15, జూన్ 2016, బుధవారం

నిషిద్ధాక్షరి - 33

కవిమిత్రులారా,
అంశం - కుచేల వృత్తాంతము.
నిషిద్ధాక్షరము - క (క, దాని గుణితములు, అది సంయుక్తమైన అక్షరములు)
ఛందస్సు - మీ ఇష్టము.

40 కామెంట్‌లు:

  1. నందనందను తోడుత నందగించి
    చదివె నాతడు సాందీపు సదన మందు
    చొరవ దోడుత నాతని జూడ బోవ
    వెన్ను డిచ్చెను సంపద వన్నె లలర!

    రిప్లయితొలగించండి
  2. నేస్తము తెచ్చిన చుడువా
    పస్తులు జేసిన విథమున పటపటలాడెన్
    మస్తుగ దుడ్డిచ్చితివట
    దోస్తీ నీతోడఁ జేయ తొలగు గరీబీ!!

    రిప్లయితొలగించండి
  3. శ్యామసుందరు స్నేహ మాధురి జన్మ జన్మల భాగ్యమై
    లేమినే మరిపించ ,నిర్ధను, లీల దాచగ వాంఛలున్

    ప్రేమతో బలరాము తమ్ముడు పేద మిత్రుని జూసి శ్రీ
    ధామ సంపద నంద జేసి సుధాము బాముల మాపెనే

    రిప్లయితొలగించండి
  4. దరిజేరిన సచివుని గని
    పరిచర్యలు జేసి మిగుల పరమ ప్రీతిన్
    విరిసెను సుధాముని వసతి
    సిరులను గురిపించె నంట స్నేహపు వరమౌ

    రిప్లయితొలగించండి
  5. శుభోదయం !

    మిత్రుడ వటంచు వచ్చెను
    చిత్రము నవలీల నతని చింతలు తీరెన్ !
    పత్రము పుష్పము ఫలముల
    చత్రము నిడుదును మురారి చరణము జేరన్ !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. బాల్య మిత్రు డగుట బహుసంపదల నొందె
    నలసు ధా ముడార్య !హరిని వలన
    చిన్న నాటి నెయ్య మెన్నంగ గొప్పది
    జీవి తాంతము మన చెంత నుండు

    రిప్లయితొలగించండి
  7. ఇల్లాలంపగ మిత్రుని
    ఖిల్లా జేరంగ బాసె ఖేదము లెన్నో!
    యుల్లాస మంద పుడమిన్
    పెళ్లాం చెబితే వినాలి! విజ్ఙత గలుగన్!

    రిప్లయితొలగించండి
  8. సాందీప మౌని శిష్యుడు
    నందాంగన చిన్న వాడు నల్లనివాడే
    విందారగించి దయతో
    బందేరము జేసె సిరుల బాపనియింటన్.


    రిప్లయితొలగించండి
  9. విపరీతము గాదె తలుపఁ
    గృపఁ జూడఁ గుచేలుని నిడి హృదయమ్మందున్
    విపులమ్ముగ గోవిందుడు
    చిపిటాశనుడై యొసగెను సిరి సంపదలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇందు "క" అక్షరము కన్పింపమి గమనించగోర్తాను.

      తొలగించండి
    2. విపరీత దరిద్రుండును
      దపోనిరతుడు నిజసఖుడు దననుం జూడన్
      విపులమ్ముగ గోవిందుడు
      చిపిటాశనుడై యొసగెను సిరి సంపదలన్

      తొలగించండి
    3. తరళము:
      ధరణి దేవుడు నిత్య సత్య పథమ్ము వాడు సుధాముడుం
      బరగె మాధవు బాల్యమిత్రు డపార పుణ్య ఫలమ్మునన్
      వరదుఁ జూడగ నేగ యిచ్చె నపార సంపద లంతటన్
      గురు మహత్వము జూపగన్నడుగుల్ తినంగ మురారియే

      తొలగించండి
    4. చిన్న సవరణ తో

      ధరణి దేవుడు నిత్య సత్య పథమ్ము వాడు సుధాముడుం
      బరగె మాధవు బాల్యమిత్రు డపార పుణ్య ఫలమ్మునన్
      వరదుఁ జూడగ నేగ యిచ్చె నపార సంపద లంతటన్
      గురు మహత్వము చాటగన్నడుగుల్ తమిం దిని వెన్నుడున్

      తొలగించండి
  10. సిగ్గుపడుచున్న మిత్రుని చేరదీసి
    చిపిటముల మూటను గ్రహించి చెంతనుండి
    హరుసమున పార్థసారథి యారగించి
    యిచ్చె నుపార్జనమ్ముల నింపుగాను
    చిపిటములుః అటుకులు

    రిప్లయితొలగించండి
  11. సాందీప మౌని శిష్యుడు
    నందాంగన చిన్న వాడు నల్లనివాడే
    విందారగించి దయతో
    బందేరము జేసె సిరుల బాపనియింటన్.


    రిప్లయితొలగించండి
  12. స్మితవదనంబున చెలువుడు
    గతనెయ్యపు బరిచయాలు గాఢతదెలుపన్
    వెతలను దీర్పగ శ్రీపతి
    మితిమీరిన ధనమునిచ్చి మిత్రునిగాచెన్.

    రిప్లయితొలగించండి
  13. నమస్సులు కామేశ్వరరావు గారు...అటుకుల పర్యాయపదమైన "చిపిట " పదప్రయోగం అమోఘం
    నిఘంటు పరిజ్ఞానానికి నిదర్శనము. మీ పద్యంలో సంధివశాన క
    కారాలు గ కారాలైనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణగారు నమస్కారములు. సంధి వలన వచ్చిన గ కారములామోదయోగ్యమేనా? తెలుప గోర్తాను. "క" నిషిద్ధమయినట్లేనా?

      తొలగించండి
    2. సుకవి మిత్రులు పొన్నెకంటివారికి....పోచిరాజు వారికి నమస్సులు!

      సంధివశమునఁ గకారము, గకారముగ మారినందునఁ బోచిరాజు వారి పద్యమున "క"కారము నియమము ప్రకారము రాలేదనియే చెప్పవలెను. క...నిషిద్ధము. గ...నిషిద్ధము కాదుగదా! కావున "కకార నిషేధము"నకు భంగము రానట్టుగనే భావింపవలెను.

      మీ పద్యమునను (పొన్నెకంటివారి)...
      మూఁడవ పాదమున...తీర్పన్ + కన్...తీర్పఁగన్...వచ్చినది.
      నాల్గవ పాదమున...మిత్రునిన్ + కాఁచెన్...మిత్రునిఁ గాచెన్...వచ్చినది.
      ఇది దోషముగఁ బరిగణింపఁబడదనియే నా యభిప్రాయము.
      స్వస్తి.

      తొలగించండి
    3. కవీంద్రులు మధుసూదన్ గారు నమస్కారములు. నాభావన సరియైనదని మీ వివరణ వలన నవగతమైనది. ధన్యవాదములు.

      తొలగించండి
  14. ఆ సురగణ వందితుడధి
    వాసముచే సేవలనిడి వేసట దీర్చెన్
    దోసిట చిపిటంబుల దిని
    హాసమ్మున నఖిల సౌఖ్య వాసము లిచ్చెన్

    రిప్లయితొలగించండి
  15. చిరుగు పాతలో తెచ్చిన చిన్న ముల్లె
    వాసుదేవుని చెలిమితో వన్నె లందె!
    యంత, విరిసె సిరుల వాన! యంతరములు
    మైత్రినంట బోవని చాటె మాధవుండు!

    రిప్లయితొలగించండి
  16. మిత్రులందఱకు నమస్సులు!

    తేటగీతి:
    చిన్ననాఁటి విద్యార్థులు మిన్నలయ్యు,
    నొండు రాజయ్యె, నిర్ధనుం డొండు నయ్యె!
    వృష్ణి దర్శింపఁ, జిపిటముల్ బ్రేమఁ గొనియుఁ,
    గూర్మి ధనమిచ్చియు, సుధాముఁ బేర్మిఁ బ్రోచె!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణముతో...

      తేటగీతి:
      చిన్ననాఁటి విద్యార్థులు మిన్నలయ్యు,
      నొండు రాజయ్యె, నిర్ధనుం డొండు నయ్యె!
      వృష్ణి దర్శింపఁ, జిపిటముల్ ప్రేమఁ గొనియుఁ,
      గూర్మి ధనమిచ్చియు, సుధాముఁ బేర్మిఁ బ్రోచె!!

      తొలగించండి
  17. విద్య లెన్ని యున్న బీదతనమ్ముతో
    విధిని మార్చలేని విష్ణు సచియె
    భార్య బోధ జేయ బట్టెడు వడ్లను
    బెట్ట వెన్ను నోట బుట్టె సిరులు!!!



    గుప్పెడు చిపిటము లీయుచు
    విప్పగు సిరులన్ గ్రహించు వెన్నుని హితుడా!
    గొప్పదయా నీజన్మము
    అప్పనముగ వచ్చి బడెను యర్ధంబిలలో!!!


    మస్తుగ విద్యలు నేర్చిన
    పస్తులతో గడుపు చున్న బాల్యసగంధున్
    హస్తముల వడ్లు చవిగొని
    శస్తములగు సిరుల నిడెడు సవ్యుడ జేజే!!!


    పురుషోత్తమునే హితునిగ
    వరముగ మరి బొందినావె బ్రాహ్మణ శ్రేష్ఠా!
    ధరలో యింతటి భాగ్యము
    నొరులెవ్వరు బొందగలరె యో గుణశీలీ!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారు మీ పద్యాలు వేమన పద్యాలవలె మనోహరముగా నున్నవి. చదువుతుంటే హాయినిచ్చాయి. అభినందనలు. మరొక్క విషయమాయనకు సిరులప్పనముగా రాలేదండోయి. మహాభక్తుడు నిష్కాముడు గనుక వచ్చాయి.

      తొలగించండి
    2. చాలా చాలా ధన్యవాదములు సర్..మీ అభినందనలు నాకు చాలా సంతోషాన్ని కల్గించాయి...అప్పనము ను బహుమతి, కానుక అన్న అర్ధం లో వాడాను..

      తొలగించండి
    3. కేవలము హాస్యానికే అన్నానండి. అందులో తప్పేమి లేదు.

      తొలగించండి
  18. సీ॥
    విద్యయు బుద్ధియున్ వినయంబు నార్జించె
    గోవిందుడు సుధాము గురువు చెంత
    దినములు గడువగ దీనతనొందె సు
    ధాము గోవిందయె తానధిపతి
    మిత్రుని ప్రాపు నిమిత్తము జనిగొనె
    బ్రాహ్మడు చిపిటముల్ బహుమతిగను
    మెచ్చు సమ్మానమ్ము మచ్చికనిడుచుండ
    వచ్చిన పనిమర్చె బాపనయ్య॥

    తే॥
    వట్టి చేతుల వెనుదీసె బ్రాహ్మణుండు
    సర్వమెరిగి యఖిల సుఖసంపదలును
    వేనవేలుగా నిచ్చెనే వేణుధరుడు
    మైత్రియన నిర్వచనముగా మాదియనగ॥

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మచ్చికనిడుచుండ బదులు ముచ్చటనిడుచుండ అని చదువగలరు. నిషిద్ధాక్షరం గమనించలేదు!

      తొలగించండి
  19. బండకాడి అంజయ్య గౌడ్ గారి పూరణము:

    సీస..
    పూతన జితుతోడ పూజ్య సాందీపుని
    .....వద్ద విద్యలునేర్చె వాసిగాను
    ఎనలేని దారిద్ర్యమనుభవించెను గాని
    .....పరులను వేడని ప్రాజ్ఞుడతడు
    హరినామ కీర్తన మన్ని వేళల యందు
    .....మరువని పుణ్యుడు మహితలమున
    తనపత్నిబలిమితో తండూలములు గొని
    .....వాసుదేవుని జేరె భాసురముగ
    తే.గీ.
    స్నేహితుని చూచి వనమాలి శీఘ్రముగను
    అష్ట సతులతో నెదురేగి యాదరించ
    పరమ సంతోష భరితుడై వచ్చిన పని
    మరచి, తరలిన మిత్రుని మాధవుండు
    సాగనంపెను ఎనలేని సంపద నిడి !!

    రిప్లయితొలగించండి
  20. సంతు జూడగ సప్త వింశతి భుజింప
    ప్రాశనము గృహమందు నిప్పచ్చరమ్ము
    ఆలి పనుపున యదునాధు నాశ్రయింప
    బొ౦దె సిరులు సుదాముడు పుణ్యశీలి

    రిప్లయితొలగించండి
  21. ఆసుధాముని నష్టమ్మునణచ నెంచి
    సిరులు వరలంగ వెన్నుడు మరల జేసె
    గురువు చెంతన శిష్యులు మరువలేని
    మమత మాధుర్యమేబంచ?తరుగదెపుడు|

    రిప్లయితొలగించండి