కామేశ్వర రావు పోచిరాజుఫిబ్రవరి 15, 2017 5:04 PM జిలేబి గారు నమస్సులు. సమాస సమీక్షణ సాహసోపేతమే. "సభాభవ నాద్విలసిత ఢాంఢఢాంఢ నాదంబు: పంచమీ తత్పురుషాలుక్సమాసము. భవనాత్ భవన పదమునకు పంచమీ విభక్తి. సాధారణముగా సమాసములు చేయునపుడు విభక్తిని వదలి చేస్తారు. అలాకాక విభక్తి సహితముగా చేసిన యది అలుక్సమాసము. భవనము నుండి లేక భవనము వలన అను అర్థమునకు తగిన పదములు వాడవలెను . వెడలిన లేక అడ్డుపడిన అను అర్థములు గల పదములు రావాలి. భవనాద్వినిర్గత, భవనాద్విసర్జిత, భవనాదాగత ఇత్యాదులు. విలసిత అని విశేషణము వాడారు. “ఢాంఢఢాంఢ” ధ్వన్యనుకరణ పదము కాబట్టి సమసింప వచ్చును. హనుమద్వాల సాధువు. “నూ” అని దీర్ఘముండదు. ప్రజ్వలనా గద్వాలానలము: ఆగత్ అని మీ యుద్దేశ్యమైతే ఆగతవాలానలము సాధువు. ప్రజ్వలనము అనుకుంటే “ప్రజ్వలన” సాధువు. “గద్వాల” పదమున కర్థము లేదు. (ఒక ఊరుగా కాకపోతే). ఇది నాకు తెలిసిన విషయము.
అప్పటి నావ్యాఖ్యకు సవరణ తిలకించ గోరెదను. 1. హనూమద్వాల సాధువే. హనూమత్. 2. ప్రజ్వలనా గద్వాలానలము సాధువే. మండుట వలన వచ్చిన వాలాగ్ని. ఆగత్ సమాసమున సాధువే.
సద్వృత్వపు చరితార్థుం
రిప్లయితొలగించండిడద్వారపు తోట విడిచి యానందముగా
నద్వయ హనుమాను భుజం
గద్వాల ప్రభవ వహ్ని కాల్చెను లంకన్
...ఇంతే సంగతులివ్వాల్టికి
🙏
సారీరోజు లీవనుకుంటాను
తొలగించండి🙏
తొలగించండిసారీరోజున లీవు రండి త్వరగా సౌరమ్ము ఝాడింపగాన్ :)
జిలేబి
గారాబంబుగ శంకరాభరణమున్ కల్పించి రంజిల్లు మా
తొలగించండిసారీరోజున లీవు రండి త్వరగా సౌరమ్ము ఝాడింపగాన్!
తొలగించండిశంకరయ్యగారి జవాబు :)
ఓరోరీ ప్రియ శిష్యులార!గురువుల్ ఊరెళ్ళగానిట్లు మీ
మారామారి కలాపముల్ తనర మీ మట్టంబు కత్రించెదన్ :)
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిసారీ! సారు! జి లేబి గారిచటనన్ సాధించి బాధింపగా
తొలగించండిపూరింపన్ బహు కష్టమాయె గదయీ ప్రొద్దున్న "గద్వాల"నున్
కం.
రిప్లయితొలగించండిఆద్వీపములోన వడి గృ
హద్వారంబులను జొచ్చి యంజన సుతుడే
సాధ్విని రక్షించుకొరకు
గద్వాల ప్రభవ వహ్ని కాల్చెను లంకన్"
విద్వత్కవితా సుమములు
రిప్లయితొలగించండిసద్వి మర్శల నిలయమ్ము సాహిత్య మునన్
విద్వత్ కళలకు నిలయము
గద్వాల ప్రభవ వహ్నికాల్చెను లంకన్
రిప్లయితొలగించండిసద్వసధము రావణునిది!
విద్వాంసుడు రామబంటు, విన్నుమనుమడా
యద్వందుడౌ హనుమ యం
గద్వాల ప్రభవపు వహ్ని కాల్చెను లంకన్!
జిలేబి
Zilebiఫిబ్రవరి 15, 2017 4:27 AM
తొలగించండివిద్వన్మణీ! సభాభవ
నాద్విలసిత ఢాంఢఢాంఢ నాదంబు హనూ
మద్వాలప్రజ్వలనా
గద్వాలానలము గాల్చెగద లంక నయో!
కామేశ్వర రావు పోచిరాజుఫిబ్రవరి 15, 2017 5:04 PM
జిలేబి గారు నమస్సులు.
సమాస సమీక్షణ సాహసోపేతమే.
"సభాభవ నాద్విలసిత ఢాంఢఢాంఢ నాదంబు: పంచమీ తత్పురుషాలుక్సమాసము.
భవనాత్ భవన పదమునకు పంచమీ విభక్తి. సాధారణముగా సమాసములు చేయునపుడు విభక్తిని వదలి చేస్తారు. అలాకాక విభక్తి సహితముగా చేసిన యది అలుక్సమాసము.
భవనము నుండి లేక భవనము వలన అను అర్థమునకు తగిన పదములు వాడవలెను . వెడలిన లేక అడ్డుపడిన అను అర్థములు గల పదములు రావాలి. భవనాద్వినిర్గత, భవనాద్విసర్జిత, భవనాదాగత ఇత్యాదులు. విలసిత అని విశేషణము వాడారు.
“ఢాంఢఢాంఢ” ధ్వన్యనుకరణ పదము కాబట్టి సమసింప వచ్చును.
హనుమద్వాల సాధువు. “నూ” అని దీర్ఘముండదు.
ప్రజ్వలనా గద్వాలానలము: ఆగత్ అని మీ యుద్దేశ్యమైతే ఆగతవాలానలము సాధువు. ప్రజ్వలనము అనుకుంటే “ప్రజ్వలన” సాధువు. “గద్వాల” పదమున కర్థము లేదు. (ఒక ఊరుగా కాకపోతే).
ఇది నాకు తెలిసిన విషయము.
అప్పటి నావ్యాఖ్యకు సవరణ తిలకించ గోరెదను.
1. హనూమద్వాల సాధువే. హనూమత్.
2. ప్రజ్వలనా గద్వాలానలము సాధువే. మండుట వలన వచ్చిన వాలాగ్ని. ఆగత్ సమాసమున సాధువే.
Zilebiఫిబ్రవరి 15, 2017 5:51 PM
తొలగించండిపోచిరాజు వారు
నమో నమః అర్థమయిందని చెప్పడానికి సాహసించను :) అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను
నెనరులు
జిలేబి
తొలగించండివావ్! నేను రాసిందేనా !!!!!!!!!
భుజాలు చరుచుకుంటున్నా ! :)
పోచిరాజువారికి దానిని గుర్తుపెట్టుకుని బయటకు లాగినందులకు జేజేలు !
జిలేబి
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిచిద్వీథిన్ రఘురామదివ్యపదముల్ సేవించి , లంఘించె శ్రీ
మద్వాతాత్మజుడగ్నితేజుడయి , హర్మ్యశ్రీలు భస్మమ్ముగా
నుద్వేలోగ్రమతిన్ , దశాస్యునకు దుర్యోగమ్ము సూచింప ., రం...
గద్వాల ప్రభవాగ్ని కాల్చెఁగద లంకాపట్టణంబున్ వడిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మద్వరిసతిసీతనుగొని
రిప్లయితొలగించండియాద్విషుడేగంగలంకనబ్ధినిదాటెన్
సాధ్వినిగనిహన్మడు జ
గద్వాలప్రభవవహ్నికాల్చెనులంకన్
విద్వాంసుండవు విజ్ఞసత్తముడవై విశ్వంబునన్ గీర్తులన్
రిప్లయితొలగించండిసద్వైదుష్యము జూప పొందగల వౌ సత్యంబు పూరించుమా
త్వద్వాంఛల్ నెరవేరునంచిటు లిడెన్ తానొజ్జ విద్యార్థికిన్
గద్వాల ప్రభవాగ్ని కాల్చెఁగద లంకాపట్టణంబున్ వడిన్.
రిప్లయితొలగించండివిద్వాంసుండు! వివేకి! సద్వసధమున్ వీక్షించె గాంచెన్ మహా
సాధ్విన్ సీతను! చెట్టు పుట్టల భళా సాగింప యుల్లంఘనం
బద్వందుండగు రామబంటు సవరంబయ్యారె నిప్పంటి, యం
గద్వాలప్రభవాగ్ని కాల్చెఁగద లంకాపట్టణంబున్ వడిన్!
జిలేబి
క: అద్వంద్వకవులనైనను
రిప్లయితొలగించండిగద్వాల ప్రభవ వహ్ని కాల్చెను, లంక
న్నధ్వాన మయె పరిస్థితి
విద్వాంసుడయిన నృపుండు వే మరణించన్
సాధ్వీజానకి జాడదెల్యకను విశ్వంబంత గాలించుచున్
రిప్లయితొలగించండివిద్వాంసుండగువాయునందనుడు నుద్వేగంబునన్లంక శ్రీ
మద్వైదేహినిగాంచిసేమమరిసెన్మాయావి పట్నంబు రం
"గద్వాల ప్రభవాగ్ని కాల్చెఁగద లంకాపట్టణంబున్ వడిన్
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిఉద్వేగోర్జితరోషబోధితవిగర్వోక్తిన్నిశాటేశుఁడే
"మద్వైరిప్రతిహస్తకుం డితనినిన్ మ్రందింప వాలాగ్రసం
విద్వస్త్రమ్ములఁ గాల్చుఁడో" యనఁ బరిప్రేష్యుల్ దదుక్తింజనన్
దద్వాతాత్మజుఁడల్గి, యెక్కొలుప, సందహ్యార్పితోచ్ఛక్త రం
గ ద్వాలప్రభవాగ్ని కాల్చెఁ గద లంకా పట్టణంబున్ వడిన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅద్వైతామృతసారపారహరియౌహన్మన్నయాలంకలో
రిప్లయితొలగించండివిద్వద్వైభవరామగాంచిగినుకన్వేశ్యావిమోహున్మహా
విధ్వంసాంధకుగూళుదైత్యవిభుగర్వేభారి సింగంబు నం
"గద్వాల ప్రభవాగ్ని కాల్చెఁగద లంకాపట్టణంబున్ వడిన్
విద్వత్తునవెల్గె మహిని
రిప్లయితొలగించండిగద్వాలప్రభవ; వహ్నిలంకనుగాల్చెన్
నద్వయుడై హనుమ చెలగి
యుద్వాసనచెప్ప నసురయూధంబునకున్
ఉద్వేగాంచి త మారుతి
రిప్లయితొలగించండిసద్విమల యశో గాత్రి జానకి గాంచె న్
వి ద్వేషులు పెట్టిన రం
గద్వాల ప్రభవ వహ్ని కాల్చె ను లంకన్
విద్వాంసుడు లంకేయుడు
రిప్లయితొలగించండిసద్వచనములు విననంత శౌర్యు డనుమడున్
విధ్వంసము గావించ జ
గద్వాల ప్రభవ వహ్ని కాల్చెను లంకన్
ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
బద్వేలు లోని మిత్రుడె
రిప్లయితొలగించండియుద్వేగమ్మున సమస్య నొక్కటి యిచ్చెన్
విద్వత్కవి ! పూరింపుము
"గద్వాల ప్రభవ వహ్ని కాల్చెను లంకన్"
విద్వేషముతో రక్కసు
రిప్లయితొలగించండిలుద్వేగము తోడ గాల్చి యురికింపంగా
నుద్విగ్నుడు మారుతి కర
గద్వాల ప్రభవ వహ్ని కాల్చెను లంకన్.
**)(**
మారుతి కరగత్ + వాల = మారుతి చేతితో చలించుచున్న (జ్వలించుచున్న) వాల......
విద్వాంసుల నెరిగించెను
రిప్లయితొలగించండిగద్వాలప్రభవ, వహ్నిలంకను గాల్చె
న్నుద్వేగమ్మున హనుమయె
సాధ్విని బాధించుటగని చండముతోడన్!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈరోజు శంకరాభరణము సమస్య
రిప్లయితొలగించండిగద్వాల ప్రభవ వహ్ని కాల్చెను లంకన్
ఇచ్చిన పాదము కందము నాపూరణము సీసములో
కపి పల్కులు మదిలో కష్టము కలిగించ, తా నతనిని చంప దలచ, వలద
నుచు తెల్పగ విభీషనుండు, సోయగమగు తోకను కాల్చిన దూత కదియె
శిక్ష యని తలచి . తక్షణమే కాల్చ , మర్కము జతగూడ మంటలు పెను
పారంగద్వాల ప్రభవ వహ్ని కాల్చెను లంకన్వడివడిగన్ , లంక జనత
భీకరమ్ముగ నరచుచు భీతి గలిగి
చీమల వలె నలుదిశల చెదరిపోవ
గ, ననుకొనని సంఘటనతో ఘడియ పాటు
రావణుని మది కోపాన రగిలి పోయె
పూసపాటి గుంటూరు
కవి శ్రేష్టులు నా పద్యము లో తప్పొప్పులు సూచించ ప్రార్ధన
తొలగించండివిద్వాంసు లైన నకటా
రిప్లయితొలగించండివిద్వేషము రేఁగ భృశము విల యారతమై
యుద్వేగ యుత ద్రవిడ జ
గద్వాల ప్రభవ వహ్ని కాల్చెను లంకన్
[జగత్ + వాల; వాలము = బెబ్బులి: ఎల్‌టిటిఈ]
సద్వారాయత నాట్ట సంచయ మహాసాల వ్రజ ధ్వంసమై
యుద్వేగమ్ము సెలంగ నెల్లరకుఁ గాదోర్వన్ మరున్నంద నో
గ్రోద్వేలాగ్రహ తప్త మానస మహా యోధాగ్ర్య తైలార్ద్ర సం
గద్వాల ప్రభవాగ్ని కాల్చెఁగద లంకాపట్టణంబున్ వడిన్
15-2-2017 నాటి పూరణములు:
తొలగించండితద్వాలముఁ గాల్చినఁ బర
మోద్వేగి దశాననుండు మూర్ఖుండై శుం
భద్వీరుడు కపివరుని జ
గద్వాలానలము గాల్చెఁ గద లంక నయో
[జగత్ + వాలము = జగద్వాలము: తిరుగుచున్న తోక]
ఉద్వేగంబున రావణుండు ఘన కోపోద్రిక్త చిత్తంబునన్
హృద్వేగుండు కపీశు వాలమును నంటింపన్ వరంబయ్యె శుం
భద్వామామణి దర్శనద్యుతి సుసంభావ్యేద్ధ భీ మానురం
గద్వాల ప్రభవాగ్ని కాల్చెఁ గద లంకాపట్టణంబున్ వడిన్
[అనురంగత్+ వాలము = అనురంగద్వాలము: ప్రకాశించుచున్న తోక]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండివిద్వత్కవులందరొకచొ
తొలగించండిసద్వర్తనమున సభలను జరుపగ నందున్
విద్వాంసుండొకడుపలికె
*"గద్వాల ప్రభవ వహ్ని కాల్చెను లంకన్"*!!
అద్వైతంబునగొఱకే
రిప్లయితొలగించండిగద్వాలప్రభవ,వహ్నికాల్చెనులంకన్
నుద్వేగంబునహనుమయె
విద్వేషముబొంగిపొరలవిఖరులపైనన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిద్వైదగ్ధ్యపరోపకారఘటనావిశ్వాసపాత్రుండు, దీ
తొలగించండివ్యద్వేగాన్వితవార్ధిలంఘనపటుప్రస్థానరామాబ్జపా
దద్వంద్వైకరతుండు వాయుసుతు నుద్యత్క్రోధవిస్ఫాలరం
గద్వాలప్రభవాగ్ని కాల్చెఁ గద లంకాపట్టణంబున్ వడిన్.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
ఉద్వాసనంబు రావణ
రిప్లయితొలగించండినీ ద్వీపంబు నెడఁబాయు, నిర్గమనుడవౌ
అద్వారమున, కపి ధగధ
గద్వాలప్రభవ వహ్ని కాల్చెను లంకన్
బాలకృష్ణ గారు “కపి ధగధగద్వాల” మనోహరమైన ప్రయోగము.
తొలగించండిపూజ్యులు శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండివిద్వేషి రావణుండా
రిప్లయితొలగించండిసాధ్వి ధరణిజను హరింప, సమరము జాటన్
విద్వాన్ మారుతి యనురం
గద్వాల ప్రభావ వహ్ని గాల్చెను లంకన్!
విద్వాంసుల్ వినరారె నా వ్యథను నన్వేధించగా కక్షతో
రిప్లయితొలగించండిగద్వాలన్ ముడిపెట్టి మా గురువు లంకం దెచ్చె నిచ్చోటికిన్
విద్వేష మ్మది యొప్పు నే కటకటా విద్యార్థిపై రామ యే
గద్వాల ప్రభవాగ్ని కాల్చెఁగద లంకాపట్టణంబున్ వడిన్.
( మిమ్మల్ని కాదు గురువుగారూ.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅద్వంద్వందుడు లంకలో యసుర సంహారమ్ము నే జేయుచున్
రిప్లయితొలగించండివిధ్వంసమ్మొనరింపగా దనుజులే భీతిల్లి బంధించుచున్
విద్వేషమ్మును బూని యంజన సుతున్ పిచ్ఛమ్ము నే గాల్చగా
గద్వాల ప్రభవాగ్ని కాల్చెఁ గద లంకాపట్టణంబున్ వడిన్
కద్వదుడ వనుచు దనుజులు
రిప్లయితొలగించండివిద్వేషము తోడ గాల్చ పిచ్ఛము నా శ్రీ
మద్వాయుసుతుడు రామ భ
గద్వాల ప్రభవ వహ్ని కాల్చెను లంకన్
విద్వాంశులుగనరారట
రిప్లయితొలగించండినధ్వాన్నంబంటుకొనగ?యంజనసుతుడే
విధ్వేషిగమారియు యా
గధ్వాల ప్రభవ వహ్నికాల్చెనులంకన్! (లంకలోనినొకపట్టణం)
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండినమస్కృతులు.
నెల్లూరు ప్రయాణంలో ఉన్నాను. మన్నించండి.
విద్వాంసాళికినారికేళమిదియావిధ్వంసమైదివ్యమై
రిప్లయితొలగించండినద్వంద్వుండ్రయిసద్వివేకులయిబ్రహ్మాండంగసద్వేగులై
చిద్వీధీవిహగంబులైప్రభలతోశ్రీవిద్యసారార్థ రం
*గద్వాల ప్రభవాగ్ని కాల్చెఁగద లంకాపట్టణంబున్ వడిన్*
నా ప్రయత్నం :
రిప్లయితొలగించండికందం
సద్వాక్ప్రయోక్త వనమున
సాధ్వినిఁ గనవచ్చి నట్టి స్పశుడని వేల్చన్
దద్వాతాత్మజు ననురం
గద్వాల ప్రభవ వహ్ని కాల్చెను లంకన్
శార్దూలవిక్రీడితము
విద్వాసుండని వానరాది గణమే వేనోళ్ల కీర్తించెడున్
దద్వాతాత్మజు నా యశో కవన మధ్యంబందు శంకించుచున్
విద్వేషమ్మున తోఁక వేల్చనట నుద్వేగంబునన్ గెంత రం
గద్వాల ప్రభవాగ్ని కాల్చెఁగద లంకాపట్టణంబున్ వడిన్
1515-2-2017 నాటి నా పూరణము
రిప్లయితొలగించండికందం
సద్వచనమ్ముల రఘుకుల
సాద్విని, జానకిని విడువఁ జాలక చెలఁగన్
దద్విధి వశ హనుమ ధగ ధ
గద్వాలానలము కాల్చె గద లంకనయో?