3, జూన్ 2016, శుక్రవారం

సమస్య - 2053 (మరణమునందు తోడ్పడెను...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“మరణమునందు తోడ్పడెను మాధవుఁ డెంతయొ మోదమందఁగన్”
లేదా...
“మరణమందు  తోడు మాధవునకు”

100 కామెంట్‌లు:

 1. జనమునివర గణము లననయ పీడన
  చేయు చుండ జనుల క్షేమ మరసి
  కదలె సత్యభామ కంసుని తోడ భీ
  మ రణమందు తోడు మాధవునకు..

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ‘భీమరణము’తో మీ పూరణ బాగున్నది.
   కాని నరకుని స్థానంలో కంసుడు వచ్చాడు. కంససంహారంలో తోడుగా ఉన్నది బలరాముడు కదా!

   తొలగించండి
  2. కం. యతిమైత్రి కూర్పనెంచిరి
   ప్రతినాయకడైన నరకు వద్దని రాహా
   బ్రతిమాలి కంసు దెచ్చిరి
   యతిప్రాసలకొఱకు మార్పు లనివార్యంబుల్

   తొలగించండి
  3. గురువుగారికి, తాడిగడప శ్యామలరావుగారికి నమస్సులు. పెద్ద పొరబాటు జరిగినది. నిద్రకుపక్రమించి పునశ్చరణ చేయ దోషమవగతమైనది. మరల కంప్యూటరు తెరచుసరికి అంతర్జాలము మొరాయించినది. చేసేది లేక ఇప్పుడు మార్చినదానిని ఉంచుచున్నాను. అన్యాపదేశ సూచనప్రాయంగా శ్యామలరావుగారు చెప్పినట్లు ఎక్కడో ఒకతరి యతిప్రాసల బలీయత ఉండవచ్చునేమో గాని అసందర్భము కాకూడదు గదా! నెచేసినది అదే. అందరూ మన్నించాలి.

   జనమునివర గణము లననయ పీడన
   చేయు చుండ జనుల క్షేమ మరసి
   నడచె సత్యభామ నరకుని తోడ భీ
   మ రణమందు తోడు మాధవునకు..

   తొలగించండి
  4. శర్మ గారు కంసారి కి బదులు కంసుడని పొరపాటున వ్రాసారేమో యని యనుకున్నాను.

   తొలగించండి
  5. కామేశ్వరరావుగారూ! నమస్కారములు.అది పొరపాటుగాదు నా గ్రహపాటున పెద్ద తప్పు జరిగినది. క్రింది వరుసలో మాధవుడుండగా కంసారికి స్థానము లేదుగా. (పునరుక్తి దోషం)

   తొలగించండి
  6. తోపెల్ల వారూ, ప్రమాదో ధీమతా మపి. మరీ అంతగా కించపడవలసిన పనిలేదు. నేను వ్రాసిన పద్యం కూడా కేవలం సరదాగానే వ్రాసాను కాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టటానికి ఉద్దేశించి కాదండి.

   తొలగించండి
  7. శ్యామలరావుగారూ! నమస్కారములు. సంస్కృత భాషమీద తెనుగుభాషమీద పట్టున్న మీవంటివారు, కామేశ్వరరావుగారు మాదొషాలను తప్పక చెప్పాలి. అప్పుడే గుణదోషాలు మావంటి వారికి తెలియబడతాయి. తప్పక నా పూరణలను సమీక్షించ మనవి.

   తొలగించండి
 2. అసుర జంప నెంచి యానంద మొందుచు
  సత్య తోన వెడలె సమర మునకు
  తల్లి చేత సుతుడు వెల్లిబోవ నరకు
  మరణ మందు తోడు మాధవు నకు

  రిప్లయితొలగించండి
 3. శుభోదయం !

  కర్ణుని దానమే నతని మోక్షానికి ప్రతిబంధకం! (bondage అన్న పదం బంధం నించి వచ్చిందా ?) ! ఆ దానాన్ని దానం గా స్వీకరించి శ్రీ కృష్ణుడు కర్ణుని కి మోక్ష ప్రాప్తి కలిగించిన జగద్గురువు !  ఒరిగెను కర్ణుడా క్షణము! సూర్యజ ! దానము నీదు శక్తి! నీ
  దరి మరణంబు రాగలద ! దానమొసంగుము నాకు నీదు శ
  క్తి! రకము! దానమే వదిలె! కీర్తిని బొందెను; దానకర్ణ ! నీ
  మరణము నందు తోడ్పడెను మాధవుఁ డెంతయొ మోదమందఁగన్

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పద్యం బాగుంది. కాకుంటే కొంత అన్వయలోపం ఉంది. సవరించడానికి సమయాభావం. మన్నించండి.

   తొలగించండి
 4. ధరణి జనుల నెల్ల నరకయాతనబెట్టు
  నరకుని దునుమాడ నాతితోడ
  తరలి వెళ్ళు వేళ దనసతి సత్యభా
  మ, రణమందు తోడు మాధవునకు!!!

  రిప్లయితొలగించండి
 5. ‘ధరణి’ గారి (వాట్సప్) పూరణ....

  మనువు మొదలు మగడు మాధవుడె సతికి
  అడుగు అడుగు నందు ఆసరాగ
  పతియె దైవ మనుచు పడతి పూజించెనె
  మరణమందు తోడు మాధవునకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు
   పద్యం మధ్యలో అచ్చులు రాకుండా జాగ్రత్త పడండి.

   తొలగించండి
 6. దైవ ప్రార్ధనంబె తథ్యముగ నరుని
  మరణమందు తోడు! మాధవునకు
  మ్రొక్కినంత కడు ప్రమోద మొందు నెడద!
  ఇహ పరముల సుఖము నిచ్చు నదియె!

  రిప్లయితొలగించండి
 7. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  గు రు వు గా రి కి న మ స్సు లు

  నే ను స ౦ పూ ర్ణ శి వ క ళ్యా ణ
  ఘ ట్ట ము ను 2 0 ప ద్య ము ల తో
  వ్రా శా ను .

  2 0 ప ద్య ము ల క థ ను ఒ కే సా రి ప ౦ పి ౦ చ మ ౦ టా రా లే క దా ని ని రె ౦ డు భా గా లు గా వి భ జి ౦ చి ప ౦ ప మ టా రా

  నా కు స ల హా ఇ వ్వ వ ల సి ౦ ద ని
  ప్రా ర్థ న

  రిప్లయితొలగించండి

 8. కరుణ రసాంతరంగమున
  గైకొని నిడ్ముల దీర్చువాడు, తా
  దరిని నిరంతరంబు వసు
  ధంగని జీవులలోని ప్రాణమై
  స్మరణము దోడనే దివికి
  మార్గము జూపెడి మోక్షదాతయై
  మరణమునందు తోడ్పడెను
  మాధవుడెంతయొ మోదమందగన్!

  రిప్లయితొలగించండి
 9. ఆచారిగారికి నమస్కారములు.కధను పూర్తిగాపంపప్రార్ధన

  రిప్లయితొలగించండి
 10. నాగమంజరి గుమ్మా గారి (వాట్సప్) పూరణ....

  హరి హరియని లిప్త నసురారి గొల్చిన
  హరిసదనము గల్గు అంత్యమునను
  చేతులార చేయు చేతలె పాశమై
  మరణమందు తోడు మాధవునకు.

  బ్రతికి నన్నినాళ్ళు పరుల సేవను జేసి
  వృక్ష బాల వృధ్ధు రక్ష జేసి
  చిద్విలాసముగను చిరునవ్వు మాత్రమే
  మరణమందు తోడు మాధవునకు

  దేశసేవ కొరకు దేహమునర్పించి
  యుద్ధ రంగమందు వ్యూహపరచి
  శత్రువు నెదిరించు సంతృప్తి మాత్రమే
  మరణమందు తోడు మాధవునకు.

  రిప్లయితొలగించండి
 11. బండికాడి అంజయ్య గౌడ్ గారి (వాట్సప్) పూరణ....

  దురమున నన్నుగెల్వగల దోర్బలు డెవ్వడటంచు నిక్కుచున్
  తరుణుల తస్కరించి తనదాపున నుంచెను క్రూర చిత్తుడౌ
  నరకుని సంహరించగను నాధుని తోడను నేగె సత్య, భా
  మ,రణమునందు తోడ్పడెను మాధవు డెంతయు మోదమందగన్! !

  రిప్లయితొలగించండి
 12. డా.ఎన్.వి.ఎన్.చారి గారి (వాట్సప్) పూరణ....

  1
  అంటు వ్యాధి తోడ నవసాన దశనుండ
  బంధు మిత్రులంత వచ్చి పోగ
  భర్త మాధవునకు బహు ప్రేమతోనిల్చె
  మరణమందు తోడు మాధవునకు.

  2.
  మరణమందు తోడుమాధవునకు నుండ
  నతని సతియు నేడ్చి చితిని దూకె
  వెంట నున్న వారు వెంటనే రక్షించి
  నేర మనుచు తెలిపి నిలిపి నారు.

  రిప్లయితొలగించండి
 13. అంబటి భానుప్రకాశ్ గారి (వాట్సప్) పూరణ....

  మనసు గలిగి చేయు మంచిపనులెపుడు
  మంచివచ్చు నెపుడుమనిషి వెంట,
  చేయుమంచిపనుల చేతనై నంతగా,
  మరణ మందు తోడు మాధవునకు.

  రిప్లయితొలగించండి


 14. వాట్సప్ సందేశంబులు !
  హాట్సాఫ్ ఓ కందివర్య ! హాట్ హాట్ సుమ్మీ !
  లైట్సాన్ యనంగ పద్య
  ట్వీట్సులు ! లైకుల జిలేబి టీగొని చదివెన్ !

  రిప్లయితొలగించండి
 15. కవిమిత్రులకు నమస్కృతులు.
  మా బావగారి పెద్దకర్మకు వెళ్తున్నాను. అటునుండి మా అక్కయ్య వాళ్ళ ఊరు వెళ్ళివస్తాను. అందువల్ల ఈరోజు నేను బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 16. భక్తుల కె పుడుండు పరమశి వునిదయ
  మరణ మందు తోడు ,మాధవునకు
  నతులొ నర్చు నెడల నమ్రత గనునిక
  రక్షజేయు నెపుడు రయము తోడ

  రిప్లయితొలగించండి
 17. నరకుని బాధలంతమొనరింపగ వేడిరి సాధులందరున్
  కరుణను రక్షజేయజను కారణ జన్ముని తోడనేగిసం
  గరమున లాఘవంబునను కార్ముక విద్యలు యొప్ప సత్యభా
  మ, రణమునందు తోడ్పడెను మాధవుఁ డెంతయొ మోదమందఁగన్

  రిప్లయితొలగించండి
 18. మీ పూరణ బాగున్నది. అభినందనలు
  ‘విద్యలు+ఒప్ప’ అన్నపుడు యడాగమం రాదు.‘కార్ముకవిద్య చెలంగ/ కార్ముక విద్యల జూప’ అనండి.

  రిప్లయితొలగించండి
 19. నరకుని బాధలంతమొనరింపగ వేడిరి సాధులందరున్
  కరుణను రక్షజేయజను కారణ జన్ముని తోడనేగిసం
  గరమున లాఘవంబునను కార్ముక విద్య చెలంగ సత్యభా
  మ, రణమునందు తోడ్పడెను మాధవుఁ డెంతయొ మోదమందఁగన్

  గురుగుగారూ, సవరణకి ధన్యవాదములు. ఈ యడాగమం అంతా వచ్చినట్లే ఉంటుంది. కానీ తప్పులు చేస్తూనే ఉంటున్నాను. ఈ సారి నుంచి తప్పు రాకుండా ప్రయత్నిస్తాను.

  రిప్లయితొలగించండి
 20. రారు భార్య,సుతులు,రాజ్యమ్ము భవనముల్
  మరణమందు తోడు,మాధవునకు
  పూజసేయ కలుగు పుణ్యఫలము జేర్చు
  జన్మరహిత మోక్ష సదనమునకు

  రిప్లయితొలగించండి
 21. మరణము నందు తోడ్పడెను మాధవు డెంతయు మో దమందగ
  న్నరయగదోచె నాపలుకు హారతి !సత్యమ యెల్ల వేళల
  న్నెరుకగ లేదె నీకు మరి యేపుగగావడె ?తిన్నని న్భళా
  దురితము బాపి పుణ్యమును దుష్టిగ నీయగ నోపునే గదా

  రిప్లయితొలగించండి
 22. వరమగు దేశభక్తియె జవానుల కందగ ధైర్యమబ్బు|యే
  తరుణమునందు మానస వితర్కము లెక్కిడబోక శత్రువుల్
  మరణమునందు తోడ్పడెను-మాధవుడెంతయొ మోదమందగన్
  విరివిగ దేశసేవ గల విజ్ఞులె రక్షకు లైన?పూజ్యులే|
  2.పరులకు మేలు జేయగల పంతము ధైర్యమువారికబ్బగా
  కరుణ కటాక్ష వీక్షణలు కామిత సిద్దిగ వెంటనుండు|సం
  స్కంరణలుసాగగా విలువ సంఘము నందుమధర్ తెరీషకున్
  మరణము నందు తోడ్పడెను మాధవు డెంతయొ మోదమందగన్
  3.మరణము నందుతోడు మాధవునకు
  కనగలేముజూడ వినగలేము
  ఆయువున్న మనకు ఆశలు యెన్నున్న?
  పోయినపుడువిలువ మాయమగును|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మూడవపూరణ మొదటిపాదంలో గణదోషం. “మరణమందు తోడు మాధవునకటన్న...’ అనండి. కనగలేము అని మళ్ళీ చూడ అన్నారు. ‘కనగలేము చెవుల వినగలేము’ అనండి. విసంధిగా ఎక్కువగా వ్రాశారు.‘చెవుల వినగ తరమె| యాయువున్న జనుల కాశ లెన్నిన్నను..’ అనండి.

   తొలగించండి
 23. నరకుని కదనమ్మున తుదముట్టించుట
  కై వెడలెడు వేళ కలిక తాను
  భర్తననుసరించె పడతియా సత్యభా
  మ, రణమందు తోడు మాధవునకు

  రిప్లయితొలగించండి
 24. నా రెండవ పూరణము

  భీతి గొనగ నరకు భేదమ్ముతో ద్రుంచ
  ఖ్యాతి గాంచె నబల కదన మందు
  రీతిగా నిలబడి రెచ్చెనా సత్యభా
  మ, రణ మందు తోడు మాధవునకు!

  రిప్లయితొలగించండి
 25. ధరణికి భారమై చెఱగు దానవ కోటిని గూల్చుచున్ సదా
  ధరణిని బ్రోచుచున్నిలను ధర్మము నిల్పెడు వాడు, నీచుడౌ
  నరకుని సంహరింప గదనమ్ముకు దానుయు వచ్చి సత్యభా
  మ రణము నందు తోడ్పడెను, మాధవుడెంతయొ మోదమొందగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘చెఱగు’ను ‘చెలగు’ అనండి. ‘కదనమ్ముకు’ అనరాదు. ‘కదనమ్మునకు’ అనడం సాధువు. ‘కదనమ్మున కాతడు వచ్చె’ అందామా?

   తొలగించండి
 26. దుష్ట నరకు జంపి శిష్ట రక్షణ జేయ

  యుద్ధమునకు హరియు సిద్ధపడగ

  ధీర వనిత బయలుదేరెను సత్య భా

  మ రణమందు తోడు మాధవునకు.

  రిప్లయితొలగించండి
 27. దుష్ట నరకు జంపి శిష్ట రక్షణ జేయ

  యుద్ధమునకు హరియు సిద్ధపడగ

  ధీర వనిత బయలుదేరెను సత్య భా

  మ రణమందు తోడు మాధవునకు.

  రిప్లయితొలగించండి
 28. దొరికెను పాండునందనుల తోడుగ కృష్ణుడు !ధర్మమార్గమున్
  నిరతము వీడరంచు తన నేస్తముఁగోరెడు బావలన్
  ధరణిని గావగన్ జయము దక్కెడు సాయము లందజేసి భీ
  ష్మ రణమునందు తోడ్పడెను మాధవుఁ డెంతయొ మోదమందఁగన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భీష్మరణముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవపాదంలో గణదోషం. ‘..గోరెడు నట్టి బావలన్’ అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
   దొరికెను పాండునందనుల తోడుగ కృష్ణుడు !ధర్మమార్గమున్
   నిరతము వీడరంచు తన నేస్తముఁగోరెడునట్టి బావలన్
   ధరణిని గావగన్ జయము దక్కెడు సాయము లందజేసి భీ
   ష్మ రణమునందు తోడ్పడెను మాధవుఁ డెంతయొ మోదమందఁగన్!

   తొలగించండి
 29. ఇచ్ఛామృత్యువుకై భీష్ముని అంతర్మథనం........
  పరమ సుసాధ్వి ద్రౌపది, సభాస్థలి, వస్త్రము లూడదీసినన్
  ఎరిగి యధర్మ మంచు మది నెట్టి విరోధము చేయనైతి నే
  ధురమున కౌరవాదముల దుర్జన పక్షము నందునున్న నా
  మరణమునందు తోడ్పడెను మాధవుఁ డెంతయొ మోదమందఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘దీసినన్+ఎరిగి’ అని విసంధిగా వ్రాయరాదు కదా! ‘దీసిన| న్నెరిగి/ దీయగా| యెఱిగి...’ అనండి.

   తొలగించండి
  2. టైపాటువల్ల ‘దురము - ధురము, కౌరవాధములు - కౌరవాదములు’ అయ్యాయి.

   తొలగించండి
 30. సలుపు మంచి పనులె సతము మనుజులకు
  మరణమందు తోడు, మాధవునకు
  ననవరతము పూజ లతినిష్టతో చేయ
  కలుగు ముక్తి పథము ఖచ్చితముగ

  రిప్లయితొలగించండి
 31. మనిషి మరణమందు|తోడు మాధవునకు వెళ్ళగా?
  ధనము,బలములాస్తి తనకు దగ్గరగున గాంచునా?
  మనసుకున్న మంచితనము మానవత్వ మైనచో?
  ఘనత,కీర్తినిలిచి పోవు|గతముహితము నింపగా|

  రిప్లయితొలగించండి
 32. మామ పుత్రుడంట మాధవుడనువాడు
  కోరరాని దొకటి గోరి నంత
  కాదనకయె కలికి మోదము తోడ కా
  మ రణమందు తోడు మాధవునకు

  రిప్లయితొలగించండి
 33. నరకుని ఘోర కృత్యముల నంతము జేయగ వాని ద్రుంచ, భీ
  కరమగు సంగరమ్ముననె కాంతుడు సుంతగ సేదదీర శ్రీ
  ధరునకు జూప కౌశలము తాను శరమ్ముల నేసి సత్యభా
  మ,రణమునందు తోడ్పడెను మాధవుఁ డెంతయొ మోదమందఁగన్

  అసుర నరకుని గని యంత మొందించగ
  వాసుదేవు డేగ వాని వెంట
  నేగి దివ్య శరము లేసెను సత్యభా
  మ,రణమందు తోడు మాధవునకు

  రిప్లయితొలగించండి
 34. మాధవుడను బావ మరదలిని పిలిచాడన్న ఊహతో

  విరహము తోడ వేగుచును వీధిన బోయెడు యింతినొక్కతిన్
  సరసము లాడ రమ్మనుచు చాటుకు బిల్వగ, ప్రేమ మీరగన్
  తరుణియె జేరె బావను, సుధాంశుడు నింగిన పండు వెన్నెలన్
  గురిసెడు వేళ, మోహమున గోమలి మల్లెల తోటలోన కా
  మ రణము నందు తోడ్పడెను, మాధవుడెంతయొ మోదమొందగన్

  రిప్లయితొలగించండి
 35. పరులకు వద్దు యీ వెతలు! భండనమందున జ్ఞాతి మిత్రులున్
  గురువులు వైరులై నిలువ కూల్చుటనెట్లనె" పార్థుడున్ అను
  స్మరణమునందు! తోడ్పడెను మాధవుడెంతయొ మోదమందగన్
  నరునకు యుద్ధరంగమున నంగము శాంతిడ గీతబోథచే॥

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వద్దు + ఈ -> వద్దీ అని అవుతుందండీ. యడాగమం రాదు.
   రఘురాం గారూ, కూల్చుట + ఎట్లనె -> కూల్చుటెట్లనె అని అవుతుంది లేదా కూల్చుటయెట్లు అని యడాగమం వస్తుంది - రెండువిధాలుగానూ సరియే.
   అంగము శాంతిడ? సుబోధకంగా లేదు. అంగము అంటే శరీరము. దానికి గీతాబోధతో శాంతి అని చెప్పటం అంత ఉచితమూ కాదు అన్వయమూ కావటం లేదు. మరికొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి మీ పద్యంలో

   తొలగించండి
  2. శ్యామలీయం గారు, మొదటి రెండు నా తప్పులే, క్షమించాలి. సరిదిద్దుతాను. ఆఖరి పాదంలో అది అంగము కాదు, అనంగము. అనగా మనసు, చిత్తము అని నా భావము. కల్లోలంగా ఉన్న అర్జునుని మనసు గీతోపదేశం ద్వారా శాంతపడింది అని నా భావన.

   తొలగించండి
  3. రఘురాం గారూ, అనంగము అంటే మనస్సు అన్న అర్థం ఉన్నా అదంత ప్రసిధ్ధం కాదు. కానీ ఆ మాట మీరు ప్రయోగించిన పక్షంలో యుధ్ధరంగమున + అనంగము -> యుధ్ధరంగమున ననంగము అని వ్రాయవలసి ఉంటుంది.

   తొలగించండి
  4. శ్యామలరావు గారూ,
   చక్కని విశ్లేషణకు ధన్యవాదాలు.

   తొలగించండి
  5. రఘురాం గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘పరులకు నీ వెతల్ వలదు...’ అనండి. శ్యామలరావు గారి సూచనలను అనుసరించండి.

   తొలగించండి
  6. గురువుగారికి శ్యామలరావుగారికి ధన్యాలు. అనంగముతో నేను అనుకున్నట్టు సంధి కాలేదు అన్నమాట. దిద్దుకుంటాను.

   తొలగించండి
 36. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  గు రు వు గా రి కి న మ స్సు లు

  నే ను స ౦ పూ ర్ణ శి వ క ళ్యా ణ
  ఘ ట్ట ము ను 2 0 ప ద్య ము ల తో
  వ్రా శా ను .

  2 0 ప ద్య ము ల క థ ను ఒ కే సా రి ప ౦ పి ౦ చ మ ౦ టా రా లే క దా ని ని రె ౦ డు భా గా లు గా వి భ జి ౦ చి ప ౦ ప మ టా రా

  నా కు స ల హా ఇ వ్వ వ ల సి ౦ ద ని
  ప్రా ర్థ న

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 20 పద్యాలు మరీ పెద్ద ఖండిక కాదు కదండీ. ఒక్కసారిగా ప్రచురించటానికి బ్లాగు వారికి ఇబ్బంది ఉంటుందనుకోను. ఐతే ముందుగా తెలిసినవారిచేత పరిష్కరింపజేసి శుధ్ధప్రతిని పంపటం బాగుంటుందని నా సూచన.

   తొలగించండి
 37. తరుణుడు పంతముం గొనుచుఁ దా నొనరించును యజ్ఞ వేదికల్
  హరణము వేగ వాడు నరకాసురు భీకరు లోక కంటకున్
  ధరణిజుఁ గ్రూరు నుగ్రుడును దాపస ఘాతకుఁ జంప సత్యభా
  మ రణమునందు తోడ్పడెను మాధవుఁ డెంతయొ మోదమందఁగన్


  మాదు తనయ పెండ్లి మహనీయ మౌనిక
  సంతసమ్మున మరి సలుప వలదె
  వరునకీయఁ బ్రీతి బంధువర్గము సర్వ
  మరణ మందు తోడు మా ధవునకు

  [సర్వము+అరణము; అరణము = కట్నము; ధవుడు = పతి]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వరరావు గారూ నమస్సులు.సర్వ శబ్దానికి మరణ శబ్దం కలప శంకరాభరణ అరణం (కానుక) పట్టుకు పోయేరు. అభినందనలు. చిన్న సందేహం ఇక్కడ ధవుడు ఎవరికి?

   తొలగించండి
  2. మాదు తనయ యనిచెబుతున్న యామె భర్తే. మా ధవుడు గౌరవ బహువచనము.

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు చక్కగా నున్నవి. ముఖ్యంగా మరణాన్ని అరణంగా మార్చిన మీ నేర్పు బహుధా శ్లాఘనీయం. అభినందనలు.

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 38. శరణము రాముడీయ,సహజన్ముడు భక్త విభీషణుండు ము
  ష్కరుడగు భ్రాతయైన దనుజాధిపు రావణు నాభియందు దా
  పరిక మొనర్చి యున్న సుధ భాండము గొట్టు మటంచు రావణున్
  మరణమునందు తోడ్పడెను. మాధవుఁ డెంతయొ మోదమందఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబై తిమ్మాజీ రావు గారూ! నమస్సులు. మీపద్యం రామాయణ పరంగా చాల బాగున్నది. కాని 3 వ పాదంలో "సుధ భాండము" సమాసం. కాబట్టి సుధ శభాన్ని దీర్ఘాతంగా నే వ్రాయాలి. సుధాభాండము అన్నది సరియైన రూపము. ఈ సవరణను పరిశీలించండి " పరికపుకంజభాండమును వాజిని గొట్టమటంచు రావణున్"

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   తోపెల్ల వారి సూచనను పాటించండి.
   *****
   తోపెల్ల వారూ,
   ధన్యవాదాలు.

   తొలగించండి
 39. నరకునిఁదున్మ నెంచి కదనమ్మునకేగుచు శౌరి కోరగా
  సరగున వచ్చె నిందుముఖి చక్కగఁద్రోల రథమ్ముఁ బ్రీతి సం
  గరమున సొమ్మసిల్లగను కాంతుడు, తానెదిరించి సత్యభా
  మ, రణమునందు తోడ్పడెను మాధవుడెంతయొమోదమందగన్

  రిప్లయితొలగించండి
 40. వరము బలిమి చేత సురలను మునులను
  బాధలిడగ సత్యభామ యలిగి
  సంగరాన జంపె శరముతో డ.నరకు
  మరణమందు తోడు మాధవునకు.

  నరకుని దునుమంగ నవ్వుచూ సత్యభా
  మరణమందు తోడు మాధవునకు
  తానెయై నిలువంగ తల్లిచే మరణంబు
  యనెడివరమెచంపె యసుర వరుని.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవపూరణలో ‘నవ్వుచున్, మరణమౌ| ననెడి వరమె చంపె నసురవరుని’ అనండి.

   తొలగించండి
 41. నిన్నటిపద్యములొకపరి చూడండి అన్నయ్యగారూ
  అక్రూరుడు సంబర పడె
  శ్రీకృష్ణుని జూచి సీత సిగ్గిలి పారెన్
  కోకను చేతను చుట్టుచు
  రాకాశశి వోలె వెలుగు రాముని గనుచున్.


  ఏకాంతమున సతి పలికె
  శ్రీకృష్ణుని జూచి:సీత సిగ్గిలి పారెన్
  యాకౌసల్యాత్మజుడగు
  యాకాకుత్స వరుని గని హర్షము తోడన్/హర్షంబొదవన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి.
   రెండవపూరణలో ‘పారె | న్నాకౌసల్యాత్మజుడగు| నా కాకుత్స్థ...’ అనండి.

   తొలగించండి
 42. భరతకులాగ్రగణ్యుడనివార్య రణంబున భీష్మయోధుడై
  గురుతర బాధ్యతన్ నెఱపి గూలె శిఖండిని గాంచి యస్త్రముల్
  కరమున జార్చ, బాణమున కవ్వడి కొట్ట మురారి సంజ్ఞచే
  మరణము నందు తోడ్పడెను మాధవుడెంతయొ మోదమందగన్.

  రిప్లయితొలగించండి
 43. పుడమి బాధ దీర్ప పోరుకై వెడలగ
  మరణమందజేయ నరకునకును
  వెంట బడుచు వచ్చె నంటగా సత్యభా
  మ, రణమందు తోడు మాధవునకు.

  రిప్లయితొలగించండి
 44. కరచుచు కాంగ్రెసాదులను , క్రమ్మి జిహాదుల తోక కోయ తా
  నరయుచు భారమంతయును హాయిగ మోసి యమీతుషా భళా
  తరలుచు రాత్రి వేళను ప్రతాపము జూపుచు పాకిమూకలన్
  మరణమునందు తోడ్పడెను;...మాధవుఁ డెంతయొ మోదమందఁగన్!

  రిప్లయితొలగించండి