31, జనవరి 2018, బుధవారం

న్యస్తాక్షరి - 50 (గ్ర-హ-ణ-ము)

అంశము - చంద్రగ్రహణము.
ఛందస్సు- తేటగీతి (లేదా) ఆటవెలది.
న్యస్తాక్షరములు... 
అన్ని పాదాల చివరి అక్షరాలు వరుసగా "గ్ర - హ - ణ - ము" ఉండాలి.

115 కామెంట్‌లు:



  1. మా బ్లాగ్జ్యోతిష్యుల వారి టపా కై మా ముందు పద్యః !


    చంద్ర గ్రహణమట జిలేబి చంపు నుగ్ర
    వాది వలె జనులట భయ పడిరట రహ
    ములను జేయ! అరరె!మును ముందు హరణ
    ములకు సూచన గా పద్య మొప్పె గనుము !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. దినకరు శశి మధ్యన చనుదెంచ ధర,గ్ర
    హణము ప్రభవించు ఘనముగ;నట్టియు గ్రహ
    ణమెపుడు మరి చంద్రగ్రహణమగు; గ్రహణ
    దినము మూఢవిశ్వాసములను కనెదము.

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    సూర్య చంద్రుల మధ్యలో జొరగ భూగ్ర
    హమ్ము చంద్రగ్రహణమగు! నపుడు గేహ..
    మందు దినరాదు త్రాగరాదండ్రు గ్రహణ
    నియమముల మర్మమును నీవు నేర్చుకొనుము !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారు దేనికైనా సమర్థులు. వారి పూరణ అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు.

      తొలగించండి
    2. కలువ కాంతలెల్ల కనరాడు చంద్రగ్ర ...
      హణము గాన ఱేఁడటంచు విరహ
      మంద , గాంచి , విధుడునాదరింప కిరణ
      ములను వృద్ధి జేసి నిలిచె గనుము !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. మైలవరపు వారి రెండవ పూరణ కూడా అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు.

      తొలగించండి
    4. అయ్యా! విద్యార్థినై అడుగుచున్నాను, నేర్చుకోవాలనే తాపత్రయం కొద్దీ. అన్యథా భావింపక నా శంక తీర్చ ప్రార్థన.
      మొదటి పద్యం మూడో పాదంలోని యతి 'ందు' 'ండ్రు' అక్షరాల మద్యనేనాండీ..

      తొలగించండి
    5. విట్టుబాబుగారు, అక్కడ ఉన్నది
      (గేహ)మందు దినరాదు త్రాగరాదండ్రు గ్రహణ అని. గేహమందు లోని మొదటి రెండు అక్షరాలూ పూర్వపాదంలో ఉండిపోయాయి. గేహమందు అన్నది గేహము + అందు => గేహమందు అన్న సంధికార్యం వల్ల వచ్చిన పదరూపం. అందుచేత 'అందు' అన్నపదంతోనే పాదం మొదలు అని తెలుసుకోవాలి మనం. 'అందు'లో ఉన్న మొదటి అక్షరం 'అ' కాబట్టి దానికి యతిమైత్రి స్థానంలో తగిన అక్షరం ఉంచాలి. అక్కడ యతిమైత్రి స్థానం 'త్రాగరాదండ్రు' అన్న పదం మధ్యలో ఉన్నది. ఈ త్రాగరాదండ్రు అన్నది ఎలా వచ్చిందీ త్రాగరాదు + అండ్రు => త్రాగరాదండ్రు అన్న సంధికార్యం వలన. అందుచేత మైత్రిస్థానంలో ఉన్న పదం 'అండ్రు' అన్నది. మనకు కావలసిన 'అ' అన్న అక్షరానికి మైత్రి కల అక్షరం అక్కడ. కనిపిస్తున్నది 'అ' అన్నదే మైత్రి స్థానంలో. ఇంకేం భేషుగ్గా కుదిరింది. అదీ సంగతి. మీ సంశయం నివృత్తి ఐనదా?

      తొలగించండి
    6. ఆహాఁ! కమాలాఫలం ఒలిచి గింజలు తీసి మరీ రససారాన్ని అందించినంత విపులంగా వివరించారు ఆచార్యా!
      ధన్యవాదములు. 🙏

      తొలగించండి
    7. నేను ఒక పద్యంలో..
      "అష్ట దిగ్గజ కవుల బంతాట తెలుగు"
      అని గతంలో రాశాను. అప్పుడు పాదమే అకారంతో మొదలుపెట్టాను కాబట్టి రాసేశా. ఇక్కడ సమాసంతో కూడినందువలన...కొంచెం గందరగోళంలో పడిపోయా...
      🙂

      తొలగించండి
  4. [31/01, 05:06] ‪+91 75698 22984‬: 31, జనవరి 2018, బుధవారం
    *న్యస్తాక్షరి - 50*
    అంశము - *చంద్రగ్రహణము.*
    ఛందస్సు- *తేటగీతి (లేదా) ఆటవెలది.*
    న్యస్తాక్షరములు... 
    *అన్ని పాదాల చివరి అక్షరాలు వరుసగా "గ్ర - హ - ణ - ము" ఉండాలి.*
    http://kandishankaraiah.blogspot.in
    [31/01, 05:58] Nvn Chary: Dr NVN Chary
    గోగ్రహణము పాండుసుతుల కొఱకు భూ" గ్ర"
    హణము నేటి నాయకులకు హక్కట గ్రహ
    ణముల తీరుతెన్నులును మారె నకట ప్రా"ణ"
    ములను తీయుచుండ్రిస్వార్థ మునను జన"ము"

    రిప్లయితొలగించండి
  5. (తండ్రి కొడుకు శశిధర్ ,కూతురు వీణలతో)
    సత్యదృష్టి జూడు శశిధరా!పుత్రాగ్ర!
    తెలియుమయ్య చంద్రు దివ్యమోహ!
    నూటయేబదేండ్లనూత్నత గను వీణ!
    నీలి యెరుపు చంద్రు నిండుదనము.

    రిప్లయితొలగించండి
  6. మోసం గురూ మోసం!

    అన్ని పాదాల "మొదటి" అక్షరాలు వరుసగా "గ్ర - హ - ణ - ము" ఉండాలి అని భ్రమించి గంట వేస్టు చేసితిని.

    అందుకే మా నాన్న గారు చెప్పే వారు:

    "కొశ్చెను పేపరు శ్రద్ధగా చదవరా గాడిదా!"

    అని.

    😢😢😢😢

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీకు exemption మంజూరు చేయబడినది. ఆ పద్యాన్ని పోస్ట్ చేయండి.

      తొలగించండి
    2. సార్!

      చేత కాలేదు! మూడవ పాదం మొదటి అక్షరం "ణ" గొంతులో ఇరుక్కున్నది.

      ఇక నాకు రేపే!!!

      🙏🙏🙏

      తొలగించండి
    3. "గొంతులోపల ణ యిరుకుకొన్నచో ప్ర
      ణతుల నొనరించి కక్కిన హితము గాదె"

      తొలగించండి
    4. ఉదయం నుండి ఆలోచిస్తున్నాను.. ఈ "మోసం గురూ మోసం" డైలాగు ఎక్కడ విన్నానా అని!
      ఇప్పుడే ట్యూబ్ లైట్ వెలిగింది....
      పాతాళభైరవి చిత్రంలో సదాజపుడు (పద్మనాభం) అంటాడు.

      తొలగించండి
  7. గాంధీజీ వర్ధంతి సందర్భంగా.. పంచచామరం ..

    అశక్యమైనఛత్రభంగయత్నమున్జయేఛ్ఛతో
    ప్రశస్తిగాప్రజాగ్రహంబిలన్బలీయమైసదా
    కృశత్వమొంది గాంధియై,అకృద్ధమాయెరాజ్యమై
    వశమ్మహింసతోసుభాగ్యవన్తదేశభారతం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటేశ్ ప్రసాద్ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'భారతం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ "సుభాగ్యవంతమౌను దేశమే" అనండి.

      తొలగించండి
  8. సార్, నేడు గాంధీజీ వర్ధంతి కదా, మీరు ఆ నేపథ్యంలో అడుగుతారేమో అని పై పద్యం నేసిఉంచాను. మీరేమో unexpected question ఇచ్చారు..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పరీక్షలప్పుడు మన 'గెస్' తప్పడం సాధారణమే కదా!

      తొలగించండి
    2. నా ఈ answer ను choice లో వ్రాసినది గా భావించి మార్కులు వేయ ప్రార్థన...

      తొలగించండి
  9. రాహు కేతువు బట్టిన రణము నుగ్ర
    సూర్య చంద్రుల కానని సోద్య మాహ
    వనిత లందరు వంటల తునిమి తృణ
    మునపు డుసుద్ధి జేయగ భూరి ముదము
    -----------------------------
    హమ్మయ్య ఎలాగొ కిట్టించాను ఇక గురువుల దయ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సోద్య' మెందుకు? "చోద్య" మనండి. చివరి రెండు పాదాలలో గణదోషం. "...తునిమియు తృణ। ముల నపుడు శుద్ధి జేయగ..." అనండి.

      తొలగించండి
    2. రాహు కేతువు బట్టిన రణము నుగ్ర
      సూర్య చంద్రుల కానని చోద్య మాహ
      వనిత లందరు వంటల తునిమియు తృణ
      ములనపు డుసుద్ధి జేయగ భూరి ముదము

      తొలగించండి
  10. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశము :: న్యస్తాక్షరి :: నాలుగు పాదాల చివరలో క్రమంగా గ్ర హ ణ ము అనే అక్షరాలు ఉండేటట్లు పద్యం వ్రాయాలి.
    ఛందస్సు :: తేటగీతి లేదా ఆటవెలది ఛందస్సు.
    సందర్భం :: పాలసముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృతాన్ని , రాహువు దేవతల వరుసలో కూర్చొని త్రాగుతూ ఉంటే , ఆ విషయాన్ని సూర్య చంద్రులు జగన్మోహినీ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి చెప్పగా , విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా , రాహువు కంఠం తెగిపోయింది. అమృతాన్ని ఆస్వాదించినందున సజీవంగా ఉన్న ఆ రాహువు తల , సూర్యచంద్రులపై కోపంతో అప్పుడప్పుడూ వారిని మ్రింగుతూ ఉంటుంది. అలా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంటాయి అనేది పురాణ కథనం. గ్రహణ సమయంలో పెద్దలు చెప్పినట్లు స్నానము ధ్యానము దానము జపము మొదలైనవాటిని ఆచరిస్తే కీడు తొలగిపోతుంది, గొప్ప ఫలితం కలుగుతుంది అని గురువు శిష్యునికి ఉపదేశించే సందర్భం.

    చంద్రు మ్రింగు రాహు సరణియె చంద్ర *గ్ర*
    హణ మటంచు పెద్ద లండ్రు ; దే *హ*
    ధారి కెన్న స్నాన దానాలతో న *ణ*
    గు నిల కీడు ; కలుగు గొప్ప ఫల *ము*.
    *కోట రాజశేఖర్ నెల్లూరు.* (31.01.2018)

    రిప్లయితొలగించండి
  11. అంతరిక్ష మందు నంశుడు ప్రత్యగ్ర
    వంతుడై నడరుచు వనర నా హ
    రిమన బడె రయముగ రిపుని సమీక్షణ
    ము, కలువచెలి వదనము దిగె మహము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వంతుడై యడరుచు" అనండి.

      తొలగించండి
  12. భ్రమణ మార్పుల బొందెడి భ్రంశమున గ్ర
    హముల గమనమార్గము లలో నకటనూహ
    కందనివిధముగను నీడలమర,ధిషణ
    గతిని యోచించ దెలియును గ్రహణవిధము

    రిప్లయితొలగించండి
  13. అ: గ్రహణ సమయమందు కచ్చితముగ నిగ్ర
    హమును జూపి గృహము న మనుచు గ్రహ
    ణము విడిన తదుపరి నయమయిన తరుణ
    మునను వెలికి కదలు డనవరతము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అన్నపరెడ్డి గారూ,
      మీరు న్యస్తాక్షరాలను పాదాద్యంత్యాక్షరాలుగా ప్రయోగించడం నీ ప్రతిభకు తార్కాణం. ఈ విశేషాన్ని ముందుగా గమనించనందుకు మన్నించండి.

      తొలగించండి
    3. కవిత్వం మీరు నాకిచ్చిన భిక్ష. సరైన గురువు దొరికితే నాలాంటి అనామకుడు కూడా పద్యములను వ్రాయవచ్చని నా ద్వారా నిరూపించారు. గురువర్యులకు పాదాభివందనములు.

      తొలగించండి
    4. కవిత్వం మీరు నాకిచ్చిన భిక్ష. సరైన గురువు దొరికితే నాలాంటి అనామకుడు కూడా పద్యములను వ్రాయవచ్చని నా ద్వారా నిరూపించారు. గురువర్యులకు పాదాభివందనములు.

      తొలగించండి
  14. పౌర్ణమి తిథి నాడు వచ్చెడి చంద్ర గ్ర
    హణమననిల జనులయందపోహ
    లెన్నియున్నఁగాని నిద్ది సాధారణ
    మైనదియె ఖగోళ మందు నిజము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  15. గురూజీ!
    చిన్న అనుమానం.
    చంద్రగ్రహణము లో 'ద్ర' లఘువౌతుందా,గురువా!
    ఎందుకంటే అది ఒకే పదముకదా... చంద్రః+గ్రహణము. లేదా చంద్ర గ్రహణము అని రెండు పదాలుగా తీసుకోవాలా?
    🤔

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమాసంలో ఉత్తర పదం మొదటి అక్షరం రేఫసంయుక్తమైనపుడు పూర్వ పదం చివరి అక్షరాన్ని మన అనుకూలతను బట్టి లఘువుగాను, గురువుగాను స్వీకరించే సంప్రదాయం ఉన్నది.

      తొలగించండి
  16. వసుధ సూర్య చంద్రుల కద్దువచ్చి న గ్ర
    హ ణ మ దేర్ప డు నను చుండ న య్యేడ గ్రహ
    ణ మును జూ డ రాదను మాట నవత గ్రహ ణ
    మును గనుట తప్ప్గుగు నా యను ట నిజము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పు కాదని యను ట నిజము అని చివరి పాదము లో చదవాలి

      తొలగించండి
    2. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వచ్చిన గ్రహణ' మన్నపుడు 'న' లఘువే. దాని వల్ల గణదోషం. "వచ్చినన్ గ్ర..." అనండి.

      తొలగించండి


  17. మరో ప్రయత్నం జీపీయెస్ వారి కామింటు చూసాక!
    పాదము మొదట ఆఖరున న్యస్తాక్షరములు


    గ్రహణ మమ్మరో!యివ్వాళ గ్రహములుగ్ర
    హముగ జూచునట! జిలేబి హవన పోహ
    ణముల జేయదగున్ స్ఫురణగొనుచు; చణ
    ము గనెను దినము మన మనమునట రయము !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆహాఁ! ఓహోఁ!!
      అద్భుతము...పరమాద్భుతము

      తొలగించండి

    2. అప్పుతచ్చయః

      *గ్రహములాగ్రహముగ

      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      న్యస్తాక్షరాలను పాదాల ఆద్యంతాలలో నిక్షిప్తం చేసిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


    4. ఐడియా ఇచ్చిన జీపీయెస్ వారికి
      మెచ్చుకున్న విట్టుబాబు గారికి కందివారికి

      నమోనమః

      చీర్సు సహిత
      సావేజిత

      జిలేబి

      తొలగించండి
    5. 👏👏👏👏👏👏

      🙏🙏🙏🙏🙏🙏

      సర్కసు లిట్టివిన్నెరుగ! శాస్త్రిని భౌతికమందునన్ సుమీ!

      తొలగించండి


    6. అర్కుడ నేను నైయయిటి మాస్టరు నమ్మ జిలేబి యమ్మరో
      బర్కిలి సిగ్రెటుల్వెలుగ భారతపౌరుల తీర్చి దిద్దితిన్
      మర్కట మైతి నిచ్చట సమస్యల పూరణ మత్తులో భళా
      సర్కసు లిట్టివెన్నెరుగ శాస్త్రిని భౌతికమందునన్ సుమీ

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    7. జిలేబి గారూ జిందాబాద్!👌👌👌👍👍👍👏👏👏

      తొలగించండి
  18. సమయాభావం వలన వెంటనే ఏమీ తోచక...

    పద్య మందు మొదటి పాదము చివర 'గ్ర'
    ఉండవలె ననిరిగ రెండవది 'హ'
    మూడు నందు చివర ముచ్చటగ గను 'ణ'
    చంద్ర గ్రహణ పదమె ఇంద్ర! గనుము!!

    సాయంత్రం మళ్ళీ ప్రయత్నిస్తా!
    ☺️

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      సమస్యాపూరణంలో ఇదీ ఒక విధానమే. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  19. నమో నారసింహా.. తేటగీతి..

    కరికరిగ,శిరమమర,నఖధరుడుగ్ర
    విలయజునకు,సురులుజయవినతులను,హ
    వనమిడ,మరియభయమిడ,వసుపతి,ఫణ
    కరుడు,అకరణితజయునికి,ఇదినిజము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటేశ్ ప్రసాద్ గారూ,
      విషయాంతరమైనా బాగుంది మీ పూరణ.
      చివరి పాదంలో యతి తప్పింది. "జయునక యిది నిజము" అనండి. (జయునక = జయునకే).

      తొలగించండి
  20. నీలి రుధిర వర్ణ నెలరాజు నేటిగ్ర
    హణము వేళ గల్గు ననెడి యూహ
    మరులు గొల్పు,తప్పు మనసు నియంత్రణ
    వర్ణ శోభి తుడయి వరలు నిజము

    రిప్లయితొలగించండి
  21. విశ్వమందున జరిగెడి వింతలను గ్ర
    హణమొకటి, సూర్యచంద్రుల నాకటను హ
    రించు రాహుకేతువులని యెంచు తరుణ
    మరయ సూత్రధారినడుపు నద్భుతమ్ము!

    రిప్లయితొలగించండి
  22. ఈ నిందాస్తుతి ఏ సందర్భంలో వచ్చింది.. తెలుపగలరు..
    కులగురు ద్వేషి నొజ్జలుగ వెన్కొని కాచి-నిష్టుర మంత్రముల్ నేర్చినావు,
    పూర్వ దేవతలు కాఁపురమున్న పురియందు-వంచించి యగ్గిబెట్టించినావు,
    తాతల తరమునఁ ద్రవ్వించిన పయోధి-పేరుగాఁ గొంత పూడ్పించినావు,
    మునియౌటెఱుంగక మోహించి వచ్చిన-యెలనాఁగ ముక్కు గోయించినావు, |సీ|
    బళిర! నీవంటి ధార్మికుఁ బ్రస్తుతింపఁ
    గొదవ లింకేమి, కైవల్య మెదుట వచ్చు!
    చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ
    హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! |తే|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రశ్న అర్థం కాలేదు.
      ఇది కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయక శతకంలోని ఒక పద్యం. ఈ శతకంలోని పద్యాలన్నీ నిందాస్తుతితో కూడినవే.

      తొలగించండి
    2. అంటే, కొన్ని పద్యాలు రామావతారం నేపధ్యంలో, మరికొన్ని కృష్ణావతారం నేపధ్యంలో ఉన్నాయి కదా, ఈ పద్యం లో చెప్పిన అంశాలు, ఏ అవతార విశేషాలు..

      తొలగించండి
    3. అన్నీ రామావతార నేపథ్యంతోనే ఉన్నాయి. కృష్ణావతార ప్రసక్తి లేదు ఆ పద్యంలో...

      తొలగించండి
  23. గ్రథిత గాథ వినుడు రాహువు ప్రబలాగ్ర
    హమున నీ దినాన యమృతుని గ్రహ
    ణమ్ము చేయు; కావున కరణీయ కరణ
    ములొనరించ మనకు కలుగు శుభము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కేతువు అని విన్నట్టు గుర్తండీ.
      సూర్య గ్రహణమునకు రాహువు అనుకుంటాను కదా.

      తొలగించండి
    2. విజయకుమార్ గారూ,
      న్యస్తాక్షరాలను పాదాల ఆద్యంతాలలో నిక్షిప్తంచేసిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
      ఈనాటి చంద్రగ్రహణం రాహుగ్రస్తమే. సూర్యచంద్రులను రాహుకేతువులలో ఎవరైనా పట్టవచ్చు.

      తొలగించండి
    3. సంపత్ కుమార్ గారూ! నేనిలా అంతర్జాలంలో చదివానండి. సూర్యుడు,భూమి,చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్దగాని,కేతువు వద్దగాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

      తొలగించండి

  24. ఆటవెలది
    గ్రమ్మన సుధఁ గొనఁగ గాంచి హరికి నాగ్ర
    హమ్ము కలుగ శశియు హరి యన గ్రహ
    ణముగ రాహువు పరిణామమై ప్రసరణ
    ము విడ కాంతి, వారిఁ బుడమి గనము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీరు కూడా న్యస్తాక్షరాలను పాదాల ఆద్యంతాలలో ప్రయోగించి మీ ప్రతిభను చాటుకున్నారు. సంతోషం!
      పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. చిత్ర మీ విశ్వ మందున శీతల(గ్ర)
    హాగ్ర గౌరుఁ గబంధ సమ (గ్ర ) విర (హ)
    భోగి విగ్ర హో (గ్ర) రత నభో వి (హ) ర (ణ)
    రాహు వార గించ నగుఁ జంద్ర (గ్రహణము)

    గ్ర ..
    గ్రహ..
    గ్రహణ..
    గ్రహణము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      ఏమాత్రం అవకాశం వచ్చినా మీరు శబ్దాలతో ఆటాడుకుంటారు. ఇది గతంలో ఎన్నోసార్లు జరిగింది.
      ఈనాటి మీ పూరణ సర్వశ్రేష్ఠమై విరాజుల్లుతున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  26. అహరహమును తిరుగు నా సూర్య చంద్ర గ్ర
    హముల నడుమ నడువ యవనియు, నహ
    హా ! కనగగలమది యపురూపమౌ గణ
    నమహిమ కతనయగు ; నదియె ఘనము

    రిప్లయితొలగించండి
  27. నింగి వెలుగు సుధాంశుడు నేడు నుగ్ర
    రాహువునకుఁజిక్కె విధివిలాస మహహ!
    ఎవరికేకీడు లేమేలు లెట్టి తరుణ
    మెవ్విధంబుఁగల్గునొ! చెప్ప నెవరి తరము

    రిప్లయితొలగించండి
  28. సూర్యచంద్రులనడుమనజొచ్చుభూగ్ర
    హమ్ము జంద్రుని నాబడునపుడు గేహ
    మందు దేనినిదినరాద?యమ్మ వీణ
    రంగు రంగుల చంద్రుని రాత్రి కనుము

    రిప్లయితొలగించండి
  29. నేడు పున్నమి కద నిండైన చంద్ర గ్ర
    హణము, జన సమూహ మంత కని హ
    రుసము పొందు చుందు రసితము, దారుణ
    ఫలిత మంద్రు కాని పడకు భయము

    రిప్లయితొలగించండి
  30. అరయ రాహువు కేతువులలిగి నుగ్ర
    మైన రీతిగ జాబిల్లి నినుని నాహ
    వమున జంపంగ సమకట్టి వచ్చు తరుణ
    మందు నేర్పడు నట్టిదే నౌ గ్రహణము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కేతువు లలిగి యుగ్ర..." అనండి.

      తొలగించండి
  31. పురుటి యందున చంద్రుని పూడ్చిడు గ్ర
    హణము నేటి రాత్రికి మనమందరము హ
    రిపదమున వింత వెలుగును మ్రిన్గు హరణ
    ము విధి రాహువు కేతువుమొగ్గు తనము !
    హరణము =దొంగ లిన్చుట మొగ్గు =యిచ్చ

    రిప్లయితొలగించండి
  32. మొదటి పాదం చివర పూడ్చిడున్ అని చదువ గోరి నాను

    రిప్లయితొలగించండి
  33. అద్భుతముగ నేడు నలరారు చంద్ర 'గ్ర'
    హణము, జూడ బాళి యగునట స'హ'
    కు ,శశి కెంపు వన్నె గూడుచు నుడుగ'ణ'
    వీధి పైచలించు వింత గమ'ము'

    రిప్లయితొలగించండి
  34. చూడ రాదని కొందరు, చోద్యమౌ గ్ర
    హణము జూడ దోషము లేదు యనుచు కలహ
    మాడుచుంటిరి కొందరు, మరల గ్రహణ
    మమరు వరకు వర్దిల్లునా మన జగడము?

    వేదములను నమ్ము వేదాంతుల వలుకు
    శాస్త్ర మెరుగడేల శాస్త్ర వేత్త ?
    మేటి యుగము లోని మేధావి తర్కంబు
    ఋజువు చూపకున్న ఋతము గాదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మూర్తి ప్రయాగ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లేదు+అనుచు' అన్నపుడు యడాగమం రాదు. "లేదటంచు" ఆనండి.
      పూరణతో పాటు వ్రాసిన పద్యం ప్రశస్తంగా ఉన్నది.

      తొలగించండి
    2. గురువుగారికి ధన్యవాదములు.

      తొలగించండి
  35. గ్రక్కున జనుల నిట రంజిల చంద్ర గ్ర
    హమ్ము నేడు దలచ నంతట గ్రహ
    ణమ్ము బట్టె! కారణమ్మిదియె, "భ్రమణ
    మున గలిగెడి ఘటన లనవరతము"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      న్యస్తాక్షరాలను ఆద్యంతాలలో ప్రయోగించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  36. Double Dhamaaka -- ఆది గ్రహణము, అంత్య గ్రహణము... తేటగీతి..

    గ్రహణమని తెలియక శశిగన నభోగ్ర
    హములమరిక గని సృజిత యజమనూహ
    ణషటఝట మను అరుపులనడుమ హరిణ
    ము గని నరబలి సడలెను మునిగెనభము

    రిప్లయితొలగించండి
  37. శంకరులు మెచ్చకపోతే సర్వగ్రహణము కూడా..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటేశ్వర్ ప్రసాద్ గారూ,
      పాదాల ఆద్యంతాలలో న్యస్తాక్షరాలను ప్రయోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  38. కనగ ఛాయాగ్రహమ్ములఘనమగుగ్రయాగ్రహమ్మనినమ్మిరియందరహహ
    కాదు కారణం,బిల యని కాదది ఫణ
    జాలమనియందురెందరోజంత్రమయము
    చూడచోద్యమనియొకరు చూడరాద
    నియొకరును కలవరములు నెపుడు కలుగు!!

    రిప్లయితొలగించండి

  39. ౹పాలసాగరమున వచ్చిన యమృతగ్ర
    హణముచేయ రాహు వధికమగుహ
    రుషముతోడ రాగ రుషతో.యాక్షణ
    మందె హరియు వాని నణచె నిజము.
    గ్రహణ సమయమందు రహితోడ నుపరిగ్ర
    హించ కూడ దండ్రు నిల నటుగ్రహ
    ణమ్ము చేయనా క్షణమ్మెకీడగు గణ
    నీయముగనటండ్రు నెపుడు నిజము.

    రిప్లయితొలగించండి
  40. అరసితిని 'హంపి'లో 'విరూ
    పాక్షు' శశి గ్ర
    హణ దినానఁ 'బంపా దేవి',
    హంపి స్వగృహ
    మయిన 'భువనేశ్వరి'ని గంటి
    నరుణ చరణ..
    మురిసె 'గులగంజి మాధవు'
    నరసి మనము

    ~వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి