27, జూన్ 2016, సోమవారం

పద్యరచన - 1225

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

23 కామెంట్‌లు:

 1. ఎడ్లబండిపైననెక్కి సాగుచునుండె
  చీకుచింతలేమి లేక వారు
  పల్లెచేరుకొనగ పైరుగాలుల మధ్య
  కబురులాడుకొనుచు కమ్మగాను

  రిప్లయితొలగించండి

 2. బండి దొరికెను యింటికి పరుగు బోవ
  తోడు దొరికెను మాటకు దోవ వెంట
  గూడ వచ్చెను మావూరి భూరి యావు
  చిత్ర కథ యిక చాలించు చిన్నదాన !


  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   పద్యం బాగుంది.
   ‘దొరికెను+ఇంటికి’ అన్నపుడు యడాగమం రాదు. ‘బండి దొరికిన దింటికి...’ అనండి.

   తొలగించండి
 3. హరిత కాంతులు పూచిన దారులందు
  నేగు చున్నది శకటము బాగుబాగు
  యూరి జనముల దోడ్కొని తీరుతోడ
  తోడు సాగెను గోమాత వాడజేర!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శర్మ గారూ,
   మీ పద్యం బాగుంది.
   మొదటిపాదంలో ప్రాసయతి తప్పింది. ‘హరితకాంతులు పూచిన యట్టి దారి| నేగుచున్నది...’ అనండి.

   తొలగించండి
 4. ఆంగ్ల మాద్యమ్ము తనయూరి నందు లేక
  పోవు చుండెను రైతింక పొలము విడిచి
  ప్రాథ మికమున నాంగ్లమ్ము పరిడ విల్ల
  పల్లె బడులింక బాగయి ప్రగతి జూపు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చారి గారూ,
   మీ పద్యం బాగుంది.
   ‘మాధ్యమము’ను ‘మాధ్యము’ అన్నారు.

   తొలగించండి
 5. గోమాత తోడు రాగన్
  గోముగ నూసులు వలికెడు కూనల తోడన్
  సామూహిక యానము గన
  నా మది యుప్పొంగె ననియన ననృతమగునే

  12 మే 2016 పూరణ:
  వికటము లాచక్రమ్ములు
  శకటము జూడ బహులార్థ సాధక మయ్యెన్
  ప్రకటిత దరహా సాస్యులు
  సుకుమారుల సహచరులకు శుభ యాత్ర గదా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ పద్యాన్ని చూచిన తర్వాత ఇది గతంలో ఇచ్చిన చిత్రమే అన్న విషయం గుర్తుకు వచ్చింది.
   మీ రెండు పద్యాలు మనోహరాలు. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గార్కి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 6. ఎడ్ల బండిని జూడగ నింపు గలిగె
  పూర్వ మందవి యుండెను బుష్కలముగ
  నేడు కరువాయె యయ్యవి నిజము గాను
  బరగ నాటోలు విరివిగ వచ్చుగతన

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘కరువాయె నయ్యవి..’ అనండి.

   తొలగించండి
 7. నాటి కాలమందు మేటిగా నిలపైన
  నిలిచి నట్టి బండి నిజము గాను
  కదులు చుండె నిదియు కాలుష్య మివ్వక
  ఇంధనమ్మవసర మిందు లేదు

  ఎడ్లు రెండు చాలు నెంతదవ్వైనను
  సాగిపోవు నట్టి శకటమదియు
  నాటి దొరలు గూడ మేటంచు బొగడిన
  వాహనమ్మిది గన బాగు బాగు

  రిప్లయితొలగించండి
 8. పల్లె మార్గమందు చల్లని గాలిలో
  నెడ్ల బండి నెక్కి యేగు చుండ్రి
  చీకుచింత లేని చిఱుజీవితమ్ములె
  యెంత మధురమొకద యెంచిచూడ

  రిప్లయితొలగించండి
 9. పల్లెటూరి యెడ్లబండి పరుగు దీయు చుండెరా
  ఘల్లు ఘల్లు ఘల్లు మంటు గంటల సడి జేయుచున్
  చల్లనైన సందెవేళ చాల మాటలాడుచున్
  పిల్లలంత బండి లోన వెళ్ళుచుండి రిండ్లకున్!!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పద్యం ఉత్సాహంగా గంతులు వేస్తూ సాగింది. బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 10. పంచగ పైరుగాలి బహుబాధ్యత చేతనుయెడ్లబండిలో
  నుంచగ సైకిలున్ మరియు,యూహల దేలెడి బాలబాలికల్
  పంచనగుంటకన్ నిడగ|ప్రక్కనవెళ్ళెడి గోవువోలెనే
  పంచగదారి చింతిడక పంట పొలానికి వెళ్లుమెల్లగా|


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   కొన్ని సంధిగత దోషాలున్నా మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘చేతను+ఎడ్ల=చేత నెడ్ల, మరియున్+ఊహల=మరియు నూహల’... ‘వెళ్లు’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

   తొలగించండి
 11. బండినెక్కి సాగు బాలికలను గన
  పసిడి వయసు యన్న బాల్య మేగ
  సాగు చుండె జతకు సాధుగోమాతయు
  హాయి గొలుపు చిన్న పయన మిదియే.

  2.వర్ష ఋతువు నందువర్షమ్ము కురియగ
  దారియంతయు నట తడిసి పోగ
  విద్య నేర్వదలచి విధిలేక బాలికల్
  బండి నెక్కిరదిగొ బడికి వోవ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘వయసు+అన్న’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘వయ సటన్న బాల్యమె గద’ అనండి.

   తొలగించండి