పరిపరి తిట్టిపోయుచును , బాధల బెట్టుచు, కర్మ కాలె నం చరచుచు, దెప్పుచున్ మనమునందున క్రౌర్యము నిండినట్టి నీ చ రణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి - వేడుకన్ తరుణమునందు ప్రేమభరితమ్ముగ బొందిన సొమ్ము నెంచకన్ (నీచరణము=నీచమైన రణము. ఆమె సేవ చేసింది కానీ కర్మ అనుకుంటూ తిట్టుకుంటూ చేసింది . వార్ధక్యం లో ఇలాంటి ప్రవర్తనలూ ఉంటాయి. )
కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు ఉదయమే డా. జి. సీతాదేవి గారి పుస్తకాన్ని ప్రెస్సులో ఇవ్వడానికి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చాను. పూరణలను చూడబోతుండగా అవుసుల భానుప్రకాశ్ గారు వచ్చి, ఇప్పటిదాక కూర్చుని వారి 'వాగ్దేవతా శతకం' పరిషరించుకొని వెళ్ళారు. అందువల్ల ఈరోజు మీ పూరణలను సమీక్షించలేకున్నాను. మన్నించండి.
రిప్లయితొలగించండికలరో జిలేబీ వలె సధవలిలలో :)
సెల్ఫు డబ్బా :)
అరయగ సధవ జిలేబియె!
పరమాత్ముని రూపమైన పతిని కొలుచుచున్
గురువువలె చూచి, తానను
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిఅనుచరణముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తరుణము వెదకుచు మానిని
రిప్లయితొలగించండిపరమార్ధము దెలిసి భక్తి భగవం తునిపై
యరకొర యటునిటు గురువని
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గురువని చరణముతో'...?
తరుగని ప్రేమకు తోడుత
రిప్లయితొలగించండివిరివిగ నాయువును కోరి ప్రీతిగ తమితో
ధరణిజ పార్వతి వ్రతమా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండివ్రతాచరణముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిపరిచయ మైన వేళన గభాలున గట్టిగ కట్టి వేసె తా
పిరియము తోడు పెన్మిటిని భీరువు మమ్మరె! తల్లితోడగా
నరయ చిరంటి, జామి, ముసలావిడ రూపసి సర్వదా సదా
చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి! వేడుకన్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వేళను' అనండి.
SEBHSH
రిప్లయితొలగించండిపరమపతివ్రత గాథలు
రిప్లయితొలగించండినిరతము పఠియించునట్టి నెలతయె తానున్
మరువక సనాతన సదా
చరణము తో భర్తృసేవ సతియొనరించెన్.
విరించి గారూ,
తొలగించండిసదాచరణముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
( కాటమరాజు సైన్యంతో యుద్ధం చేస్తూ అలసట తీర్చుకొని
రిప్లయితొలగించండివెళ్లుదామని వచ్చిన ఖడ్గతిక్కనకు సతీమణి చానమ్మ
సలిపిన సత్కారం )
బిరబిర ఖడ్గతిక్కనకు
పెద్దది నుల్కల మంచమిచ్చుచున్ ;
కెరలు పసుంపుముద్దనిడి ;
కేరుచు చీరను కట్టబెట్టుచున్ ;
విరసపు బల్కులన్ బలికి ;
విర్గిన పాలను బోసి ; వింత యా
చరణము తోడ భర్తృ పరి
చర్య యొనర్చె లతాంగి వేడుకన్ .
( కెరలు - అతిశయించు ; కేరుచు - నవ్వుచు )
జంధ్యాల వారూ,
తొలగించండివిపరీత పరిచర్యల మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
నిరతము పూజలు సేయుచు,
రిప్లయితొలగించండివరలుచు పరమాత్మ భావ పరిణతి గల్గన్
నిరతము భక్తిన్ స్తుత్యా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్.
ప్రసాద రావు గారూ,
తొలగించండిస్తుత్యాచరణముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండిమరిమరి నిన్నే కొలుతును
మరియాదకు మారుపేరు మహిళిను మగడా
సరిబండయే తగు! ననా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మహిళిను/మహిళను'?
రిప్లయితొలగించండిసరి! దేశమ్మున కై మో
డి,రాణిని నను విడిచితివి డిమ్మరి ! నే వా
తెఱ తెరువననుచు శిష్టా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కైమోడ్చి' అనండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఈ సమస్య 21.10.2017 నాడు ఇవ్వబడినది.. ఆనాటి నా పూరణద్వయం..
నరకాసురసంహారము
జరుపునపుడు కృష్ణుడలయ , సత్యయు విల్లున్
శరములఁ గొని యమరులు మె...
చ్చ ., రణముతోఁ బతికి సేవ సలిపెను సతియే !!
సరసుడు శంకరాభరణసత్కవి రాతిరి చింతజేయుచున్
సరసతనెంచి భామిని కుచమ్ములపైనొక పద్యమల్లగా
చరణములయ్యె *మూడు* ., గని చక్కగ నల్లియు దాఁ దురీయమౌ
చరణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్ !!
( భర్త కష్టపడుతుంటే భార్య చేసే ప్రతి సహాయము సేవయే.. అనే ఆలోచనతో..)
తురీయము =నాలుగవ
చరణము = పద్యపాదము
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి రెండు పూరణలు మనోహరంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅరయగ జానకి రాముని
శరాసనమునెక్కిడ తను సతియై చేరెన్
తిరుమాళిగవలదని నను
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
జిలేబి
విరి తన కొస గ ని కృష్ణుని
రిప్లయితొలగించండిచరణ ము తో భర్తృ సేవ సతి యొనరించెన్
పరి పరి విధముల వేడుచు
తరు ణిని శాంతింప జేసె దామోదరు డు న్
రిప్లయితొలగించండికొరకొర చూచెను శ్రీపతి
ని,రతగురువును, విడువంగ నియతిని; పెండ్లా
మరరే దిగ్గున లేచెన్
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
జిలేబి
రిప్లయితొలగించండికొరియా దేశపు పిల్లయె
వరునిగ తెలగాణ మగని వరముగ పొందెన్
సరి తెలుగు నేర్చి యుచ్చా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
జిలేబి
హరియే త్రొక్కెను బలినే ;
రిప్లయితొలగించండిపరమ పవిత్రమగు విధియె పడతికి భువిలో ;
తరుగని సేవలు పతికిని ;
చరణముతో ; భర్తృసేవ ;సతి యొనరించెన్ !
రిప్లయితొలగించండిచరణంబుద్రొక్కె నతడు
వరునిగ, తమకంబు హెచ్చి పతిని విటుడి తో
డు రహస్యముగా చంపి ప
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
జిలేబి
హరిహరనలువయటంచును
తొలగించండివరునిన్సతిదల్పవలయు ,పతిశుశ్రూషల్
వరమగు నువిదకనగ నుప
"చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్
చరణంబును అనండి. గణం సరిపోతుంది.
తొలగించండిపరిపరి తిట్టిపోయుచును , బాధల బెట్టుచు, కర్మ కాలె నం
రిప్లయితొలగించండిచరచుచు, దెప్పుచున్ మనమునందున క్రౌర్యము నిండినట్టి నీ
చ రణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి - వేడుకన్
తరుణమునందు ప్రేమభరితమ్ముగ బొందిన సొమ్ము నెంచకన్
(నీచరణము=నీచమైన రణము. ఆమె సేవ చేసింది కానీ కర్మ అనుకుంటూ తిట్టుకుంటూ చేసింది . వార్ధక్యం లో ఇలాంటి ప్రవర్తనలూ ఉంటాయి. )
పరులను సోదరుల వలెను,
తొలగించండివరుని మరుహరుని గరణిని,వల్లభ శిష్టా
చరణముతోగులసతి యా
*చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్*
చరితమెసాధ్విశీలము ప్రసంగ ము,సంచరణంబువీడి యా
తొలగించండిచరణము మేలుమేలనగ సాని విచారమువీడి బేరు ను
చ్చరణము సేయకన్వరుని సాంబుడ టంచెదనెంచి మంగళా
*చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి వేడుకన్*"
గురువచనమ్ముల పైనే
రిప్లయితొలగించండిగురి గలిగియు జగతిన పతి గొప్పగు, విలువౌ
సిరియని తలచియు చక్కని
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్ !
**)(**
( చరణము = నడవడి )
తరుణి వరుండె దేవుడని దల్చి విచారముసల్పిదాసిగా
తొలగించండియరమరలేనిమంత్రిగనునమ్మగసారథిగాచరించుచున్
మరులిడురంభయైవరలమానినికిన్దపమేలనో సదా
*చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి వేడుకన్*
రిప్లయితొలగించండితిరుమల శ్రీవారిని తా
పరమ పవిత్రముగ కొలిచి బ్రమరు పతిని సా
దరముగ చూచి యతని శ్రీ
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
(యెవరమ్మా ఆ శ్రీరంగరాయడు?)
జిలేబి
వరమయి దొరికిన భర్తయె
రిప్లయితొలగించండినిరతము ప్రేమానురాగ నిసర్గు డౌటన్
సరిపడు విధమున కర్మా
చరణముతో భర్తృ సేవ సతి యొనరించెన్!
సరిపడు=అనుకూలమగు
పరమ విరక్తుడు పతికిన్
రిప్లయితొలగించండినిరుపమ పాతివ్రతమును నిష్ఠను అంతః
కరణ శుచి కలిగి కర్మా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్
ఈ రోజు శంకరా భరణము సమస్య
రిప్లయితొలగించండిచరణముతో భర్తృసేవ సతి యొనరించెన్"
ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
కోరగ నాధుడు కోర్కెను తీర్చునో లేదో తెలియదు, యీ లేమ మాట
వినకున్న పరువు పోవును గద యని సత్యభామ నెక్కె నలుక పానుపు, గిరి
ధారి పరిపరి విధముల వేడి తన వదనమును వంచగ తన్నె నతని
తుండము చరణముతో, భర్తృ సేవ సతి యొనరించెన్గద, దేవ దేవు
డీ పగిది భార్య తోడ బడిసెను వదన
తాడనము , విధి లీల చిత్రముగద యని
నారదుండు తలచి తన నోరు నొక్కు
కొని పయనమాయెగా శబ్ద గుణము నందు
శబ్ద గుణము = ఆకాశము తుండము = ముఖము
పరమాత్ముని గాధలు విని
రిప్లయితొలగించండినిరతముదాభక్తితోడ నెనరగ మిగులన్
హరిసదృశుపతినిభక్త్యా
చరణముతోభర్త్రసేవ సతి యొనరించెన్
విరియది పారిజాతమును ప్రీతిగ రుక్మిణి కిచ్చెనంచు నా
రిప్లయితొలగించండితరుణియెఱంగి కోపమున తన్నెను కృష్ణుని సత్యభామయే
చరణము తోడ, భర్త పరిచర్యయొనర్చె లతాంగి వేడుకన్
స్థిరముగ రుక్మిణీ సతి పతివ్రత గా యెనలేని భక్తితో.
పరమ పురాతన ఛాందస
రిప్లయితొలగించండిపురుషాధిక్యత సహించ పుణ్యంబా నే
విరచించెద చరితయనుచు
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్
రిప్లయితొలగించండిపరిచయ మైన నిమేషము
సరి యితడే మగడనుకొని సతియై యోడం
గ రణమున బుస్సనుచు తా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
జిలేబి
వరమై యొప్పదె యిందీ
రిప్లయితొలగించండివరాక్షి లభియింపఁ బురుష వరులకు నట్లుం
గరిగమన నడుము నొత్తుచుఁ
జరణముతో భర్తృసేవ సతి యొనరించెన్
ధరణిజఁ బోలు కూర్మి వసుధాభ ఘనక్షమ నిత్య సౌమ్య వా
గ్ఝరులును భాసిలంగ మఱి సాగుచు బంధు జనవ్ర జామి తా
దర కరణైక సక్త గుణ తత్పర స్వీయ నికేతన క్రియా
చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి వేడుకన్
రిప్లయితొలగించండిమురిపెమ్ముగ ముద్దులతో
వరించి పెన్మిటికి వలయు వసతిని కల్పిం
చి రతీదేవివలె సదా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
జిలేబి
రిప్లయితొలగించండిహరియొక్కడెపతి యగునె
ల్లరికి తతిమ్మా పడతులె లావణ్యవతీ!
హరిపూజయె మేలన నను
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
జిలేబి
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
తరుగని ప్రేమ చిహ్నముల త్రవ్వుచు తీయగ జీన్సు ప్యాంటులో...
మరుసటి రోజునన్ కనగ మార్కెటు నందున దుండగీడుడై
పరుగిడి చెంతచేరి యొక పంకజ నేత్రకు కన్నుగొట్టుచున్...
చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి వేడుకన్
వరకట్నంబులు దగదని
రిప్లయితొలగించండిసరిసమముగ నతివజూచు జక్కనివాడౌ
పురుషోత్తమునిన్ ధర్మా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్
మిరియాల ప్రసాదరావు కాకినాడ
రిప్లయితొలగించండిపురివిప్పిన నెమలివలెన్
ధరణిని నాట్యంబులాడు తరుణి జిలేబీ
సరసము లాడి మదిని నా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
జిలేబి
తరుణిని నబలగ జూచుచు
రిప్లయితొలగించండికరుణింతయు జూపలేని గఠినాత్ముండౌ
బురుషుని గసిగా దక్షిణ
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్
మిరియాల ప్రసాదరావు కాకినాడ
పరమేశ్వర సంకల్పము
రిప్లయితొలగించండిమరువక సద్భక్తిచేత మనుగడయందున్
వరమని మగనినిగని యా
చరణముతో బర్తృసేవసతియొనరించెన్
రిప్లయితొలగించండిమరువక ప్రతి దివసంబున
చెరగని చిరునగవు తోడ చేయుచు సేవల్
నరసారథికిని,ధర్మా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్"*
కరమును పట్టిన పతియే
కరమను రాగమును చూప కాంతామణియున్
మురియుచు నిరతము ధర్మా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్"*
ధరణిజ యతిసద్ధర్మా
చరణముతోభర్తృసేవ సతి యొనర్చెన్
వరవర్ణినులకు నదియే
పరమాదర్శంబునయ్యె వసుమతి యందున్.
శ్రీ రామాయణ కావ్యము
రిప్లయితొలగించండిపారాయణ సల్పుచుండె పతియతి భక్తిన్,
ప్రేరణ గల్గగ సుశ్రీ
చరణముతోభర్తృసేవ సతియొనరించెన్
కొరుప్రోలు రాధాకృష్ణా రావు
అన్ని పాదములు లఘువులతో మొదలవ్వాలి కదూ...
తొలగించండిధన్యవాదాలు పొరపాటు సుశ్రీ అన్న తరువాత చ గురువౌతుందని తికమక
తొలగించండిSankararyulu. Ivala kuda ????
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపరగగ దైవభక్తియునపారముగా గలుగంగమంగళా
రిప్లయితొలగించండిచరణముతోడ భర్త్రుపరిచర్య యొనర్చె లతాంగివేడుకన్
నరయగ భర్తయేగద యయాచిత సంపదలిచ్చువాడునై
గరము నుదార బుధ్ధిని నెకాయెకి సంబరమిచ్చునేగదా
సరగున లేచి వేకువను స్నాన మొనర్చి భవానిని న్మదిన్
రిప్లయితొలగించండిస్థిరముగ నిల్పి పూజలను చేసి నివేదన తోడ తల్లికిన్
గరము ప్రియమ్ము గూర్చి తన గానముతో తుది నొక్క మంగళా
చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి వేడుకన్.
ధనమా? దైవమా? సినిమాలో ఎన్టిఆర్ ను ఓదార్చుచూ జమున పాడే పాట నేపథ్యం గా...
రిప్లయితొలగించండికందం
ధర నాత్మశాంతి విడి యే
సిరులున్ సౌఖ్యము వలదని చేరిచి యొడికిన్
స్వరడోలన్ గానమ్మున
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్
చంపకమాల
కొరవడ నాత్మశాంతి సతిఁ గోరి విరామముఁ జెందఁ జేరగన్
నెరకొన దైన్యమే నిమిరి " నీమది చల్లగ స్వామి! నిద్రపో
సిరులును సౌఖ్యముల్ వలదు చిత్తము నందున శాంతిలేక" యన్
చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి వేడుకన్
తరుణికి పతియే దైవము
రిప్లయితొలగించండిపరమార్థము శుభములొసగు భద్రత గూర్చున్
స్థిరమతి సద్భక్తి సదా
చరణముతో భర్ర్తృసేవ సతియొనరించెన్
రచయిత ఆకులశివరాజలింగము వనపర్తి
పరమపతివ్రతల్ పతిని ప్రాణపదంబుగ నెంతురయ్య యే
రిప్లయితొలగించండితరుణమునందునైన జవదాటరనుజ్ఞ మహీతలంబునన్
గురుతరకుష్టుబాధితుని కూర్మిసహింపదె భార్య సద్గుణా
చరణముతోడ భర్తృ పరిచర్యయొనర్చె లతాంగివేడుకన్
ఆకుల శివరాజలింగం వనపర్తి
కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు ఉదయమే డా. జి. సీతాదేవి గారి పుస్తకాన్ని ప్రెస్సులో ఇవ్వడానికి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చాను. పూరణలను చూడబోతుండగా అవుసుల భానుప్రకాశ్ గారు వచ్చి, ఇప్పటిదాక కూర్చుని వారి 'వాగ్దేవతా శతకం' పరిషరించుకొని వెళ్ళారు. అందువల్ల ఈరోజు మీ పూరణలను సమీక్షించలేకున్నాను. మన్నించండి.
రిప్లయితొలగించండివరహీనుడైనవానికి
రిప్లయితొలగించండివరమున వచ్చెనొకకన్య భార్యగ నిలలో
పరమపవిత్రయధర్మా
*"చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్"*
మరగించు వెతల బాపుచు
రిప్లయితొలగించండిమురిపించు వెలుగుల మగని మోమున నింపన్
విరితేనె లొలుకు త్యాగయ
చరణముతో భర్తృ సేవ సతి యొనరించెన్!