22, జనవరి 2019, మంగళవారం

సమస్య - 2908 (కొట్టుకొనిపోయె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కొట్టుకొనిపోయె గాలికిఁ గొండలెల్ల"
(లేదా...)
"కొండలు గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్"

108 కామెంట్‌లు:

 1. (1)
  గాలివాన బీభత్సమై కరుణ లేక
  చెట్టు పుట్టల గృహములం జెదరఁ గొట్టఁ
  గొట్టుకొని పోయె గాలికిఁ; కొండలెల్ల
  స్థిరముగా నిల్చి చూచె నా స్థితిని ధృతిని.
  (2)
  ఉండెను నాకు మిత్రుఁ డొకఁ డూరునఁ బేరది యేడుకొండలే
  'కొండ' లటంచుఁ బిల్చెదరు కొందరు వానిని, నొక్కనాడు వాఁ
  డొండు పొలమ్మునన్ దిరుగుచుండఁగ రేగిన గాలివానలోఁ
  'గొండలు' గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్.

  రిప్లయితొలగించండి
 2. ఆహా ! రెండు పద్యాలూ విరుపుతో , కల్పనతో కమనీయంగా ఉన్నాయండీ ! అభినందనలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చొప్పగుడిసెలకేమయ్యెచెప్పవయ్య?
   నిల్చినిడుజడినెదిరించెనేవియచట?
   వానవివరంబునడ్గతాబలికెనిట్లు
   కొట్టుకొనిపోయె గాలికి; గొండలెల్ల

   తొలగించండి
  2. జంధ్యాల వారూ,
   ధన్యవాదాలు.
   *************
   శంకర్ గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  3. పండుగగాదెపండితులభావనకున్నొకనిండురూపమై
   మెండుసమస్యగుండియనుమేల్కొనజేయుచుబూరణంబునొ
   క్కండునొసంగిదారినిడగైత ప్రవాహము బారకుండు ;నే
   "కొండలు గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్"

   తొలగించండి
 3. మైలవరపు వారి పూరణ

  🕉సుపర్ణాయ నమః🙏

  అండజుడగ్నితేజుడయి అమ్మకు దాస్యము దీర్పగా సుధా
  భాండము తేన్ జనంగ , వరపక్షయుగాంతరజాతవాతమా...
  ఖండలవైరులన్ గిరుల కందుకపంక్తిని వోలె గూల్చగా
  కొండలు గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నిండుమనంబుతో గరుడునింగికినేగగ వానివేగమున్
   దండిబలంబుతో గడలిదాటెడుహన్మ పరాక్రమంబు ని
   ట్లుండె నెడందదాక గవి యూహబలంబిది గానిజూడ యే
   "కొండలు గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్"

   తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   "ఆతత పక్ష మారుత రయః ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత..." పద్యాన్ని గుర్తుకు తెచ్చింది.

   తొలగించండి
 4. సరుకులు దొరుకు చోటేది ,సత్యవంతు
  జీవమును సంగమను డేమి చేసె,దీప
  మేల వెలుగకుండె, ఘన హిమాలయుముల
  పై కెగసి చూడగా కనపడున దేమి
  కొట్టు,కొనిపోయె, గాలికిఁ, గొండలెల్ల

  రిప్లయితొలగించండి
 5. ( పర్వతాగ్రం నుంచి పైకి లంఘిస్తున్న హనుమంతుడు )

  చండపరాక్రముండు ; గుణ
  సంపద నిండిన పావనుండు ; మా
  ర్తాండుని శిష్యుడున్ ; దనుజ
  దండను ; డా రఘురాము భక్తుడున్ ;
  గండరగండడౌ ; హనుమ
  గట్టిగ లంఘన జేసినంతనే
  కొండలు గాలితాకిడికి
  గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్ .

  రిప్లయితొలగించండి
 6. ముట్టుకొనినది కొనమని పట్టు బట్టి
  కొట్టి కూర్చొన బెట్టెడి కోమలినహ
  కట్టుకొనినంత కనవచ్చు కర్చు తోడ
  కొట్టుకొనిపోయె గాలికిఁ గొండలెల్ల!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   ఇల్లాలి కర్చులకు డబ్బు కొండలు కరిగిపోతాయన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. గ్రామ దేవత యలిగిన సేమ మనక
  శాప మీయగ జనులకు జాత రందు
  బోన మెంతేని సరిలేక పూన కమున
  కొట్టు కొనిపోయె గాలికిఁ గొండ లెల్ల

  రిప్లయితొలగించండి
 8. నేస్తమా! తెలగాణ యెన్నికలఁ గాంచ
  నోట మెఱుగని ప్రతిపక్ష మేటి నేత
  లెల్ల మట్టిగరచిరంట యెంత వింత
  కొట్టుకొనిపోయె గాలికిఁ గొండలెల్ల.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. (శ్రీకృష్ణనిర్యాణంబుగూర్చి ధర్మజునకు అర్జునుడుచెప్పు సందర్భము...)

   కొండనెయెత్తిగోపకులకున్శుభమిచ్చెను,గంససర్పమున్
   మెండుగరుండనంగబ్రజమెచ్చగనూడ్చెను భీష్మకర్ణ స
   బ్బండధరాధిపానికరభండనమందుజయంబుగూర్చెనా
   ఖండలసూతికిన్బలమఖండుడుగూలెగిరాతుచేవిధిన్
   "కొండలు గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్"

   తొలగించండి
  2. విరించి గారూ,
   కేసియార్ గాలికి కాంగ్రెస్ కొండలు కొట్టుకుపోయాయన్న మీ పూరణ కాలోచితంగా ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   ******
   శంకర్ గారూ,
   మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  3. అద్భుతమైన ఊహ. ధర్మానికి కొండలా నిలబడి సంరక్షించిన వాడు ఆ కొండ గాలికి కొట్టుకుపోయినట్టు కిరాతుని బాణానికి మరణించాడు. 🙏🙏🙏👏👏👏👏

   తొలగించండి
 9. పండుగ నాడుసై తమట బారుల వెంబడి పోవుటే లనో
  మెండగు పిండివం టలను మేలిమి బంగరు పిల్లపా పలన్
  దండిగ ప్రేమపం చగను దారయె వేచిన గాంచకు న్నచో
  కొండలు గాలి తాకిడికిఁ గొట్టుకు పోయెను దొర్లుచున్ వడిన్

  రిప్లయితొలగించండి
 10. రాముడతి లోక వీరుడై రాజ్యమేలె
  మునుల,సుజనుల రక్షించి మోక్షమిచ్చి
  రక్కసుల,దుర్జనాళిని తొక్కి,చంపి,
  కొట్టుకొని పోయె గాలికి కొండలెల్ల.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఏ గాలికి ఏ కొండలు' అన్వయం?

   తొలగించండి
  2. ధన్యవాదములు
   రామ గాలికీ
   పాపి కొండలు

   తొలగించండి
 11. ముఖ్యనేతల పయి పోరాటముల జేసి
  జయమునొంద నోట్ల సమరమందు
  చిన్న నేతల గని చెప్పిరి జనులప్డు
  “కొట్టుకొనిపోయె గాలికిఁ గొండలెల్ల”

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది.
   కాని తేటగీతి సమస్యకు ఆటవెలది వ్రాసారు. నా సవరణ....

   "ముఖ్యనేతపై పోరాటములను జేసి
   జయము నందుటకై నోట్ల సమరమందు
   చిన్న నేతల గని జనుల్ చెప్పిరిట్లు
   కొట్టుకొనిపోయె గాలికిఁ గొండలెల్ల"

   తొలగించండి
 12. జూబ్లి బంజారహిల్సను చోద్యమైన
  మనవి కానట్టి చెత్తతో ననుదినమ్ము
  వెఱ్ఱి పడమటి పవనాలు వీచి కుదుప
  కొట్టుకొనిపోయె గాలికిఁ గొండలెల్ల.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాకుమార గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. పగలు రాత్రి యు కష్టించి పట్టు బట్టి
   పోగు చేసిన పైకము రోగ ముల కు
   కొట్టు కొని పోయె గాలికి కొండ లన్ని
   యన్న విధము గ ఖర్చు తో నార్తి గూర్చె

   తొలగించండి
  3. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. డా. పిట్టా సత్యనారాయణ
  గోడ కట్టుకు రోడ్డుకు గుడికి బడికి
  ఇంటి నేలకు పైకప్పు కిరవుగాను
  బెండ్లుగా దొల్వ యాదాద్రి"పేరు"కొరకు
  కొట్టుకొని పోయె గాలికి కొండలెల్ల

  రిప్లయితొలగించండి


 14. వ్రాయగ జిలేబి పద్యము వాహిని వలె
  కొట్టుకొని పోయె గాలికి, కొండలెల్ల,
  కోనలెల్ల దాటి గురువు కొల్వు జేరి
  శంకరాభరణముగ విస్తరిలెనచట !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. కవనమున నేడెదో క్రొత్త గాలి వచ్చె
  రచయితలకు గుర్తే లేడు రాచ కొండ
  అట్టి ముదిగొండ కవి గుర్తు నంతరించె
  కొట్టుకొనిపోయె గాలికిఁ గొండలెల్ల
  నిట్టి గాలిలో నిలబడునె ధనికొండ

  ( అందం కోసం అధికంగా ఒక పాదం వేశాను. ఏ పాదమైనా తీసివేసినా పద్యం సరిపోతుంది.)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధనికొండ వారూ,
   రాచకొండ, ముదిగొండలు లేకున్నా ధనికొండ ఉన్నారు కదా! మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


 16. భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
  దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తిఘటుండు రాము డా
  మండప మందు విల్లు తునుమాడగ నాదము పిక్కటిల్లగా
  కొండలు, గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   ఇది మీరు వ్రాసిందేనా? సందేహమే!

   తొలగించండి


  2. ముట్టగ కైపదంబొకటి ముంగట శంకరుకొల్వులోనటన్,
   కొట్టున కొట్టుకొచ్చె తను కొంచెమకో? భళి రెండు పాదముల్!
   కట్టె జిలేబి పాదము ను గట్టిగ నొక్కటి యుత్పలంబవన్
   చట్టని వేసె కొల్వున సజావుగ నాల్గన వృత్తపాదముల్!


   జిలేబి

   తొలగించండి

  3. కంది వారు,

   మండప మందు విల్లు తునుమాడగ జానకి చన్నుగుబ్బలా కొండలు... అని రాస్తా మనుకున్నా ! అసలే పండితుల సభ యేమంటారో అని భయపడి కొంత నాదపు పిక్కటిల్లుతో సర్దేసా! ( తాళ్ళపాక వారి చన్గవలా సంగటి కొండలు పాదము గుర్తు కొచ్చి)   జిలేబి

   తొలగించండి
  4. జిలేబి గారు కుచ సౌందర్య వర్ణన లేని కావ్యము సంస్కృ తాంధ్ర వాఙ్మయ ప్రపంచములోనే లేదు. అతిమాత్రము వర్జనీయము.

   మీ రొక తమిళ పద్యమును తెనుఁగు లిపిలో వ్రాసి తదనువాద పద్యము ప్రకటించిన చూడాలని యుందండి.

   తొలగించండి

  5. పోచిరాజు వారికి నమో నమః


   పూర్తిగా సరిగ్గా అని చెప్పలేను గాని కొంతవరకు నావల్లయినంత వరకు :) ( కందంలో నాకు వీలైనంత ఫిట్టు చేయగలిగినంత వరకు :))   కనుగొంటిని సచ్ఛీలపు
   మణి సీతను లంకని!తడుమనయున్ దుఃఖం
   బును విడుమయ్యా! రామా
   హనుమంతుడ డింగరుడ సహాయకుడనయా!

   కంబరామాయణము-

   கண்டனென், கற்பினுக்கு அணியை, கண்களால்,

   தெண் திரை அலைகடல் இலங்கைத் தென் நகர்;

   அண்டர் நாயக !இனி, துறத்தி, ஐயமும்

   பண்டு உள துயரும்’என்று, அனுமன் பன்னுவான்;

   **

   కణ్డేన్ కర్పిణిక్కు అణియై కణ్ణాల్
   తెన్ తిరై అలై కడల్ ఇలంగై తెన్ నగర్

   అణ్డర నాయగ ఇని తురత్తి, యైయముమ్

   పన్డు ఉన్ తుయరుమ్, యెన్డ్రు అనుమన్ పణ్ణువాన్ !   ఫర్మాయిష్ అబ్ ఆప్ సే యహ్ హై కి ఊపర్ పద్య కీ‌ అంగ్రేజీ తర్జుమా (see below) సే ఆప్ కీ టెల్గు పద్య ఇదర్ దేఖ్నే కా‌ :)

   ధన్యబాద్ !


   I saw ,

   the jewel of chastity,

   with my own eyes

   in the southern city

   of Lanka

   on the clear twirling wavy ocean,

   lord of gods

   from now on

   relinquish doubts and

   all your sufferings.’

   said Hanuman

   and continued with his details.


   Awaiting your marvellous vrutta sir


   Cheers
   Zilebi

   తొలగించండి

  6. పోచి రాజు వారికి,

   చాలా బాగుందండి.

   పూతలపట్టు శ్రీ రాములు రెడ్డి గారు కంబ రామాయణము ను తెలుగు లో అనువదించి వున్నారు.

   వారి అనువాదం - ఇలా వుంది (క్రింది లింకులో రెండవ భాగం లో సుందర కాండ లో ) మత్త కోకిల

   కాంచినాడ సతీత్వ భూషను గణ్యవార్తన జానకిన్
   గాంచినాడ మదీయ దైవము గన్నులారగ లంకలో
   గాంచినాడను శంక వీడుము కాంచుమా మది నెమ్మదిన్
   గాంచితిన్ మరి మాటలాడితి గ్రమ్మరిల్లితి రాఘవా !   కంబ రామాయణము తెలుగు అనువాదం లింకు -

   భాగము - 1

   https://archive.org/details/in.ernet.dli.2015.385206

   భాగము - 2

   https://archive.org/details/in.ernet.dli.2015.385207   శుభోదయం
   జిలేబి

   తొలగించండి
  7. చూచితి స్వీయ నేత్రముల శుద్ధ చరిత్ర వసుంధరా సుతన్
   వీచి విలాస కంపిత సువిస్తృత దక్షిణ వారిరాశి స
   ద్రోచన తీర లంక నిఁకఁ దూర్ణము వీడుమ శంక నిర్జరుల్
   కాచ సమర్థులం చనియు గాదిలి హన్మయె పల్కెఁ గ్రమ్మఱన్

   తొలగించండి
 17. ముద్దు మురిపాలు గుడిచెడి ముద్దరాలు
  గానగంధర్వురాలట, గర్వమంది
  గొంతువిప్పగ శ్రోతల గుండె చెదిరి
  *"కొట్టుకొనిపోయె గాలికిఁ గొండలెల్ల"*

  **గుడుచుచు=ఆస్వాదించు

  రిప్లయితొలగించండి
 18. కొట్టుకొనిపోయె గాలికిఁ గొండలెల్ల
  బంతుల వలె పైకెగరెను భవనములవి
  జానపద బ్రహ్మగ విఠలాచార్య జూపె
  వింతలెన్నయో, నేర్వను విశ్వసృక్కు

  రిప్లయితొలగించండి
 19. నిండుగ కోపమందగనె నిర్జరనాథుడు వాని మాయచే
  "కొండలు గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్"
  మెండగు రాళ్ల వానయును మేదిని దాకగ కృష్ణుడొక్కడే
  యండగ గాచె యాదవుల నందర దా గిరిధారి యై భళా !

  రిప్లయితొలగించండి
 20. మిత్రులందఱకు నమస్సులు!

  [శంకరాభరణ వీక్షక పండిత కవులలో నొక కవిపండితుఁడు తన మనస్సులోని యభిప్రాయము నొక పండితునితోఁ జెప్పు సందర్భము]

  "పండిత! ’శంకరాభరణ బ్లా’ గను మారుతముల్ సెలంగఁగా,
  నిండియలోను, లోకమున నిర్వది లక్షల వీక్షకుల్ కవుల్
  నిండఁగ, ’వేఱు బ్లాగు’ లిట నిక్కముగాఁ బచరింపు లేమిచే
  మెండగు చీఁకటిన్ బడియు, మిక్కిలి యేడ్చెను! చూడ, బ్లాగు లన్
  గొండలు గాలి తాఁకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్!"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ,
   ముందుగా ధన్యవాదాలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కాని ఇతర బ్లాగర్లకు కోపం వస్తుందేమో?

   తొలగించండి
  2. ఇది అక్షర సత్యము! కోపము వచ్చిన రానిండు! మన బ్లాగున కేమి కొదువ?

   ధన్యవాదములతో....

   మధురకవి గుండు మధుసూదన్

   తొలగించండి

  3. Exception to the rule జిలేబి బ్లాగు హై :)   జిలేబి

   తొలగించండి
 21. ఉ.8:25
  రెండుకు నేను పండుకొని లేచితి నిప్పుడె, గుంపుఁ జూడ హాఁ!
  దండిగ పూరణల్ విరిసె దారుణ మేమియుఁ గాదు కాదహో!
  మెండగు భావనల్ గవులు మేలుగ వ్రాసిరి యొప్పు జేయ హే!
  *"కొండలు గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్"*

  రిప్లయితొలగించండి
 22. పండె నొకయేడు విరివిగా పత్తి పంట
  పర్వతముల వలెను పేర్చ పత్తి బేళ్ళు
  పాడు కాలమేమొ తుఫాను కీడు తెచ్చె!
  కొట్టుకొనిపోయె గాలికిఁ గొండలెల్ల !

  రిప్లయితొలగించండి
 23. డా.పిట్టా సత్యనారాయణ
  అండ యటంచు కొండలనహా యనలేదొకొ సూక్తి రక్తికై
  బండలుబారె బొక్కసము"పై పయి చూపుల లోని మేపులన్"
  గండమె యెన్నికౌట, యిక "గాజెయ" జూడరె నేతలీ ధృతిన్
  కొండలు గాలి తాకిడికి గొట్టుకు పోయెను దొర్లుచున్ వడిన్

  రిప్లయితొలగించండి
 24. వరద వెల్లువై యంతట పాఱుచుండ
  పుడమి యందలి లావైన భూరుహములు
  కొట్టుకొనిపోయె,గాలికి కొండలెల్ల
  వంగె నించుక,చెట్లతో భరణి కపుడు

  రిప్లయితొలగించండి
 25. [2]
  నిండి "టియారె" సీ తెలుఁగు నేలన, "నెన్నిక" లన్ బ్రభంజనో
  ద్భండన మందు గెల్వఁ; బర పార్టిలు నోడియు, భంగపాటుచే
  మండుచునుండెఁ! జూడ నిట మన్నిన "బీజెపి కాంగి టీడిపీ
  కొండలు" గాలి తాఁకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ,
   రాజకీయ నేపథ్యంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 26. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  కొట్టుకొనిపోయె గాలికిఁ గొండ లెల్ల

  సందర్భము: అసలే గాలి కొడుకు. (వాయు పుత్రుడు కదా!) కొండలు మాత్రం ఆగుతాయా! హనుమంతుని వేగానికి అం తే మున్నది! కొండపై కెక్కి ఒక్కసారిగా కుప్పించి హు మ్మంటూ నింగి కెగిరినాడు.
  ఆ గాలి వేగానికి కొండలు ఊగిసలాడుతూ ఒకదాని కొకటి కొట్టుకున్నవి.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  గాలి కొడు కాయె..కొండ లాగవు హనుమకు..
  నెగిరె కుప్పించి హు మ్మని గగనమునకుఁ
  గొండపైనుండి.. యొకదాని కొకటి యంత
  కొట్టుకొనిపోయె గాలికిఁ గొండ లెల్ల

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  22.1.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 27. రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి విన్నపము. నిన్నటి సమస్యకు నా పూర ణాంతరమును దిలకించఁ గోరెదను.

   కోపమ మూల మాపదలకున్ భువి మానవ జాతి కెంచఁగన్
   వేపును నిత్య మెల్లరను వీడక తాపస కోటి నైన సం
   దీపిత రోష వహ్ని నతి ధీరత నార్పును భవ్య శాంత కూ
   పాపము లేనిచో జగము పాడయి పోవును నిశ్చయమ్ముగన్

   [కూప +ఆపము = కూపాపము]

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   నిన్నటి సమస్యకు మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 28. రిప్లయిలు
  1. పెద్ద చీపురుఁగట్టల విరివి నూడ్చి
   రలరి కొండల నెవ్వరో యనఁగఁ దోఁచ
   రాలి యయ్యాకు లెల్లయుఁ, జూడ వయ్య,
   కొట్టుకొనిపోయె గాలికిఁ, గొండలెల్ల


   కుండల మేఖ లాభరణ కోటి విరాజిత బాలకుండు వే
   దండ సహస్ర కోటి సమ దార్ఢ్య శరీరుఁడు కుక్షి పూర్ణ వే
   ధోండుఁడు చక్ర వాత ఘన దోర్బల ధాటికి నింగి కేఁగగం
   గొండలు గాలి తాకిడికిఁ గొట్టుకు పోయెను దొర్లుచున్ వడిన్

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలలో మొదటిది ప్రశస్తంగా, రెండవది ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 29. గనులు త్రవ్వెడి మొనగాడు ఘనుడతండు
  రాజకీయపు రసరమ్య రంగు చూపి
  నోట్ల కట్టల నేతల నోరు నొక్కె!
  *"కొట్టుకొనిపోయె 'గాలి'కిఁ గొండలెల్ల!!"*

  (గాలి = గాలి జనార్ధన రెడ్డి 🐒)

  రిప్లయితొలగించండి
 30. పిండము గాలిదేవునిది వేగముబెంచుచు గెంతువేయగా
  కొండలు గాలి తాకిడికి కొట్టుకు పోయెను దొర్లుచున్వడిన్
  గండలు బెంచునాతనికి గారవమొప్పగవందనంబులే
  దండిగబెట్ట రండీటకు ధార్మిక జీవనమొందగా దగన్

  రిప్లయితొలగించండి
 31. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  లండను నుండు వర్తకులు లాభము గోరుచు కొల్లగొట్టుచున్...
  పండుగ జేయుచున్ వడిగ భారత దేశము నాక్రమించగా...
  తుండము నెత్తి తాత యొక తుమ్మును తుమ్మగ భీకరమ్ములౌ
  కొండలు గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్

  రిప్లయితొలగించండి
 32. అండగ నుండె రైతునకు నన్నకు దమ్ముల వోలె గిత్తలే
  యెండల వానలన్ కృషిని నెత్తులు మారెను యంత్రవాతముల్
  దండిగ వీచె దుక్కులను దమ్ముల నూడ్పుల సౌరభేయపుం
  గొండలు గాలి తాకిడికిఁ గొట్టుకు పోయెను దొర్లుచున్ వడిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. బహు చక్కని పూరణ మిస్సన్నగారూ,అభినందనలు!

   తొలగించండి
  3. ధన్యవాదాలు గురువు గారూ.

   సీతాదేవి గారూ ధన్యవాదాలు.

   తొలగించండి
 33. పాండవమధ్యమప్రథితపార్థసుతుం డభిమన్యుడుగ్రుడై
  భండనమందు రేగి గురుపక్షరణస్థిరపౌరుషాద్రులన్
  చండవిజృంభణన్ గలచ శాతశరానిలభీషణాహతిన్
  గొండలు గాలితాకిడికిఁ గొట్టుకఁ బోయెను దొర్లుచున్ వడిన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 34. నేటి గాలిజనార్దన ధాటిదగిలి
  ఓబులాపుర మందున నొక్కటొకటి
  కొట్టుకొనిపోయె గాలికి కొండలెల్ల!
  రాజకీయంపు గాలి పరాజయాన

  రిప్లయితొలగించండి
 35. ఖండన జేయుచున్ దిరిగి కన్యకుమారిని శీతశైలమున్
  పండిత వాదనల్,వివిధ వైదికశాఖల సంఘటించగా
  మండితమూర్తియై చెలగ మాన్యుడు శంకర వాక్ఝరీఝరిన్
  కొండలు గాలితాకిడికి కొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఝరీఝరిన్' అని పునరుక్తి కదా?

   తొలగించండి
  2. అవును గురువుగారూ,వాగ్ఝరీ ధృతిన్ అంటే సరిపోతుందనుకుంటాను!

   తొలగించండి
 36. సంద్రము దాటుటకై హనుమ మహేంద్రగిరి నధిరోహించిన ఘట్టము నూహించి.......

  బండల బిండి జేయు బలవంతుని భీకర రూపమున్ గనన్
  గొండఁ జరించు వ్యాఘ్రములు, కుంజర! సింగములెల్ల భీతిలెన్
  గండరగండడైన కపి కాలిడ బండలె ఛిద్రమై యటన్
  కొండలు గాలితాకిడికిఁ గొట్టుకు పోయెను దొర్లుచున్ వడిన్

  రిప్లయితొలగించండి
 37. పెను తుఫానుగ హుద్ హుదు ఘన విశాఖ
  నగరమున జేర్చ చెట్లను గగనమునకు
  కొట్టుకొనిపోయె గాలికిఁ ; గొండలెల్ల
  చక్కగా నిల్చె నప్పన్న చలువ కతన

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. కొండయెడంద మొండిదని,కొండొకబండని కొందరందురీ
   కొండల గుండెలందు విరికోవెలలెన్నియొ రూపుగట్టె మే
   ల్గొండ బసిండికొండ తిరుకొండ శుభాద్రియు వెండికొండలే
   *"కొండలు ;గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్"*
   బండినపాపధూళియనువామిముకుందుగృపానిలంబుచే

   తొలగించండి
 38. నా ప్రయత్నం :

  తేటగీతి
  కడలి వారధి కపిసేన కట్టనెంచి
  రామనామమ్ము వ్రాయుచు రాళ్లఁ దేల్చ
  మేటి వీరుల సంకల్ప ధాటి కచటఁ
  గొట్టు కొనిపోయెఁ గాలికి కొండలెల్ల

  ఉత్పలమాల
  పండని సూర్యబింబమును భక్షణ జేయఁగ నాంజనేయుడున్
  జండ ప్రచండ వేగమున సాచుచు చేతిని నింగి జేరు ను
  ద్దండత నాప నింద్రుడు విదల్చిన దృంభువు నేల జార్చగన్
  గొండలు గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్  రిప్లయితొలగించండి
 39. కొండగ పాదమే కదల కోతుల నన్నిటి దొక్కివేయుచున్
  భండన మందు బాహుబల ప్రాకటమొప్పగ కుంభకర్ణుడే
  మెండగు గాలినూద నట మేదిని యంతయుఁదల్లడిల్లుచున్
  కొండలు గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్

  రిప్లయితొలగించండి
 40. కండలు కల్గు బల్లిదుడు గాడుపు పుత్రుడు తండ్రి తల్చి కో
  దండుని యాజ్ఞతో కడలి దాటగ సమ్మతి తెల్పి భక్తితో,
  భండన భీముడై హరిని ప్రార్థనఁ జేయుచు పైకిలేవగా
  కొండలు గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్

  రిప్లయితొలగించండి