తంగిరాల రఘురాం గారూ! మీప్రయత్నం చాల బాగున్నది.మీభావన కూడ చాల బాగున్నది. అమ్మ తలచుకుంటే ఏమైనా చేయగలదు. నిరంతర కృషి శ్రద్ధతో చేసిన తప్పక ఫలితముంటుంది. మొదటి పాదాంతంలో “న” తరువాత వచ్చిన “కృ” ని బట్టి గురువుగాదు. క గుణింతములో ఒక అక్షరం మాత్రమే. అది సంయుక్తాక్షరంగాదు. కావున గణం దెబ్బతిన్నది. ఇక ద్వితీయ పాదములో యతి దెబ్బతినది. అచ్ మైత్రి చెల్లినది గాని హల్ మైత్రి చెల్లలేదు. చందస్సు సాఫ్టువేర్ పూర్తిగా కరెక్టు గాదు. నాకూ మిడిమిడి జ్ఞానమే. నాకు తెలిసినది వ్రాసితిని. మరోలా భావింప వలదు.
రఘురాం గారూ, మీ పూరణ బాగున్నది. అలాగే తోపెల్ల వారు చెప్పిన సూచనలను గమనించండి. ‘బుద్ధి+ఏ’ అన్నపుడు యడాగమం వచ్చి ‘బుద్ధియే’ అవుతుంది. **** తోపెల్ల వారూ, ధన్యవాదాలు.
శర్మ గారూ, అక్(ఋ)తబుద్ధి కదా కావున గురువేకదా అని నిర్ధారించుకున్నాను. క్షమించాలి. ఇకపోతే, ఋత్వంతో రెండు వేర్వేరు హల్లులు కూడా యతి మైత్రి పొందుతాయి అని చదివాను, అందుకే అలా వాడాను.
రఘురాంగారూ. నేనే పొరబడ్డాను. శ్రీ కామేశ్వరరావుగారు చెప్పినట్లు మీరు చెప్పినట్లు యతిమైత్రి సరియైనదే. దీనిని ఋవడి అందురు. కేవల ఋ కారంతో గూడ ఏదేని వట్రసుడి గల హల్లులతో గూడ యతి చెప్పవచ్చు.
సత్కవితా విశారదులు కామేశరరావు గార్కి నమస్సులు. మీ పూరణ ద్వయబులత్యంత మనోహరంబులుగా శోభిల్లుచున్నవి. సమాసపదబంధురము విశేషార్థబోధకముగా నున్నవి. కడుంగడు అభినందనలు. నిన్నటి పద్యమునందలి దోషములను తెల్పినందులకు చాల కృతజ్ఞుడను. దోషపరిహరణము చేసి మరల ప్రయత్నము చేసితి గాని కాలాతీతమై, ఈరోజు ఉద్యోగ బాధ్యతల వల్ల సాధ్యము కాలేదు. కరుణతో గురువుగారు ఆపని పూర్తి చేసినారు. శ్రీశంకరార్యులకు వందనశతములు.
పరుషంబైన పదమ్ములన్ వదలి నీవందమ్ముగా తెన్గునన్
రిప్లయితొలగించండిసరసమ్మైన కవిత్వమున్ మనమునాస్వాదించు చున్ వ్రాయుమా
కరుణా వీక్షణియైన బ్రహ్మసతి వాక్కాంతాలలామంబు భా
రతిపాదాలకు మ్రొక్కి యీ కవనసామ్రాజ్యాన పేరొందుమా
చంద్రమౌళి సూర్యనారాయణ గారు,
తొలగించండిమీరు ప్రాసను "ర"కారముగా పొరబడ్డారు
ప్రాస సవరించి మరో పూరణ వ్రాయండి.
తొలగించండిధన్యవాదములు మాష్టారు, జిగురు సత్యనారాయణగారు. పెద్ద పొరపాటే జరిగింది
తొలగించండిమీ పద్యం చాల బాగున్నది. ప్రాసభేదంతో ఇబ్బంది వచ్చింది. పునరోత్సాహంతో మరొకటి వెలయించండి. అభినందనలతో...
తొలగించండిచంద్రమౌళి గారు మీరన్య కార్యానిమగ్నత కారణమున పూరించడానికవకాశము చిక్క లేదని భావించి మీపూరణకు కావలసిన సవరణలతోడనీ పద్యమును తిలకించండి.
తొలగించండిఅతిరిక్తంపు పదమ్ములన్ వదలి నీవందమ్ముగా తెన్గునన్
చతురమ్మైన కవిత్వమున్ మనమునాస్వాదించు చున్ వ్రాయుమా
గతరోషానన యైన బ్రహ్మసతి వాక్కాంతాలలామంబు భా
రతిపాదాలకు మ్రొక్కి యీ కవనసామ్రాజ్యాన పేరొందుమా
కార్యనిమగ్నత యని చదువ గలరు
తొలగించండి
రిప్లయితొలగించండిఅతి లావణ్యత నొప్పి భావమున సౌ
హార్దమ్ము శోభిల్లగన్
హితమై సమ్మతమై జెలంగెడు సు సా
హిత్య ప్రభా హాసమై
సిత పద్మాలయ వాసిగా బరగి నీ
సేమంబులం గోరు భా
రతి పాదాలకు మ్రొక్కి యీ కవన సా
మ్రాజ్యాన పేరొందుమా!
మనోహరంగా ఉంది. అభినందనలు.
తొలగించండిశిష్ట్లా వారూ అదరగొట్టేరు. అభినందనలు.
తొలగించండివెతలన్ బాపగ మోదమొం దగను వేవేలౌ ప్రభంధమ్ము లే
రిప్లయితొలగించండిఅతిప్రీ తిన్ రచి యింపగా వలయు కావ్యమ్మే వినన్ గాంచినన్
మితమే లేదట గ్రంధముల్ కవులు సామీరేని వ్రాయంగభా
రతిపాదాలకు మ్రొక్కియీ కవనసామ్రాజ్యాన పేరొందుమా
---------------------------------------
మతిమరపు లేక కవులట
సతతము దేవిని గొలుచుచు సౌరులు పంచన్
హితమగు కవితలు పలికి భా
రతిపాదారాధనఁ గవిరాజువు గమ్మా !
రెండూ బాగున్నవి. అభినందనలు.
తొలగించండి‘సామీరేని’...?
గ్రంధములు సామీరేని [హనుమ రాసినా]ఇంకెవరు రాసినా " అని నాఉద్దేశ్యము .అదన్నమాట
తొలగించండి‘సామీరి+ఏని’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అందుకే ఆ పదం నాకు అర్థం కాలేదు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియతియున్, బ్రాఃసల చంద
తొలగించండిమ్మతి క్లిష్టమటంచు వెఱచుటక్కర లేదోయ్?
మతినిలుపు ప్రయత్నము,భా
రతి పాదారాధనఁ గవిరాజువు గమ్మా!
బాగుంది. అభినందనలు.
తొలగించండినా రెండవ పూరణము
రిప్లయితొలగించండిప్రతి పద రూపము దానయి
యతులిత సంభావ్య భావ హారావళులం
గతులిడి నాదంబిడు భా
రతి పాదారాధన గవి రాజువు గమ్మా!
బాగున్నది. అభినందనలు.
తొలగించండిటెల్, గానా :)
రిప్లయితొలగించండిపతియే జేసెను గద ఆ
రతి పాదారాధన! గవి రాజువు గమ్మా
రతిపతి దరిజే రగ ఆ
గతుకుల బండిన సరసపు గానము జేయన్ !
చీర్స్
జిలేబి
బాగుంది. అభినందనలు.
తొలగించండిస మ స్య
రిప్లయితొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
గు రు వ ర్యు ల కు న మ స్సు లు
4 వ తే ది నే ను ప ౦ పి న ......
" శి వ క ళ్యా ణ ము " గ ణ న
లో ని కి తీ సు కొ న వ ద్దు
నే ను " శి వ క ళ్యా ణ ము " ఖ ౦ డి క
6 వ తే దీ కా నీ లే దా ..
6 వ తే దీ త ర్వా త కా నీ
మ ల్లీ ప ౦ పి స్తా ను .
ీ
.
మంచిది...
తొలగించండిస్తుతమతియయినను నీవిల
రిప్లయితొలగించండియతులిత పాండిత్య గరిమ నార్యుడవైనన్
సతతము మరువక నా భా
రతి పాదారాధన గవిరాజువు గమ్మా!
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
క్షితిలో మానవ శక్తి యుక్తులకు సంక్షేమంబు సామాన్యమే
అతిలోకంబగు శాస్త్రసంపదలు,విఖ్యాతంపుబాండిత్యముల్
ప్రతిభామూర్తిగ నిల్పగాదగవు, సంప్రాజ్యంబు సాధింప-భా
రతి పాదాలకుమ్రొక్కి యీ కవన సామ్రాజ్యాన పేరొందుమా!.
రెండూ బాగున్నవి. అభినందనలు.
తొలగించండి‘నీవిల| నతులిత...’ అనండి.
మతి లేకుండగ తాను కూర్చొనిన కొమ్మందాను ఖండించు న
రిప్లయితొలగించండికృతబుద్ధే మన కాళిదాసకవి, యా దృష్టాంత మాధారమై
ప్రతినన్బూనితి కావ్యకల్పన తపంబై, తల్లి దీవించ, “భా
రతిపాదాలకు మ్రొక్కి యీ కవనసామ్రాజ్యాన పేరొందుమా”॥
అకృతబుద్ధి = మూర్ఖుడు
తొలగించండితంగిరాల రఘురాం గారూ! మీప్రయత్నం చాల బాగున్నది.మీభావన కూడ చాల బాగున్నది. అమ్మ తలచుకుంటే ఏమైనా చేయగలదు. నిరంతర కృషి శ్రద్ధతో చేసిన తప్పక ఫలితముంటుంది. మొదటి పాదాంతంలో “న” తరువాత వచ్చిన “కృ” ని బట్టి గురువుగాదు. క గుణింతములో ఒక అక్షరం మాత్రమే. అది సంయుక్తాక్షరంగాదు. కావున గణం దెబ్బతిన్నది. ఇక ద్వితీయ పాదములో యతి దెబ్బతినది. అచ్ మైత్రి చెల్లినది గాని హల్ మైత్రి చెల్లలేదు. చందస్సు సాఫ్టువేర్ పూర్తిగా కరెక్టు గాదు. నాకూ మిడిమిడి జ్ఞానమే. నాకు తెలిసినది వ్రాసితిని. మరోలా భావింప వలదు.
తొలగించండిరఘురాం గారూ, మీ పూరణ బాగున్నది.
తొలగించండిఅలాగే తోపెల్ల వారు చెప్పిన సూచనలను గమనించండి. ‘బుద్ధి+ఏ’ అన్నపుడు యడాగమం వచ్చి ‘బుద్ధియే’ అవుతుంది.
****
తోపెల్ల వారూ,
ధన్యవాదాలు.
శర్మ గారూ, అక్(ఋ)తబుద్ధి కదా కావున గురువేకదా అని నిర్ధారించుకున్నాను. క్షమించాలి. ఇకపోతే, ఋత్వంతో రెండు వేర్వేరు హల్లులు కూడా యతి మైత్రి పొందుతాయి అని చదివాను, అందుకే అలా వాడాను.
తొలగించండిగురువుగారూ, యడాగమం నన్ను మళ్ళీ దెబ్బ తీసింది!!
కృ, దృ లకు యతి మైత్రి చెల్లుతుంది. కృ వలన పూర్వాక్షరము గురువవ్వదు.
తొలగించండిరఘురాంగారూ. నేనే పొరబడ్డాను. శ్రీ కామేశ్వరరావుగారు చెప్పినట్లు మీరు చెప్పినట్లు యతిమైత్రి సరియైనదే. దీనిని ఋవడి అందురు. కేవల ఋ కారంతో గూడ ఏదేని వట్రసుడి గల హల్లులతో గూడ యతి చెప్పవచ్చు.
తొలగించండిమతినిల్పి తెలుగు భాషను
రిప్లయితొలగించండిసతతము సాధనను జల్ప సత్ఫలితమిడున్
శతదృతి ప్రియసఖి యౌ భా
రతిపాదారాధనఁగవి రాజువుగమ్మా!
బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశృతి సూక్త్యాదర ణార్హ చంద్రముఖి నిశ్శేషాఘ విధ్వంసియున్
తొలగించండినత పాకారి ముఖామృతాశిగణ వీణా గాన సంభావ్య సై
కత రమ్యస్థల హర్షయున్ సుజన శోకక్షీణ సద్భాతి భా
రతి పాదాలకు మ్రొక్కి యీ కవన సామ్రాజ్యాన పేరొందుమా
సతతము సత్కవి కృత స
న్నుత కావ్య పఠనము లందు తుష్ట మనమున
న్నతులిత భక్తిని యా భా
రతిపాదారాధనఁ గవిరాజువు గమ్మా!
సత్కవితా విశారదులు కామేశరరావు గార్కి నమస్సులు. మీ పూరణ ద్వయబులత్యంత మనోహరంబులుగా శోభిల్లుచున్నవి. సమాసపదబంధురము విశేషార్థబోధకముగా నున్నవి. కడుంగడు అభినందనలు.
తొలగించండినిన్నటి పద్యమునందలి దోషములను తెల్పినందులకు చాల కృతజ్ఞుడను. దోషపరిహరణము చేసి మరల ప్రయత్నము చేసితి గాని కాలాతీతమై, ఈరోజు ఉద్యోగ బాధ్యతల వల్ల సాధ్యము కాలేదు. కరుణతో గురువుగారు ఆపని పూర్తి చేసినారు. శ్రీశంకరార్యులకు వందనశతములు.
కవన సామ్రాజ్యాన పేరొందగలిగే పూరణలు మీవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కడుంగడు ధన్యవాదములు.
తొలగించండిశర్మ గారూ ధన్యవాదములు. కంద పద్యములో నిత్య సంధి యతి వేసాను. గమనించారా?
మతి పెంపొందగ జనులకు
రిప్లయితొలగించండిహితవును జేకూర్చునట్టి యీతిహాసములన్
చతురత కృతి సేయుచు భా
రతిపాదారాధనఁ గవిరాజువు గమ్మా!
బాగుంది. అభినందనలు.
తొలగించండిమీ పద్యాలలో కనీసం ఒక్కటైనా టైపు దోషం ఉండాలని నియమం పెట్టుకున్నట్టున్నారు!
ప్రతిపదమున మధువులొలుక
రిప్లయితొలగించండిహితమగు పద్యములనల్లి యింపును గూర్చన్
సతతము కృపగోరుచు భా
రతి పాదాఱాధన గవిరాజువు గమ్మా!!!
బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇతిహాసమ్ముల నెఱగియు
రిప్లయితొలగించండిక్రతువుగ పఠనాభిలాష గలిగియు భక్తిన్
సతతమ్ము జేయుచును భా
రతిపాదారాధన, గవి రాజువు గమ్మా
ప్రతిపాదించెద గాంచుమోయి, కవిగాపాండిత్యమెంతున్న, స
త్కృతులన్ వ్రాయుచు గొప్ప సత్కవులుగా కీర్తిన్నిలన్ బొంద నీ
వితిహాసమ్ము పురాణముల్ సకలమౌవిజ్ఞానమున్ నేర్చి భా
రతి పాదాలకు మ్రొక్కి యీ కవన సామ్రాజ్యానపేరొందుమా.
రెండూ బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఅతులిత భక్తిన్ గొల్చుచు
రిప్లయితొలగించండివెతలను సతతమ్ము బాపు విఘ్నేశ్వరునిన్
ప్రతి దినమున్ జేయుచు భా
రతి పాదారాధన గవిరాజువు గమ్మా!
బాగుంది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసతతము తదేకముగ స
న్మతితోడరతిపతిజనకు మనసారంగన్
నుతియించితీవిపుడు భా
రతి పాదారాధన కవిరాజువు గమ్మా
బాగుంది. అభినందనలు.
తొలగించండిసతతము భక్తియు కవనము
రిప్లయితొలగించండిజతయై పలికెడు హితవులు జయమొనరింపన్!
గతి తప్పక జేయుచు భా
రతి పాదారాధన గవి రాజువు గమ్మా!
బాగుంది. అభినందనలు.
తొలగించండి.హితమౌసూక్తుల పంక్తులన్నిడగ సాహిత్యాన సంతోష భా
రిప్లయితొలగించండిరతి పాదాలకు మ్రొక్కియీ కవన సామ్రాజ్యానపేరొందుమా
అతిగా నూహలుబంచి పెంచి ప్రతిపద్యంబందు హృద్యమ్ముగా
కృతులన్ వ్రాయగ మానసంబుకిడు సంకేతంబుమీకబ్బుగా|
2.మతికిన్ సమ్మతి గూర్చెడి
ప్రతి పదమును రత్నమట్లురాజిల్లుట చే
అతిగా వ్రాయుట కౌ|భా
రతిపాదారాధన గవి రాజువు గమ్మా
బాగున్నవి. అభినందనలు.
తొలగించండివెతలను మరచుచు మదిలో
రిప్లయితొలగించండిసతతము గురువుల దలచుచు సద్భావనతో
మతినొసగుమనుచు యాభా
రతి పాదారాధన గవిరాజువు గమ్మా
బాగుంది. అభినందనలు.
తొలగించండిభృతికై సాగుచు మృత్యువొంది యటుపై ప్రేతాత్మవై నిల్వకన్
రిప్లయితొలగించండిక్షితి విజ్ఞానము వేద సారమును రాశీ భూతమై యొప్పగా
పతి సృష్టించిన మానవాళి బ్రతుకుల్ బంగారమై వెల్గ భా
రతిపాదాలకు మ్రొక్కి యీ కవనసామ్రాజ్యాన పేరొందుమా!
స్తితమతి వై చతురత తో
వ్రతముగ పటుతర విశిష్ట రచనా సక్తిన్
బ్రతుకగ , నా విధి సతి భా
రతిపాదారాధనఁ గవిరాజువు గమ్మా!
రెండూ బాగున్నవి. అభినందనలు.
తొలగించండి‘స్థితమతి’... స్తితమతి అయింది.
గతితప్పక గురుపాఠా
రిప్లయితొలగించండిలతి రయముననేర్చి “శంకరాభరణము”లో
సతతక వితాసృ జనఁ భా
రతి పాదారాధనఁ గవిరాజువు గమ్మా!.
బాగుంది. అభినందనలు.
తొలగించండిధృతితో పెద్దల కావ్యముల్ పఠన దీక్షన్ బూని కావించుచున్
రిప్లయితొలగించండిసతమున్ మాధవు నీరజోదరుని సద్భక్తిం యుపాసించుచున్
మతి సంతృప్తిగ తల్చుచున్ సతము మంజుప్రాణు దేవేరి భా
రతి పాదాలకు మ్రొక్కి యీ కవన సాంబ్రాజ్యాన పేరొందుమా!
మంజుప్రాణుడుః బ్రహ్మ
మీ ప్రయత్నం ప్రశంసనీయం. మూడు పాదాల్లోను యతి తప్పింది. 14వ స్థానానికి బదులు 13వ స్థానంలో యతి వేశారు. సవరించండి.
తొలగించండిగురువర్యులకు నమస్సులు. సవరించిన పూరణ పరిశీలించండి.
రిప్లయితొలగించండిధృతితో పెద్దల కావ్యముల్ పఠన స్ఫూర్తిన్ జేయుచున్, ధీక్షతో
సతమున్ మాధవు నీరజోదరుని విశ్వాత్మున్ మదిన్ దల్చుచున్
గతినీవేయని యిచ్ఛతోడుతను వాగ్భామన్ హృదిన్ నిల్పి భా
రతి పాదాలకు మ్రొక్కి యీ కవన సాంబ్రాజ్యాన పేరొందుమా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅతిగా వ్రాయుచు కావ్యముల్ మరచుచున్ హాయిన్ సదా ఛందముల్
రిప్లయితొలగించండియతులన్ ప్రాసలు దొబ్బబెట్టుచును సయ్యాటంపు పద్యాలలో
వ్రతముల్ సల్పుచు మాటిమాటికిని నార్భాటమ్ము గావించి భా
రతిపాదాలకు మ్రొక్కి యీ కవనసామ్రాజ్యాన పేరొందుమా???