26, జూన్ 2016, ఆదివారం

పద్యరచన - 1224

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

37 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

ఒక గొడుగు బట్టి నిలిచా
ము! కలసి నడిచాము వాన మురిపము లివియే
సకల జనుల దరి జేర్చుచు
నొకరి కొకరి బాసట యన నొప్పార్చు గదా !

కంది శంకరయ్య చెప్పారు...

పద్యం బాగున్నది.
'నిలిచాము, నడిచాము' అనడం వ్యావహారికం. 'నలిచితిమి, నడిచితిమి' అనడం గ్రాంధికం.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

పడగానె వాన చకచక
పడవలనేజేసి నీట వదలుట లేదే!
పడకుండ వాన మీదను
బడికే చన వలసివచ్చె పట్టుక గొడుగున్.

విరించి చెప్పారు...

బుడి బుడి యడుగులు వేయుచు
గుడిబోలిన బడికి వెడలు కూనల గాంచన్
పుడమికి వరుణుడు చేరగ
గొడుగులె యానంద పడుచు గొప్పగ విరిసెన్

Sistla Sharma చెప్పారు...

తొలకరి చినుకుల దడియుచు
పులకించెడి దినము లవియె బుడుతల జూడన్
తలపైన ఛత్ర మూనుచు
నిలబడి రదిగో చదువుల నిలయం బేగన్!

కంది శంకరయ్య చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

శిష్ట్లా శర్మ గారూ,
మీ పద్యం మనోరంజకంగా ఉంది. అభినందనలు.

Zilebi చెప్పారు...


విరించి వారు అద్భుతః !

చీర్స్
జిలేబి

sailaja చెప్పారు...

కర్షకులకు మేలొసగెడు
వర్షాకాలమ్ము రాగ వసుమతి లోనన్
హర్షముతో బట్టి గొడుగు
వర్షములో బయలుదేరె బడిపిల్లలటన్!!!

కంది శంకరయ్య చెప్పారు...

శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
బయలుదేరిరి పిల్లలు.. అనాలి కదా! అందుకని ‘వర్షములో సాగినారు...’ అనండి.

ఫణి కుమార్ తాతా చెప్పారు...

పాదచారులకుపయుక్తమైన దారి
కోతకు గురియయ్యెను కుండపోత వలన
రక్షణంబును కరవాయె రథ్యమందు
వారి రక్షణ వహియించు తిరుమలేశ

కంది శంకరయ్య చెప్పారు...

ఫణికుమార్ గారూ,
చిత్రాన్ని పరిశీలించమంటే సునిశితంగా పరిశీలించి పద్యాన్ని వ్రాసినట్టున్నారు. బాగున్నది. అభినందనలు.

ఊకదంపుడు చెప్పారు...

ఒకటి, నాలుగు పాదములలో యతి గురించి సందేహమండీ

subbarao చెప్పారు...

వాన వచ్చుట వలననా బాలురచట
గొడుగు క్రిందన తలలిడి గుంఫన ముగ
పోవు చుండిరి బడికిగా బోలు వారు
చూడ ముచ్చట యాయెను జూడ పటము

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

చిత్రముగ బాల లచ్చట
ఛత్రము చేవూని వాన జల్లులఁ గనుచున్
మిత్రు లిరువు రింక బడికిఁ
బాత్రతఁ బడయం గదిలిరి పరమప్రీతిన్

విరించి చెప్పారు...

వేసవి సెలవుల్ ముగిసెను పిల్లలకిక
బడులు తెరిచె! వసుధయె తా వరుణు బిలువ
విరిసె గొడుగులుత్పలముల విధము, ధరణి
తడిసె,నరకలు సిధ్ధమౌ తరుణమిదియె.

Sreedhara Rao Machavolu చెప్పారు...

ఏక ఛత్ర ధారులగుచు నీ బుడుతలు
పలికి రచట తొలకరికి స్వాగతాలు!
వరుణ దేవుని పాటలు పాడుకొనిరి,
కరువు తీరగ వర్షాల కురియుమనిరి!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

వానయె కురుయుట మొదలై
తానది పెరిగిన మరింత తట్టమటంచున్
కూనలు ఉమా రమలటన్
వాణియె యేతెంచుననుచు పట్టిరి గొడుగున్!

Unknown చెప్పారు...

అవని కుంచ గలిగె ఆకాశగొడుగును
వర్ష దార బడగ వన్నె బెరిగె|
తడప లేదువానతడబాటు మనకేల?
కలసి మెలసి యున్న కలదుసుఖము|


డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...


1.బడికి వెళ్ళు నపుడు వర్షమ్ము కురియగా
నొక్క గొడుగులోనె నొద్దికగను
బాలికలరుగంగ బహుళ హర్షంబయ్యె
ఐకమత్యమనిన నదియె గాదె!

2.ఛత్రము నీడన బాలలు
చిత్రముగా నాటలాడ జిలిబిలి యడుగుల్
నాత్రము తోడను వేయుచు
సత్రము చెంతకు బిరబిర సాగిరి గనుమా

3.ఒక్క గొడుగు లోనెకలిసి
చక్కగసాగుదమురమ్ము సఖియా నీవున్
ఎక్కుడు వర్షము నందున
మిక్కిలిగాతడిసిన రుజలుమేనున చేరున్

4.కుండపోతగ వర్షమ్ము కురియు వేళ
చక్క నైన గొడుగుక్రింద చల్ల గాను
బాలిక లిరువురు కలిసి బడికి చనుట
గాంచ మదికి హర్షమ్మునుగలుగుచుండె.

5.వానయందుతడియువాంఛయున్నను కూడ
గొడుగుక్రిందచేరిగుంభనముగ
అమ్మ దిట్టు నన్ననాదుర్దనంతయు
నణచు కొనుచు వారునక్కి రచట

కంది శంకరయ్య చెప్పారు...

ఊకదంపుడు గారూ,
నిజమే! నేను గమనించలేదు. ధన్యవాదాలు.
ఆ రెండు పాదాల్లోను యతి తప్పింది.
*****
ఫణికుమార్ గారూ,
యతి దోషాలను సవరించండి.

కంది శంకరయ్య చెప్పారు...

సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
వారు బాలురు కారు, బాలికలు. ‘వలన నా బాలిక లట’ అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘బడులు తెరిచిరి! వసుధ తా వరుణు బిలువ’ అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

శ్రీధర రావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ఏక+ఛత్ర’ అన్నపుడు తుగాగమ సంధి జరిగి ‘ఏకచ్ఛత్ర’ అవుతుంది. గమనించండి.

కంది శంకరయ్య చెప్పారు...

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది.
‘తట్టము’..? ‘కూన లుమా రమ లచటన్’ అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ ఐదు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మూడవపద్యం చివరిపాదంలో గణదోషం. ‘మిక్కిలిగ తడిసిన..’ అనండి.

ఫణి కుమార్ తాతా చెప్పారు...

పాదచారులు నడిచెడి బాట జూడ
కోతకు గురియయ్యెను కుండపోత వలన
రక్షణంబును కరవాయె రథ్యమందు
వారి రక్షణ వహియించు తిరుమలేశ

గురువుగారూ 4వ పాదం ప్రాస యతి సరిపోయింది కదా.

Unknown చెప్పారు...

మండుటెండలతాపము మరచు నట్లు
మనసు నానంద పరచిన వాన జల్లు
మమత తోడ ముచ్చటలాడు మధుర భావ
ములొలికించు మధుర క్షణము లివియ గును

జిగురు సత్యనారాయణ చెప్పారు...

ఫణి కుమార్ గారు! సరిపోలేదండి.
నాల్గవ పాదము గురువుతో మొదలయింది కాబట్టి. ప్రాస యతి ముందు అక్షరము కూడా గురువు కావలిసియుంది. అనగా "వారి"లో "వా" దీర్గము కాబట్టి "తిరు"లో "తి" దీర్గము కావలసి యుంది.
"తిరుమలేశ" కు బదులుగా, యతి చెల్లించాలంటే "పార్వతీశ" లేదా యతి ప్రాస చెల్లించాలంటే "క్షీరచోర" వంటి పదాలు పరిశీలించ వచ్చు

జిగురు సత్యనారాయణ చెప్పారు...

రామకృష్ణ గారు,
1. రెండవ పాదములో ప్రాస యతి సరిపోలేదు. (ఛందస్సు సాఫ్ట్‌వేర్ ఒప్పుగా చూపిస్తుంది కాని అది సరి అయినది కాదు)
2. "మధురక్షణములు" ఒకే సమాసము కావటం చేత , సమ్యుక్తాక్షరమైన "క్ష" ముందు ఉన్న "ర" గురువై గణభంగమవుతుంది

Sreedhara Rao Machavolu చెప్పారు...

సవరించిన పద్యం చూడ గోరుతాను.

ఏకమైరి గొడుగు నీడ నీ బుడుతలు
పలికిరటను తొలకరికి స్వాగతములు
వరుణ దేవుని పాటలు పాడుకొనుచు
కరువు తీరగ వర్షాల కురియుమనిరి!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురుదేవులకు ధన్యవాదములు.
తట్టము=కష్టము
సవరించిన పూరణ:

వానయె కురుయుట మొదలై
తానది పెరిగిన మరింత తట్టమటంచున్
కూనలుమా రమలచటన్
వాణియె యేతెంచుననుచు పట్టిరి గొడుగున్!

ఫణి కుమార్ తాతా చెప్పారు...

సత్యనారాయణ గారూ, వివరణకి ధన్యవాదములు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

ఎన్నాళ్ళీ తంటాలుర?
చిన్నారులు! వచ్చు మీకు చీమిడి ముక్కుల్
నాన్నకు చెప్పుర కొనమని
చిన్నవియగు రైను కోట్లు చెన్నుగ జపనీస్!