13, జనవరి 2019, ఆదివారం

సమస్య - 2901 (అంబనుఁ బెండ్లాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్"
(లేదా...)
"అంబనుఁ బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ సాల్వుఁ డాదటన్"

51 కామెంట్‌లు:

 1. సంబరము తోడ పశుపతి
  యంబనుఁ బెండ్లాడె;...సాల్వుఁ డందరు మెచ్చన్
  జంబము లేకయె ఘనముగ
  కంబువు నెక్కుచును పోరె కంసారాతిన్ :)

  సంక్రాంతి భోగి శుభాకాంక్షలు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు
   అయినా ఘనంగా ఏనుగు నెక్కినవాడు బడాయికి పోకుండా ఉంటాడా
   'జంబువు తోడను అంటేనే బాగుంటుందేమో?

   తొలగించండి
  2. నిజానికి ఈ సాల్వుడు "సౌభగం" అనే విమానమునెక్కి పోరాడాడట...

   పోనిద్దురూ...పండుగ పూట!

   తొలగించండి
 2. ( అంబను అంబిక ,అంబాలికలతోపాటు భీష్ముడు తీసికొని పోగా సాల్వరాజు మరొక ఆర్యాంబను వివాహమాడాడు.)
  అంబను కాశిరాజసుత
  నవ్విధి నందర నోడగొట్టి , గం
  గాంబతనూజుడౌ మహిత
  గాత్రుడు భీష్ముడు సోదరీసమే
  తంబుగ గొంచు బోవ ; గుణ
  ధన్యను ; గణ్యను ; రూపభాసితా
  ర్యాంబను బెండ్లియాడె జను
  లందరు మెచ్చగ సాల్వు డాదటన్ .

  రిప్లయితొలగించండి
 3. సంబరపుటెడదసాల్వుని
  యంబనెగాశీశుపట్టియారాధింపన్
  అంబనెదనిలిపిగలలో
  అంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 4. అంబనుస్వయంవరంబున
  సంబరమునగెల్చెభీష్మశౌర్యంబెసగన్
  అంబేదలెయిటులననెటు
  లంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్"

  రిప్లయితొలగించండి
 5. మైలవరపు వారి పూరణ

  అంబుజలోచనన్ మృదు సుహాసిని నా మది దోచినట్టి యీ
  యంబను నేను రేపటి స్వయంవరమందు వరింతునంచు దా
  సంబరమందుచున్ నిదుర స్వప్నమునన్ మధురానుభూతితో
  నంబనుఁ బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ సాల్వుఁ డాదటన్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 6. ఈ రోజు శంకరా భరణము సమస్య మత్తేభము

  నరిషడ్వర్గము లాప్త మిత్రములు గా నానందమందించు లే

  నా పూరణము సీసములో


  కామిఐ ఋషిపత్ని కలయిక కోరిన
  బలభేది మౌని శాపమును బడసె,
  క్రోధము తో తన కొంప వీడిన సిరి
  పతితోడ తానెడ బాటు పొందె,
  పిన తండ్రి సుతులకు పిడికెడు నేలని
  డక ధార్తరాష్ట్రేయు డసువు బాసె,
  మోహము తో దశ ముఖుడు సీతను బట్ట
  దాశరధి వలన తనువు వీడె,
  మదముతో సైరంధ్రి మగువ పొందును గోర
  కీచకు న్వలలుడు పీచ మణచె,
  హరి పై పగను పెంచి హరిచేత నే హిర
  ణ్యకశిపుడున్ మరణంబు నొందె
  యెoచి చూడ నెపుడు మంచి జరుగునని
  కాంక్షలను బడయంగ నది యొకక
  ల , నరిషడ్వర్గము లాప్త మిత్రములు గా
  నానంద మందించు లే ననగ స

  బబు నెటుల నగు ధరణిలో, పగను వదలి
  కోపము విడచి , సతతము కూర్మి పంచి
  శక్తి కొలది దానము చేయ సంత సంబు
  కలుగు ననవర తమ్ముజనులకు భువిని

  పూసపాటి గుంటూరు

  గురువు గారు నమస్కారము నిన్నటి సమస్య ఒక్క సారి చూడండి

  రిప్లయితొలగించండి


 7. జంబలకడిపంబ విదుర!
  తంబళ తలతిక్కయగు కత యిక శకారా
  దంబోవడివలె చెప్మా !
  "అంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్"


  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. సౌంబకమెక్కియాదవులజంపుచుసాల్వుడుగన్నుగానకన్
  సాంబశివుండొసంగెననిశౌరినిగెల్వసవాలుజేయనా
  దంబునిగూల్చెజక్రియని ,ధర్మవృకాత్మజుడేవరించె,గ్లో
  "యంబనుఁ బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ సాల్వుఁ డాదటన్"

  రిప్లయితొలగించండి


 9. జంబపు మాటలాడు పరిచారకుడాతడు గట్టి గా కథన్
  తంబళ తిక్క తోడు వెస తాడుకు బొంగర మేమి లేక యున్
  సంబరమించుచున్ పలికె చక్కగ యుత్పలమాలలోనిటుల్
  "యంబనుఁ బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ సాల్వుఁ డాదటన్"


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇప్పుడు మీరు "మామూలు మనిషి"! సంతోషం! పండుగే పండుగ!!!

   తొలగించండి

  2. :)

   క్రింది పద్యము చూడు డు :) మేదావి అయిపోయాము మళ్ళీ :)


   సంక్రాంతి శుభాకాంక్షలతో


   ధరణిని విస్తారముగా
   పరిపాలింపగ త్వరితము పరిపూర్ణముగా
   వరలుకొని భళారే కరి
   కరి నినుడాక్రమణ చేసె కాంక్షలు హెచ్చన్ !


   జిలేబి

   తొలగించండి
 10. సంబుడు తాఁ దపము విడిచి
  యంబనుఁ బెండ్లాడె, సాల్వుఁ డందరు మెచ్చన్
  సాంబశివుని మెప్పించుచు
  సౌంబకమును బొందనేమి చక్రియె చంపెన్

  రిప్లయితొలగించండి


 11. సాంబుడు, ధ్యానింపగ నా
  నంబనుఁ బెండ్లాడె, సాల్వుఁ డందరు మెచ్చన్,
  త్ర్యంబకుని దేనము గనన్
  సౌంబక ము బడసె సమాధి సౌభాగ్యమహో!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. కంబమున పుట్టె గణపతి
  అంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్"
  నింబ నరటి పండ్లిడెనని,
  వెంబరవిత్తుడు బలికెను వేదిక పైనన్

  వెంబరవిత్తుడు = మూర్ఖుడు (అంధ్రభారతి ఉవాచ)

  రిప్లయితొలగించండి
 13. డా. పిట్టా సత్యనారాయణ
  "జంబ","లకిడిపంబ"లు నా
  డంబలికై "పాండు"లు కథ హాయిగ జెప్పన్
  సంబరపడి శ్రోత యెయనె
  "అంబను పెండ్లాడె సాల్వు "డందరు మెచ్చన్(పాండవులోళ్లు గ్రామాలలో (భారత )పాండవుల కథ పాడుచు జెప్పేవారు,196౦వసం॥వరకు)

  రిప్లయితొలగించండి
 14. డా.పిట్టా సత్యనారాయణ
  వరంగల్ లో నొక కవి "ఇట్ల సుత" అనే వచన కావ్యం వ్రాశారు,మహా భారత కథను వక్రీకరిస్తూ.
  సంబరమౌనె మౌని గను సంతన నీజగమేమిగావలెన్?
  అంబకు బెళ్ళిగావలెను ,అద్దిరె భారతమన్న నీగతిన్
  సంబర వెట్ట గూడదని సాచె కథన్నిటు "లిట్టులీ సుతన్"
  అంబను పెండ్లియాడె జనులందరు మెచ్చగ "సాల్వు"డాదటన్

  రిప్లయితొలగించండి
 15. సంబరము హెచ్చ సాల్వుడు
  నంబను మనువాడనెంచ; నంతట భీష్ముం
  డంబను గొనిపోయె;నెటుల
  నంబను బెండ్లాడె సాల్వు డందరు మెచ్చన్

  ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి

  రిప్లయితొలగించండి
 16. సాంబుడు మదిలో మెచ్చియు ;
  *సౌంబక మెవ్వరు నడిపిరి చతురత తోడన్ ;
  బొంబాయి శోభ వెలిగెను ;
  "అంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్"
  ***)()(***
  *సౌంబకము = సాల్వుడు శివుని గుఱించి తపమాచరించి వడసిన విమానము.

  రిప్లయితొలగించండి
 17. సంబరము నిరాశ పరచి
  యం బ ను గొని పోయె భీష్ముడoతట నావే
  శంబున వల దను చెట్టుల
  నంబను బెండ్లా డె సాల్వు దంద రు మెచ్చ న్?

  రిప్లయితొలగించండి
 18. కందం:
  అంబను భీష్ముడు గెలిచిన
  సంబంధం వీడి మరల సాల్వుడు మనువున్
  అంబను పోలిన మరియొక
  "అంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్"

  గొర్రె రాజేందర్
  సిద్దిపేట

  రిప్లయితొలగించండి
 19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ రోజు శంకరాభరణము సమస్య

   అంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్


   ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


   అంబ తాను సాల్వ రాజును ప్రేమించినాను ఒకరితో మనసు పడి వేరొకరితో మనువు భావ్యము కాదు గదా అని భీష్ముని అడుగుతుంది. అప్పుడు అందరు తలచగా సకల గౌరవ లాంచనములతో సాల్వ రాజు దగ్గిరకు పంపుతాడు భీష్ముడు. హస్తినాపురములో ఉన్న అంబికకు కొత్త ప్రదేశము కావటముతో సరిగ్గా నిద్ర పట్టక మగతనిద్ర లోకి జారుకొని ఒక కల కంటుంది. దానిలో సాల్వ రాజు అంబను చేరదీసి ఆవిడ మెడలో అందరి సమక్షములో తాళి కడుతాడు ఆప్పుడు అంబ మనసు తన్మయత్వంతో నాట్యము ఆడిందని ఆవిషయము తన చెల్లెలికి చెబుదామని ఆదుర్దాగా లేచి విస్మయము చెంది ఇది కల కదా! నిజము కాదు గదా అని తలచు సందర్భము

   మనసు నొకరిపైన మనువు వేరొకరి తోడేరీతి బొసగు, పాడి యనబోరు
   నెవ్వరు యని పల్క,నిజమని తలచి పంపెను సాల్వ రాజుతో మనువు కొరకు
   గాంగేయు డంబను, కలత వలదనుచు చేరదీసి రమణి కోరగ మురి
   పెముతోడ నంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చ,నుల్లము తన్మయముగ

   నటన మిడె సోదరికి యని నంబిక తన
   చెల్లికి తెలుప లేచెను సెజ్జ వదలి,
   నిద్ర మత్తుపోవ ,దలచె నిజము కాదు
   తానొక కలను కనెనని తల్లడిల్లె


   తొలగించండి
 20. అంబమ్మ జాతరందున
  సంబరములు సాకుచుండ సంతోషమునన్
  లంబాడితాండ వాసపు
  అంబను బెండ్లాడె సాల్వుడందరుమెచ్చన్!

  రిప్లయితొలగించండి
 21. శంబరునివైరి వైరియె
  యంబను పెండ్లాడె;సాల్వుడందరు మెచ్చ
  న్నంబకొరకు పోరెను గం
  గాంబాసుతు డపహరింప కన్యాత్రయమున్

  రిప్లయితొలగించండి
 22. సంబుడెవరిని వరించె త
  పంబును మెచ్చి? హరి తాను పరిమార్చెయరిన్
  సంబరముగ నెవ్వారిన్
  అంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 23. గు రు మూర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


  పరమేర్ష్యాపరుడై , మహోగ్రతర కోపస్వాంతుడై , దుర్మదో

  ధ్ధురుడై , దివ్యసతీ విమోహి యయి , సద్ద్యోసత్సమూహారియై

  వరమౌనీంద్ర కృతాధియాగఫల విధ్వంసక్రియాలోలుడై ,

  హరిపై ద్వేషముతో జరించెడు హిరణ్యాక్షుం డనెం బుత్రుతో

  యరిషడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మొందించులే

  హరిపై మోహము మాను మోయి సుత ! నీ వాలించు , లేదేని ని

  ష్కరుణన్ శిక్షల పాలుజేతు | నెటు నిం గాపాడునో జూసెదన్


  { సత్ + ద్యోసత్ + సమూహ ‌ + అరి : ద్యోసత్తు = సురుడు }


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 24. రిప్లయిలు
  1. అంబకు నకట మఱి పరిణ
   యంబు సుదూరంబ కాదె యాలోచింపన్
   సంబరమునఁ బల్కెదు వే
   యంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందఱు మెచ్చన్


   అంబ సమాన మీ యువతి యంచును నే నటఁ జూచు చుండ నీ
   మంబున సుందర ప్రమద మండప సుజ్వలి తాగ్ని సన్నిధా
   నంబ వరాణసీ నగర నాథ వరేణ్య వరాత్మ సంభవా
   న్యాంబనుఁ బెండ్లియాడె జను లందఱు మెచ్చఁగ సాల్వుఁ డాదటన్

   తొలగించండి
 25. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  సంబర మొందుచున్ వలచి శంభుడు చెల్లియొ చెల్లకో భళా
  అంబనుఁ బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ;.. సాల్వుఁ డాదటన్
  అంబర మందునన్ చనుచు హాయిగ తీయగ పోరుజేసెగా
  నంబరు వన్ను సౌభగము నందున కూర్చొని నల్లనయ్యతో :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పురాణాలేవీ చదవని మూర్ఖుడను...ఇన్నాళ్ళూ "పుష్పక విమానం" మాత్రమే తెలుసును నాకు...ఈ రోజు "సౌభగం" కూడా మనకు ఉన్నదని తెలిసి సంబరమే సంబరం

   తొలగించండి


  2. తంబీ సాల్వుండెక్కడ
   నంబనుఁ బెండ్లాడె? సాల్వుఁ డందరు మెచ్చన్,
   త్ర్యంబకుని దేనము గనన్
   సౌంబక ము బడసె గదా వసతిగ తిరుగుచున్ :)


   జిలేబి

   తొలగించండి
  3. బాగు బాగు!

   అంతర్జాల ఫేకులలో చదివితినెక్కడో..."సాల్వుడు", "సాళ్వుడు" వేరు వేరట..."నీరవుడు", "నరేంద్రుడు" వలె...

   తొలగించండి


  4. ఎంసక్కంగ జిలేబు లొప్పగ సజాయించేరుగా సాల్వుడిన్ :)


   జిలేబి

   తొలగించండి
 26. అంబర కేశుఁ జేరుచు సురాళియె వేడగ నగ్నివక్త్రుడా
  యంబను బెండ్లియాడె జనులందరు మెచ్చగ, సాల్వు డాదటన్
  నంబర వీధినన్ దిరుగెడద్భుత మైన విమానమెక్కి పీ
  తాంబరుఁ గూల్చనెంచుచు హతమ్మయె నాతడె కృష్ణుఁజేతిలో.

  రిప్లయితొలగించండి
 27. జంబలకడి బంబ యనుచు
  సంబరములలోన మునిగి జనపదుడనియెన్
  తంబుర మీటుచు ''యెవడెనె
  అంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్ ? ''

  నిన్నటి సమస్యకు నా పూరణ

  అరయఁగ దుర్మార్గుల కిల
  పరులను హింసించుటెగద పరమానందం
  బరగుదు రటులె నిరతము
  అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్

  రిప్లయితొలగించండి
 28. సాంబుడుశీతాద్రితనయ
  *నంబనుబెండ్లాడె;సాల్వుడందరుమెచ్చన్*
  సాంబసదాశివుతపమున
  సౌంబకమనుదివ్యరథముసాధించెభళా!

  రిప్లయితొలగించండి
 29. సంబరము గలిగి శివుడా
  యంబనుబెండ్లాడె,సాల్వుడందఱు మెచ్చన్
  డంబపు సౌభగ మెక్కుచు
  నంబరమునకేగె నచట నాలముజేయన్

  రిప్లయితొలగించండి
 30. అంబమనంబుసాంబునికినమ్మెను ,నమ్మకమారిపోవ గం
  గాంబికనందనుండురిపుగండరగండ స్వయంవరంబులో
  యంబనుగెల్వ,సాల్వపతియంబవరుండగునే?మరెవ్విధిన్
  *అంబనుఁ బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ సాల్వుఁ డాదటన్*?

  రిప్లయితొలగించండి
 31. సంబరమొప్పగా శివుడు శౌరియుబ్రహ్మయు జూచుచుండగా
  నంబనుబెండ్లియాడె జనులందఱు మెచ్చగ, సాల్వుడాదటన్
  డంబపుసౌభగంబనెడు డండను శబ్దముగల్గునావిమా
  నంబునునెక్కినేగెనట నాతులు పెద్దలుసంతసించగన్

  రిప్లయితొలగించండి
 32. నా ప్రయత్నం :

  అంభోనిధి కలదన్నను
  నంబువు తడియైన జూడ నగుపడ వలెగా?
  డంబమ్మింతయె? భువి నే
  యంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్?

  ఉత్పలమాల
  అంబను సోదరీ సహితమందుచు తమ్ముల కంటగట్ట గం
  గాంబ సుతుండు వెంటఁ గొనఁ గాదని ప్రేమికుఁ జేరబోవుచున్
  సంబర మంది యూహలఁ బసందుగఁ జేసిన భావనమ్ములో
  నంబనుఁ బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ సాల్వుఁ డాదటన్!

  రిప్లయితొలగించండి
 33. అంబరకేశుండా జగ
  దాంబను బెండ్లాడె,సాల్వుడందరు మెచ్చన్
  నంబను వలచియు తాను వి
  లంబము చేయక వదిలెను లలితాంగినటన్

  రిప్లయితొలగించండి