29, జూన్ 2016, బుధవారం

సమస్య - 2074 (దయ్యమె భార్య యైనపుడు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“దయ్యమె భార్య యైనపుడు దక్కును భర్తకు సర్వసౌఖ్యముల్”
లేదా...
“దయ్యమ్మే భార్య యయిన దక్కును సుఖముల్”

29 కామెంట్‌లు: 1. అయ్యరు జిలేబి చేతికి
  చయ్యన జిక్కిరి సభాషు ఝాడిం చెసుమీ !
  కుయ్యన కడ్జస్ట్ మాడిరి
  దయ్యమ్మే భార్య యయిన దక్కును సుఖముల్

  చీర్స్
  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. * గు రు మూ ర్తి ఆ చా రి *


  అ భ్య ర్థ న

  ::::::::::::::::::::::::  గు రు వు గా రి కి ప ద న మ స్కా ర ము లు !


  జూన్ నెల ఆ ర వ తే దీ న నే ను

  శ ౦ క రు ని > వ రు ని గా జే సి

  పా ర్వ తి ని > వ ధు వు గా జే సి


  మీ వ ద్ద కు ప ౦ పి తి ని . మ రి యు

  వా రి వె ౦ ట స క ల సు ర ల ను ,

  స ప్త ఋ షు ల ను కూ డా ప ౦ పి తి ని .


  * ఖ ౦ డ కా వ్య ము * అ ను
  --------------------------


  క ళ్యా ణ వే ది క పై న


  * శి వ క ళ్యా ణ ము * ను
  -------------------------


  జ రి పి ౦ చ మ ని ప్రా ర్థ న
  ----------------------------------------

  రిప్లయితొలగించండి
 3. అయ్యయొ బ్రతుకగ నగునా
  దయ్యమ్మే భార్య యయిన! దక్కును సుఖముల్
  వయ్యారపు నడకలతో
  సయ్యాటకు పిలువవచ్చు సతి దరి చేరన్!

  రిప్లయితొలగించండి
 4. కయ్యము నిత్యము జరుగును
  దయ్య మ్మే భార్య యయిన , దక్కును సుఖముల్
  నెయ్యముతో వర్తించుచు
  సయ్యాటలనాడు పత్ని సతిగా గొనినన్

  రిప్లయితొలగించండి
 5. నిన్నటి పూరణ

  ఓ భక్తుని అనుమానం:

  చేరి శివాలయమ్మునకు శ్రీధరుఁ, బార్వతి, వారి సంతతిన్
  భారములెన్నొ దీర్చుమని భక్తి ప్రపత్తుల సేవఁజేసి, యే
  మాఱుచు కాలభైరవుని మాత్రము మ్రొక్కక పాపినైతినే
  భైరవుడిచ్చు చుండున శుభమ్ములు నిత్యము భక్తకోటికిన్?

  రిప్లయితొలగించండి
 6. కయ్యాలమారి మగనితో ఓ భార్య:

  నెయ్యపు వారలంచు నను నీ సతిఁ జేసిరి నాదువారలున్
  చయ్యన మాటమాటకును జాపెద వేమిరి కొట్టఁ జేతులన్
  కయ్యములాడ జాలనుర కాల్చర! జేరెద దయ్యమై నినున్
  దయ్యమె భార్యయైనపుడు దక్కును భర్తకు సర్వసౌఖ్యముల్!

  అయ్యయ్యో ప్రతిదినమీ
  కయ్యమ్ములఁ దాళలేను కాల్చర మగడా!
  దయ్యమ్మై నిను జేరుదు!
  దయ్యమ్మే భార్యయయిన దక్కును సుఖముల్!

  రిప్లయితొలగించండి
 7. రిప్లయిలు
  1. కయ్యము దీర్ప దైత్యులకు కశ్యప సూనుల కెల్ల విష్ణువే
   చయ్యన మోహ మోహినిగ సంభవ మొందె సుధా నిమిత్తమై
   యయ్యుర గాంక భాసితున కాసలు రేగెను బొంద భార్యగన్
   దయ్యమె భార్య యైనపుడు దక్కును భర్తకు సర్వసౌఖ్యముల్

   [దయ్యము = దేవత]

   సయ్యాటలఁ గడు నేర్పరి
   వయ్యారమ్ము లొలుకుచు వివాహమ్మున కై
   యియ్యకొని వలచిన గడుసు
   దయ్యమ్మే భార్య యయిన దక్కును సుఖముల్

   తొలగించండి
  2. దయ్యమ కారణమ్ముగద ధారుణి నద్భుత ప్రాణి కోటికిన్
   దయ్యమ సూత్రధారి మహదండ సురక్షిత నాట్య వేదికన్
   దయ్యమ తల్లి తండ్రి ఘనదాతయు త్రాతయు జీవ రాశికిన్
   దయ్యమె భార్య యైనపుడు దక్కును భర్తకు సర్వసౌఖ్యముల్

   తొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. దయ్యమె వికృతై చనును దైవపుశబ్దము నుచ్చరింపగా
  నియ్యఖిలాండకోటికిల నీశుడు రక్షకుడైచనున్ సదా
  అయ్యయొ సక్కుబాయినటులత్తయె మిక్కిలి కష్టపెట్టగా
  దయ్యమె భార్యయైనపుడు దక్కును భర్తకు సర్వసౌఖ్యముల్.

  దయ్యమ్మె దైవరూపము
  చయ్యన నేగ్రంథమందు చక్కగ వెదుకన్
  ఇయ్యఖిలలోక సుగుణుడు
  దయ్యమ్మే, భార్యయయిన దక్కును సుఖముల్.

  రిప్లయితొలగించండి
 10. నెయ్యము నందున దైవము
  కయ్యము తనకింక రాదు కరుణయెదప్పన్
  యయ్యా మరియేమందును
  దయ్యమ్మె భార్యయయినదక్కును సుఖముల్

  దయ్యము- -దైవమునకు వికృతి

  రిప్లయితొలగించండి
 11. నెయ్యము జూపక నిరతము
  కయ్యమునే గోరు కాంత కన్నను ప్రియమౌ
  సయ్యాటగ కాపురమున
  దయ్యమ్మే భార్య యయిన దక్కును సుఖముల్

  రిప్లయితొలగించండి
 12. అయ్యయొ! జీవితమ్ము, సతమల్లరిపాలగు, నిశ్చయమ్ముగా
  వ్రయ్యలగున్, విశాలపుఁప్రపంచమునందున నెచ్చటైన, నో
  దయ్యమె భార్యయయిన, దక్కును భర్తకు సర్వసౌఖ్యముల్
  నెయ్యముతోమెలంగు కడు నేర్పరి పత్నిగ చేతచిక్కినన్

  రిప్లయితొలగించండి
 13. కయ్యము లెన్నియో జరుగు కాంతకు గాంతునికి న్జ గంబున న్
  దయ్యమె భార్య యైనపుడు, దక్కును భర్తకు సర్వ సౌఖ్యముల్
  కయ్యము లేక యుండగను గాంతుని సేమము జూర నొందుచు
  నెయ్యము తోడనే మెలఁగి నేర్పున నోర్పున నుండనోపినన్

  రిప్లయితొలగించండి
 14. నెయ్యమొనర్చి సంతతము నీతిని నీమము బోధ చేయుచున్
  కయ్యము లాడు శత్రువునకైనను హానిని కల్గజేయకన్
  వియ్యమునొంద గర్వమును వీసముఁ నైనను జూపకున్నచో
  దయ్యమె భార్య యైనపుడు దక్కును భర్తకు సర్వసౌఖ్యముల్

  కయ్యము సలుపుట కైనను
  వియ్యము నందైన సమత వీసముఁ వీడన్
  నెయ్యము నాగుణ మనుచో
  దయ్యమ్మే భార్య యయిన దక్కును సుఖముల్

  రిప్లయితొలగించండి
 15. ీ[6/29, 12:48 PM] chepuri sreeramarao: నెయ్యముచక్కగచేయును
  కయ్యమునకు దూరముండుకాంతామణితో
  వియ్యమునొందగ నట వే
  దయ్యమ్మే భార్యయయిన దక్కును సుఖముల్
  ( వేద MA) అని పూరణ
  [6/29, 1:40 PM] chepuri sreeramarao: MA చదివిన వేద అనే అమ్మాయి

  రిప్లయితొలగించండి
 16. కయ్యము లేక నిత్యమును గౌరవ భావముతోడ దంపతుల్

  నెయ్యము తోడ జీవనము నిత్యము గడ్పుచునున్నవారికిన్

  దయ్యమె భార్య యైనపుడు దక్కును భర్తకు సర్వసౌఖ్యముల్

  వెయ్యన నేల నీ భువి వివేకపు నారియె యింటి వెల్గుకున్.


  రిప్లయితొలగించండి
 17. వెయ్యేళ్ళూ నాకున్ నీ
  దయ్యమ్మే భార్యయయిన దక్కును సుఖముల్
  అయ్యది నిక్కము! నిరువురి
  నెయ్యము నాదర్శమయ్యె నెరుగు మనవడా!

  [అయ్యమ్మ = బామ్మ]

  రిప్లయితొలగించండి

 18. అయ్యా !బాగుగ జెప్పితి
  రెయ్యెడలనుసత్య మదియ యి ధ్ధర  లోన న్నియ్యదిమనుజునిభాాగ్యము
  దయ్యమ్మే భార్య యయిన దక్కును సుఖముల్

  రిప్లయితొలగించండి
 19. కయ్యము నిత్యమౌనికను కాపురమేనరకమ్ముగా నగున్
  దయ్యమె భార్యయైనపుడు, దక్కును భర్తకు సర్వసౌఖ్యముల్
  తియ్యని మాటలాడి పతి దేవుని గాదలపోయుచు నెయ్యురాలి గా
  నెయ్యపు రేణి పత్నివలె నిత్యసుఖమ్ములనంద జేసినన్


  కయ్యాల కాపురమ్మగు
  దయ్యమ్మే భార్యయయిన, దక్కును సుఖముల్
  తియ్యని మాటల నుడువుచు
  నెయ్యరియై మెదిలెడు సతినికలిగి యున్నన్

  రిప్లయితొలగించండి
 20. చెయ్యన విష్ణు|రూపసిగ చేడియగానగుపించ?నారదుం
  డయ్యరె పెళ్లియాడి దరహాసపు జీవన మెంచెయూహలో
  దయ్యమె భార్య యైనపుడు దక్కును భర్తకు సర్వ సౌఖ్యముల్
  కయ్యములేని జీవనమె కామిత సిద్ధికి రక్షబంధమౌ| {నారద గర్వభంగమునువిష్ణువుజూపినకల}{దయ్యమె=దైవము}
  2.నెయ్యంబెంచక చచ్చిన
  దయ్యమ్మే|”భార్యయయిన దక్కును సుఖముల్
  అయ్యో|పాపము ననుచును
  సయ్యాటను దలచు కొనెను సంగతి దెలియన్”. {చచ్చినదయ్యమ్మే=చనిపోయినదిఆయ్యమ్మే}

  రిప్లయితొలగించండి
 21. వియ్యము నొందగా మదిని వేడుక మీరగ మైత్రితో ననున్
  నెయ్యము తోనసం తసము నేరము లెంచక కోడలిన్ గనన్
  కయ్యము లాడుచున్ చిలిపి గారపు కోర్కెల సోయగం బులౌ
  దయ్యమె భార్యయై నపుడు దక్కును భర్తకు సర్వసౌ ఖ్యముల్
  -------------------------------------------------
  వయ్యారపు విరుపుల సతియే
  కయ్యానికి నెదురు జూసి కవ్వింత లతోన్
  సయ్యాట లసరసాల కులుకు
  దయ్యమ్మే భార్య యయిన దక్కును సుఖముల్

  రిప్లయితొలగించండి
 22. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈనాటి సమస్యకు చక్కని పూరణ లందించిన అందరికీ అభినందనలు.
  ఈరోజు ఉదయమే ఒక కార్యక్రమానికి వెళ్ళి అక్కడే భొజనం చేసి వచ్చాను. తిండి వికటించిందేమో వాంతులు.. తద్వారా నీరసం... వైద్యుడు సూచించిన మందులు వాడుతున్నాను.
  ఈనాటి మీ పూరణలను సమీక్షించలేకున్నాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాత్రికి నేను సమీక్షించ గలనండి. మీరు విశ్రాంతి తీసుకొనవలసింది.

   తొలగించండి
 23. గురువు గారూ నమస్కారములు.
  మా పూరణలు సమీక్షించకున్నా పర్వాలేదు గాని మీ ఆరోగ్యము జాగ్రత్త..

  రిప్లయితొలగించండి
 24. గురుదేవులకు ధన్యవాదములు. విశ్రాంతిగ యుండండి.

  రిప్లయితొలగించండి
 25. మాన్యులు శంకరయ్యగారికి. పరిశీలనలు చేయక ఆరోగ్యము చూచుకొనవలసినదిగా కోరుచున్నాను.

  రిప్లయితొలగించండి
 26. తియ్యగ నింటి కార్యముల తీర్చుచు దిద్దుచు ప్రేమమీరగా
  శయ్యను రంభవోలుచును సంతస మొందుచు సంతునిచ్చుచున్;...
  కయ్యము జేసి గెల్చుటను కమ్మని పోరుల నాడబిడ్డలన్
  దయ్యమె భార్య యైనపుడు దక్కును భర్తకు సర్వసౌఖ్యముల్

  రిప్లయితొలగించండి