16, జూన్ 2016, గురువారం

సమస్య - 2063 (రావణుఁడున్ విభీషణుఁడు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“రావణుఁడున్ విభీషణుఁడు రాముని పుత్రులు ధర్మవర్తనుల్”
లేదా...
“రావణ విభీషణులు రఘురాము సుతులు”
(మొన్న ఎడమకంటి శస్త్రచికిత్స (కాటరాక్ట్) విజయవంతమయింది. 
నాలుగైదు రోజులు కంటికి శ్రమ కలిగే పనులు చేయరాదన్నారు. 
రేపటినుండి సాధ్యమైనంత వరకు మీ పూరణలను సమీక్షిస్తాను)

39 కామెంట్‌లు:

  1. !! సర్వ చలనచిత్ర విషయ ఙ్ఞాన ధనులు
    శాస్త్ర విషయ విముఖ మూర్ఖ జనుల , సూర్య
    వంశ నృపులక్రమము కోర వారు జెప్పె
    రావణ విభీషణులు రఘురాము సుతులు !!


    మీరు త్వరగా కోలుకుని యధావిధి ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటూ , ధన్యవాదాలు -- కళ్యాణ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పురాణజ్ఞానశూన్యుల సమాధానంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు. ధన్యవాదాలు.

      తొలగించండి
  2. గురువు గారికి నమస్కారములు. మీ కంటి శస్త్ర చికిత్స జయప్రదంగా జరిగినందుకు సంతోషంగా వుంది. మీ రాక కోసం బ్లాగ్ లో ఎదురు చూస్తున్నాము. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  3. గురువర్యులకు నమస్సులు. వైద్యులు చెప్పినట్లు ఐదు రోజులవరకు మీరు సమీక్షలు చేయ వద్దు. కామేశ్వర రావు గారూ, గుండు మధుసూధన్ గారు సమీక్షిస్తే సరిపోతుంది. నల్ల కళ్ళ జోడు ఐదు దినములవరకు తీయవద్దు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు.
      బ్లాగును చూడకపోవడం, సమీక్షించకపోవడం ఏదో తప్పు చేసిన భావాన్ని కలిగిస్తున్నది. నల్ల కళ్ళజోడు పెట్టుకొనే సిస్టం ముందు కూర్చున్నాను. మీ సలహాను పాటిస్తాను.

      తొలగించండి
  4. అన్నదమ్ములు నల్వురు నెన్నదగిన
    నటులు నాటక రంగాన పటిమగలుఁగ
    వారి వయసుకు సరిపడు పాత్రలన్న
    రావణ విభీషణులు, రఘురాము సుతులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాటకసమాజంలోని వ్యక్తులపై మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సహదేవుడు గారూ! అన్నదమ్ములనెన్నిన మీ పూరణ మిన్నగానున్నది.

      తొలగించండి
  5. సమస్య

    { నిన్నటి కుచేల వృత్తా౦తము }

    అనఘుడు , విప్రవరు౦డు , నఖిలసద్గుణమూర్తి , మాన ధను , డగుచు౦ గుచే లాభి ధానమునన్ గ్రాలు నాత డనుభవి౦చె పటు దారిద్ర్య ;
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,

    మతని సతీమణి , " నాధ ! చనుమ , యష్మద్మిత్రు డైన
    శౌరి నర్థి౦చుమయ్యా త
    దనురాగ దీప్తి దారిద్ర్య
    మను న౦ధమున్ దొలగి౦చు "
    ననుచు వచి౦పగ " నేడె
    యరిగెదన్ గాన్క నేదైన c
    గొనిపోవ వలదె " యన౦గ c
    గోమలి తప్త త౦డులము లను జీర్ణ వస్త్ర౦బు న౦ దు
    లాఘవముగ ముడివైచి ి
    యనుపన్ గుచేలుడు చనియె ె
    హరి దర్శ నోత్సాహి యగుచు

    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఘన సుదర్శన హస్తుడును , జ
    గత్ప్రశస్తుడు , దైన్యవదను c
    గని న౦త , వాత్సల్య మెసగ c
    గౌగిలి౦చుచు నిజ తల్ప
    మున c గూరు చు౦డ నొనర్చి
    ముదమున పదముల c గడిగి తన మస్త మ౦దున జలము
    దాలిచి మృదు తాళవృ౦త
    మున వీచు చనియె , " సా౦దీప
    ముని శిష్యుల మయిన యట్టి ి
    మన మిరువురమును సరి స
    మానమె | యది సరియె మరి ,
    చిననాటి మిత్రుడ నేను
    చెపుమ , యుపాయన మేది ? "
    యనుచు ప్రశ్ని౦ప , క్ష్మా సురుడు
    హరికి చిపిటముల నీయ
    వెనుదీయు చు౦డగ న౦త
    వెన్నుడు గమని౦చి యనియె ,
    " తనియి౦చ గలదు నన్నే ప
    దార్థ మైన విశుధ్ధ భావ మున సమర్పి౦చగ : నిమ్ము భూసుర స౦దియ మేల ? యనుచు పృథుకత౦డులముల
    హస్తమునన్ లాగి కొనుచు
    తిన దొడ౦గెను వెన్న దొ౦గ
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఒనరెన్ గుచేలునకున్ మ
    హోన్నత౦బైన వైభవములు ! !

    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారు నమస్కారములు. మధ్యాక్కర (మాలిక) లో మీ కుచేలోపాఖ్యానము మనోహరముగ నున్నది.
      “గాన్క; పృథుక; లాగి కొనుచు” లలో “క” నిషిద్ధాక్షర నియమమునకు భంగము కల్గినది.
      “నిజతల్ప” పాదములో గణ భంగము.
      ఆఖరి పాదము(“తిన దొడంగెను వెన్న దొంగ ఒనరెన్ గుచేలు నకున్ మ హోన్నతంబైన వైభవములు”) మాలికలోనిమడక గణ భంగము నధిక గణములును. పరిశీలించ గలరు.
      పాద క్రమము ప్రకారము ముద్రించిన చదువుటకు సౌకర్యముగా నుండును.
      గురువు గార్కి విశ్రాంతి నీయ దలచి నేను నాకు తెలిసినంతవరకు వివరించితిని. దయ జేసి యన్యధా భావించవలదు.

      తొలగించండి
    2. అనఘుడు , విప్రవరుండు , నఖిలసద్గుణమూర్తి , మాన
      ధను , డగుచుం గుచే లాభి ధానమునన్ గ్రాలు నాత
      డనుభవించె పటు దారిద్ర్యమతని సతీమణి , " నాధ !
      చనుమ , యష్మద్మిత్రు డైన శౌరి నర్థించుమయ్యా త
      దనురాగ దీప్తి దారిద్ర్య మను నంధమున్ దొలగించు
      ననుచు వచింపగనేడె యరిగెదన్ గాన్క నేదైన c
      గొని పోవ వలదె " యనంగ c గోమలి తప్త తండులము
      లను జీర్ణ వస్త్రంబునందు లాఘవముగ ముడివైచి
      యనుపన్ గుచేలుడు చనియె హరి దర్శ నోత్సాహి యగుచు

      ఘన సుదర్శన హస్తుడును , జ గత్ప్రశస్తుడు , దైన్యవదనుc
      గని నంత , వాత్సల్య మెసగ c గౌగిలలించుచు నిజ తల్ప
      మున c గూరు చుండ నొనర్చి ముదమున పదముల c గడిగి
      తన మస్త మందున జలము దాలిచి మృదు తాళవృంత
      మున వీచు చనియె , " సాందీప ముని శిష్యుల మయిన యట్టి
      మన మిరువురమును సరి స మానమె | యది సరియె మరి ,
      చిననాటి మిత్రుడ నేను చెపుమ , యుపాయన మేది ? "
      యనుచు ప్రశ్నింప , క్ష్మా సురుడు హరికి చిపిటముల నీయ
      వెనుదీయు చుండగ నంత వెన్నుడు గమనించి యనియె ,
      తనియించ గలదు నన్నే ప దార్థ మైన విశుధ్ధ భావ
      మున సమర్పించగ : నిమ్ము భూసుర సందియ మేల ?
      యనుచు పృథుకతండులముల హస్తమునన్ లాగి కొనుచు
      తిన దొడంగెను వెన్న దొంగ ఒనరెన్ గుచేలు నకున్ మ హోన్నతంబైన వైభవములు ! !

      తొలగించండి
    3. “యష్మద్మిత్రు డైన” “యుష్మద్మిత్రుడైన” నకు ముద్రణా లోప మనుకుంటాను.

      తొలగించండి
    4. “క్ష్మా సురుడు” విషయములో నియమ భంగ మయినట్లా కాదా యనునది నాకు సంశయమే. “క్ష” గబ్బిలములాంటిది. స్వతంత్రాక్షరముగాను, క కార సంయుక్తముగాను కూడ భావించ వచ్చునేమో?

      తొలగించండి
  6. రావణుడు జచ్చి బుట్టె వైరమ్ము బూని,
    ఋణము దీర్చగ బుట్టె విభీషణుండు ,
    కవలలకు జన్మ నిచ్చెనీ కలిని సీత
    రావణ విభీషణులు, రఘురాము సుతులు
    2.రవము జేయును నిరతము రావణుండు
    సతము కామించి కన్యల సంగమించు
    వినయ సంపన్నుడౌను విభీషణుండు
    రావణ విభీషణులు రఘురాము సుతులు

    రిప్లయితొలగించండి
  7. రెండు ప్రశ్నల నడిగెద రేఖ చెపుమ!
    వాసి గాంచిన తాటకి పౌత్రులెవరు?
    లవకుశులనగ నెవ్వరు? వివరముగను
    రావణ విభీషణులు, రఘురాము సుతులు!!!

    రిప్లయితొలగించండి

  8. సంతసంబునుగలిగెనుశంకరార్య!
    కంటివైద్యముసుఖముగగలుగుకతన
    సకలశుభములుగలిగించుశంకరుండు
    కంటికినిరెప్పయట్ల్డయికాచుగాత!

    రిప్లయితొలగించండి
  9. అరయ నగుదురు సోదరు లవని యందు
    రావణ విభీ ష ణు లు ,రఘు రాము సుతులు
    కవల పిల్లలు ,వీరులు లవుడు కుశులె
    యారితే రిరి విలువిద్య యందు వారు

    రిప్లయితొలగించండి
  10. పరుని భార్యయు నైనట్టి పడతి కార
    ణమ్ము పెనుగు లాడిన యన్న దమ్ములెవరు
    సీత చెంత రామవినుతి జేసెనెవరు
    రావణ విభీషణులు, రఘురాము సుతులు

    గురువుగారూ, శస్త్ర చికిత్స విజయవంతమయినందుకు శుభాభినందనలు. మీరు విశ్రాంతి తీసుకోండి.

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. సోదరులుగ జనిం చిన సూడులెవరు?
    భూమిజకు కాననమ్మునఁ బుట్టితాము
    తండ్రితో ననిఁజేసిన తనయులెవరు?
    రావణ విభీషణులు, రఘురాము సుతులు
    సూడుః పగవాడు

    రిప్లయితొలగించండి
  14. ఆ వనమందయోనిజకు నర్క సమానులు నుద్భవించి రా
    పావనమైన సూర్యకుల పార్థులు తండ్రిని మించు శూరులుం
    జూవె మహారథుల్ లవకుశుల్, మరి వైరుల కెల్ల నిత్యమున్
    రావణుఁడున్ విభీషణుఁడు, రాముని పుత్రులు ధర్మవర్తనుల్

    ఇన కులాబ్ధి సోములు ధరణీశ సుతులు
    కుశలవులు మహావీరులు, కువలయమున
    శత్రు రాజులకును హరిస్వప్ను లనగ
    రావణ విభీషణులు, రఘురాము సుతులు

    [ రావణుఁడు = హింసించు వాడు; విభీషణుఁడు = భయంకరమైన వాడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ కంటి శస్త్ర చికిత్స జయప్రద మైనందులకు చాల సంతోషము. మొదటి వారము రోజులు జాగ్రత్తలు చాలా ముఖ్యము. తరువాత మామూలుగా నుండవచ్చును. తగిన విశ్రాంతి తీసుకోండి.

      తొలగించండి
  15. ఎవడు కపటాన సీతమ్మ నెత్తుక జనె?
    నెవడు రావణు మర్మంబు నెరుక జేసె?
    లవకుశుల నంగ నెవ్వరీ యవనిపైన?
    రావణ, విభీషణులు; రఘురామసుతులు.

    రిప్లయితొలగించండి
  16. త్రోవలు వేరుగాఁజనిరి తోడుగ బుట్టియు నన్నదమ్ములౌ
    రావణ విభీషణులు, రాముని పుత్రులు ధర్మవర్తనుల్
    చేవను జూపి యుద్ధమును జేసిరి పట్టిన హేషి రక్షకై
    యావల రాజులై జగతి హర్షము తోడుత నేలిరిచ్చతో

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. .” జీవన సారమున్ నడుప?చింతనుబాపగ నాటకాలలో
    రావణుడున్ విభీషణుడు”రాముని పుత్రులు ధర్మ వర్తనుల్|
    దీవెన లంది లక్ష్యమున దీప్తిని బెంచిరియింటివారలే
    ఏవిధమైన మోసముల నెంచనిమార్గమె నాటకంబనిన్.
    2”.కావరము వరమేగద ఘనతయనిరి
    రావణ విభీషణులు”|”రఘురాముసుతులు
    లవుడు కుశుడును రామునిలక్ష్య ముంచె”
    లవకుశుల సినిమాపాటవివరణందు.

    రిప్లయితొలగించండి
  19. ఆ వసుధ న్జనించె నుగ నిర్వురు భ్రాతలు వారలే గదా
    రావణు డున్వి భీషణుడు ,రాముని పుత్రులు ధర్మ వర్తను
    ల్యీ వ యెరుంగుమా మఱియు నెవ్వరి కెప్పుడులొంగ లేదని
    న్నివసు ధన్గనంబడునె నిట్టిమాహాత్ములు నెంత గా గనన్

    రిప్లయితొలగించండి
  20. దైవ రిపుండు రావణుడు ధాత్రిజ మ్రుచ్చిలి జచ్చెరాముచే,
    భావన జేసి భక్తి మెయి భాగవతుండు విభీషణుండుయున్,
    ఈవిధి రోయి దీర్చుకొన నీ యుగమందు జనించి నారిలన్
    రావణుఁడున్ విభీషణుఁడు, రాముని పుత్రులు ధర్మవర్తనుల్

    రిప్లయితొలగించండి
  21. రామ లక్ష్మణులకు తోడు రామ కథలు
    శోధనమొనర్చె నెందరో సోదరులను
    గూర్చి! వాలి సుగ్రీవులు, కుంభ కర్ణ
    రావణ విభీషణులు, రఘు రాము సుతులు!

    రిప్లయితొలగించండి
  22. మాన్యులు శంకరయ్య గారికి నమస్సులు.మీ కంటి శస్త్రచికిత్స విజయవంతమైనందుకు చాల సంతోషము.

    భావ విరోధులై జనన బంధమునొందిరి సోదరాకృతిన్
    రావణుడున్ విభీషణుడు, రాముని పుత్రులు ధర్మ వర్తనుల్
    పావనజీవియై కరుణ పండిన సన్మునివర్యు నీడలో
    చేవగలట్టి వీరులుగ జీవమునందిరి సూర్యతేజులై.

    దానవకుల సంజాత సోదరులు వీరు
    రావణ విభీషణులు, రఘురాముసుతులు
    ఘన ఇనకులాగ్రగణ్యులు కవలలెన్న
    శిల్పి వాల్మీకి చెక్కిన శ్రేష్ఠతములు.

    రిప్లయితొలగించండి
  23. అన్నదమ్ములు వైరులై అవ్వరాదు
    రావణ విభీషణులు; రఘురాము సుతులు
    లవకుశులవోలె జతకవులల్లె యుండ
    దగు పరస్పర మైత్రి యాదర్శముగను॥

    రిప్లయితొలగించండి
  24. అన్నదమ్ములు వైరులై అవ్వరాదు
    రావణ విభీషణులు; రఘురాము సుతులు
    లవకుశులవోలె జతకవులల్లె యుండ
    దగు పరస్పర మైత్రి యాదర్శముగను॥

    రిప్లయితొలగించండి
  25. మిత్రులందఱకు నమస్సులు!

    జీవన మూల్యమున్ బెనుపఁ జింతయె సుంతయు లేక దౌష్ట్యతన్
    జేవనుఁ జూపుచున్ బగఁగొనెన్ గఱఁ; టింకొకఁ డెంతొ యుత్తముం;
    డీ వసుధన్ గనెన్ ఘనుఁడు, ధీరుఁడు విశ్రవసుండు; చూడ వారలే

    రావణుఁడున్, విభీషణుఁడు! రాముని పుత్రులు ధర్మవర్తనుల్;
    తావలమౌచు భ్రాతృమమతన్ వెలయించిరి నీతిమంతులై!

    రిప్లయితొలగించండి
  26. తాతయొక్కడు మరియును తండ్రియొకడు
    కవలపిల్లలు గూడను కలసి నటులు
    వారు పేరొందె పాత్రల వరుసగాను
    రావణ విభీషణులు, రఘురాము సుతులు

    రిప్లయితొలగించండి
  27. శైవమటంచునగ్రజుడు శర్వుని గొల్చుచునుండ శాంతుడై
    పావనుడైన విష్ణువును భక్తిగ గొల్చిన తమ్ముడెవ్వరో
    పావన మైన రామకథ పాడినదెరెవ్వరెలాంటి వారిలన్
    రావణుడున్ విభీషణులు, రాముని పుత్రులు, ధర్మవర్తనుల్

    విశ్రవసుని సంతానము వీరిరువురు
    రావణవిభీషణులు, రఘు రాము సుతులు
    లవకుశులను కవలలేను లక్షణమగు
    రామకథను పాడిరిగద రమ్యముగను

    * నిన్నటి నిషిద్ధాక్షరి*

    సంతానము మెండవగను
    సంతాపమె మిగిలెనయ్యె సంపద లేమిన్
    చింతింపగ, సతి చెప్పెను
    శాంతముతో మాధవుండె శరణమ్మనుచున్

    ధనపతి మిత్రుండైనను
    ధనలేమిచె బాధపడు సుధాముని తోడన్
    వనితయె సూచించెను యా
    జనవంద్యుని శరణు వేడు సంపదలొసగున్

    రిప్లయితొలగించండి
  28. దైవ రిపుండు రావణుడు ధాత్రిజ మ్రుచ్చిలి జచ్చెరాముచే,
    భావన జేసి భక్తి మెయి భాగవతుండు విభీషణుండుయున్,
    ఈవిధి రోయి దీర్చుకొన నీ యుగమందు జనించి నారిలన్
    రావణుఁడున్ విభీషణుఁడు, రాముని పుత్రులు ధర్మవర్తనుల్

    రిప్లయితొలగించండి

  29. పోవుచు వేఱు దారినిట పోకిరి రీతిని రామ గాథనున్
    చేవను రంగనాయకమ చెప్పిన వైనము చూడగోరగన్
    రావలె నందరున్ వడిగ రమ్యపు నాటక మెందునన్ భళా
    రావణుఁడున్ విభీషణుఁడు రాముని పుత్రులు ధర్మవర్తనుల్

    రిప్లయితొలగించండి