17, జూన్ 2016, శుక్రవారం

దత్తపది - 90 (తాత-మామ-బావ-మరది)

కవిమిత్రులారా,
తాత - మామ - బావ - మరది
పై పదాలను అన్యార్థంలో ఉపయోగించి వానదేవుని ఆహ్వానిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

60 కామెంట్‌లు:

  1. నిత్య సమర దినకరుని నెగ్గలేము
    తాపమయ్యెను జ్వలితాతత రవి చేత
    నీకు సబబా వరుణదేవ!నెమ్మదింప?
    వర్షమా! మము కావవే వడివడిగను!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అత్తరణి చేత దేహము హడలిపోయె
      నిత్య సమర దినకరుని నెగ్గలేము
      నీకు సబబా వరుణదేవ!నెమ్మదింప?
      వర్షమా! మము కావవే వడివడిగను!!

      తొలగించండి
    2. శీర్షికలో ‘తాత’ అని టైప్ చేయవలసిన చోట ‘అత్త’ అని టైప్ చేశాను. మన్నించండి.
      మీ రెండు విధాల పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. ఉక్కపోతా తరుగుమా ! మహోగ్ర తాప
    రక్షగ సుర గంగాంబా వరలు ! వసుధ న
    మరదిశలమర వరుణాగమనము కోరు
    మాకు వడి ఋతుపవనమా మరులు దీర్చు

    రిప్లయితొలగించండి
  3. మిత్రులందఱకు నమస్సులు!

    అష్టదిక్పాలముఖ్య! జలాధిదేవ
    తా! తపనను నర్థింపఁగాఁ దాము మా మ
    నవిని వినియుం జలమ్మిడి; భువినిఁ బావ
    నమ్ముఁ జేయు మమర దిక్పథమ్ములందు!

    రిప్లయితొలగించండి
  4. అత్తరణి మండు వేసవిఁ
    జిత్తైతిమి! మా మనవిని జెవిఁగొను వరుణా!
    పత్తెంబావల బాయును!
    ముత్తెపు చినుకులమర! దిగి మోదము నిమ్మా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అత్త’ను తొలగించి ‘తాత’ను చేర్చాను. మీరు గమనించలేదు. ఈసారి తాతతో పూరించండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. తాతను జేర్చిన పూరణ పరిశీలించ ప్రార్థన.అయినా మీరప్పుడే కళ్లకి శ్రమనీయడం మంచిదికాదేమో.ఓ వారం విశ్రాంతిఁగొన ప్రార్థన.
      అత్తరణి తాతనమునన్
      జిత్తైతిమి! మా మనవిని జెవిఁగొను వరుణా!
      పత్తెంబావల బాయును!
      ముత్తెపు చినుకులమర! దిగి మోదము నిమ్మా!

      తొలగించండి
    3. సవరించినందుకు సంతోషం. కాని ‘తాతనమునన్’ అర్థం కాలేదు.
      విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏదో ఉండబట్టలేక బ్లాగు చూస్తున్నాను. ధన్యవాదాలు.

      తొలగించండి
    4. తాతనము=వ్యక్తిత్వము

      సూర్యుని మండే వ్యక్తిత్వము వల్ల చిత్తైనాము అనే భావం. గురువుగారలకు పరిశీలించ ప్రార్థన.

      తొలగించండి
  5. తాత - మామ - బావ - మరది

    ఇనుడు తాతపననుబెంచె వినడు మొరను
    చల్లదనమమర దిశల మెల్లగాను
    మామనస్సుల తనువుల ' మత్తు ' గలుగ
    వానదేవుడ గబగబా వచ్చి పోవ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సాధారణంగా ‘తాన్+తపనను = తాఁ దపనను’ కావాలి. పూరణ కనుక స్వీకరిద్దాం.

      తొలగించండి
  6. వాడి పోయె లతా తరు శాఖికాళి
    వేడి గాలుల మా మది వీడె గ్రమము
    వర్ష దర్శనం బావని వరల జేయు!
    దివ్య చేతనంబు లమర దిశలయందు!

    రిప్లయితొలగించండి

  7. గురువుగారూ నమస్సులు..మొదటిపాదంలో యతి తప్పింది...సవరించినది....
    దత్తపది: తాత-మామ-బావ-మరది

    వాడి పోయె లతా తరు వనుల శోభ
    వేడి గాలుల మా మది వీడె గ్రమము
    వర్ష దర్శనం బావని వరల జేయు!
    దివ్య చేతనంబు లమర దిశలయందు!

    రిప్లయితొలగించండి
  8. ఆ ఘన వాతాతప కృత
    మేఘ కదంబావకీర్ణ మిశ్రిత జలమున్
    మేఘ పథమున సుమామల
    మా ఘన సామరదినకరు లవని నొసగరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దత్తపదాల నెక్కడ ఇమిడ్చారా అని వెదుక్కొని ఔరా అని ఆశ్చర్యపరిచే చక్కని పూరణ మీది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. మీరు కంటికి శ్రమయిస్తున్నారేయన్న కలత రేగుచున్నది మామదిలో. ఎవరిచేతనైన చదివించి మీవ్యాఖ్యలను ప్రచురింపజేసిన బాగుండును.

      తొలగించండి
  9. ఉష్ణ గాలిని మామది యోప దయ్యె
    నాల తాతరులును మాడి నేల బడియె
    వాన దేవుడ !గబగబా వఛ్చి మాకు
    దెగువ దనము హర్ష మమరదిశల కురియు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఉష్ణగాలి’ అని సమాసం చేయరాదు కదా! ‘ఉష్ణవాయువు/ ఉష్ణతీవ్రత’ అనండి.

      తొలగించండి
  10. దారుణ కరముల్ తోడుతా తరణి వచ్చి
    నిత్యమున్ మామయి దహించి నిగుడుచుండె
    కష్టమయ్యెఁబావకువేడి కాచుకొనుట
    క్రమ్మరదివినుండి కురిసి కావుమయ్య

    రిప్లయితొలగించండి
  11. మాకుం "బావ"కు మంటలింక సహియింపన్ శక్తి లేదంతగా
    సాకుల్ జెప్పక "మామ"కంబయినవిశ్వాసంబు దీపింప రా
    వో!కాచంగ "తాత"ను నేను కడుదీనుండన్ వర్షింపంగ నే
    సంకోచంబదిలేక భ్రామర దిగంశంపు శబ్దాత్ముండవై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      మూడవ నాల్గవ పాదాలలో గణదోషం. మూడవ పాదంలో యతి తప్పింది.

      తొలగించండి
  12. నేస్తమా! మము కరుణించి నేల బావ
    నమ్ముజేయగ జినుకువై రమ్మిలకును
    వేచె నీకై లతా తరు వృక్ష రాజ
    ములమర దివిషదుడ వంచు మ్రోలు చుండె

    రిప్లయితొలగించండి
  13. క్షమించాలి. నాల్గవ పాదం సవరించి పంపుతాను.

    రిప్లయితొలగించండి
  14. మాకుం"బావ"కు మంటలింక సహియింపన్ శక్తి లేదంతగా
    సాకుల్ జెప్పక "మామ"కంబయిన విశ్వాసంబు దీపింప ర
    మ్మా కాచంగ!"తాత"ను నేను కడు దీనుండన్ వర్షింపంగ భా
    సాకారంబయి సాధు భ్రా"మరది"గంశంపు శబ్దాత్ముండవై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించినా రెండు పాదాల్లోని దోషాలు తొలగిపోలేదు. మూడవపాదంలో గణ, యతి దోషాలు, నాల్గవపాదంలో గణదోషం.

      తొలగించండి
  15. జలపతీ మామహీ గమి, చాయమగడు
    నీటితాతకు పనుపడ, నీల్గుచుండె
    తద్దయు దయతోఁబావకు తాపమడగి
    హర్షమమర దిగుచు మయ్య యంబుదముల
    మహీః ఆవు, నీటితాతః వాయువు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెడ్డి గారు చిన్న సవరణ."మహీగమి" సమాసము దోషయుక్తము. సమూహమనెడి యర్థములో "గమి" దేశ్యము. "మహీతతి" యనిన బాగుండును.

      తొలగించండి
    2. కవివర్యులు కామేశ్వర రావు గారూ - మీసవరణకు ధన్యవాదములు.గురువు గారు వద్దన్నా శ్రమ తీసుకుంటున్నాను. మీరు సహాయం చేసి గురువు గారిని ఇంకా ఐదు రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పండి.

      తొలగించండి
    3. సుకవులు రెడ్డి గారు మీరన్నది నిజము . ఇప్పుడు విశ్రాంతి చాలా యవసరము గురువు గారికి. నేనూయదె వ్రాసాను.

      తొలగించండి
  16. . మామది సంతసమొసగును
    సామాన్యమె తాతవేల్పు సహకారమునన్
    ఏమర దిగులునొసంగుచు
    బామిడ సబబా?వసుధకు వర్షము నిమ్మా {తాతవేల్పు=బ్రహ్మ}{బాము=కష్టము}

    రిప్లయితొలగించండి
  17. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    చల్లని హృదయమా మనుజ ప్రతతికి

    తగు జలము దోమటి నిడు దాతా ! తరుణము

    న గృప వీడ హిత౦బా ? వనదములన్ ద్ర

    వి౦చ నీయు మమర దిట మెలమి మాకు

    { దోమటి = ఆహారము , తరుణము = తగిన వేళ

    వనదము = జలదము ,

    దిటము = శక్తి ధైర్యము

    రిప్లయితొలగించండి
  18. అపరిమితాతపమ్ము గనుమా మడుగుల్ జలహీనమాయే నే
    నెపమది లేక తామర దినేశుని గోరేను తగ్గుమంచు,నం
    బుపుడ!నుతింతుమయ్య,నిను ముత్తెపు చిప్పగ స్వాతివానకై
    వడివడి వర్షమిమ్ము సబబా వర నమ్మిన సేద్యగానికై

    రిప్లయితొలగించండి
  19. వరుణదాతా! తగిన వాన సరగున నిడు
    చింత మా మనుజులయందు నంతుమీరె
    బ్రతుకులందు ఘోర తిమిరంబావరించె
    పంతమా! మరి దిగి రమ్ము ప్రాణ మిమ్ము

    రిప్లయితొలగించండి
  20. మరొకసారి ప్రయత్నించాను.మీరీ రోజే శ్రమపడి చూడకండి. ఇబ్బంది లేనపుడు చూడగోరెదను.

    మాకుం"బావ"కు మంటలింక సహియింపన్ శక్తిలేదంతగా
    సాకుంజెప్పక "మామ"కంబయిన విశ్వాసంబు దీపింప-రా
    వా?కాచంగను "తాత"నేను, నదులై పారంగ వర్షింపవే
    సాకారంబుగ మారి భ్రా"మరది"గంశంపుం సుశోభాత్ముండవై.

    రిప్లయితొలగించండి
  21. మరొకసారి ప్రయత్నించాను.మీరీ రోజే శ్రమపడి చూడకండి. ఇబ్బంది లేనపుడు చూడగోరెదను.

    మాకుం"బావ"కు మంటలింక సహియింపన్ శక్తిలేదంతగా
    సాకుంజెప్పక "మామ"కంబయిన విశ్వాసంబు దీపింప-రా
    వా?కాచంగను "తాత"నేను, నదులై పారంగ వర్షింపవే
    సాకారంబుగ మారి భ్రా"మరది"గంశంపుం సుశోభాత్ముండవై.

    రిప్లయితొలగించండి
  22. గురువులు శ్రీ కంది శంకరయ్య గారికి వినయపూర్వక నమస్కారములు.
    మీయొక్క కంటి శస్త్ర చికిత్స విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది.
    a
    తాత - మామ - బావ - మరది

    శథతా తమ యాగమనము
    ప్రథితంబై మా మనసులు పరవశమందన్
    వ్యథలను బాపుచుఁ బావన
    రథమున రమ్మిక యమర దిరముగన్ భువికిన్.

    రిప్లయితొలగించండి
  23. భువిలతాతరులన్నియు బోసి పోయె
    పరుగులిడి గంగ జేయుత బావనమ్ము
    నవని నీకృప చేతనే నమరదివిగ
    గావుమామమ్ము వరుణుడ కరుణ జూపి

    రిప్లయితొలగించండి
  24. గురువర్యులకు సహకరిస్తున్న జిగురు సత్యనారాయణ గారికి, కామేశ్వర రావు గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  25. జిగురు సత్యనారాయణ గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి