మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. ‘కేతనమం దెవండు| గలడు..’ అనండి. మూడవ పూరణలో ‘సుతుడు+ఎవరు’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘పాండుపుత్రు| డెవడు’ అనండి. నాల్గవ పూరణలో ‘అనిని+ఎచట’ అన్నపుడు యడాగమం రాదు. ‘..నెక్కెఁ బోర| నెచట...’ అనండి.
మీ రెండు పద్యాలు బాగున్నవి. కాని సమస్యకు పరిష్కారం చూపలేదు. రెంటిలోను కవ్వడి ధ్వజంపై గరుడుడు ఉంటాడనే అన్నారు. మొదటి పద్యం మొదటి పాదంలో యతి తప్పింది. ‘ఎవ్వడు మత్స్యయంత్రమును నెక్కటిఁ గొట్టెను మెచ్చ్ద నెల్లరున్’ అందామా?
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నా మూడవ పూరణ చూచి మీరిచ్చిన తేటగీతి సమస్యనొకసారి పరిశీలిస్తారనుకున్నాను. అది ప్రమాద పతితమా లేక వాంఛితమేనా యని తెలుసుకుందామని.
పనిమీద బయటకు వెళ్ళినప్పుడు నా ఫోన్‍లో మీ పూరణలను చదివాను. ‘కవ్వడి’ని ‘కవ్విడి’ చేసింది గమనించాను. మీ పూరణపై వ్యాఖ్యానించేముందు ఆ విషయం ప్రస్తావించాలనుకున్నాను. ఇంటికి వచ్చి సిస్టం ముందు కూర్చున్నపుడు ఆ విషయం మరిచి పోయాను. ఎలాగూ చదివాను కదా అని మూడు పూరణలు బాగున్నవని అన్నాను. మళ్ళీ పరిశీలించకుండా.
నిజమేనండోయ్... నేను గమనించనే లేదు. పొరపాటును తెలియజేసినందుకు ధన్యవాదాలు. అందుకేనా కామేశ్వర రావు గారు పరోక్షంగా హెచ్చరించారు. గుర్తించలేకపోయాను! ***** కామేశ్వర రావు గారూ, అపరాధిని... మన్నించండి. సమస్యను సవరిస్తున్నాను!
ఎవ్వడు వానరుండు మరి యెవ్వడు సింహము, గ్రద్ద యెవ్వడౌ
రిప్లయితొలగించండియెవ్వడు సూకరంబు, హయమెవ్వడు పంచముఖంబులూని తా
రివ్వున వచ్చి చేర కడురేగిన కౌరవ యుద్ధమందునన్
కవ్వడి తేరు టెక్కెమున గారుడరూపము శోభఁ గూర్చెడిన్!!
_/\_
తొలగించండిజిగురు సత్యనారాయణ గారూ,
తొలగించండిపంచముఖాంజనేయుడితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాజేశ్వరి నేదునూరి గారి పూరణ....
రిప్లయితొలగించండిఎవ్వడు విష్ణువంచు మదినిండుగ భక్తిని గొల్తురేని యే
సవ్వడి లేకనే మిగుల సంతస మందున వాసవుం డటన్
రువ్వుచు గాలులన్ పొడమి రోషము నొందుచు మానసం బునన్
కవ్వడి తేరుటెక్కమున గారుడరూపము శోభఁ గూర్చెడిన్
-------------------------------------------
కృష్ణ సఖుడు గావున జిష్ణు వనగ
నతని భక్తికి పరవశ మంది మిగుల
వెన్ను దట్టుచు కాపాడు దన్ను గాను
కవ్వడి రధపతాకాన గరుడుఁ డుండు
అక్కయ్యా,
తొలగించండిమీ రెండు పూరణలలోను సమస్యకు పరిష్కారం చూపినట్టు లేదు.
రెండవపద్యం మొదటిపాదంలో గణదోషం.
ఎవ్వడు విష్ణువంచు మదినిండుగ భక్తిని గొల్తురేని యే
తొలగించండిసవ్వడి లేకనే మిగుల సంతస మందున ఆంజనేయు డున్
కవ్వడి తేరుటెక్కమున,గారుడరూపము శోభఁ గూర్చెడిన్
రువ్వుచు గాలులన్ పొడమి రోషము నొందుచు వాసవున్ గనన్
-------------------------------------------
కృష్ణుని సఖుడు గావున జిష్ణు వనగ
నతని భక్తికి పరవశ మంది మిగుల
వెన్ను దట్టుచు కాపాడు దన్ను గాను
కవ్వడి రధపతాకాన గరుడుఁ డుండు
రిప్లయితొలగించండిఎవ్వడు గృష్ణు డర్జునుడు
నెవ్వడు జీవుడు దేహ మెవ్వడున్
ఎవ్వడు చోదకుం డెవడు
నేవిధి జేయును యుద్ధమా విధిన్
దవ్వును వీడి దేవుడట
దాను జరించ పథ ప్రభావమై
కవ్వడి తేరు టెక్కెమున
గారుడ రూపము శోభగూర్చెడిన్!
దవ్వు=దూరము
నేవిధి జేయును యుద్ధ మాదరిన్....అని చదువగలరు
తొలగించండిశిష్ట్లా వారూ,
రిప్లయితొలగించండిమీరు వ్రాసిన రెండు పాద్యాల్లో అన్ని పాదాల్లో గణదోషం. ‘కవ్వడి తేరు టెక్కెమున...’ పాదం కందంలో ఒదుగదు. మరొక పూరణ వ్రాయండి.
గురువుగారూ నమస్సులు...పద్యం ఉత్పలమాలలో...యతి కోసమని పాదం విరిచాను
రిప్లయితొలగించండిఆ పాదాలు చూసి రెండు కందపద్యాలు అనుకున్నాను.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పద్యాలు కాని, వ్యాఖ్యలు కాని రెండు రెండు సార్లు ఎందుకు వస్తున్నవి?
అదే తెలియటంలేదు. నేను ఒక్కసారి మాత్రమే ప్రెస్ చేస్తున్నాను
తొలగించండికవ్వడి రధ ప తాకాన గరుడు డుండు
రిప్లయితొలగించండిననుట సరికాదు గరుడుడు హరిప తాక
మునగ దరెప రెప లతోడ ముదము గలుగ
నూగు చుండును గగనాన నొప్పు గాను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినా రెండవ పూరణము:
రిప్లయితొలగించండిచెన్ను మీరుచు శ్రీహరి చెంత నిలచి
భవ్య మార్గము నొందగ సవ్యసాచి
కర్మ సాక్షిగ నాతని ధర్మ నెరిగి
కవ్వడి రథ పతాకాన గరుడు డుండు!
పతాక=సౌభాగ్యము
బాగుంది మీ పూరణ. కాని పతాకమంటే సౌభాగ్యమన్న అర్థం ఉన్నట్టు లేదు.
తొలగించండిగురువు గారూ పొరబడినాను..అదియొక అభినయ ముద్ర
తొలగించండిగురువు గారూ పొరబడినాను..అదియొక అభినయ ముద్ర
తొలగించండివానరేంద్రుండు తానెట వాసముండె?
రిప్లయితొలగించండికౌరవేశ్వరు రథపతాకాన నెవరు
గలరు? రణరంగమందున గాంచి చెపుమ
కవ్వడి రథపతాకాన,గరుడు డుండు.
మీ క్రమాలంకార పూరణ బాగుంది. గరుడుడు కృష్ణుని (విష్ణువు) పతాకంపై ఉంటాడు కదా! మీరు దుర్యోధనుని పతాకంపై ఉంటాడన్నారు. దుర్యోధనుని ధ్వజంపై పాము ఉంటుంది.
తొలగించండినవ్వుచు నాట్యమాడుచును నాగపు మర్దన జేసినట్టియున్
రిప్లయితొలగించండిమువ్వల సవ్వడిన్ బరగి మోహన రూపున జీవనాడులున్
జివ్వన వేణుగానమును జేసెడి వానికి నిష్టసఖ్యుడౌ
కవ్వడి, తేరు టెక్కెమున గారుడరూపము శోభఁ గూర్చెడిన్
గురువుగారూ, అన్వయం సరిపోయిందా లేదా అని అనుమానం.
బాగుంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండినాగ ధ్వజంబు ధరియించి నవ్వుచున్న
రిప్లయితొలగించండిదుష్ట దుర్యోధనునిమీద దృష్టి పడగ
వాసు దేవుడి మాయన వాని కెల్ల
కవ్విడి రథపతాకాన గరుడుఁ డుండు
బాగుంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిమొదటిపాదంలో గణదోషం. ‘నాగపు ధ్వజంబు...’ అనండి.
హనుమ యుండును భారత రణమునందు
రిప్లయితొలగించండికవ్వడి రధపతాకాన, గరుడుడుండు
వాహనమ్ముగ నొప్పుచు వాలయముగ
దానవారాతి సేవలో తనరు చుండు!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదవ్వుల నుంచు రక్కసుల దర్ప మడంచి విధేయ మిత్రుడున్
తొలగించండినవ్వు మొగంబు వాడు మన నందకుమారుని రత్నభూషితం ,
బెవ్వని పాదపద్మముల నింపుగ గొల్చెడి ప్రాణమిత్రు డా
కవ్వడి, తేరు టెక్కెమున గారుడరూపము శోభఁ గూర్చెడిన్
రాక్షసాంతకుడు సుజన రక్షకుండు
రుక్మిణీ వల్లభుడు సుందరుండు ఘనుడు
గోపికా మనోహారి, తాఁ గూర్మి సఖుడు
కవ్వడి, రథపతాకాన గరుడుఁ డుండు
రాక్షసాంతకుడు సుజన రక్షకుండు
రుక్మిణీ వల్లభుడు సుందరుండు ఘనుడు
గోపికామనోహారి, యే కుజనులకును
కవ్విడి, రథపతాకాన గరుడుఁ డుండు
[కవ్వు+ఇడి=కవ్విడి = అపహరింపలేని; కవ్వు=అపహరించు]
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికృష్ణు జిత్తము భాసిల గృపను బొంది
రిప్లయితొలగించండినిత్య సంతోష మందుచు నెయ్యమలర
అన్ని దానయి సరసన మన్ను వాడు
కవ్వడి; రథ పతాకాన గరుడు డుండు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండు సార్లు యెందుకు వస్తోందో చెప్పగలరా
రిప్లయితొలగించండిమీరు మొబైల్ లోంచి చేస్తుంటే ప్రచురించు ని సున్నితముగా నొక్కి చూడండి.
తొలగించండిగురువు గారూ నమస్కారములు...సున్నితంగానే నొక్కుతున్నాను..అయినా రెండు సార్లు వస్తుంది...మరల చూస్తాను
తొలగించండిశిష్ట్లా వారూ, ఈ ‘సున్నితంగా నొక్కుతున్నాను...’ అన్న వ్యాఖ్య ఒక్కసారే వచ్చింది. గమనించండి.
తొలగించండిఓ సినిమాలో..
రిప్లయితొలగించండిహనుమ పంచాస్యుఁడను సత్యమినుమడింప
దర్శకత్వ నైపుణ్యాన తడవకొకరి
ముఖము మారెడు రీతిని పొందుపరచ
కవ్వడి రథపతాకాన గరుడుడుండు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినవ్వెడి చిత్ర లేఖనము-నల్వురుమెచ్చినజాలునంచు యే
రిప్లయితొలగించండిసవ్వడిలేనిసంస్కృతిని సాకెడి యూహలు మాని వింతయౌ
నివ్వెర బోవు రీతిగను నిందలు వందలు వచ్చి జేరినా?
కవ్వడి తేరు టెక్కెమునగారుడ రూపము శోభగుర్చెడిన్.
2.ఎవరి చూపుకు వారికే నెరుకబడగ
త్రీడి చిత్రంబు జూడగ తిన్నగాను
నర,హరుడువేరువేరుగునరదమందు
కవ్విడిరథ పతాకాన గరుడు డుండు|
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికవ్వడి తేరు టె క్కెమున గారుడ రూపము శోభ గూర్చె డి
రిప్లయితొలగించండిన్గ వ్వడి తేరు టె క్కెమున గారుడ రూపముగానరా దుగా
నెవ్వరు సెప్పిరో యిటుల నేమన వచ్చును వారల న్సుధా !
రవ్వడి జేయకింక మఱి రాతిరి యాయెను బండుకో యిటన్
4వపాదములో...రవ్వడికిబదులుసవ్వడిగాచదువ
తొలగించండివలసినది
కా
పద్యం బాగుంది. కానీ మొదటి రెండు పాదాల్లో పునరుక్తి. ‘రాదుగా| యెవ్వరు’ అనండి. ‘పండుకో’ అనడం వ్యావహారికం.
తొలగించండిరణము నందు తోడుగ జేరె రామ బంటు
రిప్లయితొలగించండికవ్వడి రథ పతాకాన! గరుడుడుండు
పద్మనాభునికి నెపుడు వాహనముగ!
పరులు కూడక జరుగదెవ్వారి కైన!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరామకార్యమున్ సాధించి రమణి సీత
రిప్లయితొలగించండిశోకమును దీర్చిన పవన సుతుడు నిలిచె
కవ్వడి రథపతాకాన, గరుడుండు
పద్మనాభుకున్ దాసదా వాహనముగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘గరుడు డుండు’ అన్నచోట ‘గరుడుండు’ అని టైపయింది.
సవ్యసాచికి పేరేది సరియునొకటి
రిప్లయితొలగించండిహనుమ యెచ్చట నిలచెతా నర్జునునకు
విష్ణు దేవుని గడపన వెలుగునెవడు
కవ్వడి, రథపతాకాన, గరుడుండు.
క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎవ్వడు రామకార్యమన నీశుని కార్యముగా తలంచెనో
రిప్లయితొలగించండినెవ్వడు సీతశోకమును దీర్చెనొ యా కపి తాను నిల్చెనా
కవ్వడి తేరుటెక్కమున, గారుడ రూపము శోభగూర్చెడిన్
నవ్వుల మోమువాడయిన నల్లని కృష్ణుని టెక్కమందునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅంజన సుతుండు తానుండు ననవరతము
రిప్లయితొలగించండికవ్వడి రథపతాకాన, గరుడుఁడుండు
వాసుదేవుని సేవించు వాహనముగ
హరుసమున హరి యిచ్చిన వరమువలన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి1వానరేంద్రుండు తానెట వాసముండె?
రిప్లయితొలగించండినందబాలుని కేతన మందున నెవరు
గలరు? రణరంగమందున గాంచి చెపుమ
కవ్వడి రథపతాకాన,గరుడు డుండు
2యద్ధరంగము నందున యోధుడైన
కవ్వడి రథపతాకాన గరుడు డుండు
ననుట సరికాదు,గాంచుము నాగవైరి
ధ్వజము వాసుదేవుని యరదమున నుండు.
3పదియు పేర్లతో రాణించు పాండు సుతుడు
యెవరు?వానరేంద్రుండు తా నెట వసించు
దేవునెదుట కంబమ్మునందెవరు గలరు/యుంద్రు
కవ్వడి రథపతాకాన గరుడుడుండు.
కృష్ణను వివాహమాడిన కృష్ణ భక్తు
రిప్లయితొలగించండిడెవరు?పవనసుతుండెట నెక్కె ననిని (అని=యుద్ధము)
యెచట విష్ణువు యుండునో యచట విధిగ
కవ్వడి రథపతాకమున గరుడు డుండు
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. ‘కేతనమం దెవండు| గలడు..’ అనండి.
మూడవ పూరణలో ‘సుతుడు+ఎవరు’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘పాండుపుత్రు| డెవడు’ అనండి.
నాల్గవ పూరణలో ‘అనిని+ఎచట’ అన్నపుడు యడాగమం రాదు. ‘..నెక్కెఁ బోర| నెచట...’ అనండి.
ఎవ్వడు మత్స్యయంత్రమును నేలకు గూర్చెను త్రుళ్ళి రాలగ
రిప్లయితొలగించండిన్నెవ్వడు సైంధవున్నడచె, నెవ్వడు గోవుల దెచ్చె వీటికి
న్నెవ్వడు సవ్యసాచి యన నీధర పొందె విశిష్ట నామ మా
కవ్వడి తేరు టెక్కెమున గారుడరూపము శోభఁ గూర్చెడిన్
రధము నడుపగ పార్ధ సారధియె నిలువ
కవ్వడి రథపతాకాన గరుడుఁ డుండు
కూల జేయగ వీరుని నాలమందు
శాపమన కర్ణునకు తోడు శల్యుడుండు
మీ రెండు పద్యాలు బాగున్నవి. కాని సమస్యకు పరిష్కారం చూపలేదు. రెంటిలోను కవ్వడి ధ్వజంపై గరుడుడు ఉంటాడనే అన్నారు.
తొలగించండిమొదటి పద్యం మొదటి పాదంలో యతి తప్పింది. ‘ఎవ్వడు మత్స్యయంత్రమును నెక్కటిఁ గొట్టెను మెచ్చ్ద నెల్లరున్’ అందామా?
ఉల్లసంబున నాంజనేయుండు వెలుగు
రిప్లయితొలగించండికవ్వడి రథపతాకాన గరుడుఁ డరయ
వెన్నుని రథపతాకాన వెలుగు చుండు
కాన నా రెండుధ్వజములే ఘనతమములు
శ్యామల రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని ‘గరుడుఁ డుండు’ను ‘గరుడుఁ డరయ’ అని మార్చారు.
అవునుకదా, క్షంతవ్యుడిని. భోజనానికి వెళ్ళే తొందరలో సరిచూడటంలో పొరపాటు. పాఠం సరి చేస్తున్నాను.
తొలగించండిఉల్లసంబున నాంజనేయుండు వెలుగు
కవ్వడి రథపతాకాన గరుడుఁ డుండు
వెన్నుని రథపతాకాన వెలుగు మీఱ
కాన నా రెండుధ్వజములే ఘనతమములు
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నా మూడవ పూరణ చూచి మీరిచ్చిన తేటగీతి సమస్యనొకసారి పరిశీలిస్తారనుకున్నాను. అది ప్రమాద పతితమా లేక వాంఛితమేనా యని తెలుసుకుందామని.
రిప్లయితొలగించండిపనిమీద బయటకు వెళ్ళినప్పుడు నా ఫోన్‍లో మీ పూరణలను చదివాను. ‘కవ్వడి’ని ‘కవ్విడి’ చేసింది గమనించాను. మీ పూరణపై వ్యాఖ్యానించేముందు ఆ విషయం ప్రస్తావించాలనుకున్నాను. ఇంటికి వచ్చి సిస్టం ముందు కూర్చున్నపుడు ఆ విషయం మరిచి పోయాను. ఎలాగూ చదివాను కదా అని మూడు పూరణలు బాగున్నవని అన్నాను. మళ్ళీ పరిశీలించకుండా.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు.ధన్యవాదములు.
తొలగించండిశంకరయ్య గారూ, మీరు సమస్యను (పొరపాటున) కవ్విడి పదంతోనే ఇచ్చారండీ. కొందరు అలాగే ఉంచి పూరించారు కూడా.
తొలగించండినిజమేనండోయ్... నేను గమనించనే లేదు. పొరపాటును తెలియజేసినందుకు ధన్యవాదాలు.
తొలగించండిఅందుకేనా కామేశ్వర రావు గారు పరోక్షంగా హెచ్చరించారు. గుర్తించలేకపోయాను!
*****
కామేశ్వర రావు గారూ,
అపరాధిని... మన్నించండి. సమస్యను సవరిస్తున్నాను!
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.అంతమాటననకండి. నాకు చాలా బాధకలుగుతుంది. పొరపాటులెవరికైనా సహజమే.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపువ్వుల వానలన్ గురియ పొంగుచు నాకమునుండి దేవతల్
రిప్లయితొలగించండిసవ్వడిగాంచి శత్రువుల సైన్యము మిక్కిలి భీతినొందగా
చివ్వున నాడుచున్ హనుమ చిత్రముగాకనిపించునింపుగా
కవ్వడితేరుటెక్కమున, గారుడరూపము శోభఁగూర్చెడిన్
రివ్వున బోవనశ్వములు శ్రీపతి తేరును తోలుచుండగా
పువ్వుల మాలలన్ మురిసి ముచ్చటి జంటలు మార్పుజేయరే!
రిప్లయితొలగించండినవ్వుచు కోట్ల రూకలిట నాయకు లెల్లరు కూడబెట్టగా
సవ్వడి లేక నేతలహ చట్టున పార్టిలు తారుమార్చినన్
కవ్వడి తేరు టెక్కెమున గారుడరూపము శోభఁ గూర్చెడిన్ :)