18, జూన్ 2016, శనివారం

సమస్య - 2064 (అల్లుఁడ నయ్యెదన్...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“అల్లుఁడ నయ్యెదన్ సుతుఁడ నయ్యెద ప్రాణవిభుండ నయ్యెదన్”
లేదా...
“అల్లుఁడఁ బుత్రుండ మగఁడ నయ్యెద వరుసన్”

71 కామెంట్‌లు:

 1. ఉల్లమునందు ప్రేమనిడి యొప్పి జరించ నిజంబుగా నిటన్
  తల్లియు తండ్రి నౌదు మమతా సుధ జిందెడు మామ నౌదు భా
  సిల్లెడి భ్రాత నౌదు పరిసేవన మిచ్చెడి నేస్తమౌదు నే
  నల్లుడ నయ్యెదన్ సుతుడ నయ్యెద ప్రాణవిభుండ నయ్యెదన్!

  రిప్లయితొలగించండి

 2. కొంత మార్పుతో.....

  ఉల్లమునందు ప్రేమనిడి యొప్పి జరించ నిజంబుగా విరా
  జిల్లెడి తండ్రి నౌదు సురుచిన్ సుధ జిందెడు మామ నౌదు భా
  సిల్లెడి భ్రాత నౌదు పరిసేవన మిచ్చెడి నేస్తమౌదు నే
  నల్లుడ నయ్యెదన్ సుతుడ నయ్యెద ప్రాణవిభుండ నయ్యెదన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఒకే వ్యక్తి వేరువేరు వ్యక్తులతో విభిన్నబాంధవ్యం కలవాడిగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. గురువు గారికి నమస్కారములు. నిన్నటి సమస్యకు నేను వ్రాసిన పూరణ కూడా చదువ గోరుతాను.
  ధన్యవాదములు. శ్రీధర రావు.
  “వర్ష ఋతువొచ్చె, మాతా! తపనము సైప!
  మాకు వాన కావలె” నని మా మనుజులి
  ట “జగదంబా! వరుణుని జాడ తెలుపంగ
  క్రమ్మర దిగి వచ్చి భువిని కాయు డ”నిరి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘వచ్చె’ను ‘ఒచ్చె’ అనడం గ్రామ్యం. ‘వర్షఋతువిదె...’ అందామా?

   తొలగించండి
 4. గురువు గారికి నమస్సులు....మీ ఆరోగ్యం యెలా వుంది....సమస్యలోని కంద పద్యపాదాన్ని యొకసారి పరిశీలించ ప్రార్థన

  రిప్లయితొలగించండి
 5. కల్లలు గావివి సత్యము
  యెల్లలు యేమియును లేక యెన్నియొ మేనులన్
  తొల్లి ధరించితి; భావిన
  అల్లుఁడఁ బుత్రుండ మగఁడ నయ్యెద వరుసన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   ‘సత్యము+ఎల్లలు+ఏమియును’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. రెండవపాదం చివర గణదోషం. ‘భావిని’ అనడం సాధువు. మీ పద్యానికి నా సవరణ....

   కల్లలు గావివి సత్యం
   బెల్లలు లేకుండ నెన్నొ యెన్నొ తనువులన్
   దొల్లి ధరించిచి భావిని....

   తొలగించండి
 6. చల్లగ నుండను శ్రీమతి
  యల్లన వేషంబు లెన్నొ యై ఛ్చిక ముంగాన్
  మెల్లగ బ్రీతిని నిటులుగ
  న ల్లుడ బుత్రుండ మగడనయ్యెద వరుసన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణలోని భావాన్ని వివరించండి. ‘...యైచ్ఛికముగనే...’ అనండి.

   తొలగించండి
 7. ఉల్లాసమ్ముగ నట నా
  తల్లికి కుడి,యెడమ నిల్వ తండ్రీ సుతలున్!
  వల్లించగ! నే వారికి
  నల్లుఁడఁ బుత్రుండ మగఁడ నయ్యెద వరుసన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘తండ్రియు సుతలున్’ అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
   ఉల్లాసమ్ముగ నట నా
   తల్లికి కుడి,యెడమ నిల్వ తండ్రియు సుతలున్!
   వల్లించగ! నే వారికి
   నల్లుఁడఁ బుత్రుండ మగఁడ నయ్యెద వరుసన్

   తొలగించండి
 8. అల్లన పిల్లను జేకొని,
  తల్లియు దండ్రియు గనంక, ధారుణి పైనా
  యిల్లాలు ధర్మ పత్నికి
  నల్లుడ పుత్రుండ మగడ నయ్యెద వరుసన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యభావాన్ని వివరిస్తారా? ‘..గనంగ’ అన్నచోట టైపాటు. ‘పైనా’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు.

   తొలగించండి
  2. గురువుగారూ...పిల్లను జేకొని అల్లుడు, తల్లిదండ్రులకు పుత్రుడు,యిల్లాలికి మగడయ్యాడని నా యుద్దేశ్యము.....ధారుణిపైన్+ఆ యిల్లాలు=ధారుణిపై నా యిల్లాలు.....పద్యం సమర్థవంతంగా లేదేమో...!.   తొలగించండి
  3. మీ వివరణ సంతృప్తికరంగా ఉంది. ‘పైనన్’ అనేచోట ‘పైనా’ అన్నారేమో అని పొరబడ్డాను. మన్నించండి.

   తొలగించండి
  4. అల్లన పిల్లను జేకొని;
   తల్లియు దండ్రియు గనంగ; ధారుణి పైనా
   యిల్లాలు ధర్మ పత్నికి;
   నల్లుడ బుత్రుండ మగడ నయ్యెద వరుసన్!

   తొలగించండి
 9. పిల్లను కాన్కగా నిడుచు బ్రేమనుబంచెడు మామగారికి
  న్నుల్లమురంజిలన్ ఘనతరోజ్జ్వల జీవనదాత తాతకున్
  సల్లలితాంగియైభరత సంస్కృతి నిల్పెడు భాగ్యరాశికి
  న్నల్లుడనయ్యెదన్,సుతుడ నయ్యెద,ప్రాణవిభుండనయ్యెదన్.

  రిప్లయితొలగించండి
 10. ఇల్లిరకమ్మున నుంటిని
  బుల్లక్క సుతను వరించి మోదముతోడన్
  బుల్లక్క, జనని, సుతలకు
  నల్లుడఁబుత్రుండ మగడ నయ్యెద వరుసన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘ఇల్లరికమ్ము’ను ‘ఇల్లిరకమ్ము’ అన్నారు.

   తొలగించండి
 11. బల్లిదమైన వంశమునఁ బద్మభవాంచిత కీర్తివంతము
  న్నుల్లము రంజిలన్నొక మహోన్నత సద్గుణు మానవోత్తముం
  జెల్లికి భార్యకున్ మరియు సిగ్గిలు కోడల కిష్టమైన మే
  నల్లుఁడ నయ్యెదన్ సుతుఁడ నయ్యెద ప్రాణవిభుండ నయ్యెదన్

  తల్లడపడ నేల మదినిఁ
  గల్లయె బంధుత్వము లిలఁ గాలము దీరన్
  వెల్లువ లెల్ల భవమ్ములు
  నల్లుఁడఁ బుత్రుండ మగఁడ నయ్యెద వరుసన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చిన్న సవరణతో:

   బల్లిదమైన వంశమునఁ బద్మభవాంచిత కీర్తివంతము
   న్నుల్లము రంజిలన్నొక మహోన్నత సద్గుణు ప్రీతిపాత్రమౌ
   చెల్లికి భార్యకున్ మరియు సిగ్గిలు కోడల కిష్టమైన మే
   నల్లుఁడ నయ్యెదన్ సుతుఁడ నయ్యెద ప్రాణవిభుండ నయ్యెదన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి.
   ముఖ్యంగా తండ్రి చెల్లెలికి, భార్యకు, కోడలికి తానేమౌతాడో చెప్పిన పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
   ‘వెల్లువలైన భవమ్ముల| నల్లుఁడ...’ అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. మీ సవరణ బాగున్నది. ధన్యవాదములు.
   ఏజన్మ లో నేమౌతామో యెవరికి తెలియదుగద. భవములు ప్రవాహములు. ఏదైనా అవ్వచ్చునన్న భావన తో వ్రాసాను.

   తొలగించండి
 12. రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారు మీపద్యమును తిరిగి ప్రచురించండి. మొదటిది పోయింది. "చెల్లిలి పితకు" ననడము లో దోషము లేదనుకుంటాను.

   తొలగించండి
 13. ఒకటి తెలుగు మరొకటి సంస్కృతము దుష్టసమాసమని తొలగించాను.

  ఉల్లము రంజిల బంధము
  చెల్లును, మామకు, తండ్రికి, శ్రీలకు నెలవై
  మల్లియబోలిన సతికిని
  నల్లుడ,బుత్రుంండ, మగడనయ్యెద వరుసన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెండవ పాదము మూడవ గణము జగణము కాని నలము కాని కావలసి ఉంది. కన్ని ఇక్కడ భగణము (తండ్రికి) అయినది

   తొలగించండి
  2. సత్యనారాయణ గారూ,
   ధన్యవాదాలు. నేను గమనించలేదు. ‘తండ్రికి’ అన్నచోట ‘పితకును’ అంటే?

   తొలగించండి
 14. కామేశ్వరరావు గారు నమస్సులు. ఆధ్యాత్మిక పరంగా మీ రెండవ పద్యమెంతో హృద్యంగా నున్నది.

  రిప్లయితొలగించండి
 15. సమాసము చేయునపుడు మొదట సంస్కృత పదముండరాదు.అని ఉన్నది.కనుక తప్పు కాదనే అనిపించుచున్నది.సిరి వల్లభుడు.సరైనదని, అతితెలివి తప్పని ఉంది.

  రిప్లయితొలగించండి
 16. ఈరోజు కందం సమస్యలో.నాల్గవ పాదం రెండవ గణం పొరబాటున జగణం పడింది.

  రిప్లయితొలగించండి
 17. అల్లన యత్తమామలకు, హైమ వతీసుత తండ్రికి,న్నిక న్
  లాలన తోడజూచునను లాస్యకు నెప్పుడు నాదరంబునన్
  వల్లభ రాయడా !కనుము భావన జేయుచు బారదర్శ తన్
  అల్లుడ నయ్యెదన్ సుతుఁడ నయ్యెద ప్రాణ విభుండ నయ్యెడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ముందుగా కొంత గందరగోళంగా అనిపించింది.
   ‘అత్తమామలకు అల్లుడు; హైవవతి తల్లి, ఆమె కూతురు (సోదరి) తండ్రి, వారికి సుతుడు; లాస్య అనే కాంతకు భర్త!’ ఇదన్నమాట ఆ బంధుత్వం. బాగుంది. అభినందనలు.

   తొలగించండి
  2. (1) తండ్రికిన్ + ఇకన్ ="తండ్రికినికన్" అవుతుంది
   "తండ్రికిన్నికన్" (దిత్వనకారము) సాధ్యము కాదనుకుంట
   (2) నాల్గవ పాదము అచ్చుతో ప్రారంభమయినప్పుడు, మూడవ పాదమును దృతాంతముగా (సంధి లేకుండా) వదిలి వేయవచ్చా అని సందేహము.

   తొలగించండి
  3. సత్యనారాయణ గారు నమస్సులు.
   1. దృతము (న్) న కచ్చు పరమైనపుడు ద్విత్వము గూడ రావచ్చును. ఇది ఒక్క “న్” కు మాత్రమే కలదు. భాగవతము లో దీనికి చాలా యుదాహరణలున్నవి.
   ఒక ఉదాహరణ:

   అప్పుడు బ్రహ్మలు దమలో
   దప్పక ననుఁ జూచి సముచితక్రియ లగుచు
   న్నప్పరమేశున కభిమత
   మొప్పగఁ దగ సప్తతంతు వొగిఁ గావింపన్ భాగ. 2. 96

   దీనినీ విధముగా సమర్థింప వచ్చును.
   అగుచున్ + ను = అగుచున్ను;
   అగుచున్ను + అప్పరమేశు = అగుచున్నప్పరమేశు.
   “అగుచునప్పరమేశు”, లేక “అగుచున్నప్పరమేశు” రెండు విధములగ వ్రాయ వచ్చును.

   2. దృతము మీద యచ్చు వచ్చిన సంధి చేయ వలెను.
   “బారదర్శ తన్న | ల్లుడ” గా వ్రాయవలెను.

   తొలగించండి
  4. కామేశ్వర రావు గారు
   వివరించినందుకు ధన్యవాదములు

   తొలగించండి
 18. మిత్రులందఱకు నమస్సులు!

  [బాలకృష్ణుఁడు గోపికలతో సరస సంభాషణము లాడుట]

  "నల్లనివాఁడ! నన్నునుఁ గనంగనుఁ బ్రేమనుఁ జూపఁగాను మీ
  యుల్లము పొంగుచుండును! మహోత్తమమైన హృదంతరమ్ము రం
  జిల్లఁగఁ జూడ నీకు మఱి నీకును నీకునుఁ బ్రేమమీఱ నే

  నల్లుఁడ నయ్యెదన్! సుతుఁడ నయ్యెద! ప్రాణవిభుండ నయ్యెదన్!!"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిత్రులు శంకరయ్యగారూ! మీరు సాధ్యమైనంత వరకు కంటికి శ్రమ కలుగని రీతిలో నడుమ నడుమ విశ్రాంతి తీసుకొనుచు నందఱి పూరణములనుఁ బరిశీలింపఁగలరు. అధిక శ్రమ కలిగినఁ గంటికిఁ బ్రమాద మేర్పడఁగలదు. కొన్ని దినముల పిమ్మట నెంత సేపైననుఁ బరిశీలించి, తగు సూచన లీయవచ్చును. ఇప్పుడు పూర్తి జాగ్రత్త వహింపఁగలరు.

   తొలగించండి
  2. మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
   కంటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాను. కాని మనస్సు బ్లాగువైపు లాగుతోంది. కంటికి శ్రమ కల్గనంతవరకు చూస్తాను. ధన్యవాదాలు.

   తొలగించండి
 19. గుఫువు గారికి నమస్కారములు
  మీ ఆరోగ్యము జాగ్రత్త మరో వారం వరకు కళ్ళకు విశ్రాంతి అవసరమేమో అనవసర ప్రయాస తీసుకోవద్దని మనవి


  తల్లియు నామె యన్నయును తాళిని కట్టిన భార్యతోడుగన్
  చెల్లెలి బారసాలకట జేరగ వెళ్ళెడు వేళలో గనన్
  న్నెల్లజనాలకున్ వరుసనేమని చెప్పెద గాంచినంతనే
  అల్లుడనయ్యెదన్ సుతుడ నయ్యెద ప్రాణవిభుండ నయ్యెదన్

  ఉల్లము దోచిన పడతిని
  బెళ్ళాడితిబ్రేమ మీర విజ్ఞుడ నౌనే
  పిల్లకు పతిగనె కాదిల
  నల్లుడ బుత్రుండ మగడ నయ్యెద వరుసన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   కంటి విషయంలో జాగ్రత్తలు చెప్పినందుకు ధన్యవాదాలు.

   తొలగించండి
  2. రెండవ పాదము చివర దృతాంతముగా వదిలి మరల మూడవ పాదమును "న్నెల్ల" అనటము కుదరదు.

   తొలగించండి
 20. తల్లికియన్నకూతురిని దగ్గరజేర్చియు పెళ్లియాడ|ఆ
  పిల్లకుపిల్లలున్ గలిగె.”వేడుకలుండగ మామయింట,తా
  వెళ్ళగ తండ్రితోడనట ప్రేమనునింపిరి బంధువర్గమున్
  అల్లుడ నయ్యెదన్,సుతుడ నయ్యెద ప్రాణ విభుండ నయ్యెదన్.”
  2.పెళ్లికుమార్తెజనకునకు? {అల్లుడ}
  తల్లికి తండ్రికి మమతలు దగ్గని వాడై {పుత్రుండ}
  నుల్లాసమునింపుసతికి? {మగడనయ్యెద వరసన్.}
  అల్లుడ బుత్రుండ మగడ నయ్యెద వరసన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘తల్లికి నన్న కూతురును’ అనండి.

   తొలగించండి
 21. తల్లియు దండ్రియు బంధువు
  అల్లుడ బుత్రుండ మగడ నయ్యెద వరుసన్!
  ఉల్లముయు నేను యనగా
  మెల్లన యద్వైత భావ మిది యని తెలిసెన్!
  గురువు గారూ, మీ ఆరోగ్యము పూర్తిగా బాగయ్యే వరకు వైద్యుల సలహా మేరకు కళ్ళకు తగిన విశ్రాంతి నిస్తూండండి. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూడవ పాదంలొ 'నేను ' కు బదులు, 'నేనె ' అని చదువ గలరని మనవి. ధన్యవాదములు.

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘ఉల్లమును నేనె యనగా’ అనండి. ‘ఉల్లముయు’ అనరాదు.

   తొలగించండి
 22. నా రెండవ పూరణము:

  "ఎల్లఱ కనుదినము, గడున్
  జల్లఁగఁ బ్రేమ మిడు నేను, నా యీ జనకుం
  జెల్లికిఁ, బత్నికిఁ, గోడలి,

  కల్లుఁడఁ, బుత్రుండ, మగఁడ నయ్యెద వరుసన్!"

  రిప్లయితొలగించండి
 23. కల్లలు గావు నే కుటిల కంసు వధింప జనించి,వానికిన్
  బల్లిదుదైత్యరాజు బలి వంచగ వేల్పుల గన్నతల్లికిన్,
  యెల్ల సురల్ జయించి కడు హి౦స్రకు రావణు జంప సీతకు,
  న్నల్లుడ నయ్యెదన్,సుతుడ నయ్యెద,ప్రాణ విభు౦డ నయ్యెదన్

  రిప్లయితొలగించండి
 24. కొల్లలు భక్తులు గొలువగ
  నుల్లము రంజిల్ల బ్రోవ నుత్సాహము తో
  నెల్లెడ మానవ జన్మల
  నల్లుడ నౌదు సుతు నౌదు బతినే నగుదున్

  పెల్లు ఋకంగ ప్రేముడిని,పిల్లల తో భగవాను డిట్లనెన్
  "కల్లలుగావు నా కధలు, కారణ జన్మునిగా జనించితిన్
  తల్లియు దండ్రిలేక,పలు తావుల ,కానల ,నీట సాగితి
  న్నల్లుడ నయ్యెదన్ సుతుడనయ్యె ద ప్రాణ విభుండ నయ్యెదన్ "

  రిప్లయితొలగించండి
 25. కల్లరి కంసుని జంపగ,
  బల్లిదు బలి వ౦చ కశ్యపాంగనకున్ నే,
  యిల్లాలు భూమిజాతకు
  నల్లుడ బుత్రుండ మగడ నయ్యెద వరుసన్

  రిప్లయితొలగించండి
 26. మెల్లగ నాలకింపుమిక మీకిటుజెప్పెద వీరుముగ్గురున్
  చెల్లగ నాకు బంధువులు చేరుచునుందును వీరి లోయెదన్
  ఇల్లిదెయత్త, తండ్రి, సతి నిట్టుల నేనగుచుందు నయ్యెదన్
  అల్లుడ, నయ్యెదన్ సుతుడ, నయ్యెద ప్రాణవిభుండ, నయ్యెదన్.

  రిప్లయితొలగించండి
 27. మెల్లగ నాలకింపుమిక మీకిటుజెప్పెద వీరుముగ్గురున్
  చెల్లగ నాకు బంధువులు చేరుచునుందును వీరి లోయెదన్
  ఇల్లిదెయత్త, తండ్రి, సతి నిట్టుల వర్సగజూడ నయ్యెదన్
  అల్లుడ, నయ్యెదన్ సుతుడ, నయ్యెద ప్రాణవిభుండ, నయ్యెదన్.

  రిప్లయితొలగించండి
 28. ఉల్లమునందు నిల్పిన మహోన్నతుడౌ నవనీత చోరుడే
  పిల్లన గ్రోవి పాటవిని పించిన చాలును గోపబాలికల్
  నల్లని వాని జేరగను నవ్వుచు నందకిశోరుడిట్లనె
  న్నల్లుడనయ్యెదన్ సుతుడ నయ్యెద ప్రాణవిభుండనయ్యెదన్

  రిప్లయితొలగించండి
 29. ఎల్లరు దేవతల్ ధరణి నే యవతారము దాల్తు రయ్య శ్రీ
  వల్లభ రావణార్థ మన పల్కెను శ్రీ హరి మర్త్యరూపినై
  యల్ల విదేహ భూపతికి, నా దశతార్క్ష్యున, కా మహీజకున్
  అల్లుడ నయ్యెదన్, సుతుడ నయ్యెద, ప్రాణవిభుండ నయ్యెదన్.

  రిప్లయితొలగించండి
 30. ఎల్లరు దేవతల్ ధరణి నే యవతారము దాల్తు రయ్య శ్రీ
  వల్లభ రావణార్థ మన పల్కెను శ్రీ హరి మర్త్యరూపినై
  యల్ల విదేహ భూపతికి, నా దశతార్క్ష్యున, కా మహీజకున్
  అల్లుడ నయ్యెదన్, సుతుడ నయ్యెద, ప్రాణవిభుండ నయ్యెదన్.

  రిప్లయితొలగించండి
 31. తల్లిగతించనత్తనను తద్దయు మక్కువ తోడపెంచె తా
  చెల్లిగ నాన్నపూర్వమున చేసిన మేలును విస్మరించకన్
  అల్లరిపిల్లయత్తసుత హస్తము పట్టితిఁబ్రీతి, వారికిన్
  నల్లుఁడనయ్యెదన్ సుతుడనయ్యెద ప్రాణవిభుండ నయ్యెదన్

  రిప్లయితొలగించండి
 32. కామేశ్వరరావుగారు..నేనే పొరబడ్డాను.గగ మే.

  రిప్లయితొలగించండి
 33. చెల్లవు పాత నోటులని జిల్లున జెప్పెను మోడిగాడయో!
  నల్లని రూప్యముల్ గొనుచు నందన మొందుచు నాట్యమాడుచున్
  తెల్లని మోముతో వెలిగి తెల్లగ జేయుము జానకమ్మ! నీ
  కల్లుఁడ నయ్యెదన్ సుతుఁడ నయ్యెద ప్రాణవిభుండ నయ్యెదన్!

  రిప్లయితొలగించండి