22, ఆగస్టు 2017, మంగళవారం

సమస్య - 2443 (హింసకుఁ బాల్పడెడివాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హింసకుఁ బాల్పడెడివాఁడె హితమును గూర్చున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

65 కామెంట్‌లు:

  1. హంసలు నుడివిన విధముగ
    ధ్వంసము జేయుచు భయమును ధైర్యము నిడుచున్
    కంసారి వోలె సంశయ
    హింసకుఁ బాల్పడెడివాఁడె హితమును గూర్చున్

    హంస = యోగి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కం.హింస వినాశము దెచ్చును
      హింసయె పెను పిరికి పంద
      హేతియగున్;వి
      ధ్వంసము నరి కట్టంగన
      హింసకు బాల్పడెడి వాడె హితమును గూర్చున్.

      తొలగించండి
    2. "నష్టో మోహః స్మృతి ర్లబ్ధా త్వత్ప్రసాదా న్మ యాచ్యుత"

      ...నా పూరణకి వర్తించును...

      తొలగించండి
  2. కంసుడు సతతము సజ్జన
    హింసకుఁ బాల్పడెడి వాఁడె; హితమును గూర్చున్
    ధ్వంసాంతఃప్రకృతి జనెడి
    పాంసను లందరిఁ దునుముచు వ్రజనాథుండై.

    రిప్లయితొలగించండి
  3. హంసను గూల్చిన కరుణా
    ధ్వంసకుడగు బుద్దు సవతితమ్ముండెవడో?
    హింసాదూరుని తెరగో?
    హింసకు బాల్పడెడి వాడె; హితమును గూర్చున్.

    రిప్లయితొలగించండి

  4. ధ్వంసంబగును జిలేబీ
    హింసకుఁ బాల్పడెడివాఁడె; హితమును గూర్చున్
    వంశాభివృద్ధి కటు ని
    స్సంశయముగ మేలుగోరు సజ్జనుడు సుమీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  5. ధ్వంసంబగును జిలేబీ
    హింసకుఁ బాల్పడెడివాఁడె; హితమును గూర్చున్
    శంసల గొను సజ్జనుడౌ
    యంసము పై భార మెల్ల యంశము గనుచున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. హింస యె మూ ల ము బాధ కు
    హింసను విడనాడి ప రు ల హిత మే శుభ మౌ
    ధ్వంసం బు ను మానిస త మ
    హింసకు బాల్ప డెడి వాడే హిత ము ను గూర్చు న్

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    మహాత్మాగాంధి :

    01)
    _____________________

    భ్రంశము జెందిన దేశము
    హింసాత్మకమైన; గాంధి - యెగయుచు ఘనుడై
    ధ్వంసము నాపెను; సత్యా
    హింసకుఁ బాల్పడెడివాఁడె - హితమును గూర్చున్ !
    _____________________

    రిప్లయితొలగించండి
  8. పుంసత్వము,సుగుణత్వము,
    సంసద్విఖ్యాతి,యుక్తి,సాధింపంగా.
    హంసత్వంబును పొందు-న
    హింసకు పాల్పడినవాడె హితమునుఁగూర్చున్

    రిప్లయితొలగించండి
  9. హంసాకారముతో నవ
    తంసము పరమాత్మకైన ధన్యాత్ముండున్
    సంసారపరిత్యాగి య
    హింసకుఁ బాల్పడెడివాఁడె హితమును గూర్చున్

    రిప్లయితొలగించండి
  10. హంసగ శిష్టుల కాచుచు
    ధ్వంసము జేయుచును దుష్ట తలపుల నెపుడున్
    కంసుని పరిమార్చు విధము
    హింసకు పాల్పడిన వాడె హితవును గోరున్

    రిప్లయితొలగించండి
  11. హంసగ శిష్టుల కాచుచు
    ధ్వంసము జేయుచును దుష్ట తలపుల నెపుడున్
    కంసుని పరిమార్చు విధము
    హింసకు పాల్పడిన వాడె హితవును గోరున్

    రిప్లయితొలగించండి
  12. కంసుఁడు పలికెను పెను వి
    ధ్వంసము జేయంగ నేడు ధరణిని కడు మీ
    మాంసయు లేకుండగ శిశు
    హింసకుఁ బాల్పడెడివాఁడె హితమును గూర్చున్

    రిప్లయితొలగించండి
  13. హింసయె లక్ష్యము గను వి
    ధ్వంసము సృష్టించెడు నవదనుజుల గూల్చన్
    కంసారివోలె ఘనతర
    హింసకు బాల్పడినవాడె హితమును గూర్చున్!

    రిప్లయితొలగించండి
  14. పూజ్యులు శ్రీ గురువు గారికి నమస్సులు.
    వoశ పొగరు వలదు సుమతి
    కoసుని నoతము బoధువు కరుణయె లేకన్
    సoశయమువలదులలన న
    హింసకు బాల్పడినవాడె హితమును కూర్చున్
    స కు శ ప్రాస కొoదరు కవులు కవి సమ్మేళణము లో వాడినారు.అoదుకు నేను వాడినాను. దోషములను తెలుపుడు.

    రిప్లయితొలగించండి


  15. ఓం! సంకల్పము గాంచి య
    హింసకుఁ బాల్పడెడివాఁడె హితమును గూర్చున్
    హ్రీం! సద్భుద్ధిని నివ్వన్
    క్రీం! సమరసములను గాంచి కీర్తిని బడయున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. మాస్టరుగారూ! నమస్తే .మీరు ఈ కార్యక్రమమునకు తప్పక రావలసినదిగా మనవి. కవిమిత్రులందరికీ స్వాగతం.


    ప్రజ-పద్యం (లోకాస్సమస్తాస్సుఖినోభవంతు ) గుంటూరులో ఆత్మీయమైన కలయిక &“సామాజిక పద్య సుధాస్రవంతి”కవిసమ్మేళనం
    **********************************************************************
    పద్యకవులూ,కవయిత్రులకు సాదర ఆహ్వానం !!
    దయచేసి ఈ సమాచారాన్ని పరిసర ప్రాంతాల పద్యకవులూ,,కవయిత్రులతో పంచుకోవాల్సిందిగా ,తాము స్వయంగా విచ్చేయాల్సిఒదిగా విజ్ఞప్తి.(పాల్గొను మిత్రులు ఈపోస్టు కింది కామెంటు బాక్సులో తప్పక తెలియచేయగలరని మనవి)
    *********************************************************************
    తేదీ:02-09-2017(శనివారం-బక్రీదు పండుగ సెలవు దినం )
    సమయం: సరిగ్గా 11గం||- 02గం|| వరకు
    వేదిక: ది సెంట్రల్ పబ్లిక్ స్కూల్ , 4/19,బ్రాడీపేట్,శ్రీరాఘవేంద్రస్వామి దేవాలయానికి ఎదురుగా,బ్రాడీపేట్,గుంటూరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమత్ శాస్త్రి గారు నేను గుంటూరు నివాసిని. పాత గుంటూరు లొ ఉంటాను నా ఫోన్ నెంబరు 9290042432 MEE ఫోన్ నెంబరు ఈయగలరు వచ్చి కలుస్తాను.

      తొలగించండి
    2. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీరంతగా ఆహ్వానించాక రాకుండా ఉంటానా? వస్తున్నాను. చంద్రమౌళి సూర్యనారాయణ గారు గుంటూరుకు రాను, పోను టికెట్లు రిజర్వు చేయించారు.
      ఒక్క మనవి. నాకు సభాభీతి. వేదిక నెక్కితే మాట్లాడలేను. కనుక నన్ను సభలో ప్రేక్షకుల మధ్య కూర్చోనివ్వండి. దయచేసి వేదిక మీద కూర్చోబెట్టడం, మాట్లాడమనడం వంటివి పెట్టుకోకండి!

      తొలగించండి
    3. మాస్టరుగారూ! ధన్యవాదములు.మీ రాక మాకు ఉత్సాహాన్నిస్తుంది.మిత్రులు సూర్యనారాయణగారికి అభినందనలు.వారు, సత్యనారాయణరెడ్డి గారు, మధుసూదన్ గారు కూడా వసున్నారని భావిస్తున్నాను.

      తొలగించండి
    4. శ్రీ కంది శంకరయ్య గారికి,
      నమస్తే ! ఆశ్చర్యము !!! గతంలో మీరో మారు రాజమండ్రిలో ఒక అవధానంలో అద్యక్ష స్థానం లో కూర్చుని దిగ్విజయంగా అవధానాన్ని నిర్వహించినట్లు గుర్తున్నది. మీకు సభా భీతియా ?
      -- గుఱ్ఱం జనార్దన రావు.

      తొలగించండి

  17. ధ్వంసం బొనరించక కల
    హంస స్వరరుచిరమెగయ
    నభ్యుదయమునన్
    సంస్కృతి వెల్గులు బంచన
    హింసకు బాల్పడెడివాడె హితమును గూర్చున్!

    హంస=శ్రేష్టము

    రిప్లయితొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కంసుని బోలిన దనుజులు
    హింసన మెంచెడి తరుణము నీభువి నరయన్
    సంసృతి వారిది నడచెడి
    హింసకు బాల్పడెడి వాడె హితమును గూర్చున్
    (సంసృతి= కుటుంబము/తెగ)

    రిప్లయితొలగించండి
  19. హింసాత్మక దోపిడి, వి
    ధ్వంసముఁ జేయంగ నైక్యతల, గాంధీ మీ
    మాంసకుఁడు పోరె సత్య మ
    హింసకుఁ బాల్పడెడి వాఁడె, హితమును గూర్చున్

    రిప్లయితొలగించండి
  20. హింసయె వలదనుచునిల న
    హింసకు బాల్పడెడివాడె హితమును గూర్చున్
    కంసుని వంటి గరాసుల
    సంశయబడకుండ గూల్చ సమ్మతమదియున్!!!


    హింసను వలదని తెలుపుచు
    హంసవలెన్ మంచిని గొని, యడచంగ జెడున్
    కంసుని వంటి ఖలు నదిమి
    హింసకు బాల్పడెడివాడె హితమును గూర్చున్!!!



    రిప్లయితొలగించండి
  21. హింసకుడై ప్రజల ధనము
    ధ్వంసముచేయచు చరించు పాలసు కంటెన్
    హంసుని పూజలతోడ న
    హింసకుఁ బాల్పడెడి వాఁడె, హితమును గూర్చున్

    రిప్లయితొలగించండి
  22. కంసు డహింస నెరుంగడు
    హింసించి నశింప జేసె హితు లహితులనే
    కంసారికి వలె జగతిన
    హింసకుఁ బాల్పడెడివాఁడె హితమును గూర్చున్

    రిప్లయితొలగించండి
  23. కంసుని సోదర తుల్యుడు
    హింసకు బాల్పడెడివాడె, హితమును గూర్చున్
    గం సారి నెల్లవేళల
    శం సనమున్ జేయు నెడల సాత్విక బుధ్ధిన్

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. సంసారార్ణవ తారక
      హంసాఘౌఘాసి సత్కృపాంభోనిధి యా
      కంసారి ఘోర రాక్షస
      హింసకుఁ బాల్పడెడి వాఁడె హితమును గూర్చున్

      తొలగించండి
    2. పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. యధావిధిగా మీ పద్యం అత్యద్భుతంగా నున్నది. ఒక చిన్న సందేహం. ఈ రోజు పూరణలో చాలా మంది మిత్రులు అహింసకు పాల్పడెడి అని వాడి యున్నారు. హింసకు పాల్పడక పోవడమే అహింస. అహింసకు పాల్పడడం అనేది సరియైనదేనా? దయచేసి వివరించగలరు.

      తొలగించండి
    3. ఫణి కుమార్ గారు ధన్యవాదములు. క్లిష్టతరమైన ప్రశ్న వేసారు.
      హింస కానిది యహింస. రెండు విశేష్యములే. క్రియాపదములు కావు. పాలుప డనిన పూనుకొనుట యని యొక యర్థము, స్వాధీనమగని మరియొక యర్థము. అహింసకు కట్టుబడి యుండను భావమున తప్పులేదని నా భావన.

      తొలగించండి
    4. ఈ సందేహం తోనే మొదట వ్రాసిన పద్యం తో తృప్తి పడక రెండవ పద్యం వ్రాశాను. సంశయము తీర్చిన పోచిరాజు వారలకు ధన్యవాదములు. 🙏🙏🙏

      తొలగించండి
    5. పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. సందేహ నివృత్తి గావించినందులకు ధన్యవాదములు.

      తొలగించండి

  25. పిన్నక నాగేశ్వరరావు.

    హంసుని గొల్చుచు సతతము

    ధ్వంసము జేయక కుటుంబ పరువు
    ప్రతిష్ఠల్
    హింసయె వినాశమనుచు నా

    హింసకు బాల్పడెడు వాడె హితమును
    గూర్చున్.

    రిప్లయితొలగించండి
  26. హింస విడకున్న వాడు
    త్తంసుడె! శాంతిని నిలుపగ తలబోయుచు వి
    ధ్వంసపు చర్యల నడ్డ న
    హింసకు బాల్పడిన వాడె హితమును గూర్చున్!

    గురువర్యులుకు నమస్సులు. నిన్నటి మఱియు 19.08.2017 నాటి నా పూరణలను పరిశీలించ ప్రార్థన.
    ధన్యవాదములు.
    మానినుల మానము నడచు
    మానవుడే దానవుడును! మాధవుడయ్యెన్
    మానసముల తా జేరుచు
    గానముతో వేల గోపికల నలరించన్!

    మనుజ జన్మమె బుద్బుద మనుచు నెంచి
    బ్రతుకు సాగించు రీతుల భావ మెఱిగి
    తనివి తీర నాధ్యాత్మిక తత్త్వ మనెడి
    మత్తు మందు సేవించుట మంచిదె కద!

    రిప్లయితొలగించండి
  27. సంసిద్ధిగ పాలు,జలము
    హంసనొకటి వేరుబరచు|నదియెట్లన్నన్?
    “సంసారి మంచి తనము, న
    హింసకు బాల్పడెడి వాడె”హితమునుగూర్చున్|

    రిప్లయితొలగించండి
  28. మాంసము నమ్మె డి మనుజుడు
    హింసకు బాల్పడెడి వాడె, ,హితమున్ గూర్చున్ ,
    సంశయము బడయకన్ ధై
    వాoశము గల వాడెపుడు ను భాధను తీర్పన్

    రిప్లయితొలగించండి
  29. క్రమాలం కారము లో -----
    మాంసాహా ర ము గోరుచు
    హంస ల నే చంపునె వ డు ?ఔ దా ర్ర్యు oడై
    సంసిద్దుoడే మి చే యు ను ?
    హింస కు బాల్ప డెడి వా డే :హిత ము ను గూర్చు న్

    రిప్లయితొలగించండి
  30. దయ తో పొ ర పాటు న సున్న ప డి యు న్న ది మన్నించి చ దు వ మనవి

    రిప్లయితొలగించండి
  31. కంసారి పార్థసారథి
    సంశయములఁ దీర్చి ధర్మ సంరక్షణ, గీ
    తాంశముగఁ జేసి దుష్టుల
    హింసకుఁ బాల్పడెడి వాఁడె హితమును గూర్చున్

    రిప్లయితొలగించండి

  32. పిన్నక నాగేశ్వరరావు.
    ( చిన్న సవరణతో....)

    హంసుని గొల్చుచు సతతము

    ధ్వంసము జేయక కుటుంబ పరువు
    ప్రతిష్ఠల్
    హింసయె వినాశమనుచు న

    హింసకు బాల్పడెడు వాడె హితమును
    గూర్చున్.

    రిప్లయితొలగించండి
  33. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  34. హింసను జేయు ప్రవృత్తిని
    సంసారము నందు నెవడు సమ్మతి గొనడా
    హింసాచారము వీడి య
    హింసకు బాల్పడెడి వాడె హితమును గూర్చున్

    రిప్లయితొలగించండి
  35. మాంసాహారుడు జూడగ
    హింసకు బాల్పడెడి వాడె, హితమును గూర్చున్
    హింసాయుధమును వీడి య
    హింసను బోధించు వాడె యిలలో ఘనుడై

    సంశయమే యేత్వమచట
    హింసకు బాల్పడెడు వాడె హితమును గూర్చున్
    హంసా! సరిజేయు మికను
    హింసకు బాల్పడెడు వాడహితమును గూర్చున్

    : హంసా! దేశము లో వి
    ధ్వంసము సృష్టించు తీవ్ర వాదుల పట్లన్
    సంశయ మన్నది లేకయె
    హింసకు బాల్పడెడు వాడె హితమును గూర్చున్

    రిప్లయితొలగించండి
  36. హింస నొనర్చును,పైరుల
    ధ్వంస మ్మొనరించు క్రిముల ఫాలుడు,నిక వై
    తంసికుడు మా౦సమమ్మగ
    హింసకు బాల్పడెడి వాడె హితమును గూర్చున్

    రిప్లయితొలగించండి
  37. సంసారమ్మున రమ్మును
    సంసారిగ వీడి, బ్రతుకు సంతోషమునన్
    హంసగ పాలనుగొనుచు|న
    హింసకు బాల్బడెడి వాడె హితమునుగూర్చున్|

    రిప్లయితొలగించండి
  38. పాంసుధరు డెపుడు జీవుల
    హింసకుఁ బాల్పడెడివాఁడె, హితమును గూర్చున్
    సంశయము బడయక నిల పు
    మాంసులకు ననవరతము మాధవు డెపుడున్

    రిప్లయితొలగించండి
  39. గురువు గారి ఆరోగ్యమేరీతి నుండెనో ఇవాళ ఒక్క పూరణము కూడ చూడలేదు

    రిప్లయితొలగించండి
  40. కంసుడు మొదలగు దుష్టుల
    హింసించిన నాటి విష్ణువీ గౌతముడై
    ధ్వంసమును బాప వెలసె న
    హింసకు బాల్పడెడి వాడె హితమును గూర్చున్

    రిప్లయితొలగించండి
  41. గురువు గారు
    పూరణ లోని రెoడవ పాదమును మార్పిడి చేయడమైనది.
    కoసుడుకూలెచక్రధారి కరుణయె లేకన్
    మీరు ఎలా వున్నారు?
    వoదనములతో

    రిప్లయితొలగించండి
  42. కవిమిత్రులకు నమస్సులు!
    ఉత్సాహంలో అధిక సంఖ్యలో కవులు పూరణలు పంపించారు. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
    ఈరోజు ఉదయం కొన్ని ఆరోగ్యసమస్యలతో నా హెల్త్ కార్డుతో 'వెల్‍నెస్ సెంటర్'కు వెళ్ళాను. అక్కడే దాదాపు సాయంత్రం అయింది. అక్కడి నుండి చంద్రమౌళి సూర్యనారాయణ గారు పనిచెసే స్టేషనుకు వెళ్ళి గుంటూరు రాను పోను రిజర్వేషన్ టికెట్లు తీసుకొని బస్సులు, ఆటోలు మారుతూ హోముకు ఇంతకుముందే చేరాను. ప్రయాణపు అలసట, తలనొప్పి వల్ల ఈరోజు మీ పూరణలను సమీక్షించలేకునాను. దయచేసి నన్ను మన్నించండి.

    రిప్లయితొలగించండి



  43. పాంసనుడెటు లుండు ననగ

    హింసకుఁ బాల్పడెడివాఁడె ;హితమును గూర్చున్

    శంసయు చేయుచు నుండిన

    కంసారియు సతము మనకు కరుణను జూపున్.

    శంస=స్తోత్రము


    ధ్వంసమొనర్చెడి దుష్టుడు

    హింసకుఁ బాల్పడెడివాఁడె ;హితమును గూర్చున్

    హంసకములు దాల్చిన యా

    కంసారి సహాయ పడును కష్టము లొదవన్.


    హంసకములు=కాలి యందెలు.


    హింసయు కాదిది యనుచును

    హంసయు దెలిపెను కిరీటి కాహవ మందున్

    శంసను చేయుచు సతతమ

    హింసకుఁ బాల్పడెడివాఁడె హితమును గూర్చున్.

    హంస:పరమాత్మ

    శంస=స్తోత్రము


    మాంసలు డనవరతంబును

    హింసకుఁ బాల్పడెడివాఁడె ;హితమును గూర్చున్

    కంసారి యుసతతమ్మభి

    శంసలు చేసెడి జనముల సరుకును గొనకన్.

    అభిశంస=విమర్శ

    సరుకును గొనక=లెక్కచేయక.


    హింసకు డనగా నెవ్వడు?

    కంసారి ననయము కొలువ కడకేమొసగున్

    హంసను దలచుచు చెపుమా

    హింసకుఁ బాల్పడెడివాఁడె హితమును గూర్చున్.

    రిప్లయితొలగించండి
  44. కంసుని దుష్టోపాయము
    ధ్వంసము జేయంగబూని తా రాక్షసులన్
    కంసారియగుచు జంపగ
    హింసకుఁ బాల్పడెడివాఁడె హితమును గూర్చున్.

    రిప్లయితొలగించండి
  45. శంసముచే రామాయణ
    అంసమును తెలిపెను లోక సంరక్షణకున్
    అంసలుడగు నెఱుక మొదట
    హింసకు బాల్పడెడివాడె హితమును గూర్చున్

    రిప్లయితొలగించండి