7, జూన్ 2016, మంగళవారం

సమస్య - 2057 (సరసీజాతములు విరియ...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“సరసీజాతము లుల్లసిల్లి విరియన్ జంద్రుండు వెల్గెన్ దివిన్”
లేదా
“సరసీజాతములు విరియఁ జంద్రుఁడు వెల్గెన్”
(ఒక సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాదు వెళ్తున్నాను. బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. 
దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి)

76 కామెంట్‌లు:

  1. అరుణుని గాంచిన తరుణము
    సరసీ జాతములు విరియఁ,జంద్రుండు వెల్గెన్
    సురలకు సంధ్యా సమయము
    పరవశ మొందెను కలువలు పరమ ప్రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      బాగున్నది మీ పూరణ.
      'సురలకు' అన్న దాన్ని 'సురుచిర' అంటే బాగుంటుంది.

      తొలగించండి
    2. అరుణుని గాంచిన తరుణము
      సరసీ జాతములు విరియఁ,జంద్రుండు వెల్గెన్
      సురుచిర సంధ్యా సమయము
      పరవశ మొందెను కలువలు పరమ ప్రీతిన్

      తొలగించండి
  2. తరణిని జూడగ ముదమున
    సరసీజాతములు విరియఁజంద్రడు వెల్గెన్
    సరసన చుక్కల చేరగ
    సరసున కలువలు విరియగ చంద్రిక కురిసెన్.

    రిప్లయితొలగించండి
  3. సోలార్ లైట్ సరసీ జాతాలు !

    ధరణీ తలమున వింతలు !
    బరువైన కనుల జిలేబి పరిపరి జూసెన్
    అరుదగు దృశ్యం ! సోలార్
    సరసీజాతములు విరియఁ జంద్రుఁడు వెల్గెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది. అభినందనలు.
      'దృశ్యం'అని వ్యావహారికం ప్రయోగించారు. 'దృశ్యము' అనండి.

      తొలగించండి
  4. పరమా నందము నొందుచున్ సుమము లాభామా కలాపంబు లన్
    సరసీ జాతము లుల్లసిల్లి విరియన్,జంద్రుండు వెల్గెన్ దివిన్
    విరహా వేశము నందునన్ దలచె వేవేలన్ సితారా యనన్
    సురలా కాశము నందునన్ మురిసి సంశోభిం పగాదో చినన్

    రిప్లయితొలగించండి
  5. బండకాడి అంజయ్య గారి పూరణ...

    గురుతర బాద్యతల నెరపు
    వరుసన్ రవి చంద్రులంత ప్రతిదినమువలెన్
    అరుణుడు నస్త్రాద్రికి జన
    సరజీజాతములు విరియ జంద్రుడు వెల్గెన్.

    రిప్లయితొలగించండి
  6. అరుసము నొందెను యామిని
    సరసీ జాతములు విరియ; జంద్రుడు వెల్గెన్;
    విరిసిన వెన్నెల వాకలు
    సరసన సొంపొంది గురియ సాంద్రం బగుచున్!

    రిప్లయితొలగించండి
  7. పరగెన్ వెన్నెల విందులు
    కరములు కన్నులు కలిపెడు కాంతుల నడుమన్!
    మురిపెము లొలుకుచు నట యా
    ప్సరసీ జాతములు విరియ జంద్రుడు వెల్గెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది. కాని 'ఆప్సరసీ జాతములు'....?

      తొలగించండి
    2. ఆప్సరసి అంటే అప్సరస కూతురు అనే అర్ధం వున్నందున ఆప్సరసీ జాతములు అంటే అప్సరసల వారసత్వం(అందంలో) పుణికి పుచ్చుకున్న అప్సరసల కూతుళ్ళకు పుట్టిన వారు - అంటే అప్సరసల వంటి అందమైన కోమలులు అనే అర్ధం లో వ్రాశాను

      తొలగించండి
  8. అరయన్ సాంధ్య సమీర కాంతు లలమన్ హాయిన్ వికాసంబుతో
    విరియన్ జాజులు మల్లె మాలతులు తావిన్ భాసిలంగా నిటన్
    వరమై దోచెను వెన్నెలల్ భువిని విప్పారంగ నా సాంధ్యలో
    సరసీ జాతము లుల్లసిల్లి విరియన్ జంద్రుండు వెల్గెన్ దివిన్!

    రిప్లయితొలగించండి
  9. డా.ఎన్.వి.ఎన్.చారి గారి పూరణ...

    తరుణియు వెన్నెల రాత్రిని
    అరుగిడి తన మోము జూచె నా కొలనందు
    న్నరుణుడను కొనుచు మురియుచు
    సరసీజాతములు విరియఁ జంద్రుడు వెల్గెన్

    రిప్లయితొలగించండి
  10. ఎ.వి.రావు గారి పూరణ....

    తరలెను అస్తా చలముకు
    అరుణిమ భానుడు, చెలగుచు యతివేగమునన్
    తరలెను లేగలు గూటికి
    సరజీజాతములు విరియ జంద్రుడు వెల్గెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది. అభినందనలు.
      'తరలెను + అస్తాచలము'అని విసంధిగా వ్రాయరాదు. చలముకు అనరాదు. 'తరలెను పడమటి కొండకు | నరుణిమ...' అనండి.

      తొలగించండి
  11. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి చంద్రమౌళి గారి పూరణను కించిద్సవరణలతో పంపితిని . అది యిక్కడ యిస్తున్నాను. తిలకించగోర్తాను.

    చంద్రమౌళి గారు మీరన్య కార్యనిమగ్నత కారణమున పూరించడానికవకాశము చిక్క లేదని భావించి మీపూరణకు కావలసిన సవరణలతోడనీ పద్యమును తిలకించండి.

    అతిరిక్తంపు పదమ్ములన్ వదలి నీవందమ్ముగా తెన్గునన్
    చతురమ్మైన కవిత్వమున్ మనమునాస్వాదించు చున్ వ్రాయుమా
    గతరోషానన యైన బ్రహ్మసతి వాక్కాంతాలలామంబు భా
    రతిపాదాలకు మ్రొక్కి యీ కవనసామ్రాజ్యాన పేరొందుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వరరావు గారూ,
      మీ సవరణ అనన్య సామాన్యం, ఆహ్లాదకరం, మార్గదర్శకం. ధన్యవాదాలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  12. ఆప్సరసి అంటే అప్సరస కూతురు అనే అర్ధం వున్నందున ఆప్సరసీ జాతములు అంటే అప్సరసల వారసత్వం(అందంలో) పుణికి పుచ్చుకున్న అప్సరసల కూతుళ్ళకు పుట్టిన వారు - అంటే అప్సరసల వంటి అందమైన కోమలులు అనే అర్ధం లో వ్రాశాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారు వైరుధ్యపు పూరణ నాకాంక్షించి చేసిన మీ ప్రయత్నము శ్లాఘనీయము. "ఆప్సరసి" అప్సరస కూతురన్న యర్థములో తెలుగు పదమయినది. సమాసము సేయదలచిన ఆప్సరసి జాతముల ని చేయాలి తప్ప దీర్ఘము రాదు.సంస్కృత సమాసము సేయదలచిన “ఆప్సరోజాతములు”
      గా జేయవలెను. “అప్సరస” సకారాంత స్త్రీ లింగ (అప్సరః ) పదము. అపత్యార్థములో “ఆప్సరః" అవుతుంది.

      తొలగించండి
    2. విశ్లేషణాత్మక వివరణలతో నా ప్రయత్నాలను ప్రోత్సహిస్తున్న గురువు గారికి మరియు మాన్యులు కామేశ్వర రావు గారికి ధన్య వాదములు.

      తొలగించండి
  13. హరి చరణాబ్జ సముద్భవ
    సురనది మందాకినీ విశుధ్ధ జలములన్
    మెరసిన సిరి కనుల వోలె
    సరసీజాతములు విరియ;జంద్రుడు వెల్గెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. 'కనులవలెన్' అనండి.

      తొలగించండి
    2. గురుదేవుల సూచనమేరకు పద్యమును సవరించితిని
      చరణాబ్జ సముద్భవ
      సురనది మందాకినీ విశుధ్ధ జలములన్
      మెరసిన సిరి కనుల వలెన్
      సరసీజాతములు విరియ;జంద్రుడు వెల్గెన్

      తొలగించండి


  14. కం:త్వరితముగా తమ పనులను
    గరితలు వడిగా ముగించి కన్నని కొరకై
    సరసుకడకేగ నచ్చో
    సరసిజాతములు విరియఁజంద్రుడు వెల్గెన్.

    రిప్లయితొలగించండి
  15. మురియం దారలు నాకమందు నిట నంభోరాశు లుప్పొంగగం
    బరమప్రీతిని వెన్నెలంగని తమిం బాడం జకోరమ్ములుం
    బరువం బందున నున్న కన్యలన సంభావింప కల్హారముల్
    సరసీజాతము లుల్లసిల్లి విరియన్ జంద్రుండు వెల్గెన్ దివిన్

    కెరటము లుప్పొంగఁ గడలి
    దొరతనమున తారల మది దొంగిలి నెమ్మిన్
    విరివిగ నెల్లెడఁ గలువలు
    సరసీజాతములు విరియఁ జంద్రుఁడు వెల్గెన్

    రిప్లయితొలగించండి
  16. కిరణమ్ముల దాడి నడచి
    హరివాహను డస్తమించ నస్తాచలమున్
    అరుదెంచ పులుగు లిక్కకు
    సరసీజాతములు విరియఁ జంద్రుఁడు వెల్గెన్

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. హరిదశ్వుని గనినంతనె
    సరసీజాతములు విరియ, చంద్రుడు వెల్గెన్
    మురియుచు పూర్ణిమ రేయిని
    సరసున విరిసిన కలువల సవురును గనుచున్!!!

    రిప్లయితొలగించండి
  19. పరగెన్ తూర్పున లేతభానుని ప్రభల్ ప్రాభాత మందున్ భువిన్
    సరసీ జాతము లుల్లసిల్లి విరియన్; జంద్రుండు వెల్గెన్ దివిన్!
    తరుణుల్ తారలు ప్రస్తుతించి గొలువన్, తాదాత్మ్యమున్ జెందుచున్
    పరమేశుండు శిరమ్మునందు ధరియింపన్ మల్లెపూగుత్తిగా

    రిప్లయితొలగించండి

  20. సరసులకంందమువచ్చును సరసీజాాతములువిరియ,జంంద్రుడువెలిగె న్నరయగబూర్ణిమదినమున
    విరబూసినమల్లివోలెవేడుకగలుగన్

    రిప్లయితొలగించండి
  21. సరసన కృష్ణుని గని ముఖ
    సరసీ జాతములు విరియ జంద్రుడు వెల్గెన్
    తరుణులను తారల నడుమ
    న రసమయము గనగనదియె నవ్యపు శోభల్

    రిప్లయితొలగించండి
  22. చిరుజల్లుల్ గురియంగ మంచుకరుగన్, చెన్నార తేజస్వి రా
    తరుణం బయ్యె నటంచు దల్చి యతనిన్ దర్శింపగా గోరుచున్
    సరసీజాతము లుల్లసిల్లి విరియన్, జంద్రుండు వెల్గెన్ దివిన్,
    పరమోత్సాహము తోడ కల్వలు నిశిన్ భాసిల్లి వీక్షించగన్

    మురియుచు ప్రభాకరున్గని
    సరసీజాతములు విరియఁ, జంద్రుఁడు వెల్గెన్
    కరము నిశీధిని కలువల
    చిరునవ్వులు తళుకు మనుచు చిప్పిల్లంగన్

    రిప్లయితొలగించండి
  23. అరుణుండంబరవీధిలో వెలుగు లీయంగా, తటాకమ్ములన్
    సరసీజాతములుల్లసిల్లి విరియన్, చంద్రుండు వెల్గెన్ దివిన్
    కరవేగమ్ముగ సింహికాసుతుడు మ్రింగంగన్ నబః కేతనున్
    విరియన్ రాహువు చెచ్చెరన్ చదలు దీప్తించెన్ దినేశుండటన్
    సింహికః రాహువుతల్లి

    రిప్లయితొలగించండి
  24. .ధరణీజాతకచక్రమే దిరుగ నాధారంబు నౌ భాస్కరా
    సరసాలంకృతభావనా స్మృతిగ విశ్వాసాన నిన్నెంచగా ?
    సరసీ జాతము లుల్లసిల్ల విరియన్;”జంద్రుండు వెల్గెన్ దివిన్
    మరులున్ గొల్పెడివెన్నెలున్ నొసగు|మర్మంబందు రాత్రిళ్ళలో”|
    2.అరదినమందున రవితో
    సరసీ జాతములు విరియ|”జంద్రుడు వెల్గెన్
    మురియగతామరపువ్వులు
    అరదినమున సంతసించు నదియొక వింతే|

    రిప్లయితొలగించండి
  25. అరుణుండొచ్చెను దామసిన్ దరిమి బ్రహ్మాండమ్మునే గాయగన్
    జిరుకాంతుల్ వెద జల్లుచున్ , ముదముతో జేజే లనంచున్నిలన్
    సరసీజాతములుల్లసిల్ల విరియన్ , జంద్రుండు వెల్గెన్ దివిన్
    విరహమ్మందున గల్వలే పిలిచెనో వేగమ్ముగా నా శశిన్ .

    రిప్లయితొలగించండి
  26. పరమా నందము బొందె మింట గని యా ప్రద్యోతుడా దొర్వునన్
    సరసీజాతము లుల్లసిల్లి విరియన్, జంద్రుండు వెల్గెన్ దివిన్
    ధర కల్హారము లెల్ల బూయ గని మోదంబొంది, పూ లన్ని భా
    సుర నింగీశుల కెల్ల సౌరభముతో సుస్వా గతం బల్కవే.

    రిప్లయితొలగించండి
  27. స మ స్య
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    సరస క్రియాను రక్తిన్

    పురుష స్త్రీ గణము లొక్క పున్నమి రేయిన్

    మురిసిరి కడున్ | దమ మన

    స్సరసీజాతములు విరియ చ౦ద్రుడు వెల్గెన్

    రిప్లయితొలగించండి
  28. పరుగులు పెట్టించి ప్రభుతఁ
    సరసుల పూడిక తొలంగ జాగృత పరచన్
    గురిసిన వానలు నింపగ,
    సరసీజాతములు విరియఁ జంద్రుఁడు వెల్గెన్!
    (చంద్రుడు = ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.)

    రిప్లయితొలగించండి
  29. గురువర్యులకు నమస్సులు. సవరించిన పూరణ పరిశీలించండి.
    ధృతితో పెద్దల కావ్యముల్ పఠన స్ఫూర్తిన్ జేయుచున్, ధీక్షతో
    సతమున్ మాధవు నీరజోదరుని విశ్వాత్మున్ మదిన్ దల్చుచున్
    గతినీవేయని యిచ్ఛతోడుతను వాగ్భామన్ హృదిన్ నిల్పి భా
    రతి పాదాలకు మ్రొక్కి యీ కవన సాంబ్రాజ్యాన పేరొందుమా!

    రిప్లయితొలగించండి
  30. పరుగులు పెట్టించి ప్రభుతఁ
    సరసుల పూడిక తొలంగ జాగృత పరచన్
    గురిసిన వానలు నింపగ,
    సరసీజాతములు విరియఁ జంద్రుఁడు వెల్గెన్!
    (చంద్రుడు = ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.)

    రిప్లయితొలగించండి
  31. అరుణుండుదయింపగనే
    సరసీజాతములు విరియ, జంద్రుడు వెల్గెన్
    హరియస్తమించినంతట
    మెరిసెడు తారల సరసన మిన్నగ తానే

    రిప్లయితొలగించండి
  32. క్రమాలంకారంలో పూరించేయత్నం చేశాను.
    పరమానందము తోడను
    సరసీజాతములు విరియుఁ,జంద్రుడు వెల్గున్
    అరుణోదయవేళలలో
    అరుణాస్తమయ సమయముల నాకాశములో

    రిప్లయితొలగించండి
  33. ధరణిం గల్గిన నెల్ల ప్రాణులకు నాధారంపు సూత్రంబుగా
    కరుణం గాంచుచు దివ్యకాంతులిడుచుం గామ్యార్థముంజూపు-సు
    స్థిర లోకైక సకర్మసాక్షి కరముల్శీఘ్రాన దీపింపగా
    సరసీజాతములుల్లసిల్లి విరియన్ జంద్రుండు వెల్గెన్దిదివిన్.

    ---------------****------------------

    పరమార్థకలిత మూర్తియు
    సురుచిర శోభస్కరుండు,సూర్యుని కరుణన్
    ధరణిని కరమగు వరమై
    సరసీ జాతులు విరియ జంద్రుడు వెల్గెన్.

    *****************************

    రిప్లయితొలగించండి
  34. ధరణిం గల్గిన నెల్ల ప్రాణులకు నాధారంపు సూత్రంబుగా
    కరుణం గాంచుచు దివ్యకాంతులిడుచుం గామ్యార్థముంజూపు-సు
    స్థిర లోకైక సకర్మసాక్షి కరముల్శీఘ్రాన దీపింపగా
    సరసీజాతములుల్లసిల్లి విరియన్ జంద్రుండు వెల్గెన్దిదివిన్.

    ---------------****------------------

    పరమార్థకలిత మూర్తియు
    సురుచిర శోభస్కరుండు,సూర్యుని కరుణన్
    ధరణిని కరమగు వరమై
    సరసీ జాతులు విరియ జంద్రుడు వెల్గెన్.

    *****************************

    రిప్లయితొలగించండి
  35. మరువన్ జాలని ధర్మయుద్ధమున బ్రహ్మాండమ్ముగా పోరుచున్
    తరుమున్ గొట్టగ తెల్గుదేశమును పాతాళంబు వాకిళ్ళకున్
    విరియన్ తెల్లని కల్వపూవువలె సంప్రీతిన్ తెలంగాణ హా!!!
    సరసీజాతము లుల్లసిల్లి విరియన్ జంద్రుండు వెల్గెన్ దివిన్!

    చంద్రుండు = కల్వకుంట్ల చంద్రశేఖర రావు

    రిప్లయితొలగించండి