24, జూన్ 2016, శుక్రవారం

సమస్య - 2069 (రాతినిఁ గాంచి కాంత...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“రాతినిఁ గాంచి కాంత యనురక్తినిఁ బొందె మనోజకేళికై”
లేదా...
“రాతినిఁ గని కాంత రక్తి నందె”

54 కామెంట్‌లు:

  1. నీతిగ నేలుచున్న ధరణీపతి, చెంగట చేరి 'సుందరీ!
    ప్రీతినిఁ గొంటి, నిద్దె మన పెండిలి, సాక్ష్యము పంచభూతముల్,
    చేతము లౌను నమ్ము మని చెప్పగ నాతని కన్నులందు సూ!
    బ్రాతినిఁ గాంచి కాంత యనురక్తినిఁ బొందె మనోజకేళికై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేతము లౌను అంటే అన్వయం కావటం లేదు. 'సాక్షుల పంచభూతముల్ చేతము' అనండి. పంచభూతములను సాక్ష్యములను చేయాలి రెండూ బహువచనాలుగా రావాలి కదా. ఇంకొంచెం బాగుండాలంటే భూతశబ్దాన్ని ప్రాసస్థానం దగ్గరకు తెచ్చి ప్రయత్నించవచ్చును.

      తొలగించండి
    2. ఈ పాఠమును పరిశీలించండి

      నీతిగ నేలుచున్న ధరణీపతి, చెంగట చేరి 'సుందరీ!
      ప్రీతినిఁ గొంటి, నిద్దె మన పెండిలి, సాక్షులు పంచభూతముల్,
      చేతములున్ను, నమ్ము మని చెప్పగ నాతని కన్నులందు సూ!
      బ్రాతినిఁ గాంచి కాంత యనురక్తినిఁ బొందె మనోజకేళికై

      తొలగించండి


  2. దేశ రాజధానికి చదువు కోసం వెళ్లిన జిలేబి గుజరాతిని ప్రేమించె :)


    చదువుల కని యేగె చక్కని చుక్కయు
    రాష్ట్రములను దాటి రాజధాని
    సున్నిత మనసు గల సుందరుడగు గుజ
    రాతినిఁ గని కాంత రక్తి నందె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుజరాతును అవుతుంది కానీ గుజరాతిని అవదండీ, మరొక ప్రయత్నం చేయండి.

      తొలగించండి

    2. అమ్మాయి గుజరాతి అబ్బాయి ని లవ్వాడె !

      ఏక లవర్ వ్రతీ :)

      మరో లవ్వు భారత నారికి బాగోదుస్మీ :)

      చీర్స్

      జిలేబి

      తొలగించండి
    3. అంధుకే మీ పద్యాలను వర్జిస్తా నన్నది. నేను చెప్పిన దేమిటి. మీ సమాధానం ఏమిటీ పొంతన ఏమన్నా ఉందా చెప్పండి?

      తొలగించండి

    4. శ్యామలీయం వారు మరీను :) అమ్మాయి అబ్బాయి ని మోజు పడింది అంటా ఉంటే గుజరాతు అని రాష్ట్రాన్ని మోజు పడమంటే ఎట్లా ?

      వర్క్ ప్రెషర్ ఇవ్వాళ మరీ తక్కువ కామోసు ?

      జిలేబి

      తొలగించండి
  3. శ్యామ సుందరుడిని ప్రేమ మీరగ శిల్పి
    రాయి మలచి జెక్కె లాస్య మలర
    ప్రాణమున్న యటుల భాసిల్లు తీరునా
    రాతిని గని కాంత రక్తి నందె!

    రిప్లయితొలగించండి
  4. నాతి యనుకొ నె రమ రాతిరి యేగుచు
    రాతిని గని, కాంత రక్తి నందె
    సొగసు దనము తోడ శోభిల్లు నూతన
    వరుని జాచి మిగుల వలపు గలి

    రిప్లయితొలగించండి
  5. భార్యకిడిన మాట భావించి మదిలోన
    కోకను ధరియించి కోమలివలె
    సింహబలునిఁదునుమ సిద్ధమౌ కీచకా
    రాతినిఁగని కాంత రక్తినందె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది. కోక నొండు గట్టి కోమలివలె అనండి. దేశి ఛందస్సుల్లో గణాలమీద పదాలు విరగటం ఒక అందం. వృత్తాల్లో ఐతే, అలా పదేపదే విరగటం ఒక దోషం!

      తొలగించండి
  6. భూసారపు నర్సయ్య గారి పూరణ....

    విధిలిఖితము నెవరు విడిచి బ్రతుకలేరు
    కాలగతి నెవారు కానలేరు
    మంచి యందగత్తె మండోదరియె, సురా
    రాతినిఁ గని కాంత రక్తి నందె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎవారు అన్నమాట సరికా దనుకుంటాను. కొంచెం పద్యాన్ని చిత్రికపట్టాలండి. 'నుదుటి వ్రాలు నెవ్వ రెదిరించగలవారు| కాలగతిని జనులు కాంచలేరు' అందాం. కామా ఎందుకు? విరామచిహ్నాలు అవసరం కాదు.

      తొలగించండి
  7. రాతిరి వేళ యా పడతి రాగము దీయుచు బోవు చుండియు న్
    రాతిని గాంచి కాంత యను రక్తిని బొందె, మనోజ కేళికై
    నా తిని వేడెనా గురుడు నమ్ముము కోరినవన్ని నిత్తుగా
    నేతరుణంబు నైన మఱి యిప్పుడు నాదరి కీవ రాగదే

    రిప్లయితొలగించండి
  8. వీత ధృతీప్సితార్తి ఘన పీడిత మానస భూరి గోపికా
    వ్రాతము లోన వర్తిలు విలాస విహార విలోలుఁ గృష్ణుని
    న్నాతత బాహు విక్రమ మహాబల సుందర రూపు దానవా
    రాతినిఁ గాంచి కాంత యనురక్తినిఁ బొందె మనోజకేళికై

    చిరకాలానికి స్వదేశము వస్తున్న కూతురునకు విమానాశ్రయములో స్వాగతము పల్కు సందర్భము:

    తల్లి తండ్రి వచ్చి తనయకు నచ్చట
    నింటి వంటకమ్ము లీయఁ బ్రీతి,
    స్వంత వారిఁ గనిన పరమ మోదమె గద
    రా, తినిఁ గని కాంత రక్తి నందె

    రిప్లయితొలగించండి
  9. బాల ప్రాయ మందు భానుని శోభకు
    మనసు పడెను గాదె మగువ కుంతి
    మంత్రమును జపించి మక్కువతో హిమా
    రాతిని గని కాంత రక్తి నొందె!!!

    హిమారాతి = సూర్యుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భారతకథను మార్చేస్తున్నారే! అలా చేయకూడదండీ. పద్యం బాగానే ఉంది.

      తొలగించండి
  10. పారిజాతము నిడి పత్ని రుక్మిణిమది
    నేలు వాడు రాగ కాలదన్న
    కందెనేమొననుచు కాలొత్తు దానవా
    రాతినిఁ గని కాంత రక్తినందె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చూతును గాదె రుక్మిణిని సొంపుగ పట్టెను పారిజాతమున్
      దాతవు నీవుగావె నని దన్నిన శ్రీమతి పాదపద్మమున్
      ప్రీతిగ, కందెనేమొనని ప్రేమగ నొక్కగ బట్టు దానవా
      రాతినిఁగాంచి కాంత యనురక్తినిఁబొందె మనోజకేళికై

      తొలగించండి
    2. మొదటిపద్యం‌ ఆటవెలది తమాషాగా ఉంది.సలక్షణం. ఇక వృత్తంలో, చూతును సరైనపదం కాదు. 'కావె నని' అన్నది పొరపాటు. 'కావె యని' యడాగమం చేయాలి. దన్నిన అని యెందుకు? తన్నిన అనవలసి ఉంది - ద్రుతమేమీ‌ లేదు కదా ఇక్కడ. 'కందెనేమొ నని' కూడా పొరపాటే, 'కందెనేమొ యని' యడాగమమే చేయా లిక్కడ కూడా. ' ప్రేమగ నొక్కగ బట్టు' బదులు 'ప్రేముడి మీఱగ బట్టు' అనటం సరసోక్తిగా గ్రంథభాషోచితంగ ఉంటుంది.

      తొలగించండి
    3. సవరించిన పద్యములు:

      పారిజాతము నిడి పత్ని రుక్మిణిమది
      నేలు వాడు రాగ కాలదన్న
      కందెనేమొయనుచు కాలొత్తు దానవా
      రాతినిఁ గని కాంత రక్తినందె!




      చూతును గాదె రుక్మిణిని సొంపుగ పట్టెను పారిజాతమున్
      దాతవు నీవుగావె యని తన్నిన శ్రీమతి పాదపద్మమున్
      ప్రీతిగ, కందెనేమొ యని ప్రేముడి మీఱగ బట్టు దానవా
      రాతినిఁగాంచి కాంత యనురక్తినిఁబొందె మనోజకేళికై

      తొలగించు

      తొలగించండి
  11. పాతకుడై పరాయి సతి భర్తల ముందె పరాభవించగా,
    రాతిరి వేళలో నెదిరి క్రన్నన తేఱిచి, దుర్మదాంధుడున్
    ఘాతకుడైన సింహబలుఁ గాలునిలోకము పంప, కీచకా
    రాతినిఁగాంచి కాంత యనురక్తినిఁబొందె మనోజకేళికై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'సింహబలుఁ గాలుని యొద్దకుఁ బంపు' అనండి. పద్యం బాగుంది.పంప అన్నప్పుడు పంపించగా అని అర్థం‌బాగానే వస్తున్నా, పంపు అన్నప్పుడు అలా యమునివద్దకు పంపించే పని చేసినట్టి భీముడు అని వస్తుంది. మరింత బాగుంటుందని నా ఉద్దేశం. పద్యం‌ బాగుంది.

      తొలగించండి
  12. శ్యామలీయం గారికి నమస్సులు. నిన్నటి సమస్యలో నలుగురి పూరణలు మిగిలినవి. అవి కూడా పరిశీలించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  13. . కౌతుక మెంచి లక్ష్మి తనకామిత సిద్ధిని దీర్చు టౌ మురా
    రాతిని గాంచి కాంత యనురక్తిని బొందె మనోజ కేళికై
    పూతుడు నెంచునట్లు విరిపొత్తున వాల్జడ నందు నవ్వగా?
    భూత దయామయుండురికి పొందిక చేతను చెంత జేరెగా| {పూతుడు=పవిత్రుడు}
    2.తరతరాలు నెంచు దక్షత శిల్పాల
    రాతిని గని కాంత రక్తినందె|
    అమర శిల్పిజెక్కె |ఆరాధ్య దైవాలు
    భక్తి పెంపు కొరకు,యుక్తి బంచె|
    3.కందంలో పూరణ దయతో మన్నింతురని గురువర్యులకు విన్నపముసమస్య చివరి అక్షరము”కై”ని “కే “గామార్చినందుకు
    ఘనమౌ బేలూరు శిలలు
    అనవరతము నవతరమున నాశ్చర్యమె|”రా
    తినిగాంచి కాంత యనుర
    క్తిని బొందె మనోజ కేళికే తిలకించన్|

    రిప్లయితొలగించండి

  14. చేతనతో జనించు నవ జీవన రాగము నందగోరి వి
    స్ఫీత వికాస భావన రచించుచు ప్రేయసి మానసంబులో
    ఖ్యాతిని బొందగా వరలు గౌరవ భావము లోని విభ్రమా
    రాతిని గాంచి కాంత యనురక్తిని బొందె మనోజకేళికై!

    రిప్లయితొలగించండి
  15. మిత్రులందఱకు నమస్సులు!

    [తార, శశాంకునిం జేరుటకై తపించిన విధము]

    చాతక పక్షి, తోయద ప్రసాద గతిన్ గని పొంగి నట్టులున్;
    జేతము జల్లు జల్లుమనఁ, జిత్రశిఖండిజు కన్మొఱంగి, కా
    మాతురతన్ రహస్య దిశ యందున నుండ, సరించి, వేగ మేచకా

    రాతినిఁ గాంచి, కాంత యనురక్తినిఁ బొందె మనోజకేళికై!

    రిప్లయితొలగించండి
  16. చేతమునందు రూపము సజీవముగా నిలిచేను! యంధకా
    రాతిని గాంచి కాంత యనురక్తిని బొందె మనోజకేళికై
    “యీ తనువెల్ల డెందమును యీశునికే”నని జేసె ధ్యానమున్
    పాతిగ బొందె నీశ్వరుని పార్వతి ఘోర తపంబొనర్చగన్॥

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిలిచేను, ఈశునికే అన్నవి సరైన పదరూపాలు కావు. కనుపించు, ఈశునకై అని వాడండి. పద్యాంతం ఘోరతపాంతరంబునన్ అని చేయండి.

      తొలగించండి
  17. జాతిని తల్లి దండ్రులను సౌఖ్యము గోరెడి యన్నదమ్ములన్
    నీతిని ప్రేమ బంధముల నిర్మల మిత్రుల స్నేహ హస్తములు
    రీతిని పాతి పెట్టి తన ప్రేమను గోరిన వంశ హీను డా
    రాతినిఁ గాంచి కాంత యనురక్తినిఁ బొందె మనోజకేళికై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొత్తరకంగా అలోచించారు. బాగుంది. రెండవపాదాంతంలో లఘువు! స్నేహ మెల్ల నారీతిని అనండి. వంశహీనుడౌ అన్నా బాగానే ఉంటుంది కూడా.

      తొలగించండి
  18. మధుర భావ లహరి మదిని క్రమ్ముకొనగ
    పండు వెన్నెల నవ వధువును తన
    మగని చెలిమి వోలె మరపింప నీరజా
    రాతిని గని కాంత రక్తి నందె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది. దేశి ఛందాల్లో వీలైనంతవరకూ పాదాంతంలో‌పదం‌పూర్తి అయ్యేలా చూడండి. ప్రవాహగుణం అంతగా కళకట్టదు. పెద్దకవులూ‌ చెయలేదా అనకండి.

      తొలగించండి
  19. నాతిని రాతిగా నునిచె నాగ్రహ మొందుచు మౌని యొక్క డా
    రాతిని నాతిగా మలచె రాముడు తా వనసీమ లోన , నో
    భూత పిశాచ మాంత్రికుడు పూనిక రాజును రాయి జేయ , నా
    రాతినిఁ గాంచి కాంత యనురక్తినిఁ బొందె మనోజకేళికై

    జలక మాడ వచ్చి సంద్రంపు దరి నున్న
    దేవకాంతను గని ద్విజుడు బట్ట
    నింద్ర శాప మొంది యిల పైన నిలువ చ
    ట్రాతినిఁ గని కాంత రక్తి నందె”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓ‌భూత అనకూడదు పద్యాల్లో! వనసీమలోపలన్ అనండి. సమర్థన ఎలాగు? కాంతకు అది రాయిలాగే కనిపిస్తూ‌ందంటూ ఉంటే సమస్య అలాగే ఉండిపోతోందిగా?

      తొలగించండి
  20. హరుని చాప మెత్తి యవలీలగా ద్రుంచి
    ఘనత చాటుకున్న కమలనయన
    రాముని రణరంగ భీముడైన దనుజా
    రాతిని గని కాంత రక్తి నందె

    రిప్లయితొలగించండి
  21. నారదుండు చెప్ప నాతిరుక్మిణితాను
    కోరి వలచె కృష్ణు కూర్మితోడ
    కంటికెదురుగాను కన్పించుదానవా
    రాతిని గని కాంత రక్తి నందె.

    రిప్లయితొలగించండి
  22. చాటుకున్న అనరాదు చాటుకొనిన అనండి గ్రంథభాషలో. మూడవపాదం సలక్షణమే‌కాని నడక బాగోలేదు గమనించండి. ఏ కాంత ఇంతకీ?

    రిప్లయితొలగించండి
  23. చేతను విల్లు దాల్చి రణ క్షేత్రము నందు చెఱంగునట్టి యా
    భీతినెఱుంగలేని యరి వీరభయంకర పాండవ మధ్యమున్ దరిన్
    ప్రీతిగ జేరె మేనకయె ప్రేమను తెల్పగ దాను కౌరవా
    రాతిని గాంచి కాంత యనురక్తిని బొందె మనొజ కేళికై

    రిప్లయితొలగించండి
  24. రాతిని చెక్క శిల్పి యతి రమ్యముగా పురుషాకృతిన్ భళా !
    రాతిని గాంచి కాంత యనురక్తిని బొందె "మనోజ కేళికై
    ఈతని వంటి నాథునకె యిచ్చెద నా రసికత్వ" మంచు నా
    రాతుల జెక్కు శిల్పికి కరమ్ముల మోడ్చి నమస్కరించుచున్.

    రాతి బొమ్మయె మగ రాయడన్ భ్రమ నింప
    రాతిని గని కాంత రక్తి నందె
    ఇట్టి భర్త కొరకె యిత్తు నా రసికత
    నంచు శిల్పి దలచి యంజలించె ((ఈ భావనని కూడా చిత్తగించండి)

    రిప్లయితొలగించండి
  25. ధనికొండ రవిప్రసాద్ గారూ,
    మీ రెండు (విధాల) పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘రాతుల’ అన్న ప్రయోగం సాధువు కాదేమో? ‘రాతిని జెక్కు శిల్పికి...’ అనవచ్చు కదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ స్పందన గమనించటం నా నుంచి ఆలస్యమైనది .మన్నించాలి. "రాతిని" అనవచ్చు. నాకు ఎడిటింగ్ ఇక్కడ రాదు. మీరు మార్చవచ్చును. "రాతిని" అనేది సవ్యమైనప్పుడు "రాతుల" అనే పదం లో దోషం ఏమిటో నాకు అర్థం కాలేదు గురువు గారు !

      తొలగించండి
  26. నీతి నిజాయితిన్ విడిచి నెగ్గగ నెన్నికలుత్తరంబునన్
    ప్రేతలు భూతముల్ తొలగి ప్రీతియు మీరగ ముఖ్యమంత్రియై
    రాతియె నాతియై నొనర రమ్యపు రీతిని బొమ్మజేయ నా
    రాతినిఁ గాంచి కాంత యనురక్తినిఁ బొందె మనోజకేళికై :)

    రిప్లయితొలగించండి