1, ఫిబ్రవరి 2018, గురువారం

సమస్య - 2585 (హనుమంతుఁడు పెండ్లియాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"హనుమంతుఁడు పెండ్లియాడె నద్రితనూజన్"
(లేదా...)
"హనుమంతుండు వివాహమాడె హిమశైలాధీశుపుత్రిన్ దమిన్"

127 కామెంట్‌లు:

  1. చనుడీ భారత దేశము
    కనుడీ మాపాఠశాల కలియుగమందున్
    వినుడీ సూతపురాణము:
    "హనుమంతుఁడు పెండ్లియాడె నద్రితనూజన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "సూత పురాణము"

      రచయిత:

      త్రిపురనేని రామస్వామి చౌదరి

      తొలగించండి
    2. "Ramaswamy chose literary writing as the vehicle for expressing his rationalist thoughts. His famous work Sutaparanam in four cantos was a fierce attack on the ancient Puranas..."

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      సూతపురాణ ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. ఘన రుద్రుని యవ తారము
    "హనుమంతుఁడు, పెండ్లియాడె నద్రితనూజన్
    మినిసిగదేవర తనదగు
    తనువును సగపాలుజేసి తరుణికి నిడుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  3. వినుడీ వింతది నొక్కటి
    కనరాని చోద్యము గాదె కలియుగ మందున్
    మనలో మనమాట సిద్ధుడు
    హనుమంతుఁడు పెండ్లి యాడె నద్రి తనూజన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      రెండవ, మూడవ పాదాలలో గణదోషం. భావం అస్పష్టంగా ఉంది. మరో ప్రయత్నం చేయండి.

      తొలగించండి
    2. మనమున రాముని రూపము
      కనరాడు పొరబాటు నైన కాంతల నెపుడున్
      వినుటకు వింతగ నున్నది
      హనుమంతుఁడు పెండ్లియాడె నద్రి తనూజన్

      తొలగించండి
    3. అక్కయ్యా,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  4. ధ్యానించె సదా రాముని
    హనుమంతుఁడు; పెండ్లియాడె నద్రితనూజన్
    ధ్యానము చేయ ద్రుహిణుడున్
    ధ్యానాత్సర్వము లభించు ధన్య జిలేబీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      సమస్య పాదం లఘువుతో ప్రారంభమైతే మీరు మిగిలిన పాదాలను గురువుతో ప్రారంభించారు. సవరించండి.

      తొలగించండి


    2. మరీ "పర" ధ్యానం ఎక్కువై పోయినట్టుంది జిలేబి కి :)


      జిలేబి

      తొలగించండి
    3. "వరమిది నీకు జిలేబీ
      పరముగ ధ్యానమ్ము జేయ పరమార్ధమునన్
      త్వరపడుటెందుకు జెప్పుము
      మరలన్ పద్యమ్ము వ్రాయు! మంజుల వాణీ!"

      తొలగించండి
    4. కనితిని దప్పు జిలేబి క
      వనమున ,యకటా జిలేబి వనితా రత్నం
      బునెపుడు జేయదు దప్పు, క
      లనపు మసకలో న దప్పు లన్ వ్రాసె గదా

      తొలగించండి


    5. ఓయయ్యలార! తప్పై
      పాయెన్! ఛందస్సు సాఫ్టు వారున్ సాయం
      బీయంగ రాలె తప్పని
      వేయన్ తలపైన నొక్క వేటును సుమ్మీ :)

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
  5. అనుపమకాంతుడు;శర్వుడు;
    ధనదాంతఃకరణచరుడు;దర్పకదాహుం;
    డనవద్యుడు;శివుడు;ప్రణత
    హనుమంతుడు;పెండ్లియాడె నద్రితనూజన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      ప్రణత హనుమంతునితో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  6. కనుగొనె నెవండు సీతను
    వనమున? శిఖివాహనుద్భవము గోరుచు తా
    నొనరించెనేమి పశుపతి?
    హనుమంతుడు, పెండ్లియాడె నద్రితనూజన్.

    రిప్లయితొలగించండి


  7. వినగన్ రామకథన్ లగెత్తు నట సువ్వీ రామ లాలీయనన్
    హనుమంతుండు; వివాహమాడె హిమశైలాధీశుపుత్రిన్ దమి
    న్తనువున్నర్ధము గా సదా శివుడు; ధ్యానమ్మున్ సుశోభింప జే
    య‌ నరుల్ గాంతురు దైవ సన్నిధి సదా! ధ్యానింపుడీ దైవమున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి

  8. "పర" ధ్యానము నుండి బయటపడి సవరణ

    విన రామకథను పరుగిడు
    హనుమంతుఁడు; పెండ్లియాడె నద్రితనూజన్
    కనగన్ ధ్యానమున శివుడు;
    మనస్సునన్ ధ్యానము గనుమమ్మ జిలేబీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      విరుపుతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. కనితిని దప్పు జిలేబి క
      వనమున ,యకటా జిలేబి వనితా రత్నం
      బునెపుడు జేయదు దప్పు, క
      లనపు మసకలో న దప్పు లన్ వ్రాసె గదా

      తొలగించండి
  9. హనుమా, నీకై మంచిది
    వినుమా, ఇంటాలిగోల వినుటే శాపం
    అనుచున్నా వినకుండగ
    "హనుమంతుఁడు పెండ్లియాడె అద్రితనూజన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటేశ్ ప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వినుమా యిల్లాలి గోల వినుటయె శాపం | బనుచున్నను..." అనండి.

      తొలగించండి
    2. అలాగే సార్..మెరుగులు దిద్దారు..

      తొలగించండి
    3. నాపద్యానికి మీ ప్రశంసకు ధన్యవాదములు.మీ పద్యమూ చక్కగా ఉంది.

      తొలగించండి
    4. నాపద్యానికి మీ ప్రశంసకు ధన్యవాదములు.మీ పద్యమూ చక్కగా ఉంది.

      తొలగించండి
  10. ఫరవరి వచ్చింది నేడు
    బడ్జెట్టు మెరుపుల్ తోడు
    అరుణుని కసరత్తు చూడు
    కమలులకిది చివరి దౌడు..
    (శ్రీ అరుణ్ జైట్లీ పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టనున్న ఆఖరి బడ్జెట్ నేపథ్యంలో)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చివరిదని ఎందుకు అనుకోవాలి? నాకైతే మళ్ళీ కమలనాథులే అధికారం చేపడతారని నమ్మకం.

      తొలగించండి
    2. ఈ 5 సంవత్సరాల తడవ కి చివరిది. 2019 లో కమలం తప్ప పరిమళించేది ఏదీ లేదు.

      తొలగించండి
  11. వినరే దివ్యకథామృతార్థము జగద్విఖ్యాతమై పర్వమై
    ఘనమై చెల్వగు రామనామిదె భగ్యంబై తరించెన్ కదా
    హనుమంతుండు, వివాహమాడె హిమశైలాధీశుపుత్రిన్ దమిన్
    కనదంభోధరజూట తేజుడు జగత్కల్యాణమై శంభుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. 'రామ నామ మిదె భాగ్యంబై' టైపాటు...

      తొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    తననే కోరి కఠోరదీక్ష గొనగా ధన్యాత్మనర్ధాంగిగా
    వనితారత్నముఁ బార్వతిన్ గని చితాభస్మానులిప్తోల్లస..
    ద్ధనుమంతుండు వివాహమాడె హిమశైలాధీశుపుత్రిన్ దమిన్
    ఘన కారుణ్యపయోధి, యార్తజనరక్షాదక్షుడీశుండటన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      'చితాభస్మానులిప్తోల్లసత్ హనుమంతుండు' అద్భుతమైన ప్రయోగం.
      మీ పూరణ ఉత్కృష్టంగా ఉన్నది. అభినందనలు.
      ఈ నెల 16 నాటి సభలో ఈ పూరణను తప్పక ప్రస్తావించండి.

      తొలగించండి
    2. సవరణ:
      మాన్యులు శ్రీ నరాల రామారెడ్డి గారి సూచనతో...

      తననే కోరి కఠోరదీక్ష గొనగా ధన్యాత్మనర్ధాంగిగా
      వనితారత్నముఁ బార్వతిన్ గని చితాభస్మానులేపోల్లస..
      ద్ధనుమంతుండు వివాహమాడె హిమశైలాధీశుపుత్రిన్ దమిన్
      ఘన కారుణ్యపయోధి, యార్తజనరక్షాదక్షుడీశుండటన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. హనుమచ్ఛంకరులిర్వురున్ గలరొకే ప్రాకారమందెన్నగన్
      మనుజుల్ పల్లకి మోయ , నందముగ గ్రామంబందు నూరేగి రాన్
      హనుమంతుండు ., వివాహమాడె హిమశైలాధీశుపుత్రిన్ దమిన్
      ఘనుడౌ శంభుడు మాఘమాసమున భక్తాళుల్ తరింపన్ గనన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    4. ననవిలుతుడు హరుని గెలిచె
      నన నమ్మిన వారు దీని నమ్ముదురు జుమీ !
      గన బ్రహ్మచారి మారుతి
      హనుమంతుడు బెండ్లియాడె నద్రితనూజన్ !!

      ననవిలుతుడు.... మన్మథుడు

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  13. తనువున్ బెంచుచు స్వీయపాదముల నుత్సహంబు క్షాభృత్తుపై
    అనువున్ మోపుచు నంశుమాలి తనకేనాచార్యుడై నిల్వగా
    మనమున్ శ్రద్దగ శాస్త్రముల్ జదివి ధీమంతమ్ము శీతాద్రిపై
    హనుమంతుండు, వివాహమాడె హిమశైలాధీశు పుత్రిన్ దమిన్
    తనువున్ భస్మపుధారుడై శివుడు,శాంతాకారునిన్ జూడగా

    రిప్లయితొలగించండి
  14. క్రమాలoకారం లో
    ఘనుడై కాల్చేను లంక ను
    మును కొ ని రుద్రు డు తపము ను బూని న నామె న్
    మనము న మెచ్చగ నే మ యె ?
    హనుమ oతు 'పెండ్లి యా డె న ద్రితనూ జ న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరరావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      టైపు దోషాలున్నవి.

      తొలగించండి
  15. ఇనకులసోముని భక్తుం
    డననెవరు దశరథ రాముడవనిజనేమా
    డెను? గౌరియనునెవరి?నన
    హనుమంతుఁడు, పెండ్లియాడె, నద్రితనూజన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్య నారాయణ గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. కనుగొంటిని మీ చతురత,
    అనెదను నేఁ పద్యమిచట హాస్యపు రీతిన్
    గనుడిచ్చట మీ వాక్యము
    "హనుమంతుఁడు పెండ్లియాడె నద్రితనూజన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఘనమో చరితది గనఁ, పా
      వనమౌ రామాయణమ్ము పాఠమె జూడన్
      వినదగునా ఎవరన్నా
      "హనుమంతుఁడు పెండ్లియాడె నద్రితనూజన్"

      తొలగించండి
    2. విట్టుబాబు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఘనమౌ చరితను గన' అనండి. అలాగే 'యెవరన్నను' అనండి.

      తొలగించండి
  17. కనుగొనె సీతమ్మ నెవరు?
    యిను కులపతి జానకమ్మ నేమియు జేసెన్?
    మనువాడె నెవరిని హరుడు?
    హనుమంతుఁడు, పెండ్లియాడె,నద్రితనూజన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతి భూషణ్ గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      "సీతమ్మ నెవం | డినకులపతి" అనండి.

      తొలగించండి
  18. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2585
    సమస్య :: *హనుమంతుండు వివాహ మాడె హిమశైలాధీశు పుత్రిన్ దమిన్.*
    హనుమంతుడు పార్వతిని వివాహమాడినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: హిమవంతుని భార్య యైన మేనాదేవి , తన కుమార్తె పార్వతి వరింప దలచిన శివుని , మొదటిసారి చూచినప్పుడు భయపడింది. ఎంతగానో బాధపడింది. ఎందువల్లనంటే అప్పుడు కామరూపుడైన శివుడు ఒక
    భిక్షుకుడుగా ఒక నటుడుగా ఒక కోతి వలె వికారిగా బికారిగా కనిపిస్తాడు. పరమశివుని ఐశ్వర్యాన్ని గురించి నారద మహర్షి , బ్రహ్మ , విష్ణువు , ఇంద్రుడు మొదలైన దేవతలు , సనక సనందనాది ఋషులు , హిమవంతుడు చక్కగా తెలియజెప్పగా , శివుని యథార్థమైన తత్వాన్ని గ్రహించిన మేనక , సంతోషంతో పార్వతీ పరమేశ్వరుల వివాహమునకు తన సమ్మతిని తెలియజేస్తుంది. గడచిపోయిన ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకొన్న మేనాదేవి , తన చెలికత్తెకి అప్పటి విషయాలను చెబుతూ , *’’ ఈ నాడు దివ్య సుందరుడుగా ఉన్న శివుడు పెళ్లికి ముందు నా కళ్లకు కోతిలాగా కనిపించాడు. అలా కనిపించిన ఆ కోతి అంటే ఆ హనుమంతుడు పార్వతిని వివాహమాడినాడు ‘’ * అని ముచ్చటించే సందర్భం.

    . వినుమా యం చిటు బల్కె మేన చెలితో విశ్వేశు కల్యాణమున్
    ‘’ ఘను డీ శంభుడు దివ్య సుందరుడుగా కన్పించు నీ నాడు ; నా
    మనసే కుందగ వచ్చె భిక్షుకుడుగా మా యింటి కా నాడు తా
    గనిపించెన్ గద కోతి వోలె మొదటన్ కన్యార్థియై యట్టి యా
    * హనుమంతుండు వివాహమాడె హిమశైలాధీశు పుత్రిన్ దమిన్.*’’
    *కోట రాజశేఖర్ నెల్లూరు.* (01.02.2018)

    రిప్లయితొలగించండి
  19. అనవలెనని క్రమమున నే
    కనువిందులు జేయునటుల కందమునందున్
    ఘనముగ విడగొట్టితినిగ
    "హనుమంతుఁడు; పెండ్లియాడె; నద్రితనూజన్"

    పరికించెద మొకపరి యని
    తెరచితి నే బ్లాగు, నందు తెలిసితి నేనో
    పరిగని విరించి భూషణు
    లరయగ కేయారు వారు లదియే జేసెన్!

    😁

    రిప్లయితొలగించండి
  20. ఒక ప్రయోగము:

    ఘనరామను భూరుహమును
    పెనవేయగ నమితభక్తి వీరుధమువలెన్
    కనుగొన నవివాహితుడా
    హనుమంతుడు బెండ్లియాడె నద్రితనూజన్!

    అద్రితనూజ = కొండకు పుట్టినది = చెట్టు
    వీరుధము = లత

    రిప్లయితొలగించండి
  21. వినుతింపగ బుడమిన గల
    జనులందరు గూడి సీత జాడ గనుగొనెన్;
    తన తపమును మెచ్చి శివుడు
    "హనుమంతుఁడు ; పెండ్లియాడె నద్రితనూజన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      "...బుడమిని" అనండి.

      తొలగించండి
  22. కనుల కనంగ బడకనా
    వినిన కధల మరచినంత వికటించినదా
    మనసది ? యెవడనె నిట్టుల
    హనుమంతుఁడు పెండ్లియాడె నద్రితనూజన్?

    కనె జానకి నాలంకను
    హనుమంతుఁడు; పెండ్లియాడె నద్రితనూజన్
    మునిగా తప మొనరించుచు
    తన పత్నినె మరల పొంద , తాను శివుండే

    రిప్లయితొలగించండి
  23. చని లంకాపురి యందు సీతగని తా సంతోషమున్ బొంది యా
    వనితారత్నము మెచ్చ ముద్రికనుభావావేశుడై నీయడే,
    మనమందుమ్ముదమొంది దేవతలు సన్మానింప ముక్కంటి తా,
    * హనుమంతుండు, వివాహమాడె హిమశైలాధీశు పుత్రిన్ దమిన్.*’’

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      "భావావేశుడై యీయడే" అనండి.

      తొలగించండి
  24. విశ్వనాథ వారు త్రిపురనేని వారితో:

    వినుమా! మూర్ఖుడ రామసామి!యిది నీ వీరత్వమంచుంటివో
    కనుమా! సత్యము! వచ్చురో కనగ నీ కావ్యమ్ము విభ్రాంతి తో
    శునకాగ్రేసరు లెల్లరున్ వినగ నీ సూతున్పురాణమ్మునన్:
    "హనుమంతుండు వివాహమాడె హిమశైలాధీశుపుత్రిన్ దమిన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారు,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వీరత్వమం చంటివో" అనండి.

      తొలగించండి

    2. ఏమండోయ్ జీపీయెస్ వారు

      వెంటనే త్రిపురనేని వారి పుస్తకం చదవాలనిపిస్తోంది! :)


      రచన "రమణీయంగా" వుంటుందనుకుంటా రంగనాయకమ్మ వారి పుస్తకాలలా

      రసాలూరే కధల సూత పురాణం పీడీయెఫ్ ఏమన్నా లభిస్తుందా ఓ చూపు చూడ్డానికి ? :)


      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ:

      ఈ త్రిపురనేని వారి సహచరుడే మా తెలుగు మాస్టారు..1958. నిడుబ్రోలు కాలేజీలో. పేరు క్రొత్త సత్యనారాయణ చౌదరి. వీరు విశ్వనాథ గారి రామాయణ కల్పవృక్షం లో వేయి తప్పులు కనిపెట్టి పుస్తకం వ్రాసారట. ఈ మాట ఎవరో విశ్వనాథ గారి చెవిలో వేస్తే వారు ఇలా అన్నారట:

      "కవి సామ్రాట్ సత్యనారాయణను నేను!!! మరి ఈ "క్రొత్త" సత్యనారాయణ ఎవరో" :)

      త్రిపురనేని వారి విగ్రహం మా హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న 60 చిల్లర వాటిలో ఒకటై ఉండేది ఒకప్పుడు. ఇప్పటి సంగతి నాకు తెలియదు...:)

      తొలగించండి

    4. బై ది వే ఈయన శతావధాని !

      శంబుక వధ అనే వీరి పుస్తకం ఆర్కైవ్ లో దొరికింది !

      వీరే వారా ?

      https://archive.org/details/in.ernet.dli.2015.386673


      జిలేబి

      తొలగించండి
    5. మైలవరపు వారి స్పందన:

      👏👏👌ఇప్పుడు మీ పూరణ మెరుస్తోంది... నమోనమః 🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    6. జీపీయస్సు వారు వ్హాట్సప్ లో ఉవాచ:

      సార్! మా జిలేబీ గారు నిన్న నన్ను:

      "మర్కట మైతి నిచ్చట సమస్యల పూరణ మత్తులో భళా"

      అనినది 🐒

      ....................

      స్పందన:

      ...............

      **********************

      పూరణ:

      మాడుగుల మురళీధర శర్మ సిద్ధిపేట

      **********************

      కర్కశ మైనవాక్కులకు*
      కారణమైతినిమాజిలేబికిన్!
      తర్కకుతర్కవాదనల*
      తాలిమితోడు తదాటవేయ సం!
      పర్కపు శంకరాభరణ*
      పాలిటసాహితిమాధురీ వనిన్!
      *"మర్కట మైతి నిచ్చట స*
      *మస్యల పూరణ మత్తు లో భళా"*

      🐒

      ........................

      కంది వారి ప్రతిస్పందన:

      👌

      తొలగించండి

    7. అదురహో మాడుగుల వారి సమస్యా పూరణ పాద
      సమస్యా పూరణః !



      ఆహా!పూరణలోని పాదము సమస్యాపాదమాయెన్ భళా! (శార్దూలము :))


      జిలేబి

      తొలగించండి
    8. (పద్యం అమరని సమయంలో, కిటికీ వెంబడి నా బిక్కచూపులకు పదాలను చూపెట్టే కర్మసాక్షికి వందనం)

      తర్కముకందదేపదము ,తక్కిన భావముచిక్కదాయెనూ
      సర్కసుచేయవైచితిని, సద్యమునయ్యతి ఉద్భవంచదే
      మర్కట మైతి నిచ్చట సమస్యల పూరణ మత్తులో భళా
      అర్కునిదత్తమీపదము,అక్కరమందెను వెంకటేశుకున్

      తొలగించండి
    9. జిలేబీ గారూ:

      అవును. వారే వీరు:

      https://te.m.wikipedia.org/wiki/త్రిపురనేని_రామస్వామి

      తొలగించండి
  25. కనులును వదనము సురచే
    తను వడి వడి నెర్రబార తడబాటుగ తా
    ననె నొక్క మందుబాబిటు
    హనుమంతుఁడు పెండ్లియాడె నద్రితనూజన్"

    రిప్లయితొలగించండి
  26. అనలాంబకుండు హరుఁడు న
    యనాయుధుఁడు చేతనుండు హైముఁడు శివుఁడే
    ఘనుఁడు భవిష్యత్పూజిత
    హనుమంతుఁడు, పెండ్లియాడె నద్రి తనూజన్


    ఘనుఁ డా శీతమహీధ్ర శేఖరుఁడు ముక్కంటిన్ మహేశున్ మహా
    త్ముని జామాతగఁ బొందె నక్కజముగన్ ముల్లోకనాథున్ హరున్
    వనజాక్షిన్ సుతపఃకృశాపఘననున్ బాలన్ శివుండా బృహ
    ద్ధను మంతుండు వివాహమాడె హిమ శైలాధీశు పుత్రిం దమిన్

    [హనువు = ఆయుధము; బృహద్ధనుమంతుడు = గొప్పదైన యాయుధము కలవాఁడు. గరుత్మంతము / గరుత్మంతుఁడు; బుద్ధిమంతుఁడు వలె]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి



  27. అనునిత్యము రామపదము

    లను విడక కొలిచిన దెవరు? లలితో భువిలో

    వనిలో వటువుగ పశుపతి

    హనుమంతుఁడు ,పెండ్లియాడె నద్రితనూజన్.



    ఇనవంశోద్భవు దాసుడు

    హనుమంతుఁడు ,పెండ్లియాడె నద్రితనూజన్

    మనసిజు గర్వము నణచిన

    పినాకపాణి యగుహరుడు వేడుక తోడన్.


    వినయము నగాంచె సీతను

    హనుమంతుఁడు పెండ్లియాడె నద్రితనూజన్

    తననే పతిగా కోరగ

    ననలాక్షుండు సురవరులు హర్షంబొందన్..

    రిప్లయితొలగించండి
  28. కన నెవ్వండటఁదొల్త భూమిజను లంకాధీశరాజ్యంబునన్?
    ధనువుం గూల్చియు నేమిఁజేసె తదయోధ్యాధీశు డాశుల్కమున్?
    తనువందున్ సగభాగమొప్ప నెవతెన్ దాల్చెన్ శివుండెట్లుగన్?
    హనుమంతుండు, వివాహమాడె, హిమశైలాధీశు పుత్రిన్ దమిన్.

    రిప్లయితొలగించండి
  29. మునుపటి ప్రేమను బెంచియు
    హనుమంతుడు పెండ్లియాడె నద్రి తనూజన్
    మునుపటి కథలో గాదిది
    కనుపించెడి నాటకాన కలలో యిలలో !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కలలో నిలలో' అనండి.

      తొలగించండి
  30. వినుమా రామునిబంటుగ
    హనుమంతుడు,పెండ్లియాడెనద్రి తనూజ
    న్ననలముభ్రుకుటిని గలిగెడు
    ననిరుధ్ధుడుప్రేమమీర యమరుల యెదుటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మీర నమరులు..' అనండి.

      తొలగించండి
  31. కందం
    తనకున్ పార్వతిఁ గూర్చెడు
    ననన్వజుని గాల్చి వైచి హరుడానాడున్
    మనమందున చెలఁగి తొలఁగ
    హనుమంతుఁడు, పెండ్లియాడె నద్రితనూజన్

    రిప్లయితొలగించండి
  32. గురువు గారికి నమస్సులు.
    ఇనకుల రాముని శిష్యుడు
    హనుమంతుడు,పెండ్లియాడె నద్రితనూజన్ వనమాలిద్వాపరo బున
    కనుడీ పుణ్యవిషయములు కలికి చకోరా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      పద్యం బాగుంది. కాని వనమాలి ద్వాపరంలో అద్రితనూజను పెండ్లాడడం?

      తొలగించండి
  33. .
    కనగనతిథియై వచ్చెను
    హనుమంతుడు, పెండ్లియాడెనద్రి తనూజన్
    త్రినయనుడు, కనులపండుగ
    దినమది దేవతల పూలు దివి నుంచి పడన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      కాని శివపార్వతుల కళ్యాణానికి హనుమంతుడు అతిథిగా రావడం?

      తొలగించండి
  34. అనయము దశరథ రాము భ
    జన చేయుచునున్నదెవరు జగతిన్ ? శివుడే
    వనితను పెండిలి యాడెన్?
    హనుమంతుఁడు, పెండ్లియాడె నద్రితనూజన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  35. .
    కనగనతిథియై వచ్చెను
    హనుమంతుడు, పెండ్లియాడెనద్రి తనూజన్
    త్రినయనుడు, కనులపండుగ
    దినమది దేవతల పూలు దివి నుంచి పడన్ .

    రిప్లయితొలగించండి
  36. అనయమ్మున్ రఘురాముఁ గొల్చుకరమౌయర్థిన్ ముదమ్మొందుచున్
    హనుమంతుండు, వివాహమాడె హిమశైలాధీశుపుత్రిన్ దమిన్
    మనమందున్ రహి కల్గజేయగ వెసన్ మారుండు, శంభుండు తా
    జనముల్ భక్తి ప్రవృత్తితోడుతనటన్ సల్పంగ స్తోత్రమ్ములన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ముదమ్మొందు నా హనుమంతుండు...' అనండి.

      తొలగించండి
  37. ఇనతనయను కృత యుగమున
    హనుమంతుఁడు పెండ్లియాడె, నద్రితనూజన్
    గొనె శంకరుండు, తరమే
    హనుమ శివుల నడుమ భేద మరయగ జూడన్?

    రిప్లయితొలగించండి
  38. అనువౌవిద్యల నభ్యసించగను గుర్వాజ్ఞన్ సువర్చస్వినా
    హనుమంతుండు వివాహమాడె; హిమశైలాధీశుపుత్రిన్ దమిన్
    ఘనుడౌ శూలి, శశాంకమౌళి, వరగంగాధారి, ముక్కంటి, పా
    వనకైలాసనివాసి, నాగతొడవు, వ్యాఘ్రాంబరుండే గొనెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సువర్చలను సువర్చిస్వి అని కూడా అంటారా?
      'తొడవు'లో 'వు' లఘువై గణదోషం.

      తొలగించండి
    2. గురుదేవులకు నమస్సులు! సువర్చలను గణాలకోసం సువర్చస్విని చేసాను!😊😊🙏🙏🙏 తొడవౌ అంటే సరిపోతుందనుకుంటాను! ధన్యవాదములు!

      తొలగించండి
  39. వినుమా!పరమేశ్వరుడే ; మనోనయనముల గనగను మహదానంద మ్మున రాముని భక్తుడయిన హనమంతుడు;పెండ్లియాడె నద్రితనూజన్.

    రిప్లయితొలగించండి
  40. పార్వతిని తనదానిగా చేయడానికి ప్రయత్నించిన మన్మథుఁడు భస్మమవడానికి కారణమైన కోతి స్వభావము మదిలో తొలఁగిన తర్వాత పరమేశ్వరుడు పార్వతిని పెండ్లాడాను భావంతో..

    మత్తేభవిక్రీడితము

    నన బాణమ్ముల వైచి తీక్షణ తపోనాశంబు నన్గాలుచున్
    తనకున్ బార్వతిఁ గూర్చెనంచు నొగి లో తత్వంబుఁ జింతించుచున్
    మనగన్ జేయుచు మన్మథున్ మదిని సంభాలించఁ బాయంగ నా
    హనుమంతుండు, వివాహమాడె హిమశైలాధీశుపుత్రిన్ దమిన్ 

    రిప్లయితొలగించండి
  41. దినకరతనయుని మంతిరి?
    యినకుల తిలకుడు మహీజ నేమియు జేసెన్?
    అనలాంబకుడు వరించెన్?
    హనుమంతుడు, పెండ్లియాడె, నద్రితనూజన్..!!!

    రిప్లయితొలగించండి
  42. మరొకపూరణ



    జనకజనెవ్వరు గాంచిరి?

    ఇనవంశజుడేమి చేసెనిలలో సీతన్?

    వనిలో హరుడెవరిని గనె?

    హనుమంతుఁడు ,పెండ్లియాడె నద్రితనూజన్

    రిప్లయితొలగించండి
  43. కనినెవరు సీత జాడను?
    'మనువాడె ' నన మఱియొక్క మాట నుడువుమా?
    అన నెవ్వారిని 'పార్వతి ' ?
    హనుమంతుడు, పెండ్లి యాడె, యద్రి తనూజన్!

    రిప్లయితొలగించండి

  44. ........🤷🏻‍♂సమస్య
    హనుమంతుడు పెండ్లి యాడె నద్రి తనూజన్

    సందర్భం:
    తూరుపు కొండమీదినుండి ఒక్కొక్క కిరణం పైకి వస్తూ వుంటే ఆ కొండయే సూర్యుడా అనిపిస్తుంది.
    ఆ కొండ (రవి) కూతురే సువర్చల. ఆమె హనుమంతుని దేవేరి.

    కనఁ దూరుపు మలనుండియె
    యిన కిరణము లుద్భవించెనే
    యనిపించెన్
    ఘన రవి నద్రిగ నెంచిన
    హనుమంతుడు పెండ్లి యాడె
    నద్రి తనూజన్

    ~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  45. కనుమా! దూకెను సాగరమ్మునట కంగారంచు లేకుండనే
    హనుమంతుండు;...వివాహమాడె హిమశైలాధీశుపుత్రిన్ దమిన్...
    వినుమా! పిమ్మట నేమిజేసె సతి యావీరుండు ముక్కంటికిన్!
    తునుమన్ మేలగు నర్ధకాయమునుతా తుష్టించి చేకూరెభల్!

    రిప్లయితొలగించండి