జిలేబి గారు మాతో పాటు మీరుకూడా వస్తారని వేచిచూసాము మీరుకూడా మాతో వస్తే మేము వద్దంటామా చెప్పండి ?మీకంటే చిన్నవాడిని మీకు చెప్పకుండా రాములవారిని పిలిచినందుకు క్షంతవ్యుడను. నమస్సుమాంజలి కవిరాజవిరాజు లందరికీ .
చీమకు హాని చెయ్యకను చేవగ జీవని సాకువాడవే ప్రేమనుదార రీతినిడి ప్రీతిగ సేవలు సేయువాడవే రాముని భక్తి తోడుగను రాజ్యమునేలుచునున్న ధర్మ తృ ట్కాముడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోక మౌననన్||
కామము గ్రోధమున్ వదలి కాలము నందున గాంతులీని నీ లో మద మత్సరంబులను లోభము మోహము లన్ని వీడుచున్ ప్రేమను బంచుకొంచు సమరీతి జెలంగి జగమ్మునందు ని ష్కాముడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోకమౌనన్!
సన్యసింపగ పని లేదు! సాత్త్వికముగ నడుగులేయుచు కర్తవ్య మాచరించి కర్మ బద్ధత నెఱిగిన, కావె మోక్ష కాముడవు! ముక్తి దక్కుట కడు సులభము! గురువు గారికి, మిత్రులకు నమస్కారములు. నిన్నటి సమస్యకు నేను వ్రాసిన పూరణ కూడా చదువ గోరుతాను.
సకలమును మీకు సమకూర్చు సతిని నేను! మీ విజయ పరంపరకు మీ మీసము మెలి వేయు కార్యంబు నేనేల చేయననుచు వనిత మీసమ్ము నంటి తాబలికె నిట్లు!
భూమి నశాశ్వతంబులను బుధ్దిదలంచక నెల్లవేళలన్ కామమదాదిషట్కమును కట్టడి చేసి తదేకదీక్షమై రాముని లో దలంచి రఘురాముని దివ్యపదాబ్జసేవనా కాముఁడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోక మౌననన్
శ్యామలీయం గారూ, మీరు మరల పద్య రచనలో పాల్గొనటం ముదావహం. శబ్దసౌందర్యం కూడా చూసుకొంటే పద్యం పదునుగా బాగుంటుందని నమ్మేవారు మా చిన్నప్పటి తెలుగు మాస్టారిని గుర్తు చేసేవారు. "కామ మదాది..." అనే ప్రయోగం ఛందస్సుకోసమేనా ? కరక్టే అయినా ఏదో వెలితిగా ఉన్నట్లనిపిస్తోంది. కామ క్రోధాది అలవాటవటం వల్లనా?
మన తెలుగు వారి అభిమానానికి ధన్యవాదాలు. కామమదాది అన్న ప్రయోగం ఛందస్సౌలభ్యం కోసమే నండీ, అలాగని అది ఏదో ఆలోచించి తన్నుకొని వేసిందీ కాదు - అలా పడింది అంతే. అందులో విశేషం ఏమీ లేదు. అలవాటైన పిదప పదాలు తట్టటం సహజంగానే జరుగుతుంది. ఐతే కామక్రోధాదిగా వీటిని చదవటం అలవాటైన ప్రజకు కొంచెం తమాషాగా అనిపించటం కూడా అంతే సహజం. ధారాశుధ్ధిగా వచ్చిన పద్యం చదివే వారికి పసందుగా ఉంటుంది. అది వ్రాయసకాండ్రు అందరూ ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయమే.
సామము కోరుచున్ సుజన సంగతి పొందుచు నెల్లవేళలన్
రిప్లయితొలగించండినీమము తోడ భక్తి మెయి నేరమి పోవగ జ్ఞానమూర్తి వై
రాముని నామమున్ బలుక రాజిత మానసవీధినందు ని
ష్కాముడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోకమౌననన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ. నీమములెన్నొజేసిననునీదరిజేరరునీతిమంతులై
రిప్లయితొలగించండిసామముజెప్పువాడనిది సత్యమునీదెసవీడకుండ శ్రీ
రామసదార్చనంబెమది రాగముమీరుచుచిక్కబట్టుచున్
కాముఁడవైన, ముక్తియె సుఖంబుగ దక్కును లోక మౌననన్.
పిరాట్ల వారూ,
తొలగించండిబహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాముడు గానివా డెపుడు కాగల డేని?వినంగ చోద్యమౌ
రిప్లయితొలగించండివేమన వంటివారలు వివేకము నొందిరి భోగలాలసన్
రాముడు కోరిమా నవుల రాజస మందున నీతిజూపగన్
కాముఁడ వైనముక్తియె సుఖంబుగ దక్కును లోకమౌననన్
-------------------------------------
తే.గీ.
తావు లేదిల నీతికి తనరు మదిని
దొరికి నంతనె సుఖములు దోచు కొనగ
వేద పండితు లైనను వేశ్య కడకు
కాముఁడవు ముక్తి దక్కుట కడు సులభము
మీ రెండు పూరణలు (కొద్ది అన్వయలోపం ఉన్నా) బాగున్నవి. అభినందనలు.
తొలగించండియేసు ప్రభువుని మాటగ యేను జెబితి
రిప్లయితొలగించండినిది నిజముగ, తండ్రి దయన నీవు ప్రేమ
కాముఁడవు; ముక్తి దక్కుట కడు సులభము
నాతని పలుకుల వినంగ నాచరించ!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘మాటగ నే బలికితి...దయను నీవు..’ అనండి.
అన్నట్టు మీరు బాప్తిజం ఎప్పుడు తీసుకున్నారు?
తొలగించండికంది వారు :)
నెనర్లు !
ఆల్రెడీ తోపెల్ల వారు, పిరాట్ల వారు, రాజేశ్వరి అక్కయ్య గారూ అందరూ రాముల వారిని ఆహ్వానించేసారు !
యిక ప్రభువే గతి యని యేసు వారి మీద బాణం :)
నెనర్లు
జిలేబి
జిలేబి గారు మాతో పాటు మీరుకూడా వస్తారని వేచిచూసాము మీరుకూడా మాతో వస్తే మేము వద్దంటామా చెప్పండి ?మీకంటే చిన్నవాడిని మీకు చెప్పకుండా రాములవారిని పిలిచినందుకు క్షంతవ్యుడను. నమస్సుమాంజలి కవిరాజవిరాజు లందరికీ .
తొలగించండిడా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
రిప్లయితొలగించండిSK2031అకస
కామమె నాకు ముఖ్యమని కాంక్షల కోరల యందు నల్గకన్
నీమము తోడ జీవనము నేలుము మేల్కొ ని దైవ చింతనన్
రాముని ధర్మ మా ర్గమున నిల్చుచు తృప్తి తోడ సత్
కాముడవైన ముక్తియె సుఖం బున దక్కును లోక మౌనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవపాదంలో గణదోషం, యతిదోషం. ‘రాముని ధర్మమార్గమున రాగముతోడను నిల్చియుండి సత్...’ అందామా?
చీమకు హాని చెయ్యకను చేవగ జీవని సాకువాడవే
రిప్లయితొలగించండిప్రేమనుదార రీతినిడి ప్రీతిగ సేవలు సేయువాడవే
రాముని భక్తి తోడుగను రాజ్యమునేలుచునున్న ధర్మ తృ
ట్కాముడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోక మౌననన్||
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాముఁడు చాటునుండి కఱకంఠుని పైనను బాణమేయగా
రిప్లయితొలగించండిబాముల దాల్చువాడు దన ఫాలపు టగ్నిని గాల్చివేసెగా
కాముని కాల్చినట్టి మన కల్మష కంఠుని భక్తి యుండగా
కాముఁడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోక మౌననన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రజల కున్ సేవ చేయుచు నిజముగాను
రిప్లయితొలగించండిసత్య పథమున పయనించు నిత్య శాంతి
కాముడవు ముక్తి దక్కుట కడు సులభము
సాగు మటులనే మిత్రమా సంతతమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రేమ యున్నది పదుగురి ప్రీతి గనగ
రిప్లయితొలగించండిదాన మున్నది దీనుల దరిని జేర
మానవుని గను సాగిపో! మాన్యతా ప్ర
కాముడవు ముక్తి దక్కుట కడు సులభము!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రేమ యున్నది పదుగురి ప్రీతి గనగ
రిప్లయితొలగించండిదాన మున్నది దీనుల దరిని జేర
మానవుని గను సాగిపో! మాన్యతా ప్ర
కాముడవు ముక్తి దక్కుట కడు సులభము!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిన్నటి సమస్యకు పూరణము
రిప్లయితొలగించండివిరటు గొల్వున కీచక సరసమునకు
భీము డేతెంచె నబలగ భేద మెంచి
భామ యనుకొని యువరాజు భీము గనక
వనిత మీసమ్మునంటి తా బలికె నిట్లు!
"పడతి!? నీకు మీసముకూడ! బాగు! బాగ!"
నంచు మోహమున దనమది నెంచలేక!
(విఙ్ఞులు మన్నించాలి...కీచకుడలా అన్నాడో లేదో గాని...పూరణలో చిత్రించాను)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్యాపూరణలో ఇటువంటివి సామాన్యమే.
కామమె క్రోధమూలమగు,కామమె ద్వేషపు బీజమౌనుగా,
రిప్లయితొలగించండికామమె భూరిసంపదవిఘాతము,కామమె కీర్తిహారియౌ,
క్షేమము గోరినన్సతము శ్రీరఘునందను వేడికొంచు-ని
ష్కాముడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోకమౌనన్.
*******(***************(**************
రామ కథనెల్ల నేనటు వ్రాయబూన
స్వప్నమందున గరుణించి స్వామి బలికె
నిర్మలానంద తేజుడై "నీవు విజిత
కాముడవు ముక్తిదక్కుట కడు సులభము".
*****************-----***************
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికాముడవు ముక్తి దక్కుట కడు సులభము
రిప్లయితొలగించండికాంత ! ముమ్మాటికినిజము కామ మదియు
దైవ నామము ,పూజలు దర్శన ముల
నెడల లగ్నమై నుండుచో నీపు డమిని
ముక్తి నొందుదు వనుమాన మొంద వలదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రేమ మయంపు లోకమిది ద్వేషము వీడియు నిత్యముం బరం
రిప్లయితొలగించండిధాముని భక్తిఁ గొల్చుచు నుదారత దీనుల నుద్ధ రించుచున్
సామ గుణంబునం బనులఁ జల్పుచు నిర్మల వృత్తి నుండి ని
ష్కాముఁడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోక మౌననన్
ఇంద్రాది దేవతలు మన్మధుని నీశ్వరునికి పార్వతి మీద ప్రేమ పుట్టింప వేడుకొను సందర్భము:
పార్వతీపరమేశ్వర పావన పరి
ణయము జేయ పూనుకొనుము రయమున నిలఁ
జూడ సామాన్యుడవు గావు సుమ్మి నీవు
కాముఁడవు ముక్తి దక్కుట కడు సులభము
[కాముడు = మన్మధుడు]
మీ రెండు పూరణలు శ్రేష్ఠంగా ఉన్నాయి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండినేమము దోడ నెప్పుడును నీరజ నాభుని మ్రోలనే దగ
రిప్లయితొలగించండిన్గా మము గల్గుచు న్భజన గారవ మొప్పగ జేయుచో నిక
న్గా ముడ వైన ముక్తియె సుఖంబుగదక్కును లోకమౌన
న్బా ముల దాల్చువాని నిల బ్రార్ధన జేయుమ యెల్ల వేళలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్షేమమొసంగు సౌఖ్యమని చేరిన కోర్కెలు నమ్మి మూఢతన్
రిప్లయితొలగించండిపామరుడయ్యు పాపములు పంతము నందునజేర్చ బోకనే
రాముని నమ్మియున్ తగువిరామము నందున భక్తి యుక్తితో
కాముడ వైన ముక్తియె|సుఖంబుగ దక్కును లోక మౌననన్|
2.కాముడవు ముక్తి దక్కుట కడు సులభము
నియమ,నిష్ఠగ నిమిషము నిలిపి మనసు
చంచలత్వము విడనాడి జరుపు తపము
ఎవరి కైనను సాధ్యమేనెంచి జూడ| {పూర్వముతపస్సు వందల వేలఏళ్ళుజేసినదేవుడు గనుపించడు కాని కలికాలమునఒక్క నిమిషము చాలుచంచలత్వము లేనిమనసుఅన్నభావన}
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిహరియు ప్రహ్లాదు తోడను యెలమి బలికె
రిప్లయితొలగించండివత్స, యైహిక వాంఛల వదిలి పెట్టి
భక్తి చింతన కలిగిన వర ముముక్ష
కాముడవు ముక్తిదక్కుట కడు సులభము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘తోడఁ దా నెలమిఁ బలికె’ అనండి.
గురువుగారూ, సవరణకి ధన్యవాదములు.
తొలగించండికామన లన్ని దీరగ జగమ్ముల నేలెడి వెంకటేశునిన్
రిప్లయితొలగించండినేమము తోడ పూజలను నిత్యము జేయ ఫలమ్ములిచ్చు,నే
కామన లేక లోకహిత కార్యముదీర దధీచిలా యశః
కాముఁడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోక మౌననన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధర్మపథమును విడకుండ దయను కలిగి
రిప్లయితొలగించండితల్లిదండ్రుల సేవించు తనయుడవయి
నీశ్వరారాధనను జేయు చిలన మొక్ష
గాముడవు ముక్తి దక్కుట కడుసులభము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘...జేయుచు నిలను...’ అనాలి. అక్కడ ‘..నీశ్వరారాధనమ్మున నిలను మోక్ష...’ అనండి.
భామలు సంపదల్ ధనము భాగ్యము లంచును తృప్తి లేక నీ
రిప్లయితొలగించండినీమము లెల్ల మంటబడ నీతిని దప్పుచు వాని వెంబడిన్
సేమమె పోవ శ్రీచరణ చిన్మయ మూర్తిని జేరు సద్యశః
కాముడ వైన ముక్తియెసుఖంబుగ దక్కును లోక మౌననన్|
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధర్మ మార్గమ్ము దప్పక దరణి యందు
రిప్లయితొలగించండివిత్త మార్జించి రేబవల్ విసుగు లేక
మంచి పనులెన్నొ జేయుచు మసలు కీర్తి
కాముడవు ముక్తి దక్కుట కడుుసులబము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినా రెండవ పూరణము:
కామము గ్రోధమున్ వదలి కాలము నందున గాంతులీని నీ
లో మద మత్సరంబులను లోభము మోహము లన్ని వీడుచున్
ప్రేమను బంచుకొంచు సమరీతి జెలంగి జగమ్మునందు ని
ష్కాముడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోకమౌనన్!
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేమము దప్పకుండ ప్రతి నిత్యము చిత్తము నందు శ్రీ
రిప్లయితొలగించండిరాముని, సద్గుణోత్తముని రమ్యపదమ్ముల దల్చినంతనే
క్షేమమొ సంగువాడతడు శ్రీకర కారకు డైనవాడు ని
ష్కాముడవైన ముక్తియె సుఖంబుగ దక్కును , లోకమౌననున్ .
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటిపాదంలో గణదోషం. ‘చిత్తమునందు నిల్పి శ్రీ...’ అందామా?
సన్యసింపగ పని లేదు! సాత్త్వికముగ
తొలగించండినడుగులేయుచు కర్తవ్య మాచరించి
కర్మ బద్ధత నెఱిగిన, కావె మోక్ష
కాముడవు! ముక్తి దక్కుట కడు సులభము!
గురువు గారికి, మిత్రులకు నమస్కారములు. నిన్నటి సమస్యకు నేను వ్రాసిన పూరణ కూడా చదువ గోరుతాను.
సకలమును మీకు సమకూర్చు సతిని నేను!
మీ విజయ పరంపరకు మీ మీసము మెలి
వేయు కార్యంబు నేనేల చేయననుచు
వనిత మీసమ్ము నంటి తాబలికె నిట్లు!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాము భజించుచున్ మహిని ప్రాణము కల్గిన కాలమంతయున్
రిప్లయితొలగించండిగ్రామము లందునన్ బ్రతుకు కష్టపు జీవుల గూర్చితల్చుచున్
క్షేమముగా వసించుటకు చేయుచు వారికి తోడుపాటు ని
ష్కాముడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోకమౌననన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏమరు పాటు లేక హరినే స్మరియించుచు రేబవళ్లు నీ
రిప్లయితొలగించండిక్షేమమె గాక జీవులకు సేమము గూర్చెడి చింత జేయుచున్
కామము క్రోధమున్ మదము క్రన్నన వీడుచు, భక్తియుక్తులన్
కాముఁడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోక మౌననన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ మహి కామ క్రోధములు నెప్పుడు నీధరి జేరకుండ శ్రీ
రిప్లయితొలగించండిరాము పదాంబుజంబులను రంజిల గొల్చుచు చిత్త శుద్ధితో
ప్రేమ సుధా సదా ప్రజల పెంపును గోరియు పంచుచున్ యశ:
కాముడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోకమౌనన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘ప్రేమసుధన్’అనండి.
కాముడవు ముక్తి దొరకుట కడుసులభము
రిప్లయితొలగించండికాదు, విషయవాసనవీడ కల్గుసుఖము
దీని నరయుచు మసిలిన దేశమందు
మంచి పేరునందగలవు మరువకయ్య
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘మసలిన’ అనండి.
పావనంబైన శ్రీరామపాదతీర్థ
రిప్లయితొలగించండికాముఁడవు ముక్తి దక్కుట కడు సులభము
మారుతీ నీవు చూపిన మార్గమందు
నడచుచుండెడి నరులకు నమ్మకముగ
మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
తొలగించండిభూమి నశాశ్వతంబులను బుధ్దిదలంచక నెల్లవేళలన్
రిప్లయితొలగించండికామమదాదిషట్కమును కట్టడి చేసి తదేకదీక్షమై
రాముని లో దలంచి రఘురాముని దివ్యపదాబ్జసేవనా
కాముఁడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోక మౌననన్
>రాముని లో దలంచి రఘురాముని దివ్యపదాబ్జసేవనా
రిప్లయితొలగించండిబదులుగా
రాముని లో దలంచి రఘురామపదాంబుజనిత్యసేవనా
అన్నా బాగుంటుంది.
అద్భుతమైన పూరణ. అభినందనలు.
రిప్లయితొలగించండి‘సాహితీకాముఁడ నాకు రక్తిని సుఖంబుగ నిచ్చితె ధన్యవాదముల్’
శ్యామలీయం గారూ, మీరు మరల పద్య రచనలో పాల్గొనటం ముదావహం. శబ్దసౌందర్యం కూడా చూసుకొంటే పద్యం పదునుగా బాగుంటుందని నమ్మేవారు మా చిన్నప్పటి తెలుగు మాస్టారిని గుర్తు చేసేవారు. "కామ మదాది..." అనే ప్రయోగం ఛందస్సుకోసమేనా ? కరక్టే అయినా ఏదో వెలితిగా ఉన్నట్లనిపిస్తోంది. కామ క్రోధాది అలవాటవటం వల్లనా?
రిప్లయితొలగించండిమన తెలుగు వారి అభిమానానికి ధన్యవాదాలు. కామమదాది అన్న ప్రయోగం ఛందస్సౌలభ్యం కోసమే నండీ, అలాగని అది ఏదో ఆలోచించి తన్నుకొని వేసిందీ కాదు - అలా పడింది అంతే. అందులో విశేషం ఏమీ లేదు. అలవాటైన పిదప పదాలు తట్టటం సహజంగానే జరుగుతుంది. ఐతే కామక్రోధాదిగా వీటిని చదవటం అలవాటైన ప్రజకు కొంచెం తమాషాగా అనిపించటం కూడా అంతే సహజం. ధారాశుధ్ధిగా వచ్చిన పద్యం చదివే వారికి పసందుగా ఉంటుంది. అది వ్రాయసకాండ్రు అందరూ ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయమే.
తొలగించండిస్తంబమందున శ్రీహరిన్ చక్కగాను
రిప్లయితొలగించండిచూపినమహిమో పేతుడా చూడుమీవు
కాముడవు ముక్తి దక్కుట కడు సులభమ
టంచు బోధించినావయ్య యసుర కులజ
స్తంబమందున శ్రీహరిన్ చక్కగాను
రిప్లయితొలగించండిచూపినమహిమో పేతుడా చూడుమీవు
కాముడవు ముక్తి దక్కుట కడు సులభమ
టంచు బోధించినావయ్య యసుర కులజ
నీదు మంత్రులు దోచిన సాధువగుచు!
రిప్లయితొలగించండివెరశి పైకమ్ము నాకంటు వెంటఁ బడవు!
భంటువై యమ్మకున్ వంత బలుకు, మౌన
కాముడవు ముక్తి దక్కుట కడు సులభము!
గోముగ మాటలాడుచును గొప్పగ నేతల స్నేహమొందుచున్
రిప్లయితొలగించండినీమము లేకయే కడుపు నిండుగ బ్యాంకుల కొల్లగొట్టుచున్
క్షేమము గోరుచున్ కనుల కింపుగ లండను జారుకొంటయే
కాముఁడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోక మౌననన్