29, నవంబర్ 2018, గురువారం

దత్తపది - 149 (అల-కల-తల-వల)

అల - కల - తల - వల
పై పదాలను అన్యార్థంలో పాదాదిని ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

128 కామెంట్‌లు:



  1. అలరింపగ రామకథ స
    కల జనుల వినుడు వినుడనగ లవకుశులటన్
    తలచిరి వసుగర్భసుతను
    వలవల కన్నీరుగ ప్రజ వసుధాధిపుకై!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 👌🏻👌🏻🙏🏻💐
      నిన్న నేను జీపీయసు వారు కలుసుకున్నాము.
      మిమ్ములను తలచుకున్నాము.
      😁😁

      తొలగించండి

    2. నమో నమః

      మీరు తలచినారు ! అదే పదివేలు !


      అల హైదరబాదున భళి
      కలకల లాడెడు ప్రొఫెసరు గారిని కలువన్
      తలచితిమి జిలేబిని నా
      వల చర్చింతిమి సదనపు పరిబృంహణమున్ :)


      జిలేబి

      తొలగించండి
    3. Zilebi Garu:

      Please check your yahoo mail for pics of our Prince Charming with me and Ishani...

      తొలగించండి

    4. :)

      అల హైదరబాదున భళి
      కలకల లాడెడు ప్రొఫెసరు గారిని కలువన్
      తలచితిమి జిలేబిని నా
      వల మూడుతరముల సెల్ఫి వారధిగానన్ :)


      జిలేబి

      తొలగించండి
    5. 😄😄😄😄😄😄
      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
      💐💐💐💐💐💐

      తొలగించండి
    6. జిలేబి గారూ,
      మీ పూరణతో ప్రాస్తవిక పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. ఆ.వె.
    అలకల ముదితలను వలయునె యూహింప!
    కథమలుపు తిరిగెను కైకచేత
    దశరథుడడవులకు దాశరథిని పంపె
    సుతుని రాజ్య కాంక్ష శోకమిడెను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని దత్తపదాలను పాదాదిని ఉంచాలన్న నియమాన్ని గమనించినట్టు లేదు.

      తొలగించండి
  3. అల రె డు జానకి యందము
    తలచుచు రాముండు నెత్తె ధనువు ను విరుగన్
    కలవర పడినవి జగము లు
    వలపుల జూపు లు విసిరె ను వైదేహి యు తాన్

    రిప్లయితొలగించండి
  4. అలసటలాకలిదప్పులు
    గలగవుబలయతిబలయను ఘనవిద్యలు భూ
    తలవరసూతిగొనుము గా
    వలయునృపులకనిముని,రఘువరునకొసంగెన్

    రిప్లయితొలగించండి
  5. ( దశరథుని వరద్వయం కోరుతున్న కైకేయి )
    అలకల బోవుచున్న వని
    తాంతరభావ మెరుంగలేకనే
    కలవర మందుచున్న తన
    కాంతుని కైకమ నిర్దయాత్మయై ;
    తలపులు మీరి " నా భరతు
    తక్షణరాట్టుగ ; రామభద్రునిన్
    వలవల యేడ్పు మాని వన
    వాసిగ జేయు " మటంచు గోరెనే !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. బాపూజీ గారూ, నమస్కారములు. మంచి సున్నితమైన సన్నివేశం తీసుకొన్నారు. మీ నాన్న గారు శ్రీ పాపయ్య శాస్త్రి గారు (కరుణశ్రీ) గుర్తుకొచ్చారు.

      తొలగించండి
    2. జంధ్యాల వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    అలవి కానిది కోర దేవాదులైన
    కలత పొందుదురనగ నిక్కమ్ము సుమ్ము !
    తలచె బంగరుజింక సీతమ్మ , దాని
    వలన మగనికి దూరమై వగచెనెంతొ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అలవోక విరిగె ధనువని
      కలత నశింపంగ సీత కన్నులు మెరిసెన్ !
      తలపులు మధురములయ్యెను ,
      వలరాజున్ బోలు రామభద్రుని జూడన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. విభీషణోపదేశం...

      అలవాటైన మహేశ్వరార్చనమునందాసక్తి తగ్గెన్ ., నిశిన్
      కలతన్ నిద్దుర దూరమయ్యె తరుణీకామాతిరేకమ్మునన్ ,
      తలపుల్ పట్టెను ప్రక్కదారి , యిది యే ధర్మమ్మొ ? చింతింప నీ...
      వలనన్ లంకయె దగ్ధమయ్యె , వినుమా ! భద్రమ్మునూహింపుమా !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. అలవాటయ్యును రాజ్యపాలనము నీవన్యాయమౌ రీతి నీ
      కలతన్ మానితివన్న ! లంకయును దగ్ధంబయ్యె , యోచించి చిం...
      తలకున్ కారణమైన సీతననుమానంబింతయున్ లేక ఆ..
      వల శ్రీరామునిఁ జేర్చుమా ! శరణనన్ ప్రాప్తించెడున్ భద్రముల్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


      తొలగించండి
    4. మైలవరపు వారి పూరణలన్నీ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    5. మహాస్రగ్ధర.....

      అలరెన్ వ్యోమమ్మునన్ లోహ విహగమనగా నంజనీసూనుడా రె...
      క్కల లీలన్ బాహుదండోత్కట యుగమమరెన్ గాంచ భీతావహంబై ,
      తలపన్ వాలమ్మునూగెన్ గరుడ నఖ విముక్తాహి రూపమ్మునందున్
      వలయంబైనగ్నికీలల్ వరలిన గతిగా వార్ధి లంఘించుచుండెన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    6. చిరు సవరణ 🙏

      మహాస్రగ్ధర.....

      అలరెన్ వ్యోమమ్మునన్ లోహ విహగమనగా నంజనీసూనుడా రె...
      క్కల లీలన్ బాహుదండోత్కట యుగమమరెన్ గాంచ భీతావహంబై ,
      తలపన్ వాలమ్మునూగెన్ దనర గరుడ ముక్తాహి రూపమ్మునందున్
      వలయంబైనగ్నికీలల్ వరలిన గతిగా వార్ధి లంఘించుచుండెన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

  7. (అల)కకు కారణ మేమది?
    (కల)తలతోనేల?నీదు కాంక్షను నేనున్
    (తల)పనె? తెలుపుము తీర్చెద
    (వల)దిది యనె కైక కచట వసుధాధిపుడున్

    రిప్లయితొలగించండి
  8. అలరుచు సీతా రాములు
    కలనైన నూహించ నట్టి కబురే వినగన్
    తలచిరి దశరధు నాజ్ఞను
    వలదని వారించె కైక పట్టము గట్టన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  9. ఆల, కల, తల, వల దత్తపది పాదాదిపద్యంలో రామాయణార్థంలో పూరణ.

    అలకను దీర్చ వరమొసగ,

    కలతలఁ గూర్చె, సతి కైక కారడవులకై

    తలపడి రాముని బంపుచు,

    వలవలనేడ్వగ దశరథవసుధాధిపుడున్.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    .

    రిప్లయితొలగించండి
  10. రావణుడు సీతతో :
    అలవియె నన్నెదిరించుట
    కలబడి బ్రతుకంగఁగలడె కాదని నాతో
    తలఁబడ నీ భర్తయె నీ
    వలననె మరణించు సీత వలచుము నన్నే

    రిప్లయితొలగించండి
  11. అలకవలదుచెలియయనుచు నతివనూరడించు నీ
    కలతమానుమానినీయకారణంపుగిన్కనీ
    తలపుయేదియైనదీర్చదశరథుండుదాసుడీ
    వలపుపాశబంధుడంధవైరివంశచంద్రుకై

    రిప్లయితొలగించండి
  12. *అల*భరించే రామకథ,పలు
    కల*తల* వారించి దివ్య కాంతులు చిమ్మెన్
    విలసిత *కల*శం బయ్యెను
    తెలుపుచు కళ్యాణ పూల తీ*వల*సొబగుల్.

    రిప్లయితొలగించండి
  13. దత్తపది :-
    *అల - కల - తల - వల*
    అన్యార్థంలో పాదాదిని ప్రయోగిస్తూ
    రామాయణార్థంలో
    నచ్చిన ఛందస్సులో

    *కందం**

    అలసిన రాముని చూచుచు
    కలవర పడె లక్ష్మణుండు,కనపడని వదినన్
    తలచుకొనుచు దుఃఖమునన్
    వలవల యేడ్చుచు తిరుగుచు వనమున వెదకెన్
    ...................✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణతో

      *కందం**

      అలసిన రాముని చూచుచు
      కలవర పడె లక్ష్మణుండు,కానని వదినన్
      తలచుకొనుచు దుఃఖమునన్
      వలవల యేడ్చుచు తిరుగుచు వనమున వెదకెన్
      ...................✍చక్రి

      తొలగించండి
    2. చక్రపాణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  14. అలరింపంగను కాలపృష్ఠమచటన్ నార్యున్ ప్రియత్వమ్ముతో
    కలశాబ్ధిన్ జని యించి నట్టి సిత జింకన్ కోరగా వేటకై
    తలసాలన్ దహరుండు లక్ష్మణుడి చేతన్బెట్టి శ్రీరాముడా
    వల బోవంగ మహీజ గీత భళిరా పాయెన్గదాలంకలో !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...పృష్టమట నా యార్యున్... జనియించు తెల్లనగు జింకన్ (సిత జింక... దుష్టసమాసం)' అనండి.

      తొలగించండి


  15. అలరింపంగను కాలపృష్ఠమచటన్ నార్యున్ ప్రియత్వమ్ముతో
    కలపన్ దున్నగ బుట్టి నట్టి సిత జింకన్ కోరగా వేటకై
    తలసాలన్ దహరుండు లక్ష్మణుడి చేతన్బెట్టి శ్రీరాముడా
    వల బోవంగ మహీజ గీత భళిరా పాయెన్గదాలంకలో !



    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. అలసిన మానస మ్మునకు నౌషద మారఘు రామనామమే
    కలతల బాపుచుండి కల కాలము బ్రోచును పాదసేవయే
    తలచిన మాత్రమే మనకు దర్శన మబ్బును మానసమ్మునన్
    వలచిన వారి నెల్లఱను వర్ధిల జేయును నిశ్చయమ్ముగా

    రిప్లయితొలగించండి
  17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశము :: దత్తపది
    ఇచ్చిన పదాలు :: అల-కల-తల-వల {అన్యార్థంలో}
    విషయము :: రామాయణార్థము
    ఛందస్సు :: ఏ పద్యమైనా సరే
    సందర్భము :: లంకలో అశోకవనంలో శింశుపావృక్షం క్రింద శోకదేవతలా కనిపించిన సీతమ్మను చూచినాడు హనుమంతుడు. పరమానందంతో రామకథను గానంచేస్తూ ఆ తల్లి ఎదుట నిలబడి తనను తాను పరిచయం చేసికొన్నాడు. “అమ్మా! నేను వాయుపుత్రుడను. ఆంజనేయుడను. రామదూతను. నీ నాథుడు రఘునాథుడు అగు శ్రీరామచంద్రుడు చాలా గొప్పవాడు. ఈ లంకనుండి నేను రామస్వామి దగ్గఱకు వెళ్తాను. చూచినాను సీతమ్మను అని చెబుతాను. నీ కలతను పోగొట్టి నీకు ధైర్యము కలిగేటట్లు మాట్లాడినానని చెబుతాను. భూభారాన్ని తగ్గించేందుకోసం పాపాత్ముడైన దశకంఠుని పది తలలను ఖండించి దుష్టశిక్షణ చేయమని చెబుతాను. శిష్టరక్షణ చేయమంటాను. భూజాతవు సుగుణప్రపూతవు అగు నిన్ను సంతోషంగా చేపట్టమని చెబుతాను. సాకేత సార్వభౌమా! నీవు జగన్నాథుడవు అని ప్రశంస చేస్తాను. ఓ సీతామాతా! నా మాటలు నమ్ము అని చేతులు జోడించి వినయవిధేయతలతో మారుతి విన్నవించుకొనే సందర్భం.

    దత్తపది అల-కల-తల-వల అన్యార్థంలో
    ‘అల’ఘున్ రాముని జేరుకొందు, రఘునాథా! కంటి సీతమ్మ నే
    ‘కల’తన్ దీర్చితినందు, రావణు తలల్ ఖండించుమా యందు, భూ
    ‘తల’ భారమ్మును దీర్చమందు, గుణపూతన్ నిన్ను జేపట్టగా
    ‘వల’యున్ నాథుడవందు, నమ్ము మిక నా వాక్యాల నే మారుతిన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (29-11-2018)

    రిప్లయితొలగించండి
  18. కం: తలచుము భరతు సమస్యల
    తలపకు కైకమ్మదే యధర్మ మ్మనుచున్
    వల పన్నె ధాత మంచికి
    అల కలతల తలచ వలదు హా ! సౌమిత్రీ
    (లక్ష్మణుడు అడపాదడపా కైక పై తన కోపాన్ని చూపిస్తుంటే శ్రీరాముడు ఆమెని పన్నెత్తు మాట అనకుండా వారిస్తూ ఉంటాడు. తన వనవాసం మంచిదే అని అది బ్రహ్మ ఏదో మంచికే చేశాడనీ అంటాడు. వనవాసారంభం లో కూడా తనకి ఋష్యాశ్రమాలని దర్శించే భాగ్యం కలిగించిన సవతి తల్లికి రాముడు కృతజ్ఞత తెలియజేసినట్లు రామాయణాలలో ఉన్నది . ఇక్కడ అదృష్టవశాత్తు దత్తపదాలన్నీ ఒకే పాదం లో ఇమిడే అవకాశం కూడా వచ్చింది.)

    రిప్లయితొలగించండి
  19. రిప్లయిలు
    1. తన భార్యను నిందిస్తూ 'నిన్నేలుకోడానికి నే రాముణ్ణి కాదం"టున్న చాకలి పలుకులుగా...

      అల రావణుఁ జెరనుండిన
      కలకంఠినిఁ గూడవచ్చుఁ గరుణను నృపుడున్
      తలపున నే నెంచనటుల
      వలపున నే గ్రుడ్డి గాను వాటమె తెలియున్

      తొలగించండి
    2. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చాకలి కథ జనశ్రుతియే కాని వాల్మీకం కాదు.

      తొలగించండి
  20. asnreddy

    రావణుడు సీతతో
    అలక లడచగట్టెను కను మలరుఁబోఁడి
    కలతఁ బడిన నీ రూపమ్ము వెలితిపడును
    తలచకు పతి వచ్చు ననుచు కలలనైన
    వలచుము నను నే తేలింతు స్వర్గమందు

    రిప్లయితొలగించండి
  21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  22. అలవోకగ తాకగ గుణి
    కలజముడి విడువడినట్టు గప్పున కూలన్
    తలరారు నితండెయనుచు
    వలతియు జూచి రఘుపతిని వరునిగ వలచెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. డా. పిట్టా సత్యనారాయణ
    తలపుల్ నీవయి,రామభూమి నిలుపన్ తాత్సారమే జేయ మా
    వలపుల్ నాలుగు వత్సరాలు నలిగెన్ వాత్సల్య సంధాత! యీ
    కలనంబప్పటి ఖాందిశీకుల యెడన్ కారుణ్యమున్ జూప;మా
    అలసత్వంబును మాన్ప రమ్ము కరుణన్నారామ నిర్మాతవై!

    రిప్లయితొలగించండి


  24. అలనాటిది నాతి వెతయు
    కలకంఠి శుభాంగి లక్ష్మి కనవచ్చెను కుం
    తలమును దున్నగ! తానా
    వల రాముని సతిగ వెడలె వనమునకకటా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. అలకాపురి పతి నందము
    దలపించెడు రాఘవుండు దయజూపకనే
    వలదన్న శూర్పణఖ మది
    కలవరపడి రెచ్చగొట్టె కాముకు రావణ్

    రిప్లయితొలగించండి


  26. అలఘుడు రఘుపతి, సిత యల
    కలల్ల లాడెడు మహీజ, కల్యాణమటన్
    తలతల లాడెడు చీరల
    వలతులు నటునిటు తిరిగిరి వరుడిని గానన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  27. తలచెన్ పో శూర్పణఖయు
    కలడా రఘురామునివలె గాళకుడిలలో?
    వలపుల కురుపించెద సయి
    యలసిసొలసియైన పరిణయం బాడెద నే!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  28. అలమట నొందక నెన్నడు
    కలబడి వెతల యవలీలగ నెదుర్కొని యా
    వల మానవుండు రాముడు
    తలముల నన్నిటికి దేవతాయెను వినరో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వెతల నవలీలగ' అనండి. 'దేవత + ఆయెను' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
  29. కలతను విడుమంటిని నీ
    తలపులలో నున్నవాడె దనుజుని జంపున్
    వలదిక శోకము తల్లీ
    యలవోకగ కడలి దాటి యనఘుడె వచ్చున్.

    రిప్లయితొలగించండి
  30. అలక వహించిన హరిమూ
    కల నాటి విచిత్ర గాథ కద ;రావణుఁతో
    తలపడ వారధి నిడ , నా
    వల రాముడు లంక జేరి పట్టి వధించన్

    రిప్లయితొలగించండి


  31. అలకాపురిపతి మ్రొక్కుచు
    తలసాలన్ గాపుగాచు ధరణిజ వినుమా
    వలచితి రమ్మా లంకకు
    కలడే దశకంఠుని వలె గండడిల రమా ?


    జిలేబి

    రిప్లయితొలగించండి


  32. అలవోకగ లంఘించుచు
    కలతల చేర్చి యసురులకు కార్మొగిలువలెన్,
    తలచిన రీతిని తానా
    వల నీవల దూకెనుగ పవన తనయుడటన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  33. అలవోకగ పద్యమిచట
    కలమున జాల్వార్చు తమిని క్షణమందుననే
    వలపటి దాపటి చేతుల
    తలపించుచు సవ్యసాచి తరుణి జిలేబీ!!

    ఇప్పటికి తొమ్మిదయ్యాయి! ఇంకెన్ని వస్తాయో!!

    రిప్లయితొలగించండి
  34. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అలసితి లంకను గాల్చగ
    కలవర మాయెనుగ మనసు కష్టంబాయెన్
    తలవగ సీతా మాతకు
    వలపట దాపట రగిలెడు వనమును మదిలో


    రిప్లయితొలగించండి
  35. తలగడ మంత్రము జదివెను
    కలతలు రేపెనెరజాణ కైక, వల వలా
    విలపించె దశరథుడు, ముది
    తల యలకలకు బెదరగను దప్పవు బాధల్

    రిప్లయితొలగించండి
  36. అలవడునే యన్యులకు స
    కల వేదార్థజ్ఞత భువిఁ గాకుత్స్థనితాం
    త లసద్భాషణములుఁ గా
    వలయు ననిన రఘువరా! కువలయ దళాక్షా!

    రిప్లయితొలగించండి


  37. కలవరమునుజేర్చెడు కల!
    అలఘుడు రఘురాముడు తన సైన్యము తోడై
    వలతి ధరణిజను కావగ
    తలకన్నది లేక దునిమె దశకంఠునిటన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి


  38. అల ముక్కుపచ్చలారని
    తలకయు లేని నగుమోము దహరుడయా ! నా
    వల గాములు! గాధేయుడ!
    కలవరమాయె మది నేను కానకు వత్తున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  39. అక్కల- అయ్యో !



    అలనాడిచ్చిన వరముల
    తలంపునకు తెచ్చి కైక తన రాముని న
    క్కల! కాననమున కంపగ
    వలవల నేడ్చె దశరథుడు పరిపరి విధముల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  40. అల గంధమాదనమ్మున
    కలహమ్ముల కల్లు త్రాగి కలకలములతో
    వలకాకపు కోరికలకు
    తలమీరి పనుల మరిచిరి తఱులమెకమ్ముల్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  41. మణిగణనికర వృత్తము
    (న-న-న-స ...యతి 9వ అక్షరము)
    ****)()(****
    అలకల సతిగని యడిగిన వరముల్
    కలతను జనకుడు కడువడి నొసగన్
    తలపక వెతలను తరుణిని గొనియున్
    వలనుగ రఘుపతి వనమున కరిగెన్.
    **)(**

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ విశేషవృత్త పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  42. తలచెద నిన్నే రామా
    కలనైను యని హనుమంతు కడలిన్ దాటెన్
    వలతిగ సింహికను దునిమి
    అలగము నెక్కిగనులార యమ్మను చూసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం సంతృప్తికరంగా లేదు.

      తొలగించండి
  43. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ ...


    వలనొప్పగ రఘురాముడు
    తలపించెడి శబరి జేర దర్శనమివ్వన్
    కలవర మొందుచు గాంచెను
    అలరించియు ఫలములొసగ నాహారించెన్.

    రిప్లయితొలగించండి
  44. (సీతా మాతతో మారుతి సంభాషణ)

    అలతిగ నెంచగ నాచే
    కలవరపడి పోయెను దశకంఠుడు మున్నే
    తలచిన నీకీ రక్కసి
    వలయము తొలగింతు వాస్తవంబుగ మాతా.

    రిప్లయితొలగించండి
  45. అలకమాను కైక ఆరాధ్యమవునీవు
    తలచదగదు నన్ను తగడనుచును
    కలతజెంద బోకు కామితార్థముదీర్తు
    వలచినాడ నిన్నె వగచ నేల?

    రిప్లయితొలగించండి


  46. అలసట యన్నది లేక స
    కలము రఘుపతి దని తలచి కరసేవగ పో
    తల యిసుకను నుడతయు తా
    వలచక తెచ్చెను ప్రపత్తి పరిపక్వముగాన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  47. అలసె సొలసెనాత్మయు నా
    వల తల్లియు వేచెనయ్య పట్టిని కడుపున్
    కలవరపడక కలుపుకొన
    తలచెద నీ మేలు రామ తరలెద పుడమిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  48. కలయగ సుగ్రీవుడు నా
    వల వాలిని కంధరమున ఫల్యపు మాలన్
    తలచియు ధర్మము బాణం
    బలవేయగ చచ్చినాడు బలవంతుడటన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  49. వలపుల జమచేసుకొనుచు
    కలవర పడక పతిరాక కై నిదురను తా
    నలవోకగ కౌగిలిగా
    తలచెను లక్ష్మణుని సతియె తరుణి జిలేబీ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  50. కల-వరమట్లుగసీతయు
    తలపోసిన రామచంద్ర "దండమునెత్తన్
    నలవోకగ"నానందపు
    వలపులచేపెళ్లిజరిగె పందిటయందున్!

    రిప్లయితొలగించండి
  51. అలకలు వదనమును మూసె, నలుక యేల?
    కలవలము తోడ యేల నీ పలుకు మారె?
    వలవల నడలగ ముఖము వాడె నేమొ?
    తలఁడు యేల కైకా యనె దశరధుoడు

    రిప్లయితొలగించండి
  52. అలకల కులుకుల జానకి
    కలవరపడె భూవరులను గనిఁ బతి యెవరని
    తలపునఁ రాముని జూడగ
    వలరాజుని శరముఁ దగిలె పడతీ మణికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చరణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...గని పతి యెవ రనుచున్' అనమ్డి. అలాగే 'వనితామణికిన్' అనండి. అక్కడ దుష్టసమాసం.

      తొలగించండి


  53. అలకలకొలికి యిదియె! సీ
    త! లక్ష్మి!కళ్యాణరామ! ధరిణిజ యిదిగో
    వలపుల పంటగ నిల్చు స
    కల గుణముల మేల్మిగా సుఖములను జేర్చున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  54. బాపూజీ గారూ, నమస్కారములు. మంచి సున్నితమైన సన్నివేశం తీసుకొన్నారు. మీ నాన్న గారు శ్రీ పాపయ్య శాస్త్రి గారు (కరుణశ్రీ) గుర్తుకొచ్చారు.

    రిప్లయితొలగించండి
  55. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కం. అలరించెడి చందమ్మున
    తలమిన్నగు రామకథను తమ్ముని తోడన్
    కలసి మునిపల్లెను కుశుడు
    వలనుగ పలుకుచు జననికి పరితోష మిడెన్.

    రిప్లయితొలగించండి


  56. అల వైకుంఠములో సే
    వల చేసెను కర్మ ఫలపు పరిపక్వతకై
    తలచుచు నెదిరిగ విభుడిని
    కలహమునకు కాలుదువ్వె కద రావణుడే!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  57. అలరారు నీకు సతిగా
    వలపుల రాణిగ ధరణిజ పరిపూర్ణముగా
    తలచెమదిని నిను పతిగా
    కలహంసా!యేలుకొనుమ కళ్యాణమునన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  58. 1.ఆ.వె:అలక బూన కైక యవనీశు పైతాను
    కలతనొందె పతియు కాంతను గని
    తలపదేదొ దెలుపు నేనెర వేర్తును
    వలదు చింత యనుచు పలికె తాను.

    రాక్షస స్త్రీలు సీతతో

    2.ఆ.వె:అలవి కాదు వినుము అతివరో రాముకు
    కలవ లేడు నిన్ను కడలి దాటి
    తలపు లన్ని వీడి దరిచేరి రావణున్
    వలపు నందు కొనుము వారిజాక్షి.

    సీత రావణునితో

    3.ఆవె:అలఘు మతులు వారు అసురేంద్ర వినవయ్య
    కలన మందు నిన్ను కస్తి బెట్టి
    తలలు తెగ నరికి దండన లిడుదురు
    వలదు వైర మనుచు వసుధజనియె.

    హనుమంతుడు సీతతో

    4.ఆ.వె:అలతి మాట లాడి యతివ సీతకపుడు
    కలత బాపె నచట కపివరుండు
    తలచి నటులె వచ్చు దాశరథియు నిట
    వలదు చింత యనుచు పలికె హనుమ.

    5.ఆ.వె:అలమటించకమ్మ అంతరంగమునందు
    కలత మాను మింక కమల నయన
    తలపు నందు సతముదాశరథి యునుండ
    వలదు చింత వచ్చు వార్ధి దాటి.


    .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      కొన్ని దోషాలున్నవి. అలసట కారణంగా వివరించలేను.

      తొలగించండి
  59. సవరించిన పూరణ
    ------------------
    అలరుచు సీతా రాములు
    కలవర మందున చలించె కబురే వినగన్
    తలచిరి దశరధు నాజ్ఞను
    వలదని వారించె కైక పట్టము గట్టన్

    రిప్లయితొలగించండి
  60. అలసటలాకలిదప్పులు
    గలగవుబలయతిబలయను ఘనవిద్యలు భూ
    తలవరసూతిగొనుము గా
    వలయునృపులకనిముని,రఘువరునకొసంగెన్

    రిప్లయితొలగించండి
  61. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂దత్తపది🤷‍♀....................
    *అల - కల - తల - వల*
    పై పదాలను అన్యార్థంలో పాదాదిని
    రామాయణార్థంలో నచ్చిన ఛందస్సులో
    పద్యం

    సందర్భము: హనుమన్నుతి..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    *అలవోకగ సీతమ్మకు*

    *కలవరమును బాపినాడు గద!*
    *రఘు రామున్*

    *తలపుల నిడి నిశ్చింతగ*

    *వలయు పనుల జేసెడు*
    *కపి వరుని స్మరింతున్.*

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    29.11.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  62. మీకు వీలున్నపృతడు తెలిపిన సవరించుకొంటాను

    రిప్లయితొలగించండి
  63. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    నిన్నటి పూరణ స్వీకరించ ప్రార్థన.


    శ బ రి భ క్తి
    -----------------


    కలత వహించు చేను బహుకాలము నీకయి వేచియుంటి , నే

    ‌నలయక | నేడు నిన్ను కనులారగ గాంచితి | ధన్యనైతి | కే

    వల మొక పేదబోయెతను స్వామి ! రఘూద్వహ మా
    కుటీర మీ

    తలమున నుండె రాగదె ? ముదంబున నే బదరీఫలంబులన్ ,

    వలవనివా తినం దగినవా రుచి జూచుచు , నిచ్చెదన్ బ్రభూ !

    చులకన చేయకుండ దయజూచుచు , గైకొను బీద పూజలన్ |


    { అలయక = విసుగొందక ; తలము = ప్రదేశము చోటు ; బదరీ

    ఫలము = రేగు పండు ; వలవని = పనికిమాలిన ; }


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి