వర్షము కొఱకు ఎదురు చూసె వారికి "ఉఱుము" శ్రావ్యముగానే ఉంటుంది కదా!!ముద్దుల నింగిగుమ్మ కడు ముచ్చటగొల్పగ మబ్బు కాటుకన్దిద్దెనొ! నవ్వెనో మెఱపు తీగల కాంతులు కాన వచ్చెనాసద్దులు మిన్నుకొమ్మ నట సాధనమందలి మేఘనాదమోమద్దెల లెన్నియో గగనమధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్!!
సత్యనారాయణ గారూ, మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
వద్దని సృష్టిచక్ర సమవర్తన కద్ది విరుద్ధమౌననిన్బెద్దలు చెప్పినన్ వినక భృత్యుని కౌశికుడంప నింగికై గ్రద్దన వాని ఊహలనఁ గ్రమ్మెను మంగళ నాదవాద్యముల్మద్దెల లెన్నియో గగనమధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్!!
రామకృష్ణ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘ఔను అని’ అన్నపుడు అని ద్రుతాంతం కాదు. ‘విరుద్ధమౌ ననన్’ అందామా?
అద్దరి ఉరిమెను మేఘముమద్దెలలే మ్రోగె గగన మధ్యము నందున్మిద్దెలు మేడలు మునిగెనుహద్దులు దాటెనుగ వాన హరహర శంభో !జిలేబి
జిలేబీ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముద్దుగ పార్వతి కోరగహద్దే మరిలేకనాడె హరుడే గిరిపైపెద్దగ నాతని డమరుకమద్దెలలెమ్రోగె గగన మద్యము నందున్
చారి గారూ, మీ పూరణ బాగున్నది.లేక అన్నది కళ. కనుక లేక యాడె అనాలి. డమరుక మద్దెల అన్నది దుష్ట సమాసం. ‘పెద్దగ నా డమరుక మను| మద్దెల..’ అనండి.
బద్దలు కొట్టగ నభమునుహద్దులు లేక చెలరేగి నర్జునుడచటన్ముద్దుగ మెట్లను వేయగమద్దెలలేమ్రోగె గగనమధ్యమునందున్
చేపూరి వారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘చెలరేగి యర్జును...’ అనండి.
అద్దదె మేఘజాలము సమాగమ మందెను వర్షరాగమైదిద్దెను నల్లరంగులు శ్రుతించె తటిత్తులు మేళనమ్ములైమద్దెలలెన్నియో గగన మధ్యమునందున మ్రోగె శ్ర్యావ్యతన్నొద్దిలె జూడ నా జలద మూను పథమ్ము వియఃతలమ్మునన్!
శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘అద్ది+అదె=అద్దియదె’ అవుతుంది. అక్కడ ‘అద్దిర(ఆశ్వర్యార్థకం)’ వేద్దాం.
నిద్దుర వీడి సాధనల నింగికుపగ్రహ నౌకలంపగన్దిద్దిరి శాస్త్రవేత్తలొగి తీరుగ శ్రీహరికోటనందునన్హద్దులు దాటిలక్ష్యముల నందగ మోదము మిన్నుముట్టగన్మద్దెల లెన్నియొ గగన మధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్!
సహదేవుడు గారూ, సమకాలికాంశంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘నింగి నుపగ్రహ..’ అనండి.
గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:నిద్దుర వీడి సాధనల నింగి నుపగ్రహ నౌకలంపగన్దిద్దిరి శాస్త్రవేత్తలొగి తీరుగ శ్రీహరికోటనందునన్హద్దులు దాటిలక్ష్యముల నందగ మోదము మిన్నుముట్టగన్మద్దెల లెన్నియొ గగన మధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్!
శంకరాభరణం వారి సమస్యపూరణబండకాడి అంజయ్య గౌడ్ ముద్దుల మేనకాత్మజను మోదముతోడుత పెండ్లియాడగన్పెద్దలగూడి శంకరుడు విష్ణువు బ్రహ్మయు వెంటరాగ తానెద్దున కూర్చునొంగ సురబృందములన్నియు నాట్యమాడగన్మద్దెల లెన్నియో గగనమధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్ !!
అంజయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘కూరుచుండ’ అనండి.
నా రెండవ పూరణము ఒద్దిక దోడ నాశివుడు యూర్జిత మందెడి నర్తనమ్మునన్తద్ధిమి తాకిటా యనుచు తాళగతుల్ స్వర మేళనమ్ములైమద్దెలలెన్నియో గగన మధ్యము నందున మ్రోగె శ్ర్యావ్యత న్నద్దరి దద్దరిల్లె నవి యార్భటులై శివధామ మందునన్!
శర్మ గారూ, మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. ‘శివుడు+ఊర్జిత=శివు డూర్జిత’ అవుతుంది. ‘ఒద్దికతోడ నాగధరు డూర్జిత...’ అనండి.
ధన్యవాదములు
గురుమూర్తి ఆచారి గారి పూరణ....{ రావణుడు పుష్పకవిమానములో విహారము సేయు సమయమున నాట్యకత్తెలు ఆడగా మద్దెలలు శ్రావ్యముగా మ్రోగినవి }"తద్దిమితో౦ తధీ౦ తకిటతా కిటతా" యని పుష్పక౦బునన్ మద్దెల లెన్నియో గగన మధ్యము న౦దున మ్రోగె శ్రావ్యతన్ముద్దులు చి౦దు న౦దమున ముద్దియ లె౦దరొ నాట్య మాడగన్ దద్దయు హాయి రావణు డొనర్చె విహారము స్త్రీ విలాసియై!
ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తద్దయు భాను తాపమున ధారుణి మండుచు నున్నవేళలన్గ్రద్దన దిక్కు లన్నియును గ్రమ్ము కొనంగ దురంత మేఘమిప్పొద్దున నద్భుతమ్ముగను బొల్పుగ మ్రోగెను మేఘ ఘర్జనల్మద్దెల లెన్నియో గగనమధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్అద్దివమున మేఘమ్ములుసద్దులు సేయుచు నురుముల సాగుచు నుండన్ముద్దుగ నేనంటి నపుడుమద్దెలలే మ్రోగె గగనమధ్యము నందున్
కామేశ్వరరావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"గ్రద్దన నన్ని దిక్కులను గ్రమ్ము కొనంగ దురంత మేఘమి" యని సవరణ.
ముద్దుల చెల్లెలి పెళ్లికినద్దిరబన్నా! టపాసు లాకశమంటెన్సుద్దులఁ జెప్పఁగ ప్రేలుచుమద్దెలలే మ్రోగె గగన మధ్యమునందున్!
సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినదనలు.
బీటుకూరు శేషుకుమార్ గారి పూరణ...హద్దులు లేవుర శివుడా! ముద్దుల నీ ముదితతోడ మువ్వలు మ్రోగన్ఎద్దుల మూపున యాడగమద్దెలలేమ్రోగె గగన మధ్యమునందున్
శేషుకుమార్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘మూపున నాడగ’ అనండి.
‘ధరణి’ గారి పూరణ...విద్దెయె జీవన మని సరిహద్దులు దాటిన యిరువురు యన్నల తపముల్ నిద్దుర లోనా యూగుచు మద్దెలలో మ్రోగె గగన మధ్యము నందున్
ధరణి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ఇరువురు+అన్నల’ అన్నపుడు సంధి జరుగుతుంది, యడాగమం రాదు. ‘లోనన్+ఊగుచు=లోన నూగుచు’ అవుతుంది.
యుద్ధమున గెలువ విజయుడుతద్దయు ధృతితో, కనుగొని తనివిపెనుపడన్ముద్దుగ నచ్చర లాడగమద్దెలలే మ్రోగె గగన మధ్యమునందున్
అన్నపరెడ్డి వారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అద్దిర యురుములు నాబడు మద్దెలలే మ్రోగె గగన మధ్యము నందున్ని ద్దిన ముదయము కాగనె తద్దయు వర్షo బువ చ్చెదా మెఱుపు లతోన్
సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. ‘కాగనె’ అన్నది గ్రామ్యం. కాగన్ అందామా?
నిద్దుర మత్తును వీడకబద్దకముగ నున్నవేళ వాయ్వాస్పదమున్పెద్దగ నురిమెను మేఘముమద్దెలలే మ్రోగె గగన మధ్యము నందున్!!!
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఒద్దిక యైన సీతను మహోన్నతు డౌరఘు రామచంద్రుడే పెద్దలు గాంచుచుండ హర విల్లును ద్రుంచి వివాహమాడగానిద్ధరణీ తలమ్మున సురు లే కురిపించగ పుష్పవర్షమున్ మద్దెలలెన్నియో గగన మధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్ దద్దద్ధాయని యురిమె, దగద్ధగల మెరుపుల్ మెరియగ గాలియె వీచన్ నిద్దుర విడి నే తలచితిమద్దెలలే మ్రోగె గగన మధ్యము నందున్
ఆంజనేయ శర్మ గారూ,మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.మొదటి పద్యంలో ‘సురలే’ అనాలి. రెండవ పద్యం రెండవపాదంలో గణదోషం. ‘..గద్దగ మెరుపులు..’ అనండి.
అద్దిర మేఘముల్ గగన మంతయు నల్లగ నావరించె నే యిద్దిన మెల్లడన్గనగ నీదురు గాలులు నుర్ము లున్మఱిన్ సద్దులు తోడుగాగ దివి సాంతము చీకటి గాఁగ నా ఘనా మద్దెల లెన్నియో గగన మధ్యము నందున మ్రోగె శ్రా వ్యతన్
సుబ్బారావు గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘ఘనా మద్దెల’ అన్నచోట ‘చీకటి గాఁగ గొప్పనౌ| మద్దెల...’ అనండి.
ముద్దుల జంట కోరగను పుష్కరమందునఁజేయ పెండిలిన్పెద్దలు సమ్మతించి కడువేడ్కగఁ జల్ప విమాన లోఁగలిన్తద్దయు ప్రీతితో చనిరి తక్కినవారలు మేళగాండ్రతోమద్దెలలెన్నియో గగన మధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్పుష్కరముః ఆకాశము
అన్నపరెడ్డి వారూ, పుష్కర విమానంలో పెళ్ళి... బాగుంది పద్యం. అభినందనలు.‘లోఁగలిన్’...?
గురువర్యులకు నమస్సులు. విమాన మందునన్ అంటే సరిపోతుందా
మిత్రులందఱకు నమస్సులు![ఆత్మలింగము కోసమై రావణుఁడు ఘోరతపమునుం జేసినను శివుఁడు ప్రసన్నుఁడు కాకపోవఁగాఁ, దన ప్రేవులనే వీణియ తీవలుగాఁ జేసి వాయింపఁబూనుకొనఁగాఁ, జలించిన శివుఁడు తాండవమాడ నారంభింప, వెనువెంటనే ప్రమథగణాలు మద్దెలలు శ్రావ్యముగ మ్రోయించిన సన్నివేశము]అద్దనుజేంద్రు రావణుని యాంత్రపు వీణియ తీవ లుల్లమున్నిద్దుర లేపి యా శివుని నృత్యముఁ జేయఁగఁ బ్రేరణ మ్మిడన్దద్దిమి దిమ్మి దిమ్మి తక తద్దిమి తద్దిమి యంచు వెంటనేమద్దెల లెన్నియో గగనమధ్యము నందున మ్రోఁగె శ్రావ్యతన్!
గుండు వారూ, పూరణలో అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించారు. చక్కని పూరణ. అసలు సమస్యాపూరణగా కాక ఏదో కావ్యంలోని పద్యంగా భాసిస్తోంది. అభినందనలు.
ధన్యవాదాలు శంకరయ్య గారూ!
అద్దము వంటి దయ్యుమనకందిన వింతగటీవి యందునేమద్దెల లెన్నియో గగన మధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్దిద్దె| విమాన యానమున దీర్గ ప్రయాణముజేయువారికిన్అద్దియె సంతసంబొసగు హాయిని గూర్చునుదృశ్యకావ్యమై|3.గద్దలవలె గగనంబునమిద్దెల పైనుండి యెగురు మేటి విమానంసిద్దము జేసినటీవీమద్దెల మ్రోగె గగన మధ్యము నందున్.
ఈశ్వరప్ప గారూ, విమానంలోని టీవీలో మద్దెల దరువు. బాగున్నవి మీ రెండు పూరణలు. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ ముద్దులు గొల్పు బాలలకు మోదము గూర్చగ విద్య లెల్లెడన్ పెద్దలు దీక్ష బూని ఘన పెన్నిధి వోలె శ్రమించి నేర్పగన్ విద్దెల రాణి దీవెనలవే గొన భారతవాసు లెల్లరున్ మద్దెల లెన్నియో గగనమధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్పెద్దగ మెరుపులతో పిడి గుద్దులు గా గుండెలదర ఘోషించుచు వే మిద్దెలు మేడలు గూలగమద్దెలలే మ్రోగె గగనమధ్యము నందున్
కృష్ణారావు గారూ,మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.‘ఘన పెన్నిధి’ అనరాదు కదా! ‘దీక్ష గైకొనియు పెన్నిధి...’ అందామా?
అద్దమరేయి వచ్చె భరతావని స్వేచ్ఛకు స్వాగతంబిడన్ నిద్దుర లేచిరందరు ననేక జయోన్నత నాదముల్ సదా సద్దును మానకుండ కడు సమ్ముద మిచ్చెడి వాద్య బృందముల్మద్ధెల లెన్నయో గగన మధ్యము నందున మ్గోగె శ్రావ్యతన్
యుద్ధము నందున పార్థుడుబద్దలు గొట్టెను రిపులను బాణంబులచేసద్దును చేయుచు నవియునుమద్దెలలె మ్రోగె గగన మధ్యము నందున్
ముద్దుల గుమ్మయౌ గృహిణి ముచ్చటగా చన పుట్టినింటికిన్ప్రొద్దున లేవగానె పతి పోవగ వంటకు పాకశాలకున్నిద్దర మత్తులో నటక నెక్కుచు గిన్నెలు దింపుచుండగా...మద్దెల లెన్నియో గగనమధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్
వర్షము కొఱకు ఎదురు చూసె వారికి "ఉఱుము" శ్రావ్యముగానే ఉంటుంది కదా!!
రిప్లయితొలగించండిముద్దుల నింగిగుమ్మ కడు ముచ్చటగొల్పగ మబ్బు కాటుకన్
దిద్దెనొ! నవ్వెనో మెఱపు తీగల కాంతులు కాన వచ్చెనా
సద్దులు మిన్నుకొమ్మ నట సాధనమందలి మేఘనాదమో
మద్దెల లెన్నియో గగనమధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్!!
సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
వద్దని సృష్టిచక్ర సమవర్తన కద్ది విరుద్ధమౌననిన్
రిప్లయితొలగించండిబెద్దలు చెప్పినన్ వినక భృత్యుని కౌశికుడంప నింగికై
గ్రద్దన వాని ఊహలనఁ గ్రమ్మెను మంగళ నాదవాద్యముల్
మద్దెల లెన్నియో గగనమధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్!!
రామకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఔను అని’ అన్నపుడు అని ద్రుతాంతం కాదు. ‘విరుద్ధమౌ ననన్’ అందామా?
రిప్లయితొలగించండిఅద్దరి ఉరిమెను మేఘము
మద్దెలలే మ్రోగె గగన మధ్యము నందున్
మిద్దెలు మేడలు మునిగెను
హద్దులు దాటెనుగ వాన హరహర శంభో !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముద్దుగ పార్వతి కోరగ
రిప్లయితొలగించండిహద్దే మరిలేకనాడె హరుడే గిరిపై
పెద్దగ నాతని డమరుక
మద్దెలలెమ్రోగె గగన మద్యము నందున్
చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
లేక అన్నది కళ. కనుక లేక యాడె అనాలి. డమరుక మద్దెల అన్నది దుష్ట సమాసం. ‘పెద్దగ నా డమరుక మను| మద్దెల..’ అనండి.
బద్దలు కొట్టగ నభమును
రిప్లయితొలగించండిహద్దులు లేక చెలరేగి నర్జునుడచటన్
ముద్దుగ మెట్లను వేయగ
మద్దెలలేమ్రోగె గగనమధ్యమునందున్
చేపూరి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘చెలరేగి యర్జును...’ అనండి.
అద్దదె మేఘజాలము సమాగమ మందెను వర్షరాగమై
రిప్లయితొలగించండిదిద్దెను నల్లరంగులు శ్రుతించె తటిత్తులు మేళనమ్ములై
మద్దెలలెన్నియో గగన మధ్యమునందున మ్రోగె శ్ర్యావ్యత
న్నొద్దిలె జూడ నా జలద మూను పథమ్ము వియఃతలమ్మునన్!
శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అద్ది+అదె=అద్దియదె’ అవుతుంది. అక్కడ ‘అద్దిర(ఆశ్వర్యార్థకం)’ వేద్దాం.
నిద్దుర వీడి సాధనల నింగికుపగ్రహ నౌకలంపగన్
రిప్లయితొలగించండిదిద్దిరి శాస్త్రవేత్తలొగి తీరుగ శ్రీహరికోటనందునన్
హద్దులు దాటిలక్ష్యముల నందగ మోదము మిన్నుముట్టగన్
మద్దెల లెన్నియొ గగన మధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్!
సహదేవుడు గారూ,
తొలగించండిసమకాలికాంశంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నింగి నుపగ్రహ..’ అనండి.
గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
తొలగించండినిద్దుర వీడి సాధనల నింగి నుపగ్రహ నౌకలంపగన్
దిద్దిరి శాస్త్రవేత్తలొగి తీరుగ శ్రీహరికోటనందునన్
హద్దులు దాటిలక్ష్యముల నందగ మోదము మిన్నుముట్టగన్
మద్దెల లెన్నియొ గగన మధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్!
గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
తొలగించండినిద్దుర వీడి సాధనల నింగి నుపగ్రహ నౌకలంపగన్
దిద్దిరి శాస్త్రవేత్తలొగి తీరుగ శ్రీహరికోటనందునన్
హద్దులు దాటిలక్ష్యముల నందగ మోదము మిన్నుముట్టగన్
మద్దెల లెన్నియొ గగన మధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్!
శంకరాభరణం వారి సమస్య
రిప్లయితొలగించండిపూరణ
బండకాడి అంజయ్య గౌడ్
ముద్దుల మేనకాత్మజను మోదముతోడుత పెండ్లియాడగన్
పెద్దలగూడి శంకరుడు విష్ణువు బ్రహ్మయు వెంటరాగ తా
నెద్దున కూర్చునొంగ సురబృందము
లన్నియు నాట్యమాడగన్
మద్దెల లెన్నియో గగనమధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్ !!
అంజయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కూరుచుండ’ అనండి.
నా రెండవ పూరణము
రిప్లయితొలగించండిఒద్దిక దోడ నాశివుడు యూర్జిత మందెడి నర్తనమ్మునన్
తద్ధిమి తాకిటా యనుచు తాళగతుల్ స్వర మేళనమ్ములై
మద్దెలలెన్నియో గగన మధ్యము నందున మ్రోగె శ్ర్యావ్యత
న్నద్దరి దద్దరిల్లె నవి యార్భటులై శివధామ మందునన్!
శర్మ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
‘శివుడు+ఊర్జిత=శివు డూర్జిత’ అవుతుంది. ‘ఒద్దికతోడ నాగధరు డూర్జిత...’ అనండి.
ధన్యవాదములు
తొలగించండిగురుమూర్తి ఆచారి గారి పూరణ....
రిప్లయితొలగించండి{ రావణుడు పుష్పకవిమానములో విహారము సేయు సమయమున నాట్యకత్తెలు ఆడగా మద్దెలలు శ్రావ్యముగా మ్రోగినవి }
"తద్దిమితో౦ తధీ౦ తకిటతా కిటతా" యని పుష్పక౦బునన్
మద్దెల లెన్నియో గగన మధ్యము న౦దున మ్రోగె శ్రావ్యతన్
ముద్దులు చి౦దు న౦దమున ముద్దియ లె౦దరొ నాట్య మాడగన్
దద్దయు హాయి రావణు డొనర్చె విహారము స్త్రీ విలాసియై!
ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తద్దయు భాను తాపమున ధారుణి మండుచు నున్నవేళలన్
రిప్లయితొలగించండిగ్రద్దన దిక్కు లన్నియును గ్రమ్ము కొనంగ దురంత మేఘమి
ప్పొద్దున నద్భుతమ్ముగను బొల్పుగ మ్రోగెను మేఘ ఘర్జనల్
మద్దెల లెన్నియో గగనమధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్
అద్దివమున మేఘమ్ములు
సద్దులు సేయుచు నురుముల సాగుచు నుండన్
ముద్దుగ నేనంటి నపుడు
మద్దెలలే మ్రోగె గగనమధ్యము నందున్
కామేశ్వరరావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి"గ్రద్దన నన్ని దిక్కులను గ్రమ్ము కొనంగ దురంత మేఘమి" యని సవరణ.
తొలగించండిముద్దుల చెల్లెలి పెళ్లికి
రిప్లయితొలగించండినద్దిరబన్నా! టపాసు లాకశమంటెన్
సుద్దులఁ జెప్పఁగ ప్రేలుచు
మద్దెలలే మ్రోగె గగన మధ్యమునందున్!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినదనలు.
బీటుకూరు శేషుకుమార్ గారి పూరణ...
రిప్లయితొలగించండిహద్దులు లేవుర శివుడా!
ముద్దుల నీ ముదితతోడ మువ్వలు మ్రోగన్
ఎద్దుల మూపున యాడగ
మద్దెలలేమ్రోగె గగన మధ్యమునందున్
శేషుకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మూపున నాడగ’ అనండి.
‘ధరణి’ గారి పూరణ...
రిప్లయితొలగించండివిద్దెయె జీవన మని సరి
హద్దులు దాటిన యిరువురు యన్నల తపముల్
నిద్దుర లోనా యూగుచు
మద్దెలలో మ్రోగె గగన మధ్యము నందున్
ధరణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఇరువురు+అన్నల’ అన్నపుడు సంధి జరుగుతుంది, యడాగమం రాదు. ‘లోనన్+ఊగుచు=లోన నూగుచు’ అవుతుంది.
యుద్ధమున గెలువ విజయుడు
రిప్లయితొలగించండితద్దయు ధృతితో, కనుగొని తనివిపెనుపడన్
ముద్దుగ నచ్చర లాడగ
మద్దెలలే మ్రోగె గగన మధ్యమునందున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అద్దిర యురుములు నాబడు
రిప్లయితొలగించండిమద్దెలలే మ్రోగె గగన మధ్యము నందు
న్ని ద్దిన ముదయము కాగనె
తద్దయు వర్షo బువ చ్చెదా మెఱుపు లతోన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. ‘కాగనె’ అన్నది గ్రామ్యం. కాగన్ అందామా?
నిద్దుర మత్తును వీడక
రిప్లయితొలగించండిబద్దకముగ నున్నవేళ వాయ్వాస్పదమున్
పెద్దగ నురిమెను మేఘము
మద్దెలలే మ్రోగె గగన మధ్యము నందున్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఒద్దిక యైన సీతను మహోన్నతు డౌరఘు రామచంద్రుడే
రిప్లయితొలగించండిపెద్దలు గాంచుచుండ హర విల్లును ద్రుంచి వివాహమాడగా
నిద్ధరణీ తలమ్మున సురు లే కురిపించగ పుష్పవర్షమున్
మద్దెలలెన్నియో గగన మధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్
దద్దద్ధాయని యురిమె, ద
గద్ధగల మెరుపుల్ మెరియగ గాలియె వీచన్
నిద్దుర విడి నే తలచితి
మద్దెలలే మ్రోగె గగన మధ్యము నందున్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యంలో ‘సురలే’ అనాలి.
రెండవ పద్యం రెండవపాదంలో గణదోషం. ‘..గద్దగ మెరుపులు..’ అనండి.
అద్దిర మేఘముల్ గగన మంతయు నల్లగ నావరించె నే
రిప్లయితొలగించండియిద్దిన మెల్లడన్గనగ నీదురు గాలులు నుర్ము లున్మఱిన్
సద్దులు తోడుగాగ దివి సాంతము చీకటి గాఁగ నా ఘనా
మద్దెల లెన్నియో గగన మధ్యము నందున మ్రోగె శ్రా వ్యతన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఘనా మద్దెల’ అన్నచోట ‘చీకటి గాఁగ గొప్పనౌ| మద్దెల...’ అనండి.
ముద్దుల జంట కోరగను పుష్కరమందునఁజేయ పెండిలిన్
రిప్లయితొలగించండిపెద్దలు సమ్మతించి కడువేడ్కగఁ జల్ప విమాన లోఁగలిన్
తద్దయు ప్రీతితో చనిరి తక్కినవారలు మేళగాండ్రతో
మద్దెలలెన్నియో గగన మధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్
పుష్కరముః ఆకాశము
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిపుష్కర విమానంలో పెళ్ళి... బాగుంది పద్యం. అభినందనలు.
‘లోఁగలిన్’...?
గురువర్యులకు నమస్సులు. విమాన మందునన్ అంటే సరిపోతుందా
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[ఆత్మలింగము కోసమై రావణుఁడు ఘోరతపమునుం జేసినను శివుఁడు ప్రసన్నుఁడు కాకపోవఁగాఁ, దన ప్రేవులనే వీణియ తీవలుగాఁ జేసి వాయింపఁబూనుకొనఁగాఁ, జలించిన శివుఁడు తాండవమాడ నారంభింప, వెనువెంటనే ప్రమథగణాలు మద్దెలలు శ్రావ్యముగ మ్రోయించిన సన్నివేశము]
అద్దనుజేంద్రు రావణుని యాంత్రపు వీణియ తీవ లుల్లమున్
నిద్దుర లేపి యా శివుని నృత్యముఁ జేయఁగఁ బ్రేరణ మ్మిడన్
దద్దిమి దిమ్మి దిమ్మి తక తద్దిమి తద్దిమి యంచు వెంటనే
మద్దెల లెన్నియో గగనమధ్యము నందున మ్రోఁగె శ్రావ్యతన్!
గుండు వారూ,
తొలగించండిపూరణలో అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించారు. చక్కని పూరణ. అసలు సమస్యాపూరణగా కాక ఏదో కావ్యంలోని పద్యంగా భాసిస్తోంది. అభినందనలు.
ధన్యవాదాలు శంకరయ్య గారూ!
తొలగించండిఅద్దము వంటి దయ్యుమనకందిన వింతగటీవి యందునే
రిప్లయితొలగించండిమద్దెల లెన్నియో గగన మధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్
దిద్దె| విమాన యానమున దీర్గ ప్రయాణముజేయువారికిన్
అద్దియె సంతసంబొసగు హాయిని గూర్చునుదృశ్యకావ్యమై|
3.గద్దలవలె గగనంబున
మిద్దెల పైనుండి యెగురు మేటి విమానం
సిద్దము జేసినటీవీ
మద్దెల మ్రోగె గగన మధ్యము నందున్.
ఈశ్వరప్ప గారూ,
తొలగించండివిమానంలోని టీవీలో మద్దెల దరువు. బాగున్నవి మీ రెండు పూరణలు. అభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
ముద్దులు గొల్పు బాలలకు మోదము గూర్చగ విద్య లెల్లెడన్
పెద్దలు దీక్ష బూని ఘన పెన్నిధి వోలె శ్రమించి నేర్పగన్
విద్దెల రాణి దీవెనలవే గొన భారతవాసు లెల్లరున్
మద్దెల లెన్నియో గగనమధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్
పెద్దగ మెరుపులతో పిడి
గుద్దులు గా గుండెలదర ఘోషించుచు వే మిద్దెలు మేడలు గూలగ
మద్దెలలే మ్రోగె గగనమధ్యము నందున్
కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘ఘన పెన్నిధి’ అనరాదు కదా! ‘దీక్ష గైకొనియు పెన్నిధి...’ అందామా?
అద్దమరేయి వచ్చె భరతావని స్వేచ్ఛకు స్వాగతంబిడన్
రిప్లయితొలగించండినిద్దుర లేచిరందరు ననేక జయోన్నత నాదముల్ సదా
సద్దును మానకుండ కడు సమ్ముద మిచ్చెడి వాద్య
బృందముల్
మద్ధెల లెన్నయో గగన మధ్యము నందున మ్గోగె శ్రావ్యతన్
యుద్ధము నందున పార్థుడు
రిప్లయితొలగించండిబద్దలు గొట్టెను రిపులను బాణంబులచే
సద్దును చేయుచు నవియును
మద్దెలలె మ్రోగె గగన మధ్యము నందున్
యుద్ధము నందున పార్థుడు
రిప్లయితొలగించండిబద్దలు గొట్టెను రిపులను బాణంబులచే
సద్దును చేయుచు నవియును
మద్దెలలె మ్రోగె గగన మధ్యము నందున్
యుద్ధము నందున పార్థుడు
రిప్లయితొలగించండిబద్దలు గొట్టెను రిపులను బాణంబులచే
సద్దును చేయుచు నవియును
మద్దెలలె మ్రోగె గగన మధ్యము నందున్
ముద్దుల గుమ్మయౌ గృహిణి ముచ్చటగా చన పుట్టినింటికిన్
రిప్లయితొలగించండిప్రొద్దున లేవగానె పతి పోవగ వంటకు పాకశాలకున్
నిద్దర మత్తులో నటక నెక్కుచు గిన్నెలు దింపుచుండగా...
మద్దెల లెన్నియో గగనమధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్