తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ఆవిర్భావదినోత్సవాలలో భాగంగా
రేపు (5-6-2016 నాడు)
తెలంగాణ ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖ, ‘తెలంగాణ పద్యకవితా సదస్సు’ అధ్వర్యంలో
‘పద్య తెలంగాణం’ పేరుతో
వివిధ జిల్లాలనుండి ఎన్నుకున్న 116 మంది పద్యకవుల సమ్మేళనం, సన్మానం
హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరుగనున్నది.
ఉదయం తొమ్మిది గంటలనుండి సాయంత్రం వరకు కవుల కవితాగానం. తదుపరి ఆ కవులకు సత్కారం.
ఆ సమ్మేళనంలో ఒక పద్యకవిగా పాల్గొనడానికి నాకు అవకాశం లభించిందని తెల్పడానికి సంతోషిస్తున్నాను.
గురువుగారూ, అభినందనలు
రిప్లయితొలగించండిఫణికుమార్ గారూ, ధన్యవాదాలు.
తొలగించండిశుభాభినందనలు గురువుగారూ .....నాకే అవకాశంవచ్చినంత ఆనందంగా వుంది
రిప్లయితొలగించండివిరించి గారూ, ధన్యవాదాలు.
తొలగించండిశంకరయ్య గారు!
రిప్లయితొలగించండినేను రేపు అక్కడ కవిగా పాల్గొనడమే కాకుండా, "హైదరబాదు జిల్లా కన్వీనర్" గా కూడ బాధ్యతను నిర్వహిస్తున్నాను.
రేపు రవీంద్రభారతిలో తప్పక కలుసుకొందాం.
కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని కలవాలన్న కోరిక రేపు తీరబోతున్నది. సంతోషం!
తొలగించండిచాలా సంతోషం.
తొలగించండిసాంద్రకీర్తిగలఫణీంద్రకవీంద్ర స
త్కవులసభకుజయము కలుగుగాక
కలుగుగాక జయము ఘనమైన సభలోన
కందిశంకరార్యకవివరులకు
ధన్యవాదాలు శ్యామలీయం గారు!
తొలగించండివచ్చె సుదినంబన బిలిచి
రిప్లయితొలగించండిరచ్చట! కంది కవి శంకరార్యుల కవితల్
మెచ్చుదురు జనులు మేలౌ !
వచ్చుదురు ఫణీంద్రవారు, వచ్చు జిలేబీ !
చీర్స్
సీ యు ఆల్
జిలేబి
జిలేబీ గారూ, ధన్యవాదాలు. మీరు రేపు అక్కడికి వస్తున్నారా?
తొలగించండిజిలేబి గారు .. ధన్యవాదాలు
తొలగించండిపద్యకవితా శారదామూర్తులు శ్రీశంకరార్యులకు శ్రీ ఆచార్య ఫణీంద్రులకు అభినందనలు. కార్యక్రమం దిగ్విజయంగా జరుగాలని కోరుచున్నాను.
రిప్లయితొలగించండితోపెల్ల వారూ, ధన్యవాదాలు.
తొలగించండిధన్యవాదాలు తోపెల్ల వారు.
తొలగించండిగురువుగారికి అభినందనలు...కార్యక్రమం సరస రసోన్నతం గావాలని కోరుకుంటున్నాను.... నమస్సులు
రిప్లయితొలగించండిశర్మ గారూ, ధన్యవాదాలు.
తొలగించండిగురువుగారికి అభినందనవందనములు....
రిప్లయితొలగించండిశైలజ గారూ, ధన్యవాదాలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సువర్ణ సుమన స్సుజ్ఞేయ సుగంధ సుమనిభ పద్య హారావలుల సభాసదుల హృదయాలను రంజింప జేయగలరని యాశిస్తున్నాము. సభలో నున్న కవి పుంగవు లందరు మీవంటి వారేనని భావించి నిర్భయముగ మీ స్వభావ సిద్ధపు చిత్త వృత్తి తో పాల్గొనండి. మా యానందమున కవధులు లేవు యీ వార్త విన్న తర్వాత. మీకు మా హృదయపూర్వకాభినందనలు!
రిప్లయితొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు. మొదటినుండీ నా బలహీనత సభాభీతి. సాధారణంగా నేను సభలు, సమావేశాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపకపోవడానికి అదే కారణం. తప్పనిసరిగా వేదిక ఎక్కితే కాళ్ళు, గొంతు వణుకుతాయి. ఎప్పుడు దిగిపోతానా అని భావిస్తాను. ఈ కారణం గానే మా వరంగల్లులో నాగురించి కాని, నా బ్లాగు గురించి కాని చాలామంది స్థానిక కవులకు తెలియదు. రేపు వేదిక మీద నా స్థితి ఎలా ఉంటుందో?
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మొదటి రెండు నిమిషములే భయమనిపిస్తుంది. అప్పుడు సభ ముందందరిని చూస్తూ గడపండి. వేదికమీద మాట్లాడేవారిని గమనించండి. భయము సర్దుకుంటుంది. అంతా బాగా జరగాలని యాశిస్తున్నాను.
తొలగించండిశుభం భూయాత్
రిప్లయితొలగించండిచాలా సంతోషంగా ఉంది.గురువు గారికి శుభాభినందన మందారములు
రిప్లయితొలగించండికవులసమ్మేళనమునందుకవితనీదు
రిప్లయితొలగించండిసరసమాధుర్యములతోడజదివియచట
శంకరాభరణమునకుశంకరయ్య!
మంచిపేరునుదెమ్ముమామందిలోన
మాస్టరుగారూ!మీకు. ఫణీంద్ర గారికి అభినందనలండీ..మన శంకరాభరణం " స్వరం " వినిపించే వరం..
రిప్లయితొలగించండిధన్యవాదాలు
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు! మిత్రులు కంది శంకరయ్య గారికి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండితెలంగాణ రాష్ట్ర ద్వితీయ ఆవిర్భావదినోత్సవాలలో భాగంగా
రేపు (5-6-2016 నాడు)
తెలంగాణ ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖ, ‘తెలంగాణ పద్యకవితా సదస్సు’ అధ్వర్యంలో
‘పద్య తెలంగానం’ పేరుతో వివిధ జిల్లాలనుండి ఎన్నుకున్న 116 మంది పద్యకవుల సమ్మేళనం, సన్మానం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరుగనున్నది.
ఉదయం తొమ్మిది గంటలనుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కవుల కవితాగానం. తదుపరి ఆ కవులకు సత్కారం.
ఆ సమ్మేళనంలో ఒక పద్యకవిగా పాల్గొనడానికి నాకు అవకాశం లభించిందని తెల్పడానికి సంతోషిస్తున్నాను. నాతో పాటుగా వరంగల్ లోని మా "కాకతీయ పద్య కవితా వేదిక" బృందం లోని మరి కొందరు పద్య కవులకు కూడా ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడానికి అవకాశం లభించింది. వారి వివరాలు....
వరంగల్లు కవుల బృందానికి సమన్వయ కర్త: శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు
01. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు
02. ఆరుట్ల భాష్యాచార్యులు
03. కంది శంకరయ్య
04. గుండు మధుసూదన్
05. పిట్టా సత్యనారాయణ
06. జీడికంటి శ్రీనివాస మూర్తి
07. బీటుకూరు శేషుకుమార్
08. పాతూరి రఘురామయ్య
09. ఎన్.వీ.ఎన్.చారి
10. పల్లేరు వీరస్వామి
11. అక్కెర సదానందా చారి
12. చేపూరు శ్రీరామారావు
ఇట్లు
భవదీయుఁడు
మధురకవి
గుండు మధుసూదన్
వరంగల్
కం అందరు కవివరులకు నభి
తొలగించండివందనములు కవుల గోష్ఠి వాసిన్ రాశిన్
సందేహమేల విపులా
నందకరంబగుచు వెలుగు నానాదిశలన్
ధన్యవాదాలండీ శ్యామలరావు గారూ!
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు! మిత్రులు కంది శంకరయ్య గారికి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండితెలంగాణ రాష్ట్ర ద్వితీయ ఆవిర్భావదినోత్సవాలలో భాగంగా
రేపు (5-6-2016 నాడు)
తెలంగాణ ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖ, ‘తెలంగాణ పద్యకవితా సదస్సు’ అధ్వర్యంలో
‘పద్య తెలంగానం’ పేరుతో వివిధ జిల్లాలనుండి ఎన్నుకున్న 116 మంది పద్యకవుల సమ్మేళనం, సన్మానం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరుగనున్నది.
ఉదయం తొమ్మిది గంటలనుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కవుల కవితాగానం. తదుపరి ఆ కవులకు సత్కారం.
ఆ సమ్మేళనంలో ఒక పద్యకవిగా పాల్గొనడానికి నాకు అవకాశం లభించిందని తెల్పడానికి సంతోషిస్తున్నాను. నాతో పాటుగా వరంగల్ లోని మా "కాకతీయ పద్య కవితా వేదిక" బృందం లోని మరి కొందరు పద్య కవులకు కూడా ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడానికి అవకాశం లభించింది. వారి వివరాలు....
వరంగల్లు కవుల బృందానికి సమన్వయ కర్త: శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు
01. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు
02. ఆరుట్ల భాష్యాచార్యులు
03. కంది శంకరయ్య
04. గుండు మధుసూదన్
05. పిట్టా సత్యనారాయణ
06. జీడికంటి శ్రీనివాస మూర్తి
07. బీటుకూరు శేషుకుమార్
08. పాతూరి రఘురామయ్య
09. ఎన్.వీ.ఎన్.చారి
10. పల్లేరు వీరస్వామి
11. అక్కెర సదానందా చారి
12. చేపూరు శ్రీరామారావు
ఇట్లు
భవదీయుఁడు
మధురకవి
గుండు మధుసూదన్
వరంగల్
అభినందనలు మధుసూదన్ గారు.
తొలగించండిఫణీంద్రగారికి,మధుసూదన్ గారికి అభినందనలు
రిప్లయితొలగించండిమధుసూదన్ గారికి మిగిలిన కవివరులందరికీ అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ మధుసూదన్ గారికి...ఆచార్య ఫణీంద్ర గారికి అభినందనలు..
రిప్లయితొలగించండిగురువుగారూ అభినందనలు.మధుసూదన్ గారికి మిగిలిన కవివరులందరికీ అభినందనలు.
రిప్లయితొలగించండి