శిష్ట్లా శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ఒదుగా’ అంటే మీ ఉద్దేశంలో ఒదుగు + ఆ అని అనుకుంటాను. అదే అయినా ఒదుగు నా.. అవుతుంది. ‘కడలి నొదుగన్’ అనండి.
బండికాడి అంజయ్య గారూ, చివరికి పూరణను బ్లాగులో పోస్టు చేయడం తెలుసుకున్నారు. సంతోషం! మీ పూరణ బాగున్నవి. అభినందనలు. ‘శంకరాభరణం వారి పూరణ... సామాజికము(?).. బండికాడి అంజయ్య గౌడ్..’ ఈ వివరాలన్నీ ఇక్కడ అవసరం లేదు. మీరు వ్యాఖ్యను పోస్ట్ చేయగానే మీ పేరుతోనే ప్రకటింపబడుతుంది. వేరే వివరాలు అక్కర లేదు.
రిప్లయితొలగించండిభువియందిది యధిక మనుట
అవతలిది యనధిక మనుట అసలేదియు లే
దు! వసుధ యందందరికిన్
శవసందర్శనము పుణ్యసంపద లిచ్చున్ !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాని పూరణలోని 'లాజిక్' ఏమిటో అర్థం కాలేదు.
తొలగించండిఅదే ప్రకృతి నియమం, ప్రకృతి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇస్తుంది, మనిషి కూడా ప్రకృతిలో భాగమే కదా
భువి కాపాడిన భరిమను
రిప్లయితొలగించండిశివముల నువెదకి విధాత కిచ్చిన శేషి
న్నవనీతచోరుడౌ కే
శవసందర్శనము పుణ్యసంపద లిచ్చున్!!!
శివము = వేదము
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘భరిమ, శేషి’ విష్ణువునకు పర్యాయపదాలైనా అంత ప్రసిద్ధాలు కావు కదా!
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిశివ సందర్శన మిచ్చు మోక్షమును సంక్షేమమ్ము తోషమ్మునున్
లవలేశ మ్మిఁక శంక వద్దు నలువన్ లాభమ్మె వీక్షింపఁగన్
శివమున్ సత్యము సుందరమ్ము లొనరున్ శీఘ్రమ్మె నీకిప్డు కే
శవ సందర్శన మిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
శవముగ మారక మున్నే
రిప్లయితొలగించండిశివమయమౌ జగతి నరుడ చేయుము ప్రీతిన్
శివదర్శనమున్ మరి కే
శవసందర్శనము,పుణ్యసంపద లిచ్చున్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నవమాసంబులు తల్లి గర్భమున దీనావస్థయందుండియున్
రిప్లయితొలగించండిశివసంకల్పపు ధన్య భాగ్యముననే జీవంబు తాబొందెగా
జవ సత్వంబులు మీఱకుండ నిల సత్సంగంబులన్ గూడు కే
శవసందర్శన మిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా!
ఫణి కుమార్ తాతా గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివుడే సత్యము నిత్యము
రిప్లయితొలగించండిభవసాగరమీదువారి బాటకు వెలుగౌ
రవళించగ మది శివ కే
శవసందర్శనము పుణ్య సంపద లిచ్చున్
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
పూర్వార్ధంలో శివుని గురించి చెప్పారు కదా! అందువల్ల ‘నత కేశవ సందర్శనము...’ అనండి. బాగుంటుంది.
భువియందున్ జరియించి నీ మనికి దాపు న్నిల్చు శ్రీ కంఠుడున్
రిప్లయితొలగించండిదివి తేజోమయ శాంతమూర్తి వలె దా దీపించు శ్రీ నాథుడున్
శివమై యీశుడు, శోభలన్ హరియు, భాసిల్లంగ, నా యీశు, కే
శవ సందర్శనమిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా!
శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘... నా యీశ కేశవ...’ అంటే బాగుంటుంది.
ధన్యవాదములు
తొలగించండివివిధోపాయము లూని చేయుటను వేవేలాదిగా కర్మ లీ
రిప్లయితొలగించండియవనిన్ మానవమాత్రులందరను వెన్నంటున్ గదా పాపముల్
లవలేశమ్ముగ పుణ్యముల్, గనుక మేలౌ దైవముంగొల్వ, కే
శవ సందర్శనమిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా!
రామకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దివి నుండి భువికి జనుచును
రిప్లయితొలగించండినవ కాంతులు సృజనచేయ నదు లన్నిటిలో
ప్రవహించి కడలి నొదుగా
శవ సందర్శనము పుణ్య సంపద లిచ్చున్!
శవము=జలము
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఒదుగా’ అంటే మీ ఉద్దేశంలో ఒదుగు + ఆ అని అనుకుంటాను. అదే అయినా ఒదుగు నా.. అవుతుంది. ‘కడలి నొదుగన్’ అనండి.
అవునండి గురువు గారూ...కడలి కేగెడి...అనవచ్చుగదా.....
తొలగించండిఅనవచ్చు... బాగుంటుంది.
తొలగించండిచివరకు మనమంద రమును
రిప్లయితొలగించండిశవముగనే మారుట నుట సత్యము పుడమిన్
శవమనగను శివ రూపము
శవ సందర్శనము పుణ్య సంపద లిచ్చు న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘మనము’ అన్నారు కనుక ‘శవములుగన్ మారుదుమన సత్యము పుడమిన్’ అనండి.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
భువనాధ్యక్షుని , సత్కృపామయుని ,
స౦పూజి౦చుమా | పాప ని
హ్నవ స౦భూయ భవార్ణవ స్థిత మనుష్య
శ్రేణి బాలి౦చు - కే
శవ స౦దర్శన మిచ్చు పుణ్యముల
సత్స౦పత్తులన్ | మిత్రమా !
ప్రవణస్వా౦తుడవై భజి౦చుమిక కైవల్య౦బు
సాధి౦పుమా
{ పాప నిహ్నవ స౦భూయ =
పాపముచేత , కపటముచేత మిశ్రిత మైన ;
ప్రవణ స్వా౦తుడు = వినయ స్వా౦తుడు ; }
మీ పూరణ బాగున్నది.
తొలగించండిరెండవపాదంలో యతి తప్పింది. సవరించండి.
అవనీ భారము దీర్పఁ బుట్టు నిల మాహాత్మ్యంబునన్ విష్ణువే
రిప్లయితొలగించండిసవనాధీశుడు లోకపాలకుడు తత్సన్నామ సంకీర్తనల్
భవతోయాంబుధి దాట నావలట సంప్రాప్తింప నిత్యమ్ము కే
శవసందర్శన మిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా!
సవనమ్ము లేల సేయగ
భవసాగర మీద గాఢ భక్తిని హరినిన్
కవనములఁ బొగడ నగుఁ గే
శవసందర్శనము పుణ్యసంపద లిచ్చున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఎవడో తెల్పుడి విశ్వకారకుడెవండీ ధాత్రినే గాయగ
రిప్లయితొలగించండిన్నవతారమ్ముల దాల్చి దానవుల సంహారమ్మునే జేయుచు
న్నవనిన్ బ్రోచెడు వాడు శ్రీకరుడు దివ్యాత్ముండనన్ నొప్పు కే
శవ సందర్శనమిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా
అవతారము లెత్తుచు దా
నవ సంహారమును జేసిన దెవండో యా
భవభయ హరుడౌ శ్రీకే
శవసందర్శనము పుణ్యసంపద లిచ్చున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి‘ధాత్రినే కాయగా| నవతారమ్ముల...’ అనండి.
శంకరాభరణం వారి పూరణ
రిప్లయితొలగించండిసామాజికము
బండకాడి అంజయ్య గౌడ్
శివపూజ సేయకున్నను
స్తవనీయుడు లచ్చిమగని తలపకయున్నన్
భువిలో నెవ్వరి దైనను
శవసందర్శనము పుణ్యసంపద లిచ్చున్
బండికాడి అంజయ్య గారూ,
తొలగించండిచివరికి పూరణను బ్లాగులో పోస్టు చేయడం తెలుసుకున్నారు. సంతోషం!
మీ పూరణ బాగున్నవి. అభినందనలు.
‘శంకరాభరణం వారి పూరణ... సామాజికము(?).. బండికాడి అంజయ్య గౌడ్..’ ఈ వివరాలన్నీ ఇక్కడ అవసరం లేదు. మీరు వ్యాఖ్యను పోస్ట్ చేయగానే మీ పేరుతోనే ప్రకటింపబడుతుంది. వేరే వివరాలు అక్కర లేదు.
సుకవి మిత్రులు అంజన్న గారూ...నమస్సులు...స్వాగతం!
తొలగించండిశ్రీకృష్ణభగవానులవారి మిత్రుల మధ్య సంభాషణ:
రిప్లయితొలగించండిజవసత్వమ్ములఁ గూర్చెనే నరుని విశ్వాసమ్ము! గీతామృతం
బవనిన్ బంచగ విశ్వరూపమున! పుణ్యమ్ముల్ ప్రసాదించు చున్!
సవరింపంగ కుచేలు నయ్యటుకు లాస్వాదించి మేలెంచె! కే
శవ సందర్శనమిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా!"
నవనీత చోరుఁ గలిసిన
సవయస్కుండౌ కుచేలు సంపద పెరిగెన్
ప్రవచింప సందియమె? కే
శవ సందర్శనము పుణ్యసంపదలిచ్చున్!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఅవతారమ్ములు దాల్చినాడుపది యాహ్లాదమ్ము గల్పించ నా
రిప్లయితొలగించండిదివికిన్ భూమికి దైత్యులన్ దునిమి ; దృష్టిన్నిచ్చె వాంచింప కౌ
రవ నాధుండును గాంచి మోకరిల, రాధాలోలుడై వెల్గు కే
శవసందర్శన మిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా!
శివుడభిషేక ప్రియుడగు
భవబంధమ్ములు తొలగగ ప్రార్ధింపదగు
న్నవనికి మనుగడ నిడు కే
శవసందర్శనము పుణ్యసంపద లిచ్చున్
అవలో కించగ మనుజుడు
నవరసములు చిలికెడి రచనల పఠియించ
న్నవవిధ భక్తులతో , కే
శవసందర్శనము పుణ్యసంపద లిచ్చున్
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిభువిలో సత్పథము విడక
రిప్లయితొలగించండియవిరళమగు భక్తి తోడ నర్చన సేయన్
భవసాగరమీదగ కే
శవ సందర్శనము పుణ్య సంపద లిచ్చున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినవనవలాడెడి విరులను
రిప్లయితొలగించండిజవమున దారమున కట్టి స్వామికివేయన్
భువిలోచూడగ నా కే
శవ సందర్శనము పుణ్య సంపద లబ్బున్.
2.నవవిధ భకుతుల తోడన
నవరతము హరిని విడువక నారాధింపన్
భువిలో జనులకుయా కే
శవ సందర్శనము పుణ్య సంపదలబ్బున్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో ‘తోడను... జనులకు నా కే|శవ...’ అనండి.
భువిలో నెప్పుడు మరువక
రిప్లయితొలగించండికవనము జెప్పంగమీరు కాంక్షతొ వేడన్
భువనము లన్నియు గను కే
శవ సందర్శనము పుణ్య సంపదలిచ్చున్
శ్రీనివాసాచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. ‘కాంక్షను’ అనండి.
అవిరళ జిగీషతో కే
రిప్లయితొలగించండిశవ సందర్శనము పుణ్య సంపదలిచ్చున్
భవబంధమ్ములను విడిచి
భువి పేదల సేవసలుప ముక్తియు దక్కున్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శవ రూపంబున నాశివుండె పుడు నాశా జ్యోతులన్నీ యుచు
రిప్లయితొలగించండిన్నవసానంబున ముక్తినా బరఁగు నానై శ్వర్యము న్దా సదా
యివటూరీ ! నిక ఖఛ్చితంబ యిల నీ శుండేశుభంకా రుడున్
శవ సందర్శన మిచ్చు పుణ్యముల సత్సంపత్తు ల న్మిత్రమా !
మీ పూరణ బాగున్నది.
తొలగించండిఇవటూరీ అనేది సంబోధనా? అయితే దాని తర్వాత నుగాగమం రాదు. ‘..యిక..’ అనాలి కదా
భవితవ్యమ్మును కోరి కూరుచు స్వభావమ్మున్ విసర్జించుచున్
రిప్లయితొలగించండిభువిపై సంతత పేదవారలను సమ్మోదమ్ముతోగొల్చుచున్
భవబంధమ్ముల యుచ్చులోఁబడక సద్భక్తిన్ బలిధ్వంసి కే
శవ సందర్శనమిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా
భవితవ్యమ్మునకైదనమ్ముఁగొను భావమ్మున్ విసర్జించుచున్
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ మత్తేభ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు వు గా రూ ! క్ష మి ౦ చా లి !
రిప్లయితొలగించండి' ని హ్న వ ' లో ని ' హ్న ' కు
' మ ను ష్య ' లో ని ' ష్య ' కు
య తి స రి పో తు ౦ ద ను కు ౦ టా ను
భతవ్యంబునుపంచిపెంచగల సద్భావంబునీకుంచు |కే
రిప్లయితొలగించండిశవ సందర్శమిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా
అవకాశంబున భక్తి శక్తియని నాహ్లాదంబె నీవెంచగా
కవితా శక్తిని యుక్తియున్ నొసగ సంకల్పంబు నిన్నంటుగా|
2.వివరణ లడుగక భక్తిగ
శ్రవణము,గుడులందు పూజ శాంతమునందే
అవకాశంబునగని కే
శవ సందర్శనము పుణ్య సంపదలిచ్చున్|
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిGanges Cleaning Project:👇
రిప్లయితొలగించండిశవముల్ గాల్చుట గంగ యొడ్డునికపై సైచించ బోరంటగా!
ఎవడున్ రాడిట మూడు రోజులవగా నెచ్చోటకుం బోయిరో!
చవిలేదీ పని కూడు గుడ్డలిక నే సంపాదనం జేయలేన్...
శవసందర్శన మిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా!
రిప్లయితొలగించండికలియుగ శ్రీకృష్ణుడు భీమునితో:
జవరాలౌ తన భామినిన్ పితరునున్ జంబంపు భండారమున్
భవనమ్మున్ రణభూమినిన్ విడుచుచున్ భద్రమ్ముగా దాగుటన్
లవలేశమ్మును సిగ్గు వీడి సరసిన్ రంజిల్లు రారాజుదౌ
శవసందర్శన మిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా!