13, మార్చి 2018, మంగళవారం

సమస్య - 2624 (రాల వండి పెట్టె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాల వండి పెట్టె రమణి రుచిగ"
(లేదా...)
"రాలను వండి పెట్టె రుచి రంజిలుచుండఁగఁ గాంత ముద్దుగన్"
(డా॥ జి.యం. రామశర్మ గారి 'శతావధాన వైజయంతి' గ్రంథం నుండి)

114 కామెంట్‌లు:

  1. వేకువందు లేచి పెరటి తోటకు వెళ్ళి
    కాచినట్టి కూర గాయ లెన్నొ
    కోసితెచ్చి భర్త కోరిక మేర కీ
    రాల వండి పెట్టె రమణి రుచిగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కీరాలు' అంటే మీ అభిప్రాయంలో కీరదోసకాయలే కదా?

      తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    మ్రోలనె కూరుచుండి , పరిపూర్ణశశాంకమనోజ్ఞవక్త్రమున్
    లీలగ జూచుచుండి, మురళీస్వరమాధురి మున్గి , రాధ గో...
    పాలుని జేరుచుండ దన పయ్యెద పయ్యెద జారగా నొయా...
    రాలను వండి పెట్టె రుచి రంజిలుచుండఁగఁ గాంత ముద్దుగన్"!!

    (రుచి... కాంతి)

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. చిరు సవరణ...( శ్రీ రాజశేఖరావధాని గారికి ధన్యవాదాలతో )

      మ్రోలనె కూరుచుండి , పరిపూర్ణశశాంకమనోజ్ఞవక్త్రమున్
      లీలగ జూచుచుండి, మురళీస్వరమాధురి మున్గి , రాధ గో...
      పాలుని జేరుచుండ దన పయ్యెదఁ బయ్యెద జారగా నొయా...
      రాలను వండి పెట్టె రుచి రంజిలుచుండఁగఁ గాంత ముద్దుగన్"!!

      (రుచి... కాంతి)

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  3. మహిమ నెంచి జూడ మౌనితెచ్చి పలికె
    రాల వండి పెట్టె రమణి రుచిగ
    గులక రాళ్ళ నిచ్చె గుగ్గిళ్ళు గామార్చె
    పాతి వ్రత్య మనిన పడతి సొమ్ము


    రిప్లయితొలగించండి
  4. శనగ పిండి లోన సలసల లాడెడి
    మిర్చి బజ్జి లెన్నొ మిసమిసలుగ,
    చేత పట్టినంత చేయి కాలెడి నూనె
    రాల, వండి పెట్టె రమణి రుచిగ

    రిప్లయితొలగించండి
  5. కలహభోజనుండు కల్పింప నొకవింత
    ఇనుపరాల దెచ్చి యీయగానె;
    అత్రి పత్నియైన అనసూయ భక్తితో
    రాల వండి పెట్టె రమణి రుచిగ

    రిప్లయితొలగించండి
  6. తల్లినేర్పలేదు తనకు వంటనుఁజేయ
    వండిపెట్టుటెటుల పతికియనుచు
    నెట్టులోనవెదకి నేర్చి వంటల వివ
    రాల, వండి పెట్టె రమణి రుచిగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పతికి ననుచు / పతి కటంచు" అనండి. అక్కడ యడాగమం రాదు.

      తొలగించండి
    2. ఆకసమ్ముమూసి అంధకారమునిండ
      చిమ్మచీకటెల్ల కమ్ములొనగ
      వాన కురియుచుండ వరుసగ పిడుగులు
      రాల,వండిపెట్టె రమణి రుచిగ

      తొలగించండి
    3. రామకృష్ణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. Nvn chary
    ఒంటిగంట కొట్ట నింటికి నేతెంచె
    కడుపు లోన క్షుత్తు గంట కొట్ట
    పిట్టవేట లోన పట్టి తెచ్చిన పావు
    రాల వండి పెట్టెరమణి రుచిగ

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2624
    సమస్య :: *రాలను వండిపెట్టె రుచి రంజిలుచుండఁగఁ గాంత ముద్దుగన్.*
    *రాళ్లను వండిపెట్టింది ఒక స్త్రీ రుచికరంగా* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: మన భారతదేశం పతివ్రతా శిరోమణులకు నిలయం. అనసూయ సుమతి సీత సావిత్రి మొదలైన పతివ్రతల మహిమలను మన పెద్దలు పురాణములలో చక్కగా విశదీకరించి ఉన్నారు. పతివ్రతయైన సుమతి సూర్యుడు ఉదయించకుండేటట్లు చేయగా అత్రి మహర్షి భార్యయైన అనసూయ తన పాతివ్రత్య మహిమతో సూర్యుని ఉదయించేటట్లు చేసింది. త్రిమూర్తులను చిన్నబిడ్డలుగా మార్చింది. సీతాదేవికి సతీధర్మములను గుఱించి చెప్పింది. నారదమహర్షి తెచ్చియిచ్చిన గులకరాళ్లను వండిపెట్టింది అని విశదీకరించే సందర్భం.
    హేలగ సూర్యదేవు నుదయింపగ జేసె, ధరన్ ద్రిమూర్తులన్
    బాలుర జేసె, నత్రిసతి పావని తా ననసూయ సీతకున్
    లీలగ జెప్పె ధర్మముల ప్రీతిగ, నారదమౌని కోరగా
    *రాలను వండిపెట్టె రుచి రంజిలుచుండగ గాంత ముద్దుగన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (13-3-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      అనసూయా ప్రస్తావనతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  10. అత్తమామ భర్త కత్యంత ప్రియముగ
    పిల్లపెద్దలంత ప్రేమమీర
    నారగింప నరటి నావబెట్టి బహు గా
    రాల వండిపెట్టె రమణి రుచిగ!

    రిప్లయితొలగించండి
  11. తనవారి కడుపు నింపాలని తాపత్రయపడే తల్లులందరికీ పాదాభివందనం 🙏🏻

    తలపు తోచ దెపుడు తల్లి గావున తాను
    బంధు మిత్రు లంత వచ్చి రనగ
    ఒడలు బాధ మరచి యోపిక గొని సంబ
    "రాల వండి పెట్టె రమణి రుచిగ"

    రిప్లయితొలగించండి
  12. అలుక బూని యొక్క యాలి మగని పైన
    వంట మాని వైచి వగచు చుండ
    కొనెద ననగ మగడు కోరిన యానూపు
    "రాల వండి పెట్టె రమణి రుచిగ"

    రిప్లయితొలగించండి
  13. ఆదోని ప్రాంతంలో బొరుగుల (మరమరాల) తో చేసే ఉగ్గాణి ఆపై మిర్చి బజ్జీ కలయిక గానంలో ఘంటసాల సుశీలల కలయికలా ఉంటుందని ప్రతీతి.

    ఆటవెలది
    గానమునకు జోడు ఘంటసాల సుశీల! 
    లటులె బజ్జి తోడ నాదవేని 
    వార లుగ్గురాణి వంటకము !మరమ
    రాల వండి పెట్టె రమణి రుచిగ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడుగారూ! మీ పూరణ జిహ్వకేగాక వీనులకు కూడ విందుగా నున్నది! అభినందనలు!

      ఈనెల తెలుగువెలుగులో సమస్యాపూరణలో మేలైన పూరణగా మీ పూరణ ప్రచురించబడినందుకు హార్ధిక
      అభినందనలు!💐💐💐💐

      తొలగించండి
    2. ఈ నెల తెలుగువెలుగులో ప్రచురింపబడిన పది పూరణలలో ఐదు మన కవిమిత్రులవే కావడమెంతో ముదావహము!
      సహదేవుడుగారు, అన్నపరెడ్డిగారు, శ్రీహర్షగారు, రాజేశ్వరరావుగారు, శైలజగారు
      అందరికీ హార్ధిక అభినందనలు!💐💐💐

      ఇది మనబ్లాగుకు , గురువుగారికీ గర్వకారణము!! ఈ విజయాలకు వారి మార్గదర్శనమే కారణము! శ్రీ గురుభ్యోనమః!
      🙏🙏🙏🙏🙏

      తొలగించండి
    3. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    4. గుండా వారికి తదితర కవిమిత్రులకు అభినందనలు 👏👏👏

      తొలగించండి
    5. గురుదేవులకు, శ్రీప్రభాకరశాస్త్రి మరియు శ్రీమతి సీతాదేవి గారలకు ధన్యవాదములు.

      తొలగించండి
  14. అలసి సొలసి రాగ నా ప్యాయ త ల్ పొంగ
    తనదు భర్త గాంచి తక్షణం బె
    మంచి మనసు కలిగి మమత తో డ కడు గా
    రాల వండి పెట్టె రమణి రుచిగ

    రిప్లయితొలగించండి
  15. మిత్రులందఱకు నమస్సులు!

    కాలమునందు వర్షములు గాటముగాఁ గుఱియంగ, హర్షముల్
    గ్రాలుచు నుండఁగాఁ, గనులఁ గాంతులు నిండఁగ, సాగుచేయఁగాఁ,
    జేలనుఁ బండినట్టియు, రుచిం గలిగించెడి, నాణ్యమైనవౌ
    ప్రాలను వండి పెట్టె, రుచి రంజిలుచుండఁగఁ గాంత ముద్దుగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      రాలను ప్రాలుగా చేసిన మీ పూరణ వివిధ్యంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  16. వంటఁజేయువేళ పైట క్రిందికి జార
    కొప్పులోని విరులు గుప్పుమనచు
    వలపు తలపు పండి ప్రక్కకు జలజల
    రాల,వండిపెట్టె రమణి రుచిగ

    రిప్లయితొలగించండి
  17. అతిథి యరుగు దెంచ నత్యంత నమ్రయై
    దైవ మంచు దలచి తడయకుండ
    మాటలాడి యపుడు మమతానురాగాలు
    రాల, వండి పెట్టె రమణి రుచిగ.

    రిప్లయితొలగించండి
  18. (2)
    బోయఁ డొక్కఁ డడవిఁ బోయియు, వేఁటాడి,
    తెచ్చెఁ బారువముల నిచ్చతోడ;
    నంత నతని మెచ్చి, నగుమోముతోఁ బావు
    రాల వండి పెట్టె, రమణి రుచిగ!

    రిప్లయితొలగించండి
  19. ఆలికి బ్రేమతో మగడె యందము చిందెడి పట్టు చీరయే
    మేలగు రీతినిన్ గొనియు మెచ్చెడి వైఖరి కానుకీయగన్
    దూలుచు సంబరమ్ముగను తొయ్యలి యాతని కిష్టమైన కా
    "రాలను వండి పెట్టె రుచి రంజిలుచుండఁగఁ గాంత ముద్దుగన్"
    ****)()(****
    (కారాలు = మణుగుబూలు; మురుకులు ; బూరెలు)

    రిప్లయితొలగించండి
  20. ఉత్పలమాల
    వేళకు నన్నికార్యముల వెంటనె జేయుచు తోడునీడయౌ
    యాలికి నేడు జన్మదిన మంచును భర్తయె పూని బాస్మతీ
    ప్రాలను వండి పెట్టె! రుచి రంజిలుచుండఁగఁ గాంత ముద్దుగన్
    వాలుచు కౌగిటన్ మురిసి పంచె భుజించఁగ ముద్ద జేయుచున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, సరసంగా ఉన్నది. అభినందనలు.
      'ముద్దు జేయుచున్' టైపాటు.

      తొలగించండి
    2. గురుదేవులకు ప్రణామములు. ముద్ద జేయుచున్ అనే వ్రాశాను సర్. సమస్యాపాదములో ముద్దుగన్ అని ముందే వచ్చింది, సర్. పరిశీలించ మనవి.

      తొలగించండి
    3. 'ముద్ద జేయుచున్' అంటే? దానికి అన్వయం?

      తొలగించండి
    4. వండిన పదార్థాన్ని భర్తకు కూడాతినడానికి ముద్ద జేసి పంచిన దను భావము సర్

      తొలగించండి
  21. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,

    వాల c గృపాకటాక్షణము భక్తజనావళి పైన , సర్వ వి

    ఘ్నాలను ద్రుంచి శీఘ్రముగ గాచెడు సామివి నీ వటంచు , నుం

    డ్రాలను వండి పెట్టె > రుచి రంజిలు చుండగ కాంత - ముద్దుగన్ |

    " వాలుగ కంటి ! యన్ని సదనమ్ముల యం దివె మెక్కితి జీర్ణమౌ నొకో !

    చాలును పెట్టు మన్నమును చా " రని బొజ్జ గురుం డనెం గదా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కటాక్షము'ను 'కటాక్షణము' అన్నారు. అక్కడ "కటాక్షములు" అనండి. నాల్గవ పాదంలో గణదోషం. 'యం దివె' తొలగించండి. సరిపోతుంది.

      తొలగించండి
    2. గురువు గారికి నమస్సులు . మీరు సూచించిన‌ సవరణలతో పద్యము

      మల్లి పంపించాను .

      తొలగించండి
  23. ఓ బొజ్జ గణపయ్య!

    వేళది వచ్చెగా మురిసి వేకువ జామున లేపునట్టిదౌ
    మేలుగ పూజ చేయుటకు మెండుగ పత్రియు పూలమాలలున్
    పాలును పంచదారయును పండ్లును గారెలు వేడివేడి యుం
    డ్రాలను వండి పెట్టె రుచి రంజిలుచుండఁగఁ గాంత ముద్దుగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరూ నేనూ ఉండ్రాల గణపతిని తలచుకోవడం కాకతాళీయమే! సంతోషం!😀

      తొలగించండి
    2. సార్! గులక రాయీ, కొండా రెండునూ ఒకే వస్తువు

      🙏🙏🙏

      తొలగించండి
    3. నా ఉండ్రాలలో అన్వయం ఎగిరింది... చూసుకోలేదు :(

      తొలగించండి
    4. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ ఉండ్రాల పూరణ బాగున్నది. అభినందనలు.
      "లేపునట్టిదై..." ఆనండి.

      తొలగించండి
  24. మిత్రులందఱకు నమస్సులు!

    (3)
    నేలకుఁ దెచ్చె మోదము గణేశ చతుర్థియె; మానవుల్ దగన్
    బాల గణేశునిన్ మదినిఁ బ్రార్థనఁ జేయుచునుండ, నొక్కరుం
    డాలయమందునుండిన గణాధిపుఁ గొల్తు ననంగఁ, దాను నుం
    డ్రాలను వండి పెట్టె, రుచి రంజిలుచుండఁగఁ గాంత ముద్దుగన్!

    రిప్లయితొలగించండి
  25. ఏమి చేయఁ దీరు నీ ఋణము సెపుమ
    మరువఁ జాల నేను మగువ వంట
    పంచ భక్ష్య భరిత పరమాన్నమును ముద్ద
    రాల! వండి పెట్టె రమణి రుచిగ


    చాలునె యింటి వంటలకు సద్గణ సంకలి తాన్న శాలలన్
    మేలుగ వండ నెన్నఁడును నేర్పున వ్యర్థపు మాట లేటికిన్
    బేలయు ముద్దరాలు కడుఁ బ్రీతిని,బియ్యము నందు నేఱి తా
    రాలను, వండి పెట్టె రుచి రంజిలు చుండఁగఁ గాంత ముద్దుగన్

    [సద్గణ సంకలి తాన్న శాలలు = నక్షత్ర సముదాయము తో గూడిన భోజన శాలలు; సత్ = నక్షత్రము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      ముద్దరాలను సంబోధించిన మొదటి పూరణ, రాలను ఏరిన రెండవ పూరణ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  26. నాకు వలదు బోజనంబు నిపుడు జవ
    "రాల, వండి పెట్టె రమణి రుచిగ",
    జాంబవతి గివమున సవతి రుక్మిణి తన
    వలపు నంత కూర్చి చెలిమి తోడ
    శ్రీకృష్ణుడు సత్య భామ ఇంటిలో భోజనము వలదని చెప్పు సందర్భము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ జవరాలి పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  27. మూలపు దైవమున్ గొలువ ముందగు పండుగ సందడించగా
    మేలగు మట్టిదౌ ప్రతిమ మెండుగ పూవులు పత్రితోడుతన్
    బాలలు బాలికల్ గలసి భక్తిని వేడ్క పఠింపగాను మం
    త్రాలను, వండిపెట్టె రుచిరంజిలు చుండగ కాంత ముద్దుగన్!

    రిప్లయితొలగించండి
  28. ప్రాణనాథు డడుగ పలహార మును గూర్చి
    త్వరితముగను చేయ తలచి వంట
    మగనిని కడుఁ బ్రేమ మన్నించి పులి బొంగ
    రాల వండి పెట్టె రమణి రుచిగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అబ్భ! పులిబొంగరాలు! ఇంకో రెండు వారాలు ఆగాలి నేను :)

      తొలగించండి
    2. అన్నపరెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పులిబొంగరాలు' అంటే ఏమిటి? నాకు తెలియదు.

      తొలగించండి
    3. పులిపొంగరము, పులిబొంగరము : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 Report an error about this Word-Meaning గ్రంథసంకేత వివరణ పట్టిక
      వి.
      పులిసిన పిండితో కాల్చిన తినుబండారము.

      తొలగించండి
  29. గున్నమావి చెట్టు కొమ్మన కాయలు
    రాల ,వండిపెట్టె రమణి రుచిగ
    పప్పు నావకాయ పచ్చడి, పులిహోర
    అన్నమందు దినగ నమృతసమము!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి, మామిడి కాయ పులిహోర (మా ఆవిడ చేసేది!) ... రుచికరమైన పూరణ మీది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారు.....

      తొలగించండి



  30. అ.వె:పర్వమొచ్చె ననుచు పలురకములయిన

          పిండి వంటలెల్ల  ప్రేమతోడ

         వండి కొత్త చింతపండుతోడపులిహో

         రాల వండి పెట్టె రమణి రుచిగ.


    వాన వచ్చు వేళ భర్తయు నడుగంగ

    కాదు కూడదనక కమ్మగాను

    వేడి వేడి మిరప బజ్జీలతో మరమ

    రాల వండి పెట్టె రమణి రుచిగ.


    ఒక్కపొద్దు నేడు నుపవాసమనుచును

    వంట చేయ కుండ వడిగ తాను

     అత్తమామలకట   పలురకాల ఫలహా

    రాల వండి పెట్టె రమణి రుచిగ.



    చాలిక వద్దనన్ వినక చక్కగ నాకలి దీర్చగా మదిన్

    కాలిన మొక్కజొన్నలకు కమ్మగ నుప్పును పూయుచున్ త్వరన్

    గోలుగ పిండిముద్దలను గొట్టము నందున నుంచి బూంది కా

    రాలను వండి పెట్టె రుచి రంజిలుచుండఁగఁ గాంత ముద్దుగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'వచ్చె'ను 'ఒచ్చె' అన్నారు. అక్కడ "పండుగ దినమంచు..." అనండి.

      తొలగించండి
  31. పెళ్ళిన వంతులాటలను పెండ్లికుమారుడు పెండ్లికూ తురున్
    బ్రాలను బోసుకోగ దలఁ రాలిన గింజల జాకలంతనే
    చేలము నందు గట్టుకొని చేర్చె దనింటికి; నేర్పుగా తలం
    "బ్రాలను వండి పెట్టె రుచి రంజిలుచుండఁగఁ గాంత ముద్దుగన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పెళ్ళిని" అనండి. అలాగే "...బ్రాలను పోసికొంచు.." ఆనండి. 'పోసుకోగ' అన్నది సాధువు కాదు.

      తొలగించండి
  32. క్రొవ్విడి వెంకట రాజారావు:

    హేలను పంచునట్టిదగు నీయరుణోదయ సప్తమిన్నెసన్
    హేలి కుపాస్తి గూర్చుచు సహేతుకమౌ శ్రధనమ్ము నేచుచున్
    వాలకమైన పధ్ధతిని ప్రాగ్యనివేదనకంచు పాలలో
    ప్రాలను వండిపెట్టె రుచి రంజిలు చుండగ గాంత ముద్దుగన్

    (అరుణోదయసప్తమి= రధసప్తమి; హేలి= సూర్యభగవానుడు; ప్రాగ్యనివేదన= శ్రేష్టమైన ఆరగింపు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "సప్తమిన్ వెసన్" అనండి.

      తొలగించండి
  33. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తీపి నొల్ల కుండి తిరముగా సతతమ్ము
    ఘాటు ఖాదనమ్ము కాంక్ష చేయు
    పతికి నాటి రాత్రి ప్రణయముప్పొంగ కా
    రాల వండి పెట్టె రమణి రుచిగ

    రిప్లయితొలగించండి
  34. ఆలిని యూరికంపి ప్రియు రాలిని జేరదలంచి ధర్మశా
    స్త్రాలనెఱంగువాడొకడు చంద్రుడు వెన్నెలనీనుచుండగా
    వేలుపు బానిసన్ , భృంగిని గాంచి కణేర తా నొయా
    రాలనువండిపెట్టె రుచిరంజిలు చుండగ గాంత ముద్దుగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. 'కణేర'...? సవరించండి.

      తొలగించండి
  35. మిత్రులందఱకు నమస్సులు!

    (4)
    వేలుపు లందఱన్ మిగులఁ బ్రీతిని జన్నమునందుఁ గొల్వ, మం
    త్రాలను నుచ్చరించుచును, రంజిలఁ జేసెడి పిండివంటలన్
    మాలిమిఁ జేయ నాజ్ఞనిడి, మక్కువ మీఱఁగ వ్రేల్చ నగ్నిహో
    త్రాలను, వండి పెట్టె, రుచి రంజిలుచుండఁగఁ గాంత ముద్దుగన్!

    రిప్లయితొలగించండి
  36. ఔను టైప్ చేయడంలో తొందరపాటు సరిచేస్తున్నాను

    ఆలిని యూరికంపి ప్రియు రాలిని జేరదలంచి ధర్మశా
    స్త్రాలనెఱంగువాడొకడు చంద్రుడు వెన్నెలనీనుచుండగా
    వేలుపు బానిసన్ గలిసె, భృంగిని గాంచి కణేర తా నొయా
    రాలనువండిపెట్టె రుచిరంజిలు చుండగ గాంత ముద్దుగన్

    రిప్లయితొలగించండి
  37. అథితి రాక గాంచి నాప్యాయతల తోడ
    పిండి వంట జతగప్రీతి నింపు
    కార బూంది గాక కోరకనే మర్మ
    రాలవండి పెట్టె రమణి రుచిగ

    రిప్లయితొలగించండి
  38. 13-3-18
    .
    ..సమస్య
    *"రాల వండి పెట్టె రమణి రుచిగ"*

    *ఉగ్గాణి*

    సందర్భము: గద్వాల కర్నూలు ప్రాంతాల్లోని హోటళ్ళలో జానపదులంతా ఉదయం అల్పాహారం(నాష్ట లేదా టిఫిను)గా ఉగ్గాణి దాంతోబాటు మిర్చీ తింటూవుంటారు.
    పప్పులపొడి (పుట్నాలపొడి) చల్లి, ఉల్లిపాయలు తరిగి తయారు చేయబడిన మరమరాల (బొరుగులు)నే ఉగ్గాణి అంటారు. భలే రుచిగా వుంటుంది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "పొద్దు పొద్దున మరి ముద్దుగా *నుగ్గాణి*

    గద్దువాల వారి కతి ప్రియంపు

    నాష్ట" యన్నఁ దెమ్ము నా కంటిని మర మ

    రాల వండి పెట్టె రమణి రుచిగ

    2 వ పూరణము:--

    *ఉగ్గాణి*

    సందర్భము: గద్వాల కర్నూలు ప్రాంతాల్లో ఉగ్గాణినే ఉగ్రాణి అని కూడ అంటారు.
    మిగతా వివరాలకై నా 'పొద్దు పొద్దున' పద్య సందర్భాన్ని చూడవచ్చు.
    ~~~~~~~~~~~~~~~~
    చల్లి పప్పులపొడి,..యుల్లి పాయలఁ జేర్చి,

    పోపుఁ జేసినట్టి బొరుగు లుగ్గు

    రాణి యనుచు మిర్చిలను జేర్చుచు మరమ

    రాల వండి పెట్టె.. రమణి రుచిగ

    3 వ పూరణము:--

    *అతిరసాలు*

    సందర్భము: అరిసెలు లేక అతిరసాలు.. చేసే విధానం. బియ్యం రాత్రి బాగా నానబెట్టి పొద్దున్నే చిల్లుల గిన్నెలో వుంచి (నీళ్ళు పోయేదాకా) వడబోయాలి. మిక్సీలో వేసి పిండి చేసుకోవాలి. కొన్ని నూవులు, కొంత బెల్లం(ముక్కలు చేసుకోవాలి). వేయించడానికి తగినంత నూనె.. యివి కావాలి.
    (మిగతా వివరాలకు యూట్యూబ్ చూడండి.)
    అన్నీ తెచ్చింది మా యావిడ. తీయని అతిరసాలు తినొ చ్చనుకున్నాను. తీరా చూస్తే ఏం బుద్ధి పుట్టిందో గాని ఆఖరికి మరమరాలు రుచిగా వండి పెట్టింది.
    ఆడవాళ్ళ... అర్థాలే వేరులే! అని ఊరికే అన్నారా!
    ~~~~~~~~~~~~~
    రాత్రిఁ దడిసినట్టి ప్రాలఁ జేసిన పిండి,

    కొన్ని తిలలు, గుడము, కొంత నూనె

    తెచ్చె; నతిరసాలు తిననైతిని; మరమ

    రాల వండి పెట్టె రమణి రుచిగ

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    -------------------------------
    ప్రాలు= బియ్యం.. గుడము= బెల్లం

    రిప్లయితొలగించండి
  39. రవీందర్ గారూ,
    మీ పూరణ చీరాలతో అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  40. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,





    సవరించిన పద్యము



    వాల c గృపాకటాక్షములు భక్తజనావళి పైన , సర్వ వి

    ఘ్నాలను ద్రుంచి శీఘ్రముగ గాచెడు సామివి నీ వటంచు , నుం

    డ్రాలను వండి పెట్టె > రుచి రంజిలు చుండగ కాంత - ముద్దుగన్ |

    " వాలుగ కంటి ! యన్ని సదనమ్ముల మెక్కితి జీర్ణమౌ నొకో !

    చాలును పెట్టు మన్నమును చా " రని బొజ్జ గురుం డనెం గదా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురు వర్యా ! " ఉండ్రాలను " ప్రయోగము మొదట చేసినది

      నే నే ననుకుంటా !

      తొలగించండి
    3. మీకంటె ముందు ప్రభాకర శాస్త్రి గారు, గుండు మధుసూదన్ గారు ఉండ్రాల పూరణలు చేసారు.

      తొలగించండి
    4. కాదు సార్! ఆచారిగారివే ప్రథమ "ఉండ్రాలు" 👆

      తొలగించండి

  41. సవరణలతో
    1.పండుగదినమందు పలురకములయిన

    వంటలెల్ల చేసి వాసిగాను

    సెనగపిండి తోడ చేసిన బూందికా

    రాల వండి పెట్టె రమణి రుచిగ.


    2.వాన వచ్చు వేళ భర్తయు నడుగంగ

    కాదు కూడదనక కమ్మగాను

    నుల్లిపాయలేసి యుగ్గరణి మరమ

    రాల వండి పెట్టె రమణి రుచిగ.


    3.ఒక్కపొద్దు నేడు నుపవాసమనుచును

    వంట చేయ కుండ వడిగ తాను

    బంధుజనుల కచట   పలురకాల ఫలహా

    రాల వండి పెట్టె రమణి రుచిగ.

    ఒక్క ప్రొద్దుpermalink
    ఒక్కపొద్దు / ఒక్క ప్రొద్దు : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010    )
    [హిందూ]

    4.చాలిక వద్దనన్ వినక చక్కగ నాకలి దీర్పగా మదిన్

    కాలిన మొక్కజొన్నలకు కమ్మగ నుప్పును పూయుచున్ త్వరన్

    గోలుగ పిండిముద్దలను గొట్టము నందున నుంచి బూంది కా

    రాలను వండి పెట్టె రుచి రంజిలుచుండఁగఁ గాంత ముద్దుగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      సవరించిన మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. ఉమాదేవి గారూ,
      సవరించిన మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  42. ఒక పడతి, అధికారి యొక్క సంతకము కొఱకు భక్ష్యములను వండినదని తెలుపుచూ....

    పాలకులైన వారలకు వాంచితమంతయు నేర్చి కూర్చ గా
    మేలగు రీతి కార్యములమేయముగా నొనరింతురంచు తాఁ
    ప్రాలిమి వీడి నవ్య విధ భక్ష్యము లెల్లను, తాను కోరి చే
    వ్రాలను, వండి పెట్టె రుచి రంజిలుచుండఁగఁ గాంత ముద్దుగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      చేవ్రాల కోసం మీరు చేసిన పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  43. మంచుపడుటవలనమామిడికాయలు
    రాల,వండిపెట్టెరమణిరుచిగ
    పప్పు చేసి పతికి పరమసం తసముగ
    బేవుమనగ తినెను బ్రీతితోడ

    రిప్లయితొలగించండి
  44. చాలని జీతమొందుచును చాకిరి చేయుచు నింటిదాసిగా
    కూలికి పెండ్లి నొప్పుకొని కూరిమి మీరగ జౌరుకొన్నవౌ
    రాలిన పళ్ళెమందులవి లంకెల బిందెల బస్మతీ తలం
    బ్రాలను వండి పెట్టె రుచి రంజిలుచుండఁగఁ గాంత ముద్దుగన్

    రిప్లయితొలగించండి