చేపలమ్ము కొని బ్రతుకు చెలువ యొకని భార్యగా వచ్చి తొలిరేయి పాన్పు మీద వాలి క్రొత్త వాసన యలవాటు లేక "మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె" ***)()(*** (బాల్యము నుండి చేపల వాసన కలవాటు పడిన యావిడ మల్లెల వాసన క్రొత్తగా యుండి భరించలేక పోయింది.)
ఉత్పలమాల ఉల్లము నందు రాముని మహోన్నత రూపము నిండి యుండ నా చల్లని మూర్తికై వగచు సాధ్వి ధరాత్మజ చెంత పోచకున్ జెల్లని వాడు రావణుడు చిత్తము మార్చగఁ జేర వచ్చెడున్ మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే?
ఎల్లవేలల కొట్టుచు నెపుడు సుంత
రిప్లయితొలగించండిపేర్మి కురుపించని మొరటు పెనిమిటి మరు
మల్లెలను సంత కొని తన మహిళ కివ్వ
మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె
ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమంచి పూరణతో శుభారంభం చేసారు. అభినందనలు.
ధన్యవాదములు... గురువు గారూ...
తొలగించండిప్రియుని కై నిరీక్షిoచె ను ప్రేమ తోడ
రిప్లయితొలగించండిమల్లియలు గుబాళించగ ; మహిళ రోసె
కడు నిరాశ పరచ గ తా కలత చెంది
రువ్వె విరుల ను బయటికి రోష ముగను
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొల్లలుగ చూసిమురిసెను చెల్లి తెల్ల
రిప్లయితొలగించండిమల్లియలు గుబాళించఁగ:...మహిళ రోసె
క్రుళ్ళి పోయిన నుల్లులు త్రుళ్ళు చుండ
వంట నింటికి జల్లుచు వాసనలను
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'....మహిళ రోసె
నుల్లిపాయలు క్రుళ్ళిన తల్లడిలుచు
వంటయింటను నిండ దుర్వాసన లయొ!' అంటే ఎలా ఉంటుంది?
🙏
తొలగించండిచల్లని కైతలన్ సభను
రిప్లయితొలగించండిజల్లుచు , నందరి మెప్పు నందుచున్
మల్లెలు రాని కాలమున
మంచిగ వల్లభు డిల్లు జేరగా
తెల్లని ప్లాస్టి "కంపు " పువు
తీరుల కృత్రిమదోషజుష్టమౌ
మల్లెల వాసనల్ సెలగ
మానిని రోయుచు ముక్కుమూయదే ?
జంధ్యాల వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ !
తొలగించండిచల్లని వెన్నె లందున చక్క నైన
రిప్లయితొలగించండిచెలియ చెంతను హాయిగ చింత లేక
మనుసు పడునట్టి సతికోర్కె మంట గలుప
మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "చల్లనైన వెన్నెలలోన చక్కనైన" అనండి.
చల్లనైన వెన్నెలలోన చక్కనైన
తొలగించండిచెలియ చెంతను హాయిగ చింత లేక
మనుసు పడునట్టి సతికోర్కె మంట గలుప
మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి*పట్నం పిల్ల*
అల్లన శైత్యయంత్రముల హాయిని పొందుచు , నింపుసొంపు మే..
నెల్లను జల్లుకొంచు పులకించును కృత్రిమమౌ సుగంధముల్ !
పల్లెల పైరగాలి యన పట్టదు , గిట్టదు సాజమైనవౌ
మల్లెల వాసనల్ , సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ సహజ సుందరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితాళి గట్టిన మరునాడె తరుణి విడిచి
రిప్లయితొలగించండికడలి దాటుచు మగడేమొ కదలి పోగ
కామ వాంచలె తనువంత కాల్చువేళ
మల్లియలు గుబాళించగ మహిళ రోసె.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికొల్లగ ద్రాగి కోపమున గొట్టుచు దిట్టుచు నెల్లవేళలన్
ఘొల్లున నేడ్చి యల్గినను గూరిమి బేరిమి సుంత జూపకన్
దెల్లని మల్లియల్ పతియె తెచ్చియు గొప్పున జుట్ట బోవగన్
మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అల్లనఁ జేరవత్తు నటకంచుఁ బ్రియుండన సంతసించి తా
రిప్లయితొలగించండినుల్లము పల్లవింపఁ దగు నోపికవట్టు నిరీక్షఁ జేసె, మే
నెల్లదహించ రాడని ధరించిన పూలు గిరాటు వేయుచున్,
మల్లెల వాసనల్ సెలగ మానిని రోయుచు ముక్కు మూయదే
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కల్లలెఱుంగనట్టి పుర గణ్య వరాంగన. ముద్దరాలహో
రిప్లయితొలగించండిపల్లియకాంత. సత్ప్రకృతి భాసిలు నైజమునందునెప్పుడున్.
కుళ్ళిన భావనల్ గలుగు గోముఖ వ్యాఘ్ర సమాజమందు యీ
మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే.
చింతా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గోముఖ వ్యాఘ్ర' మన్నపుడు 'ఖ' గురువై గణదోషం. సవరించండి.
ఉల్లమును కొల్లగొట్టిన ఉవిద చెంత
రిప్లయితొలగించండిహర్ష పులకిత గాత్రుడై యతడు నిలచె
మల్లియలు గుబాళించగ; మహిళ రోసె
అత్త పిలుపుల కాగ్రహ మంది యామె
ప్రసాద రావు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిచేపలమ్ము కొని బ్రతుకు చెలువ యొకని
రిప్లయితొలగించండిభార్యగా వచ్చి తొలిరేయి పాన్పు మీద
వాలి క్రొత్త వాసన యలవాటు లేక
"మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె"
***)()(***
(బాల్యము నుండి చేపల వాసన కలవాటు పడిన యావిడ మల్లెల వాసన క్రొత్తగా యుండి భరించలేక పోయింది.)
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తెల్లని చీరగట్టి దన తీయని ప్రేమను చాటిచెప్పగా
రిప్లయితొలగించండిజల్లుచు పాన్పుపై మిగుల చక్కని పూవుల వేచియుండగా
మల్లియ వాసనల్ సెలగ; మానిని రోయుచు ముక్కుమూయదే
కల్లును ద్రాగి మైకమున కాలిడ నింటను కాంతుడయ్యయో?
సీతాదేవి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండికామక్రీడలదేలెనుగామరాజు
రిప్లయితొలగించండిమల్లియలుగుబాళించగ,మహిళరోసె
త్రాగివచ్చినబెనిమిటితంతుజూసి
భర్తప్రేమనేగోరునుభార్యయెపుడు
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొల్లి సనాథ తాను వెడ తోటకు బూవులు తేవ పూజకే
రిప్లయితొలగించండిమల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే
వెల్లువ ధారలన్ గనుల వెంటను గారగ భర్త గుర్తులన్
సల్లపనంబులన్ దలచి, సద్యము తేరుకొనెన్ వెడెన్ యదే
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని భావం సుబోధకంగా లేనట్టున్నది. 'వెడెన్'? 'వెడెన్ + అదే = వెడె నదే' అవుతుంది. యడాగమం రాదు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండినవనవానంద బృందావనమ్ము చెంత
కలియుదమని రావించిన కామనుండు
నాగమించని వేళలో నాగ్రహించి,
మల్లియలు గుబాళించిన, మహిళ రోసె.
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒక్క సాయంసమయమునఁ జక్క నైన
రిప్లయితొలగించండిచుక్క యొక్కతి పతి నెకసెక్కెము లట
వేడ్క నాడుచు నుండంగ వెక్కసముగ
మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె
[రోయు = వెదకు]
ఉల్లసనమ్ము క్రమ్మికొన నుల్లము నందు విహార యాత్రకై
చల్లని వేళ సాగుచు విశాలపుఁ గుల్య గలట్టి పెద్దదౌ
పల్లెకు పోయి చేర నొక ప్రాంగణ మచ్చట నిల్వకుంటి మే
మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే
[మేము + అల్లెల = మేమల్లెల ; అల్లెలు = చేపలలో నొక రకపు చేపలు]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా, వైవిధ్యంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండి[ఏము + అల్లెల = ఏ మల్లెల ; అల్లెలు = చేపలలో నొక రకపు చేపలు]
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.................🤷🏻♂సమస్య 🤷♀....................
మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె
సందర్భము: నాగరికత వెఱ్ఱితలలు వేయడంవల్ల ఆడతనానికి హుందాతనం కనిపించకుండా పోతున్నది. మహిళల సింగారాలు నిరర్థకా లైపోతున్నాయి. చూడండి....
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"గాజులు పెట్టవే గడుసుదానా!" యన్న
"మోజు లే" దని నవ్వు ముదిత యొకతె..
"కురులు కట్టుకొనవే కులుకులాడీ!" యన్న
"విరబోసికొందు"నన్ వెలది యొకతె..
"చీరఁ గట్టుకొనవే చారు లోచన!" యన్న
"జారు నేమో!" యను నారి యొకతె..
"తిలకము దిద్దవే కలువకంటీ!" యన్న
"సమయ మేదీ?" యను జాణ యొకతె..
పిచ్చి నాగరికత లేవొ పెచ్చుపెరిగె..
పూల నిష్టపడరు నేటి పొలతు లయ్యొ!
"తురుముకొను మందురో!" యని తోటలోన
మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె
✒~డా.వెలుదండ సత్యనారాయణ
3.1.19
-----------------------------------------------------------
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
👏👏 అద్భుతం సర్.
తొలగించండిచాలా అద్భుతంగా చెప్పారండీ.
తొలగించండి👏👏👏👏
తొలగించండివెలుదండవారి భావాన్ని కందంలో
నేటి వనిత
నొసటను తిలకము నుంచదు
విసుగొందును కురుల ముడువ విరులను దాల్చన్
కసురును గాజుల దొడగగ
నసుగును ధరియింప జీర నచ్చగ జీన్సే!
నారిముగురమ్మలకునమ్మనమ్మివేసె
రిప్లయితొలగించండిమల్లియలుగుబాళించంగ;మహిళరోసె
పూలువాడినగనియెదబోరుమనియె
మంగళముగాదుమగని కమంగళమని
శంకర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎల్లలులేనిప్రేమనిలువెల్లనుగన్నులుగాగవేచెలే
రిప్లయితొలగించండి*"మల్లెల వాసనల్ సెలఁగ మానిని ;రోయుచు ముక్కు మూయదే"*
క్రుళ్లినకంపువాహనపుగుంపునుగుప్పగనీచగంధమున్
యల్లదెవల్లభుండు హృదయం బునుజెప్పెను వాడియూసులన్
శంకర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మెల్లగమంచమెక్కెనటమేకలనాగినిసంబరంబున
రిప్లయితొలగించండిన్మల్లెలవాసనల్సెలగ,మానినిరోయుచుముక్కుమూయదే
గల్లునుద్రాగివచ్చిదనకాంతకుమీదికిబోవుచుండగా
నల్లదెవాసనల్దగులనాయమయట్లుగముక్కుమూసెనే
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అందమైనపెరటిమల్లెహాయినీయ
రిప్లయితొలగించండిముడిచిపెట్టత్రెంపెముదిత;పుణ్యతీర్థ
యాత్రలోశిరోముండనమరయమిగని
మల్లియలు గుబాళించగమహిళరోసె
శంకర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
జల్లులు వేసవిన్ కురియ జానకి త్రుళ్ళెను పర్ణశాలనున్
మల్లెల వాసనల్ సెలఁగ;...మానిని రోయుచు ముక్కు మూయదే
చెల్లియొ చెల్లకో తరుణి చెవ్వులు ముక్కును కోలుపోవుచున్
గొల్లున కేక బెట్టుచును ఘోరపు నిందల నెత్తిపోయగా
చెవ్వు = చెవి (శ్రీహరి నిఘంటువు :)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
మల్లెల వాసనల్ సెలగ మానుగ ముక్కుపుటాల బెంతుమే
రిప్లయితొలగించండికల్లలు కాదు నా పలుకు కాంత! నిజమ్మిది ప్రక్క యింటిలో
పిల్లకు మల్లె పూ వనిన పెద్ద వికారము వింత కాదె యా
మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలు గురువుగారూ.
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిచెల్లి!యా బాపు బొమ్మవై చెలగ లేవు
తల్లి వెంట్రుక లిచ్చినా తరుగు చుంద్రు
కొప్పులెక్కడ? విరబోయు కురులు దప్ప;
మల్లియలు గుబాళించగ మహిళ రోసె
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కల్లయిదేమిచిత్రమగుకామినులెల్లరునుల్లసిల్లగన్
రిప్లయితొలగించండిమల్లెలుచందనాగరులుమానినికొప్పుననొప్పుగాకనొ
ల్లెల్లనుపద్మినీయనగలేమలుబూలకుదాసులేగదా
యుల్లముపల్లవించవిభుడొద్దికచెంతనలేడొకోకటా
*"మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే"*
శంకర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఉల్లము మీది కొంగు నట నూరక దీయగ నూన్చ వన్నెయౌ
చల్లగ వీడిరా కొనల చానల-చీరల సోకు లేదు; స్త్రీ
లల్లన నన్య దేశమున హాయిని నున్నతమౌ (యు)నుపాధినిన్
జెల్ల,సుగంధ పూతలను జేర్చగ;దివ్య పరీమళంబునౌ
మల్లెల వాసనల్ సెలగ"మానిని" రోయుచు ముక్కు మూయదే
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొత్త పెళ్ళి కూతురు కోరి కొల్లలుగను
రిప్లయితొలగించండిపూల చెండులన్ కడుప్రేమ పొటకరించ
చేర తనపతి చెంతకున్ చెదరెను కల
*"మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె"*
గంగాప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జ్యేష్ట మాసాన బెండ్లిని జేసినారు
రిప్లయితొలగించండివెంటనే వచ్చె నాషాఢ విరహబాధ
మదిని గదలాడె యూహల మధుర తలపు
"మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...గదలాడె నూహల..' అనండి.
రిప్లయితొలగించండిపైక మార్జించగా నెంచిపతియు సాగ
దూరదేశమ్ము సతియు తీ దుఃఖ పడుచు
విరహ వేదన నొందంగ పెరటి లోని
మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె"*
రెండవ పూరణ.
కొల్లలుగ పూసినట్టియా మల్లెల గని
మురిసి మగువ పతికొరకు మోజు తోడ
వేయి కనుల నెదురు జూచి నిభుని తలచ
మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె"*
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తీ దుఃఖపడుచు'...?
సానికొంపల లోచేరి సంతసమున
రిప్లయితొలగించండిపవలు రేత్రులు నచ్చటే పవ్వళించి
మరల యిక్కకు వచ్చిన మగని చేతి
మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముద్దురాలు కొనంగను మూర పూలు
రిప్లయితొలగించండిమిన్నులన్ తాకె మూల్యము; మిగుల పేద
నయ్య వల్ల గాదంచును నసిగె విసిగె
మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో యతిదోషం. సవరించండి.
కలలు సాకార మగుచు కల్యాణ మాయె
తొలగించండికలత లేని కాపురమును కన్నె గోరె
చిరుకలహపు చికాకుల చింత హెచ్చ
మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె
కల్లలెరుంగ నట్టి యొక కన్నియ పొందగ మంచి భర్త తా
రిప్లయితొలగించండినుల్లము పద్మనాభుపయి నుంచి భజించగ చిక్కె భర్తగా
కల్లరి, సానితోఁ గొని సుఖమ్ముల క్రమ్మర, వాని మేనిపై
మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కన్నె కప్పు।డిష్టమైన...' అనండి.
కష్టసుఖములు దెల్పిరి కన్నె కప్పు
తొలగించండిడిష్టమైన చెలుని చేయి బట్టి సాగె
పక్షి రెక్కలు గట్టిన పంజరాన
మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె
ఎల్లలులేనిప్రేమవిటుడేయెదకోవెలపూజలందగా
రిప్లయితొలగించండి*"మల్లెల వాసనల్ సెలఁగ మానిని ;రోయుచు ముక్కు మూయదే"*
నల్లనికారుచీకటులనక్కడ వ్యర్థమలంబుబారగ
న్నల్లదెజుమ్మికాడు హృదయం బుపయోధరమూరరెచ్చగన్
శంకర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి రెండు పాదాల భావం అర్థం కాలేదు.
రిప్లయితొలగించండిగల్ఫునకు వెళ్ళినట్టి మగండు జ్ఞాప
కమున కరుగుదెంచి యెలమిగ కవగొనెను
మల్లియలు గుబాళించఁగ,మహిళ రోసె
తన పరిస్థితి గాంచి వెతలను నొంది !
నూతన వత్సర శుభాకాంక్షలతో
జిలేబి
జిలేబిగారూ! పునః స్వాగతం! నూతన సంవత్సర శుభాకాంక్షలు!
తొలగించండిమీ ఆరేగ్యమిప్పుడు పదిలమనుకొంటాను!
తొలగించండిసీతాదేవి గారికి
నెనరులు ఉభయకుశలోపరి :)
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిస్వాగతం! ఇప్పుడు మీ కన్ను ఎలా ఉంది?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భావుకతనునింపుకొనిన భామ యెదను
రిప్లయితొలగించండికదలి యాడ 'పుష్పవిలాప కావ్యమొకటి ',
చెంతగా వచ్చి నిలచిన యింతి తలను
మల్లియలు గుబాళించగ మహిళ రోసె!
మీ భావుకత బాగున్నదండీ!👏👏👏
తొలగించండిధన్యవాదాలండి 🙏
తొలగించండిశ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యులకు నమఃపూర్వక ధన్యవాదములు 🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఉల్లపు కోరికల్ చెలికి నొప్పవు! పెట్టుకొనంగ కొప్పులో
మల్లెల నోకరింతయగు! మాడ్రను గర్లు జిలేబి, సోదరా!
పల్లెల కెప్పుడైన మరి భామిని పోయెనకో ?గుభాళిగా
మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే!
జిలేబి
👏👏👏
తొలగించండిజిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పెండ్లి జరిగిన మరునాడె పెనిమిటి కొక
రిప్లయితొలగించండిజాడ్య మున్నటు తెలియగ జారుడనుచు.
పాన్పు పై వాల దుఃఖము పట్టలేక
మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె
నిన్నటి సమస్య కు నా పూరణ
కూతు నల్లుని బిలువక కోరి జేయ
దక్ష యజ్ఞము జూడగ దగదటన్న
పతిని విడిజని భగ్నమై సతిగ జేర
పతిని త్యజియించి సతి పతివ్రత యనఁబడె
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అల్లుకొన్నట్టి యాశలు,మల్లియలట
రిప్లయితొలగించండినలుగ?శోభనమందున విలువతగ్గ!
మగని మాంగల్య సుఖమంతతగనిదైన?
మల్లియలుగుభాళించగ మహిళరోసె!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అల్లరి పిల్లయంచు జనులందరు పిల్చెడు చిన్నదాననే
రిప్లయితొలగించండినల్లని పిల్లవాడొకడు నచ్చివివాహముఁ జేకొనంగ నా
పిల్లకు వచ్చె గర్భమట పెక్కుగఁ గోరెను చింతకాయలన్
మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కుమూయదే.
నల్లని భర్త మీసములు నాతి
రిప్లయితొలగించండికపోలముఁ గ్రుచ్చుచుండగా
నల్లరి పిల్ల మోముఁ దరహాసము చిందెడు దృశ్యమున్ గనన్
చల్లని వెన్నెలే సతికి చండమయెన్ విరహమ్ము పెర్గగన్
మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కుమూయదే.
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'విరహమ్ము హెచ్చగన్' అనండి.
అల్లరియేలనోయతివలందరినిన్ పలుకు ల్మరేలనో
రిప్లయితొలగించండియెల్లలెరుంగదోమరుడునెక్కిడడోమగవారలైననా
యుల్లముమెల్లమెల్లగమయూరమునైనటనంబొనర్చదో
కల్లలుగాగగొల్లనరెకాంతులుగామినులంతనొక్కటే
*"మల్లెల వాసనల్ సెలఁగ మానిని(మాన్యుడు) రోయుచు ముక్కు మూయదే(డే)"*
శంకర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దయచేసి మీరు పద్యాన్ని టైపు చేసేసమయంలో పదాల మధ్య వ్యవధానం ఉంచండి.
ఉత్పలమాల
రిప్లయితొలగించండిఉల్లము నందు రాముని మహోన్నత రూపము నిండి యుండ నా
చల్లని మూర్తికై వగచు సాధ్వి ధరాత్మజ చెంత పోచకున్
జెల్లని వాడు రావణుడు చిత్తము మార్చగఁ జేర వచ్చెడున్
మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే?
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉ. మెల్లని చూపులన్ మగని మేనుని తాకుచు యింతురెల్లరున్
రిప్లయితొలగించండిచల్లనిగంధమద్దనొక చారిణిమద్యముగొంతునింపగన్
ఎల్లలులేనిహాయిగొనియేమఱపాటునవాంతులీను, భా
మల్లెల వాసనల్ సెలఁగ, మానిని రోయుచు ముక్కు మూయదే.
Note: ఇక్కడ భామలందరు పరిపరి విధాలా పరిమళాలు వెదజల్లారు అన్న అర్ధం ప్రయోగించితిని
తేటగీతి
రిప్లయితొలగించండిపెళ్లి చూడగ వచ్చియు గిల్లు కొనుచు
వర్గ పోరుతో నలిగెడు వైరులచట
నుడికి పోవుచు తిట్లతో నొకరికొకరు
పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట!
ఉత్పలమాల
ఇద్దరి వర్గపోరు బెదిరింపుల రేగుచు సద్దుమన్గియున్
పెద్దల పెండ్లివేడుకల విందున బైల్పడ గిల్లుకొంచుఁ బెన్
గుద్దులతో చెలంగి గుమి గూడఁ బరస్పర దూషణమ్ములన్
శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్