డా.పిట్టా సత్యనారాయణ వెన్ను బోటున ముఖ్యుడౌ విజ్ఞుడొకడు "మేకినిండియ" యను నవ్వ!మేటి భక్తి ఓటు గానదు నీతిని; యొనరు ఖ్యాతి పతిని త్యజియించి సతి ప్రతివ్రత యనబడె
డా. పిట్టా సత్యనారాయణ అతి వినయమ్ము ధూర్తమగు నా హరి పాదము లొత్తు లక్ష్మియై బ్రతికిన బ్రత్కు బ్రత్కగునె బాయగ దేశ విదేశ వర్తనన్ చతికిల బడ్డదీ వరుస చక్కబడన్ గత సంప్రదాయ ది క్పతిని బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2890 సమస్య :: పతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్. *భర్తను వదలివేసిన ఒక స్త్రీ పతివ్రతగా ప్రశంసలను అందుకొన్నది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: పరమశివుని అవమానించేందుకోసం దక్షుడు నిరీశ్వరయాగం మొదలుపెట్టినాడు. తండ్రి మనసును యెఱుగని సతీదేవి తన భర్తయైన శివునికి ఇష్టం లేకున్నా ఒంటరిగా ఆ దక్షయజ్ఞానికి వెళ్లింది. అక్కడ దక్షుడు చేసిన తన పతినిందను (శివనిందను) సహింపలేక “ఇక నేను నా భర్తయగు పరమశివునికి నా ముఖాన్ని ఎలా చూపగలను” అని చింతిస్తూ యోగాగ్నిని సృష్టించుకొని భర్తనే స్మరించుకొంటూ ఆ చితిలో పడి తన ప్రాణాలను అట్లే తన భర్తను వదలివేసింది. అలా భర్తను (ప్రాణములను) వదలి వేసిన ఆ సతీదేవి పరమ పతివ్రతా శిరోమణిగా ప్రశంసలను పొందినది పూజ్యురాలు అయ్యింది అని సతీసహగమనమును గుఱించి విశదీకరించే సందర్భం.
సందర్భము: ఒక భామ ఇంగ్లీషు వైద్యం (అలోపతిని) వదలిపెట్టి మూలికావైద్యంతో పతి ప్రాణాలు రక్షించుకోగలిగింది. ఇదీ సారాంశం. *రోగం పేరు* ఏమిటో! పేర్కొనబడలేదు. *మూలిక పేరు* ఏమిటో చెప్పబడలేదు. *వైద్యుని పేరు* ఏమిటో *రోగి పేరు* ఏమిటో చివరకు *భామ పేరు* ఏమిటో కూడ పేర్కొనలేదు. సమస్య మాత్రం పూరింపబడింది. ఏ విశేషమూ లేని మామూలు పద్యం అన్నదానికి ఇది ఉదాహరణగా తీసుకోవచ్చు. *కాని ఏ విశేషమూ లేకపోవడమే యిందులోని విశేషం..* ఐదు విషయాలు ఇందులో చెప్పబడక పోవడంవల్ల *అనుక్త పంచకం* అనవచ్చు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ అతి దయనీయమైన రుజ నల్లలనాడు పతిన్ గురించి వై ద్య తతి వచించు మాట విని యాయమ మూలిక వైద్య మద్ది మే లు..తగు నటంచుఁ జేయగను రోగము తగ్గెను పూర్తిగా..నలో పతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్
✒~డా.వెలుదండ సత్యనారాయణ 2.1.19 ----------------------------------------------------------- శ్రీ సూరం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలతో
సత్యము నహింస చేబట్టి శాశ్వతముగ
రిప్లయితొలగించుబాపు తోడుత కస్తూరి పయనమందు
కులము ధనమును యశమును గురుతర పర
పతిని త్యజియించి సతి పతివ్రత యనఁబడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'గురుతర పరపతి' దుష్టసమాసం. అక్కడ "కోరియు పర।పతిని..." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుసతతము మోస గించిన నుచాకిరి జేయుచు నేర్పుగా నిలన్
రిప్లయితొలగించువెతలను పొందుచున్ తుదకు వేయి విధమ్ముల మార్పు కోరినన్
కతలను జెప్పగా మిగుల కాలుని వోలె విదారణ చేయగన్
పతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్
విదారణ = చంపుట, బాధించుట మున్నగునవి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'విదారణ' అన్నచోట గణదోషం. సవరించండి.
వెతలు పడలేక నిరతము వేగి వేగి
రిప్లయితొలగించుమార లేనట్టి మగనిని మార్చ లేక
విసిగి పోయిన యిల్లాలు విధిని దలచి
పతిని త్యజియించి సతి పతివ్రత యనబడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించువిసిగి పతిని త్యజించిన ఇల్లాలు పతివ్రత ఎలా అవుతుంది?
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించుఅతులితమైన ప్రేమ హృదయమ్మున నిండ స్వయంవరమ్మునన్
బతియన నాకునా నిషధపాలకుడైన నలుండె యంచు ధీ...
చతురతఁ ద్రోసి వాయువుఁ గృశానునిఁ బాశిని., స్వర్గలోకపుం... ...
బతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
దిక్పతులను పరిత్యజించిన దమయంతిని ప్రస్తావించిన మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుపతినిగావగయమునితోవాదమునొన
రిప్లయితొలగించురించె ,బతికినైయొకతెహరిన్ స్మరించె
పతికినైయాపెనర్కు నేసతిధరిత్రి
*"పతిని త్యజియించి సతి పతివ్రత యనఁబడె"*?
ప్రశ్నార్థకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"..నేసతి, యనకుము। పతిని..." అంటే బాగుంటుందేమో?
సమస్య :-
రిప్లయితొలగించు"పతిని త్యజియించి సతి పతివ్రత యనబడె"
*తే.గీ**
నాస్తికుడు పెళ్లిజేసుకున్న పిదప తన
సతిని దైవపూజ వలదు చాలుమనెను
భర్తమాటమీరక తాను భక్తిని,గణ
పతిని త్యజియించి సతి పతివ్రత యనబడె
....................✍చక్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించురగులు క్రోధాగ్నినేత్రుడై భ్భగుమహర్షి
రిప్లయితొలగించుమరచి బుద్ధిని దన్నగ హరియెడదను;
కమలిపోయిన కన్నుల కమల వెతను
పతిని త్యజియించి సతి పతివ్రత యనబడె.
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించుపతినిదలంచిభిక్షమిడెవచ్చినపూజ్యులకన్నపూర్ణయై
రిప్లయితొలగించుపతినిదలంచిదండధరుపాశమునాపెసతీయొకర్తుకా
పతిహితమైవ్రతంబులసువాసినులెందరుజేయలేదు యే
*"పతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్"*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'సతీ యొకర్తుక' ఇక్కడ సతీశబ్దం దీర్ఘాంతం కాదు. "సతీమతల్లి యా" అందామా?
మొదటి పాదంలో "భృగు "అని చదువ మనవి .
రిప్లయితొలగించుసతికిపతియౌనుభరతోర్విసాంబశివుడు
రిప్లయితొలగించుమాధవుడుదాతగతిజీవమంతనతడె
పతినిసర్వస్వమనియెంచె-పడతియెవతె
పతిని త్యజియించి సతిపతివ్రతయనబడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించువెన్ను బోటున ముఖ్యుడౌ విజ్ఞుడొకడు
"మేకినిండియ" యను నవ్వ!మేటి భక్తి
ఓటు గానదు నీతిని; యొనరు ఖ్యాతి
పతిని త్యజియించి సతి ప్రతివ్రత యనబడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'నీతిని నొనరు...' అనండి. అక్కడ యడాగమం రాదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఆసుపత్రిని రోగియై యలమటించు
రిప్లయితొలగించుభర్తకును సేవ లందించి, వగచి,వగచి,
కామ హీనత,సాధ్వి,వికారపు రతి
పతిని త్యజియించి సతి,పతివ్రత యనబడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుధన్యవాదములు
తొలగించుధన్యవాదములు
తొలగించుగడిపె పురములో వనమున కడుగునిడక
రిప్లయితొలగించుపతిని త్యజియించి సతి, పతివ్రత యనఁబడె
నుగద నూర్మిళ నగరిలో జనులు పలు తె
రంగుల కొనియాడ నిలలోన భంగ పడక
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'యూర్మిళ' అనండి.
మౌని తనకు నొసగినట్టి మంత్ర మహిమ
రిప్లయితొలగించుచూడ దలచి కుంతి పిలిచె సూర్యుని, రవి
నొసగ సుతుని, తన మనసు నొచ్చ నంగ
పతిని త్యజియించి సతి పతివ్రత యనఁబడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'రవి యొసగ... నొవ్వ' అనండి.
ఆ పసివాడు అప్పటికి అంగపతి కాలేదు కదా?
పతి యె ప్రత్యక్ష దైవమై పర గు చుండ
రిప్లయితొలగించువ్రతము నోములు సలిపెడు వారిజాక్షి
భక్తి భావము గలిగి యు వరల నెటుల
పతిని త్యజియించి సతి పతివ్రత యన బడె?
ప్రశార్థకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుశంతనుడు కూడ కలిగెను సంతసముగ
రిప్లయితొలగించుసుతులు, మాట తప్పెననుచు వెతను పొంది
గంగ, దేవవ్రతుని తోడ గడప దాటె,
పతిని త్యజియించి సతి పతివ్రత యనఁబడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుపుత్ర సంతతి బడయగ పుణ్యవతియె
రిప్లయితొలగించుసతి, గురువులాజ్ఞతో నోచె సవితృ నోము
అతుల నిష్ఠగ నుండుచు, ఆరు నెలలు
పతిని త్యజియించి సతి, పతివ్రత యనఁబడె
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించుడా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించుఅతి వినయమ్ము ధూర్తమగు నా హరి పాదము లొత్తు లక్ష్మియై
బ్రతికిన బ్రత్కు బ్రత్కగునె బాయగ దేశ విదేశ వర్తనన్
చతికిల బడ్డదీ వరుస చక్కబడన్ గత సంప్రదాయ ది
క్పతిని బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుపతిని యెడబాసి బాధతో వనము నందు
రిప్లయితొలగించురామనామము స్మరియించు రమణి తనను
కోరి నట్టి మోహాంధుడగు దనుజాధి
పతిని త్యజియించి సతి పతివ్రత యనఁబడె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'పతిని నెడబాసి..' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుగతులిక నాస్తి కాంతలకు కాంతుని బాసిన నాథు నీయవే
రిప్లయితొలగించుపితృపతి యంచు వెంటబడి వేడి సతీత్వమహద్వరమ్మునన్
పతిని లభింప జేసుకొనె ప్రాంతర మందు పడుండ స్వర్గియౌ
పతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్.
ప్రశస్తమైన పూరణ అభినందనలు.
తొలగించుధన్యవాదాలు గురువు గారూ
తొలగించుక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించుపొలుపుమీఱె నమలమౌచు పోకుగల్గు
పతిని త్యజియించి సతి; పతివ్రత యనబడె
నామె నీమ నిష్ఠల తోడ ననవరతము
మెలగు పెన్మిటి గొలిచెడి మెలన వలన.
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'నియమ నిష్ఠల' అనండి.
చంపకమాల
రిప్లయితొలగించువెతల బడంగ జేసి మది వేదనఁ గూర్చఁగ కీచకుండటన్
గుతకుత లాడుచున్ వలలుఁ గూడఁగ మాలిని వ్యూహమేర్పడన్
జతురత నాట్యశాలకును సైగల రమ్మని చంప మత్స్యరా
ట్పతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్
మనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించు🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించుఅతిగ బుభుక్ష గల్గెనట అద్రిజ మింగెను తా శివుండనే
రిప్లయితొలగించుఅతిచర తాను విష్ణువును అల్లన వీడెను కోపమొందగా
అతివయె జూపె కారణము, ఆమెను ఓల్గయె మెచ్చగా నదే
పతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్! ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకాని భావం అంత స్పష్టంగా ఉన్నట్టు లేదు.
నాథుని పయి రోషం బూనిన తఱి నించు
రిప్లయితొలగించుకంత మౌన మూనును గాని పంత మూని
చీటికిని మాటి కెక్కక చింతఁ బాను
పతినిఁ ద్యజియించి సతి పతివ్రత యనఁబడె
[పానుపు +అతి = పాను పతి]
అతుల తపో ధనస్థిత మహర్షి భృగూత్తమ నామధేయుఁడే
వితత తమిస్ర సంభృత వివేక విహీనతఁ దన్నవక్షముం
బతి పయి ఘోర రోషమునఁ బాఱె రమాసతి వీడి విష్ణునిం
బతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్!
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించుపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించుతన స్వయంవర మందున తలచి మదిని తిరముగ నల మహరాజు, దేవలోక పతిని త్యజియించి సతి ప్రతివ్రత యనబడె పొగడ దమయంతి కనుగొని పుడమిపతులు Asnreddy
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించుసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2890
సమస్య :: పతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్.
*భర్తను వదలివేసిన ఒక స్త్రీ పతివ్రతగా ప్రశంసలను అందుకొన్నది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: పరమశివుని అవమానించేందుకోసం దక్షుడు నిరీశ్వరయాగం మొదలుపెట్టినాడు. తండ్రి మనసును యెఱుగని సతీదేవి తన భర్తయైన శివునికి ఇష్టం లేకున్నా ఒంటరిగా ఆ దక్షయజ్ఞానికి వెళ్లింది. అక్కడ దక్షుడు చేసిన తన పతినిందను (శివనిందను) సహింపలేక “ఇక నేను నా భర్తయగు పరమశివునికి నా ముఖాన్ని ఎలా చూపగలను” అని చింతిస్తూ యోగాగ్నిని సృష్టించుకొని భర్తనే స్మరించుకొంటూ ఆ చితిలో పడి తన ప్రాణాలను అట్లే తన భర్తను వదలివేసింది. అలా భర్తను (ప్రాణములను) వదలి వేసిన ఆ సతీదేవి పరమ పతివ్రతా శిరోమణిగా ప్రశంసలను పొందినది పూజ్యురాలు అయ్యింది అని సతీసహగమనమును గుఱించి విశదీకరించే సందర్భం.
గతమున దక్షయజ్ఞమున గాంతుని నింద భరించలేక, యే
గతి నిక మోము చూపగల కాంతుని కంచును క్రుంగిపోవుచున్,
చితిఁ బడిపోయె మానవతి జీవితనాథు దలంచుకొంచు; నౌ
పతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్.
కోట రాజశేఖర్ నెల్లూరు (2-1-2019)
మనోజ్ఞమూ, ప్రశస్తమూ అయిన పూరణ. అభినందనలు.
తొలగించుశ్రీ గురుభ్యో నమః
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుపతినిత్యజియించి యనగనుబతియరాచ
రిప్లయితొలగించుకములరూపుమాపునటులగట్టడించి
మంచిమార్గముజూపించిమనిషిజేసి
పతినిత్యజియించిసతిపతివ్రతయనబడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకాని కొంత గందరగోళంగా ఉన్నది.
సర్ అప్పుడు గందరగోళం జరుగుచుండగావ్రాయబడినది.క్షమించండి
తొలగించుఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించు(జిలేబి గారికి అంకితం)
స్తుతముగ ప్రేమ జాలమున సూత్రము గట్టుచు పార్శికక్కటా!
నుతముగ పుత్రులొందుచును నొప్పుల నోర్చుచు పెద్దజేయుచున్
హతవిధి తండ్రి కోసమని హాయిగ తీయగ దేశభక్తుడౌ
పతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్
"భలే...
తొలగించుసహజంగా సమస్యలన్నింటికీ పూరణలకు మహాభారతం అనువుగా ఉంటుందని ఆర్యోక్తి.... మీకు కూడా అదే... అయితే...
మన భారతం 🙏🙏"
...మైలవరపు మురళీకృష్ణ"
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించుమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
సతిదమయంతివల్లభునిజాడనెరుంగకవీడెనాటవిన్
రిప్లయితొలగించుస్తుతమతిదక్షపుత్రిసతిశూలినివీడిజనెన్మఖంబు దుః
ఖితమతిలక్ష్మణానుమతిఖిల్లవసించెనె యూర్మిళాంబ శ్రీ
*"పతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్"*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'వీడె నా వనిన్' అనండి.
పతిని వ్రతముగా నెంచిన పడతి యొకతె
రిప్లయితొలగించుసతము పూజలు సలుపుచు, సంగరమున
యోధు డొక్కడై శత్రునిహతులజేయ
అందరును కలిసి నొకని నసమరీతి
జంపివేసిరి, ధర్మాల నెరుగువారె
*"పతిని త్యజియించి సతి పతివ్రత యనఁబడె"*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
ప్రాస యతి....
తొలగించుగండూరి లక్ష్మినారాయణ గారి పూరణ ...
రిప్లయితొలగించుపతితగ పేరుపొందెనొక భాగ్య విహీనుని సద్గుణాత్ముడౌ
పతినిఁ బరిత్యజించి, యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్
సతతము కష్ట దు;ఖముల సన్మతితోడను స్వీకరించుచున్
జతనముతోడ భర్త పయి జల్లుచు చల్లని ప్రేమ చంద్రికల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమతిజెడితిర్గుచుండెనటమానినియైననులజ్జలేకయే
రిప్లయితొలగించుపతినిపరిత్యజించియొకభామ,పతివ్రతగానుతుల్గొనెన్
సతియగు ద్రౌపదయ్యెడలజారుగుణంబులనొప్పుచుండుచున్
బతివ్రతలెల్లరున్గడుగృపారసయుక్తులుమౌనభాషణుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఅతిబల సేనలన్ దునిమి రా ముని బాలురటంచెఱంగి యా
రిప్లయితొలగించుసుతులను కన్నతల్లినట చూచుచు రాముడు విస్మయమ్ముతో
యతివను లోకపావనిని యాదర మందున బిల్వ జానకీ
పతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'విస్మయమ్ముతో నతివను... పావనిని నాదర...' అనండి.
మచ్చు కైన లేక యొకటి మంచి గుణము
రిప్లయితొలగించుమాన వత్వమె పూర్తిగ మఱచి పోయి
పరమ పాపియై మసలెడి పనికి రాని
"పతిని త్యజియించి సతి పతివ్రత యనఁబడె"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"అతులితభోగభాగ్యమహిమాన్వితదానవభూవిభుండ నే
రిప్లయితొలగించునతివరొ?, నీ మగండల నరాధిపు బుత్రులనందు నొక్కడౌ,
వెతుకుచుఁ జేరునే!" యను వివేకవిలుప్తనిలింపవైరిభూ
పతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
అద్భుతమైన పూరణ. అభినందనలు
తొలగించుతేటగీతి
రిప్లయితొలగించుఅసురుఁ గూల్చఁగ భర్తకు నండనుండి
యుద్ధమందున కృష్ణుడుఁ నొరుగ నలసి
నరకుఁ జంపెను సత్యయె యరధమందు
పతిని త్యజియించి! సతి పతివ్రత యనఁబడె!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించుఅరదమందు.. టైపాటు
గురుదేవులకు ధన్యవాదములు.టైపాటు సవరణతో:
తొలగించుతేటగీతి
అసురుఁ గూల్చఁగ భర్తకు నండనుండి
యుద్ధమందున కృష్ణుడుఁ నొరుగ నలసి
నరకుఁ జంపెను సత్యయె యరదమందు
పతిని త్యజియించి! సతి పతివ్రత యనఁబడె!!
రిప్లయితొలగించుఅప్పు లెక్కువగాచేసి యవని యందు
కష్టము లనుభవించుచు కడకు తాను
శ్రమపడుచు ధనముదాచి జవముగ పర
పతిని త్యజియించి సతి పతివ్రత యనబడె.
పరపతి:చేబదులుగా ద్రవ్యము పుచ్చుకొనుట.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించు.................🤷🏻♂సమస్య 🤷♀....................
పతినిఁ బరిత్యజించి యొక
భామ పతివ్రతగా నుతుల్ గొనెన్
సందర్భము: ఒక భామ ఇంగ్లీషు వైద్యం (అలోపతిని) వదలిపెట్టి మూలికావైద్యంతో పతి ప్రాణాలు రక్షించుకోగలిగింది. ఇదీ సారాంశం.
*రోగం పేరు* ఏమిటో! పేర్కొనబడలేదు.
*మూలిక పేరు* ఏమిటో చెప్పబడలేదు.
*వైద్యుని పేరు* ఏమిటో
*రోగి పేరు* ఏమిటో చివరకు
*భామ పేరు* ఏమిటో కూడ పేర్కొనలేదు.
సమస్య మాత్రం పూరింపబడింది. ఏ విశేషమూ లేని మామూలు పద్యం అన్నదానికి ఇది ఉదాహరణగా తీసుకోవచ్చు.
*కాని ఏ విశేషమూ లేకపోవడమే యిందులోని విశేషం..*
ఐదు విషయాలు ఇందులో చెప్పబడక పోవడంవల్ల *అనుక్త పంచకం* అనవచ్చు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
అతి దయనీయమైన రుజ
నల్లలనాడు పతిన్ గురించి వై
ద్య తతి వచించు మాట విని
యాయమ మూలిక వైద్య మద్ది మే
లు..తగు నటంచుఁ జేయగను
రోగము తగ్గెను పూర్తిగా..నలో
పతినిఁ బరిత్యజించి యొక
భామ పతివ్రతగా నుతుల్ గొనెన్
✒~డా.వెలుదండ సత్యనారాయణ
2.1.19
-----------------------------------------------------------
శ్రీ సూరం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలతో