24, మార్చి 2017, శుక్రవారం

సమస్య - 2317 (నారాయణ యనిన నరుడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్"
లేదా...
నరకం బందును మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

70 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...



పేరోలగంబు గాంచును
"నారాయణ!" యనిన నరుఁడు, నరకముఁ జెందున్
వేరొక నామజపంబును
ధారణ జేయన్ జిలేబి ధర్మము గనుమా !

జిలేబి

BVVHBPrasadarao చెప్పారు...

ధారాళము నోంకారము,
నారాటము, లేక నామమనుటయు తగునా
కారాదు జప విరుద్ధము
నారాయణ యనిన నరుఁడు నరకముఁజెందున్
(ఓంకార రహితమైన నామ జపము నిష్రయోజనమని నా భావన)

BVVHBPrasadarao చెప్పారు...

నిష్ప్రయోజనము లో ప వడలేదు.మన్నంచండి

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
vsnmhari చెప్పారు...

అరయన్ నాస్తికు లొక్కచోట సభలో నత్యున్నతోత్సాహులై
వరుసం జేరుచు బోధ జేసి రిటు లప్పౌరాళి కవ్వేళ నో
కరిచర్మాంబర కావుమన్న నఘముల్ కాయంబునన్ నిండు నా
నరకం బందును మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో.

ఔరా నాస్తిక సభలో
వారట బోధింతు రిట్లు పరమేశ శివా
రారా యన నఘ మంటును
నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్.

హ.వేం.స.నా.మూర్తి.

sisindri చెప్పారు...

పరులన్ బాధలు పెట్టుచున్ సలుపగా పాపమ్ములన్ నిత్యమున్
నరకంబందును మానవుండు; "వరదా! నారాయాణా" యన్నచో
చరితార్థంబగు జన్మమెల్ల, కలుగున్ స్వర్గమ్ము తథ్యమ్ముగా
పరమార్థంబన నియ్యదే సుహృదయా పద్మాక్షు కీర్తింపుమా ||

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టాస.నా.
వీరావేేేశపు శైవులు
ఆరాటము కొలది నాడ నన్యపు భక్తిన్
ఈరీతి ననిరి,"భజనన్
నారాయణ యనిన నరుడు నరకము జెందున్"!

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

పూజ్యులు శ్రీ శంకరయ్య గారి సవరణతో:


ఓరీ! ప్రహ్లాదా! విను!
కారాగారమున నిన్ను ఖైదీ జేతున్!
శూరుడనగు నన్ను మఱచి
"నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్!

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టాస.నా
పర రాష్ట్రంపు సునామి బాధితులదో పైపైని ప్రాణాల సం
గరమందోడగ వచ్చెనొక్క కవిగా గద్యంపు కావ్యాళినిన్
విరచించెన్ బహు రమ్యమంచు"వరద"న్ విశ్వాత్మ రమ్మంచు !తా
నరకంబందును 'మానవుండు';"వరదా!నారాయణా"యన్నచో!!

కంది శంకరయ్య చెప్పారు...

మైలవరపు మురళీకృష్ణ గారి పూరణ.....

నరకంబందును మానవుండు వరదా! నారాయణా! యన్నచో
కరుణాసింధువు సర్వలోకజనరక్షాదక్షుడౌ విష్ణువున్
పరమంబౌ పదమిచ్చు , జీవులకు కైవల్యమ్ము సిద్ధించెడున్ !
హరి సర్వాంతరవర్తి , నిశ్చయమికేలా! మీకు సందేహముల్!!

( నరకంబందును.. = నరకంలో కూడా)

కంది శంకరయ్య చెప్పారు...

జిలేబీ గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
(మనలో మాట... 'వేరొక నామజపంబున' అంటే శివనామజపంతో నరకానికి వెళ్తాడా? మరీ ఇంత వైష్ణవ పక్షపాతమా?) :-)

కంది శంకరయ్య చెప్పారు...

ప్రసాద రావు గారూ,
కొంత అన్వయక్లేశం ఉన్నా చక్కని భావంతో మీ పూరణ అలరారుతున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రభాకర శాస్త్రి గారూ,
హిరణ్యకశిపుని మాటగా మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

హరి వేంకట సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ఐనా నాస్తికులు స్వర్గనరకాలు కూడా లేవంటారు కదా! లేనిచోటికి పోతారని వారెలా అంటారు?

కంది శంకరయ్య చెప్పారు...

సిసింద్రి(?) గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
మీరు బ్లాగుకు క్రొత్తవారైతే స్వాగతం! పాతవారే అయి కొడుకు మెయిలో, మనుమడి మెయిలో వినియోగించుకొని పూరణ పంపి ఉంటే మీ పేరును పూరణ ముందో, చివరనో ఉంచండి.

Unknown చెప్పారు...

అయ్యా నేను నేమాని సోమయాజులు. పాత వాడినే.

Zilebi చెప్పారు...



ఓ రమణీ ! "నలుగురితో
నారాయణ" యనిన నరుఁడు నరకముఁ జెందున్
పారా హుషారు బిడ్డా !
గోరీలను గట్టవలదు కోట్లను జేర్చీ !

జిలేబి

Zilebi చెప్పారు...


సోమయాజులు వారు శంకరాభరణం కొరకే సిసింద్రి అన్న పేరుతో ప్రొఫైల్ మార్చి లో కొత్త గా కట్టి నట్టి ఉన్నారు :)

జిలేబి

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

__/\__

కంది శంకరయ్య చెప్పారు...

డా. పిట్టా సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'శైవులు+ఆరాటము' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు కదా! "శైవులె। యారాటము..." అనవచ్చు.

కంది శంకరయ్య చెప్పారు...

మైలవరపు మురళీకృష్ణ గారూ,
క్రియాపదాన్ని విభక్తి ప్రత్యయంగా మార్చి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

జిలేబీ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
'జేర్చీ' అనడం సాధువు కాదు.

Zilebi చెప్పారు...


అబ్బే ! కంది వారు ! హర హర శంకర !

పూరణ కోసం అంతే :)

జిలేబి

కంది శంకరయ్య చెప్పారు...

మేము వైష్ణవులమే. మా అమ్మానాన్నలు మా సోదరులకు వెంకటనారాయణ, సూర్యనారాయణ, లక్ష్మినారాయణ అని పేర్లు పెట్టి నాకుమాత్రం (మా అమ్మమ్మ సూచనతో) 'శంకరయ్య' అని పేరు పెట్టారు! కనీసం 'శంకర నారాయణ' అని పేరు పెట్టి ఉండవచ్చుకదా అనేవాణ్ణి!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

నారాయణయనుమంత్రము
పారాయణజేయువాని పరిహాసమునన్
గీరుచు గిల్లుచుఁ గలడా
నారాయణ? యనిన నరుఁడు నరకముఁ జెందున్

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

జిలేబిగారూ! ధన్యవాదములు.
మీ ఆలోచనా స్ఫూర్తితో....

చోరులు, నేరము జేసెడి
వారలతో గలిసి సలిపి వసుధను నఘముల్
ఘోరములా "నలుగురితో
నారాయణ" యనిన నరుఁడు నరకముఁ జెందున్.

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
sailaja చెప్పారు...

కూరును ఘనమగు పుణ్యము
నారాయణ యనిన నరుడు, నరకము జెందున్
ధారుణిలోబీరముతో
నారడి పుచ్చగ గుణులను నన్యాయముగన్!!!

Zilebi చెప్పారు...


గోలి వారు

అదురహో ! గోలి వారి గోళీ :)

జిలేబి

కంది శంకరయ్య చెప్పారు...

సహదేవుడు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

గోలి వారూ,
చక్కని పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

తిమ్మాజీ రావు గారూ,
పూరణ భావం సందిగ్ధంగా ఉంది. '..జూపి యొసగు' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...

కవిత సంఖ్య :-- 689. 24--3--2017.
పిన్నక నాగేశ్వరరావు. యస్.కే.1043.
శీర్షిక :-- సమస్యా పూరణము.
శంకరాభరణం వారు ఇచ్చిన సమస్య :--

" నారాయణ"! యనిన నరుడు నరకము
జెందున్.
పూరణము :-- కందపద్యము.

చేరును స్వర్గము తుదకున్

నారాయణ! యనిన నరుడు ; నరకము
జెందున్
ఘోర దురితముల జేయుచు

దూరముగా నుంచి హరిని దూరుచు
నుండన్.

9490313830.
**********************************

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

చోరుడు సద్గుణ హీనుడు
క్రూరుడు సత్కర్మ రహిత కుటిలాత్ముండున్
జేరియు దేవాలయములు
నారాయణ యనిన నరుఁడు నరకముఁ జెందున్.

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

చోరుడు సద్గుణ హీనుడు
క్రూరుడు సత్కర్మ రహిత కుటిలాత్ముండున్
జేరియు దేవాలయములు
నారాయణ యనిన నరుఁడు నరకముఁ జెందున్.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

"హా! రామయ్యది మంచిది!"
"పోరా! చైతన్య గొప్ప ప్రోద్బల మిచ్చున్"
"హేరాం! మూఢా! 'చెడ్డది
నారాయణ!' యనిన నరుఁడు నరకముఁ జెందున్!"

vsnmhari చెప్పారు...

ఆర్యా!
శ్రోతల నమ్మకాన్ని దెబ్బకొట్టేట్లుగా అలా అన్నారనే భావంతో వ్రాశాను. అయినా ప్రశ్నార్థకమే కనుక క్రింది పూరణలను తిలకించ ప్రార్థన.

ఆరాజు మూర్ఖు డిట్లను
పౌరులు! దైవంబ నేను పలుకగ వలయున్
కోరుచు నా నామంబును
నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్.

ఏరోజు నన్ను సుఖములు
చేరంగా వలయు దేవ చీకాకులతో
నూరందరున్న నేమగు
నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్.

ధరణీనాథు డొకండు మత్సరమునన్ దైవంబు తానే యనున్
వరుసం జాటును నన్ను గొల్వవలె మీ పాపంబులం గూల్తు ని
ర్జరు లింకెవ్వరు లేరు సత్య మిదియే సంకోచ మింకేలనో
నరకం బందును మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

మీరఁగ రాదాడి నుడులు
పారావార మినికినను వసుధాలయమై
నీరైన నసత్యం బిది
నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్


పరమైశ్వర్యము పొంద శక్యమగు నప్పద్మాక్షుఁ గీర్తించినన్
దురితౌఘమ్ములు నాశనంబగును వే తోరంబుగన్ ధాత్రినిన్
నిరయాధీశుడు ధర్మరాజునకు వానిం ద్రోయగా శక్యమే
నరకం బందును, మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో

Unknown చెప్పారు...

గురుదేవుల సూచనమేరకు పద్యము సవరించడమైనది
శ్రీరాముని స్మరియించిన
కారుణ్యము జూపి యొసగు కైవల్యమ్మున్
దూరుచు మన దేవతలన్
నారాయణ! యనిన నరుఁడు నరకముఁ జెందున్.

A.Satyanarayana Reddy చెప్పారు...

నిరతమ్మున్ నటియించుచున్, నిజముగా నిర్భాగ్యులన్ బ్రోచగన్
ధరణిన్ జన్మము నొందినామనుచు, నిర్దాక్షిణ్య మార్గమ్మునన్
కరమౌ ప్రీతిని దోచుకొంచు ప్రజలన్ కాంక్షించి లాభమ్ములన్
మరణమ్మొందెడు కాలమందుకడు సన్మార్గంబునన్ బోయినన్
నరకంబందును మానవుండు; "వరదా! నారాయణా" యన్నచో

subbarao చెప్పారు...

నేరుగ దివికే నేగును
నారాయణ యనిన నరుడు .నరకము జెందున్
పోరానిచోటు కేగిన
రారానిగ నిడుములొంది రహిచెడి దానే

A.Satyanarayana Reddy చెప్పారు...

కోరుచు పరుల ధనమ్మును
నేరములను చేసి కరము నేరుపుతోడన్
ధారుణిని వీడు నప్పుడు
నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్

seethadevi gurram చెప్పారు...

క్రూరత్వము చోరత్వము
జారత్వం బసురబలిమి జమిలిని గల్గన్
పారద్రోలవు పాపము
"నారాయణ" యనిన, నరుడు నరకము జెందున్!

అజామిళుడు మినహాయింపు!😊😊😊

ఊకదంపుడు చెప్పారు...

హిరణ్యకశిపుని మాట:
హరి యెవ్వండును లేడు లోకముల హా హా జూడనేతావునన్
దరుమంబోయితి క్షీరసాగరము మధ్యన్ వానివాసంబనన్
మరుగున్ దాగెనొ! కాంచనైతి, వినుమా మారాజ్యమందేరు బో
నరకం బందును మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో

-----


హరిపాదాబ్జనితాంతచింతన దినాసాంతంబునున్ జేయుచోన్
దరణోపాయము చూపునాతఁడను సత్యంబున్ స్పృహందాల్చియే
సిరినాధుండను భక్తిఁగొల్చినను సూ శీఘ్రమ్మె స్వర్గస్థుడౌ
నరకం బందును మానవుండు, "వరదా! నారాయణా!" యన్నచో

ఊకదంపుడు చెప్పారు...

దండాన్వయము:
నరకం బందును మానవుండు
హరిపాదాబ్జనితాంతచింతన దినాసాంతంబునున్ జేయుచోన్
దరణోపాయము చూపునాతఁడను సత్యంబున్ స్పృహందాల్చియే
సిరినాధుండను భక్తిఁగొల్చినను సూ శీఘ్రమ్మె స్వర్గస్థుడౌ
"వరదా! నారాయణా!" యన్నచో

ఫణి కుమార్ తాతా చెప్పారు...

పరువంబందున విఱ్ఱవీగి మహిలో పాపాలు సాగించుచున్
సరకంబున్ కడు గ్రోలి మత్తున సదా సంవేశనాసక్తులై
పరిధుల్ దాటి చరించి యంత్యదశలోవార్ధక్య భారంబునన్
నరకం బందును మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో

ఫణి కుమార్ తాతా చెప్పారు...

సరకంబున్ కడు గ్రోలి మత్తున సదా సంవేశనాసక్తుడై

subbarao చెప్పారు...

పరువంబందున నీచ కార్యముల దా బాహాటము న్ జేయుచో
నరకంబందును మానవుండు ,వరదా ! నారాయణా యన్నచో
నిరతంబాతడు బోవు సద్గతికి దానే కంబుగానిధ్ధరన్
నరకంబయ్యది చూడబోదలచ నానాపా పాముల్ జేయుమా

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

నేరుపుతో దివి కేగును
నారాయణ యనిన నరుడు;నరకము చెందున్
కారాగారము నందును
నారాటమును జూపి యొరుల కస్తి బెట్టన్.

చేరును నాకము సతతము
నారాయణ యనిన నరుడు:నరకము చెందున్
క్రూరుండై తిరుగుచు పరులను
ఘోరంబుగ హింసచేయు కూళుండెపుడున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురుదేవులకు ధన్యవాదములు

పూసపాటి నాగమణి చెప్పారు...

పూసపాటి కృష్ణ సూర్య కుమార్
కం: చేరెను వైకుంఠమునకు
నారాయణ యనిన నరుడు ,నరకము చేరెన్
జారుడు హరీ అని అనక
మారక సమయమున వాని మగువను తలచన్

Unknown చెప్పారు...

పారాయణ?పరమార్థమె|
“కారణములు కల్మషాల కఠినత్వమునన్
వేరొకమతకర్త బలికె
నారాయణయనిన నరుడు నరకము జెందున్”
2.శరణంబంచు హిరణ్యకున్గొలువ?విశ్వాసంబెస్వర్గంబగున్
వరముల్ బొందినరాక్షసోత్తముడు గర్వంబందునేదెల్పెగా
హరినే దల్చిన శిక్షగా యముడు నాహ్వానించుమిమ్మెల్లరున్
నరకంబందును మానవుండు వరదా|నారాయణా|యన్నచో|

కంది శంకరయ్య చెప్పారు...

కృష్ణ సూర్యకుమార్ పూసపాటి గారి పూరణ.....

కం: చేరెను వైకుంఠమునకు
నారాయణ యనిన నరుడు ,నరకము చేరెన్
జారుడు హరీ అని అనక
మారక సమయమున వాని మగువను తలచన్

కంది శంకరయ్య చెప్పారు...

పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు..

కంది శంకరయ్య చెప్పారు...

శాస్త్రి గారూ,
_/\_

కంది శంకరయ్య చెప్పారు...

కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు..

కంది శంకరయ్య చెప్పారు...

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు..
'దివికే యేగును' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు..

కంది శంకరయ్య చెప్పారు...

సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు..
'పారద్రోలవు' అన్నపుడు 'ర' లఘువే. దానివల్ల గణదోషం. 'పారంద్రోలవు' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

ఊకదంపుడు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ఫణికుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీరే ప్రకటించారు కదా! సంతోషం!

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

పోపాయణం:👇

కరముల్ మోడుచు గొంతులెత్తుచును హా! కాపాడు మమ్మోయనన్
వరముల్ నిచ్చుచు జీససుండు మనలన్ స్వర్గమ్ము చేర్పించడే!
త్వరగా రండిటు రామ భక్తులును భల్! తండోప తండాలుగా!
నరకం బందును మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో!