ నచ్చవు :)

    అట్లాగే శునకానికి కూడా సంపంగి వాసన బేకార్ :)

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. అనగూడదుగానీ, మా
    వెనుకింటను గోడదూకి వెంకట్రావే
    కన పూలగోయు వాడొక
    శునకము, సంపంగి పూల శోభను మెచ్చున్.

    రిప్లయితొలగించండి
  23. *శిష్ట్లావారు ఈశుని సంపంగి సుమాల శోభ అన్నారు. బాగుంది. పద్యంలో‌ సరిగా రాలేదు.

    *రెండుచింతలవారి కందంలో‌మొదటి రెండు పాదాల్లో రెండు ఉటంకింపులు పూర్తయ్యాయి. పద్యమే పూర్తి కాలేదు కాబట్టి తత్ర్పయాసగా వ్రాసిన ద్వితీయార్థం సరిగా రాలేదు. తా మిను మిక్కిలి? లేదా తామిను మిక్కిలి? ఏమిటో ఎలాగైనా అర్థం ఏమిటో సుభగంగా లేదు. మిను అంటే ఆకాశం కదా.

    *సహదేవుడుగారు వృత్తంలో మహేశుని అని పూరించారు. తనువున్? తనువునన్ అన్నది అలా క్లుప్తీకరించటం‌ కుదరదు కదా! ననసానాగడ అంటే - మీ‌ భావం అస్పష్టంగా తెలుస్తోంది కాని ఆ పదం ఉందా, ఏమి అర్థం అని నాకైతే తెలియదు.

    *సుబ్బారావుగారు మెచ్చున్ తనులత కల ఆభామలు అన్నారు. కాని అనకూడదండీ. మెచ్చున్ ఏకవచనం భామలు బహువచనం కదా. వారి రెండవ కందంలో సమస్యను నేరుగా సమర్థించారు! పరిష్కరించాలి కదా? శునకము మెచ్చును అని ఒప్పుకొంటే మరి పద్యం అవసరం లేదు కదా.

    *శైలజగారు అనయము నచ్చిక జూపును శునకము అన్నారు. అచ్చిక అంటే కొఱత అండి. తుఱుము నవలామణులే అనకూడదు తురుము అని ఒక వ్యక్తి గురించి మాత్రమే అనగలం కదా. నవలామణులు బహువచనం‌ కదా. నవలామణియే అనండి. పద్యాన్ని కొంచెం చిత్రిక పట్టాలి. 'కనుగొని మెచ్చగ నేఱదు| శునకము సంపంగి పూల శోభను; మెచ్చన్| వినుతపరీమళము నెఱుగు | తనుమధ్యకె చెల్లు గాన తలదాల్చు జుమీ|' అందాం. మీ సౌకర్యం‌కొసం విరామచిహ్నం‌ వాడాను కాని, అవి వాడటం అనవసరం.

    *పోచిరాజు వారి వృత్తంలో మార్పులవసరం. శంకరుఁ అంటే శంకరుని అని ఒక విభక్తిలోనూ కాంక్షారతుండు మరొక విభక్తిలోనూ అనకూడదండీ. 'ఘనుడా శంకరు భక్తపాలన..' బదులుగా 'ఘను డీశుండన భక్తపాలన..' అందాం. సంభావింప అంటే సంభావింపగా అని కదా, పొసగటం లేదు. చూడండి 'సంభావింప దామంబులన్ అనిశమ్మున్ ద్విగుణీకృతం బయిన,' ఏది ద్విగుణీకృతమైనది - పూర్తిగా చెప్పలేదు ప్రయోగంలో. మరొక రకంగా ఆ సంభావింప అన్నది వెనుకకు పెట్టి 'దామంబులన్ అనిశమ్మున్ ద్విగుణీకృతం బయిన' అన్నా అదే పరిస్థితి కదా. మోదమున సంభావించి ఒక మార్పు చేదాం మొదట. ఇంక మూదవపాదాన్ని, 'అనిశంబున్ సుమనోహరంబయిన కంఠాభూషణంబా మహే' అని సరిచేదాం. ఇక కందం చూదాం. 'వినాశక విష్ణు కథనములు' ఏమిటి? ముందువేసిన మాటను మారిస్తే అఘవినాశక విష్ణుకథనములు అన్నది సరిపోతోంది. అనఘ అన్నది సంబోధనగానే పద్యంలో వస్తున్నది గమనించండి. అఘము అంటే పాపం‌ - అనఘుడు అంటే‌ పాపరహితుడు అని. కొంచెం‌ పొరబడ్డారు. 'అనఘ, సర్వేశు విష్ణు' అని మారుధ్దాం. పూరణావిధానం ప్రశస్తం.

    *ఉమాదేవిగారి పద్యం మూడు పాదాలతో సంపన్నం ఐపోయింది. కాని నాల్గవపాదమూ వ్రాయవలసి వచ్చింది! అది సరిగా రాలేదు. నాలుగవపాదం ఒక తప్పనిసరి వ్యవహారం లాగానో అతుకులాగానో‌ బయటకు కనబడని విధంగా చాకచక్యం చూపించాలి మరి. అదటుంచి మొదటి మూడుపాదాల్లో‌నూ‌ పూర్తి ఐన రెండు ఉటంకింపులూ ఒకదానికి ఒకటి సంబంధించటం లేదన్నదీ గమనార్హం. 'కనుగొని మెచ్చగ నేఱదు శునకము అనండి'. శునకాలు నేడు వాకిట్లో ఏం‌ఖర్మం హాయిగా మన పక్కల్లోనే పడుకుంటున్నాయి ఈ‌లోకంలో హతవిధీ! ముదమున అన్నది నాల్గో‌పాదంలోనికీ‌ అన్వయించుకో వచ్చును కాబట్టి, ఆఖరి పాదాన్ని'తన కురులను ముడిచి సంతతంబును మురియున్' అని మారిస్తే సరి.

    *ఈశ్వరప్పగారి వృత్తం. వేంకటనాథు సత్కృప అన్నది సరిగా ఉంటుంది. వారే ఇచ్చిన అర్థం ఆరోపించి 'పనితంబందున' అంటే అన్వయం సరిగా రావటం లేదు కదా - పొగడ్తలో? ఎలా? 'మనసున్ మంగళ దాయకంబుగను సౌమ్యంబందు' రకరకాలుగా ఉన్నాయండి పదాలు! పద్యం తిరుగ వ్రాయాలి. వారి కందంలో కూడా ఇటువంటి దోషాలు చాలా ఉన్నాయి! దయచేసి దండాన్వయం చూసుకోకుండా వ్రాయవద్దని అందరికీ మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామల రావు గారు మీ విశ్లేషణకు ధన్యవాదములు. శంకరుని, భక్తపాలన క్రియా కాంక్షా రతుండు-ఆతనిని, అని రెండు ద్వితీయావిభక్తి గదా యని వ్రాసితిని. సంభావించు(ను) దామంబుల న్ననిశమ్మున్ గామర్చి ఆవాక్యాన్ని పూర్తి చేస్తాను. అప్పుడు ఈసుని సంపంగి సుమాల ఆయన కంఠమునలరించుటవలన వచ్చిన కాంతి వలన ద్విగుణీకృతమయిన మాలను మెచ్చుకుంటాడన్న భావము.
      కంద పద్యములో “అనఘ ను అఘ అని మనసులో యనుకొని పొరబడ్డాను. సవరించిన పద్యమును పరిశీలించగలరు.

      అనఘాత్మపఠిత విష్ణు క
      థనముల మెత్తురె నితాంత తామస జనులున్
      జన పదములఁ జని యెవ్విధి
      శునకము సంపంగిపూల శోభను మెచ్చున్

      తొలగించండి
    2. "ద్విగుణీకృతమయిన మాలశోభలను" అని చదువ గోర్తాను.

      తొలగించండి
  24. *అన్నవరపు వారు. ఎవ్విధి మెచ్చున్ అన్నట్లు పూర్తిచేసారు బాగుంది. 'తను చేరు ను' లో‌ టైపో. 'తిని చేరును' అనబోయా రనుకుంటాను.
    *సుబ్బారావు గారూ . మీ‌ వృత్తం నాకూ ఆశ్చర్యం‌ కలిగించిందండీ. ' దాన్|ననగా'? 'మిగుల దానో పంగ నామా గిరీ
    శుని'? అయోమయంగా ఉందండి. దయచేసి దండాన్వయం చూసుకోండి ఒకసారి.
    *విరించిగారు 'మెచ్చున్|వనితలు' అన్నారు. ఒకే వచనంలో ఉండవద్దండీ? పదాలమధ్య విరామం లేక గానుత ఏమీ అని విస్తుబోయానండి మొదట. గాను తమ అన్న మాటల సంగతి అన్నమాట. దయచేసి దండాన్వయం చూసుకోండి ఒకసారి. వృత్తంలో వేంకటనాథుడు వేంకటేశుడు అని రెండుసార్లు చెప్పటం పునరుక్తి. ఉచితం కాదు. మొదటిపాదాన్నే సరిచేయండి. పద్యాంతం 'ప్రత్యక్షమ్మయే నంతటన్' అన్నది సరిగా లేదు గమనించండి. 'ప్రత్యక్షమ్ముగా నంతటన్' అనండి. ధారకనిపించటం సంతోషకరం.
    *తంగిరాలవారు. దౌష్ట్యంబున అనండి. దేవమానవులనిన్! దేవమానవులనున్ అనియా? ఉహుఁ. పద్యం‌మొత్తం గడబిడగా ఉందండి. మీరూ దయచేసి దండాన్వయం చూసుకోండి ఒకసారి పద్యాన్ని పంపే ముందు. మొత్తం‌ తిరుగవ్రాయాలి.
    *భాగవతులవారు. వృత్తం విషయం. 'కన,నా పార్వతి నేత్ర పర్వమనుచున్' బదులుగా 'కని యా పార్వతి నేత్ర పర్వమనుచున్' అంటే సముచితం. మంచి పద్యం. కందంలో, ' సంపంగిపూల శోభను మెచ్చున్ పెనగొని నాగులు' అంటే వచనసాంకర్యం కదుటండీ? చివరిభాగం అంతా పూరణప్రయాసగా ఉంది. ముక్కముక్కలుగా ఉంటే బాగుండలేదండి.
    *నండూరి నాగమణి గారు. ఘనమగు నమ్మిక చూపును శునకము; సంపంగి పూల శోభను మెచ్చున్ కనకాంగి వరకు పద్యం బాగానే సాగింది. చెప్పదలచుకొన్నది ఐపోయింది. మిగిలినది సరిగా లేదు. 'తానె కురులను నునుపుగ దువ్వీ ముడువగను సిగను తానే' అంటారు. అందులో పునరుక్తిగా తానె అన్న మాటా, గ్రామ్యభాషగా దువ్వీ అనటం పరిహరించాలి. కనకాంగి అని కాస్త పెద్దమ్మాయి అన్నట్లే ఉంది కద తనకురులు తాను దువ్వుకొని తానే ముదుచుకోవటంలో విశేషం ఏమిటీ? పద్యంలో అది ఎందుకు ఏలా అతుకుతున్నదీ. అమ్మా దండాన్వయం అన్నది చూసుకోండి.
    *గోలివారి కందం. వ్యావహారిక గ్రంథభాషలను కలగలుపు చేసారు. పద్యం సరిగా రాలేదు. దండాన్వయం చూసుకోండి ఒకసారి పద్యాన్ని పంపే ముందు.

    రిప్లయితొలగించండి
  25. శ్యామలీయం గారికి ధన్యవాదములు. శ్రీధర్ రావు గారి కందము, నా వృత్తము కూడా పరిశీలించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధరరావుగారి కందం బాగుంది ఫలాని రకం కుక్కలు శిక్షణకారణంగా సంపంగిపూలను మెచ్చుతాయని.

      అన్నపురెడ్డి వారు, గొను యిచ్చతో అనరాదు గొను నిచ్చతో అనవలసి ఉంది. తనువున్ కోర్కులు దండిగా చిగురులొత్తంగన్ అన్నారు కాని తనువున అనటానికి తనువున్ అన్నది సరైన ప్రయోగం కాదండి. కొంచెం సరిచేయవలసి ఉంది. రెండు వేర్వేరు విషయాలు మీ వృత్తంలో ఉన్నాయి. ఎలాగో వాటికి ముడివేస్తే మరింత బాగుంటుంది.

      తొలగించండి
  26. శ్యామలీయం గారికి ధన్యవాదములు. ననసానాగడ అంటే మన్మథుడు అని అర్థం. తనువున్ ని తనువుల్... అంటూ సవరించాను. సర్ దయతో పరిశీలింప ప్రార్థన.

    నను నీ దానను జేయగన్ రగిలి! ప్రాణాపాయ మూహించడే!
    తనువుల్ పూసెడు రీతిగన్ వలపు బంధమ్ముల్ ప్రసాదించుగా
    ననసానాగడనన్ కుమారిఁగని దానై గుమ్మరింపన్ మహే
    శుని సంపంగి సుమాల శోభలను మెచ్చున్ మేలు మేలంచుఁ దాన్!

    రిప్లయితొలగించండి
  27. మిక్కిలి అంటే అధికం మినుమిక్కిలి అంటే ఇంకా ఎక్కువ అనే భావం తో అలా ప్రయోగించాల్సి వచ్చింది.శ్యామలీయం గారికి ధన్యవాదములు.తమరి వ్యాఖ్యను ఆలస్యంగా గమనించాను మిను అంటే ఆకాశం ఒకటే కాదని నా భావన."ఇనుమిక్కిలి" అనే పదాన్ని ఇలా ప్రయోగించాను.చూ...శబ్దరత్నాకరము

    రిప్లయితొలగించండి
  28. కనజాలమ్ముర జర్మనీని వెదుకన్ కమ్యూనిజమ్మున్ భళా
    కనజాలమ్ముర రష్యలో వెదుకబో కమ్యూనిజమ్మున్ గురూ
    కనజాలమ్ముర చైనలో వెదుకబో కమ్యూనిజమ్మున్ సలా
    కనరే భారత రాజకీయమున నేకాంతమ్ముగన్ మార్క్సునున్...
    శుని సంపంగి సుమాల శోభలను మెచ్చున్ మేలు మేలంచుఁ దాన్...

    రిప్లయితొలగించండి