9, జనవరి 2019, బుధవారం

సమస్య - 2897 (రాక్షస గర్భమ్మున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాక్షస గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్"
(లేదా...)
"రాక్షస గర్భమందు రఘురాముఁడు పుట్టెను లోకరక్షకై"

110 కామెంట్‌లు:

  1. రాక్షస రావణు డొదవెను
    రాక్షస గర్భమ్మున;...రఘురాముఁడు పుట్టెన్
    దీక్షను చేగొని చంపను
    రాక్షసు లెల్లరిని, భూమి రక్షణ కొరకై...

    రిప్లయితొలగించండి
  2. (దేవదానవ యుద్ధంలో దశరథుడు దేవతలకు సాయంగా వెళ్ళి శంబరాసుని ఎదుర్కొన్నాడు)

    రక్షో దివిజ రణంబున
    నక్షీణబలుండు శంబరాసురుతోడన్
    సక్షముఁడై పోరిన జిత
    రాక్షస గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్.

    రిప్లయితొలగించండి


  3. అక్షరపు ముక్క రాకన్
    సాక్షియు లేక నవివేకి ! చలకపు తీరుల్
    చక్షువుల కానదకొ ? యే
    రాక్షస గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కానదొకొ" అనండి.

      తొలగించండి
    2. రాకన్ సాధవేనా...జిలేబీ గారూ...

      తొలగించండి

    3. నో ఐడియా :) అసలే అధిక్షేపం :) ఇక సాధువా అసాధువా అని చూసుకుంటే యెట్లా :)




      జిలేబి

      తొలగించండి
    4. రాకన్..కాకన్..లేకన్..అనేవి కళలు...
      వాటి అంతము దృతము రాదు..

      తొలగించండి
  4. అక్షయుడే పుట్టెనుగద
    రాక్షస గర్భమ్మున, రఘురాముడు పుట్టెన్
    రాక్షసుల సంహ రించుచు
    రక్షింపగ లోకమును సురాళియె వేడన్

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ


    పక్షిని గారవించె , నొక వానరమున్ దమిఁ గౌగిలించె , ప్ర...
    త్యక్ష హరిస్వరూపమన నందరి గాచెను , సత్యధర్మముల్
    చక్షువులైనవాడిల *దశాస్యు వధన్ రగిలింప జిచ్చునా*
    *రాక్షస గర్భమందు*, రఘురాముఁడు పుట్టెను లోకరక్షకై"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాక్షస గర్భంలో చిచ్చు రగిలించ రాముడు పుట్టాడన్న మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


    2. వావ్! మైలవరపు వారు !



      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారికి 🙏 వందనములు.. ధన్యవాదాలండీ

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    4. అద్భుతమైనపూరణఅవధానిగారూ!నమోనమః!

      తొలగించండి
    5. శ్రీమతి సీతాదేవి గారికి.. మీకు.. నమోనమః 🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
  6. రాక్షసి తాటకిని వధించ
    తక్షణమే యవత రించి తప్తము జేసెన్
    రాక్షసి విమాత యాజ్ఞకు
    రాక్షస గర్భమ్మున , రఘురాముఁడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పద్యం వరకు బాగున్నది. కాని ఉత్తరార్ధం అర్థం కాలేదు.

      తొలగించండి


  7. శిక్షకుడు ఛాత్రుల నడిగె

    "ఈ క్షితినందు రఘురాము డెటుల జనించెన్"
    ?
    దక్షత లేక యొకండనె

    "రాక్షస గర్భమ్మున రఘురాముడు పుట్టెన్"


    🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱

           🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి


  8. అక్షర మొక్క టైన వనితా, సరి నేర్వక వంశవృక్షముల్
    చక్షువు కానలేదకొ ? పిశాచుల, దైత్యుల కాశ్యపేయులన్
    వక్షము లోన బెట్టుకొని ప్రార్థన జేసితివా? జిలేబి, యే
    రాక్షస గర్భమందు రఘురాముఁడు పుట్టెను లోకరక్షకై?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. ( శ్రీహరి ద్వారపాలకులు జయవిజయుల జననం )
    వీక్షణదీక్షతో మరల
    విష్ణుని సేవల జేయనెంచుచున్
    దక్షులు ద్వారపాలకులు
    దబ్బున పుట్టిరి దేవి కైకసీ
    రాక్షసగర్భమందు ; రఘు
    రాముడు పుట్టెను లోకరక్షకై
    శిక్షను వేయ వారలకు
    జెల్వగు భానుకులమ్ము నందునన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జంధ్యాల వారూ,
      విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,



    గురుభ్యో నమః నిన్నటి పూరణ స్వీకరించ ప్రార్థన
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,




    శారదాంబ వలన సాహిత్య మబ్బును |

    పలుకులమ్మ వలన భావ మబ్బు |

    పద్మగర్భునిసతి వలన , నా వాగ్వధూ

    టీ వలన కవిత్వ మే విలసిలు |


    """"""""""""""""""""""""''"""""""""""""""""""""""""""""""""

    రిప్లయితొలగించండి

  12. మోహన్ రావ్ గారి ప్రేరణతో...

    లక్షణముగ నీ "శాంతియె"
    రాక్షస సాలు జనియించె రాజిల జగతిన్
    వీక్షించగ నవ్విధమునె
    రాక్షస గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్

    (నేనైతె రాక్షస నామ వత్సరములో పుట్టాను....రాముల వారు ఆ వత్సరములో పుట్టాడో..లేదో ఆ కౌసల్యకే తెలియాలి..

    ఏమో గొప్ప గొప్ప వారంత ఆ వత్సరములో పుడుతారేమో....)
    😀😀😁😁😁)


    🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱

                        🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  13. అక్షీణ బల యు తుం డై
    ర క్షిoపగ సజ్జ నాళి రావణు దునుమన్
    క క్ష గ కలతలు రేపగ
    రాక్షస గర్భ మ్మున ;రఘు రాముడు బు ట్టెన్

    రిప్లయితొలగించండి
  14. రక్షింప సురాళి సహ
    స్రాక్షుఁ బిలుపు మేర కదలి సంగ్రామములో
    రాక్షసులన్ దునిమిన జిత
    రాక్షస గర్భమ్మున రఘురాముడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  15. సవరించిన పద్యం
    ---------------------
    రాక్షస రాజుల వధించ
    తక్షణమే యవత రించి తప్తము జేసెన్
    రాక్షసి విమాత యాజ్ఞకు
    రాక్షస గర్భమ్మున , రఘురాముడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      క్షమించాలి. ఇప్పుడూ ద్వితీయార్థం అర్థం కాలేదు.

      తొలగించండి



  16. మోక్షము దండహస్తులకు ముంగమురాముగ నిచ్చె విష్ణువే!
    దక్షత గాన జన్నము, ప్రదక్షిణ చేయగ, పాయసమ్మటన్
    భక్షణ మై ప్రసాదముగ పంక్తిరథున్ రమణుల్ గొనంగ వై
    రాక్షస గర్భమందు రఘురాముఁడు పుట్టెను లోకరక్షకై!


    వైరాక్షస - రాక్షసులకు వైరము గా నుండు , గర్భము నందు ? సరియేనా ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సరియేనా?' అంటే 'సరియే కాబోలు!' అంటాను!

      తొలగించండి
  17. సవరించిన పద్యము గురువు గారు
    లవకుశులు రామాయణ గానము చేయుచు అయోధ్య పురమునకు వెళ్లి అచ్చట సీతారామ దర్శనము కోరుతారు . పురములో సీత లేదని సీతను కొన్ని పరిస్తితులలో అడవులకు రాముడు పంపెను అని తెలుసుకుంటారు కౌసల్యాది స్త్రీల ఎదుట బాధతో రాముని చర్యకు నిస్టురముగా మాట్లాడుతారు. తల్లి దగ్గరకు వచ్చి కూడా ఆబాధ తట్టుకోలేక రాముని గురించి ఆవిడ ఎదురుగా కర్కశంగా మాట్లాడుతారు దానితో సీత పిల్లలను రాముని గుణముల గురించి మీరు పరుషముగా మాట్లాడు వారా అని పిల్ల లిద్దరి మీద విపరీతమైన కోపము చూపిస్తుంది .అప్పుడు లవకుశులు పలుకు మాటలు


    భర్తతోడ వెడలెన్ పదునాల్గు వత్సరములు కాననము లోన కలసి తిరుగ
    దలచి,తనను పెట్ట దనుజుడు లంకలోన, బడసె వెతలను నాధు విడచి ,
    నిండు చూలాలే యని తలచక నడవి లోని కెటుల పంపె జానకమ్మ
    ను, తననే మనమున సతతము సంస్మర ణముచేయు పడతికి నాధు డతడు,
    కఠినుడు, రాక్షస గర్భమ్మున రఘురాముఁడు పుట్టె ననుచు ప్రముఖులు నింద

    మోపి నను ధర్మ మేయగు, కోప మేల
    తల్లి ,నేడు మా హృదయము తల్ల డిల్లు
    చుండె నీమదికిని బాధ నుండునుగద
    యనుచు బలికె లవకుశులు నమ్మ తోడ


    రిప్లయితొలగించండి
  18. వీక్షింపగ లోకమ్మున
    రక్షణయే లేకపోయె రమణులకెల్లన్
    ప్రక్షాళన జేయుటకై
    రాక్షస గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      కాని సమస్య పరిష్కరింపబడినట్లు లేదు.

      తొలగించండి
    2. ఔను గురువు గారూ. ఏదో రాసేసాను.తర్వాత చూసుకున్నాను.

      తొలగించండి
  19. భక్షకుడౌ నరకుడు విష
    వృక్షము వలె నెచట పుట్టె వివరము జెపుమా ;
    శిక్షింపగ రక్కసులన్
    రాక్షస గర్భమ్మున ; రఘురాముఁడు పుట్టెన్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. మక్షికముబుట్టె మకరికి
    తక్షకుడేబుట్టె పక్షితనయుడుగానే
    వీక్షించ నింద్రజాలము
    రాక్షసగర్భమ్మున రఘురాముడుబుట్టెన్

    రిప్లయితొలగించండి
  21. ఒక గయ్యాళి గంప సజ్జనుడైన బాలుని ప్రసవించింది.అతని పేరు రఘురాముడు

    సాక్షీభూతంబుగ నీ
    రాక్షస గర్భమున రఘురాముడు పుట్టెన్
    మోక్షంబిచ్చును మీకున్
    దాక్షిణ్యము నందుమయ్య!దరిఁజేరుమయా!

    రిప్లయితొలగించండి
  22. అక్షయమౌ విధిన్ వరము నాయుగ మందున బొందలేదొకో
    తక్షణమే వచింపనగు దారకు డప్పుడె యెందు పుట్టెనో ;
    భక్షక రాక్షసాధములనె భండన మందున సంహరింపగన్
    రాక్షస గర్భమందు ; రఘురాముఁడు పుట్టెను లోకరక్షకై !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాక్షసాధముల భండన...' అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  23. మిత్రులందఱకు నమస్సులు!

    [నారదుఁడు రావణునకు శ్రీరామ జన్మ వృత్తాంతమును దెలిపిన సందర్భము]

    దీక్షిత పుత్రకాముఁడయి ధీరుఁడు పంక్తిరథుండు, భార్యలున్
    మోక్షద పుత్ర యజ్ఞమును మోదముతో నొనరింప, నగ్ని స
    ద్వీక్షనుఁ బాయసమ్ము నిడ, వేగ సతుల్ గొనఁ, బెద్దభార్యకున్,
    రాక్షస! గర్భమందు రఘురాముఁడు పుట్టెను లోకరక్షకై!

    రిప్లయితొలగించండి
  24. రావణ కుంభకర్ణ వధానంతరము నారదమహర్షి యొక రాక్షసునితో

    ఉత్పలమాల
    రక్షణ గూర్చశిష్టులకు రాక్షస మూకను సంహరించగా
    నీ క్షితి ధర్మమూర్తియన నెల్లరు, శ్రీహరి రూపమే యనన్
    మోక్ష ప్రసాదితుం డగుచు మ్రొక్కిన మోసిన భక్త కోటికిన్
    రాక్షస! గర్భమందు రఘురాముఁడు పుట్టెను లోకరక్షకై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మరి ఎవరి గర్భమందు అన్న విషయం చెప్పలేదు.

      తొలగించండి
  25. డా. పిట్టా సత్యనారాయణ
    రాక్షస భూమియ సింహళ
    పక్షము నీ నాడు "రాజ పక్షయె" ప్రభువై(యేలికయై)
    రక్షణ నొసగెను భళిరా!
    రాక్షస గర్భమున రఘురాముడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  26. డా. పిట్టా సత్యనారాయణ
    పక్షిని గోళ్ళలో నిరుక బట్టిరి భారతి(దేశము)నాంగ్ల పాలకుల్(వారి దేశ ఎంబ్లెమ్ గ్రద్ద(eagle)
    రక్షణ లేక తల్లడిలెరా మన గాంధిగ "పుత్తలీ"(పుత్లీబాయి)మహా
    రాక్షస గర్భమందు రఘురాముడు పుట్టెను లోకరక్షకై
    దక్షత లోన తల్లుల వదాన్యతనందున రక్కసే(దీర్ఘ దే‌హి)యనన్

    రిప్లయితొలగించండి
  27. డా.పిట్టా నుండి
    ఆర్యా,నాల్గవ పాదమును మూడవ పాదముగా వేసి చదివిన మరింత స్పష్టత ఉండునని భావించితిని.మన్నించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  28. కందం
    ఈ క్షితి శ్రీహరి యేయన
    రక్షించగ శిష్టజనుల రాజితలీలన్
    మోక్ష ప్రదాతగ గొలువన్
    రాక్షస! గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఎవరి గర్భమ్మున?

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. అయోనిజుడైన శ్రీహరి గర్భమందు ఈ భూమి మీద పుట్టినారని చెప్పడమే నా పద్యభావం

      తొలగించండి
  29. కుక్షిన వేయును కోలయు
    రాక్షస; గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్
    వీక్షింప పుట్టు గిట్టను
    లక్షణములు లేనివాడు లంకను గెల్వన్

    రిప్లయితొలగించండి
  30. దక్ష వదాన్యమౌళి బలిదాత భవంబది యేకులంబునన్?
    రక్షి కకుత్థ్సుడార్తజన రక్షకు డెవ్వరుత్రేతమందునన్?
    భిక్షకుడయ్యెనేలహరి వేసెధరిత్రి విచిత్రవేషముల్?
    "రాక్షస గర్భమందు; రఘురాముఁడు పుట్టెను; లోకరక్షకై"

    రిప్లయితొలగించండి
  31. రక్షింపను దనభృత్యుల
    శిక్షింపను దైత్యబుద్ధి శ్రీ పతిబుట్టన్
    దక్షాయ్య తురగు డెవ్విధి
    "రాక్షస గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్"?

    రిప్లయితొలగించండి
  32. వీక్షింపగ లోకమ్మున
    రక్షణయే లేకపోయె రమణులకెల్లన్
    ప్రక్షాళన జేయుటకై
    రాక్షస గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాదరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాక్షస గర్భమ్మున'...?

      తొలగించండి
  33. పక్షితురంగుడా ప్రభునిబంటులు శాపవశాన బుట్టరే
    "రాక్షస గర్భమందు; రఘురాముఁడు పుట్టెను లోకరక్షకై"
    దక్షుడు లోకరక్షకుడు దానవ వైరి ముకుందు డార్తులన్
    రక్షణసేయ బంటుల దురాగ్రహమార్ప జగద్దితంబునై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  34. మోక్షము గోరి కేశవుని పూజలు సేసెడి దానవోత్తమా
    దక్షుడ వీవె ధర్మమును ధాత్రిన నిల్పుమటంచు వేడగా
    నీ క్షితి బ్రోవనెంచి హరియే గద మానవ మాత్రుడై యిలన్
    రాక్షస, గర్భమందు రఘురాముడు పుట్టెను లోకరక్షకై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధాత్రిని' అనండి. 'రాక్షస గర్భమందు'...?

      తొలగించండి
  35. అక్షయమంగళాంగుడు మహత్త్వ వసుంధర భూతినాశకా
    శిక్షకుడై నిశాచకుల శేషవిశేష కుఠారఘాతమై
    "రాక్షస గర్భమందు; రఘురాముఁడు పుట్టెను లోకరక్షకై"
    దక్ష విభీషణాభయుడు దైత్యనృపాల చయాంతకుండునై

    రిప్లయితొలగించండి
  36. కక్ష వహించి తా నసురకాంక్షలఁ దీర్చ, సురారియై హిర
    ణ్యాక్షధరిత్రిసజ్జననియంత జనించెను లోకహింసకై
    రాక్షసగర్భమందు; రఘురాముడు పుట్టెను లోకరక్షకై
    లక్షితధర్మవిగ్రహుడు రాజిలఁ గోసలరాజపుత్రికిన్

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  37. అక్షయధామ విరాజిత
    పక్షీంద్ర తురగ విభుండు ఫణిశయనుఁడు ప
    ద్మాక్షుఁడు ధరఁ గౌసల్యా
    రాక్షస గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్

    [కౌసల్య +అరాక్షస = కౌసల్యా రాక్షస; అరాక్షస = మానవ]


    రాక్షస కోటి నాయకుఁడు రావణ నామ విరాజమానునిన్
    రూక్షుని శిక్ష సేయ ముని లోకము నింపుగఁ గాచ నెంచియే
    యక్షయ భోగ భాగ్య పురమయ్య యయోధ్య నరాధిపాగ్ర దా
    రాక్ష సగర్భ మందు రఘురాముఁడు పుట్టెను లోక రక్షకై

    [దార + అక్ష = దారాక్ష; దార = భార్య; అక్షము = తెలియఁబడిన యర్థము; స గర్భము = పిండము తో; అందు = అయోధ్యలో]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి


    2. వావ్!


      అయోధ్య నరాధిపాగ్ర దారాక్ష సగర్భ !


      అయోధ్య నరాధిప అగ్ర దార అక్ష సగర్భ !

      పోచిరాజువారి శైలి unbeatable !



      జిలేబి


      జిలేబి

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
      జిలేబి గారు నమస్సులు, ధన్యవాదములు.
      పురమయ్య యయోధ్య వేరు తర్వాత సమాసము వేరు.

      తొలగించండి
  38. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    శిక్షణ జేయగా దలచి శిష్యుల గూర్చుచు భాగ్యనగ్రినిన్
    భక్షణ గోరుచున్ భళిగ బంజర హిల్సున బార్బెక్యూలలో...
    అక్షర శూన్యుడిట్లనియె హైరన నొందుచు రామగాథనున్:
    "రాక్షస గర్భమందు రఘురాముఁడు పుట్టెను లోకరక్షకై"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  39. కక్ష వహించి తా నసురకాంక్షలఁ దీర్చ, సురారియై హిర
    ణ్యాక్షధరిత్రిసజ్జననియంత జనించెను లోకహింసకై
    రాక్షసగర్భమందు; రఘురాముడు పుట్టెను లోకరక్షకై
    లక్షితధర్మవిగ్రహుడు రాజిలఁ గోసలరాజపుత్రికిన్

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల

    రిప్లయితొలగించండి
  40. శిక్షయిక తప్పదోయీ
    రాక్షస! గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్!
    సుక్షత్రియ వంశమునన్!
    దీక్షాపరుడగు దశరథదేవుని యింటన్!

    రిప్లయితొలగించండి
  41. దక్షతనక్షరాక్షర పదాక్షతలాది గవీశుడీయ సం
    రక్షణజేయభాష పరిరక్షణ శిక్షణశంకరార్యులే
    యక్షయశంకరాభరణమాత్మ విచిత్ర దెనుంగు డెందమ
    *న్రాక్షస గర్భమందు రఘురాముఁడు పుట్టెను లోకరక్షకై"*

    రిప్లయితొలగించండి
  42. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఈక్షితి నొదవెను రావణి
    రాక్షస గర్భమ్మున; రఘురాముడు పుట్టెన్
    నిక్షేపముగా నాతని
    కౌ క్షాంతువు రావణు నడగార్చుట కొఱకై.

    (రావణి= ఇంద్రజిత్తు; క్షాంతువు= తండ్రి)

    రిప్లయితొలగించండి
  43. కం:మోక్షమొసగి జయవిజయుల
    శిక్షను బాపగ భువినను -సీత నెపమునన్
    లక్షము జేసుకు గొట్టగ
    రాక్షసగర్భమ్మున ,రఘు రాముడు బుట్టెన్!!

    రిప్లయితొలగించండి
  44. వీక్షింప రావణు డమరె
    రాక్షస గర్భమ్మున! రఘురాముడు పుట్టెన్
    శిక్షింపగ దుష్టుల, సం
    రక్షించుచు సాధు జనుల రంజిల జేయన్!

    రిప్లయితొలగించండి
  45. రాక్షస గుణములతో భువి
    కక్షను పెంచంగ నొకడు కలి రావణుడై
    శిక్షించగ పుట్ట , నడచ
    రాక్షస గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    కవిత జెప్ప దలుప కాసింత భాష పై
    పట్టు గలుగు నట్టి పండితునకు
    చాల కొంచమైన చక్కనిదౌ గ్రీను
    టీ వలన కవిత్వమే విలసిలు

    రిప్లయితొలగించండి
  46. కందం:
    లక్షణమైన గుణనిధి సు
    రక్షిత పాలన సలిపెడి ప్రహ్లాదుడినే
    వీక్షించిన ప్రజలు పలికె
    "రాక్షస గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్"

    గొర్రె రాజేందర్
    సిద్దిపేట

    రిప్లయితొలగించండి
  47. ఈక్షితి ప్రహ్లాదు వెలసె
    రాక్షస గర్భమ్మున,రఘురాముడు బుట్టెన్
    లక్షణముగ కౌసల్యకు
    దక్షను గావంగ తాను దశరథసుతుడై!!!

    రిప్లయితొలగించండి
  48. కుక్షిని నిల్వుమంచసురుఁ గోరిక కాదన లేక గాదె ఫా
    లాక్షుడొసంగె వానికి వరమ్మును దానిఫలమ్మె దాగెనా
    రాక్షస గర్భమందు, రఘురాముడు పుట్టెను లోకరక్షకై
    దక్షత తోడ ధర్మమును ధాత్రిని నిల్ప, సురాళి వేడగన్

    రిప్లయితొలగించండి
  49. పక్షులకలస్వనమ్మున
    కక్షలతొలగింపజేయకారణముననే
    రక్షకుడేతెంచెననిరి
    *"రాక్షస గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్"*

    రిప్లయితొలగించండి
  50. పక్షికి మోక్ష మిచ్చెను కబంధుని శాపము బాపె వాలినిన్
    శిక్షను జేసె సంద్రమును చీల్చగ జూచెను చాచి చేతి నా
    పేక్షను జేర్చె నక్కున విభీషణు బాణము వేసి ద్రుంచె నా
    రాక్షస గర్భమందు రఘురాముఁడు పుట్టెను లోకరక్షకై.

    రిప్లయితొలగించండి


  51. రక్షస్సు బుట్టె భువిలో
    రాక్షస గర్భమ్మున;రఘురాముఁడు పుట్టెన్_
    శిక్షించుచు నా దనుజుని
    రక్షించగ సుజనుల నిల రాజన్యుండై

    రిప్లయితొలగించండి


  52. మదిని చిలుకంగ చాలును
    చదువక పండితుఁడగు! మఱి చదివి మొఱఁకునౌ
    చు దెసచెడుటేల ! నరుడా
    హృదయము లో రహిని నింపి హృత్వుని గనుమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  53. దీక్ష నొదవ జయవిజయులు
    రాక్షస గర్భమ్మున, రఘురాముఁడు పుట్టెన్
    శిక్షించి వారలకొసగ
    మోక్షము త్వరగ భువినుండి మోదముతోడన్

    రిప్లయితొలగించండి