18, ఆగస్టు 2017, శుక్రవారం

సమస్య - 2439 (గురువుల పదసేవ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!"
ఈ సమస్యను సూచించిన గుఱ్ఱం సీతాదేవి గారికి ధన్యవాదాలు.

91 కామెంట్‌లు:

  1. తరలేక్షణలను కోరెడు
    గురువుల పదసేవ జేయకూడదు , శిష్యా
    ధరణిన సతతము జ్ఞానపు
    సిరులను బోధించు వాని సేవించవలెన్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధరణిని' అనండి.

      తొలగించండి
  2. ఆషాఢభూతి:

    విరిగిన చీపురు పుల్లను
    మరుక్షణమే ధారవోసి మన్నన తోడన్
    బరువగు బొంతను మోయుచు
    గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!

    రిప్లయితొలగించండి
  3. పరిపరి విధముల బోధక
    గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా
    పరుసపు పలుకులు వీడిన
    మెరుపుల పూదండ వోలె మేలగు ఒజ్జన్

    రిప్లయితొలగించండి
  4. ఎరుకన చదువుచు చేయుము
    గురువుల పదసేవఁ, జేయఁ గూడదు శిష్యా
    చెరిపెడి చెలిమరు లచెలిమి
    చెరసా లలపా లుజేయు చేసిన నెపుడున్.

    రిప్లయితొలగించండి
  5. గురువులమని చాటుకొనుచు
    సిరులకు వశులై సతతము చీకటిమతితో
    మరులకు లొంగెడి కుహనా
    గురువుల పదసేవ జేయగూడదు శిష్యా!

    రిప్లయితొలగించండి
  6. సరసత కొరవడి నిరతము
    సరళత సురుచిరతలేని చరితము తోడన్
    తిరముగ నుండని వారగు
    గురువుల పదసేవఁజేయకూడదు శిష్యా

    రిప్లయితొలగించండి


  7. పరుపుల పైనన్ సుఖముగ
    పరుండు కొని కులుకుచు సరపణుల కెలుకుచున్
    కరపోకరాయి కుహనా
    గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. నిరుపమ మగు విశ్వాసము
    నిరతాసక్తియును శ్రద్ధ నేర్చుటలోనన్
    వరగుణములు లేకుండగ
    గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి


  9. పరగడపు పద్యములతో
    గురువుల పదసేవఁ జేయ, గూడదు శిష్యా
    పురటము, పనిజే యన్ వెడ
    లు,రయ్యన గలుగును బంగరు భవిత సుమ్మీ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కొండ మీద పరకామణి కి పోయినా నాలుగు కాసులు గిట్టు బాటవుతాయ్ :)

      పరగడపు పద్యములతో
      గురువుల పదసేవఁ జేయ, గూడదు శిష్యా
      పురట,పరకామణికి వెడ
      ల రయ్యన గలుగును మంగళాశాసనముల్ :)

      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పురట(ము)'...?

      తొలగించండి
  10. కరమగు ధనకాంక్షఁ గలిగి
    నిరతము చెడుమార్గమందు నివసించుచు తా
    సరిగా పాఠము చెప్పని
    గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!

    రిప్లయితొలగించండి
  11. అరుదగు విద్యలు నేర్పక
    సుర ల కు దాసు లు గ మారి సో మ రు లగు చున్
    పరమా వ ధి లే ని కు జ న
    గురువు ల పద సే వ జే య గూడ దు శిష్యా !

    రిప్లయితొలగించండి
  12. గురువని ప్రతిమను దలచగ
    గురుదక్షిణ బొటన వ్రేలు కోరెడి గురువున్
    మరుక్షణమే నిరసించుచు
    గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!

    రిప్లయితొలగించండి
  13. సరసపు భాషణ నెరుగక
    పరుషపు పలుకుల సతతము పలికెడి గురులన్
    కరుణ యొకింతయు గానని
    గురువుల పదసేవ జేయ గూడదు శిష్యా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనాథ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      బాపూజీ గారు, మీరు ఒకటేనా? వేరు వేరా? లేక సోదరులా?

      తొలగించండి
    2. ధన్యవాదములు. బాపూజీ గారి అబ్బాయిని.

      తొలగించండి
    3. సంతోషం! శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.

      తొలగించండి
  14. ధరణిని జనులకు కీడును
    విరివిగ కలిగించు క్షుద్ర విద్యల గొనుచున్
    కరమున పుఱ్ఱెలు దాల్చెడి
    గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!

    రిప్లయితొలగించండి
  15. ధరణిని మాతా పితలున్
    దరిఁజూపెడు గురువు, నతిథి దైవసమానుల్
    వరలక త్రికరణశుద్ధియె
    గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. వాట్సప్ లో తమరి సూచన మేరకు సవరించిన పూరణ:

      ధరణిని మాతా పితలున్
      దరిఁజూపెడు గురువు, నతిథి దైవసమానుల్
      మరచుచు త్రికరణశుద్ధిని
      గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!



      తొలగించండి
  16. నిరతము జేయుటవ శ్యము
    గురువుల పదసేవ, జేయ గూడదు శిష్యా !
    గురుపత్నిని మోహించుట
    నెరపుమ యీరెండు నీవు నిరతము భువినిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నెరపును+ఈ' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.

      తొలగించండి
  17. *ధర వరములిడును చేసిన*
    *గురువుల పదసేవ, చేయగూడదు శిష్యా*
    *సరికాని పనుల నెప్పుడు*
    *దొరికిన సద్గురువు ముందుద్రోహమ్మవగన్*

    రిప్లయితొలగించండి
  18. అరుదగు విద్యలు నేర్పక
    సుర కు న్ దాసు లు గ మారి సోమరు ల గు చున్
    పర మా వ ధి లే ని కుజ న
    గురువు ల ప ద సే వ జే య గూడ దు శిష్యా !

    రిప్లయితొలగించండి
  19. శ్రీ గురుదేవులకు నమస్సులు
    సరసపు భాషణ సేయుక
    వివరుల్ కొలుతురు శారద విపoచినిగదా!
    విరసపు భావన కలిగిన
    గురువుల పదసేవ జేయగూడదు శిష్య
    చివర పదము టైపు పొరబాటు. మన్నన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      రెండవ పాదంలో ప్రాస, యతి రెండూ తప్పాయి. సవరించండి.

      తొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.

    మరువకు విజ్ఞాన మిడిన

    గురువుల పద సేవచేయ; కూడదుశిష్యా

    పర కాంతలపై మోహము

    చరియించకు చెడ్డవారి సాంగత్యమునన్
    .

    రిప్లయితొలగించండి
  21. పరిశుద్ధమనము తోడను
    పరి ప్రశ్నలజేతనేమి పనిజేయవలెన్?
    పరమార్ధము విడచి పనుల
    గురువుల పదసేవ; సేయకూడదు శిష్యా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మొదటి పాదమునకు మెరుగైన మార్పు!
      "పరివర్తన, ప్రణిపాతము"
      "తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా"

      తొలగించండి
    3. గురువుగారికి నమస్సులు,ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏🙏

      తొలగించండి
  22. శిరసున దాల్చుము తోయము
    గురువుల పద సేవజేయ.కూడదు శిష్యా,
    పరిహాసమ్మొనరించుచు
    పరాభవము సేయ గురుని,పతనమె నీకున్

    రిప్లయితొలగించండి
  23. గురు వితరణ గుణ మగు నే
    తరులకు నెన్నండు నీవు, దాన మిడ వలెం
    బరులకు నన లంఘించరె
    గురువుల, పదసేవఁ జేయఁ గూడదు శిష్యా

    [గురువు = వేగపు పరుగు; ఏతరి = లోభి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ విలక్షణంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      డా. సీతా దేవి గారు ధన్యవాదములు. నేటి సమస్య మీ సన్మనోజాతమే కదా యభినందనలు.

      తొలగించండి
  24. స్ధిరమగు శుభములు గలుగును
    గురువుల పదసేవజేయ, కూడదు శిష్యా
    ధరణికి విద్యను గరపెడు
    గురువుల నిందించి కారుకూతలు గూయన్!!!


    వరమగు విద్యను గరపక
    సరసపు సంభాషణముల సమయము వృథగన్
    నిరతము గడిపెడు కుహనా
    గురువుల పదసేవజేయ కూడదు శిష్యా!!!



    రిప్లయితొలగించండి
  25. సిరులం గోరుచు చదువుల
    పరమార్థము నేర్వనట్టి వారలగుదురే
    గురువులు! యిల దుర్మతులౌ
    గురువుల పద సేవ జేయ కూడదు శిష్యా!

    రిప్లయితొలగించండి
  26. తిరమ గు మోక్షము కలుగును
    గురువుల పద సేవ జేయ ;గూడ దు శిష్యా !
    పరిహాస పుచేష్టల తో
    గురువుల నొప్పించి మను ట కుత్సి స బుద్ది న్

    రిప్లయితొలగించండి
  27. పెరుగును శిష్యుల యాయువు
    గురువుల పదసేవ జేయ, కూడదు శిష్యా
    పరుషపు మాటలు ఎపుడును
    తరగని పెన్నిధి గురువును తలచుకొ నిత్యం

    రిప్లయితొలగించండి
  28. వర పుత్రుఁడవీవని మా
    హిరణ్యకశిపులు బనుపఁగ నెరుఁగగ విద్యల్
    హరి భజనల వీడకనే
    గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!

    రిప్లయితొలగించండి
  29. గురువు గారికి నమోవాకములు.సవరిoచిన పూరణ యo దు దోషములు తెల్పుము.
    సరసపు భాషణ నిరతము
    దరహాసమగున్ విశారదకరుణ చేతన్
    విరసపు భావన కలిగిన
    గురువులపద సేవ జేయకూడదు శిష్యా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారని యంటూ “తెల్పుము” అని యనడము సమంజసము గాదు. “తెల్పుఁడు” అన గౌరవప్రదము.

      తొలగించండి
    2. సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  30. గురువు గారికి నమోవాకములు.సవరిoచిన పూరణ యo దు దోషములు తెల్పుము.
    సరసపు భాషణ నిరతము
    దరహాసమగున్ విశారదకరుణ చేతన్
    విరసపు భావన కలిగిన
    గురువులపద సేవ జేయకూడదు శిష్యా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  31. మరచియు మానవతత్వము
    కరుణయు లేనట్టిమనసు,కల్మష మందే
    మరిగిన మందున దొరలెడి
    గురువుల పదసేవ జేయ గూడదు శిష్యా.

    రిప్లయితొలగించండి
  32. మరో పూరణ చేశాను.దయచేసి దోషములు తెల్పుము.
    హరియును పొగడును శివకృతిన్
    సారమతులు శుభకార్యము సలుపన్ ప్రాoశా
    కరతేజమునిoడ, కుటిల
    గురువులుపద సేవ జేయకూడదు శిష్యా.
    వoదనములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  33. వరమగునె యతుల, లఘువుల,
    గురువుల పద సేవ జేయ! గూడదు శిష్యా
    పరుల కవనమును గొని తన
    పరముగ చేసికొన జూడ పాపమ్మె యగున్!

    రిప్లయితొలగించండి
  34. పెద్దలు కామేశ్వరరావు గారికి
    నమస్సులు. మీ సూచన సదా పాటిస్తాను. ధన్యవాద ములు.

    రిప్లయితొలగించండి

  35. హరిని కడు నింద జేయుచు
    హర నామము బల్కుడంచు నాగ్రహవరులై
    కరము భయపెట్టి చెప్పెడి
    గురువుల పద సేవ జేయ గూడదు శిష్యా!

    రిప్లయితొలగించండి
  36. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నిరతము చిఱచిఱ లాడుచు
    పురువడి గూడని పలుకుల బోధకులౌచున్
    మురియుచు నుండెడి గర్విత
    గురువుల పదసేవ జేయగూడదు శిష్యా!

    జరుపుము బుద్థిని గఱపెడి
    గురువుల పదసేవ; జేయగూడదు శిష్యా
    నిరతము చిఱచిఱ లాడుచు
    పురువడి నేర్పని గురువుల పూజల నెపుడున్

    రిప్లయితొలగించండి
  37. పరులకు హానిని గూర్చుచు
    చెరుపును కలిగించు క్షుద్ర చేష్టల నెపుడున్
    మరి మరి చేసెడి నీచపు
    గురువుల పదసేవ చేయగూడదు శిష్యా

    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి