శ్యామలీయం వారికి ధన్యవాదములు.అయ్యో! యీ రోజుల్లో పెళ్లి కాగానే లేకున్న పెళ్లికి మునుపే వీళ్లగురించి వారికి, వారి గురించి వీరికి తగవులు పెట్టెడు వారలు బోలెడు మంది అనే విషయంగా అలా వ్రాశానండీ!
జాలిమి? జాలియు అనటంలో కొంచెం typo అనుకుంటాను.సాగే అన్నది వ్యావహారికం - సాగెడు అంటాం సాధారణంగా కాని ఇక్కడ గగ లేదా భ ఉచితం కాదు, నల కాని జ కాని తప్పదు. 'నీలోనం సుడులు తిరుగు' అందామా?
తెలిసెను+అలుకకు అన్నప్పుడు ఉత్త్వసంధి నిత్యతవలన తెలిసెనలుకకు అనే ఔతుంది కదా. అందుచేత మొదటి పాదాన్ని 'మూలము తెలిసిన దలుకకు' అని మార్చండి. మూడవపాదంలో 'కౌగిలిఁ గొని' అనండి. చంపక రాత్రిన్ అన్నది చదువుతుంటే మాలదాసరి కథలో రాయలవారు వ్రాసిన పద్యం తలపుకు వచ్చింది. చంపకు చదువుల మేము ప ఠింపని శాస్త్రములె మా పఠింపని శ్రుతులే యింపవని నమ్మఁ వే బ్రథ మాం పిబతే వహి యనెడు మాటవుఁ గాదే
దయచేసి విరామచిహ్నాలను ఆశ్రయించకండి. వాటి అవసరం తెలుగుసాహిత్యానికి -ముఖ్యంగా - సంప్రదాయికమైన పద్యానికి లేదండి. హంసలు పాలను విడి చేయునది ఏమీ అని ఆశ్చర్యంగా ఉంది. బోర్నవిటాకీ జై - బాగుంటుంది లెండి నిజంగానే. పద్యం మాత్రం చిత్రిక పట్టాలండి.
బాలుం డెల్లర కీయ? అందరు బాలలకూ ఇవ్వగా అని మీ బావం అనుకుంటాను. బాలుండు ఏకవచనం కదండీ ఎల్లరు బహువచనం? మార్చివ్రాయండి. 'ఆపాలన్ వీడి' అంటే? ఏ పాలనూ ? స్ఫుటం కావటం లేదు. ఇంకొక ప్రయత్నం చేయాలండి.
అమిషము అంటే మీ ప్రయోగంలో అర్థం లౌకికసుఖం అనా? ఈ మాటకు అర్థం సందిగ్ధం - విరుధ్దార్థాలున్నాయి కాబట్టి - అటువంటి మాటలను జగరూకతతో వాడకపోతే అపార్థాలు వచ్చే ఇబ్బంది ఉంది. పద్యం బాగుంది.
బాలుండ్రు అన్న రూపం లేదనే అనుకుంటాను. అమిషము అంటే మాసం అని ప్రసిధ్ధార్థమే కాని 'మూల మమిషము మనస్తాపాలకుఁ' అంటే అది సముచితం కాదు - దూరాన్వయమే అవుతుంది మహా ఐతే.
శ్యామల రావు గారు "బాలుండ్రు" ప్రయోగము సాధువండి. అయినను పద్యమును సవరించితిని. దయజేసి చూడగలరు. సహదేవుడుగారు త్రిక సంధి బహుళము గాబట్టి రెండు రూపములు సాధువులే. అయిన మార్చిన పద్యములో దానిని మార్చితిని.
శ్యామల రావు (శ్యామలీయం)గారికి నమస్కారములు ధన్యవాదములు కూడాను......,,యెంతో ఓపికతో అత్యంత శ్రమ కోర్చి మా పద్యాలను సమీక్షిస్తూ మాకు చక్కని మార్గదర్శకత్వాన్ని చూపుతున్నారు.....నిన్నటి పద్యమును ప్రయాణం లో ఉండడం చేతి ఆలస్యంగా పోస్టు చేసాను దయతోమీ అమృత వచనాల నందిస్తారని మనవి.
పద్యం బాగుంది. మంచి సందర్భాన్ని ఎన్నుకున్నారు పూరణకు. 'జనింపగను' బదులు 'జనించినవి' అన్నా ఇబ్బంది లేదు. 'అట' బదులుగా'ఇటు' అనండి! మోహనాంగిట్లు అన్నది కొంచెం ఒప్పటం లేదు. 'మోహినీదేవి' అంటే సరి.
మాత్రు కాదు మాతృ. మాతృస్తనంబున అనండి లేకుంటే గణభంగం.పద్యాంతంలో నమ్మిన యటులౌ అనటం సరిగా ఉంటుంది. ఇక్కడ మాతాస్తన్యం ప్రక్కనే , ఆలు - వెలయాలు అన్న ప్రసక్తి అనుచితంగా అనిపిస్తోంది నాకు.
పెంచుమిక అనటం ఉచితమేమో మీపద్యధోరణికి? తల్లి చన్ బాలన్ గ్రోలి .. అన్నట్లుగా పూర్తిచేసారు బాగుంది. కాని చన్ + పాలు అన్నది చనుబాలుగా మారుతుంది ఎందుకంటే చన్ అని నిలవక అది చన్ను లేదా చను అని మారక తీరదు కాబట్టి. సరిచేయండి.
పద్యాలు రెండూ బాగున్నాయి. కాని పయఃపానము లేదా క్షీరపానము అన్నది సరిగా సమర్థన పొందిందా అన్నది ఆలోచించండి. మధ్యలో పాలెక్కడినుండి వచ్చాయీ అనిపిస్తోంది కదా.
బాలా! ట్యాబును తెచ్చి యిచ్చెద, మొబైల్ వాడంగ "నో"జెప్ప నేన్,
రిప్లయితొలగించండికాలేదేమి పరీక్షయంచునడుగన్, కాలేజిలో లేటుకున్
మూలంబేమని ప్రశ్న జేయనిదిగో మూడౌటు పోవంగ కో
పాలన్ వీడి ముదంబుతోడుత పయఃపానంబు సేయం దగున్!!
పద్యం బాగానే ఉంది. సమకాలీన విషయాలపై పూరణకాబట్టి అన్యదేశ్యాలపై పెద్దగా అభ్యంతరం లేదు. కోపాలన్ వీడి అన్నది బాగుంది. పద్యం నాకు అంతగా అర్థం కాలేదు!
తొలగించండిశుభోదయం !
రిప్లయితొలగించండిమేలును కీడును తెలియన్
వీలుగ విడి జేయవలె, వివేకమది జిలే
బీ!, లక్షణముగ నీళ్ళను
పాలను విడి చేయు క్షీరపానము మేలౌ
సావేజిత
జిలేబి
ఏలనయా మన్ను దినుట
రిప్లయితొలగించండినాలింపుము నాదుమాట నలమేనిదొరా!
జాలము సేయక నీ కో
పాలను విడి చేయు క్షీరపానము మేలౌ!!!
ఆలింపుము అన్నదానిపైన యడాగమమేనండి. పదాది శబ్దం అకారాది కాబట్టి 'నలమేని' అన్నపదంలోని న-కారంతో యతిమైత్రి పొరపాటు. కోపాలను వీడి అన్నది సరైన పూరణయే.
తొలగించండిఆలూమగలై పిదపన్
రిప్లయితొలగించండివేళాకోలమ్ము మాని ప్రేమలు నిలువన్
దేలెడు శోభనమున లో
పాలను విడి చేయు క్షీర పానము మేలౌ!
మంచిపూరణ. లోపాలనువీడి అనటానికి మంచి సందర్భం జోడించారు. కాని అప్పటికే పరస్పరలోపాలపై అవగాహనలు ఏమి వస్తాయా అన్నది సందేహం!
తొలగించండిశ్యామలీయం వారికి ధన్యవాదములు.అయ్యో! యీ రోజుల్లో పెళ్లి కాగానే లేకున్న పెళ్లికి మునుపే వీళ్లగురించి వారికి, వారి గురించి వీరికి తగవులు పెట్టెడు వారలు బోలెడు మంది అనే విషయంగా అలా వ్రాశానండీ!
తొలగించండిజాలిమి నోర్మియు లేకను
రిప్లయితొలగించండినీలో బెనగుచు సాగే నిష్ఠుర భావాల్
ద్రోలగ బూనుచు నీ లో
పాలను విడి చేయు క్షీర పానము మేలౌ!
జాలిమి? జాలియు అనటంలో కొంచెం typo అనుకుంటాను.సాగే అన్నది వ్యావహారికం - సాగెడు అంటాం సాధారణంగా కాని ఇక్కడ గగ లేదా భ ఉచితం కాదు, నల కాని జ కాని తప్పదు. 'నీలోనం సుడులు తిరుగు' అందామా?
తొలగించండిధన్యవాదములు... సవరిస్తాను
తొలగించండిమూలముతెలిసెనునలుకకు
రిప్లయితొలగించండిచాలునుమూతిని బిగించి చంపక రాత్రిన్
మేలగుకౌగిలిజనితా
పాలను విడిచేయు క్షీరపానము మేలౌ
తెలిసెను+అలుకకు అన్నప్పుడు ఉత్త్వసంధి నిత్యతవలన తెలిసెనలుకకు అనే ఔతుంది కదా. అందుచేత మొదటి పాదాన్ని 'మూలము తెలిసిన దలుకకు' అని మార్చండి. మూడవపాదంలో 'కౌగిలిఁ గొని' అనండి. చంపక రాత్రిన్ అన్నది చదువుతుంటే మాలదాసరి కథలో రాయలవారు వ్రాసిన పద్యం తలపుకు వచ్చింది.
తొలగించండిచంపకు చదువుల మేము ప
ఠింపని శాస్త్రములె మా పఠింపని శ్రుతులే
యింపవని నమ్మఁ వే బ్రథ
మాం పిబతే వహి యనెడు మాటవుఁ గాదే
మాలా !వినుమిది ,హంసలు
రిప్లయితొలగించండిపాలను విడి చేయు ,క్షిరపానము మేలౌ
బాలురు తెలివిగ నుంటకు
వీలగుచో బోర్నవీట వేయుము రుచికిన్
దయచేసి విరామచిహ్నాలను ఆశ్రయించకండి. వాటి అవసరం తెలుగుసాహిత్యానికి -ముఖ్యంగా - సంప్రదాయికమైన పద్యానికి లేదండి. హంసలు పాలను విడి చేయునది ఏమీ అని ఆశ్చర్యంగా ఉంది. బోర్నవిటాకీ జై - బాగుంటుంది లెండి నిజంగానే. పద్యం మాత్రం చిత్రిక పట్టాలండి.
తొలగించండిబాలెంత రోగపీడితు
రిప్లయితొలగించండిరాలయి స్తన్యమ్ము నీయ రాదని తెలుపన్
లాలించుచు శిశువుకు చను
బాలను విడి, జేయు క్షీర పానము మేలౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆలోచింపగ నొక్కవేళ నొక టర్హంబై ప్రవర్తిల్లునే
తొలగించండిబాలుం డ్రెల్లర కీయ ప్రొద్దున తమిం బాలం బలంబేర్పడున్
కాలాతీతము గాగ నెండను బడిం గందంగ దాహార్తి యా
పాలన్ వీడి ముదంబుతోడుత పయఃపానంబు సేయం దగున్
మూల మమిషము మనస్తా
పాలకుఁ బరికించి చూడఁ బ్రమదమ్ముగఁ గో
పాలను దుస్సహ సంతా
పాలను విడి చేయు క్షీరపానము మేలౌ
బాలుం డెల్లర కీయ? అందరు బాలలకూ ఇవ్వగా అని మీ బావం అనుకుంటాను. బాలుండు ఏకవచనం కదండీ ఎల్లరు బహువచనం? మార్చివ్రాయండి. 'ఆపాలన్ వీడి' అంటే? ఏ పాలనూ ? స్ఫుటం కావటం లేదు. ఇంకొక ప్రయత్నం చేయాలండి.
తొలగించండిఅమిషము అంటే మీ ప్రయోగంలో అర్థం లౌకికసుఖం అనా? ఈ మాటకు అర్థం సందిగ్ధం - విరుధ్దార్థాలున్నాయి కాబట్టి - అటువంటి మాటలను జగరూకతతో వాడకపోతే అపార్థాలు వచ్చే ఇబ్బంది ఉంది. పద్యం బాగుంది.
తొలగించండి“(బాలురు) బాలుండ్రు” అని బహువచన ప్రయోగమండి. “ఆ పాలన్” అంటే బాలురకు బలమునిచ్చునని చెప్పిన పాలని భావమండి.
తొలగించండి“అమిషము” అంటే మాంసమని యర్థము.
బాలుండ్రు అన్న రూపం లేదనే అనుకుంటాను. అమిషము అంటే మాసం అని ప్రసిధ్ధార్థమే కాని 'మూల మమిషము మనస్తాపాలకుఁ' అంటే అది సముచితం కాదు - దూరాన్వయమే అవుతుంది మహా ఐతే.
తొలగించండిచిన్న సందేహమండి. ఆ పాలను అన్నప్పుడు సంధి చేయవలసిన అవసరము యున్నదా?
తొలగించండిఆ+పాలు =అప్పాలు కాదా?
సవరించిన పూరణ:
తొలగించండిఆలోచింపగ నొక్కవేళ నొక టర్హంబై ప్రవర్తిల్లునే
బాలారిష్టము లుండ వింక నొసగం బాలన్ ప్రభాతమ్మునం
గాలాతీతము గాగ నెండను బడిం గందంగ దాహార్తి తాఁ
బాలన్ వీడి ముదంబుతోడుత పయఃపానంబు సేయం దగున్
శ్యామల రావు గారు "బాలుండ్రు" ప్రయోగము సాధువండి. అయినను పద్యమును సవరించితిని. దయజేసి చూడగలరు.
తొలగించండిసహదేవుడుగారు త్రిక సంధి బహుళము గాబట్టి రెండు రూపములు సాధువులే. అయిన మార్చిన పద్యములో దానిని మార్చితిని.
ధన్యవాదములండీ!
తొలగించండిచేలమ్ముల్ ధరియించి వేగ వెడలన్ సిద్ధుండవై రమ్మిటన్
రిప్లయితొలగించండివేళన్ దాటెను గాంచుమంటి వినుమా విద్యాలయమ్మేగ కో
పాలన్ వీడి ముదంబు తోడుత పయః పానంబు సేయందగున్
బాలా! యుక్తము కాదెఱుంగుమిక నీ పంతమ్ము చాలింపుమా.
పాలేగద యారోగ్యము
బాలల కైనన్ ముదుసలి వగ్గుల కైన
న్నేలనికయలక మరి కో
పాలను విడి చేయు క్షీరపానము మేలౌ
'వెడలన్ సిధ్ధుండవై' బదులు 'జన సంసిధ్దుండవై' అంటే బాగుంటుంది. పద్యం బాగుంది.
తొలగించండికందం కూడా బాగుంది.
శ్యామల రావు (శ్యామలీయం)గారికి నమస్కారములు ధన్యవాదములు కూడాను......,,యెంతో ఓపికతో అత్యంత శ్రమ కోర్చి మా పద్యాలను సమీక్షిస్తూ మాకు చక్కని మార్గదర్శకత్వాన్ని చూపుతున్నారు.....నిన్నటి పద్యమును ప్రయాణం లో ఉండడం చేతి ఆలస్యంగా పోస్టు చేసాను దయతోమీ అమృత వచనాల నందిస్తారని మనవి.
తొలగించండిశ్రీలం బొందిన దేవ దానవ మహాశ్రేణుల్ సమోత్సాహులై
రిప్లయితొలగించండిగ్రోలం బోవు తఱిన్ జనింపగను వైరుధ్యమ్ములచ్చోట, "నా
కేలం బంచెద" నంచు వచ్చి యట బల్కెన్ మోహనాంగిట్లు -"కో
పాలన్ వీడి ముదంబు తోడుత పయః పానంబు సేయందగున్"
పద్యం బాగుంది. మంచి సందర్భాన్ని ఎన్నుకున్నారు పూరణకు. 'జనింపగను' బదులు 'జనించినవి' అన్నా ఇబ్బంది లేదు. 'అట' బదులుగా'ఇటు' అనండి! మోహనాంగిట్లు అన్నది కొంచెం ఒప్పటం లేదు. 'మోహినీదేవి' అంటే సరి.
తొలగించండిసవరించినానండీ:
తొలగించండిశ్రీలం బొందిన దేవ దానవ మహాశ్రేణుల్ సమోత్సాహులై
గ్రోలం బోవు తఱిన్ జనించినవి వైరుధ్యమ్ములచ్చోట, "నా
కేలం బంచెద" నంచు వచ్చి ఇటు బల్కెన్ మోహినీదేవి -"కో
పాలన్ వీడి ముదంబు తోడుత పయః పానంబు సేయందగున్"
ఇప్పుడు బాగుంది.
తొలగించండితూలుచు మాటల విరివిగ
రిప్లయితొలగించండిబేలను నిందించి సతముఁ బ్రేలుట కంటెన్
లోపాలనుదిద్దుచు, కో
పాలను విడి చేయు క్షీర పానము మేలౌ
తిట్టటం బదులు పాలు త్రాగమంటారు. మంచిదే. కాని 'క్షీర' పానానికి తగిన సమర్థన కనబడదు. మొదటి పాదాన్ని 'తూలగ త్రాగుచు విరివిగ' అని మారిస్తే సరి.
తొలగించండిఆలింపుము నామాటను
రిప్లయితొలగించండివేళాపాళయును లేకవిసిగించకుమా
చాలిక పుత్రా నీకో
పాలను విడిచేయు క్షీరపానము మేలౌ.
ధార బాగుంది. 'క్షీర'పాననికి సమర్థన కొంచెం తక్కువైనదేమో. 'వేళయు పాళయును' లేక అనండి వేళాపాళా అన్నది వ్యావహారికం.
తొలగించండిబాలా మారామువలదు
రిప్లయితొలగించండికాలా తీతంబగునిట కస్తింబడకన్
వేళకు సరిగానీ కో
పాలను విడి చేయు క్షీరపానము మేలౌ
చాలీచాలని పోషకాల్ గలిగి నుత్సాహంబుమాన్పించెడిన్
రిప్లయితొలగించండిబాలారిష్టపు డబ్బిపాలనిడగా?పాపంబు శాపంబె|కో
పాలన్ వీడి ముదంబు తోడుత పయఃపానంబు సేయన్ దగున్
ఆలోచింపగ తల్లిపాలిడుట నాహ్లాదంబు నాబిడ్డకున్|
2.కాలము మాత్రు స్తనమున
పాలను విడి| చేయు క్షీరపానము మేలౌ?
ఆలిని విడి వెలయాలిని
ఆలిగభావించి నటులె నమ్మెడి పాలౌ|
ధార కనబడుతోంది. చాలీ చాలని అన్నది ఒప్పిన పక్షంలో వేళాపాళనూ ఒప్పుకోవాలి. వీలైనంతవరకూ ఇటువంటి వ్యవహారిక పదబంధాలను దూరగా ఉంచండి. తగున్+ఆలోచించగ అన్నచోట ద్రుతం నిలువక తగునాలోచించక ఐపోతుందండి. నాలుగవపాదాన్ని మార్చాలండి.
తొలగించండిమాత్రు కాదు మాతృ. మాతృస్తనంబున అనండి లేకుంటే గణభంగం.పద్యాంతంలో నమ్మిన యటులౌ అనటం సరిగా ఉంటుంది. ఇక్కడ మాతాస్తన్యం ప్రక్కనే , ఆలు - వెలయాలు అన్న ప్రసక్తి అనుచితంగా అనిపిస్తోంది నాకు.
కాలున్ గాలిన పిల్లివోలే పరుగుల్ గా పట్నవాసమ్ము,యే
రిప్లయితొలగించండివేళన్ యెగతి నుండునో యనుచు జీవించంగ,మెల్ గాదె నీ
యాలున్ బిడ్డలు బందుగుల్ కలసి యాహ్లాదమ్ముగా పల్లెలో
పాలన్ వీడి ముదంబు తోడుత పయః పానంబు సేయందగున్"
పద్యం కొంచెం చిత్రిక పట్టాలి. 'పల్లె లోపాలన్ వీడి' అన్నది సరే బాగుంది పూరణకు. పయఃపానం ప్రసక్తి అతకటం లేదే?
తొలగించండిచాలీచాలవు తల్లిపాలనుచు నెంచంబోకుమో మిత్రమా
రిప్లయితొలగించండిఆలన్ భారతమందు తల్లులకు ప్రత్యామ్నాయ మంచెంచరే
పాలన్ బిడ్డల కిచ్చి పెంచుటను నీపాపల్ వెసన్ తల్లి చన్
బాలన్ వీడి ముదంబుతోడుత పయఃపానంబు సేయం దగున్”
చాలీచాలవు తల్లిపాలనుచు నెంచంబోకుమో మిత్రమా
రిప్లయితొలగించండిఆలన్ భారతమందు తల్లులకు ప్రత్యామ్నాయ మంచెంచరే
పాలన్ బిడ్డల కిచ్చి పెంచుటను నీపాపల్ వెసన్ తల్లి చన్
బాలన్ వీడి ముదంబుతోడుత పయఃపానంబు సేయం దగున్”
పెంచుమిక అనటం ఉచితమేమో మీపద్యధోరణికి? తల్లి చన్ బాలన్ గ్రోలి .. అన్నట్లుగా పూర్తిచేసారు బాగుంది. కాని చన్ + పాలు అన్నది చనుబాలుగా మారుతుంది ఎందుకంటే చన్ అని నిలవక అది చన్ను లేదా చను అని మారక తీరదు కాబట్టి. సరిచేయండి.
తొలగించండిమేలుంగీడు లెఱుంగ బోక మదిరన్ మేధావిగా గ్రోలుచున్
రిప్లయితొలగించండిచాలీచాలని కూలి దెచ్చి కడు రుచ్యంబేది లేదంచు తా
నాలిన్ నిష్టుర మాడ బోక తృణ మైనన్ ప్రీతి మైగొంచు కో
పాలన్ వీడి ముదంబుతోడుత పయఃపానంబు సేయం దగున్
చాలని రాబడి నిడుచున్
మేలగు వంటకము లేదు మ్రింగుట కనుచు
న్నాలిని నిందించక కో
పాలను విడి చేయు క్షీరపానము మేలౌ
పద్యాలు రెండూ బాగున్నాయి. కాని పయఃపానము లేదా క్షీరపానము అన్నది సరిగా సమర్థన పొందిందా అన్నది ఆలోచించండి. మధ్యలో పాలెక్కడినుండి వచ్చాయీ అనిపిస్తోంది కదా.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[మోహిని... దేవదానవులతోఁ ’గలహాలనుఁ బరిత్యజించి, యమృతమ్మునుం గ్రోలఁగ రం’ డనుట]
"కేలం బట్టితి రీ సుధన్ మిగుల దుష్క్లేశమ్మునుం బొందియున్!
మేలౌ మీ కిఁక దీనిఁ ద్రావ నిపుడున్! మీరందఱున్ బోరునున్
ద్రోలన్ రండయ! దేవదానవులు విద్రోహాలనున్ గోపతా
పాలన్ వీడి, ముదంబుతోడుత, పయఃపానంబు సేయం దగున్!"
బాలా మారామువలదు
రిప్లయితొలగించండికాలా తీతంబగునిట కస్తింబడకన్
వేళకు సరిగా నీ కో
పాలను విడి చేయు క్షీరపానము మేలౌ
బండకాడి అంజయ్య గౌడ్ గారి పూరణ...
రిప్లయితొలగించండికం
చాలియుచాలని జీతము
కాలెడుకడుపుల వెతలను కలకాలంబున్
మేలేంచని ప్రభువుల లో
పాలను విడిచేయు క్షీరపానము మేలౌ !!
లాలూ! నీవిక జైలువీడి వడిగా రబ్రీని జేరంగ నే
రిప్లయితొలగించండిహాలాహాలము కక్కబోకనిక పేరాశల్ ను చాలించి నీ
యాలున్ తోడుగ నింటిలోన భళిగా హాయిన్ విహారించి శా
పాలన్ వీడి ముదంబుతోడుత పయఃపానంబు సేయం దగున్