19, మార్చి 2018, సోమవారం

సమస్య - 2627 (పతినే మనసార నమ్మి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతినే మనసార నమ్మి బాధల నొందెన్"
(లేదా...)
"పతినే నమ్మి మనమ్మునందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వియై"
(డా. జి.ఎమ్. రామశర్మ గారి 'శతావధాన వైజయంతి' గ్రంథం నుండి)

87 కామెంట్‌లు:

  1. అతివలు కోరుచు నిరతము
    గతమును మరపించు వింత కలలను గాంచున్
    వెతలను నూహను తలచక
    పతినే మనసార నమ్మి బాధల నొందెన్
    -----------------------------
    పతివ్రత యనుపేరు పొందిన
    మతిలేని యుగము లందు మానిను లంతా
    గతిలేని జీవితమ్మును
    పతినే మనసార నమ్మి బాధల నొందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. "పతిదేవతలై యుండిన... మానినులెల్లన్" అనండి.

      తొలగించండి
    2. పతిదే వతలై యుండిన
      మతిలేని యుగము లందు మానిను ల్లెల్లన్
      గతిలేని జీవితమ్మును
      పతినే మనసార నమ్మి బాధల నొందెన్

      తొలగించండి
  2. మితిమీరన్ తగ నంతివాస సుఖముల్ మేలౌనె?ధర్మంబు నా
    పతి వెంటన్ వనసీమకేగుటని తా భావించె పూతాత్మ స
    న్మతితో,జానకి తండ్రి గౌరవము నెన్నన్ నిల్పెగా దీక్షతో!
    పతినే నమ్మి మనమ్మునందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వియై

    రిప్లయితొలగించండి
  3. మతిలో రాముని తలచుచు
    నతిభక్తిని ప్రభుత ధనము నర్పణ చేయన్
    జతపడెను జైలు సీతా
    పతినే మనసార నమ్మి బాధల నొందెన్

    రిప్లయితొలగించండి
  4. గుఱ్ఱం జనార్దన రావు గారి పూరణ....


    మితి మీరిన విశ్వాసము
    వెతల కతమనుచు నెఱుగక వెఱ్ఱిగ మఱియా

    యతివయె దుష్టుడు వెంకట
    "పతినే మనసార నమ్మి బాధల నొందెన్"

    రిప్లయితొలగించండి
  5. హితమును తెలియని వయసున
    నతివయె పెండ్లాడి వరుని హైందవ రీతిన్
    సతియై ప్రధాన మంత్రికి
    పతినే మనసార నమ్మి బాధల నొందెన్

    రిప్లయితొలగించండి
  6. గతమే జేసిన పాపమంచు మదినే గాఢంబు గానమ్ము చున్
    గతమే దైనను ప్రేమ కోసమని వైదర్భే మదిన్ కోరగా
    సతిగా ధర్మమ టంచుతా వెడలి కాసారం బునన్ జేరెనే
    పతినే నమ్మి మనమ్మునందు సతమున్ బాధల్ వడెన్ సాద్వియై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వైదర్భి+ఏ = వైదర్భియే" అవుతుంది. అక్కడ సంధి లేదు.
      'కాసారమును చేరడం'...?

      తొలగించండి
    2. నమస్కారములు
      నలుడు జూదంలో ఓడిపోతే దమయంతి భర్తతో సహా అడవికి వెడుతుంది కదా

      తొలగించండి
    3. కాని 'కాసార' మంటే కొలను. అడవి కాదు కదా!

      తొలగించండి
  7. మతిలోరామునిపైనఁ బ్రేమము సదా మత్తున్ బడన్ ద్రోయగా
    గతినీవేయని నిచ్చగొల్చుచును, యాగర్వాందు డౌ రావణున్
    ధృతితోనిత్యము ధిక్కరించుచును, ఖైదీయై వనమ్మందు భూ
    పతినే నమ్మి మనమ్మునందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వియై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కొల్చుచును + ఆ' అన్నపుడు యడాగమం రాదు. అక్కడ "...గొల్చుచును దుర్గర్వాంధుడౌ" అందామా?

      తొలగించండి
    2. గురువర్యుల సవరణకు ధన్యవాదములు నమస్సులు.

      తొలగించండి
  8. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2627
    భర్తను నమ్మి ఒక సాధ్వి మనసులో కుములుతూ ఎప్పుడూ బాధపడుతూ ఉండేది అని చెప్పడం ఈ సమస్యలోని విశేషం.
    సందర్భం :: మండోదరి తన మాటను భర్తయైన రావణాసురుడు వింటాడని నమ్మి ఓ నాథా! ధర్మంగా ఆలోచించి సీతమ్మను శ్రీరామునికి తిరిగి అప్పజెప్పు. లేకుంటే నీకు మరణం తప్పదు అని చెప్పిన సందర్భం.

    గతి నీవే, పతి నీవె రావణవిభూ ! గైకొమ్ము నా మాట, నీ
    వతి కామమ్మున సీతఁ దెచ్చితివి, నీ యంతున్ గనున్ దాను, నీ
    మతిఁ యోచింపుము ధర్మ మంచు, బలికెన్ మండోదరీనారి, యా
    *పతినే నమ్మి మనమ్ము నందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వియై.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (19-3-2018)

    రిప్లయితొలగించండి
  9. Dr.n.v.n.chary
    మితిమీరి ఖర్చుజేయుచు
    సతతంబునుమందు పొందు సాంగత్య ములన్
    పతితుండయ్యెనతడమర
    పతినే మనసార నమ్మి బాధలనొందెన్
    ఇంద్రుని నమ్మి .........

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    గాంధారి....

    సుతప్రేమన్ బతి , ధర్మమున్ విడువగా , శోకించె దానెంతయున్ ,
    పతి యంధుండని స్వీయనేత్రయుగళిన్ వస్త్రమ్ముతో గప్పి , యం...
    ధ తమో మార్గమ్మున సంచరించు సతి గాంధారిన్ గనన్ నిక్కమే !
    పతినే నమ్మి మనమ్మునందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వి యై !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. అతులిత బలధాముండై
    శితికంఠుఁ ధనుసు విరిచిన శ్రీరఘు రామున్
    సతియై జానకి నిరతము
    పతినే మనసార నమ్మి బాధల నొందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ధనువు విరిచిన" అనండి.

      తొలగించండి
    2. సవరిస్తానండి.....ధన్యవాదాలండి గురువుగారు.

      తొలగించండి
  12. సతతము సత్యగుణవిరా
    జితుడు హరిశ్చంద్ర న్రుపుని శ్రీమతి యగుచున్
    స్మితముఖి చంద్రమతీసతి
    పతినే మనసార నమ్మి బాధల నొందెన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నృపుని'... టైపాటు!

      తొలగించండి
  13. వితరణశీలి యయోధ్యా
    పతి సతతము సత్యమందు పాదుకొనంగన్
    ధృతమతి చంద్రమతియు నిజ
    పతినే మనసారనమ్మి బాధలనొందెన్!

    రిప్లయితొలగించండి
  14. వెతలన్ బడసెను ధరణిజ,
    సతతము ద్రౌపది మెలిగెను సహనము తోడన్,
    అతివ దమయంతి సతతము
    పతినే మనసారనమ్మి బాధల నొందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సహనముతో నా। యతివ..." అనండి. పద్యం మద్యలో అచ్చులు రాకుండా చూడండి.

      తొలగించండి
  15. కందం
    సతతము పరిచారికలున్
    స్థితమై తనర దమయంతి సేవల నుండన్
    గతితప్పగ కానలలో
    పతినే మనసార నమ్మి బాధల నొందెన్

    రిప్లయితొలగించండి
  16. పతియగు రాఘవ నాయుడు
    ప్రతిదినమును మందు కొట్టి పరుషము లాడ
    న్సతియగు లక్ష్మీకాంతము
    పతినే మనసారనమ్మి బాధలనొందెన్

    రిప్లయితొలగించండి
  17. మత్తేభవిక్రీడితము
    పతి ప్రాణమ్ముల పాశమందు గొనఁగన్ పాతంగి, వెంటాడుచున్
    మతిమంతంబుగ ధర్మరాజు మది నేమార్చెన్ సుతున్ గోరుచున్
    క్షితిపై కాలుని గెల్చె భర్తకు పునర్జీవాన సావిత్రి యే!
    పతినే నమ్మి మనమ్మునందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వియై!

    రిప్లయితొలగించండి
  18. స్థితమతి ప్రహ్లాదుడు తన
    పితరునవజ్ఞను సతతము పేరిమితోడన్
    స్తుతిజేయుచు నాలక్ష్మీ
    పతినే మనసారనమ్మి బాధలనొందెన్

    రిప్లయితొలగించండి
  19. మితి లేని మరులు గల
    సతి సావిత్రి కని యముని సై యని వెడలె న్
    వెతలకు వె రు వక తనదౌ
    పతి నే మనసారనమ్మి బాధ ల నొ oదె న్

    రిప్లయితొలగించండి
  20. సతతము సత్యము నాడగ
    నతుల హరిశ్చంద్రుఁడు భువి నాతనికి మహా
    సతియై చంద్రమతి సతము
    పతినే మనసార నమ్మి బాధల నొందెన్


    ధృతిఁ జిత్తమ్మునఁ బూని తర్జనములన్ ధిక్కార దూష్యమ్ములం
    బతి విధ్వంసన వాచ్య భర్జనములన్ బాధింప ఘోరమ్ముగన్
    సతి వైదేహి దశాస్య బంధిత మహచ్చారిత్ర తా లంకలోఁ
    బతినే నమ్మి మనమ్మునందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వియై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు మనోహరంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  21. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,


    సతమున్ సత్యమునే వచించెడు హరిశ్చంద్రుండు , గాధేయు నా

    నతి సామ్రాజ్యమునే త్యజించి నిజ కాంతా యుక్తుడై , యేగె | హా !

    సతియౌ చంద్రమతీ లలామ కడు క్లేశం బందె దాస్యాన ‌ | లో

    హిత పుత్రు‌న్ భుజగమ్ము కాటిడగ దుఃఖించెన్ | బవిత్రాత్మ యై

    పతినే నమ్మి మనంబు నందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వి యై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  22. తరిగొండ వెంగమాంబ

    బ్రతుకే నిండగు భక్తికిన్ నుపమ గాభారమ్ము శ్రీవారిదై
    సతమున్ కీర్తనజేయుచున్ తెగువతో సంకోచమున్నెంచకే
    పతిగా నెంచగ వేంకటేశుమది సౌభాగ్యమ్ముతో నారమా
    పతినే నమ్మి మనమ్మునందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వియై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భక్తికే యుపమగా...సంకోచమే యెంచకే..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరించెదను!

      తొలగించండి
    3. బ్రతుకే నిండగు భక్తికంకితము
      గాభారమ్ము శ్రీవారిదై
      సతమున్ కీర్తనజేయుచున్ తెగువతో సంకోచమేలేకయే
      పతిగా నెంచగ వేంకటేశుమది సౌభాగ్యమ్ముతో నారమా
      పతినే నమ్మి మనమ్మునందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వియై!

      తొలగించండి

  23. ...సమస్య
    పతినే నమ్మి మనమ్మునందు సతమున్
    బాధల్ వడెన్ సాధ్వియై

    సందర్భము: మారుతి అశోకవనంలో సీతను చూడగలిగినాడు. రాముడు గుర్తించే ఆనవాలేదైనా యిమ్మన్నాడు. ఆమె బాష్ప ప్రగ్రథితాక్షరమైన వచనము నిట్లు పలికినది రామునితో చెబుతున్నట్టుగా..
    "ఎంతో రమ్యమైన చిత్రకూట పర్వత సమీపంలో ఒకనాడు నీటిలో విహరించి వచ్చి నీవు నా వద్ద కూర్చుంటివి. ఒక కాకి మాంసం కోసం నన్ను పొడిచింది. మట్టి బెడ్డలతో అదలించినా మాటిమాటికి అలాగే పీడించింది. నే నెంతో కంగారు పడిపోయాను. కినుకతో లోలోపలే యేడుస్తున్న నన్ను నీవు ఓదార్చినావు."
    సీత మళ్ళీ ఇలా చెప్పింది. " అప్పుడు నేను అలసిపోయి రాముని ఒడిలో చాలాసేపు నిద్రించినాను. పిమ్మట రాముడునూ నా తొడమీద నిద్రించినాడు. కాకి మళ్ళీ వచ్చి నా పాలిండ్ల నడుమ చీల్చసాగింది. బాధతో రాముని మేల్కొలిపినాను. రాముడు ఎంతో కోపంతో కాకిని చూశాడు. అది దేవేంద్రుని పుత్రు డట!
    రాముడు వెంటనే ఒక గడ్డిపోచ తీసుకొని బ్రహ్మాస్త్రా న్నభిమంత్రించి వదలినాడు. అది ముల్లోకాలూ తిరిగి రక్షణ దొరకక రాముని వద్దకే వచ్చి శరణు వేడగా జాలిపడినాడు. బ్రహ్మాస్త్రం వ్యర్థం కారా దంటే ఆ కాకి తన కుడి కన్నును సమర్పించి ప్రాణం దక్కించుకున్నది.
    బాధించిన కాకి మీదనే బ్రహ్మాస్త్రం వేసినాడే! నన్నే అపహరించిన వాణ్ణి యింతగా క్షమిస్తున్నా డేమిటి?
    *సురాణా మపి దుర్ధర్షౌ*
    *కిమర్థం మా ముపేక్షతః*.. దేవతలకు సైతం ఎదిరింప శక్యం కాని వారై యుండికూడ ఎందుకొరకు ఉపేక్షిస్తున్నారో కదా!"
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ధృత కోదండుడు రామ చంద్రుడు వెసన్
    దీక్ష్ణంబు బ్రహ్మాస్త్రమున్
    కృత పాపుం డగు, శక్ర సూను డగు కా
    కిన్ గూల్ప సంధించె, నా
    తత శౌర్యుం డిపు డేల రా డనుచు సీ
    తా మాత శోకించెడిన్..
    పతినే నమ్మి మనమ్మునందు సతమున్
    బాధల్ వడెన్ సాధ్వియై

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  24. కతియావారున వైష్ణవంబునను తా కస్తూరియై పుట్టగా
    పుతలీబాయికి ముద్దుకోడలుగ నాపుత్రుండు పెండ్లాడగా
    సతియై గాంధికి తోడునీడగను తా సత్యాగ్రహమ్మున్; తథా
    పతినే నమ్మి మనమ్మునందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వియై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కంది శంకరయ్య సారు:

      ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *"సత్యాగ్రహారంభుడౌ। పతినే..."* అనండి. బాగుంటుంది.

      తొలగించండి
    2. శాస్త్రి గారూ,
      సమీక్షించే శ్రమను కూడా తప్పించారు. ధన్యవాదాలు!

      తొలగించండి
  25. గురుమూర్తి ఆచారి


    ధ న్య వా ద ము లు గు రు దే వా !


    రిప్లయితొలగించండి
  26. పతియే దైవంబిలలో
    సతికని పెద్దలు నుడువగ సతతము వినుచున్
    సతివినుచును జూదరి యౌ
    పతినే మనసార నమ్మి బాధల నొందెన్.

    మితిమీరి తాగి తిరుగుచు
    పతికొట్టుచు సతతము బాధల నిడ నే
    గతిగానక తానిలలో
    పతినే మనసార నమ్మి బాధల నొందెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. వాట్సప్‍లో సవరణ సూచించాను.

      తొలగించండి
  27. గతమౌ గాథలె గావుగావినగ నాగార్హస్థ్య ధర్మంబునన్
    సతియే యెంచగ దిక్కుగా వరుని సంస్కారంబు తోడవ్వగా
    పతియౌ ముష్కరు దౌష్ట్యమున్ సయిచి స్వాపత్యమ్ము మేల్గోరుచున్
    పతినే నమ్మి మనమ్మునందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వియై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవ్వగా' అన్నది సాధువు కాదు. "తోడై చనన్" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువర్యా! సవరించెదను!🙏🙏🙏🙏

      తొలగించండి
  28. సతతము రోగిష్ఠి పతియె
    వెతలను మరి బెట్టుచున్న వినయము తోడన్
    హితముగ సేవించి సుమతి
    పతినే మనసార నమ్మి బాధల నొందెన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      సుమతీ ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  29. శృతికటుయత్త‌‌మామలు
    హితమునువిడనాడి.జె్యు-హి్నతలందున్
    అతిగా కట్నంబొసగిన
    పతినేమనసార-నమి్బాధలుబొందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "శృతి కటుల నత్తమామలు" అనండి.
      టైపాట్లు ఎక్కువగా ఉన్నవి.
      'అందున్ అతిగా' అని విసంధిగా వ్రాయరాదు. "హీనతలన్ తా" మతిగా..." అనండి.

      తొలగించండి
  30. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సతియగు తననొడిచిన విం
    శతి బాహుని మాటలెల్ల సహనము తోడన్
    వ్యతిరేకించుచు జానకి
    పతినే మనసార నమ్మి బాధల నొందెన్

    రిప్లయితొలగించండి
  31. మితి లేని రోగ మియ్యది
    బ్రతుకుట కష్టమ్మనంగ భయపడి యిచ్చెన్
    సతి లక్ష వెజ్జు కల్లో
    పతినే మనసార నమ్మి బాధల నొందెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      అల్లోపతితో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  32. మిత్రులందఱకు నమస్సులు!

    ప్రతినన్ నిల్పుకొనంగ భర్త, పదవీ ప్రాదేశనమ్మొందఁగా,
    సతియౌటన్, హితమెంచి, పాఱున కుపస్థాతృత్వముం జేయునా
    నతిఁ దాఁ బూనఁగఁ, బుల్కసున్ గొలిచెరా! యాహా! హరిశ్చంద్రుఁ! డా
    పతినే నమ్మి, మనమ్మునందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వియై!

    రిప్లయితొలగించండి
  33. 19-3-18
    .......సమస్య
    పతినే మనసార నమ్మి బాధల నొందెన్

    సందర్భము: అసుర పతి యైన హిరణ్య కశిపుని తనయుడు ప్రహ్లాదుడు. అతడు శ్రీ పతినే మనసార నమ్మినాడు. తన గతిగా.. పతిగా.. పితగా.. జననిగా.. సఖునిగా.. గురునిగా.. దైవంగా.. ఒకటేమిటి.. సర్వస్వంగా భావించినాడు. ధ్యానించినాడు. అంతరాత్మ లో ఎంతో ఆనందానుభూతి చెందినాడు. శారీరకమైన బాధల నెన్నింటినో తండ్రివల్ల అనుభవించినాడు.
    (ఆ ఆనందానుభూతి ఈ బాధలకన్న ఎంతో గొప్పది కాబట్టి వాళ్ళ కీ బాధలు కష్టము లనిపించవు.)

    ఎక్కువమటుకు లఘువులతోనే కూర్చబడిన పద్యం. వృత్యనుప్రాస.. (త)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    అత డసుర పతికి తనయుడు..

    గతి, పతి, పిత, జననియు, జత గాడు,
    గురుడు, దై

    వత మని,.. నతుల... నుతుల శ్రీ

    పతినే మనసార నమ్మి
    బాధల నొందెన్

    2 వ పూరణము:---

    సందర్భము: అసుర పతి యైన హిరణ్య కశిపుని తనయుడు ప్రహ్లాదుడు. అతడు శ్రీ పతినే మనసార నమ్మినాడు. సర్వస్వంగా భావించినాడు. ధ్యానించినాడు. అంతరాత్మ లో ఎంతో ఆనందానుభూతి చెందినాడు. శారీరకమైన బాధలెన్నో తండ్రివల్ల కలిగినవి. కాని విష్ణుమూర్తి అవన్నీ తొలగించినాడు.
    (ఆ ఆనందానుభూతి ఈ బాధలకన్న ఎంతో గొప్పది కాబట్టి వాళ్ళ కీ బాధలు కష్టము లనిపించవు.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    వెత లసుర పతి సుతునకును

    పితవలననుఁ గలిగె; విశ్వపిత తొలగించెన్..

    వెతలు తనువునకె యని, శ్రీ

    పతినే మనసార నమ్మి బాధల నొందెన్..

    3 వ పూరణము:--

    సందర్భము: ఒక మహోన్నతమైన ధ్యేయాన్ని సాధించడంలో భారతీయ మహిళ ఎంతో శ్రమ తీసుకుంటుంది. ఎంతో త్యాగం చేస్తుంది. వాటి ముందు శారీరక బాధలు చాలా అల్పమైనవి కాబట్టి ఆమె వాటిని పట్టించుకోనే పట్టించుకోదు.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    పతియే ప్రత్యక్షపు దై

    వత మనునది భారతీయ

    వనితకును మహో

    న్నత మగు ధ్యేయము కావున

    పతినే మనసార నమ్మి బాధల నొందెన్..

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  34. ఔత్సాహిక శంకరాభరణ కవిపతి:👇

    యతిలేనట్టివి తేటగీతములతో యాతన్ను బెట్టించుచున్
    మతిలేనట్టివి కందపద్యములతో మారాము జేయించుచున్
    స్తుతిగా వ్రాసిన సీసపద్యములతో సుత్తిన్ని గొట్టించెడిన్
    పతినే నమ్మి మనమ్మునందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వియై...

    రిప్లయితొలగించండి