19, జూన్ 2016, ఆదివారం

న్యస్తాక్షరి - 35 (రా-మ-దా-సు)

అంశము- భద్రాచల రాముఁడు
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాల మొదటి అక్షరాలుగా వరుసగా 
‘రా - మ - దా - సు’ ఉండాలి.

103 కామెంట్‌లు:

 1. రాతి గుడిలోన బొమ్మవై నాతి తోడ
  మమ్ము కరుణించ నిలిచేవు మహిని జూడ
  దానవాంతక పాహి భద్రాద్రి వాస
  సుజన రక్షక శ్రీరామ సుగుణధామ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారు మీ పూరణ చాలా బాగుంది. నిలిచేవు గ్రామ్యము. కరుణించ నుంటివి యనిన బాగుండును.

   తొలగించండి
  2. Kameswara Rao Pochiraju గారికి ధన్యవాదాలు మీ సూచన శిరోధార్యం నా సవరించిన పద్యం
   తొలగించండి
  3. రాతి గుడిలోన బొమ్మవై నాతి తోడ
   మమ్ము కరుణించ నుండేవు మహిని జూడ
   దానవాంతక పాహి భద్రాద్రి వాస
   సుజన రక్షక శ్రీరామ సుగుణధామ

   తొలగించండి
 2. రామడరిగెను దివికిని రమ్యముగను
  మరిచి భద్రున కిచ్చిన మాట నెల్ల
  దానికేడ్చిన భద్రుడు తపముజేసె
  సుస్థిరముగను స్వామిని శిరము నిలుప

  రిప్లయితొలగించండి
 3. రామ! రాక్షస రాజ విరామ! నిరుప
  గుణధామ! రఘుకుల సోమ! జనకజ హృ
  దారవిందాభిరామ! సుధర్మ కామ!
  సురనమిత భద్రగిరి రామ! సురుచి నామ!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హృదరవింద కావాలి. సవరించటానికి ప్రయత్నిస్తా

   తొలగించండి
  2. రామ! రాక్షస రాజ విరామ! నిరుప
   మ గుణధామ! రఘుకుల సోమ! జనకజ హృ
   దాలయాభిరామ! ఘన సుధర్మ కామ!
   సురనమిత భద్రగిరి రామ! సురుచి నామ!!

   తొలగించండి
  3. సత్యనారాయణ గారు మీ సవరణ తో పూరణ బాగుంది.అభినందనలు. విరామ పదము రాక్షసుల కంత సమంజసము గాదు. విదళనమే వారికి తగిన పదము. భార్గవ విరామ: బార్గవునకు విశ్రాంతి నిచ్చిన వాడు.

   తొలగించండి

 4. రామ రామ రామ యటంచు రామ దాసు
  మదిని తపమేమి జేసెనో మనసు తెలియ
  దారి జూపుము రఘురామ దాసి నయితి
  సుగుణ భద్రాద్రి దరిజేర సుళువు తెలుపు


  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. రామదాసత్వమెంచిన రామదాసు
  మరువలేనట్టి భద్రాద్రి మందిరాన
  దాసజనులకు నాదర్శ దారిజూపె|
  సుజన సంస్కార కీర్తనల్ విజయమనగ|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారు మీ పూరణ బాగుంది. అభినందనలు."ఆదర్శ దారి" దుష్ట సమాసము. "మేలైన దారి" యన్న సరిపోవును.

   తొలగించండి
 6. రార! శంఖ చక్ర సహిత రామ! యనుచు
  మహిని భద్రుడు తపమునన్ మనసుఁ దెలుపి
  దాసుడయ్యెను గిరియౌచుఁ దలనువంచి!
  సురునుతుండు భద్రాచల సోముఁడయ్యె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేంకట సుబ్బ సహదేవుడు గారు మీ పూరణ బాగుంది. అభినందనలు. "మనసుఁ దెలిపి" అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములండీ! టైపాటు సవరణతో:
   రార! శంఖ చక్ర సహిత రామ! యనుచు
   మహిని భద్రుడు తపమునన్ మనసుఁ దెలిపి
   దాసుడయ్యెను గిరియౌచుఁ దలనువంచి!
   సురునుతుండు భద్రాచల సోముఁడయ్యె!

   తొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 10. రాతిని నాతిని జేసిన పరంధాముడు
  మతి నిలుపగ కరుణించెడు మహిమాన్వితుడు
  దాతగ వరములనొసగెడు మహేశ్వరుడు
  సుతశ్రేణీ జానకీ వల్లభుడు శ్రీ శ్రీరాముడు

  (గురువు గారు, కేవలం స్వేచ్చా రచనం.
  తప్పులు క్షమించగలరు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. రాతి పాదము తలదాల్చి నాతి యయ్యె
   మతిని నిలుపగ కరుణించె మహిని సామి
   దాతగ వరముల నొసంగు ధర్మ ప్రభువు
   సుత జన పరిపాలా భక్త సుజన రామ !

   స్వల్ప అడ్జస్ట్ మాడి
   బండెనక బండి కట్టి
   జిలేబి

   తొలగించండి
  2. రావు గారు మీ భావ గీతము దానికి జిలేబి గారి పద్య రూపము రెండు బాగున్నవి. ఇరువురకు నభినందనలు. "సుతశ్రేణీ" యనిన మీయుద్దేశ్యము?

   తొలగించండి
  3. పొరపాటుకు మన్నించగలరు. ఆ పదానికి అర్ధం స్త్రీ గా పొరబడి వాడటం జరిగింది.
   ఈ క్రింది విధంగా మార్చినప్పుడు నా భావానికి సరిపోలుతుందని భావిస్తున్నాను.

   రాతిని నాతిని జేసిన పరంధాముడు
   మతి నిలుపగ కరుణించెడు మహిమాన్వితుడు
   దాతగ వరములనొసగెడు మహేశ్వరుడు
   అతివ జానకీ వల్లభుడు శ్రీ శ్రీరాముడు

   తొలగించండి
  4. తప్పిదానికి మరోసారి క్షంతవ్యుడిని. అత్యుత్సాహంతో,
   పూరించడంలో పడిన తికమకకి లెంపలేసుకుంటున్నాను.
   గమనించి క్షమించిన మీ పెద్ద మనసుకు ప్రణామములు.
   __/\__ ...

   రాతిని నాతిని జేసిన పరంధాముడు
   మతి నిలుపగ కరుణించెడు మహిమాన్వితుడు
   దాతగ వరములనొసగెడు మహేశ్వరుడు
   సుతిని జానకీ వల్లభుడు శ్రీ శ్రీరాముడు

   (సుతిని : మాత,జనని) (ఆంధ్ర భారతి)

   తొలగించండి
 11. రాతినే నాతి జేసిన రామ చంద్ర !
  మమ్ము సహితము గాపాడు మిమ్ముగాను
  దాస దాసాను దాసుండ దయను జూడు
  సుజన పాలన రక్తుడ !సౌమ్య చరిత !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారు,
   నాల్గవ పాదములో "సు" కు "సౌ" కు యతి చెల్లదు

   తొలగించండి
  2. అన్నయ్య నీ పూరణ బాగున్నది.సత్యనారాయణ గారి సూచన గమనించదగినది. "శుద్ధ చరిత" యనిన సరిపోవును.

   తొలగించండి
 12. రామ చరితము మార్మ్రోగ రమ్యముగ న
  మరెను భద్రాద్రి గౌతమీ స్వరము లూని
  దాస జనులను బ్రోచుచు వాసి గాంచి
  సుగుణ ధాముడు రాముడు శుభమొసంగు!

  రిప్లయితొలగించండి
 13. రామ! సద్గుణసోమ! భద్రాద్రి వాస!
  మధుసూధన! రక్షించు మమ్ముఁబ్రీతి
  దాసుడ!దయఁజూపుము పరంధామ! శౌరి!
  సురుచిరమునీదు భజన మసుర విదళన!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధునిషూదన - రెండవ పాదంలో చిన్న మార్పు.

   తొలగించండి
  2. రెడ్డి గారు మీ పూరణ సవరణ తో బాగుంది. అభినందనలు.

   తొలగించండి
  3. పండిత నేమాని గారు పూర్వం పద్యములను సమీక్షిస్తూ గురువుగారికి సహకరిస్తూ ఉండే వారు. ఇప్పుడు మీరిస్తున్న సహకారానికి ధన్యవాదములు.

   తొలగించండి
  4. రెడ్డి గారు మీ యభిమానానికి కృతజ్ఞున్ని.

   తొలగించండి
 14. రామ! భద్రాచల విశాల ధామ! దనుజ
  మర్దనక్రియా నిపుణైక మండన వర!
  దాశరధి! జనక సుత హృదయ విహార!
  సుజన పూజిత! ప్రణతులు సుందర ముఖ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భద్రగిరి రామమూర్తికిఁ బ్రణతు లిడుచు
   మేటి పూరణఁ జెప్పిన మీకుఁ బ్రీతిఁ
   బలుకుదు నభినందనములఁ జెలిమితోడఁ
   సాటి కవుల పూరణముల సాధ్వసాధు
   చింతనము సేసి యొప్పు సూచించునట్టి
   పోచిరాజు కామేశ్వరా ముదముతో న
   మస్కరించెద నెంచి మీ మంచితనము.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ యపూర్వాభినందనలకు మనస్ఫూర్తిగ ధన్యవాదములు. మీరు విశ్రాంతి తీసుకుంటారని నా తపన.

   తొలగించండి
 15. రాజతిలకుండు భద్రాద్రి రాముడనుచు
  మధుర భక్తిని జూపించి మానితముగ
  దాసుడయ్యెను గోపన్న దాశరథికి
  సుగతుడయ్యెను నిర్మల సాధనాన.

  రాగమనురాగ మమతలు రక్తిగూర్చి
  మధుర భక్తికి నాటంక మగుచునుండు
  దాశరథి పాద సంసేవ తపన వలన
  సురుచిరంబగు యశమును జూడగలము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణగారు మీ పూరణ బాగుంది. అభినందనలు. శోధన తో యతి సరిపోయినది. "రాగమనురాగ మమతలు" మూడును సమానార్థములుగద.

   తొలగించండి
  2. కామేశ్వరరావు గారికి హార్దిక నమస్సులు.మీ అభినందనలకు విశ్లేషణకు ధన్యవాదములు.రాగము.. అను పదమునకు అర్థములుగా, నాటలోనగునది,అనురాగము,ఆశ,మాధుర్యము,కాంతి,మాత్సర్యము,రంగు ,క్లేశములోనగునది,అందము,సంతోషము,ఎఱుపు,కోపము,రజోగుణము,అసూయ. ఇందు నేను ..ఆశ,రజోగుణము,అసూయ అను గుణత్రయము నూహించి వ్రాశాను.

   తొలగించండి
  3. మధుర భక్తికి నాటంక మగుచునుండు నన్న భావము లో నా పదప్రయోగము బాగుందండి.

   తొలగించండి
  4. సుహృన్మిత్రులు కవివతంసులైన మీ సహృదయత ప్రశంసావహము.ధన్యవాదములు.

   తొలగించండి
 16. రామ !భద్రగిరి నివాస !రమ్య చరిత !
  మదిని దలతునునీ రూపు మాననీయ !
  దాసు డైనట్టి గోపన్న ద్రాచి నట్లు
  సుజన పాలక! మాయెడ జూపు దయను

  రిప్లయితొలగించండి
 17. రామదాసులు నీకు నై కామమోహ
  మదవిలోభాదులు విడచి పదములంటి
  దాసులై యుందు రయ్య భద్రాద్రి రామ
  సుజన రక్షక మోక్షంబు చూరగొనగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్కటి పూరణ నిచ్చారు శ్యామల రావు గారు.అభినందనలు. నా పూరణను సమీక్షించ గోర్తాను.

   తొలగించండి
 18. "రా"కలుషముల నెట్టును రసనతోడ
  "మ"తగు వాకిలై మూయు దా మనసుబెట్టి
  "దా"చ నేటికి నయ్యదె తపమనంగ
  "సు"గుణగనియౌచు నరునకు సుగతులీను.

  "రా"జరాజేంద్ర!కాకుత్థ్స!రమ్యతేజ!
  "మ"ధురభాషణ!సౌశీల్య మాన్యచరిత!
  "దా"శరథినామవిఖ్యాత! దనుజహరణ!
  "సు"గుణమునిజన వందిత!సూనృతాత్మ!

  రిప్లయితొలగించండి
 19. క్షమించండి సహదేవుడుగారు .ముద్రారాక్షసం...శోధనాన..కు బదులు సాధనాన అనిపడింది.

  రిప్లయితొలగించండి
 20. జిగురు సత్యనారాయణ గారికి నమస్సులు..క్షమించండి....జనక హృత్+అరవింద--హృదరవింద.హృదారవింద ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారు,
   నిజమె పొరబడ్డాను. సవరించటానికి ప్రయత్నిస్తా.

   తొలగించండి
  2. సూర్యనారాయణ గారు ప్రతియక్షరమునకు భాష్యము చెబుతున్న మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రసనతోడ యని విభక్తి లేకుండ వ్రాయ దగదు గద.. "నెట్టును రమ్యముగను" అనిన బాగుండును. "సుగుణగని" దుష్ట సమాసమండి. "సుగుణఖని" అనండి.
   “కాకుత్స్థ” కు బదులు “కాకుత్థ్స” యని వ్రాసారు.

   తొలగించండి
 21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 22. రిప్లయిలు
  1. "హృదాలయ"ముగా సవరించాను. ధన్యవాదములు

   తొలగించండి
  2. సత్యనారాయణ గారు సహృదయము తో సూర్యనారాయణ గారి సూచనను తీసుకొని సవరించినందులకు ధన్యవాదములు.

   తొలగించండి
 23. సమస్య
  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { నా మొబైల్ పనిచేయక మొన్నటి పూరణ ఈరోజు ప౦పిస్తున్నాను దయచేసి స్వీకరి౦చ౦డి }

  " అల్ల ధరాసుతన్ బరిణయ౦ బయి నట్టి
  ి కతమ్ము చేత , స౦

  ధిల్ల మనుష్య జన్మ ధరణిన్ ,
  రఘురాముడ నైన నేను = నీ

  కల్లుడ నయ్యెదన్ , సుతుడ నయ్యెద || ప్రాణవిభు౦డ నయ్యెదన్

  మెల్లగ విష్ణులోకము గమి౦చు " చనెన్
  హరి , కా౦చి - భూసతిన్

  స౦ధిల్లు = చేకూరు , గమి౦చు = చను . చేరు

  ి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గు రు మూ ర్తి ఆ చా రి గారు మొన్నటి మీ పూరణ బాగుంది. అభినందనలు. సమస్య సమర్థనే కొంచెము సందిగ్ధముగా నున్నది.

   తొలగించండి
 24. 🌺☘🌺

  అంబటి భానుప్రకాశ్.

  శంకరా భరణం న్యస్తాక్షరి.పూరణ.

  తే**

  రామ రఘురామ భధ్రాద్రి రమణ, నిన్ను,
  మనము నందున దలతును మహిని యందు
  దాశరథివని జగమెల్ల దలతు రెపుడు,
  సుగుణ శృంగార శ్రీ రామ జూడు మెపుడు,  అంబటి భానుప్రకాశ్,


  రామ రాజీవ లోచన రాఘవేంద్ర,
  మహిమ జూపగ యేతెంచె మహినియందు,
  దాస దాసుని బ్రోవగ ధరనుజేరె,
  సుగుణ శ్రీ రామ జయరామ సుందరాంగ.  🌺☘🌺

  రిప్లయితొలగించండి
 25. రామ భక్తి గోపన్నలో రాజుకొనగ
  మహిని భద్రాద్రి యయ్యె నీ మందిరమ్ము!
  దాస పోషణ చేయగ తరలి వచ్చు
  సుగుణ ధామ! రామా! దారి చూప రావ!

  రిప్లయితొలగించండి
 26. రామదాసు భద్రాద్రిలో రమ్యమైన
  మందిరంబును గట్టించి మాన్యుడాయె
  దాసుడాయెను గోపన్న దాశరధికి
  సుజన రామాలయం బును చూడ దగును

  రిప్లయితొలగించండి
 27. రామదాసు భద్రాద్రిలో రమ్యమైన
  మందిరంబును గట్టించి మాన్యుడాయె
  దాసుడాయెను గోపన్న దాశరధికి
  సుజన రామాలయం బును చూడ దగును

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మీనారాయణ గారు మీ పూరణ బాగుంది. అభినందనలు. సుజన! యనిన యర్థము సరళతమమగును.

   తొలగించండి
  2. కావచ్చునండీ. కాని కవిత్వంలో విరామచిహ్నాలు వాడటం సంప్రదాయం కాదు . వాడితే అభ్యంతరం చెప్పవలసిన పని లేదనుకోండి.

   తొలగించండి
  3. నెమ్మి నినుండు మేరుధరణీధరనాథుఁ బ్రదక్షిణంబుగాఁ
   ద్రిమ్మరుచున్నఁ జూచి పటుదీధితికిం గర మల్గి వింధ్యశై
   ల మ్మనియెన్‌ ‘దినేంద్ర! యచలప్రభు నన్నుఁ బ్రదక్షిణంబు ని
   త్యమ్మును జేయ కేల మతి దప్పితి? మేరువుఁ గొల్వ నేటికిన్‌? భా.ఆర. 3. 21

   తొలగించండి
 28. ఉత్సాహంగా సమర్థంగా పూరణలు చేస్తున్న కవిమిత్రులకు అభినందనలు.
  ఎంతో సౌహార్దంతో మిత్రుల పూరణలను సమీక్షిస్తూ తగిన సూచనలు ఇస్తున్న గౌరవనీయులు పోచిరాజు కామేశ్వరరావు గారికి ధన్యవాదాలు.
  కంప్యూటర్ ముందు కూర్చుంటే ఎడమ కన్ను ఇబ్బంది పెడుతున్నది. మరో రెండు రోజులు ఈ స్థితి కొనసాగవచ్చు.
  కవిమిత్రు లందరూ సహకరించవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కవిమిత్రు లందరూ సహకరించవలసిందిగా మనవి అంటున్నారు శంకరయ్యగారు. కవిమిత్రులు అయ్యా మీరు కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకోండీ అని విన్నవిస్తున్నా పట్టించుకోవటం లేదు.

   అందుచేత కవిమిత్రు లందరూ కొన్నాళ్ళ పాటు సమస్యాపూరణాదికాలు చేయకుండా సమ్మె చేయాలని నా సూచన. అప్పుడు శంకరయ్యగారికి విశ్రాంతి దొరుకుతుంది తప్పక. అందుకు అందరూ సహకరించవలసిందిగా మనవి.

   తొలగించండి

  2. శ్యామల రావు గారూ,
   మీ అభిమానానికి ధన్యవాదాలు.
   ఎట్టి పరిస్థితిలోనైనా రోజుకొక సమస్యను బ్లాగులో ప్రకటించాలన్నది నా నియమం. సమస్యను ప్రకటించడం అంత కష్టమైన పని కాదు. సమస్యను ఇచ్చిన తరువాత ఎవరెలా పూరించారో చూడాలన్న ఆసక్తి, ఔత్సాహికులు చేసే దోషాలను సవరించాలన్న ఉత్సాహం అనారోగ్యంతో ఉన్నపుడు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. దూడొద్దనుకుంటాను... చూస్తాను.. చూసి ఊరికే ఉండలేను! అదన్నమాట!
   మీరన్నట్టు పూరణలు చేయకుండా సమ్మె (నిజంగానే చేస్తే బ్లాగులోకంలో అదొక రికార్డ్ అవుతుంది సుమా!) చేస్తే నేనే కొన్ని పూరణలు చేసి నా బంధుమిత్రుల పేర్లతో ప్రకటిస్తానేమో? అదింకా శ్రమ పెట్టినట్టు కాదా?
   కనుక నా మనవిని మన్నించి రోజూ నన్ను సమస్య లివ్వనివ్వండి. మీవంటి కవిపండిత మిత్రులు సమీక్షిస్తుంటే నేను విశ్రాంతి తీసుకుంటాను.
   మీ సౌహార్గానికి మరొకమారు కృతజ్ఞతలు!

   తొలగించండి
 29. మంచిమాట చెప్పారు శ్యామలీయం గారూ. కానీ శంకరయ్య గారి స్పందన చూశారుగా!
  ఏమైనప్పటికీ శంకరయ్య గారు కొన్నిరోజులపాటు సమస్యాపూరణం అంటూ అసలు బ్లాగుపోస్టే పెట్టకుండా ఉంటే (ఈ రోజు కూడా పోస్ట్ పెట్టారుగా) ఆయనకి తగిన విశ్రాంతి దొరకడానికి మరింత ఆస్కారం ఉంటుంది. పోచిరాజు వారు సమీక్షిస్తున్నప్పటికీ శంకరయ్య గారు తాను స్వయంగా చూడడం తగ్గించుకోవట్లేదుగా. ఈ పరిస్ధితుల్లో కాస్త విరామం ప్రకటించడమే మంచిది.
  చేయించుకున్న శస్త్రచికిత్సకి ఫలం దక్కించుకోవాలి కదా. అందులోనూ కంటిచూపుకి సంబంధించిన విషయం.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అదే నండీ నా ఆందోళన! పోనీ శంకరయ్యగారిని సమస్యలు ఇవ్వనివ్వండి. 'మీవంటి కవిపండిత మిత్రులు సమీక్షిస్తుంటే నేను విశ్రాంతి తీసుకుంటాను' అని అంటున్నారు శంకరయ్యగారు. పోనీ అలాగే కానిద్దాం. నాకు రాత్రి సుమారు తొమ్మిదిన్నరదాకా తీరదు. కాబట్టి ఆసమయంలో కూర్చుని ఆనాటి సమస్యలను సమీక్ష చేయటానికి నేనిక్కడ సిధ్ధంగా ఉన్నాను. (ఒక్క జిలేబీ గారి మిల్లునుండి వచ్చేవి తప్ప అన్నీ సమీక్షించటానికి యత్నిస్తాను!)

   తొలగించండి
  2. విన్నకోట నరసింహా రావు గారూ,
   ధన్యవాదాలు.
   *****
   శ్యామల రావు గారూ,
   ధన్యుడను. మీ సూచనను పాటిస్తాను. కేవలం సమస్య నిచ్చి మిన్నకుంటాను.

   తొలగించండి
  3. మిత్రులు శంకరయ్య గారు, సంతోషం. ఈ రోజు రాత్రి నుండే పనిలో ప్రవేశిస్తాను. మీరు సాధ్యమైనంతగా విశ్రాంతి తీసుకోండి. కంటి విషయంలో అతిజాగరూకతగా ఉండాలండి.

   తొలగించండి
 30. సమ్మెకు పిలిచెను శ్యామా!
  కమ్మగ యిచ్చిరి రిటార్టు కంది కవివరుల్
  నిమ్మది సమస్య పూరణ
  నమ్ముము, కవివరులు మెచ్చు నందన వనమూ

  జిలేబి
  పరార్ :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు  1. హమ్మయ్యా

   జిలేబి మిల్లుకి రెవ్యూ లేదు :)

   చీవాట్లు తప్పేను :)


   ప్రాజెక్టు వర్కులో సమయం ఉండునా :)
   చీర్స్
   జిలేబి

   తొలగించండి
  2. 1. "జిలేబి మిల్లుకి రెవ్యూ లేదు."
   రివ్యూ వలన ఏమైనా ఉపయోగం ఉండునా?

   2. "ప్రాజెక్టు వర్కులో సమయం ఉండునా?"
   చిత్తం. నా ప్రాజెక్టు వర్కు ఆనాటికి ముగించిన పిదపనే పద్యాలను రివ్యూ చేసేది.

   తొలగించండి

  3. అట్లంటారా :)

   ప్రాజేక్టు వర్కులో మిమ్మల్ని బయటపడనీకుండా చేసేస్తా :)

   చీర్స్
   జిలేబి

   తొలగించండి
  4. మా మేనేజరుకు కూడా మీ పద్యాలు పంపుతారా? పంపండి. వారు sick కావటం తప్ప మీ కేమీ లాభం లేదు.

   తొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
 31. మీ మేనేజరు యెరుగని
  వేమీ కాదుగ జిలేబి వేపుడు గీతల్
  మా మీ మాటలు మొత్తము
  రామా రావుకు తెలియని రాగము గాదే :)

  రిప్లయితొలగించండి
 32. రామ రామయని మనసార నుతి యించె
  మహిని భద్రాద్రి పై రామ మహిమ దెలుప
  దామము లమర్చగా రామదాసు యెంతొ
  సుకృతమును చేసుకొనె నంత సువిదుడతడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘దాసు+ఎంతొ’ అన్నపుడు సంధి నిత్యం, విసంధిగా వ్రాయరాదు కదా! అక్కడ ‘రామదాసు తాను’ అనండి.

   తొలగించండి
 33. రామ శ్రీరామ శ్రీరామ రామ యనుచు
  మదిని స్మరణ నిరతము ముమ్మారు చేయ
  దాని ఫలితము ఎన్నగా దాని ఫలము
  సుగుణ ధాముని కరుణఎ సులభ తరము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామకృష్ణ గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ పూరణ బాగుంది.
   మూడవపాదంలో ‘దాని ఫలితము/దాని ఫలము’ పునరుక్తమయింది. ‘దాని ఫలితము నెన్న నెవ్వాని తరము’ అందామా?
   ‘కరుణయె’ పొరపాటున ‘కరుణఎ’ అని టైపయినట్టుంది.

   తొలగించండి
 34. గురువు గారూ మీ సూచన పాటిస్తాను
  రామ శ్రీరామ శ్రీరామ రామ యనుచు
  మదిని స్మరణ నిరతము ముమ్మారు చేయ
  దాని ఫలితము నెన్న నెవ్వాని తరము
  సుగుణ ధాముని కరుణయె సులభ తరము

  రిప్లయితొలగించండి
 35. గుణములనెంచబోక నిక గో్ప్యముగా భవబాధ బాపుకో్న్్
  తృణమొదళమ్మ్మొ గొంచునొకదివ్య పరేశు నహంబునచ్చటన్
  పణముగబెటిటి భక్తిమెయిప్రార్ధనలన్ సరిజేయ జీవికన్
  రణమన నేల! శాంతిగని రాజిల వచ్చుగదయ్య శంకరా!pitta satyanarayana

  రిప్లయితొలగించండి
 36. గుణములనెంచబోక నిక గో్ప్యముగా భవబాధ బాపుకో్న్్
  తృణమొదళమ్మ్మొ గొంచునొకదివ్య పరేశు నహంబునచ్చటన్
  పణముగబెటిటి భక్తిమెయిప్రార్ధనలన్ సరిజేయ జీవికన్
  రణమన నేల! శాంతిగని రాజిల వచ్చుగదయ్య శంకరా!pitta satyanarayana

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా వారూ,
   పద్యం బాగుంది. దీనిని ఇక్కడ పెట్టడంలో మీ ఉద్దేశ్యం?

   తొలగించండి

 37. తే.గీ.రామ రామ యనంగను రంజిలు హృది
  మదిని నమ్మిన వారికి మంచి కలుగు
  దాసులను బ్రోచు పోషించు దయను జూపి
  సురులు నరులును గొలిచెడి నరహరి మరి !

  రిప్లయితొలగించండి