ఇదీ ఒక రకమైన పూరణమే. ఇటువంటి పూరణలు చేయడంలో శంకరాభరణం ఆస్థానంలో పోచిరాజు సుబ్బారావు గారు ముందుంటారు. సాయంత్రంలోగా వచ్చే మిగిలిన కవిమిత్రుల పూరణలను పరిశీలించండి. మీకే అర్థమౌతుంది.
నే ను ఉ ద య ము ఐ దు గ ౦ ట ల కే లే చి " శా బ క " ప దా న్ని ఉ ప యో గి ౦ చి పూ ర ణ చే శా ను . నా ద గ్గ ర cell ను ౦ చి పో దు క ను క . బె ౦ గ ళూ ర్ లో ను న్న మా కూ తు రు cell ద్వా రా బ్లా గు కు ప ౦ పి ౦ చా ను . కా నీ , ఇ ౦ త కు లో గా నా క న్న ము ౦ దే శ్రీ యుత మ ధు సూ ద న్ గా రి ద్వా రా మరియు శ్రీ గు రు వు గా రి ద్వా రా "రె ౦ డు శా బ క ము లు " వ చ్చి చే రి న వి .
‘శాబకము’ జోలికి ఎవ్వరూ వెళ్ళలేదు కదా అని నేను నా పూరణను ‘ఒక కాంతారము..’ అని ప్రారంభించి, టైప్ చేసి పెట్టేలోగా గుండు వారు శాబకంతో, ‘ఒక కాంతారము..’ అని ప్రారంభించి బొడ్డు వారూ పూరణలు పెట్టేశారు. ఇదే కాకతాళీయం అంటే! పాపం... ఆ కాకికి ఒకటే తాటిపండు పడితే నా మీద రెండు పడ్డాయి!
కవిరాజశేఖరులు మధుసూదన్ గారు మీ ప్రశంస నందుకున్నందులకు మహదానందముగనున్నది నాకు. ధన్యవాదములు. మీ వృత్త పూరణ ని చాలాసార్లు చదివాను నేనంతగా నచ్చినది నాకు. శిష్ట్లా శర్మ గారు నమస్సులు. మీ పేరు చూచినప్పుడల్లా నాకు మా యున్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ ఎల్ నారాయణ గారు (శిష్ట్లా) గుర్తుకు వస్తారు. మీకు నా ధన్యవాదములు. మీపూరణ చమత్కారము తో శోభిల్లుచున్నది. అభినందనలు. ఇది యంతా మన పూజ్య గురువు గారి చేతి చలువ.
మిత్రులు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు! మీరు సూచనలు బాగున్నాయి. స్నాయు బద్ధ కుసుమ చయము...అనడం బాగుంటుంది. నేను నేరుగా (ఆశువుగా) టైపు చేయుటచేత, నాకు అప్పటికి తోచిన విధంగా (సామంజస్యాన్ని పరిశీలిస్తూనే)పూరణ చేశాను.
రెండవ సూచనలో...భక్తి చూపడం అవసరమా? ప్రేమ చూపితే బాగుంటుందేమో. మొత్తానికి నా పూరణ మీ మెప్పును పొందినందులకు ధన్యవాదాలు!
ఈరోజు సుదినం. చాలా మంది కవులు మిత్రుల పూరణలపై వ్యాఖ్యానించారు. పూరణలు చేసిన మిత్రులు కేవలం నా సమీక్షనే కాకుండా తోటి కవుల ప్రశంసనలను, సూచలన కోసం ఎదురు చూస్తారు. సాటి కవుల ప్రశంసలు వారికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీ సూచనలు ఔత్సాహిక కవులకు మార్గదర్శకా లవుతాయి. అందరికీ ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుకంసుడంపుజేత కర్వరుండొక్కడు
తొలగించుబకపు రూప మందు పరగి యుండి
యసురమాయజేత యాగోపవనములో
బకము రేగి జింక ప్రాణముఁ గొనె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు‘కంసరాజు పంప’ అంటే బాగుంటుందేమో?
గురువుగారూ, సవరణకి ధన్యవాదములు.
తొలగించునమస్కారములు
రిప్లయితొలగించుగురువుగారు క్షమించాలి వృత్తపాదం సరిగా అర్ధమవడం లేదని పిస్తోంది.
అక్కయ్యా, సవరించాను.
తొలగించు
రిప్లయితొలగించుశుభోదయం !
చేయట మెట్లా గో తెలియక బాల్ బేక్ ఇన్ ది కోర్ట్ :)
వాక్యము చదివి మతి వడదెబ్బ తినెను బో !
పూర్తి జేయ తెలివి పొంక లేదు !
బకము రేగి జింక ప్రాణముఁ గొనెనెట్లు ?
కథ వివరము తెలుపు కంది వర్య !
సావేజిత
జిలేబి
ఇదీ ఒక రకమైన పూరణమే. ఇటువంటి పూరణలు చేయడంలో శంకరాభరణం ఆస్థానంలో పోచిరాజు సుబ్బారావు గారు ముందుంటారు.
తొలగించుసాయంత్రంలోగా వచ్చే మిగిలిన కవిమిత్రుల పూరణలను పరిశీలించండి. మీకే అర్థమౌతుంది.
కృష్ణసారము నట మృగరాజు వెంటాడ
రిప్లయితొలగించుహరిని గూల్చి లేడి నరయు నంత
వేట గాని చేతి వాటము సడల, నం
బకము రేగి జింక ప్రాణము గొనె!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుచెరువు లోన దిరుగు చేపను తినగోరి
రిప్లయితొలగించుబకము రేగి,జింక ప్రాణముఁ గొనె
సింగ మొకటి జూచి చెలరేగి పైబడి
విందు నార గించె వేడు కనుచు
అక్కయ్యా,
తొలగించుమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘తినగోరె’ అంటే అన్వయం కుదురుతుంది.
చెరువు లోన దిరుగు చేపను తినగోరె
తొలగించుబకము రేగి,జింక ప్రాణముఁ గొనె
సింగ మొకటి జూచి చెలరేగి పైబడి
విందు నార గించె వేడు కనుచు
చెంగున తిరుగాడు చిత్రమౌ జింకను
రిప్లయితొలగించుకాంచి సీత, పతికి కాంక్షతెలిపె
రాత్రిచరుని మాయ లంకారి యెఱగ నం
బకము రేగి జింక ప్రాణముఁగొనె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుగురువుగారూ, వృత్తం మత్తేభం కావలసి ఉన్నట్టుంది, కాని చివర రెండు "ర" గణాలు వచ్చాయి. సవరించగలరా?
రిప్లయితొలగించుఅక్కయ్యా, రఘురాం గారూ,
రిప్లయితొలగించుధన్యవాదాలు. రాత్రి నిద్రాసక్తితో తప్పుగా షెడ్యూల్ చేశాను. సవరించాను.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించుహరిణ మొకటి గడ్డి పరకలు మేయుచు
నుండె! దానిఁ గనుచు నుండ, మిగుల
నాఁకలి యయి, వేగ నచ్చటి సింహ శా
బకము రేఁగి జింక ప్రాణముఁ గొనె!
నేనాశించిన ‘సింహశాబకాన్ని’ మీరు పట్టుకున్నారు. చక్కని పూరణ. అభినందనలు.
తొలగించుధన్యవాదాలు శంకరయ్య గారూ!
తొలగించుఈవిధముగనే వృత్తమందు నా పూరణము:
"సక లారణ్య చతుష్పదాది తతి మత్సంభోజనార్థ ప్రకా
శకమై జన్మఁ గొనెన్ గదా!" యని మృగాస్యం బా యెడన్ దత్పశు
ప్రకరంబున్ దినుచుండఁగాఁ, గనుచు, సభ్రాంతి స్థితోత్సేక సింహ శా
బక, ముద్వృత్తిని, జింక ప్రాణముఁ గొనెన్! బాపంబుగా నెంచదే?
మూఁడవ పాదమున గణభంగమయినది. చిన్న సవరణముతో....
తొలగించు"సక లారణ్య చతుష్పదాది తతి మత్సంభోజనార్థ ప్రకా
శకమై జన్మఁ గొనెన్ గదా!" యని మృగాస్యం బా యెడన్ దత్పశు
ప్రకరంబున్ దినుచుండఁగాఁ, గనుచు, సభ్రాంతిన్ వెసన్ సింహ శా
బక, ముద్వృత్తిని, జింక ప్రాణముఁ గొనెన్! బాపంబుగా నెంచదే?
మఱొక చిన్న సవరణముతో...
తొలగించు"సక లారణ్య చతుష్పదాది తతి మత్సంభోజనార్థ ప్రకా
శకమై జన్మఁ గొనెన్ గదా!" యని మృగాస్యం బా యెడన్ దత్పశు
ప్రకరంబున్ దినుచుండఁగాఁ, గనుచు, సభ్రాంతి స్థితిన్, సింహ శా
బక, ముద్వృత్తిని, జింక ప్రాణముఁ గొనెన్! బాపంబుగా నెంచదే?
మీ వృత్త పూరణం అద్భుతంగా ఉంది. అభినందనలు.
తొలగించుధన్యవాదాలు శంకరయ్య గారూ! _/\_
తొలగించుఒక కాంతారమునందునొక్క దినమందొక్కండు వేటాడ నో
రిప్లయితొలగించుపికగానుండ జలాశయమ్ము కడ దప్పిన్గొన్న జింకల్ వడిన్
నికరంబై పరుగెత్తుచుండ కసిగా నీచుండు వేయంగ నం
బక ముద్వృత్తిని జింక ప్రాణముఁ గొనెన్ బాపం బంచు భావింపదే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఒక కాంతారమునన్ వసించుఁ గద నెన్నో జంతువుల్; వేట మా
రిప్లయితొలగించునక క్రూరంబుగ మాంసభక్షణరతి న్సంచారముం జేసి ప
చ్చిక భక్షించు మృగమ్ముఁ గాంచి తినఁ గాంక్షించెన్ దమిన్ సింహశా
బక ముద్వృత్తిని జింక ప్రాణముఁ గొనెన్ బాపంబుగా నెంచదే.
(ఏదో కిట్టించాను. తృప్తికరంగా లేదు)
గుండు మధుసూదన్, బొడ్డు శంకరయ్య గారల పూరణలను ముందే చూసి ఉంటే నా పూరణను పెట్టకపోయేవాణ్ణి. వాళ్ళిద్దరి పూరణల కలగలుపుగా ఉంది నా పూరణ...
తొలగించుకంది వారు :)
తొలగించుఅందులో కూడా బకము వచ్చిందండోయ్ :) కలగలపు = కదంబకం :)
బాగుంది కొత్త పదం ! శాబకం !
నెనర్లు
జిలేబి
పూరణకు ‘కిటుకు’ దొరికింది కదా! ఇక మీదే ఆలస్యం...
తొలగించుమిత్రులు శంకరయ్యగారూ...
తొలగించుమీ పూరణము చాలా బాగున్నది. బొడ్డువారి పూరణము కన్న...నా పూరణము కన్న మీ పూరణమే బాగున్నది. అభినందనలు!
నా పూరణలో ‘...గద యెన్నో’ అనవలసింది ‘...గద నెన్నో’ అన్నాను. మన్నించండి.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించు
తొలగించుగుండు వారు !
నమహో నమః !
జిలేబి
కవీంద్రులకు నమస్సులు...మీ పూరణమద్భుతము
తొలగించుమిత్రులు...
తొలగించుజిలేబీ గారికి...
శర్మ గారికి...
ధన్యవాదాలు!
_/\_
బకము రేగి జింక ప్రాణము గొనెనట
రిప్లయితొలగించుయేమి చిత్ర మిదియ యెక్క డైన
సంభ వించు నట్లు జాడతెలిసె నిల ?
వేరు వేరు వాటి వేసరములు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ శా ర్దూ ల శా బ క ము = పు లి పి ల్ల ;
మి థ్యా మ తి న్ = బు ధ్ధి శూ న్య త చే ;
హి ౦ స క ము = క్రూ ర జ ౦ తు వు }
అకటా , సృష్టిని , జీవి - జీవి కగు
నాహార౦బు | శార్దూల శా
బక ముద్వృత్తిని జి౦క ప్రాణము గొనెన్ ,
పాప౦ బ౦చు భావి౦ప | దే
ే
మి కృపన్ దాల్చు నరు౦డు సాటి నరుపై ?
మిథ్యామతిన్ దాను హి౦
సకమున్ మి౦చె గ దో యి ! శ్రీ
నపహరి౦చన్ బ్రాణముల్ దీయుగా ! !
మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
తొలగించుమాయ లేడియైన మారీచు చూచి యా
రిప్లయితొలగించుచిత్ర మృగము కోరె సీతయంచు
కూర్చి యెక్కుపెట్టె కోదండమే తదం
బకము రేగి జింక ప్రాణముఁ గొనె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించునే ను ఉ ద య ము ఐ దు గ ౦ ట ల కే
రిప్లయితొలగించులే చి " శా బ క " ప దా న్ని ఉ ప యో గి ౦ చి పూ ర ణ చే శా ను . నా ద గ్గ ర cell ను ౦ చి పో దు క ను క . బె ౦ గ ళూ ర్ లో ను న్న మా కూ తు రు cell ద్వా రా బ్లా గు కు ప ౦ పి ౦ చా ను . కా నీ , ఇ ౦ త కు లో గా నా క న్న ము ౦ దే శ్రీ యుత మ ధు సూ ద న్ గా రి ద్వా రా మరియు శ్రీ గు రు వు గా రి ద్వా రా
"రె ౦ డు శా బ క ము లు " వ చ్చి చే రి న వి .
నే నే మి చే య గ ల ను ?
‘శాబకము’ జోలికి ఎవ్వరూ వెళ్ళలేదు కదా అని నేను నా పూరణను ‘ఒక కాంతారము..’ అని ప్రారంభించి, టైప్ చేసి పెట్టేలోగా గుండు వారు శాబకంతో, ‘ఒక కాంతారము..’ అని ప్రారంభించి బొడ్డు వారూ పూరణలు పెట్టేశారు. ఇదే కాకతాళీయం అంటే! పాపం... ఆ కాకికి ఒకటే తాటిపండు పడితే నా మీద రెండు పడ్డాయి!
తొలగించుబకమును "శాబకము" లేదా "అంబకము" గా మార్చడము సాధారణముగా నెవరైనా చేసే పనే. మార్చక పోతే యాశ్చర్యపడాలి.
తొలగించునా రెండవ పూరణము:
రిప్లయితొలగించుప్రకటంబై జరియించు నో హరిణి వే
బంధించి దానందగా
నొకచో దాగుచు బొంచియుండె నట న
య్యో! యావిధంబందునం
దకటా! దా చరియించగా జనగ; నా
హ్లాదించి; సింహ శా
బక ముద్వృర్తిని జింక ప్రాణము గొనెన్ ;
బాపంబుగా నెంచదే?!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుబక హరిణము లంత నొకటిగా హితులైరి!
రిప్లయితొలగించుక్రూర జంతువొకటి మీరి రాగ
నాదు కొనగ వచ్చి యడ్డుపడఁగఁ జూడ
బకము, రేగి జింక ప్రాణముఁగొనె!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఒకకాసారమునన్ జలమ్ముగొన నుద్యోగించి హర్షమ్ముతో
రిప్లయితొలగించుమెకపర్వమ్ములు చేరెనచ్చటను సంప్రీతిన్ ప్రవర్తిల్లుచున్
నికురంబమ్మును కాంచి క్షుత్తడర గానిర్భీతితో సింహ శా
బక, ముద్వృత్తిని, జింక ప్రాణముఁ గొనెన్! బాపంబుగా నెంచదే?
మీ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించు‘మెకపర్వమ్ములు’...?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుగురువర్యులకు నమస్సులు. మెకముల్ గుంపుగ చేరెనచ్చటను - అంటే సరిపోతుందా?
తొలగించువనము నందు తిరిగి వడలిన మేనుతొ
రిప్లయితొలగించుఆక లవ్వు తుండ యలసి సొలసి
బకపు విరుల జూచి బాగుగా మేయగ
బకము రేగి జంక ప్రాణము గొనె
మీ పూరణలో కొంత అన్వయదోషం ఉన్నట్టుంది. ‘బకపువిరులు’...? ‘అవ్వుతుండ’ అనడం గ్రామ్యం. ‘ఆకలి కనలింప నలసి...’ అందామా?
తొలగించుబకపుష్పం గురించి తెలియక ‘బకపువిరులు’ అన్నదాని గురించి సందేహాన్ని వ్యక్తం చేసాను. మన్నించండి. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుభ్రుకుటుల్ ప్రస్ఫుటరీతినిం బరగ శార్దూలౌఘ మందుం, గకా
తొలగించువికలై పారగ నెల్ల జంతువులు దుర్భీతిన్ దిగంతంబులన్
వికటారావములుం జెలంగ వని నావేశంబునన్, వ్యాఘ్ర శా
బక ముద్వృత్తిని జింక ప్రాణముఁ గొనెం బాపంబుగా నెంచదే
జగతినిఁ బరి కింప నగుపడు సత్యము
జీవి కశన మగును జీవి యొండు
వింధ్యు డొక్క డడవి వింటి విడిచిన యం
బకము రేగి జింక ప్రాణముఁ గొనె
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించుపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించుమిత్రులు కామేశ్వర రావు గారూ...మీ వృత్త పూరణము చాలా బాగున్నది.
తొలగించుకామేశ్వర రావుగారూ నమస్సులు.మీ వృత్తంలో వ్యాఘ్రావేశం ప్రతిబింబించింది. అద్భుతం.
తొలగించుకవిరాజశేఖరులు మధుసూదన్ గారు మీ ప్రశంస నందుకున్నందులకు మహదానందముగనున్నది నాకు. ధన్యవాదములు. మీ వృత్త పూరణ ని చాలాసార్లు చదివాను నేనంతగా నచ్చినది నాకు.
తొలగించుశిష్ట్లా శర్మ గారు నమస్సులు. మీ పేరు చూచినప్పుడల్లా నాకు మా యున్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ ఎల్ నారాయణ గారు (శిష్ట్లా) గుర్తుకు వస్తారు. మీకు నా ధన్యవాదములు. మీపూరణ చమత్కారము తో శోభిల్లుచున్నది. అభినందనలు.
ఇది యంతా మన పూజ్య గురువు గారి చేతి చలువ.
వేటలాడు తెఱగు లోటు రానీయక
రిప్లయితొలగించున్నేర్పుమీర హరియె నేర్పుచుండ
లాలసంబుజూపి లంఘించి, యేతచ్ఛా
బకము రేగి జింక ప్రాణముగొనె.
***********************
మాయలేడియైన మారీచుడంతట
చిక్కి చిక్కకుండ చిత్ర మైన
తెలివి జూపుచుండ దీసె, శ్రీరాముడం
బకము. రేగి జింక ప్రాణము గొనె.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించు‘...యేతచ్ఛా’ అన్నచోట గణదోషం. ‘సింహశా...’ అంటే సరి!
బక ముద్వృత్తిని జింక ప్రాణము గొనె న్బాపంబు గా నెంచదే
రిప్లయితొలగించుబక ముద్వృత్తిని జింక ప్రాణమనగ న్భావ్యంబు గా దెప్పుడు
న్బకము న్జింకలు నొక్కచో గలియు నెవ్వారి న్గనుంగొ ం టి రే ?
వికలం బౌనదిగా దలంచితిని నో భీమేశ్వరా వా !మదిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకకుబంతమ్ముల గ్రమ్మె జీకటులు నా కాంతార మందున్ త్రుటిన్
రిప్లయితొలగించువికటార్భాటపు మేఘగర్జనలతో విద్యుత్ప్ర్లభల్ తళ్కనన్
చకితమ్మయ్యెను చూలు గొన్న మెకమున్ స్రావమ్మయెన్ గర్భశా
బక ముద్వృత్తిని జింక ప్రాణముఁ గొనెం బాపంబుగా నెంచదే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుసకలంబున్ తనదంచు నేటి నొక మత్స్యంబున్నచో మ్రింగదే
రిప్లయితొలగించుబక ముద్వృత్తిని? జింక ప్రాణముఁ గొనెన్, బాపంబుగా నెంచ దే
మెకము,న్నయ్యది సాజమే భ్రుతికి ; ప్రేమించంగ తా వీడునే?
సకల ప్రాణుల జన్మ మ్రుత్స్యువులకున్ సాక్ష్యంబగున్ కర్మలే!
(లేదా)
యకటా జీవుల జన్మ మ్రుత్యువులకు న్నాద్యంతమున్ కర్మలే
మీన ములను మ్రింగె మిడిసి పడుచునున్న
బకమురేగి; జింక ప్రాణముఁ గొనె
చెట్టు నీడనున్న చిరుత పులియు గాంచి;
తలలు రాల్చెనవియు వలకు తుదకు
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించు‘భృతికి, మృత్యువు’ టైపాట్లు.
ప్రకటంబౌ ఘనపౌరుషాగ్నికనులం బ్రాచుర్యమింపారగా
రిప్లయితొలగించుసకలంబైన వనాన రాజుననుచున్ శాసించు సింగంబు,సా
గి కరీంద్రంబును బట్టగా గనుచు లంఘించెంబ్రతాపాన-శా
బకముద్వృత్తిని జింకప్రాణముగొనెన్ బాపంబుగానెంచదే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఅకటా తిండియెజీవితంబనెడి లక్ష్యంబందు శార్దూలశా
రిప్లయితొలగించు1బక ముద్వృత్తిని జింక ప్రాణముఁ గొనెం బాపంబుగా నెంచదే |
వికలంబైనమనస్సునన్దిరుగు నిర్వీర్యంబైన నిర్వేదినిన్
నకలంకంబని నెంచు చుండె గద నన్యాయంబుగా జంపుచున్
కవిత లల్లుటందు కల్పన చిత్రమే|
రిప్లయితొలగించుబకము రేగి జింక ప్రాణము గొనె
అబలయనుచు నామె నణచగ జూచిన
సబలయనగ రీతి చంపినట్లు|
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించు1.ఆ.వె:పసిడి జింకఁగోరె పడతి జానకి నాడు
పట్టి తేరగ చనె పతియు వేగ
చిక్క కుండ పార శ్రీరాము చేతి యం
బకము రేగి జింక ప్రాణము గొనె.
2.ఆ.వె:అడవి లోన హరిణ మడ్డు యదుపులేక
నెగురు చుండె వనిని నిర్భయముగ
నదను జూచి వచ్చె నచ్చోట సింహ శా
బకము రేగి జింక ప్రాణము గొనె.
3.ఆ.వె:పాండు రాజు వనిని పడతుల తోడుగా
వాసముండి తాను పరవశాన
వేటలాడు చుండ వేగమే యొక్కనం
బకము రేగి జింక ప్రాణము గొనె.
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించురెండవ పూరణలో ఒకే వాక్యంలో ‘అడవి, వని’ అని పునర్తుక్తమయ్యాయి. ‘..నెగురుచుండె నదియె...’ అనండి.
`బకము జపము సేయ,స్వాదు జలమ్ములు
రిప్లయితొలగించుత్రాగుచుండె జింక తటమునందు
వ్యాధు డొకడుశరము బకముపై నేయంగ
బకము రేగి,జింకప్రాణము గొనె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుశిష్ట్లా శర్మ గారి పూరణ....
రిప్లయితొలగించుఅల్ప జీవి బకము నాదరంబుగ జూచి
జింక తాను జనెను వంక వైపు
పులుగు యెగిరి బోవ పొంచిన సింహ శా
బకము రేగి జింక ప్రాణము గొనె!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుగురువర్యులకు నమస్సులు. మెకముః జింక, పర్వముః గుంపు
రిప్లయితొలగించుజింకల గుంపు అనే అర్థంలో ‘మెకపు పర్వము’ అవుతుంది, కాని ‘మెకపర్వము’ కాదని గమనించ మనవి.
తొలగించుగురువర్యులకు నమస్సులు. మెకముల్ గుంపుగ చేరెనచ్చటను - అంటే సరిపోతుందా?
తొలగించుఒక రాజేంద్రుడు వేటకై వనములోనుత్సాహియై తిర్గుచున్
రిప్లయితొలగించుఅకలంకంబగు దొర్వు చెంత గనె నాహారంబు నాశించియున్
నకటా ! తిర్గెడు జింక నా ప్రభువు సంహారంబు గావించె , నం
బక ముద్వృత్తిని జింక ప్రాణముఁ గొనెన్, బాపంబుగా నెంచదే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుబక హరిణము లంత నొకటిగా హితులైరి!
రిప్లయితొలగించుక్రూర జంతువొకటి మీరి రాగ
నాదు కొనగ వచ్చి యడ్డుపడఁగఁ జూడ
బకము, రేగి జింక ప్రాణముఁగొనె!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించునా మూఁడవ పూరణము:
రిప్లయితొలగించు[ఒక కొంగ, ఒక జింకను ప్రేమతో సన్మానింప దలచి, నరాలతో అల్లిన పుష్పగుచ్ఛాన్ని దాని మెడలో వేసింది. జింక, నీటికోసం వెళ్ళగా, నీటిలోని మొసలి మొగపు కొనకు ఆ గుచ్ఛము తగుల్కొని, జింక ప్రాణాలను తీసినట్లుగా కల్పించిన అంశ మిది]
బక మొకండు, పేర్మిఁ బఱఁగ జింక మెడను
స్నాయు రచిత కుసుమ చయ మిడ, జల
ములను, మొసలి మొగపు మొనఁ జిక్కి, యపుడు స్త
బకము రేఁగి, జింక ప్రాణముఁ గొనె!
చిన్న సవరణము...
తొలగించుమొదటి పాదంలో...
...బఱఁగ రురు గళాన...అనాలి.
బక మొకండు, పేర్మిఁ బఱఁగ, రురు గళాన,
స్నాయు రచిత కుసుమ చయ మిడ, జల
ములను, మొసలి మొగపు మొనఁ జిక్కి, యపుడు స్త
బకము రేఁగి, జింక ప్రాణముఁ గొనె!
మీ మూడవ పూరణ బాగున్నది. ఎవ్వరూ ఊహించని విధంగా మీరు ఆలోచిస్తారన్నది సుస్పష్టం. వైవిధ్యమైన పూరణ, బాగుంది. అభినందనలు.
తొలగించుధన్యవాదాలు శంకరయ్య గారూ! _/\_
తొలగించుఅద్భుతమైన యూహ మధుసూదన్ గారు. నారికేల పాకము లో పడింది. "స్నాయు బద్ధ కుసుమ చయము" అన్న నెట్లుండును?
తొలగించు"నరుడొకండు భక్తి మెరయరురుగళాన" అంటే వాస్తవానికి దగ్గరగానుండునేమో? సమస్య లోని బకాన్ని యెలాగు వదిలేశారు గదా!
తొలగించుమిత్రులు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు!
తొలగించుమీరు సూచనలు బాగున్నాయి.
స్నాయు బద్ధ కుసుమ చయము...అనడం బాగుంటుంది. నేను నేరుగా (ఆశువుగా) టైపు చేయుటచేత, నాకు అప్పటికి తోచిన విధంగా (సామంజస్యాన్ని పరిశీలిస్తూనే)పూరణ చేశాను.
రెండవ సూచనలో...భక్తి చూపడం అవసరమా? ప్రేమ చూపితే బాగుంటుందేమో.
మొత్తానికి నా పూరణ మీ మెప్పును పొందినందులకు ధన్యవాదాలు!
మధుసూదన్ గారు ధన్యవాదములు. ప్రేమ యేబాగుంది
తొలగించుఅదియునుం గాక, ఇందు అన్నియు జంతువులే యున్న కారణమున నేను బకమునుం గొంటిని. అడవిలో నరుని యవసరము కన్న బకము యొక్క యవసరమే మిన్న గదా!
తొలగించుఒక సాయంత్రము వేటకై జనిన రాజొక్కండు నుత్సాహముం
రిప్లయితొలగించుసకలారణ్యచరమ్ములన్నమితరాశీభూత రోషంబులన్
ప్రకటించంగధనుర్విద్యా నిపుణుడై ప్రావీణ్యతన్వేయనం
బకముధ్వ్రత్తిని జింక ప్రాణముగొనెన్ బాపంబుగానెంచదే
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
తొలగించుమొదటిపాదంలో ‘..నుత్సాహియై’ అంటే బాగుంటుదేమో?
రెండవపాదంలో యతి తప్పింది.
మూడవపాదంలో గణదోషం. సవరించండి.
పెద్దలు కంది శంకరయ్య గారు మీరు ఆశ్సీస్సుల నందించాలి
రిప్లయితొలగించుఅవి మాకు అభివృద్ది కారకాలు ధన్యవాదములు
ఈరోజు సుదినం. చాలా మంది కవులు మిత్రుల పూరణలపై వ్యాఖ్యానించారు. పూరణలు చేసిన మిత్రులు కేవలం నా సమీక్షనే కాకుండా తోటి కవుల ప్రశంసనలను, సూచలన కోసం ఎదురు చూస్తారు. సాటి కవుల ప్రశంసలు వారికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీ సూచనలు ఔత్సాహిక కవులకు మార్గదర్శకా లవుతాయి. అందరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించుమబ్బు రీతిగ యద్ధాన మసలు చున్న
రిప్లయితొలగించుకౌర వేంద్రుని సైన్యంబు గాంచి నరుడు
వాన వడ్డట్టు శరములు వదలు చుండ
జగడ మాడెడి గుండియల్ జల్లు మనగ
వరద గట్టెను రక్తంబు వసుధ లోన
సికలో పువ్వులు తుర్ముచున్ కడకు కోసెన్ సోన్య కేశమ్ములన్
రిప్లయితొలగించుప్రకటించెన్ తన సీట్లనున్ మొదట నీ ప్రారబ్ధమింతేననిన్
అకటా! మాయను నమ్మునా మృగము లాహారమ్ము గారేనిటుల్! 👇
బక ముద్వృత్తిని జింక ప్రాణముఁ గొనెన్ బాపంబుగా నెంచదే