5, జనవరి 2019, శనివారం

సమస్య - 2893 (చంద్రుఁ డేతెంచె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు"
(లేదా...)
"చంద్రుఁడు వచ్చెఁ జూడుఁడు ప్రచండ విభాకరుఁడై దినమ్మునన్"

113 కామెంట్‌లు:

  1. పండు వెన్నెల కాచెను బంధులార!
    చంద్రుఁ డేతెంచె;...మధ్యాహ్న సమయమందు
    కునుకు తీయగ వచ్చును గురువు గారు!
    పనియు పాటను మానుచు కనులు మూసి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నిన్న మధ్యాహ్నం ప్రయాణంలో ఉన్నాను స్వామీ... కునుకు తీయలేదు!

      తొలగించండి
  2. వెలుగు ఱేడుకు, భూమికి వెన్నెల దొర
    మధ్య నేతేంచు సమయము మర్కుడపుడు
    ధరకు నగుపించక బగలు ధ్వాంతమగును
    చంద్రు డేతెంచె మధ్యాహ్న సమయమందు

    రిప్లయితొలగించండి


  3. కాల వాహిని లోన నాకాశమున జి
    లేబి గాన వచ్చును వింత లెస్స గాను!
    అదిగొ! చూడుము! సూర్యగ్రహణము! అదిగొ
    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. పోల వరమును దర్చించ పోయె నొకడు,
    నేను కాళేశ్వరమును చూతు నిప్పుడనుచు
    వెడలగ, జనులచట పల్కె విస్మయముగ

    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు"
    ననుచు ముఖ్య మంత్రులగాంచి ఘనత తోడ


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      ఇద్దరు ముఖ్యమంత్రులను ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. జనులు బహువచనం, పల్కె ఏకవచనం. "కాళేశ్వరము జూతు... జనులు పల్కిరి" అనండి.
      ఆలస్యంగా స్పందించినందుకు మన్నించండి.

      తొలగించండి
  5. కవిమిత్రులారా,
    నిజానికి ఈరోజు ఆకాశవాణి వారి సమస్యను ఇవ్వాలి. ఆ విషయం మరచిపోయి ఈనాటి సమస్యను షెడ్యూల్ వారం క్రితమే చేసాను. ఆకాశవాణి సమస్యను రేపు ఇస్తాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  6. అందచందాలకరిరాజు మందగమను
    డార్తరక్షణకై విల్లు నందుకొన్న మీలకనుదోయి రతనాలజాలు రామ
    చంద్రుడేతెంచె మధ్యాహ్నసమయమందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కరి బోలు మందగమను' అనండి.

      తొలగించండి
  7. నీటి పారుదల పనుల పాటవమును
    క్షుణ్ణముగఁ బరిశీలింపఁ గోరుచుండి
    ఘనత కాళేశ్వరమునకు కల్వకుంట్ల
    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు.

    రిప్లయితొలగించండి
  8. భూరి వ్యయముతో నిర్మించు పోలవరపు
    పనులఁ వీక్షింప దలచి ప్రభాత వేళ
    బయలు దేరిన నేమి యా ప్రాంతమునకు
    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      నేను కెసీయార్ ను ప్రస్తావిస్తే మీరు చంద్రబాబును స్వీకరించారు. బాగున్నది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  9. శాస్త్రవేత్తల నందర సంప్రదించి ;
    కర్షకులు పొందు వ్యధలను కనులజూచి ;
    పోలవరపు పనుల గాంచి ముఖ్యమంత్రి
    " చంద్రు " డేతెంచె మధ్యాహ్న సమయమందు .

    రిప్లయితొలగించండి
  10. భూసురేంద్రులు,పరచార,పురజనులకు,
    రాజ దర్బారున పలు వరాల నిడగ
    ఉన్నతోన్నత కుశలు డయోధ్య రామ
    చంద్రు డేతెంచె మధాహ్న సమయమందు.

    రిప్లయితొలగించండి
  11. కనక హరి ణ ము కోరిన కాంత కోర్కె
    దీర్చ కార్ముక oబును గొని తేకు వ గను
    వె దుక కాన లో గాలి oప వెడలి రామ
    చంద్రు డే తెంచె మధ్యాహ్న సమయ మందు

    రిప్లయితొలగించండి
  12. ఇంద్రునిగెల్చితేనని పరేంగిత శౌర్యము శూన్యమందువే
    ఇంద్రునిపంపునన్ నిశిచరేంద్రుని ద్రుంపగ వచ్చె, గార్తవీ
    ర్యేంద్రహతున్ జయించెను,హరీశునిజంపెను భానువంశ ధీ
    *"చంద్రుఁడు వచ్చెఁ జూడుఁడు ప్రచండ విభాకరుఁడై దినమ్మునన్*
    చంద్రసహోదరే ధరజ జానకి హన్మడుశూలి తాన్హరై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సహోదరి + ఏ, హరి + ఐ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
  13. మనసునందున దలచిన మరువబోక
    శబరికోర్కెను దీర్చగ శాంతమూర్తి
    ఆయరణ్య వాస సమయమందు రామ
    చంద్రు డేతెంచె మధ్యహ్న సమయమందు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మనమునందున' అనండి. 'మనసు' సాధువు కాదంటారు.

      తొలగించండి
  14. డా. పిట్టా సత్యనారాయణ
    "ఆటు నటుజూడు సంద్రపు టలల జూడు;
    కాదు పున్నమి చంద్ర సంకాశ మెచట?"
    "ఈ సునామీల మబ్బుల నిగిడిన రవి!"
    చంద్రుడేతెంచె మధ్యాహ్న సమయమందు.
    (పున్నమిన అలల అలజడిని,కారు మబ్బులలో గుండ్రని సూర్య బింబమును గని అతడే చంద్రుడేమో యన్న భ్రమ లో సముద్ర తీరవాసు లిరువురి సంభాషణ)

    రిప్లయితొలగించండి
  15. మాదిరెడ్డి సులోచన మరపురాని
    వర్ణనంబులు చేసె నవలల లోన
    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు
    ఒయ్యనొయ్యనన్, వ్రాయగ ఒక్కనాడు

    రిప్లయితొలగించండి
  16. భరత భూమిని వెన్నెల భాగ్య మనగ
    ఇతర దేశము లందున వేడి వెతలు
    హిముడు సూరీడు లటునిటు హేల యనుచు
    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయ మందు .














    రిప్లయితొలగించండి
  17. రఘుకులాన్వయదీపము రాఘవుండు
    సీతముఖపద్మభృంగము శిష్టరక్ష
    ణార్థమైరావణాంతమై స్వార్థ రహిత
    ప్రేమపితృభక్తిసోదరప్రేమజాట
    హరి దశరథాత్మజుడుబాడియాడి రామ
    చంద్రుడేతెంచె మధ్యాహ్న సమయమందు

    జ్ఞాపకమ్మిచ్చునానందకడలినొసగు
    నొకడుగుణపాఠమందించునొకడు కూళ
    లిర్వురునుగూడచంద్రులే యెన్నికలల
    చంద్రుడేతెంచె మధ్యాహ్న సమయమందు

    రిప్లయితొలగించండి


  18. మన తెలగాణ చంద్రుడు :)



    బింద్రను వాలె కాదితడు! భీతియు కొంతయు లేని వాడురా!
    సంద్రపు పొంగు మాటలు పసందుగ గ్రామ్యపు భాష తోడుగా
    తంద్రితులెల్ల నిద్దురను తన్నుచు వీడి శుభమ్ముగానగా
    చంద్రుఁడు వచ్చెఁ జూడుఁడు ప్రచండ విభాకరుఁడై దినమ్మునన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. సంద్రము దాటగాదలచి సాగరవేల్పును దారికోరగా
    సాంద్రతరమ్మగున్ జడిమ సంవరమానతి నీయలేమి రా
    జేంద్రుడు తీవ్రరోషమున సేనలమధ్యన శస్త్రహస్తుడా
    చంద్రుడు వచ్చెజూడుడు ప్రచండ దివాకరుడై దినమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సాగర వేల్పు' దుష్టసమాసం. "సాగరదేవుని" అందామా?

      తొలగించండి
    2. గురువుగారూ! ముందు సాగరదేవుడనే వ్రాశాను,అది సరియైనది కాదేమోనని మార్చాను.ఇప్పుడు సవరిస్తాను.ధన్యవాదములు!

      తొలగించండి
  20. గురువు గారు నేను 5-22 కే పోలవరము కాళేస్వరము ఇద్దరుముఖ్య మత్రులకు చూపించా మీరు నన్నువదలి ఇతరులతో చెట్టా పట్టాలు కట్టారు అన్యాయము గురువు గారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమే. ఎందుకో నా దృష్టికి రాలేదు మీ పూరణ. మన్నించండి. ఇప్పుడే సమీక్షించాను.

      తొలగించండి
  21. మిత్రులందఱకు నమస్సులు!

    జన్నమునుఁ గావ రామలక్ష్మణులఁ బంపఁ
    బంక్తిరథు నాజ్ఞఁ గొనియును వనమునకును
    హర్షమునను వడిగఁ గౌశికాఖ్యమౌని
    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      మౌనిచంద్రునితో మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  22. కలలు నెరవేర్చిన ఘనుడు కల్వ కుంట్ల
    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు
    చేరె కల్యాణ లక్ష్ములు సైరికులును
    ఆసరా నీవని పొగడె అరుసమునను
    దేశమందు లేడయ్యపో దేవులాడ
    నిన్ను మించిన లీడరు నిజము నిజము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పొగడి రరుసమునను' అనండి.

      తొలగించండి
  23. [2]
    తండ్రి యానతిం గొనియును తపసియైన
    గాధిజుని యజ్ఞముం గావఁగాను వనికిఁ
    దుదకుఁ దమ్ముండౌ సౌమిత్రి తోడ రామ
    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడో పాదంలో తమ్ముఁడు అని అరసున్నా టైపు చేశాను. అరసున్నా ఎగిరిపోయి...సున్నా టైపయినది...చూసుకోకుండానే ప్రకటించాను.... దాని సవరణము:

      తండ్రి యానతిం గొనియును తపసియైన
      గాధిజుని యజ్ఞముం గావఁగాను వనికిఁ
      దుదకుఁ దమ్ముఁడౌ సౌమిత్రి తోడ రామ
      చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు!

      తొలగించండి
    2. మధుసూదన్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      రెండవ పాదాన్ని "గాధిజు డొనర్చు యజ్ఞముం గావ వనికి" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి

  24. జనకునిపలుకు నిల్పగా జవముగాను
    వనములకు నేగ సిద్ధుడై వనిత తోడ
    తల్లి నొప్పించి భ్రాతతో తరలి రామ
    చంద్రుడేతెంచెమధ్యాహ్నసమయమందు

    రిప్లయితొలగించండి
  25. భూమి సూర్యుల మధ్యకు సోమ గ్రహము
    వచ్చు కతనాన జీకటి విచ్చుకొనగ
    చంద్రు డేతెంచె మధ్యాహ్న సమయ మందు
    కనుమ యట్లగుగ్రహణపు కాలమందు

    రిప్లయితొలగించండి
  26. ఈ రోజు సమస్య

    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు

    సీస సహిత తేట గీతిలో నా పూరణము

    అభిమన్యుడు పద్మ వ్యూహములో చొరబడి వీర విహారము చేస్తూ ఉంటే దుర్యోధనుడు ఈ విధముగా అనుకుంటాడు సముద్రములో పుట్టిన బడబాగ్నిలా సైనికులనందరిని దహించు చున్నాడు . అడవిలో కోపము కలిగిన సింహము వలె చెలరేగి సైన్యము నంతా చంపుచున్నాడు ఈతడు వేసెడి బాణములకు ఆకాశములో ఛీకట్లు కమ్ముకొని రవి కనిపించ కుండా పోతున్నాడు . ఏమి ఇతని పరాక్రమము రెండో రుద్రుడులా (భాల చంద్రుడు) వచ్చాడు మధ్యాన్న సమయములో అని మనసులో కించిత్తు అతనిని అభినందించి ధర్మ యుద్ధము చేసి ఇతనిని గెలుచుట కష్టము ఇతర మైన ఆలోచనలు పెట్టుకోకుండా అధర్మ యుద్ధము చేయమని తన వారలకు చెప్పు సందర్భము

    కడలిలో పుట్టిన బడబాగ్ని వోలె, యీతడు దహించుచు నుండె దండు నంత,
    నడవిలో క్రోధాగ్ని బడసిన మృగరాజు రీతి దునుము చుండె రెచ్చి పోయి
    పరివారములనెల్ల ,శరముల ధాటికి గగనము లో రశ్మి కాన రాక
    రణరంగ మంతయున్ రాజ్యము నేలెను చీకట్లతో, యేమి వీక, భాల

    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు
    ఐంద్రి సుతుడభిమన్యుడు, ఔర , ధర్మ
    యుద్ధమున్ మాని చంపుము యోచనమ్ము
    వదలి , యని బల్కె రారాజు వరుస మరచి




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'బడబాగ్ని వోలె నీతడు...' అనండి.

      తొలగించండి
  27. తేటగీతి
    తనరుచున్ గుక్క వరిమళ్ల దారిఁ బట్టు
    వరుస లోకోక్తి నిజమంచు గుఱుతు దెచ్చి
    గురువు లేడని తారతోఁ గూడ నెంచి
    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు

    రిప్లయితొలగించండి
  28. మైలవరపు వారి పూరణ

    సాంద్రదయాసుధల్ గురియు శాంతముఖమ్మది రాల్చె వహ్ని , ని...
    స్తంద్రితనేత్రయుగ్మమది త్రాసకరమ్ముగ నెర్రనయ్యె , లో...
    కేంద్రనుతుండు భీష్ము వధియించెడు వేళ రమామనోనభ...
    శ్చంద్రుఁడు వచ్చెఁ జూడుఁడు ప్రచండ విభాకరుఁడై దినమ్మునన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  29. మిత్రులు శంకరయ్య గారు,
    'చంద్రు డేతెంచె మధ్యాహ్న సమయమందు' అన్నది సరైన సమస్య కానే కాదు! ఎందుకంటే, సూర్యోదయాస్తమయాలకూ చంద్రోదయాస్తమయాలకూ ఏమీ సంబంధం లేనేలేదు. అలా ఉందన్నట్లుగా కవులు వ్రాసేది కేవలం కవిసమయం మాత్రమే. రోజులో ఏసమయంలో ఐనా చంద్రోదయం కావచ్చును, చంద్రాస్తమయం కావచ్చును. బారెడు ప్రొద్దెక్కినా చంద్రుణ్ణి చూడవచ్చును కొన్ని రోజుల్లో. ఐతే మిట్టమధ్యాహ్నానికి దగ్గర్లో చంద్రోదయం ఐనా మనకు కనిపించడన్న్దది అర్థం చేసుకోవచ్చును. రావటం ఐతే నిజమే అయ్యే సందర్బాలు ఎలాగూ ఉన్నా, వచ్చిన చంద్రుడు మనకు కనిపించకపోవటం అతడి తప్పుకాదుగా. నిజానికి సమస్యను 'చంద్రు గననాయె మధ్యాహ్న సమయమందు' అంటే బాగుంటుందేమో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామల రావు గారూ,
      మీ అభిప్రాయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. ఇది గతంలో ఒక అవధానంలో ఇచ్చిన సమస్య. దాన్ని అలాగే స్వీకరించాను. ఇంత లోతులా ఆలోచించలేదు. మీరన్నట్లు ఏతెంచె కంటే కననాయె అన్నదే సముచితంగా ఉంటుంది. కాని ఇప్పుడు దానిని మార్చడానికి అవకాశం లేదు. ధన్యవాదాలు

      తొలగించండి
  30. చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు
    కవుల కల్పనలోనది కావ్య తతుల
    కవిత లల్లగ బాగుగ కాదనర్హ
    మదియె శ్రీశ్రీ యడుగులవి మార్గముగద

    రిప్లయితొలగించండి
  31. దొంగ! తానేమి చేసెనో దొరక ననుచుఁ
    గనఁబడక నమవస నాడు గడుసు వాఁడు
    పృష్ఠ భాగమున్ జూపుచుఁ బృథివి పైకి
    *"చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు"*

    రిప్లయితొలగించండి


  32. మా నారా చంద్రబాబు వారు :) మా వూరి ఆసామి కాబట్టి తెలగాణ చంద్రుడి కన్న కొంత ఎక్స్ట్రా ఫిట్టింగు పెట్టక పోతే బావోదు :)

    జై ఆంధ్ర :)


    కేంద్రము కాలదన్నగ, వకీలు జయిట్లి సహాయమివ్వకన్
    చింద్రము కాగ బొక్కసము, చివ్వునలేచి సజావు చేయుచున్
    సంద్రము లెల్ల దాటి తన చాతురితో నమరావతిన్ భళా
    చంద్రపు కాంతులీనగను చక్కగ నెక్కొన సింగపూరు పా
    రీంద్రము తోడు సైయనుచు రెక్కలు చాపుచు రిక్కదారిలో
    చంద్రుఁడు వచ్చెఁ జూడుఁడు ప్రచండ విభాకరుఁడై దినమ్మునన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాహ్ జిలేబీ!! సింగపూరు పారీంద్రము!!

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

    3. బాలకృష్ణ గారికి
      సీతాదేవి గారికి
      కంది వారికి

      నమో నమః


      జిలేబి

      తొలగించండి
  33. Accurate and beautiful analysis on current AP politics. Jai Jai Zilebi ji, a poetic journalist.வணக்கம்

    రిప్లయితొలగించండి
  34. సంతస మొసంగుచుఁ గమల షండమునకుఁ
    జండ కిరణుఁ డాదిత్యుఁడు నెండదొర ది
    నేశుఁ డధ్వపతి నిజప్రకాశ దత్త
    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు


    ఇంద్ర ముఖామర వ్రజ మునీశ్వర సంచయ మర్దనుండు దై
    త్యేంద్ర వరానుజుండు ఖరు నిద్ధరఁ గూల్చఁగ రామచంద్రుఁడే
    సాంద్ర ధనుర్విలాస కర సంస్తవ పూర్ణ మహా మహీ నభ
    శ్చంద్రుఁడు వచ్చెఁ జూడుఁడు ప్రచండ విభాకరుఁడై దినమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. గు రు మూ ర్తి ‌ ఆ చా రి
      ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


      { జాంబవంతుడు కపివర్గముతో అన్నమాటలు }



      సాంద్ర దయాగుణాంచితుడు , చండతరానయ నాశకుండు , మౌ

      నీంద్రనుతుండు , సారసదళేక్షణుడున్ , దిననాథవంశపున్

      జంద్రుడు వచ్చె జూడుడు ప్రచండ విభాకరుడై దినమ్మునన్ |

      జింద్రము చేసివేయు రజనీచర వర్గము నీ క్షణంబునన్ |

      జంద్రుని ముందు తళ్కు మనునా చిన చుక్క లవెన్ని నిల్చినన్ |



      ( చింద్రము = ఖండము )


      ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  35. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ఆంధ్రుల రాయలౌ ఘనుడు హాయిగ తీయగ భాగ్యనగ్రినిన్
    చంద్రుఁడు వచ్చెఁ జూడుఁడు ప్రచండ విభాకరుఁడై దినమ్మునన్...
    చంద్రుడు శేఖరుండు గని శాపము లిచ్చుచు పారద్రోలగా
    సంద్రపు నీరమున్ తడిసె చంద్రుడు క్రుంగుచు నుప్పునీళ్ళలో

    రిప్లయితొలగించండి
  36. ఇంద్రధనుస్సువోలెగడునింపొనగూర్చుచునాకసంబునన్
    జంద్రుడువచ్చెచూడుడుప్రచండవిభాకరుడైదినమ్మునన్
    చంద్రునిజూడగామఱిప్రచండవిభాకరివోలెలేడుగా
    సంద్రమునుండియేవెడలిసంద్రపుఛాయలుబోలెనేసుమా

    రిప్లయితొలగించండి
  37. తుంగుని ధనువు నెత్తుట దుర్లభమని
    కుతలపతులెల్లవిఫలురై కూలబడగ
    గాధిజుని యాజ్ఞ గైకొని కడకు రామ
    చంద్రుడేతెంచె మధ్యాహ్న సమయమందు!!!

    రిప్లయితొలగించండి
  38. సంకురేతిరి కానుక సక్కగాను
    జన్మభూమిని నీయగ జంకనిడుచు
    నూరువాడల దిరుగుచు నారవారి
    చంద్రు డుదయించె మధ్యాహ్న సమయమందు

    రిప్లయితొలగించండి
  39. రిప్లయిలు
    1. రాజేందర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      బాలచంద్రుడు పల్నాటియుద్ధం కథలోనివాడు. మీరు బొబ్బిలి యుద్ధాన్ని ప్రస్తావించారు.

      తొలగించండి
    2. తేటగీతి:

      బాలు డైనను సాగెను భయము లేక
      పరుగు దీసెను పల్నాటి పోరు జేయ
      చేరె నూనుగు మీసాల వీర బాల
      చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు

      గొర్రె రాజేందర్
      సిద్దిపేట

      తొలగించండి
    3. 🙏🙏🙏 పని తొందరలో పొరపాటు జరిగింది క్షమించండి సవరణ తెలియజేసినందుకు ధన్యవాదాలు

      తొలగించండి
    4. సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  40. అన్ని మబ్బులు దోబూచు లాడుచుండ
    కాంచ రవి గగనమ్మున కానరాడె
    యయిన మనల నలరింప నాకసమున
    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "...యయినను మనల..." అనండి.

      తొలగించండి
  41. పవను కళ్యాను నివసించు భవనమునకు
    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు
    చేయ విన్నపము తనతో చేయి కలప
    కీలకమగు యెన్ని కలలో గెలుపు కొరకు

    రిప్లయితొలగించండి
  42. ' చంద్రు ' లనబడు నేతల సభకు బిలువ
    మొదటి చంద్రు డరుగుదెంచ నుదయ మందె,
    యలర జేయ జనమ్ముల నట మఱియొక
    చంద్రుడేతెంచె మధ్యాహ్న సమయ మందు!


    రిప్లయితొలగించండి
  43. ఇంద్రుడు సర్వ విఘ్న తతి కీశ రమేశ సురర్షిసంఘ బ్ర
    హ్మేంద్ర కుమార వందితుడు నేన్గుముఖుండును వల్లభామన
    శ్చంద్రుఁడు వచ్చెఁ జూడుఁడు ప్రచండ విభాకరుఁడై దినమ్మునన్
    సంద్రము కాగ క్రోధనము చంపగ మూషికు నేకదంతుడై.

    రిప్లయితొలగించండి
  44. క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువు గారికి నమస్కారములు. నిన్నటి, నేటి పూరణలను పంపుతున్నాను. దయతో పరిశీలించ గలరు.

    04-01-2019:

    కొడుకు మనువు చేసిరి వారు కూబరముగ
    పెండ్లి వేదిపై; శ్రాద్ధము పెట్టి రంత
    శాస్త్ర విధుల ననుసరించి సక్రమముగ
    మృతి చెందిన తండ్రికి గృహము నందు.

    05-01-2019:

    శీతలమగు వెన్నెలదోడ చెన్నమరగ
    చంద్రుడేతెంచె; మధ్యాహ్న సమయమందు
    భానుడుగ్ర రూపము నొంది పమ్ముకొనుచు
    నెండ వడగాలుల బఱచి నెత్తి మాడ్చె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ చివరి పాదంలో గణదోషం. "మృతిని పొందిన..." అనండి.

      తొలగించండి
  45. ఇంద్రపురంపు తుల్యముగ నింపగు పట్టణ మొక్కటిన్ భువిన్
    సంద్రము తూర్పుదిక్కుగల చక్కటి పంటల నిచ్చు రాజ్యమౌ
    యాంధ్రకు రాజధాని పురమధ్భుత రీతిగ గట్ట నెంచుచున్
    జంద్రుఁడు వచ్చెఁ జూడుడు ప్రచండ విభాకరుఁడై దినమ్మునన్.

    రిప్లయితొలగించండి
  46. గురుడు తపసున లీనమై కుందరదన
    తార కోర్కెను దీర్చని కారణమున
    విరహ వేదనతో తార వేడు కొనగ
    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు

    ఈ సమస్య ఆకాశవాణి విజయవాడ కేంద్రం తే 14/ 3/1977 దీ కి ఇవ్వగా
    నాడు నేను పూరించింది
    నేటి పూరణ

    కలియుగాంతము నందున కలుగబోవు
    చిత్ర చిత్ర విచిత్రముల్ చిన్న వయసు
    బాలుడొక్కడు పరికించి బలుకు నేమొ
    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు

    నిన్నటి సామసులకు నా పూరణ

    చక్కనైన ముహూర్తమీ జత కనంగ
    గుండె పోటున వరుడట గూలినంత
    నపర కర్మను జరుపగ నాప్తులచట
    పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట

    రిప్లయితొలగించండి


  47. పై వారము ఆకాశవాణి సమస్య తెలియ చేయగలరు ?




    జిలేబి

    రిప్లయితొలగించండి
  48. దయచేసి ఈ వారం ఆకాశవాణి సమస్య తెలుపగలరు

    రిప్లయితొలగించండి
  49. తండ్రి యాజ్ఞను వనముల దనయుడేగె
    చెలియ కోరిన బంగారు జింకకొరకు
    నుదయమేగినాడక్కటయోధ్యరామ
    "చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు"

    రిప్లయితొలగించండి
  50. నన్ను మీ శంకరాభరణం బ్లాగు లో చేర్చగలరు...

    ఆకుల శివరాజలింగం
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  51. డా. పిట్టా సత్యనారాయణ
    మంద్రత,నుష్ణము న్నరుని మాడ్చెడు నెండల కాలమిద్ది;ని
    స్తంద్రిత సూర్య తేజమును శాస్త్రపు శీతల యంత్ర రాశినిన్
    సంద్రపు వాయువుల్ వొ(పొ)డమ జాలవె మంటల యార్తి బాయగా
    చంద్రుడు వచ్చె జూడుడు ప్రచండ విభాకరుడై దినమ్మునన్
    (ఏ.సీలు పగలే వెన్నెల హాయిని ఇవ్వడం వల్ల చంద్రుడేతెంచెనా యన్న భ్రమ )

    రిప్లయితొలగించండి
  52. ఉత్పలమాల
    సాంద్ర సుధానిధిన్ గలుఁగ చక్కని రూపము నుల్లసిల్లఁగా
    నింద్రియ నిగ్రహమ్ము విడి నీతిని వీడిన తార పుత్రునిన్
    చంద్రుని తోడఁ గన్న, బుధు జన్మ బృహస్పతి సొంతమంచనన్
    చంద్రుఁడు వచ్చెఁ జూడుఁడు ప్రచండ విభాకరుఁడై దినమ్మునన్

    రిప్లయితొలగించండి
  53. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    చంద్రుఁడేతెంచె మధ్యాహ్న సమయమందు

    సందర్భము: శ్రీ మతి కె.వరలక్ష్మి గారు హరుని విల్లు... అనే పద్యం వ్రాసింది.. శ్రీ మునుగోటివారు.. శ్రీ వెలది వారు మధ్యాహ్న సమయ మంటే అభిజిల్లగ్నంగా భావించి సంతృప్తి చెందారు.
    కాని ఆ పదబంధం రాలేదే అని రచయిత్రి కించి దసంతృప్తిని వ్యక్తం చేసింది. అందుకోసం "అభిజి న్ముహూర్తము.."అనేది రావా లని చేసిన ప్రయత్నం..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    శివుని విలు రాముడు విఱిచె.. సీతతో వి
    వాహ మని తెల్ప ధవళంపు వస్త్రము లవి
    మెరయ నభిజి న్ముహూర్తాన వరుడు రామ
    చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    5.1.19
    -----------------------------------------------------------
    శ్రీ కె.వరలక్ష్మి గారి ప్రేరణతో..కృతజ్ఞతలతో..

    రిప్లయితొలగించండి