25, ఆగస్టు 2017, శుక్రవారం

రథబంధ గణేశ స్తుతి

రచన - పూసపాటి కృష్ణ సూర్యకుమార్
ఇది రధ బంధ సీస పద్యము. 'శం' నుంచి మొదలు పెట్టి 'శాంకరి' నుంచి చదివి మరల 'కొమరా' నుంచి చదువు కోవాలి. ఎడమ నుంచి కుడి, కుడి నుంచి ఎడమకు చదువుకోవాలి. నిలువుగా ఉన్న మధ్య అక్షరములు కలిపి చదువుకున్న (ఎర్ర అక్షరములు) "శంకరాభరణం కవులకు వినాయక చవితి శుభాకాంక్షలు" అన్న సందేశము వచ్చును.

గణేశ స్తుతి (రధ బంధ సీసము)
శం శాంకరి కొమరా, చంద్ర చూడ శుభ త
          నయ, బొజ్జ దేవర, నాగ సూత్ర
ధర, వారణంపు వదన, నిత్య మోదక
          వాంఛితా, పరమేష్టి భావుక, గణ
నాధా, ఎలుక వాహనా, కుమారాగ్రజా
          విలసితంపు వదనా, విఘ్న రాజ
సుప్రదీపాయ, శుభప్రదా, జిష్ణవే,
          యేకదంతా, సర్వలోక నాధ,

చదిర వీక్షితా, భువిజన సమ్మతి విత
రణ, శుభ ప్రదాత, వ్యాస భారత విధాత,
యెపుడు కాంచుచు, తప్పుల నెప్పుడు క్షమ
చూపి దీనుల బాధలు బాపు మయ్య! 

27 కామెంట్‌లు:

  1. గురువు గారు నమస్కారములు నేను వ్రాసిన రధ బంధ సీస గణేష స్తుతి బ్లాగులో పెట్టారు ధన్యవాదములు కానీ నా పేరు వ్రాయటము మర్చి పోయినారు

    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  2. అద్భుతమైన రచన! గురుదేవులకు, కవి మిత్రులకు హేవళంబి వినాయక చతుర్ధి శుభాకాంక్షలు!!

    రిప్లయితొలగించండి
  3. పూసపాటి వారూ ! అద్భుతమైన రచన . చాలా బాగుంది.
    అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్య గారు నమస్కారము ధన్యవాదములు మీ ఆరోగ్యము ఎలా ఉన్నది.

      తొలగించండి
  4. మిత్రమా!
    చాలా బాగుంది. అభినందనలు. వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములు మిత్రమా మీకు వినాయక చవితీ శుభాకాంక్షలు

      తొలగించండి
  5. కవులనెక్కజేసి కమ్మగా ద్రిప్పిరి
    శుభములనుచు జెప్పి చూడగాను
    రథము వోలె సాగె రమ్యమ్ముగా నిట్లు
    పూసపాటి వారి సీస మహహ.

    రిప్లయితొలగించండి
  6. అద్భుతమైన నైపుణ్యమును బ్రదర్శించినారు. అభినందనలు. వినాయక చవితి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిష్ణువా, చదిర వీక్షణా, వ్యాసభారత లిపికర అంటే బాగుంటుంది.

      శంకర; శంకరీ; శంకృత; శంవ; శంయు ఇత్యాదులు శం తో సమసించును.
      శంశాంకరి ప్రయోగము పరిశీలనార్హము.

      తొలగించండి
    2. ధన్యవాదములు కామేశ్వర రావు గారు. గురువు గారి మరియు మీ యొక్క ప్రోత్సాహముతో ఈ కొత్త ప్రయోగమునకు పూనుకున్నాను. తప్పులున్న సూచించిన సరిదిద్దుకుంటాను.

      తొలగించండి
  7. .మట్టిగణపతు లుంచుట మంచిదనిన
    రంగు,హంగుల దేవతల్ తొంగిచూడ?
    సీస పద్యానరథపు నివాసమొసగ?
    కృష్ణసూర్య కుమార్ మదితృష్ణబెరుగ
    విఘ్న నాయకభక్తిచే విశద బరచె
    శంకరాభరణకవుల శంకమాన్ప|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రమా ఈశ్వర మీరు కూడ షడ్రుచుల పద్య భోజనము పెట్టారు. ధన్యవాదములు

      తొలగించండి
  8. కృ ష్ణ కుమార్ గారికి నమస్కారములు. మీరు వ్రాసిన గణేష స్తుతి అద్భుతము. అందుకు అభినందనలు.
    సీస పద్య కవనము స్వీయ వరము
    పూస గుచ్చిన టు ల గణ పూజ సేయ
    ప్రాస యతు లు గద వాణీ పాపిటయ్యే
    పూసపాటి కవిధీవరా పూర్ణ మతి యె
    కాసు లన్ తెచ్చు రతబం ధ కృష్ణ కుమ ర
    హా సములు ధరయి o పు న హాయి నిచ్చు.
    వందనములు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములు పంచ రత్నము వారు షడ్రుచుల గీత యల్లారు. అమ్మవారి దయ.

      తొలగించండి
  9. కెరటాలవోలె సాగెను
    కరమునుసౌందర్యమొప్ప కవనము సూర్యా!
    యరసితి మాశుభవాక్యము
    మురిపెముతో మీకునిత్తు మోదక శతముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములు. మిత్రమా అలలలో తేల్చారు. సంతోషము సుబ్బారావు గారు

      తొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువుగారూ! దయతో మొన్నటి, నిన్నటి పూరణలను పరిశీలించండి.
    23-08-2017:

    శీలము గల్గిన తనయుడు
    వాలెము శ్రమతో గుణపడ బఱచుచు తనకున్
    మేలౌ విద్యానిక్షే
    పాలిచ్చిన తన జనకుని భజియింప వలెన్
    24-08-2017:

    లవకుశు లెవని కొడుకులై రాణకెక్కె?
    ద్వాపరమ్మున ధర్మనిబంధి యెవడు?
    మనలకూర్థ్వగతి నెవడమర్చు చుండు?
    రామభద్రునకున్, ధర్మరాజు, సుతుడు


    రిప్లయితొలగించండి