14, జూన్ 2016, మంగళవారం

సమస్య - 2062 (పాశుపతమ్ము వేసి హరి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“పాశుపతమ్ము వేసి హరి పార్థునిఁ జంపెను నిర్దయాత్ముఁడై”
లేదా
“పాశుపతము వేసి హరియె పార్థునిఁ జంపెన్”
(ఈరోజు నాకు కంటి శస్త్రచికిత్స. రెండు రోజులు బ్లాగును చూడలేనేమో? రేపటికి ‘నిషిద్ధాక్షరి’ని షెడ్యూల్ చేశాను. దయచేసి పరస్పర గుణదోషాల విమర్శ చేసికొనండి)

63 కామెంట్‌లు:

  1. ఒక సరదా పూరణ !!

    ఆశగ హరియను కవి గని
    ధీశూన్యుడు పార్ధు నామ ధేయుడు కవితల్
    ఆశువు కోరగ కవనపు
    పాశుపతము వేసి హరియె పార్థునిఁ జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ‘సరదా పూరణ’ మనోరంజకంగా ఉంది. అభినందనలు.
      ‘కవితల్+ఆశువు’ అని విసంధిగా వ్రాయరాదు. ‘కావ్యం| బాశువుగఁ గోరఁ గవనపుఁ| బాశుపతము...’ అనండి.

      తొలగించండి
  2. క్లేశము నందున పతియనె
    నాశాపాశమ్ము వీడి నయముగ నుండన్
    కౌశలమున నిలువనియెడ
    పాశుపతము వేసి హరియె పార్ధునిఁ జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్కారములు
      భయమేమిలేదు నొప్పి అనేది అస్సలు ఉండదు .ధైర్యం గాఉండండి.ఆశీర్వదించి అక్క

      తొలగించండి
  3. మాస్టరుగారూ! మీకంటి 'సమస్యను' వైద్యుడు చక్కగా 'పూరించాలని' కోరుకొనుచున్నాను.

    రిప్లయితొలగించండి
  4. మీ కంటి శస్త్రచికిత్స జయప్రదమవ్వాలని శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. గురువుగారూ మీ కంటి శాస్త్ర చికిత్స ద్వారా మీరు సత్వరమే ఆరోగ్యం వంతులుగా వుండాలని కోరుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  7. ఆశువు తోడన బలికెను
    పాశుపతము వేసి హరియె పార్ధుని జంపె
    న్నీ శా ! వింటివె యాయది
    పాశుపతము జంపెన టగ పార్ధుని నచట న్

    రిప్లయితొలగించండి
  8. ఆశుగు మూసి చక్రమున నాశలు రేపఁ గిరీటి యత్తరిన్,
    నీ శర మెక్కుపెట్టి యిక నిల్చి దురాత్మునిఁ జంపఁ గోరినన్
    పాశుపతమ్ము వేసి హరి పార్థునిఁ, జంపెను, నిర్దయాత్ముఁడై
    యీశుని చేత దుష్ట వర మింపుగఁ బొందిన, సైంధవాధమున్
    ఆ శక్రసూను దుష్టుని
    నీ శరణాగతి రవిజుడు నింపుగ వేడన్
    దాశరధి యతని గళమునఁ
    బాశుపతము వేసి, హరియె పార్థునిఁ జంపెన్

    [పాశుపతము = బకపుష్పము (అవిసెపువ్వు); పార్థుడు = రాజు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ కంటి చికిత్స జయప్రదము కావాలని కోరుకుంటున్నాము.

      తొలగించండి
  9. ప్రణామములు గురువుగారు..మీ కంటి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసుకుని సత్వరమే కోలుకోవాలని కోరుకుంటున్నాను..

    రిప్లయితొలగించండి
  10. క్లేశము లెన్ని గల్గినను కృష్ణుడు సైంధవు నెట్లు జంపెనో
    రాశులు పోసి గొల్చినను రాళ్ళకు తూగని వాడు యెవ్వడో
    పాశము పట్టి లాగినను పార్థ కుమారుడు యేమి జేసెనో
    పాశుపతమ్ము వేసి, హరి, పార్థునిఁ జంపెను నిర్దయాత్ముఁడై

    గురువుగారూ, కంటి శస్త్ర చికిత్స విజయవంతమై మీరు త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆ సర్వేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణిగారూ, చాలా అందంగా సమస్యని పూరించారు!! మాబాగా నచ్చింది నాకు.

      తొలగించండి
    2. ఫణి కుమార్ గారు మీ క్రమాలంకార పూరణ ప్రశస్తముగ నున్నది. కృష్ణుడని యెవరి నుద్దేసించియన్నారో యదికూడ పూరణ లో సూచించిన బాగుంటుంది

      తొలగించండి
    3. కామేశ్వరరావు గారికి నమస్సులు. నేను కృష్ణుడు అని అర్జునుడి పది పేర్లలో ఒక దానిని వాడాను. ఈ సందర్భానికి అదే అర్థం వస్తోంది కదా అని ఇంక వివరించలేదు. మీ సూచనకి ధన్యవాదములు. పార్థ కుమారుడు అని బభ్రువాహనుడి గూర్చి రాసి యున్నాను.

      తొలగించండి
    4. ఫణికుమార్ గారు కృష్ణుడు నల్లని వాడనెడు నర్థములో నర్జునునకు వర్తింప వచ్చును. అర్జునుని దశనామాల్లో నది లేదు. అర్జునుని దశనామాలు భారతములో చెప్పిన రీతి:

      "అనుటయు నతండు సస్మితాననుం డగుచు, ‘నర్జునుండు, ఫల్గునుండు, పార్థుండు, కిరీటి, శ్వేతవాహనుండు, బీభత్సుండు, విజయుండు, జిష్ణుండు, సవ్యసాచి, ధనంజయుండు నను నివి పదియును నా పేళ్ళనవుడు, నుత్తరుండు పాండవమధ్యమున కిట్లనియె."
      భారతములో కృష్ణులు: వ్యాస మహర్షి, కృష్ణుడు, అర్జునుడు, ద్రౌపదు (కృష్ణ) లు.

      తొలగించండి
    5. అర్జున: ఫల్గుణ: పార్థ: కిరీటీ శ్వేతవాహన: |
      బీభత్సుర్విజయ: కృష్ణ: సవ్యసాచీ ధనంజయ: ||

      ఈ శ్లోకం పిడుగుపాటు సమయంలో చదవడం నాకు చిన్నప్పుడు పెద్దలు నేర్పి యున్నారు. తప్పు ఒప్పులు నాకు తెలియదు. తెలియజేసినందుకు ధన్యవాదములు.

      తొలగించండి
    6. ఫణికుమార్ గారు మీ తప్పేమీ లేదు. కాలాంతరములో చాలా మార్పులువస్తుంటాయి. కవిత్రయ భారతము (వ్యాస) మనకు ప్రామాణికము. మీపూరణ నిస్సందేహముగా ప్రశస్తమే.

      తొలగించండి
    7. కామేశ్వరరావు గారూ ధన్యవాదములు. ఈ శంకరాభరణం వేదికగా మీవంటి పెద్దల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొనే అదృష్టం నాకు దక్కింది. ధన్యుడను. గురువుగారికి మరియు మీవంటి పెద్దలందరికీ నమస్సుమాంజలి.

      తొలగించండి
  11. గురువుగారి శస్త్ర చికిత్స విజవంతం కావాలని కోరుకుంటున్నాను.కళ్ళకు కొన్ని రోజులు వత్తిడి కలుగనీయ కూడదు. వరంగల్లు లో ఉన్న కవిమిత్రులు గురువుగారికి కావలసిన సహాయం చేస్తారని తలుస్తాను.

    రిప్లయితొలగించండి
  12. కేశవుని గొలిచె కవ్వడి
    పాశుపతము వేసి, హరియెపార్థుని జంపెన్
    క్లేశముతోనిందించెడు
    యాశిశు పాలుని యడచగ నావేశముతో!!!

    పాశుపతము =అవిసెపువ్వు
    పార్థుడు = రాజు


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారు భిన్నార్థములతో మీపూరణ సుందరముగనున్నది. "శిశుపాలునినడరిన యావేశముతో" అంటే బాగుంటుంది.చంపెను,అడచగ రెండు సమానార్థ పదములు గద.

      తొలగించండి
    2. ధన్యవాదములు సర్..


      కేశవుని గొలిచె కవ్వడి
      పాశుపతము వేసి, హరియెపార్థుని జంపెన్
      క్లేశముతోనిందించెడు
      యాశిశు పాలుని నడరిన యావేశముతో!!!

      తొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీగురువుగారైనకందిశంకరయ్యగారికివందనములతోకంటిశస్రచికిత్సతరువాతజాగ్రత్తలతోవైద్యసలహాలుతీసికొనిఆరోగ్యభాగ్యమందుకోవాలనికోరుకుంటూమనవి
    14.6.16. ఆశగ నమ్మవిద్యగొని అందరి లాగునగొప్పగాను న
    త్యాశగ పండితుండగుచు దర్పమునందున విద్యనేర్పుచున్
    పాశుపతమ్ము వేసి హరి పార్థునిజంపెను నిర్ధయాత్ముడై
    ఆశువుగాను బల్కె “మరియాదగువిద్య ప్రమాణమెంచకన్ {చదువును కొన్నపండితుడుతెలిపినవిషయము}

    రిప్లయితొలగించండి
  15. పాశుపతమ్ము బొందెనొక పార్థుడు గొప్పతపంబుజేసి-తా
    నాశమొనర్ప వైరులను నవ్య విశేష పరాక్రమాన-నా
    యీశుని నామమెన్న "హరి"యీప్సితమొప్పగ యుద్ధరంగమున్
    పాశుపతంబువేసి హరి పార్థుని జంపెను నిర్ణయాత్ముడై.

    నాశముజేయగ రిపులను
    పాశుపతముబొందెను" హరి "భక్తవరుండై
    ఆశయసిద్ధిని గోరుచు
    పాశుపతము వేసి హరియె పార్థుని జంపెన్.

    రిప్లయితొలగించండి
  16. సవరణ....నిర్దయాత్ముడై కి బదులుగా నిర్ణయాత్ముడని పొరబాటున వ్రాశాను.

    రిప్లయితొలగించండి
  17. పాశుపత మ్ము వేసి హరి పార్ధుని జంపె ను నిర్దయాత్ముడై
    యాశువు గాదె మీపలుకు లట్లుగ నెవ్వరు నైన నుండునే
    నీ శుడు జంప నేరడిల నెట్టి పరి స్థితులందు నైనను
    న్బాశు పతంబుతోడ నమరి పార్ధుని గృష్ణుడు నేర్వుమా యిదిన్

    రిప్లయితొలగించండి
  18. రోశముతోప్రతిజ్ఞసభలోనొనరించితరణ్యవాసమున్
    గ్లేశములెన్నొదాటితిరి కృష్ణపరాభవవేదనమ్మికన్
    నాశమొనర్పలెమ్మనుచునష్టుడచేతనమూర్తి గీతభా
    పాశుపథమ్మువేసిహరిపార్థునిజంపెనునిర్థయాత్ముడై
    కృష్ణ..అనగా ద్రౌపది
    సైకాలజి ప్రకారం అచేతనమనసు అజ్ఞానమోహావిష్టము.కావున అచేతనమూర్తయిన పార్థుని గీతయనే ప్రకాశ పాశుపథమ్ముతోకూల్చాడని...ఐతగోని వేంకటేశ్వర్లు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఐతగోని వేంకటేశ్వర్లు గారు మీ పూరణ చక్కటి భావముతో నలరారుచున్నది. ఒక చిన్న సూచన.
      “నష్టుడచేతనమూర్తి, పార్థుని జంపె” ననుట కంటె “పార్థుని యజ్ఞానమును జంపె నన్న యర్థములో
      “నాశమొనర్ప లెమ్మనుచు నవ్వి యవిద్యను నెల్ల, గీత భా” యనిన నెట్లుండును?
      “ పాశుపతమ్ము” నకు బదులు పొరపాటున కాబోలు “పాశుపథమ్ము” గా వ్రాసినారు. రోసము (రోషము) ను రోశము గా వ్రాసినారు.

      తొలగించండి
  19. మిత్రులందఱకు నమస్సులు!

    [రాముని మిషగాఁ గొని, లంకకు రాజైన రావణుని, యముఁడే కాళపాశ మనెడి పాశుపతమును వేసి, నిర్దయుఁడై, ప్రాణముం గొనెనని చమత్కారము]

    నాశము లేదటంచుఁ గరుణం దగఁ జూపక కాశ్యపేయులన్
    గ్లేశములందుఁ ద్రోసి, సురనేతనుఁ బాఱఁగఁ ద్రోలినట్టి లం
    కేశునిఁ గూల్ప, "రాముఁ డను నిహ్నవమున్" గొని, "కాళపాశ మన్

    బాశుపతమ్ము" వేసి, హరి, పార్థునిఁ జంపెను, నిర్దయాత్ముఁడై!

    (కాశ్యపేయులు=దేవతలు, నిహ్నవము=వ్యాజము, హరి=యముఁడు, పార్థుఁడు=రాజు [లంకేశుఁడైన రావణుఁడు])

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారు మీ పూరణ మిక్కిలి రమ్యముగా నున్నది. విశేషముగా మూడవ పాదములో మీరు వాడిన యతి నన్నాకర్షించింది.

      తొలగించండి
    2. త్రివేణీ సంగమములా యఖండ యతి, యనుస్వారయతి, న-ఙ లయతి. కలసిన మేలువడి.

      తొలగించండి
    3. సుకవి మిత్రులు కామేశ్వర రావు గారూ...నమస్సులు!
      మీ అభిమానానికి కృతజ్ఞుడను! మీ సూక్ష్మపరిశీలనకు జోహారులు!

      సుకవులు శిష్ట్లావారూ...నమస్సులు!
      ధన్యవాదములు!

      తొలగించండి
  20. కంటి వైద్యమునకు బోవు కంది శంక
    రయ్య గారికి శుభములు రయముగాను
    జరుగు గావుత ! శంకరు గరుణ వలన
    తధ్య మీయది ,నామాట తప్పు కాదు

    రిప్లయితొలగించండి

  21. [3:44pm, 14/06/2016] విరించి VIRINCHI: మంత్రితో విభీషణుడు తన స్వప్న వృత్తాంతముగా తెలిపినట్టుగా నూహించి

    క్లేశము తప్పదేమొ మనకింకను, స్వప్నము గంటినేను యా
    క్రోసుల దవ్వునుండిటకు రోయక జేరిన వానరేంద్రుడే
    నాశము జేసె రాక్షసుల నా కలయందున నాలకింపుమా
    పాశుపతమ్ము వేసి హరి పార్థుని జంపెను నిర్దయాత్ముడై

    క్లేశము తప్పదనుచును వి
    భీషణుడు పలికెను కదన భీముడు మనలన్
    నాశన మొనర్చ హరియను
    పాశుపతము వేసి హరియె పార్థుని జంపెన్

    హరి= హనుమంతుడు
    రెండవ పద్యములో చివరి పాదమున శ్రీరాముడు

    పార్థుడు = రాజు, రావణుడు

    రిప్లయితొలగించండి
  22. ఆశ రహించు వేళలు మ
    హార్ణవమౌ మధురోహ హేలలన్
    క్లేశము సంతరించగ స్వ
    కీయమునో బరకీయమౌచునో
    నాశ దహించు వేళల ని
    రాశ్రయమున్గన నిట్లు గన్పడున్
    "పాశుపతమ్ము వేసి హరి
    పార్థుని జంపెను నిర్దయాత్ముడై!"

    రిప్లయితొలగించండి
  23. మధుసూదన్ గారు. మీ భావనాపటిమ అనితరసాధ్యము. హార్దికాభినందనలు.నిఘంటువు మొత్తం కంఠోపాఠం చేసినట్లున్నారు.

    రిప్లయితొలగించండి
  24. మధుసూదన్ గారు. మీ భావనాపటిమ అనితరసాధ్యము. హార్దికాభినందనలు.నిఘంటువు మొత్తం కంఠోపాఠం చేసినట్లున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవి మిత్రులు పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారికి...నమస్సులు!
      ధన్యవాదములు!

      నిఘంటువు కంఠోపాఠము కావలెనన్న చాలా ధారణ మవసరము. నాకంతటి ధారణ లేదు. ఒక్క నిహ్నవ మనే పదాన్ని ప్రయోగించడానికి కొంత ఆలోచించాను. మిగతావి సులభములే.

      మీ అభిమాన పూర్వక అభినందనలకు కృతజ్ఞుడను!

      తొలగించండి
  25. నా రెండవ పూరణము:

    [గయునిఁ గాఁచుటకై నడుముకట్టిన యర్జునుని పాశుపతాస్త్రమునుఁ గోపముచే శ్రీకృష్ణుఁ డపహరించి, దయమాలి, యా పాశుపతము తోడనే పార్థుని సంహరించినట్లు...కర్ణుఁడు... స్వప్నమందుఁ గాంచె...నని కల్పనము]

    శైశవ చేష్ట నూను గయుఁ జంపఁగఁ బూనెను కృష్ణుఁ! డర్జునుం
    డాశ నిడెన్ గయుం దడవ! నప్పుడు కృష్ణుఁడు నాగ్రహించి, వే
    పాశుపతమ్ము మ్రుచ్చిలె! స్వబాంధవుఁ డంచునుఁ జూడఁ డయ్యొ! త

    త్పాశుపతమ్ము వేసి, హరి, పార్థునిఁ జంపెను నిర్దయాత్ముఁడై!!

    రిప్లయితొలగించండి
  26. నాశము చేసితి వేమిర?
    'పాశుపతము వేసి నరుడు పరులన్ జంపెన్'
    దోషముగ వ్రాసినావట?
    బాశుపతము వేసి హరియె పార్థునిఁ జంపెన్!

    రిప్లయితొలగించండి
  27. ఆశగబబ్రువాహనుడు యర్జున పుత్రుడు నశ్వమేధమున్
    దేశములన్ని దాటి తన దేశము వచ్చిన యశ్వమంట నా
    వేశముతోడ యుద్ధమని వెంటనె రాగను నాగబాణమౌ
    పాశుపతమ్ము వేసి హరి! పార్థుని జంపెను నిర్దయాత్ముడై.

    రిప్లయితొలగించండి
  28. కామేశ్వరరావు గారు ధన్యవాదములు.నాభావమది.అది అభ్యంతరకరమైతే ..సవరించుకోవడానికి..ఇబ్బంది.యేమీలేదు
    ఐతగోని వేంకటేశ్శర్లు

    రిప్లయితొలగించండి
  29. హనుమచ్చాస్త్రిగారు మీపూరణ అద్భుతం

    రిప్లయితొలగించండి
  30. ఆశల బాపెడిన్ గుబులు హైరణ జేయుచు తల్లడించగా
    కేశవ! నేనిటన్ రణము ఖిన్నుచు క్రుంగుచు చేయలేనన
    న్నాశువు గీతనున్ నుడివి యర్జుని క్లైబ్యము చంపెగానిటుల్:👇
    పాశుపతమ్ము వేసి హరి పార్థునిఁ జంపెను నిర్దయాత్ముఁడై...

    రిప్లయితొలగించండి