7, జనవరి 2019, సోమవారం

సమస్య - 2895 (ననన నాన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నాన నాన నాన ననన నాన"
(లేదా...)
"నననా నానన నాననా ననన నానానాననా నాననా"

81 కామెంట్‌లు:

 1. మీను మీను మీను మీను లెగురగాను
  వాన వాన వాన వనము లోన
  కోన కోన కోన కోనలన్ కురిసెగా
  నాన! నాన! నాన! ననన నాన!

  రిప్లయితొలగించండి
 2. "ఘనుఁడా భూసురుఁ డేఁగెనో నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో"
  యను పద్యంబును నప్పజెప్పుటకునై యధ్యాపకుం డొండు శి
  ష్యునిఁ బ్రశ్నింపఁగ గుర్తు దెచ్చుకొనుచున్ యోచించెఁ దా నిట్టులన్
  *'నననా నానన నాననా ననన నానానాననా నాననా*'

  రిప్లయితొలగించండి


 3. తాత తాత తాత తాతకు జింతాత
  దీది దీది దీది దిదిది దీది
  మామ మామ మామ మామకు మాంధాత
  నాన నాన నాన ననన నాన!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. గాన విద్య తెలిసి కమ్మని రాగాల
  నాలపించు వార ల నవ ర తము
  రాగ మొకటి మె దల వేగ మి ట్టు లని రి
  నాన నాన నాన న న న నాన

  రిప్లయితొలగించండి
 5. నాది నాది నాది యనుచుత పములేల
  ఉన్న దాని లోన యెన్న సుఖము
  దైవ మిచ్చి నంత దానధర్మ ముజేసి
  నాన నాన నాన ననన నాన

  రిప్లయితొలగించండి
 6. సమస్య :-
  "నాన నాన నాన ననన నాన"

  *ఆ.వె**

  కొలువు నందు నేడు కొత్తగా జేరిన
  చక్రపాణి నధిక సంతసమున
  పాటపాడె నంట పరవశమ్మును బొంది
  నాన నాన నాన ననన నాన
  ........‌............✍చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తప్పు జేసి నంత తండ్రి కొట్టెడువేళ
   దెబ్బలకును కొడుకు బొబ్బ బెట్టె
   నాన,నాన,నాన,ననన,నాన యనుచు
   తత్తర పడి పలికె తండ్రినిట్లు
   ........................✍చక్రి

   తొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  *న*... *నిషేధార్థకం*

  "తననా తానన తాననా తనననా తానాన తానాననా"
  *యను రాగమ్మున* నింటికేగి తన భార్యన్ జేరగా గోరు , గే..
  స్తుని కాంతామణి మూడురాత్రులిక పస్తుల్ మీకనన్ పల్కెడిన్
  నననా నానన నాననా ననన నానానాననా నాననా !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 8. బావబావబావభగవంత శ్రీకృష్ణ
  బావబావబావ భళిరబావ
  కౌరవేయుగూల్చకదనమేశరణంబు
  నాన నాన నాన ననన నాన

  రిప్లయితొలగించండి


 9. అనఘా! గాయకుడా సురేశుడనఘా, యత్యద్భుతంబైన పా
  టని తీయంగను పాడగా సభని ధీటైనట్టి రాగంబులో,
  జనసందోహము సంతసంబున మదిన్ సాగించి శ్లాఘించిరే
  "నననా నానన నాననా ననన నానానాననా నాననా"  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. మనసు దోచి నట్టి మగువయే ననుగాంచి
  కన్నుగీటి దరికి నన్ను బిలువ
  మౌన మందు మనసు కూనిరాగము తీసె
  నాన నాన నాన ననన నాన

  రిప్లయితొలగించండి
 11. పాలకడలిలోన పరుషవిషముబోలి
  దానవ కులమున వదాన్యుడొకడు
  భళిర భళిర భళిర బలిఛత్రపతియన
  నాన నాన నాన ననన నాన

  రిప్లయితొలగించండి
 12. ఆటవెలది పద్దియమ్ము నొక్కఁడు సెప్ప
  బోయి పూర్తి జేసె మూడు పాద
  ములను చివరి పాదమునుఁ జెప్ప యోచించె
  నాన నాన నాన ననన నాన

  రిప్లయితొలగించండి
 13. నననా నానన నాననా ననన నానానా ననానా ననా
  గనరాబాలు వధానవిద్య ఘనతన్ గాంధర్వ రాగంబులో
  ఘనులౌ పండిత మౌళిపృచ్ఛకుల వాగ్రక్తీశమంబొందగా
  కనియున్ విన్నది గానికైతలకు ఱెక్కల్ వచ్చెనేమోభళా

  రిప్లయితొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తల్లి భాష నేర్ప వల్లించె పాపాయి,
   వచ్చి రాని బాల పలుకు లిట్లు,
   తాత తాత తాత తత్తాత తత్తాత,
   నాన నాన నాన ననన నాన..

   తొలగించండి
 15. ( శోభనమందిరంలో తెలుగువధువు - హిందీవరుడు )
  పలికె నిటుల పతికి వలపుల కల్యాణి
  "నాన నాన నాన " ; " ననన నాన "
  యనుచు హింది మదను డత్యంత తమకాన
  మేలిముసుగు తీసె మెరుపు కనుల .
  ( తెలుగులో " నాన " అంటే " సిగ్గు " అని అర్థం .
  హిందీలో " న న న " అంటే " తగదు తగదు తగదు " అని
  అర్థం . )

  రిప్లయితొలగించండి
 16. నాన్న, నాన్న నాన్న నాన్నేన , నహినహీ ,
  నాన ,నాన నాన. ననన నాన
  తెలుసు కొనుము నాట వెలది లో గణములు
  ననుచు నుదహ రించె నప్ప యొకడు

  రిప్లయితొలగించండి
 17. లాల లాల లాల లలిలాల పోయాలి
  బాల చాలు నిదుర బడికి పోవె
  భానురాక నిరులు పరుగుబెట్టెనునాన్న
  నాన నాన నాన ననన నాన

  జాణ మేనువీణ జానగనులు మీలు
  జాణయంచయాన జాణనగవు
  ధవళ రత్నజాలు ధవుడెవడో హరీ
  నాన నాన నాన ననన నాన

  రిప్లయితొలగించండి
 18. మనువేమానిని రక్ష దక్షుడగు సామాన్యుండునే జాలు భా
  మినికిన్ భర్తగు మేనమామ సుతుడేమేల్మేలు వేయేల శ్రా
  వణమేతెంచె ముహూర్తమే మిగిలె భావ్యంబే నిదానించ నా
  న ననా నానన నాననా ననన నానానా ననానా ననా

  రిప్లయితొలగించండి
 19. అమెరికా లో ఉన్న ఒకడు తన చిన్ని పాపకు ఫోన్
  చేస్తే ఆ పాప తండ్రి గొంతు గుర్తు పట్టక ఏడ్చు చుండ
  ఆ పాపను సముదాయిస్తూ పలికిన పలుకులు


  నాని నేనె, నేను నేనేనె, నాన్నేనె,
  నాన ,నాన నాన. ననన నాన,
  యనుచు పలికె నొకడు తన సుత తో ఫోను
  నందు ముద్దు తోడ నమ్మ మనుచు

  రిప్లయితొలగించండి

 20. ఆటవెలది పద్య మడగ తమ గురువు

  చలికి మరి వణుకుచు ఛాత్ర గణము

  నోరు విప్పలేక వారు పల్కి రిటుల

  "నాన నాన నాన ననన నాన"  �� ☘ ఆకుల శాంతి భూషణ్ ����

                      �� వనపర్తి ��

  రిప్లయితొలగించండి
 21. పాముపడగవిప్పి ప్రక్కననిలుచుండ
  చూడలేదు నాన్న కాడియెడ్ల
  చెంత మైమరచిన నంతజూచికొడుకు
  నాననాననాన ననన నాన. (యనెనుభయాన)

  రిప్లయితొలగించండి
 22. డా. పిట్టా సత్యనారాయణ
  నాన్న నాన నన్న నననాన నానాన
  నాన నాన ననన నాన నాన
  నాన్న నాకు జెప్పె నప్పించ నవ రీతి
  నాటవెలది నాదు నర నరాన
  తండ్రి బోధగాన తనువెల్ల.నిండెను
  స్వరము జూపు నడక వరల మదిని!

  రిప్లయితొలగించండి
 23. డా.పిట్టా సత్యనారాయణ
  నననా నానన నాననా ననననా నానాన నానాననా
  యను నీ పేటిక(హార్మోనియం)"నీ"(స,రి,గ,మ,ప,ద,ని లోని "ని")ని బంచి పలుకన్ యారాటమే లేకనే
  చనెనే యా యవధాని యూహ గదురన్ సంగీత విద్వాంసునిన్
  గొనగా నూ(యూ)త మదేమొ వింత యనిరా గోప్యంబు "మత్తేభమే"
  నినినీ నీనిని నీని నీని నినినీ నీనీనినీనినీ (పేటిక భాష)

  రిప్లయితొలగించండి
 24. కవిమిత్రులారా, నమస్కృతులు. వరంగల్ వెళ్తున్నాను. ఈరోజు బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 25. శంకరాభరణం...
  07/01/2019 ..సోమవారం

  నేటి సమస్య.
  **** **** ***
  "నాన నాన నాన ననన నాన"

  నా పూరణ : ఆ.వె
  *** *** ***

  ఆటవెలది నడత మేటిగా జెప్పెద

  వినుము శిష్యులార! విధిగ మీరు

  ననుచును గురుదేవు డనెను నీరీతిగా

  నాన నాన నాన ననన నాన


  ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి


  🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱

                      🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
 26. మనసున్ దోచిన వన్నెలాడి పిలువన్ మన్నించి నే చేరగా
  నను హేమంబును తెమ్మటంచడగగా నాచెంత లేదంటనన్
  కినుకన్ బూని లతాంగి తా గదల మ్రోగెన్ గాదె మంజీరముల్
  నననా నానన నాననాన నననా నానా ననా నాననా.

  రిప్లయితొలగించండి
 27. గురుదేవులకు వినమ్రవందనములు
  ===========******==========
  మనమున మలినముల మదిరాక్షిని నిలపి
  ధనవనమున పరగ ఘనుడను నన
  వినక జనవనమున పెద్దల బలుకులు
  నాన నాన నాన ననన నాన !
  నాన = సిగ్గు

  రిప్లయితొలగించండి
 28. మోదిగారిమాట మోమాటమేలేక
  లేవులేవు నిధులు లెక్కలేవి?
  యెంత మొత్తుకున్న నేమిరా ఫలితమ్ము?
  నాననాన నాన ననననాన!

  రిప్లయితొలగించండి
 29. భాష హిందిలోన వద్దనగానేమి
  పలుకుడనుచు నడుగ పంతులయ్య
  పలికె పిల్లలంత పలుమార్లు గుంపుగా
  నాన, నాన, నాన, ననన, నాన.

  రిప్లయితొలగించండి
 30. ఆట వెలది యనిన నమిత యిష్టము నాకు
  నాట వెలది వోలె నాడు చుండు
  వేమన కృతుల వలె వేయి విధమ్ముల
  "నాన నాన నాన ననన నాన"

  రిప్లయితొలగించండి
 31. కనగా నిను నే స్వప్నమందు నయినన్ గాంక్షింతు గాఢమ్ముగా
  వినలేవా మొఱ యాలకింపుము శివా !విజ్ఞాపనల్ జేతునే
  కనకాంబరముల్ కోరలేదు గదరా! కాపాడు శంభో!హరా!
  నననా నానన నాననా ననన నానానాననా నాననా

  రిప్లయితొలగించండి
 32. వాన లోన నాన వద్దని నాన్ననె
  నాని నాని నేను నాటలాడె
  నాన వచ్చె చూడు నాకు వణుకె బుట్టె
  నాన నాన నాన ననన నాన

  రిప్లయితొలగించండి

 33. ఈ మధ్య కోట వారి బల్పసందు పూరణలు రావటం లేదు
  కుశలమేనా ?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 34. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సుస్వరముల తోడ సొంపుగా పాటను
  పాడనెంచి తొలుత పాటగాడు
  గాత్రశుద్ధి కొఱకు క్వణముజేసె నిటుల
  నాన నాన నాన ననన నాన

  రిప్లయితొలగించండి
 35. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  నాన నాన నాన ననన నాన

  సందర్భము: శ్రాద్ధ కర్మలలో యజమాని
  1.తండ్రి పేరు.. (పితృ)
  2.తండ్రి తండ్రి (తాత) పేరు.. (పితామహ)
  3.తండ్రి తండ్రి తండ్రి
  (తాత తండ్రి) పేరు.. (ప్రపితామహ)
  అడిగి ఆహ్వానిస్తారు.
  వీళ్ళనే "వసు, రుద్ర, ఆదిత్య" దేవతలుగా సంభావిస్తారు.
  ఒక తండ్రి తన తండ్రికి శ్రాద్ధం పెట్టేటప్పుడు పురోహితు డా యా పే ర్లడుగుతూవుంటే విస్తుపోయిన కొడుకు తండ్రితో ఇలా అంటున్నాడు.
  "నాన్నా! నీ వొకడవే (కనిపిస్తూ) వున్నావు. నాన్న నాన్న (తాత.. నీకు తండ్రి) న..న..న.. (కనిపించడం లేదు.. లేదు.. లేదు..)
  నాన్న నాన్న నాన్న (తాత తండ్రి.. నీకు తాత) న..న..న.. (కనిపించడం లేదు.. లేదు.. లేదు..)"
  ఇంక నీ ప్రపితామహుని సంగతేమో!
  ఆ పసివాడి ఉద్దేశ్యం వాళ్ళు నిజంగా వస్తారా!.. అని.
  వేగంగా మాట్లాడడంలో నాన్న లోని నా ఒత్తు ఎగిరిపోతున్నది.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "నాన్న నడిగి, నాన్న నాన్న నడిగి, నాన్న
  నాన్న నాన్న నడిగినారు... కలవు
  నాన్న! నీ వొకడవె! నాన నాన ననన..
  నాన నాన నాన ననన.. నాన!"

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  7.1.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 36. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వినుమా శారద! నాదుపల్కులను నివ్విధంబుసంగీతమున్
   నననానానననాననాననననానానానానానాననా
   ననయంబీయదిసాధనమ్మొనరయయ్యాప్రాంతసీమంబులన్
   ఘనమౌకీర్తులువచ్చునున్ధరనుదిగ్గంతమ్మువ్యాపించగాన్

   తొలగించండి
  2. రామరామరామ రావణమర్దన!
   వేడుచుంటినిపుడు వినయముగను
   బాలముంచెదొయిక నీరముంచెదొసామి!
   నాన నాన నానన నననాన

   తొలగించండి
 37. నమ్మి నానబోసి నగుబాటు గాకుమ
  పుచ్చి పురుగు బట్టి పులిసి పోవు
  నమ్ము నరహరిని ఘనముగ నామములోన
  నాన నాన నాన ననన నాన

  రిప్లయితొలగించండి
 38. బొంకె తొలుత "నాన! పులివచ్చె" నని నవ్వి,
  పెంకివాడు నటులె పిలిచె మరల,
  కడకు పులికి చిక్కి తడబడ నిట్లనె
  "నాన నాన నాన ననన నాన"


  రిప్లయితొలగించండి
 39. నాగఫణికవీంద్రులూగించెనుయ్యాల
  పృచ్ఛకునికి బదులు యిచ్చునపుడు
  స్మృతికి దెచ్చుకొనుచు శృతిజేసుకొనిరిట్లు
  "నాన నాన నాన ననన నాన"

  రిప్లయితొలగించండి
 40. జనకా! మత్తేభము వ్రాయ నాకు సులువౌ చక్కన్ని మార్గంబు నా
  కును నేర్పించుమనంగ నట్టులనె, నీకున్ పట్టుపట్టంగ నీ
  మనమందీవిధమాలపించుసుతుడా మంత్రంబుగా లయన్
  *"నననా నానన నాననా ననన నానానాననా నాననా"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరణ :
   (కాటేపల్లి వారికీ, చక్రవర్తి గారికీ ధన్యవాదములతో)


   ఘన మత్తేభము వ్రాయ నాకు సులువౌ కమ్మన్ని మార్గంబు నా
   కును నేర్పించుమనంగ నట్టులనె, నీకున్ పట్టుపట్టంగ నీ
   మనమందీవిధమాలపించుసుతుడా మంత్రంబుగా రాగమున్
   *"నననా నానన నాననా ననన నానానాననా నాననా"*

   తొలగించండి
 41. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 42. క్రొవ్విడి వెంకట రాజారావు:

  జనబాహుళ్యము మెచ్చునట్లుగను శస్తంబైన గీతమ్ములన్
  తన కంఠమ్మున నాలపించుటకు పంతంబొంది నాతండట
  న్ననువున్ గొంతును చక్కబెట్టుకొనగా నాలప్తి జేసెన్నిటున్
  నననా నానన నాననా ననన నానానా ననానా ననా.

  రిప్లయితొలగించండి
 43. మనసేపద్దెపుదారిలోనడువగామామాట తూటల్ వడిన్
  మనసున్దాకిన గాయమౌను బలుకుల్ మర్యాదతో నిండుచో
  మనకున్మేలగు చందనంబువలె సామాన్యుల్నసామాన్యులై
  ఘనతన్బొందరె కీర్తికాయుల యి ప్రజ్ఞానాత్ములైవెల్గరా
  నననా నానన నాననా ననన నానానా ననానా ననా

  రిప్లయితొలగించండి
 44. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,


  గురుభ్యో నమః నిన్నటి పూరణ స్వీకరించ మనవి
  ...................... ......... .......... ........................


  ఆలోచించగ , నింటి యందలి సదాహారమ్మె భోజ్యంబు | కా

  నీ లాగింతువు వీధి లోన గల తిండిన్ | పానిపూరీల , బ

  జ్జీలన్ , బోండల మెక్కు నబ్బెసము వర్జింపం దగున్ | గాన నీ

  వాలోకించుము :- మక్షి కాలయములౌ యప్పచ్చులన్ , బెల్లప

  ప్పాలన్ దూరము నందు బెట్టి నపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్


  { భోజ్యము = భజింపదగినది ; అబ్బెసము =

  అభ్యాసము ; మక్షికము = ఈగ ‌ ;‌ బెల్లపప్పాలు ‌ = బెల్లపు

  టప్పచ్చులు }


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 45. ఘనుడౌ గాయకుడైన చూతమని నా గాటంపు తాపత్రయం
  బనినన్ సుంతయు లెక్క జేయవె సదభ్యాసంబు జేబట్టవే
  వినరా నా వ్యథ యెన్ని నాళ్ళని యిలా విన్పింతు వీ రాగమే
  నననా నానన నాననా ననన నానానాననా నాననా.

  రిప్లయితొలగించండి
 46. ఎన్నఁ డెవ్వ రింత సన్ననఁ జేయరు
  నాదు చెయ్వు లేల నారి సేయ
  నవ్వ యివ్విధమ్ము నొవ్వఁగఁ జేయంగ
  నాన నాన నాన ననన నాన

  [నాన =సిగ్గు; నను + అన = ననన (నను తిట్ట); నన్ను తిట్టుట సిగ్గు సిగ్గు ....]


  చని వేగమ్ముగ వింటి వీను లలరన్ సంగీత మిభ్భంగినిన్
  సనిసా సానిస సాని సానిస ససా సాసా నిసా సానిసా
  దనిదా దానిద దాని దానిద నిదా దాదా నిదా దాని దా
  నననా నానన నాననా ననన నానానా ననా నాననా !

  రిప్లయితొలగించండి
 47. షష్టి పూర్తి నాడు సంగీత కారుడు
  సాస రీరి గాగ సరిగమయని
  పదము గుర్తురాక పలు పాట్లు పడియనె
  నాన నాన నాన ననన నాన

  రిప్లయితొలగించండి
 48. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  డింపులయ్య ఉత్తరకుమారోపాఖ్యనం:👇

  వినరా! కాంగ్రెసు వీరశైవుడనునే వీర్యమ్ము చూపెట్టెదన్!
  కనగా మోడిని కాళ్లుచేతులనహా ఖండించి నర్తించెదన్
  తనివిన్ తీరగ బుర్ర మ్రోగ నతనిన్ తందాన తందాన తాన్
  నననా నానన నాననా ననన నానానాననా నాననా!

  రిప్లయితొలగించండి
 49. పూరణమ్మిదియని పూజ్యులివ్వగనిట్లు
  నాన నాన నాన ననన నాన
  దేశికుడి రచనమదే గుర్తు వచ్చెనే
  పాదపా యనుచును పాద భక్తి

  రిప్లయితొలగించండి
 50. నత్తి కారణమున నాలుక తిరుగక
  నాన నాన నాన ననన నాన
  యనుచు నతడు పలుక నంత హేళన సేయ
  బోకు! కూర్మి జూప నీకు తగును!

  రిప్లయితొలగించండి


 51. విదురుల్ మేల్ కవివర్యు లెల్ల తనరన్ వేర్వేరు మార్గంబులో
  మదిలో వీచెడు భావ వీచికలతో మాలల్ భళాగట్టి, యీ
  సదనంబందున పద్యపూరణల విస్తారంబుగా నిల్పగా
  కుదురైనట్టి సహాయమిద్ది పదముల్ కోరాడ నేర్వన్ దగున్!


  చీర్స్ టు ఆల్ కవీస్ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి


 52. మనసా మాలిని మాటలాడ రమణీ మత్తేభ పద్యంబగున్
  తననా తానన తాన తాన తననా తానాన తానాన తా !
  అనఘా!పద్యము వచ్చెగా కుదురుగా యబ్బో జిలేబీయమై
  నననా నానన నాన నాన నననా నానాన నానాన నా.


  జిలేబి

  రిప్లయితొలగించండి
 53. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 54. కురువృద్దులు మరియు గురువులు కర్ణుని యుద్ధ పోటీల్లో పాల్గొన కుండ నిలువరించినపుడు దుర్యోధనుడు....

  ఆటవెలది
  యముడు వాయు వింద్రుడన్నను సత్యము
  ధర్మజాది భీమ ధర నరులకు
  నాన! నాన! !నాన!!! న న న నానయె గాదు
  పాండు రాజు! పృథకు పతియె గాని!!

  రిప్లయితొలగించండి
 55. ఉత్తరగోగ్రహణమున యుద్ధములో బృహన్నల మరియు ఉత్తర కుమారుల మధ్య సంభాషణ :

  మత్తేభవిక్రీడితము
  "కనుమా! యాతడె భీష్ముడున్ నిలిచెనే గర్జించు సింహమ్మటుల్
  తనువెల్లన్కవచానఁ గుండలుని యోధాగ్రేసరున్ గర్ణునిన్"
  "తనువే జంకి బృహన్నలావడకె నాదారంది పోనీయుమా. .
  నననా నానన నాననా ననన నానానాననా నాననా. ..."

  రిప్లయితొలగించండి
 56. మ. "నననా నానన నాననా ననన నానానా ననానా ననా"
  వినగా నియ్యది, కాంచితిన్ మదిని యా వేదాగ్రణిన్ భారతిన్
  గణముల్ నిండిన పద్యముల్ స్వరము లాఘ్రాణించు సంగీతమున్
  కన నా తల్లియె కూర్చె గాదె పదముల్ గానమ్ములో జేరగన్!

  (లయను సమకూర్చే స్వరముల గణనకు అటు సంగీతంలోను, లయ తప్పకుండా గణముల పొందికకు ఇటు పద్యంలోను కూడా ఇదే విధంగా గుర్తు పెట్టు కుంటారనేది నా భావన.
  సంగీత సాహిత్యాల రెంటికీ ఆ సరస్వతి మాతయే కదా అధిదేవత).


  రిప్లయితొలగించండి
 57. ఆ: పనికి వెళ్లినట్టి తనతండ్రిఁ గనుగొన
  తపనపడుచు చిట్టి తనయుడిక్క
  పలుకులన్ని రాని పసి వయస్సునఁ బల్కె
  నాన నాన నాన ననన నాన

  రిప్లయితొలగించండి
 58. అనిశమ్మున్ కడు దీక్షతో ననుము వ్రాయన్ మంచి మత్తేభమున్
  “నననా నానన నాననా ననన నానానాననా నాననా”
  కనుపించున్ దిశ తప్పకుండ దొరకున్ ఖాయమ్ముగా పాదముల్
  వినసొంపౌ కవితల్ ఘటిల్లు, నొనరున్ విఖ్యాతి నిక్కమ్ముగా

  రిప్లయితొలగించండి
 59. ఆటవెలది:
  సీత జాడ తనకు చిక్కినంత హనుమ
  ఆప తరము గాని కౌతుకమున
  కూనిరాగమెత్తి గానమే చేసెను
  "నాన నాన నాన ననన నాన"

  గొర్రె రాజేందర్
  సిద్దిపేట

  రిప్లయితొలగించండి
 60. ఊయలందు పాప యూపిరి బిగబట్టి
  యేడ్చుచుండ తాత యెత్తుకొనుచు
  నొడిన జేర్చు కొనుచు తొడనూపుచుఁ బాడె
  నాన నాన నాన ననన నాన

  రిప్లయితొలగించండి
 61. లక్ష్మణకుమారుడు మాయా శశిరేఖ ల సరసం....

  మత్తేభవిక్రీడితము
  కనలేదింతటి సోయగమ్ము శశిరేఖా! నీవు నాసొంతమే! !
  యెనలేనంతటి సంతసమ్ము మనదౌ నిల్లాలి వైనంత. .ల
  క్ష్మణుడిట్లాడ ఘటోత్కచుండతివగా జాడించ మూల్గెన్నిటుల్
  న.న..నా.. నాన.న నాన..నా ననన.. నానానా..ననా నాననా....

  రిప్లయితొలగించండి