21, నవంబర్ 2018, బుధవారం

దత్తపది - 148 (మూఁడు-ఆరు-ఏడు-పది)

మూఁడు - ఆరు - ఏడు - పది
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

91 కామెంట్‌లు:

  1. ద్రౌ*పది*నిఁజూచి రారాజు రాజసమున
    పిల్చె తొడపైకి--*ఆరేడు* పిల్చినంత
    *మూడు*చున్నది మృత్యువు మూర్ఖ!నీకు
    ననుచు పల్కిరి గురులెల్ల కినుకతోడ.

    రిప్లయితొలగించండి

  2. లాహిరి లాహిరి లాహిరి లో ...

    రసపట్డున భగ్నము కూడదు :)


    ఆ రుచి తెలియని వారెవ
    రో? రస పట్టున పదిలుడు రుంకము గనడ
    మ్మా! రత గురువయ్యేడు క
    దా! రుక్మిణి! ఆరుమూడు తప్పు! పదపదా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 😁👌🏻🙏🏻💐

      రుంకము
      రత
      ఆరుమూడు
      ఇవేవీ నాకు తెలియవు. జై ఆంధ్రభారతీ!

      నేటి దత్తపదికి జీపీయసువారేమంటారో...నాలాగే ఊరకుంటారో!!
      😃

      తొలగించండి

    2. రత అంటే అర్థం మారి పోవచ్చు :)
      అసలే మీరు బ్యాచులరన్నారు :)

      రతగురువయ్యేడు ఒక పదం గా చదవండి :)


      జిలేబి

      తొలగించండి
    3. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అయ్యేడు' అన్నది వ్వావహారికం కదా?

      తొలగించండి


  3. ( అభిమన్యు వియోగవిహ్వలక్రోధహృదయుడైన
    అర్జునుడు సంగ్రామరంగంలో సైంధవుడితో )

    మూడుకాలము సైంధవ ! మూర్ఖ ! వచ్చె ;
    నట సుభద్రకు శోకాగ్ని యారు నింక ;
    నేడుపన్నది నీ భార్య యెరుగు గాక !
    పదిలమగు నీకు నరకమ్ము బాలహంత !

    రిప్లయితొలగించండి
  4. ఏడుగడ యైన సత్యయె
    చూడగ పుత్రుని వధించె చోద్యము గాదే
    వేడుక గాదట యారును
    మూడుడు నరకుని గాలి పదిలము పూర్తిన్

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    మూడును మృత్యువింక మదమోహములన్ త్యజియింపకున్న , నీ
    తోడుగ కర్ణుడుండినను ., దుర్మతి ! యాశలునారు , వారిలో
    క్రీడియె చాలు,నేడుపది కీడొనరించునసూయ హెచ్చ ., నీ...
    వోడుట యాజిఁ దథ్యము , సుయోధన ! సొంపది సంధి మార్గమే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. నవభారతార్థంలో....

      మూడు.. ఆరు... ఏడు... పది

      కారు చక్రమూడు , కమలమ్ము వాడును ,
      దీపమారు , చచ్చి తేలు చెయ్యి !
      ఏడుపొకటె మిగులు, నిమ్మహినోటరు
      వాడుకొనిన ఓటు పదిలముగను !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  6. ఆరుచి కరపు టాహార మార గించె
    విషము తల కెక్కి భీముడు విధి గ జచ్చు
    ననుచు పదిలముగాను న్న నశని పాత
    పే డు పును గూర్చు వార్త గా భీతి గొలిపె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఐదవ పాదం
      మూఁడు నను కొన్న వారల ముచ్చటుడి గె
      అని సవర ణ చేయడమైనది

      తొలగించండి
    2. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అశనిపాతపు టేడుపు' అన్నది సరియైన ప్రయోగం. 'ముచ్చట + ఉడిగె' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
  7. అదిగో కౌరవసేనపార్థగనుమా యాస్యందనంబందుద్రౌ
    పదివస్త్రాపహరాధ్వరాఖ్యులను బాపంబారుమూడౌను చూ
    డదిగోకర్ణుడుమూడునాతనకి తోడైనిల్చిరాఱేడులున్
    పదిలంబౌననిదైన్యమారు విజయంబౌనేడు గృష్ణుండనెన్

    రిప్లయితొలగించండి
  8. కీడు (మూడు) నిజము కిమ్మనకుండిన
    సుఖము(లారు) తెగులు సోకు నధిప!
    (ఏడు)గడయె లేక ఈ నీ సమూహంబు
    చచ్చు (పది)ల మనియె శార్ఙి సభను.

    రిప్లయితొలగించండి
  9. పదిలంబగుసంధియెపార్థునితో
    కదనంబునమూడునుగర్ణునకున్
    యదుభూషణువాక్కిదియారునిజం
    పదనేడుగడైకురువంశవిభో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ తోటక వృత్త పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  10. పదిలమైనట్టి రాజ్యమ్ము బంచకున్న?
    దలచ?తనరారు సౌఖ్యంబు తల్లడిల్లు!
    మూడు బలమున్ననవినీతి మోజుగాదు
    యుద్దమేడుపుగా మార్చుబుద్దివలదు
    ననుచుకౌరవ సభయందు హరియుదెలిపె

    రిప్లయితొలగించండి
  11. మూడు నీకాయువిప్పుడె మూర్ఖ! వినుమ!
    యాఙ్ఞసేని ద్రౌపది కేశ మంటినావు
    కర్మఫలముగ నీవారు గాంచుచుండ
    త్రాగుదును నీ రుధిరమును త్రాష్ట నేడు
    యేడుగడ లేడిచట నీకు నెంచిచూడ

    రిప్లయితొలగించండి
  12. శ్రీకృష్ణుడు ద్రోవది నోదార్చుట :
    **)()(**
    చావు మూడు దుష్టులకును సమరమందు
    నారు కష్టములన్ని నిరాశ వీడు
    మెల్ల కాలముండదు కదా యేడుపెపుడు
    నూరడిల్లుము ద్రౌపది! యూరడిల్లు!

    రిప్లయితొలగించండి


  13. అహనా పెళ్ళియట! పదిగు
    డహహో లక్ష్మణకుమారుడట!మూడును పో
    తహతహ, నేడుగడయు వెలు
    గు, హడల గా నారుమూడగును పెండ్లియు పో!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశము :: దత్తపది
    ఇచ్చిన పదాలు :: మూడు-ఆరు-ఏడు-పది {అన్యార్థంలో}
    విషయము :: భారతార్థం
    ఛందస్సు :: నచ్చిన ఛందస్సు ఏదైనా
    సందర్భం :: శకునిమామతో మంతనాలాడిన ధుర్యోధనుడు ధర్మరాజును మాయజూదానికి పిలువదలచినాడు. “జూదంలో ధర్మరాజు పూర్తిగా ఓడిపోతాడు. పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తూ ప్రాణాలు పోగొట్టుకొంటారు. ఒకవేళ బ్రతికి బట్టకడితే ఒక యేడు అజ్ఞాతవాసం చేయాలి. అప్పుడు వాళ్లను గుర్తుపట్టినట్లయితే మరల వనవాసం అజ్ఞాతవాసం చేస్తారు. అలా వారికి చావు మూడుతుంది. ఇక నేను శాశ్వతంగా ఈ రారాజపీఠాన్ని అధిష్ఠించి తిరుగులేని అధికారంతో సిరిసంపదలతో అలరారుతూ చిరకాలం ఉండగలను” అని సంబరపడుతున్న సందర్భం.

    అదిగో వారికి చావు ‘మూడు’ త్వరలో నాడంగ జూదమ్ము, సం
    పదతో నే నల’రారు’వాడ, వనిలో వారుండినన్ వేగ బా
    యదె ప్రాణ, మ్మొక ‘యేడు’ పాండవులకౌ నజ్ఞాతవాస, మ్మికన్
    ‘పది’లమ్మౌ గద నాదు పీఠ మనుచున్ భావించె రారాజిలన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (21-11-2018)

    రిప్లయితొలగించండి
  15. కీచకుడు ద్రౌపది తో పలికిన పలుకులు

    దివినుంచి ధరణికి దిగినట్టి రంభవా?సొం(పారు) కన్నుల సుధ్యుపాస్య!
    భూ(పది) తోటలో పుట్టిన దానివా? సౌగంధ దేహపు చంద్ర వదన!
    (ఏడు) వసుధ లోన చూడ కుండగ లేడు నీదు సౌoదర్యము నీల వేణి!
    నడు(మూడు) గడుపగ నాదు జీవితము వామనయన !సంధించె మన్మధుoడు
    పూల బాణముల్ నాపైన, పోవు చుంటి
    వేల నన్నువదలి చెలీ, వేడు చుండె
    నిన్ను కీచకుండు ననుచు నిలువ రించె
    సత్య సంధను సువిదల్ల సౌధమందు

    ఏడు = ఏ పురుషుడు, నడుమూడు = కష్టమగు భూపది = మల్లియ సువిదల్లము = అంతపురము


    రిప్లయితొలగించండి
  16. ఈ దత్తపదిని ఆకాశవాణి విజయవాడ కేంద్రం తే15 /05 /1966 దీ
    పూరణమునకై ప్రకటించగా నాడు నేను పూరించినది .
    ఒకటవ పద్యము :-
    తనదు బలమది పదిలము తానె నిత్య
    ము నిజమని యెంచి కాలము మూడు రేడు
    అతిభయంకరుడైదనరారు యర్జు
    నాత్మజుని జంప నేడ్వని యాత్మ గలదె !
    రెండవ పద్యము :-
    కాలము మూడు కౌరవులు కర్ణుని స్నేహము గోరు వారవై
    తాళగ లేక యుద్ధమున దర్పము తో దన రారు వీరు డౌ
    బాలుని యర్జు నాత్మజుని పల్వురు గూడి వధింప ; వార్త చే
    గూలు సుభద్ర ఏడు పది ఘోరము తెల్పగ శక్య మేరికిన్

    నేటి నా పూరణ :-
    పదిల మని నమ్మి తనదగు బలమటంచు
    మూడు కాలము నెరుగని మూఢ రేడు
    భండనమ్మున దనరారు పార్ధుసుతుని
    నెల గూల్చగ నేడుపు నింగినంటె

    నిన్నటి పూరణపై విశ్లేషణకు నా వివరణ :-
    నా పురాణములను నా కుమారుడు సత్యనారాయణ మూర్తి
    మాత్రమే పంపిస్తూ ఉంటాడు . నిన్న పొరపాటున తన మెయిల్ అడ్రస్
    లో కూడా పంపించడం జరిగింది . రెండు పురాణములు నావే .
    అరసున్నా టైపాటు .


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
      'మూఢ రేడు' దుష్టసమాసం.

      తొలగించండి
  17. ప్రాణమూడునుసైంధవా!బాణమునకు
    నేడుగడయదిలేకనీయింతికుములు
    వేతుబాణముకాచుకోపదిలముగను
    రుధిరధారలదనరారువిధిగనొడలు

    రిప్లయితొలగించండి
  18. సవరణ పద్యం
    ఆరుచి కర పు టాహా ర మార గించె
    విషము తలకెక్కి భీముడు విధి గ జచ్చె
    నను సుయోధనుకేడుపు లతి శయింప
    పదిల మగు గొప్ప వ్యూహం పు వల చెడ oగ మూఁడు నను కొన్న యాశ ల మురిప ముడి గె

    రిప్లయితొలగించండి
  19. ఏడువకమ్మా ద్రౌపది!
    మూడెను యట్టి కురు పతుల మౌడ్యముకారున్
    వాడిది దీపము పదిలము
    గా డెందము సంబరపడ గాంతురు జయమున్

    కృష్ణను కృష్ణుడు పరామర్శించుట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మూడెను + అట్టి = మూడెనట్టి' అవుతుంది. యడాగమం రాదు.

      తొలగించండి
  20. భీముని పల్కులు:

    ఏ డుండుకుఁ డేని వడిని
    మూఁడుట నాచేత నిక్కము సుమీ కనుమా
    నేఁడ యసురుఁ డా రుతముల
    తోడఁ బొలియు ద్రౌపది యిటఁ దూర్ణము ధృతినిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇక్కడ ఏ అసురుని గురించి చెప్పారు? కీచకుడు అసురుడు కాడు. "అసురుని వంటి కీచకుడు" అని మీ భావమా?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      వనవాసము చేయు నప్పుడు కామ్యక వనములోఁ గిమ్మీరుని దృష్టిలోఁ బెట్టుకొని వ్రాసినదండి.

      తొలగించండి
  21. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    గురుభ్యో నమః నిన్నటి పూరణ స్వీకరించ ప్రార్థన
    ...................... ............................................



    అమ్మ ! పురమ్మునన్ జరుగు నైదు దినమ్ముల వేడ్క | లందు నా

    ట్య మ్మన నీకు నిష్టము గదా | తొలి నాడె ప్రదర్శనమ్ము | రా

    రమ్మని పిల్చె తండ్రి తొలి రాత్రికి కూతును ప్రేమమీరగన్ |

    సమ్మతి (న్) బిడ్డ వచ్చె గన ". నాట్య కళా మణి " యౌ యల శోభనాయునిన్


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. గు రు మూ ర్తి ఆ చా రి
      ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,

      గురుభ్యో నమః నిన్నటి పూరణ స్వీకరించ ప్రార్థన
      ...................... ............................................



      అమ్మ ! పురమ్మునన్ జరుగు నైదు దినమ్ముల వేడ్క | లందు నా

      ట్య మ్మన నీకు నిష్టము గదా | తొలి నాడె ప్రదర్శనమ్ము | రా

      రమ్మని పిల్చె తండ్రి తొలి రాత్రికి కూతును ప్రేమమీరగన్ |

      సమ్మతి (న్) బిడ్డ వచ్చె గన ". నాట్య మయూరిని " శోభనాయునిన్


      ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

      తొలగించండి
  22. డా.పిట్టా సత్యనారాయణ
    (ఒక బాలకు మహాభారత కథను వినిపిస్తున్నప్పుడు ఆమె దుఃఖిస్తుండగా ఆమె తాతయ్య ఆమెనోదార్చు సందర్భము)
    ఏడుపది యెందుకమ్మ!నీ యీడు కిపుడు
    మూడు కౌరవులకు ముప్పు మోహరమున
    కన్నుగానని ఖలులకు కలుగు కీడు
    ఆరు నీ దుఃఖ మప్పు డయారె బాల!!

    రిప్లయితొలగించండి
  23. ద్రౌ 'పది' ని జుట్టుబట్టి సదసునకీడ్చ
    నామె 'యేడు' పు వినినంత నార్తినొంది
    రొప్పు భీముని 'యారు' ద్ర రూపు గాంచి
    బతుకు 'మూడు' టెరిగె కౌరవాధముండు

    రిప్లయితొలగించండి
  24. అవమాన భారంతో యేడ్చుచున్న ద్రౌపదిని సహదేవుడోదారుస్తున్నట్టుగా నూహించిన పద్యము

    చూడు మారుద్రుడొసగెను క్రీడిఁ మెచ్చి
    పాశుపతముండ బాధింక పడగనేల?
    యేడు పేలనో ద్రౌపది యిదియె నిజము
    మూడు కౌరవులకు చావు మొగ్గరమున.

    రిప్లయితొలగించండి
  25. ఆటవిడుపు సరద పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ఉత్తరుడు: 👇

    మూడెన్ నాకిట యుద్ధరంగమున నే మూర్ఛిల్ల బోవంగ నా
    నాడుల్ జారుచు బిక్కచచ్చి తడిదౌ నారంగ నా గొంతహో
    చూడన్ నేనిట యేడుపొచ్చి పదివేల్ శోభిల్లెడిన్ కౌరవుల్
    వీడన్ శాంతిట నా మనమ్ము పదిలం బేరీతి వొందున్నయా!

    మూడు ("మూడెన్")
    ఆరు ("నారం")
    ఏడు ("యేడు")
    పది ("పదిలం)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఏరీతి బొందున్నయా' అనండి.

      తొలగించండి
  26. మూడు,కౌరవులకు ముప్పు వచ్చుననుచు
    ద్రౌపది కురులారు దారి దొరుకు
    ఏడుపెవరికుండదింక వినుడు కృష్ణ
    రాయబారమనిన రాజసమ్మె!!

    **సంధి కార్యమున పాండవులు కృష్ణునితో
    శాంతి వచనములు పలికినపుడు ద్రౌపది ఆందోళన చెందగా అప్పుడే అక్కడికి వచ్చిన నారదుడు పాండవులతో పలికిన సందర్భం:

    రిప్లయితొలగించండి
  27. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తే.గీ.
    (ఆరు)దూఱుచు రారాజు యా సదమున
    ద్రౌ(పది) వలువ లూడ్చెడి తలపు సేయ
    (ఏడు)గడ యౌచు గోపాలు డెలమి తోడ
    చెల్లెలకు (మూడు) పీడను జీర్ణపఱచె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రారాజు + ఆ' అన్నపుడు యడాగమం రాదు. "రారాజె యా..." అనండి.

      తొలగించండి
    2. గురువు గారికి నమస్కారములు. మీ సూచనను గమనించినాను.

      తొలగించండి
  28. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ....

    మూడు ను జావు నిక్కమిది పొంగకు మోరి సుయేధనా నినున్
    వీడను నీవు ద్రౌపది వి భీష్ముడు పెద్దలు నడ్డగించినన్
    మూఢుడ చీర లిప్పగను బూనితి వారుష నాకు తగ్గు నా
    యేడును ధూర్త నీ మరణ మెల్లరు గాంచియు సంతసించినన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుయోధనా' టైపాటు!

      తొలగించండి
  29. సోదరునికి కాలము మూడుచున్న దేమి!
    తమ్ముడ! తగదా రుచిరాంగి తలపు లింక,
    పదిలమౌ నీ బ్రతుకు నేల పాతి పెట్ట!
    పరసతిని గోర యేడుపే పరి హసించు!
    (విరాట రాజు భార్య సుధేష్ణ తమ్ముడు కీచకుని ఈ విధంగా మందలించిందన్న ఊహ)

    రిప్లయితొలగించండి
  30. రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి శంకరాభరణ విద్వన్మండలికి వందనములు. శ్రీ నారాయణభట్టతిరి ప్రణీతము శ్రీమన్నారాయణీయము (భాగవత సారము) నాంధ్రీకరించ బూని మీ యాశీస్సుల నపేక్షించి మొదటి పద్యమును ప్రచురించు చున్నాను.
      మూలములో నన్నియు స్రగ్ధరా వృత్తములో నున్నవి.


      శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము
      (మూలము: శ్రీనారాయణభట్టతిరి కృతము)
      ప్రథమ స్కంధము
      దశకము. 1


      మ.
      గురువాయ్వాఖ్య పురమ్ము నందలి ప్రజా కూటంపు భాగ్యం బహో
      కర మానంద సుబోధక ప్రవరునిం గాలస్థ లాతీతునిన్
      వర నిస్తుల్యుని నిత్యముక్తుని ధరం బ్రాఁబల్కు దండమ్ములే
      యరయ న్నేరని బ్రహ్మతత్త్వుఁ బురుషార్థాలి ప్రదున్ నిత్యునిన్ 1.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మనోహరంగా ఉంది ప్రారంభ పద్యం. శుభాకాంక్షలు!

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి


  31. ఈ వారపు ఆకాశవాణి సమస్య యే మి టి ?



    జిలేబి

    రిప్లయితొలగించండి

  32. ద్రౌపది కౌరవునితో

    మూడు నాయు వింక మూర్ఖ దుశ్శాసనా
    మాకు నేడుగడగ మమత పంచు
    చనవరతము కాచు నారుక్మిణీశుడు
    వదలక పతి చంపు పదిలముగను.

    రిప్లయితొలగించండి
  33. మూడు నూకలు భువిపైన నేడు నీకు
    ఆరు నీయింటి లో దీప మర్భకుండ
    ఏడు నిన్ను రక్షించు వాడీపుడమిని
    ద్రౌపది యభీష్టముఁ దీర్తు తప్పకుండ

    రిప్లయితొలగించండి
  34. కీచకునితో అక్క సుధేష్ణ పలుకులు..

    కందము
    మూడును గంధర్వులతో
    నేడుగడలు వారటంచు నెరిగించెనయా!
    కీడొనరు నారుబయటన్
    పాడియె గాని పని నీకు పదిలమ్మైట్లౌ?

    రిప్లయితొలగించండి
  35. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂దత్తపది🤷‍♀....................
    *మూఁడు - ఆరు - ఏడు - పది*
    పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
    భారతార్థంలో మీకు నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

    సందర్భము: యుద్ధం రాబోతుంది.. జయాపజయాలు దైవాధీనాలు.. పాండవుల కే ముప్పు వాటిల్లుతుందో!.. అని మథనపడుతున్న కుంతీదేవితో కృష్ణు డిలా అంటున్నాడు.
    "శత్రువులకు కీడు మూడుతుంది. మీ పీడ లన్నీ తొలగిపోతాయి. విలపించే పని లేదు. నీవు చూస్తూ వుండు. అంతా పదిలమే (క్షేమమే) అవుతుంది."

    ఈ పద్యంలో ప్రత్యేకతలు..

    1.ఈరోజు శ్రీ లక్ష్మీ కాంత రాజారావు గారు "ఛందః ప్రకరణము" క్రింద వివరించిన *ఉత్సుకము* అనే వృత్తంలో ఈ పద్యం వ్రాయబడింది.
    ప్రతి పాదంలో భభర గణా లుంటాయి. యతి వుండదు. ప్రాస వుంటుంది.
    2. మరో విశేషాన్ని కూడా ఈ పద్యంలో పొందుపరచడానికి ప్రయత్నించాను. అదే మంటే ఈ పద్యంలో ఏ పాదాన్నైనా ఎన్నవ పాదంగానైనా వాడుకోవచ్చు. అర్థ భంగం వుండదు. అంటే 1వ పాదాన్ని 2వ పాదంగానైనా 3వ పాదంగానైనా 4వ పాదంగానైనా వుంచి చదువుకోవచ్చు. తేడా వుండదు. అలాగే తక్కిన పాదాలు కూడా. అంటే ఏ పాదాన్నైనా.. ఎన్నవ పాదంగానైనా.. మార్చుకోవచ్చు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    *"మూడును కీ డహితాళికిన్*

    *పీడలు మీయవి యారుగా!*

    *ఏడువగాఁ బని లేదుగా!*

    *చూడు మదే పదిలం బగున్!"*

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    21.11.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ ఛందోనైపుణ్యానికి వందనాలు.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి