4, జనవరి 2019, శుక్రవారం

సమస్య - 2892 (పెండ్లి వేదిపై...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట"
(లేదా...)
"శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్"

75 కామెంట్‌లు:

 1. చిన్ననాటిని నుండియు చిలిపిజేసి
  కన్నులారగ వెదకగ కన్యకొరకు...
  బ్రహ్మచర్యమునకు నిక వరుడు గారి
  పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ముప్ఫై ఏండ్లక్రితం మా పంజాబీ విద్యార్ధి "కపిల్" వివాహ ఆహ్వాన పత్రిక:

   Sir: You are cordially invited to the funeral of my bachelorhood"

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   బ్రహ్మచర్యానికి శ్రాద్ధం పెట్టడం... బాగుంది. చమత్కారమైన భావన. చక్కని పూరణ. అభినందనలు.
   "చిన్ననాటినుండియు గడు చిలిపి జేసి....వరునియొక్క" అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 2. మైలవరపు వారి పూరణ

  ఇద్ధరనుగ్రవాదికి విధించి యురిన్ , తుదికోర్కె యేమనన్
  శ్రద్ధగ న్యాయవాదులు , విలక్షణమౌ గతి కోరెనాతడున్
  శ్రాద్ధము పెండ్లిపీటపయి చాలును నాకని ., చంపి, వానికిన్
  శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 3. డా. పిట్టా సత్యనారాయణ
  ఇండ్ల నమ్మి ఫంక్షనుహాలు నిట్టె గట్ట
  వాస్తు లేదని ప్రజలెల్ల వదల దాని
  గొప్ప యజమాని రందితో గూలి పోవ
  పెండ్లి వేదిపై శ్రాద్ధము పెట్టిరంట!

  రిప్లయితొలగించండి


 4. ఉన్నదొకటె కామను హాలు యూరిజనుల
  కెల్ల! పెండ్లి యయ్యె జనులు కెడను బాయ,
  వచ్చె పో, యమావాస్యయు వరలుకొనుచు
  పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తిరిగి స్వాగతమండి! జిలేబి గారు
   మీరు లేని ఈ బ్లాగు కొన్నాళ్లు నారద ముని లేని వైకుంఠంలా ఉంది!
   ఇప్పుడు మళ్లీ పుర్వ వైభవం వచ్చిందీ:)

   తొలగించండి


  2. పాలవరపు శ్రీకర! మా
   గోలను భళి నారదార్య గురువులతో హే
   రాలముగా బోల్చిరిగ! వ
   యోలా! నెనరులు జిలేబులొప్పంగ గొనన్ :)


   జిలేబి

   తొలగించండి
  3. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  4. జిలేబి గారు మీకు కంటి చికిత్స జరిగినదని శాస్త్రి గారు చెప్పిరి. ఇప్పుడు పూర్తి స్వస్థత చేకూరి నట్లు తలఁచెదను.

   తొలగించండి

  5. పోచిరాజు వారికి

   నమో నమః!

   గుడ్డిలో మెల్ల :)


   నెనరులు

   జిలేబి

   తొలగించండి
 5. క్రమాలంకారం లో -----
  పెండ్లి యెచ్చట జరుగును వేడు కలర?
  కాశి చేరియు తనయులు కన్న తండ్రి
  కేమి పెట్టి రి శ్రద్ద తో నిష్టు ల గు చు ?
  పెండ్లి వేది పై ; శ్రాద్ద ము పెట్టి రం ట

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు నేను వరంగల్ వెళ్తున్నాను. రేపు తిరిగి వస్తాను. ఈ రెండు రోజులు బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 7. సమస్య :-
  "పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట"

  *తే.గీ**

  పెండ్లి కానివేళతిరిగె పృథ్వి యంత
  వరుడు తనకిష్టమైనట్లు విరివిగాను
  వరుడి స్వేచ్ఛకక్షతలలందరును జల్లి
  పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట
  .....................✍చక్రి

  రిప్లయితొలగించండి
 8. షష్టి పూర్తి మహోత్సవ సమయమందు
  గుండె పోటుతో మరణించె గుడిన యున్న
  పెండ్లి వేదిపై, శ్రాద్ధముఁ బెట్టిరంట
  యూర్ధ్వ గతులనిప్పింపగ నోర్మితోడ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గుడిని నున్న' అనండి.

   తొలగించండి
 9. డా. పిట్టా సత్యనారాయణ
  బుద్ధిని తాన్ బృహస్పతియ బో నట గాంగి(కాంగి॥కాంగ్రెస్ పార్టీ)ని బెళ్ళి యాడగా
  సిద్ధిని బొందునో యనగ శీల యుతుండగు రాము(కోదండ రామ్)పార్టికిన్
  బద్ధక మావరించెనొకొ బాగన నొక్కడు గెల్వ లేదయో
  శ్రాద్ధము బెట్టినారట విశాల వివాహపు మండపమ్మునన్

  రిప్లయితొలగించండి
 10. ( హితకారిణీసమాజాన్ని స్థాపించి ఏకైకధీరుడై సమకాలిక
  సమాజాన్ని ఎదిరించి వితంతుపునర్వివాహాలతో మహిళ లకు మంగళజీవితాలిచ్చిన వీరేశలింగం మహాశయుడు )
  బద్ధత లేని సంఘమున
  బంధితలైన వితంతులందరిన్
  సిద్ధము చేసి పెండిలికి ;
  సిగ్గును లజ్జయు లేని మూఢులన్
  యుద్ధమొనర్చి గెల్చిన సు
  యోధశిఖామణి "కందుకూరి " యే
  శ్రాద్ధము బెట్టినారట వి
  శాల వివాహపు మండపమ్మునన్ .

  రిప్లయితొలగించండి
 11. నగర జీవనమది గన నరకము గద
  సత్రమొక్కటె వేదిక చావు, పెళ్లి
  సకల కార్యములకది, నొసటను నవ్వె
  పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట
  అనుచు పల్లె యతిథులంత, అక్క పెళ్లి
  చేసినచ్చోట తండ్రికి చేయ కర్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చేసినట్టిచో దండ్రికి...' అనండి.

   తొలగించండి


 12. వృద్ధుల దేశమాయె గద వృద్ధిని గాంచగ వద్దు పిల్లలే
  వద్దన గాను! రోసిరి వివాహము లన్ సహ వాస మాయె పో
  ముద్దుగ పేర్మిగా జనుల మూర్ఖత, చావగ కాలరీతిలో
  శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 13. జీపీయెస్ వారి తేటగీతికి ఉత్పలము :)  యుద్ధమిదేను! భామల పయోధరముల్ మరి వీడలేమికన్
  సిద్ధము మేము! బ్యాచులరు చింతల తాళుట మా తరంబకో!
  బుద్ధిగ బ్రహ్మచర్యమును, పొల్తుక కైగొని, చంపి, శూరులే
  శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. వరుని బంధుల కత్యాశ వరలి నంత
  పెండ్లి పీటల మీదనె పెండ్లి వీగె
  'కన్య మాకు వలద'నుచు కాల దన్ని
  "పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట"
  ***)()(***
  (వాచార్థమున కాక పోయినను,కవనార్థమున)
  {Though not in literary sense, yet in poetic / figurative sense}

  రిప్లయితొలగించండి
 15. బుద్ధులు మారిపోయినవి పూర్వసనాతనసంప్రదాయముల్
  శ్రద్ధగ నాచరించఁ దగు సత్సహనమ్ము నశించె, యింట సం
  సిద్ధతఁ లుప్తమై తుదకుఁ జిత్రవిధిన్ బితృకార్యవేదిగా
  శ్రాద్ధముఁ బెట్టినారట, విశాలవివాహపు మండపమ్మునన్.

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించండి
 16. మిత్రులందఱకు నమస్సులు!

  [తాత మరణించిన యింట ననతికాలముననే మనుమరాలి వివాహముం జేయుట యొక యాచారము. తద్వారా మేలు జరుగునని, మృతునకు సద్గతులు దక్కునని యొక నమ్మకము. ఆ నమ్మిక ననుసరించి, యొక వృద్ధుఁడు మరణించిన యింట, నతని మనుమరాలికిఁ బెండ్లి సేసి, యా మృతున కచ్చటనే శ్రాద్ధముం బెట్టిరను సందర్భము]

  సిద్ధయ తాత చచ్చెఁ, దను సిద్ధము సేసిన మండపాన; నా
  వృద్ధుఁడు కట్టి నింటను నివృత్తినిఁ గోరుచుఁ, బౌత్రిఁ బెండ్లికై
  బద్ధను సేసి, సేసియు వివాహము శీఘ్రమె విట్పతీచ్ఛమై,
  శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు.

   తొలగించండి
  2. రెండో పాదాన చిన్న సవరణతో...

   సిద్ధయ తాత చచ్చెఁ, దను సిద్ధము సేసిన మండపాన; నా
   వృద్ధుఁడు కట్టి నింటను నివృత్తినిఁ గోరుచుఁ, బౌత్రి నుద్వహో
   ద్బద్ధను సేసి, సేసియు వివాహము శీఘ్రమె విట్పతీచ్ఛమై,
   శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్!

   తొలగించండి
 17. బాల్యమందువివాహము ,వరుడుమడయ
  సతియెసతిహితమనివల్కెచాంధసుండు
  మూఢనమ్మకంబునకుసుమూరుతంబు
  పెండ్లివేదిపై శ్రాద్ధము బెట్టిరంట

  రిప్లయితొలగించండి
 18. శ్రద్ధగజేయుకృత్యమగు శ్రాద్ధ ము;ధ్యానముయోగసాధనల్
  బుద్ధుని వోలెబద్ధుడయి మోహ మణంచిమహాత్మశుద్ధి స
  న్నద్ధుడయెన్గధాధరుడనాదరమెంచకశారదాంబతో
  *"శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్"*

  రిప్లయితొలగించండి
 19. సోమయాజుల యింటను శోభగాను
  అరుగుపైన జరిగెవివాహమ్ము నాడు
  నేడు తిథిగాన తండ్రిది జూడనాటి
  పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట.

  రిప్లయితొలగించండి
 20. ఇష్టపడిన వరుని, నింట నిచ్ఛలేక,
  పెండ్లి కొమరుడు జూడుమ, పెండ్లి యాడ,
  ప్రేమ గెలిగింప, దాగొనె, ప్రీతి విషము,
  పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట

  రిప్లయితొలగించండి
 21. తండ్రి ఆబ్ధీక మనుచును తనయు దొకడు
  కూతు పెండిలి జేయగ కోవె లందు
  ఇరువు రటునిటు తమపని యింపు గాను
  చూచు వారల కనిపించె సోద్దె ముగను
  పెండ్లి వేదిపై శ్రాద్ధము బెట్టి రంట

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పని నింపుగాను' అనండి.

   తొలగించండి
  2. తండ్రి ఆబ్ధీక మనుచును తనయు దొకడు
   కూతు పెండిలి జేయగ కోవె లందు
   ఇరువు రటునిటు తమపని నింపు గాను
   చూచు వారల కనిపించె సోద్దె ముగను
   పెండ్లి వేదిపై శ్రాద్ధము బెట్టి రంట

   తొలగించండి
 22. వత్సరముమీరకుండవివాహమెట్లు
  మనుమరాలికియనవల్క;మాన్యుడొకడు
  శ్రాద్ధమొనరించిపెండిలిజరుపుమనిన
  పెండ్లివేదిపై శ్రాద్ధము బెట్టిరంట

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మనుమరాలికి నని పల్క...' అనండి.

   తొలగించండి
 23. గుండెపోటున మరణించ క్రొత్తవధువు
  పెండ్లివేదిపై శ్రాధ్ధంబుపెట్టీరంట
  శాస్త్రయుక్తపు మంత్రాలు చదువు చుండి
  పెండ్లి వోలెను గర్మగా వించి రార్య!

  రిప్లయితొలగించండి
 24. ఇరుకు కొంపలోన జరుపగ లేము శుభాశుభ కార్యముల్ బాధ తీర్చ
  పట్టణముల లోన, పల్లెలలోన వెలసె మంటపములు సలక్షణముగ,
  పితృ కర్మలనెపుడు పెట్ట రాదు వివాహ మంటపముల లోన, మదము కలిగి
  మంటప యజమాని మనువైనను మరణ మైన నొక్కటి యని మదిని తలఛి
  తనదు తండ్రికి ఘనముగా తద్దినమును
  పెట్ట దలచి బందు జనము న్బిలిచి జరిపె,
  పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట"
  యనుచు గుసగుస లాడిరి జనులు నపుడు  రిప్లయితొలగించండి
 25. శ్రద్ధను గల్గి తండ్రికట సాహెబమీరనె యన్నదమ్ములే
  బుద్ధిగ హిందు పద్ధతిని మోక్ష మొసంగ మటంచు కోరుచున్
  శ్రాద్ధముఁ బెట్టినారట, విశాల వివాహపు మండపమ్మునన్
  నిద్దరినిన్ ఘనమ్ముగను హిందుసమాజము గౌరవించెనే.

  రిప్లయితొలగించండి
 26. బుద్ధిచిగిర్చదేశమున మూఢస నాతనభ్రష్టసంస్కృతిన్
  శుద్ధియొనర్పనెంచియఘసూదనబ్రహ్మసమాజమార్యమున్
  వృద్ధమనాదిమౌఢ్యమనిబెద్దలునొప్పగమూఢవాదికిన్
  *"శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్"*

  రిప్లయితొలగించండి
 27. పడతి యురిశిక్ష పడ్డట్టి వాని పెండ్లి
  యాడ నిశ్చయించ, జరిగె నద్భుతముగ
  పెండ్లి వేదిపై, శ్రాద్ధముఁ బెట్టి రంట
  శిక్ష పడి మరణించగ చేరి హితులు

  రిప్లయితొలగించండి
 28. ముదము నొసఁగి మిక్కుటముగ ముగియ పరిణ
  యమ్ము దంపతుల జనకు లంత నెమ్మిఁ
  బట్టు పీతోత్తరీయము బ్రాహ్మణుండు
  పెండ్లి వేది పై శ్రాద్ధముఁ బెట్టిరంట

  [వేది = విద్వాంసుఁడు; శ్రాద్ధము = శ్రద్ధతో గూడి ]


  ఇద్ధపు దీప కాంతు లట నింపు నొసంగఁగఁ దల్లిదండ్రు లా
  శుద్ధపు నూత్న వస్త్రములు, శ్రోత్రియు నానతిఁ గ్రొత్త జంట యే
  పద్ధతి నెంచి చిత్తమునఁ బన్నుగఁ బీటల మీద నుండగన్
  శ్రాద్ధముఁ, బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్

  [శ్రాద్ధము = శ్రద్ధతో గూడినది]

  రిప్లయితొలగించండి
 29. వృద్ధుడు రాజకీయ గురువేగగ స్వర్గము శోకతప్తులై
  శ్రద్ధను జూపుచున్ దమదు శాస్త్రపురీతిని శిష్యులెల్లరున్
  శ్రాద్ధము బెట్టినారట; విశాల వివాహపు మంటపమ్మునన్
  బెద్దగ జేరగా జనులు పేర్మిని బెట్టిరి భోజనమ్ములన్ !

  రిప్లయితొలగించండి
 30. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)


  భవిష్య పురాణం:

  బుద్ధుడు డింపులయ్యకిక పుణ్యము కట్టుచు కాంగ్రెసేతరుల్...
  బద్ధకమంతయున్ విడిచి బ్రాహ్మణ భామను దేవులాడుచున్...
  శ్రద్ధగ బ్రహ్మచర్యమును చంపుచు పంపుచు స్వర్గసీమకున్
  శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్

  రిప్లయితొలగించండి
 31. మొద్దులు సంప్రదాయక విమోహులు యాధునికమ్ముబేరిటన్
  శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్
  పెద్దల మాట గాదనుచు పెండ్లిని జేసిరి కాటిలోపలన్
  పెద్దలు తిట్టి పోసిరిక పెద్దపదమ్ముల పేడిగాళ్లనే

  రిప్లయితొలగించండి
 32. శ్రద్ధతోజేయు పనినేమొ శ్రాద్ధమనిరి
  నేడు శ్రాద్ధము మారుచు నీచమాయె
  పెండ్లి తంతును శ్రద్ధతో బిలచుటనిన
  "పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట"

  రిప్లయితొలగించండి
 33. బధ్ధ మనస్కులై హితులుబాపనిపంపున గ్రొత్తబట్టలన్
  శ్రాధ్ధముబెట్టినారటవిశాలవివాహపుమండపమ్మునన్
  నిధ్ధరనానవాయతియయిట్లుగబట్టలువెట్టుటిత్తరిన్
  శ్రాధ్ధమనంగనేర్వుమిటశ్రధ్ధనుజేయుటనెల్లవేళలన్

  రిప్లయితొలగించండి
 34. బాల్యమందున పెళ్లిళ్లు బ్రమలుయగును!
  యవ్వనంబున కోర్కెలు నవ్వుచుండ?
  పెళ్లిదినమందె భర్తకు పెద్దఖర్మ
  పెండ్లి వేదిపై శ్రాధ్దము బెట్టిరంట!
  (మ్యారేజ్ డే రోజే భర్తచనిపోవశ్రాద్దమురోజైనది)

  రిప్లయితొలగించండి
 35. శ్రద్ధ వహించి చేయునది శ్రాద్ధ మటంచు వచింత్రు పండితుల్
  శ్రద్ధగ జేయగా వలయు చక్కని తంతుగ పెండ్లి శాస్త్ర సం
  బద్ధ విధాన నంచు తమ పౌత్రుని పెండిలి లోన నాంది యన్
  శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్.

  రిప్లయితొలగించండి
 36. తే. ప్రేమపేరున మోసముపెద్దచేసి
  యతివ లెందరినొమునుపు యలుసు జేయ
  తగిన బుద్ధిజెప్పగవనితలపుడుమరు
  పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట.

  రిప్లయితొలగించండి
 37. బుద్ధిని శుద్ధిజేసి మనపూర్వు లు నేర్పిననేర్పులొప్ప సం
  సిద్ధులుగండు రండనగ జేతము జచ్చిన సాంప్రదా యికుల్
  *"శ్రాద్ధముఁ బెట్టినారఁట; విశాల వివాహపు మండపమ్మునన్"*
  బుద్ధికి,తార్కికాత్మకు బ్రబుద్ధులొసంగిరి నాంది శ్రాద్ధమున్

  రిప్లయితొలగించండి
 38. తేటగీతి
  పెళ్లి చూడగ వచ్చియు గిల్లు కొనుచు
  వర్గ పోరుతో నలిగెడు వైరులచట
  నుడికి పోవుచు తిట్లతో నొకరికొకరు
  పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట!

  ఉత్పలమాల

  ఇద్దరి వర్గపోరు బెదిరింపుల రేగుచు సద్దుమన్గియున్
  పెద్దల పెండ్లివేడుకల విందున బైల్పడ గిల్లుకొంచుఁ బెన్
  గుద్దులతో చెలంగి గుమి గూడఁ బరస్పర దూషణమ్ములన్
  శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్

  రిప్లయితొలగించండి
 39. బంధువు లనందర బిలిచి బాగుగాను
  కూతు పెండిలి జేసెను కూర్మితోడ
  *"పెండ్లి వేదిపై, శ్రాద్ధముఁ బెట్టిరంట"*
  మరుసటి దినము నాతని మారుతల్లి!!

  రిప్లయితొలగించండి