9, జూన్ 2016, గురువారం

సమస్య - 2059 (భాగవతమ్ము మానవుల...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“భాగవతమ్ము మానవులఁ బాపముఁ జేయఁగఁ బ్రోత్సహించురా!”
లేదా...
“భాగవతము ప్రోత్సహించుఁ బాపముఁ జేయన్”

61 కామెంట్‌లు:

 1. నేగతమందు జేసితిని నీమము దప్పుచు ఘోర కృత్యముల్
  భోగము లందునన్ మునిగి బోవుచు బానిసనై ఘటించుచున్
  భాగవతమ్ము మానవులఁ బాపముఁ జేయఁగఁ బ్రోత్సహించురా
  వేగమె మార్పునొంది తమ వేలమువెఱ్ఱిని మార్చు కొందురే ?
  ---------------------------------------
  యోగము సరిలే కున్నను
  భాగవతము ప్రోత్సహించు బాపముఁ జేయన్
  భోగము నందున దేలుచు
  సాగుచు బోయెదరు గాన సంతస మందున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ మొదటి పూరణ సంతృప్తికరంగా లేదు. సమస్యకు పరిష్కారం లేదు.
   రెండవ పూరణ ఫరవాలేదు.

   తొలగించండి
 2. శుభోదయం !

  ప్రోత = వస్త్రము -> శరీర మనెడి వస్త్రము ; సహించు బాపము శరీరము పాపాన్ని సహించినా ఆ భోగము వలదే !


  చాగంటి జెప్పిరి గదా
  భాగవతము! ప్రోత్సహించుఁ బాపముఁ జేయన్
  భోగము జిలేబి వలదే !
  ఆ గమ్యము నీకు పనికిరాదు సుమా ! హా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చమత్కారం బాగున్నది. కాని ‘ప్రోత సహించు’... ప్రోత్సహించు కాదు. చివరిపాదంలో యతి తప్పింది.

   తొలగించండి
 3. నిన్నటి సమస్య:

  కాశ్మీరాధిపతుల్ పరాక్రమ మహాక్ష్మాభృత్తులచ్చోట న
  ర్చిష్మానర్చిత భూవరుల్ విఫలులై చింతింప పార్థుండు నా
  ఇష్మాసంబును దాల్చి సుష్మమును లావెక్కించి సంధింపగాన్
  భీష్మాచార్యుఁడు పాండవుల్ వొగడఁగాఁ బెండ్లాడె పాంచాలినిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంది మీ పూరణ. అభినందనలు.
   శ,ష ప్రాస చింత్యం.

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   మీ విశ్లేషణకు, సూచనలకు ధన్యవాదాలు.
   శంకరాభరణం బ్లాగుకు కొండంత అండగా ఉంటున్నారు. సంతోషం. గతంలో పండిత నేమాని వారు అందరి పూరణలను ఓపికతో పరిశీలించి తగిన సూచనలిస్తూ ఉండేవారు. మీరు వారి లోటును తీరుస్తున్నారు. కృతజ్ఞుడను.

   తొలగించండి
  3. సుమలత గారు మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. అయితే కొన్ని చిన్న సవరణ లవసర మనిపించు చున్నవి.
   1. “అర్చిష్మానర్చిత “ సమాసము సాధువు కాదు. “అర్చిష్మదర్చిత” సాధువు. “అర్చిష్మత్” త కారంత పుంలింగ పదము. లేదా “అర్చిష్మంతుడు” సాధువు. కనుక “అర్చిష్మన్నందన ముఖ్యులున్” అంటే “క్ష్మాభృత్తుల” , “భూవరుల్” లోని కించిత్పున రుక్తి దోషము కూడా తొలగును.
   2. ఇష్వాసము (ధనుస్సు) నకు బదులు ఇష్మాసమని వ్రాసారు. ప్రాస తప్పింది.
   3. “సంధింపగాన్” బదులు “భేదింపగన్” యనిన పూర్తి యర్థము నిచ్చును.
   పూజ్యగురువులు సూచించినట్లు శ్మ, ష్మ ల ప్రాస నివారణ యోగ్యము.
   మీరు నిరాశ జెంద వలసిన పని లేదు. గుణదోషాల వివరణ కోసమే నా యీ సమీక్ష. పరిశీలించి తగిన సవరణలు చేయ గోర్తాను.

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ యభిమానమునకు ధన్యుడను.

   తొలగించండి
  5. Kshaminchaali, nenu Maa ammayi college orientation lo gata 2 rojulugaa vunnanu, repu badulu vraastaanu

   తొలగించండి
 4. యోగములనువివరించును
  భాగవతము, ప్రోత్సహించు బాపము జేయన్
  భోగములపైన మక్కువె
  రాగమ్ముల దుడిచిబెట్టి రట్టడి దెచ్చున్!!!

  రిప్లయితొలగించండి
 5. యోగ మెరుంగలేక నిట
  యుక్తము గాని విలోమ యానముల్
  భోగము తోడ గూడుకొని
  పోవును మానవ జీవనమ్మునన్
  రాగము ద్వేషముల్ విషయ
  లాలస నొంది జరించ; నట్టి హృ
  ద్భాగవతమ్ము మానవుల
  బాపము చేయగ బ్రోత్సహించురా!

  నా రెండవ పూరణము:

  రాగ విరాగము లెంచక
  భోగ మొకటె జీవితమను పోకడ లందున్
  తా గన లేకను జన; నా
  భాగవతము ప్రోత్సహించు బాపము జేయన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘లేక’ అన్నది కళ. అందువల్ల ‘లేక యిట’ అనవలసి ఉంటుంది.

   తొలగించండి
 6. భాగవతోత్తముల్ జనిన భారత రీతిని నేర్పుచుండుఁదా
  భాగవతమ్ము, మానవులఁ బాపముఁ జేయఁగఁ బ్రోత్సహించురా!
  అగ్నిరజంబు జూదమును వారపుఁ గాంతల తోడ సఖ్యమున్
  భోగము మద్య మాంసములు భ్రష్టుల జేయు కలిప్రభావమున్

  రిప్లయితొలగించండి
 7. సాగఁగ రాజ్యపాలనముఁ జక్కగ నాప్తుల యాధిపత్యమున్
  తూగఁగ నక్రమార్జనల తోడిన సంపద రాశిపోయుచున్
  జోగఁగ గాఢనిద్రలను చుట్టపు చట్టము! వారి దోపిడీ
  భాగవతమ్ము మానవుల పాపముఁ జేయఁగఁ బ్రోత్సహించురా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘తోడను’ అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు.
   మరో పూరణ:

   ఆ గీత వలన భారత
   భాగవతము ప్రోత్సహించు పాపము జేయన్!
   సాగించె రణము నరుడని
   వాగిరి పరమార్థము విడి పరదేశస్తుల్!

   సవరించిన మొదటి పూరణ:

   సాగఁగ రాజ్యపాలనముఁ జక్కగ నాప్తుల యాధిపత్యమున్
   తూగఁగ నక్రమార్జనల తోడను సంపద రాశిపోయుచున్
   జోగఁగ గాఢనిద్రలను చుట్టపు చట్టము! వారి దోపిడీ
   భాగవతమ్ము మానవుల పాపముఁ జేయఁగఁ బ్రోత్సహించురా!

   తొలగించండి
 8. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { శైవ మతతత్వ మత్త చిత్తుని మాటలు }
  ......................................................


  నాగధరు౦డె సర్వభువనమ్ముల నేలు

  మహోన్నతు౦డు | స

  ర్వాగమ వ౦దితు౦ డగు మహాశివు c గూర్చిన

  గ్ర౦ధమే = సమ

  స్తాగములన్ హరి౦చి , పరమార్థ మొస౦గు |

  బఠి౦ప నేటి కా

  భాగవతమ్ము ? మానవులc బాపము జేయగ

  ప్రోత్సహి౦చురా !

  { సమస్త + ఆగములన్ = సమస్తపాపములను }

  రిప్లయితొలగించండి
 9. భోగ విలాస లాలసులు మూర్ఖుల పల్కులు గావె చూడ, హృ
  ద్రోగము ఖండితం బగును దూరము వారవె సంకటమ్ములున్
  రాగసుధారసాకలిత రామజపంబునఁ, బల్కరా దిటన్
  భాగవతమ్ము మానవులఁ బాపముఁ జేయఁగఁ బ్రోత్సహించురా!

  వేగమ యిచ్చును పుణ్యము
  భాగవతము, ప్రోత్సహించుఁ బాపముఁ జేయన్
  రేగగ వికారము మదిని
  సాగెడు వికృతంపు దుష్ట సాహిత్యమిలన్

  రిప్లయితొలగించండి
 10. రాగము దానము బల్లవి
  రాగములను బాడుకొ నుము రంజిల మనసుల్
  బాగుగగలదా యిట్లన
  భాగవతము ప్రోత్స హించు బాపము జేయన్

  రిప్లయితొలగించండి
 11. రాగము తోడనువినగను
  భాగవతము ప్రోత్సహించు;బాపము జేయన్
  భోగము లెల్లనశించగ
  రోగము హెచ్చై పుడమిన రోయుచు జచ్చున్

  రిప్లయితొలగించండి
 12. భాగవతమ్ము మానవుల బాపముజేయగ బ్రోత్సహించురా
  రాగము తోడ నిట్లనగ రాదు గనెప్పుడు నోయి సోదరా !
  భా గ వతమ్ము మానవుల పాప ము బోవుట కర్హమౌ గదా
  భోగము లెన్నియో మనకు భూరిగ నిచ్చును సత్యమే యిదీ

  రిప్లయితొలగించండి
 13. రాగము చూపించమనుచు

  భాగవతము ప్రోత్సహించు ; బాపము జేయ

  న్నే గతి కూడదటంచును

  జాగృతి గలిగించె లోక జన బాంధవియై.

  రిప్లయితొలగించండి
 14. రాగముతోవసియించుట
  భాగవతము ప్రోత్సహించు, బాపముఁజేయన్
  సాగదు మానసమెపుడున్
  త్యాగపుబుద్ధిఁగలిగించి ధన్యతఁగూర్చున్

  రిప్లయితొలగించండి
 15. ఆగమ శాస్త్రముల్ చదివినా,మమతల్ విడలేని వారికిన్
  రాగము భోగ మాశగొని రంజిలు ధూర్త నృపాల కోటికిన్
  యేగతి పట్టేనో తెలిసి హింసలు జేసెడి వారి దృష్టిలో
  భాగవతమ్ము మానవుల బాపముజేయగ బ్రోత్సహించురా
  2.రాగము,భోగము,త్యాగము
  భాగవతము ప్రోత్సహించు.బాపము జేయన్
  యేగతి నొందును జీవుడు
  బాగుగ వివరించి యుండె భాగవతమునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘కోటికిన్+ఏగతి, జేయన్+ఏగతి’ అన్నపుడు యడాగమం రాదు. ‘కోటి కే|యేగతి..., జేయ|న్నేగతి...’ అనండి.

   తొలగించండి
 16. భాగవతమ్ము దైవమును భక్తిగ గొల్చు-కథా శ్రవంతిగా
  త్యాగము భోగమున్ దెలుపుతత్వము గూర్చెనుపోతనార్యుడే|
  సాగెడి నీతి చంద్రికలు సాగకజేయక మానుకున్నచో?
  భాగవతమ్ము మానవుల బాపము జేయగ ప్రోత్సహించురా|
  2.ఆగని యాశ దోషములనంతర మందున జేరిపోవగా
  భాగవతమ్ము మానవుల బాపము జేయగ ప్రోత్స హించు|రా
  జా|గమనించు నీచగుణ సంపద లెప్పుడు నిల్వబోవులే
  యోగమటంచు నెంచకము యుక్తముగాదిది మిత్రమాయనెన్.
  3.వేగమె గోడకు బంతిని
  త్రాగిన వాడట్లుగొట్ట తగులునుగాదా?
  భోగము నమ్మిన వాడికి
  భాగవతము ప్రోత్సహించు బాపము జేయన్.
  4.ఆగని భగవద్ భక్తిని
  భాగవతము ప్రోత్స హించు|బాపముజేయన్
  త్రాగుడు,జూదం,వ్యసనము
  లాగక నిన్నంటి నపుడు ?నధమత్వంబే|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   కొన్ని టైపు దోషాలు, జూదం అన్న వ్యావహారికమూ ఉన్నాయి. ‘యోగమటంచు నెంచుటయు యుక్తము’ అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 17. భోగపు వాడలందిరుగు భోగిని సైతము మార్చగల్గునీ
  భాగవతమ్ము, మానవుల బాపము జేయగ ప్రోత్సహించురా
  వేగము మీరినట్టి నవ విజ్ఞుల కాంక్షలు, సత్పథమ్ముకై
  భాగవతమ్ము జ్ఞాన పరి పక్వత నిచ్చెడి గ్రంథరాజమౌ

  భోగిని మార్చును యోగిగ
  భాగవతము, ప్రోత్సహించు బాపము జేయన్
  భోగపు వాడలు సుమ్మీ
  జాగర్యముతో మెలగుము జగతిన నార్యా

  రిప్లయితొలగించండి
 18. యాగముమానవాభ్యుదయ యత్నసరాగము,శాంతిశోధనా
  యోగము,రాగమోహనపయోనిధినీదగనిల్చుకావ్యమీ
  భాగవతమ్ము, మానవుల బాపముజేయగప్రోత్సహించురా
  త్రీగమరాక్షసాంశలను దీయుచు నిచ్చును మోక్షసాధనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. వృత్తరచనా నైపుణ్యం చేజిక్కింది. సంతోషం. అభినందనలు.

   తొలగించండి
 19. రాగము నెఱుగుచు బ్రతుకగ
  భాగవతము ప్రోత్సహించు! బాపము జేయన్
  ఏ గాధలైన కావవు!
  వేగమె మదిని మలినముల వీడంగ వలెన్!

  రిప్లయితొలగించండి
 20. మిత్రులందఱకు నమస్సులు!

  [దుర్మార్గ వర్తనుఁడైన కుమారుఁడు గుణనిధినిఁ, దండ్రి యజ్ఞదత్తుఁడు తూలనాడు సందర్భము]

  "భోగ విమోహివై చెలఁగి, మూర్ఖుఁడవై, నయమున్ ద్యజించి, వే
  శ్యా గమనుండవై, ధనము వ్యర్థముగా నశియింపఁ జేసి, మద్యమున్
  ద్రాగి, యమాయకుల్ గుముల, ఱవ్వ యొనర్చుచు నుండునట్టి నీ

  భాగవతమ్ము, మానవులఁ బాపముఁ జేయఁగఁ బ్రోత్సహించురా!”

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ‘భాగవతం’ యొక్క లౌకిక వ్యంగ్యార్థంతో చక్కని పూరణ అందించారు. అభినందనలు.

   తొలగించండి
 21. రోగము నేడిదంతటయు రోతను రేపగ విస్తరించెనే
  భోగపు మాయనందుబడి బుద్ధి నశించగ మాదకమ్ములన్
  చేగొని గడ్డి పీల్చి మధుసేవనతో పతనమ్మె పద్మనా
  భా! గవతమ్ము మానవుల బాపము జేయగ బ్రోత్సహించురా!

  రిప్లయితొలగించండి
 22. త్రాగియు వాగెనొకండు “ధర్మము నిలుపంగ నెపుడు
  భాగవతము ప్రోత్సహించు”|బాపము జేయన్ దలచిన?
  “ఆగక నానంద మిడెడి యాశల నుయ్యాల లూపు
  రాగల కష్టాలు బెంచు రక్షణ నినువీడిపోవు”.|

  రిప్లయితొలగించండి
 23. త్యాగియు యోగియై పరమతత్త్వ వివేక విచారశీలియై
  నాగలిదున్ను" పోతన "జనార్దను భూరి కృపావలంబనన్
  బాగుగ వ్రాసె, భక్తిరసబంధుర మార్దవ సత్ఫలాలతో
  భాగవతమ్ము! "మానవులబాపముజేయగ బ్రోత్సహించురా?"

  భాగవతనామ చింతనె
  వేగంబుగ జ్ఞానమిచ్చు వేదము పగిదిన్
  రాగంబుద్రుంచు-నిక నే
  భాగవతము బ్రోత్సహించు బాపముజేయన్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మొదటి పూరణలో సమస్య సమర్థంగా పరిష్కరింపబడలేదు.
   రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 24. భోగముసుమ్మ తెల్గులకు పోతన వ్రాసిన కావ్యరాజమౌ
  భాగవతమ్ము, మానవులఁబాపముంజేయఁగఁబ్రోత్సహించురా?
  సాగదు దుష్ప్రచారమిక సాధుజనమ్ములు నమ్మరెవ్వరున్
  రాగముతోపఠించుచు సరాగము పొందుడు జీవితమ్ములో

  రిప్లయితొలగించండి
 25. భోగములొంది మత్తిలుచు భూరి సుఖమ్మని దల్చి నిత్యమున్
  తూగుచు మద్యపానమున దుర్వ్యసనమ్ములలోన మున్గుచున్
  సాగుచు , నాస్తికాళినొక షడ్గుణుడాడె సభాముఖమ్ముగా
  భాగవతమ్ము మానవులఁ బాపముఁ జేయఁగఁ బ్రోత్సహించురా!

  యోగీశ్వరుని కధాంశమె
  భాగవతము;ప్రోత్సహించుఁ బాపముఁ జేయ
  న్నీగమ్యం బైహిక మగుచున్
  తూగగ ధనకాంక్ష నీకు తోడైనంతన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణ మూడవపాదంలో గణదోషం. ‘...న్నీగమ్యం బైహిక మయి’ అనండి.

   తొలగించండి
 26. దయచేసి సవరణ పద్యమును పరిశీలింప గోరెదను.
  """'''''''''''"""""""""""""""""""
  త్యాగియు,యోగియై పరమ తత్త్వవివేక విచారశీలియై
  నాగలిదున్ను"పోతన" జనార్దను భూరికృపన్ రచించెనా
  భాగవతమ్ము-మానవులబాపముజేయగ బ్రోత్సహించురా
  సాగిలి మ్రొక్కగాదగిన సన్ముని వందిత కావ్యమెప్పుడున్?.

  రిప్లయితొలగించండి
 27. బాగుగ పోపుభక్తులకు బ్యాగులు బ్యాగుల రూకలందగా
  వేగమె క్రైస్తవమ్మునిట బీరును త్రాగుచు వృద్ధిజేయుటన్
  వాగరె వాడవాడలను బైబులు వక్తలు మైకులో నిటుల్:👇
  “భాగవతమ్ము మానవులఁ బాపముఁ జేయఁగఁ బ్రోత్సహించురా!”

  రిప్లయితొలగించండి