18, మార్చి 2018, ఆదివారం

దత్తపది - 135 (మార్చి-మే-జులై-డిసెంబరు)

మార్చి - మే - జులై - డిసెంబరు
పై పదాలను అన్యార్థంలో వినియోగిస్తూ
విళంబి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

37 కామెంట్‌లు:

  1. ఉగాది స్వాగత పద్య మాల
    సీసము:
    చైత్ర మాసపు చీర చిత్ర వర్ణ భరిత౦బై నీదు కలిలము పైన జేర,
    వైశాఖ మాసపు కూసము లేలేత చనుదోయి దాచుచున్ సంతసించ,
    జ్వేష్ట మాసపు చుక్క నొష్ట పై కెంజాయ వర్ణ తేజమ్ముతో వఱలు చుండ,
    ఆషాఢ మాసపు హాటక హారమ్ము గళముపై నొడగూడి కాంతు లీయ,
    శ్రావణ మాసపు చంచువు పోగులు నాసిక పై జేరి నాట్య మాడ,
    భాద్రపద కుహరా భరణముల్ ఘనముగా శ్రోతమ్ము పైజేరి శోభ నిడగ,
    ఆశ్విన మాసపు అ౦గుళీయకము హస్తాగ్రంబు నంజేరి సరస మాడ ,
    కార్తీక మాసపు కనకంపు పతకమ్ము పాపట పై జేరి ప్రభలు జల్ల,
    మార్గశీర్ష౦పు శ్రీ మకుట గాజుగములు కరదోయి పైజేరి పరవశి౦చ,
    పౌష్యపు వంకీలు బాహు యుగళముపై జేరి నధికమైన జిగిని జల్ల,
    మాఘ వడ్డాణము మహము తోడ కటిపై జేరి నీ కాయము సౌరు బెంచ,
    ఫాల్గుణపు రజత పాయ పట్టమ్ములు పాదాల పైజేరి మోద మిడగ,
    తే:: శుభ విళంబి నామాంకిత సుధ్యుపాస్య,
    తెలుగు వత్సరపు యుగాది తీయబోడి ,
    తెలుగు జనతకై వచ్చిన మెలుత, రమ్ము,
    స్వాగతమ్ము నీకిదియ సు స్వాగతమ్ము

    రచన
    పూసపాటి కృష్ణ సృయ కుమార్ 17 -3-2018

    రిప్లయితొలగించండి
  2. సంఘదుర్భావతతి మార్చి సాకవమ్మ !
    మంచిమనుజులై మేమింక మనెదమమ్మ !
    కనుగవ తడిసెం ; బరువెక్కె కల్పవల్లి !
    రమ్ము రమ్మోవిళంబి ! బిరాన రమ్ము !

    రిప్లయితొలగించండి

  3. మలిన వత్సర చీరను మార్చి మేను
    మీద ,నవ వత్సరపు ఛీర మోద మొప్ప
    తనువున తొడిగి, పత్రముల్ తామ రసపు
    మేలి గాజులై కరములన్ మెరియ, వచ్చు
    చున్నట్టి ఉగాది కన్యకా, నిన్న నీదు
    చెల్లి హేవలంబి శుభము చేసి వెళ్ళె,
    ప్రజకు నొసగు నీవు పడిసెం, బరుగు లెట్ట
    కుండ భానుని కూడుచు ఎండ లోన
    శుభము లిమ్ముము విళంబి శోభ తోడ,
    స్వాగ తమ్ము నీకు సు స్వాగ తమ్ము


    పడిసెం = చలువ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్కారములు
      సోదర సోదరీ మణు లందరికీ నూతన సంవత్సర [ఉగాది ] శుభాకాంక్షలు .

      తొలగించండి
  4. సంఘ విద్రోహ మునుమార్చి సంత సమున
    మేలు జేయంగ మనుజులై నొకరి కొకరు
    విరియు డిసెంబ రుహముల వెలుగు లందు
    రమ్ము విళంబి వత్సమా రమ్యము గను

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ


    మన గతి మార్చి మోది యవమానమొనర్చె తెనుంగు సోదరా!
    జనహితమే ముదమ్మనుచు స్వాగతమిచ్చి విలంబికిన్ మహా..
    స్వనముల రాజులైన పెరవారల గూల్చగ రమ్ము రమ్ము ! గాం...
    చిన మన యాశలన్ని మడిసెంబరువెత్తుము పోరు సల్పగన్ !!

    మడిసెన్ పరువెత్తుము...

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కని పూరణ!అభినందనలు!💐👍👌💐

      తొలగించండి
    2. తిరుపతి లోని మహతి ఆడిటోరియం నందు ఉగాది సందర్భముగా మురళీకృష్ణ
      అవధాన విశేషాలు...

      నిషిద్ధాక్షరి... మహతి ని వర్ణన

      శ్రీ భావంబుల్ నిల్చున్
      శోభకునిదియౌను గాంచుచున్ వాణీ భా...
      వాభాస్వంతము మహతీ
      శోభను వర్ణింప దరమె ? చూచిన దెలియున్ !!

      సమస్య...

      కారము కన్నులన్ బడగ కౌతుకమందిరి గోపకాంతలున్

      నీ రమణీయవక్త్రమును నిత్యము గాంచుట మాకు భాగ్యమౌ,
      ధీర సమీర సంకలిత దివ్య వనాంతరసీమనున్న నీ
      వారము , మమ్ము గావుమని పల్కుచు గృష్ణుని ముగ్ధమోహనా...
      కారము కన్నులన్ బడగ కౌతుకమందిరి గోపకాంతలున్ !!

      కారము.. కారము... కారము... కారము

      అంశం.. కారములతో తీపి

      కారము ముద్దు గాదు , మమకారము కావలె గారమేల ? సం...
      స్కారము నభ్యసించి పలుకన్ ముదమందు జనాళి , వాక్చమ...
      త్కారము తీపి , గాన యనగా వినగా దగు మంచిమాట , యోం..
      కారము సర్వభద్రదము , కావున కావలెనిట్టి కారముల్ !!

      న్యస్తాక్షరి...

      1లో 2 కు
      2లో 11 ల
      3లో 3 స
      4లో 7 తి

      వర్ణనాంశం..... స్త్రీ మూర్తి.... చంపకమాల లో...

      సుకులమునందు బుట్టి , తనుశోభను భర్తకు ధారపోసి , పాల్
      పకపకలాడు పిల్లలకు లక్షణరీతిగ నిచ్చి , తల్లిగా
      వికసనమందినావు పృథివీస్థలినమ్మరొ ! నీకు మ్రొక్కెదన్
      సకలము నెంచితిన్ జనని చక్కని రూపమటంచు ధాత్రిలో !!


      వర్ణన...

      తెలుగుభాష ను నేర్పించడానికి ప్రభుత్వానికి సూచన...

      తెలుగన తీపి బాస యని తెల్పెడు వ్యర్థప్రసంగమేల ? పి...
      ల్లలకును తెన్గు నేర్ప మరి లక్షలఁ దెచ్చెడి వృత్తి యేది ? యీ
      తెలుగును నేర్చు వారలు సుధీతిలకమ్ములు, వృత్తి గూర్చుచో
      తెలుగును నేర్చుకొందురిక తేజము వెల్గును తెల్గు బాసకున్!!

      ఇంకా ఆశువులు.... ఇవీ విశేషాలు..

      నమోనమః...

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. నిషిద్ధాక్షరి లో

      శోభకు నిధి యౌను... అని గమనింప ప్రార్థన ( టైపాటు) 🙏

      తొలగించండి
  6. ఓ విలంబియుగాది మాకోజసిమ్ము
    దుష్టయోచనలను మార్చి తోషమిమ్ము
    మంచి మనుజులై బరగెడు మార్గమిమ్ము
    మేలుగూర్చెడు భావముల్ మేలుకొల్పు
    పాతవత్సరము మడిసెం బరువుగాను
    స్వావలంబన నీయగ స్వాగతమ్ము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువర్యులకు, కవిమిత్రులందరికీ శ్రీ విలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!💐💐💐💐

      తొలగించండి
  7. మేదిని బ్రదుకులను మార్చి మేలు గూర్చ
    రైతు లందఱు రాజులై రంజిలంగ
    పట్టిన పడిసెం బరువెత్తి పారిపోవ
    వేగ రాగదమ్మ విలంబి వెల్గలీన.

    రిప్లయితొలగించండి
  8. మిత్రులందఱకు విళంబి నామ సంవత్సర యుగాది పర్వదిన శుభాకాంక్షలు!

    కోరికలున్ దరాజులయి కూర్మి యుగాదియె హేవిళంబియన్
    చీరను మార్చియుం మనలఁ జేరె విళంబిగఁ గూర్మిఁ బంచఁగా
    ధారుణి కందమే పెరిగె దబ్బునఁ బ్రకృతి విందొనర్పఁగాఁ
    జీరుచు సూర్యుఁ డిట్లు విడిసెం బరువెత్తుచు వచ్చి మేలిడన్!

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశము :: దత్తపది
    *మార్చి- మే- జులై- డిసెంబరు* అనే పదాలను అన్యార్థంలో వినియోగిస్తూ విళంబి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయాలి.

    మాయ గనన్, *విడంబి*! యిక మా తలరాతలు *మార్చి* , సర్వదా
    మాయని కీర్తి నిచ్చి, శుభ మార్గము జూపుచు *మే* లు గూర్ప, వి
    చ్చేయుము, జా *జులై* విరియ చిత్తము లెల్లరకున్, ధరిత్రి సు
    శ్రీయుత ! నీ దయారసముచే త * డిసెం బరు* లన్ జయింపుమా.
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (18-3-2018)

    రిప్లయితొలగించండి
  10. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


    మా హృదయ మెల్ల నక్కటా మరువ లేని

    యిడుములన్ వడిసెం , బరుగిడగ లేము --->

    బ్రతుకు బాటలో || నూత్న సంవత్సరంబ !

    మంచిగా భవిష్యత్తును మార్చి వేసి ,

    ధైర్యమే శ్వాసగా జేసి దారి నిమ్ము ||

    దేశపౌరులు సౌజన్య తేజులై , మ

    హా విభవ వంతులై నిత్య మలర వలయు ||


    { వడిసెన్ = కృశించెను ,‌అలసిపోయెను ; విభవ వంతులై = భాగ్యవంతులై }

    రిప్లయితొలగించండి
  11. వచ్చె ను విల oబ వర్షమ్ము వసు ధ పొంగె
    మేలొ న ర్చు మను జు లైరి మేటి యగుచు
    జగతి రూపం బు మార్చి యు జ వ ము జూప
    చెడు గ ది జడి సెం బరు వె త్త చే వ జూపె

    రిప్లయితొలగించండి
  12. పరిమార్చి మేలుగ నవాం
    తరమ్ముల విళంబి శకమ! ధాత్రి ననుజులై
    నరు లుండ జనము దడిసెం
    బరువంపు దయాబ్ధిని నని పలుకఁగ రావే

    [పరువము = పరిపాకము/పక్వము]

    రిప్లయితొలగించండి
  13. ఏమార్చి పోకు మమ్మెప్పటి మాదిరి
    .....గట్టి మేలును తలపెట్ట నిమ్ము
    ఏమేమి యాశ లం చెకసక్కె మాడకు
    .....హితవైన తలపుల బ్రతుక నిమ్ము
    ఆరోజు లైపోయె బేరీజు వేయకు
    .....డని సుద్దులాడక తనుపు మమ్ము
    ఆ డిసెంబరు* పూల జాడ కాలం బను
    .....చట్రాన గట్ట నెంచకుము మమ్ము

    ఆశలకు నాశయాలకు నంతరముల
    పూడ్చి మంచిగా కాలమ్ము పోవనిమ్ము
    కనుము మము దయతో విలంబనము లేక
    రమ్ము వసుధకు మేలై విళంబి రమ్ము.

    * డిసెంబరాలు అనే పూల చెట్లు డిసెంబరు నెలలో మాత్రమే కనువిందు చేస్తాయి.

    రిప్లయితొలగించండి
  14. గుడిసెంబరువగు జీవితమ్ములికపైకొంగ్రొత్త రాగాలతో
    బడయంగావలె సౌఖ్యముల్ యశముసంపాదింపగా మార్చి పు
    త్తడి బొమ్మా!కవిరాజులై మముల విస్తారమ్ముగా తీర్చుమా
    పడతీ వర్షవిళంబి స్వాగతమిదే ప్రత్యుషమే నీవుగా

    రిప్లయితొలగించండి
  15. ప్రజల నేమార్చి యోట్లను బడయుచున్న
    కావరుల త్రుంచి మేల్జేయ నో విళంబి!
    మనుజు లైకమత్యముతోడ మనగజేయ,
    నింక విడిసెం బరువడిగ హేవిళంబి,
    రమ్మువేగముగ భువికి రమ్ము రమ్ము

    రిప్లయితొలగించండి
  16. గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారికి, గురుతుల్యులు శ్రీపోచిరాజు కామేశ్వరరావుగారికి మరియు నితర కవిమిత్రులకు విళంబి నామ వత్సర శుభాకాంక్షలు.

    స్వాగతమో విళంబమ! ప్రశాంతత నిచ్చి జగంబునందు ది
    వ్యాగమ రీతి ధార్మిక మహత్తర కార్య ఫలంబులిచ్చి ని
    ష్ఠాగరిమంబు బెంచి కడు సార పయోధర ధారలిచ్చి స
    ద్భోగము గల్గ జేయుమని మ్రొక్కెద భక్తి వినమ్ర చిత్తతన్.

    మార్చి - మే - జులై - డిసెంబరు
    పై పదాలను అన్యార్థంలో వినియోగిస్తూ
    విళంబి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ

    మారిన వత్సరంబ! పరిమార్చి దురాగత భావజాలముల్
    కోరిన కోర్కెలెల్ల బ్రజకున్ జరిపించుచు మేలుగూర్చుచున్
    సారస రాజులై చెలగ శాశ్వత కీర్తిని గాంచ నెల్లెడన్
    చేరి నుతింతు నిన్ను విడిసెం బరువమ్మును మ్రాంపనీకుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్కుమార్ శాస్త్రి గారికి నమస్సులు మరియు నుగాది శుభాకాంక్షలు.

      తొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. ఓవి ళంబి వత్స రంబ!జయ మునీకు
    మనువునొందుదిలను మనుజులైన
    మాక ష్టముల లెల్లపరిమార్చి ్మేలు నిమ్ము
    మాడి సెంబరుండు మమతపంచి
    వంద నంబు లిచ్చు వందలాది

    రిప్లయితొలగించండి
  19. సుకవులు, గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి జాతీయ విశిష్ట సాహిత్య పురస్కార గ్రహీత, సమస్యాపృచ్ఛక చక్రవర్తి, శంకరాభరణం బ్లాగు నిర్వాహకులు,
    మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి
    గౌరవ పురస్సరముగా సమర్పించుకొను
    -:సాదర పద్య సుమార్చన:-
    ఉ.
    శ్రీయుత కంది వంశ వర! ♦ శ్రేష్ఠ గుణాన్విత! సత్ప్రకీర్తితా!
    శ్రేయద! శిష్ట మండిత! వి♦శేష మహోదయ! శంకరాఖ్య! ప
    ద్యాయత శంకరాభరణ ♦ యాజ్ఞిక! సత్కవిజాత మార్గద
    ర్శీ! యువ ధీ బలా! ప్రకట ♦ శిష్య సమర్చిత! పద్య పోషకా! 1
    మ.
    మహిమోపేతసుశబ్దయుక్తకవితా♦మార్గప్రదౌత్సుక్యతన్,
    సహసాశూక్తిఁ గవీంద్ర సంహతి మన♦శ్శబ్దార్థసంశీతిఁ బ్ర
    త్యహముం దీర్చుచు, "శంకరాభరణ" వి♦ద్యాహృద్యపద్యాల్ ముహు
    ర్ముహురావృత్తిగ వ్యాప్తిఁ జేతు; విదె కొ♦మ్మో శంకరా సత్కృతుల్! 2
    సీ.(మాలిక)
    శైశవమ్ముననుండి సాహిత్య విద్యలో ♦ రాణించి యెదిగిన రత్న మీవు;
    బోధకవృత్తి సుభూషణమ్మని యెంచి, ♦ తలఁదాల్చి వెలిఁగిన ధన్యుఁ డీవు;
    వృత్తిధర్మముఁ దక్క వేఱొక్క ధర్మమ్ము ♦ ముందుగాఁ దలఁపని మునివి నీవు;
    వారు వీరను భేదభావ మెఱుంగక ♦ హితముఁ గల్గించు సౌహృదుఁడ వీవు;
    కోప మింతయు లేక, కోమలమ్మగు వాక్కు, ♦ చిఱునవ్వు తళుకొత్తు శ్రేష్ఠుఁ డీవు;
    శంకరాభరణాఖ్య సాహితీ శీర్షికన్ ♦ రస రమ్యముగఁ దీర్చు రసికుఁ డీవు;
    శ్రీశుని, వరదుని, శ్రీ వేల్పుఁగొండ నృ♦సింహు శతకము లర్చించి తీవు;
    షిరిడీశు, నయ్యపన్ స్థిరమైన భక్తితోఁ ♦ గరముఁ గొల్చిన గేయకర్త వీవు;
    దేశవిదేశ సుస్థిరతరాంతర్జాల ♦ పద్య ప్రచారక ప్రముఖుఁ డీవు;
    సహనానఁ గవుల సత్సందేహములఁ దీర్చి, ♦ పద్యవిద్యనుఁ బెంచు వరదుఁ డీవు;
    ప్రముఖావధాన సంభావ్య సత్సభలందు, ♦ వరపృచ్ఛకాళిలోఁ బ్రథముఁ డీవు;
    సాహితీ సంస్థల సత్కృతు లనిశమ్ముఁ ♦ గొని, వెల్గుచున్న సద్గురుఁడ వీవు;
    గీ.
    మంచి వీవు! సుగుణ గణ మణివి నీవు! ♦ బంధుఁ డీవు! సుధీజన బంధ మీవు!
    స్నేహ మీవు! సంపూర్ణ సౌశీల్య మీవు! ♦ కవుల కందఱ కాదర్శ కవివి నీవు!! 3
    కం.
    హృద్యములగు పద్యమ్ముల ♦ నాద్యంత సువేద్యముగ, నిరాటంకముగా,
    శ్రీద్యుతి చెన్నలరారఁగ, ♦ సద్యః ప్రభలొలుక రచన సాఁగింతువయా! 4
    తే.గీ.(మాలిక)
    పర ధనమును మృత్పిండమ్ము పగిది నెంచి, ♦ పర సతీ మణులనుఁ దల్లి వలెఁ దలంచి,
    యెపుడు శాంత్యహింసాక్షమాకృపలు, దాన ♦ ధర్మ సద్గుణ శౌచ సత్యములు గలిగి,
    యొజ్జబంతివై, కవులకే యొజ్జవైన ♦ నీకుఁ బరమాత్ముఁ డెంతయు నీవి తోడ
    నాయురారోగ్యభోగభాగ్యైహికమ్ము ♦ లీప్సితార్థమ్ము లనిశమ్ము నిచ్చుఁ గాక! 5
    .
    శుభం భూయాత్
    పత్ర సమర్పణ:
    శ్రీ రాజరాజ నరేంద్రాంధ్రభాషా నిలయం, హన్మకొండ, వరంగల్లు
    పత్ర రచన:
    మధురకవి గుండు మధుసూదన్
    వరంగల్లు
    .
    పై టపాను నా బ్లాగులో వీక్షించడానికై క్లిక్ చేయండి:మధుర కవనం: శ్రీ కంది శంకరయ్య గారికి సన్మానము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధురం మధురం మధురం ధ్యానము, ధ్యాత, ధ్యేయము మధురం!!

      మధురకవి గారికి అభినందనలు!!💐💐💐🙏🙏🙏

      తొలగించండి
  20. మార్చినది మేదిని తనదు మకుటము నది
    తా ధరించె విళంబిని మోదముగను
    పల్లవించిన నవపల్లవముల గాంచి
    జాజులై విరిసె మనసు సంతసమున
    కురిసె నానంద భాష్పముల్ విరివిగాను
    కన్నులు తడిసెంబరువయె మిన్నగాను.

    రిప్లయితొలగించండి
  21. కొన్ని రోజులైననుచెడు కోరి తుడిచి
    మార్చి ధరలోన క్రొత్తగా మంచి జూపు
    కనులు తడిసెన్ బరుగునను కదలిరావె
    స్వాగతమ్మేయిది విళంబి సరిగ రావె.

    రిప్లయితొలగించండి



  22. తే.గీ:పంట మార్చి వేయంగ బాగ పండుననుచు

           జనులకెల్ల మేలు కలుగుజగతిలోన

            రైతులెల్లరు రాజులై రహిని పంచ

           దయయు తడిసెంబరుగున ధరణి యందు

          వచ్చెసంబరాన విలంబి వత్సరమ్ము

    రిప్లయితొలగించండి

  23. .....దత్తపది
    మార్చి మే జులై డిసెంబర్ అన్యార్థంలో
    వినియోగిస్తూ విళంబి ఉగాదికి స్వాగతం.

    సందర్భము: సులభము.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    మానవుని మానవత గల్గు వానిగాను
    మార్చి, మే ల్గూర్చి, మహిలోనఁ తీర్చి దిద్ది,
    మేడలై మోజులై యాశ మెరయకుండ
    చిన్నదౌ గుడిసెం బరుల్ చేరకుండ
    నున్న చాలు విళంబి! నీకు న్నమోస్తు!!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  24. *మార్చి- మే- జులై- డిసెంబరు* అనే పదాలను అన్యార్థంలో వినియోగిస్తూ విళంబి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయాలి.

    *ఆ.వె**

    రైతు బ్రతుకు *మార్చి* రైతులే రా *జులై*
    *మే* దినేలు నట్లు మెరుగు పడెడు
    రోజులు గు *డిసెం బరు* వులేని కాలాలు
    ఈ విలంబి నుంచి రావలయును
    ...............✍చక్రి

    రిప్లయితొలగించండి
  25. విలంబి నామ వత్సరమా!

    కందం
    ఏమార్చితే ఋతువులన్
    భూమిని ప్రజ తల్లడిల్లి పొగలుట మేలే? 
    సామజులై త్రొక్క ప్రభుల్
    మామది జడిసెం బరుగున మార్చఁగ రావా !

    రిప్లయితొలగించండి