30, జూన్ 2016, గురువారం

సమస్య - 2075 (పతితులె పుణ్యజీవులని...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“పతితులె పుణ్యజీవులని వాదనఁ జేసెద రంగనామణుల్”
లేదా...
“పతితులె పుణ్యపురుషులని వాదింత్రు సతుల్”

69 కామెంట్‌లు:

  1. సతతము దైవ నామమును సాధన జేసిన భక్తి మీరగన్
    పతితులె పుణ్యజీవులని వాదనఁ జేసెద రంగనా మణుల్
    యతులిత మైన ప్రీతిగని యాపర మేశుడు ముక్తి నీయడే
    మతిచెడి పాప కూపమను మైకము నందున తేలియా డినన్

    రిప్లయితొలగించండి
  2. సతతము పండితు లైనను
    వితరణముగ బోయెద రట వేశ్యల కడకున్
    హితముగ కొలిచిన దైవము
    పతితులె పుణ్య పురుషులని వాదింత్రు సతుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పాపాలు చేసి పతితులైనవాళ్ళు దైవనామస్మరణ, పూజలతో పుణ్యులౌతారంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
      ‘మణుల్+అతులిత’ అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి

  3. అతివల కెల్లపుడును తమ
    పతిదేవుళ్లు సొబగైన పరమ పురుషులే !
    గతుకుల బతుకుల యున్నను
    పతితులె పుణ్యపురుషులని వాదింత్రు సతుల్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘బ్రతుకుల నున్నను’ అనండి.

      తొలగించండి
  4. చేపూరి శ్రీరామారావు గారి పూరణ....

    సతతమువెతల బ్రతుకుదురు
    పతితులె,పుణ్యపురుషులని వాదింత్రుసతుల్
    హితమునుక్షేమము కోరుచు
    వ్రతదీక్షలు చేయు పతులె వైభవములతో

    రిప్లయితొలగించండి
  5. బ్రతుకున దారిదప్పి యను
    రాగము లేక వికాస హీనులై
    వెతగొనుచున్ చరించి బహు వేదనలందుచు కుందు వారలై
    హితమును బొంతకన్ మనికి
    హేళన నొంది చరించు వేళలనా
    పతితులు పుణ్యజీవులని
    వాదనజేసెద రంనామణుల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘బొందక’ టైపాటువల్ల ‘బొంతక’ అయింది.

      తొలగించండి
    2. సవరణతో:

      బ్రతుకున దారిదప్పి యను
      రాగము లేక వికాస హీనులై
      వెతగొనుచున్ చరించి బహు వేదనలందుచు కుందు వారలై
      హితమును బొందకన్ మనికి
      హేళన నొంది చరించు వేళనా
      పతితులె పుణ్యజీవులని
      వాదనజేసెద రంగనామణుల్!

      తొలగించండి
  6. సతతము లేమల దిరిగిన
    పతులెందరు లేరు? వారె పరిపక్వ దశన్
    సతులను విడవక యుండగ
    పతితులె పుణ్యపురుషులని వాదింత్రు సతుల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటప్పయ్య గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. సతతము సత్యపాలనము సాధ్యము చేయగ భార్యనమ్మినన్
    సతియగు రాణి చంద్రమతి స్వామియె దైవమటంచుపల్కెగా
    వెతలకు నోర్చి ధర్మమును వీడక నుండెడి దుఃఖ భాజనా
    పతితులె పుణ్యజీవులని వాదనఁ జేసెద రంగనామణుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      ‘దుఃఖభాజనా పతితులు’ అంటూ మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఫణి కుమార్ గారు మీరు ప్రయోగించిన “దుఃఖ భాజనా పతితులు” సమాసము మహదానందము నిచ్చుచున్నది. దీనిని విడదీసి మీ భావమును వివరముగ తెలుప గోర్తాను.

      తొలగించండి
    3. కామేశ్వరరావు గారూ ధన్యవాదములు
      దుఃఖ భాజనులై తాత్కాలికంగానైనా ఒకింత క్రింది స్థాయిలో (భౌతికంగా మాత్రమే) ఉన్నవారు అన్నది నా ఉద్దేశ్యము.

      తొలగించండి
    4. ఫణి కుమార్ గారు నా ప్రశ్న “దుఃఖ భాజనా పతితులు” సమాసము గూర్చి మాత్రమే నండి. మళ్ళీ దుఃఖ భాజనులనే అంటున్నారు. “దుఃఖ భాజనా పతితులు” దీని పద విభజనను గూర్చియే నా ప్రస్నండి. అన్యధా భావించక మీరే విధముగా యనుకొని వ్రాసారో యది తెలుపండి. తరువాత ఇందలి విశేషమును నేను తెలిపెదను.

      తొలగించండి
    5. కామేశ్వరరావు గారూ, నా ఊహని నేను ఇతఃపూర్వమే రాసి యున్నాను. ఇంతకు మించిన వివరణాత్మక విశ్లేషణ బహుశః నా పరిధికి మించిన విషయమేమో అని భావిస్తున్నాను. దయచేసి తెలియజేయగలరు.

      తొలగించండి
    6. కామేశ్వర రావు గారూ,
      భాజన శబ్దం అకారాంత నపుంసకలింగం. సమాసాలలో అది దీర్ఘాంతం కాదు. దుఃఖ భాజన పతిరులు (దుఃఖపడుటకు యోగ్యులైన పతితులు)’ అనాలి. మీరు సూచించేదాకా అది దోషమని గుర్తు పట్టలేదు.ధన్యవాదాలు.

      తొలగించండి
    7. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అయిననూ” దుఃఖ భాజనా పతితులు” సాధు సమాసమే యీ క్రింది విధముగా. పరిశీలించ గోర్తాను.
      ఫణికుమార్ గారు మీకు తెలియకపోయినా మంచి సమాసమును వాడినారు . “భాజనము” అ కారాంత నపుంసక లింగము. దీనికి రెండు అర్థములు ఉన్నవి. పాత్రము (కంచము మొదలగునవి) ; యోగ్యత (అర్హత). సమాసము చేయదలచిన "దుఃఖ భాజన పతితులు” అనాలి. ఇక్కడ పాత్ర యను అర్థము తీసుకున్న విగ్రహ వాక్యము : దుఃఖమనెడి పాత్రలో పడిన వారు యని చెప్ప వచ్చును.
      అలాకాక “దుఃఖ భాజన+ ఆపతితులు = దుఃఖ భాజనా పతితులు” సాధు సమాసము.
      దుఃఖమనెడి పాత్రలో దైవ వశమున పడిన వారు యని విగ్రహ వాక్యము చెప్ప వచ్చును.
      హరిశ్చంద్రుడు అలా పడిన వాడే గదా! అందుకే నాకు మహదానందము కలిగినదని చెప్పితిని.

      తొలగించండి
    8. గురువుగారూ మరియు కాకామేశ్వరరావుగారూ ధన్యవాదములు. నేను దుఃఖ భాజన + పతితులు అన్న ఉద్దేశ్యంతోనే రాశాను. మీ వివరణకి ధన్యవాదములు.

      తొలగించండి
  8. సతతము జనులకుమేలును
    వితరణముగజేయువాడువిశ్వమునందున్
    వెతలెన్నివచ్చిజేరిన
    పతితులె పుణ్యపురుషులని వాదింత్రు సతుుల్

    పతితులు - పదవిచెడినవారు

    రిప్లయితొలగించండి
  9. గురుమూర్తి ఆచారి గారి పూరణ....

    సతి మనమున్ గ్రహి౦చుచు, ప్రసన్నత జూపుచు, విశ్వసి౦చుచున్
    సతి గుణశీలస౦పదను, సౌభగ మె౦చుచు, జీవిత౦బునన్
    సతి నొక దివ్య దేవతగ స౦తతమున్ దలపోయు నట్టి, ని
    ష్పతితులె పుణ్య జీవులని వాదన జేసెద ర౦గనామణుల్
    { సౌభగము = క్షేమము }

    రిప్లయితొలగించండి
  10. సతతము శంకరు గొలుచుచు
    వితరణముంజేయు నెడల బేర్మిని నెపుడు
    నితరులు నోపక పోయిన
    పతితులె పుణ్యపు రుషులని వాదింత్రు సతుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘..నెపుడు| న్నితరులు...’ అనండి.

      తొలగించండి
  11. బండకాడి అంజయ్య గౌడ్ గారి పూరణ....

    మతిచెడి కౌశికుండు తను మారుని క్రీడలు సల్పనెంచియున్
    సతికిని దెల్పినాడు నను సత్వరమే గొనిపొమ్ము వేశ్యతో
    కుతుకము దీర్చుకొందు నన కోమలి చేర్చెను వేశ్యవాటికన్
    పతితులె పుణ్యజీవులని వాదన జేసెద రంగనామణుల్.

    రిప్లయితొలగించండి
  12. చితికిన బతుకులు గడుపును
    పతితులె, పుణ్యపురుషులని వాదింత్రు సతుల్
    సతతము దేవుని గొలుచుచు
    వితరణశీలతను గలుగు పెనిమిటులనిలన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పతితులు బహువచనం. గడుపును అనే ఏకవచన క్రియారూపం అన్వయించదు కదా! ‘చితికిన బ్రతుకు గడుపుదురు’ అనండి.

      తొలగించండి
  13. సతత సదంగనా దృఢ సుసంగత మానిత వారిజాక్షులున్
    వితత మనోవికాస పరివేష్టిత భాసిత సుందరాననుల్
    గతభవ పుణ్యభావ పరికల్పిత పావన భర్తృపాద సం
    పతితులె పుణ్యజీవులని వాదనఁ జేసెద రంగనామణుల్

    అతియని యెంచక మదిని స
    తతము వొగిడి తిరుగుచు నిజ దార పనుపులన్
    మితి మీరక సతి భాషణ
    పతితులె పుణ్యపురుషులని వాదింత్రు సతుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా ‘పాద సంపతితులు’ అంటూ చేసిన మొదటి పూరణ అద్భుతంగా, వైవిధ్యంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గార్కి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి





  14. అతి పాపాత్ము౦ డైనను
    గతి నీవే యనుచు భవుని గావుమనుచు స
    న్మతి పరిదేవన మందిన
    పతితులె పుణ్యపురుషులని వాదింత్రు సతుల్!




    రిప్లయితొలగించండి
  15. బ్రతుకిక యంధకారమయి బాధలుఁ గూడగ నాత్మతేకువన్
    సతతము వీడకన్ పడుపు సైతము సైచుచు నించు జీవనిన్
    పతితులె పుణ్యజీవులని వాదనఁ జేసెద! రంగ! నా మణుల్
    పతకములెల్ల దేహముకు, పాలమనమ్మిదె యర్పితమ్ముగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      వైవిధ్యమైన పద విభాగంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఆత్మ తేకువన్’ అంటే దుష్ట సమాసం అని భ్రమించే ప్రమాదం ఉంది. ‘ఆత్మఁ దేకువన్’ అనండి. ‘దేహముకు’ అనరాదు, ‘దేహమునకు’ అనడం సాధువు. అక్కడ ‘మేనునకు’ అనండి.

      తొలగించండి
  16. అతిశయ మేమి? నేతలుధనార్జన గోరుచు నీచులై నిజా
    యతియను మాట మర్చిన మహాసచివేంద్రులె యోడినంతటన్
    సతతము పేదలంచు కడు జాలిని జూపధికారభ్రష్ఠు లౌ
    పతితులె పుణ్యజీవులని వాదన జేసెద రంగనా మణుల్

    ప్రతినిధులై వెలిగెడు వా
    రతిగా ధనమార్జనమ్మె యాశయమవగా
    మతిగల జనులో డించిన
    పతితులె పుణ్యపురుషులని వాదింత్రు సతుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పతితుడు = పదవి కోల్పోయిన వాడు

      తొలగించండి
    2. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘మరచు’కు ‘మర్చు’ అన్న రూపాంతరం లేనట్టుంది. ‘..జూపధికార’ అన్నచోట పదవిభాగం సందిగ్ధం. ..జూపి+అధికార=జూపి యధికార; జూపన్+అధికార=జూపు నధికార; జూపు+అధికార=జూపు నధికార...’ ఇవీ రూపాలు.

      తొలగించండి
    3. యతి యను మాటనే మరతు రా సచి వేంద్రులె యోడినంతటన్
      సతతము పేదలంచు గడు జాలిని జూపుచు నుందు రీ యిలన్

      గురువు గారికి ధన్యవాదములు ముసూచనలకముగుణంగా సవరించిన రెండవ మూడవ పాదములు

      తొలగించండి
  17. సతతము దైవ ప్రార్ధన లుసల్పుచు దానము జే యు శీలుడే
    యితరము లైన పానమున కిష్టుడు నైనను వాని నందురే
    పతితులె పుణ్య జీవులని వాదన జేసెద రంగనా మణు
    ల్లతి వల మాటలన్నియు ను నాదరణీయములౌ గ దా యిలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పద్యం నిర్దోషం. కాని భావమే సరిగా ఆవిష్కరింపబడనట్టుంది.

      తొలగించండి
  18. గతమందు వ్యసనపరులై
    సతతము చెడుమార్గమందు చనిన దురాత్ముల్
    రతితో దైవకృపఁగొనిన
    పతితులె పుణ్యపురుషులని వాదింత్రుసతుల్

    రిప్లయితొలగించండి
  19. . బ్రతుకుననాశ,దోషములు,బాధ్యతవీడెడిభావ బంధముల్
    హితమును మాను జీవనము హీనతగామనసొప్పదన్న?ను
    ద్రుతమగు లాభదాయకము దోషమటంచునుబల్కరేలనో?
    పతితులె పుణ్య జీవులని వాదన జేసెదరంగనామణుల్|
    2.అతులిత నాశగ బ్రతుకగ
    పతితులె పుణ్య పురుషులని వాదింత్రు సతుల్|
    శ్రుతిమతి దప్పిన గీతము
    అతిగా మద్యమము గ్రోలి నద్బుత మనుటే|




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. ఉద్ధృతమును మీరు ఉద్రుత మన్నారు. సరియైన పదాన్ని వేస్తే అక్కడ యతిదోషం.

      తొలగించండి
  20. గతిచెడి చెడ్డమార్గమున కావరులై చరియించి, జ్ఞానులై
    యతులిత భక్తితోడుత ననంతుని పూజలొనర్చుచున్, ధృతిన్
    గతియిక నీవెయంచు మది కైటభవైరినినిల్పి శుద్ధులౌ
    పతితులె, పుణ్యజీవులని వాదనఁజేసెదరంగనామణుల్

    రిప్లయితొలగించండి
  21. భూసారపు నర్సయ్య గారి పూరణ...

    సతులు గతుల విడనొల్లక
    పతి గణముల మార్పుఁ గోరి పాట్లు బడుచు నే
    గతిలేక నేమి తోఁచక
    పతితులె పుణ్యపురుషులని వాదింత్రు సతుల్.

    రిప్లయితొలగించండి
  22. ​నిరతము ధనార్జనయే పనిగా భావించి కుటుంబమును నిర్లక్ష్యము చేసెడు భర్తలకన్న పదవులను ఉద్యోగములను కోలుపోయి సతులు చెంత గడుపు వారలే పుణ్యజీవులని వాదన జేసెడు స్త్రీలు అనుకొనిన సందర్భము​

    ​​​​సతమతమౌచు భర్త లనిశమ్ము ధనార్జన జేయనెంచియున్
    సతులను లెక్కబెట్టక ప్రశాంతత లేక యహమ్ముజూపుచున్
    ప్రతిదినమింతయేని యనురాగము జూపని వారి కన్న నా
    పతితులె పుణ్యజీవులని వాదనఁ జేసెద రంగనామణుల్!

    రిప్లయితొలగించండి
  23. సతతము నింటి ప్రక్కఁగల సానిని జూచుచు చింతజేసెడు
    న్నతివను జేర్చగన్ నరకమందున! సానియె స్వర్గమేగగా!
    కృతముల నిష్టగా గొనుచు గేలిగ నన్యుల
    నెంచరానెడున్
    పతితులె పుణ్యజీవులని వాదనఁ జేసెదరంగనామణుల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణలో కొంత అన్వయలోపం ఉన్నట్టుంది. భావం సందిగ్ధంగా ఉంది.

      తొలగించండి
  24. సతులను గ్రహించని పతులు
    పతితులె! పుణ్య పురుషులని వాదింత్రు సతుల్
    సతమతమొందక, బెదరక,
    వెతల కలియబడి పురుషులు విజయము లందన్!

    రిప్లయితొలగించండి
  25. క్రొవ్విడి వేంకట రాజారావు గారి పూరణ....

    పతితులుగ మెలగి యుండిన
    పతులెందరొ తమ సతులను వాసిగ గను స
    త్కృతులను జదువుచు నెపుడా
    పతితులె పుణ్య పురుషలని వాదింత్రు సతుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  26. సతము తిరుగు సానింటను
    పతితులె:పుణ్యపురుషులని వాదింత్రు సతుల్
    పతులునుతము వీడరనుచు
    హితమగు మాటలు పలుకుచు యిలనలరింతుర్

    రిప్లయితొలగించండి
  27. సతతము వ్రతములుపూజల
    పతితులె పుణ్యపురుషులని వాదింత్రు సతుల్
    వెతలన్ జెందక నిరతము
    సతమత మొందక భజనలు చక్కగ చేతుర్

    పతితులు=పడినవారు(వ్రతాలు,పూజలలో పడినవారని )

    రిప్లయితొలగించండి
  28. పతులకు సేవ జేయుటను వంటల వార్పుల సొమ్మసిల్లకే
    కతలను వ్రాసి పల్కుచును కైతలు కూర్చుచు పాడియాడుచున్
    సతతము స్త్రీల హక్కులకు ఝమ్మని పోరుచు సంఘసేవనున్
    పతితులె పుణ్యజీవులని వాదనఁ జేసెద రంగనామణుల్

    పతిత = పడినది

    రిప్లయితొలగించండి